26, జూన్ 2022, ఆదివారం

తొట్రుపాటు చిరునామా - 41

“ఏసు ధారా మణి - ఇల్లు ఎక్కడ మేడమ్!”  సారధి అడిగాడు. రికాళ్ళు రాసుకుంటూ, ఒత్తుకుంటూ - 

అరుగు మీద చతికిలపడ్డాడు. వాన వచ్చి, గులకరాళ్ళు పైకి మొనదేలి ఉన్నాయి,

కంకర రోడ్డు పైన - చేతిలో అడ్రసు చీటీ పుచ్చుకుని, ఇల్లిల్లూ తిరిగినట్లున్నాడు, 

మోకాళ్ళ దాకా ఒత్తుకుంటూ, అరుగు పైన కూర్చున్నాడు సారధి/ పార్ధసారధి ;  

నానీ గ్లాసెడు నీళ్ళు, మజ్జిగ ఇచ్చింది. 

ఆ ఆగంతకుని వివర, విశేషాలు కనుక్కున్నది. 

“పార్ధు బాబూ,  ఏసు ధారా మణి అనే మనిషి ఎవ్వరూ, 

ఈ వీధిలోనే లేరు” అంటూ ఖరాఖండీగా చెప్పింది. 

“ఇవాళ ఇరవై ఐదో తేదీ - నేను అడ్రస్ అడుగుతూ వచ్చిన-

 ఈ ఇల్లు ఇరవై ఐదోది.” అన్నాడు నిస్పృహగా.

కుందనబాల “మా ఇంటి నెంబరు కూడా 25 …. , “ అన్నది.

బైట గేటు కొక్కెం తీస్తూన్నప్పుడు, షాపు నుండి వస్తున్న రెస్టోర్ రాజా - ప్రశ్నార్ధకంగా చూసాడు. 

పార్ధు - “మీది మంచి మనసు, helping nature ఉన్నవారు, నాకు -

ఏసు ధారా మణి - ఇల్లు చూపించగలరా!?”

చీటీ చదివి, “మీరిచ్చిన address ఇదేనే , 

కానీ ఏసు ధారా మణి అనే పేరు ఉన్న వాళ్ళు ఎవరూ, ఈ కాంపౌండ్ లో లేరు” 

అనేసి, లోపలికి వచ్చాడు. టీ తాగి, నాలుగు గంటలు పైనే ఐంది. - 

పొద్దున ఎవరి మొహం చూసాడో గానీ,  

అసలు - తన ప్రేయసి విలాసమే దొరకడం లేదు, ఇదేమి వింత …. ; 

ఒక మోస్తరు ఊరు, మళ్ళీ ఆ ఐదారు streets తిరిగాడు. 

కాలికి బలపం కట్టుకో లేదు గానీ - చెప్పులు మాత్రం బాగా అరిగిపోయాయి.  

ఇహ, భూమి గుండ్రంగా ఉంటుంది - అనే సైన్స్ సిద్ధాంతం ఋజువు అయ్యింది, 

రెండోసారి, తిరిగి తిరిగి - నానీ ఇంటికే చేరాడు.

మధ్యాహ్నం - నానీ తనతో ముఖ పరిచయాలు లేకపోయినా 

మంచినీళ్ళు, మజ్జిగ ఇచ్చింది. , మానవత్వం పాలు ఉన్న ఆమె ఇంటికే - 

తనకు తెలీకుండానే తన పాదాలు అక్కడికి తీసుకెళ్ళాయి. 

నానీ భర్త వెంకట్రమణయ్య “బాబూ, మా ఇంట్లో ఇవాళ రెస్ట్ తీసుకో, 

రేప్పొద్దున వెళ్ళొచ్చు.” అన్నాడు. 

“హోటల్ లో తిన్నాను.” అని చెప్పాడు పార్ధసారధి. 

ఆ రోజు అక్కడ నిద్ర చేయడంతో కాస్త సత్తువ వచ్చింది.

***************** ,

"అరె, పార్ధూ, నువ్వా! ఇక్కడా!?" చిర పరిచితమైన గొంతు, వింటుండగానే

పార్ధసారధి మనసు ఆనందంతో గంతులే గంతులు ... , 

ఎవరి కోసమైతే తాను ఇప్పటిదాకా గాలిస్తున్నాడో ఆమె ….. , అన్వేషి పార్ధసారధి,

సినీ స్టైల్లో ఆమె ముందు మోకరిల్లాడు, 

" సుధ …, తన సుధ - “సుధా రాగ సుధా, అనురాగసుధా …. ,

పాట పాడాలని అనుకున్నాడు గానీ, 

గద్గద స్వరం - గొంతులో నుండి రాగం కాదు కదా, కనీసం కూనిరాగం కూడా పెగల్లేదు. 

“పార్ధూ! ఏమిటిది!?” అంటూ సుధ అతని భుజాలు పట్టుకుని, లేపింది. 

“ఎక్కడికెళ్ళావు?” పార్ధు ఆనందబాస్పాలు నిండిన కళ్ళు, ఉద్వేగం నిండిన హృదయం - 

“ఇంత దయ, ఇంత కనికరం, ఇంత జాలి ఐనా లేవు కదూ!?”

అప్పటికే వీరి సందడికి,  ఇళ్ళలో నుండి అందరూ బైటికి వచ్చేసారు.

“లోపలికి వెళ్దాం, పద!” పార్ధు భుజాన మోస్తున్న బ్యాగుని అందుకుంటూ అన్నది. 

“ఇదేనా, నువ్వుంటున్న ఇల్లు?” ఆశ్చర్యానందాలు ఫుల్ గా నిండిన 

అతని క్వశ్చన్ మార్క్ భూతద్దంలో మాదిరిగా బోలెడు పెద్దదై, 

గాలిలో బొమ్మలా ప్రత్యక్షం అయ్యింది. “వీళ్ళందరూ, ఇది కాదు కాదు - 

అన్నారే, ఈ అడ్రసు కరెక్టే కదా!”

జయశ్రీ ముందుగా అడిగింది, “అదేమిటి, సుధ కదా, తన పేరు?”

“ఏసు ధారా మణి - అంటూ అడిగాడు, ఈ పిల్లాడు ….. “ నానీ, 

వెంకట్రమణయ్య ప్రశార్ధకం …, నానీ “మరే … “  అంటూ అందుకున్నది. 

“అదేంటి పార్ధూ, “చిన్నప్పుడే అనుకున్నాను, 

ఇప్పటికీ - నీకు స్పెల్లింగ్ మిస్టేకుల తికమకలు తప్పలేదా!??” సుధ అన్నది. 

“ఐతే, చిన్నప్పుడు కూడా - ఏం చేసాడు, నీ పార్ధు?” 

“చెప్పు సుధామణీ!” కుందన ఆతృత ,

“అక్కా! నువ్వు కూడా, పార్ధు లిస్టులోకి చేరిపోతున్నావు

సుధా రమణిసుధా మణి కాదు … “ 

“ఔనా … ఇంతకీ నీ లవర్ చిన్నప్పటి సంగతులు, ఇప్పటివి కూడా చెప్పు.” 

మిగతా పటాలం అందరికీ మెల్లమెల్లగా - సుధా, పార్ధుల జీవిత విశేషాలు తెలిసాయి.

***************** ,

పల్లెటూరిలో - పలక, బలపం -పట్టాడు. ,

అన్నీ త్వరత్వరగా నేర్చుకున్నాడు పార్ధసారధి. , అ - ఆ - కొన్ని అక్షర మాలలను - 

వెనక్కి తిప్పి రాసేవాడు, అట్లాగే మరి కొన్నింటిని - ఋ - ౠ - రెండు కొమ్ములకు బదులుగా - 

నాలుగు, ఐదు తగిలించే వాడు.  ఒక్కొక్కసారి ఈ - ఊ - లకు తోకలను తిరగదిప్పే వాడు. 

పాపం, పలక కూడా, ఇటువంటి కొత్తరకం  తెలుగు అక్షర ఆకృతిని మోసీ, మోసీ అలిసిపోయిందేమో!

, కొసకి ఒకరోజు, దగ్గరికి పిలిచాడు, 

“ఎన్నిసార్లు చూపించినా, ఇట్లా రాస్తున్నావు, ఎన్నిమార్లు చూపించినా, అన్నీ వింత వింతగా రాసున్నావు, 

చైనా, జపాన్ ల నుండి, ఇక్కడికి వచ్చావా, ఏం?” అంటూ చెవి మెలి పెట్టాడు. 

పాపం, శంఖం లాంటి చెవి ఎర్రగా కమిలిపోయింది. , ఐతే ఆ శ్రవణ మంత్రం ఫలించింది. 

ఆ రోజు నుండీ - అచ్చ తెనుగు అక్షర అచ్చులు, హల్లులు, గుణింతాలు - 

అన్నీ ముద్రశుద్ధిగా, గుండ్రంగా, చక్కగా రాస్తున్నాడు పార్ధు. 

ఈ సంఘటనల పరంపర - మరికొన్నింటిని కూడా, తెలుసుకుని, అందరూ, బాగా enjoy చేసారు.

ఇంతకీ, ఈ episode లో తొలిసారి ప్రవేశించిన - ఏసు ధారా మణి - ఎవరై ఉంటారు!?

ఏసు ధారా మణి - sir name - A -  అంటే ...,

A. సుధా రమణి - ఆమె అసలు పేరు - 

కానీ పార్ధు ఉచ్ఛారణతో - పూర్తిగా స్వరూపం మార్చుకున్న నీలి లిట్మస్ కాగితం ఐ కూర్చుంది - 

గృహనామం, రెండు పదాలు = సుధా, రమణి - లను విరిచి, 

ఏసు + ధారా +మణి - అని - పలుకుతున్నాడు ఈ నూతన హీరో పార్ధు.

రెస్టోర్ రాజా - తదితరులు - తమ తమ ఆఫీసులలో చెప్పుకున్నారు ఈ కామెడీ కథని.

"అదేదో సినిమాలో - కుజదోషం బాబూ మోహన్ - వీధి పేరు ఏదో తప్పు చెప్పాడు ... " 

"mistake తో తిప్పలుపడ్డాడు, వాణిశ్రీ ఇంటికి చేరి, పిల్లిమొగ్గలు వేసాడు." 

విద్యాసాగర్, వర్ధని, ఆమని - క్లారిటీ ఇచ్చారు.

“ఇంటి పేరు కలిపేసి, ఇట్లాగ మన పార్ధు, ఏసు ధారా మణి - అంటూ మన ఉరఫ్  పార్ధసారధి -  

పంచకూళ్ళ కషాయం చేసాడు." journalist చంద్రిక - గంగాధర్, లవణకుమార్ - నళిని - 

తతిమ్మా శ్రోతల లిస్ట్ యొక్క కామెంట్స్ ;

& [పాత్రలు ;- ఏసు ధారా మణి/ A. సుధా రమణి = సారధి = పార్ధసారధి -  

రెస్టోర్ రాజా -  కుందనబాల -   జయశ్రీ -  journalist చంద్రిక - 

గంగాధర్, లవణకుమార్ -నళిని - విద్యాసాగర్, వర్ధని - ఆమని ]

========================== ,

toTrupATu cirunAmA - 40 = story ;-

“Esu dhArA maNi - illu ekkaDa mEDamm!”  

saaradhi aDigADu. ari kaaLLu raasukumTU, 

ottukumTU - arugu meeda catikilapaDDADu.

Waana wacci, gulakarALLu paiki monadEli unnaayi,

kamkara rODDu paina - cEtilO aDrasu cITI puccukuni, 

illilluu tiriginaTlunnADu, mOkALLa 

daakaa ottukumTU, arugu paina kuurcunnaaDu sAradhi/ pArdhasAradhi ; 

nAnI glaaseDu nILLu iccimdi. A aagamtakuni wiwara, wiSEshaalu kanukkunnadi. 

“paardhu baabuu,  Esu dhArA maNi anE manishi ewwaruu, ee weedhilOnE lEru” amTuu kharaakhamDIgaa ceppimdi. 

“iwALa irawai aidO tEdee - nEnu aDras aDugutuu waccina ee illu irawai aidOdi.” annADu 

nispRhagaa. , kumdanabaala “maa imTi nembaru kUDA 25 …. , “ annadi. \\\\\\\ 

baiTa gETu kokkem teestuunnappuDu, shaapu numDi wastunna resTOr rAjA - praSnaardhakamgaa cuusADu. paardhu - “meedi mamci manasu, `helping nature` unnawaaru, naaku “Esu dhArA maNi - illu cuupimcagalarA!?”  ;;;;;;;; 

cITI cadiwi, “meericcina `address` idEnE , kaanee Esu dhArA maNi anE pEru unna wALLu 

ewaruu, ee kaampaumD lO lEru” anEsi, lOpaliki waccADu.

Tea taagi, naalugu gamTalu painE aimdi. - 

podduna ewari moham cuusADO gAnI,  asalu - tana 

prEyasi wilaasamE dorakaDam lEdu, idEmi wimta …. ; 

oka mOstaru uuru, maLLI aa aidaaru `streets` tirigaaDu.

kaaliki balapam kaTTukO lEdu gAnI - ceppulu maatram 

baagaa arigipOyaayi. iha, bhuumi gumDramgaa umTumdi - 

anE sains siddhaamtam Rjuwu ayyimdi, 

remDOsaari, tirigi tirigi - nAnI imTikE cErADu. 

madhyaahnam - nAnI tanatO mukha paricayaalu lEkapOyinA 

mamcinILLu, majjiga iccimdi. , 

maanawatwam paalu unna aame imTikE - tanaku teleekumDAnE - 

tana paadaalu akkaDiki teesukeLLAyi. 

nAnI bharta wemkaTramaNayya 

“bAbU, maa imTlO iwaaLa resT teesukO, rEppodduna weLLoccu.” 

annADu. “hOTal lO tinnaanu.” ani ceppADu pArdhasAradhi. 

A rOju akkaDa nidra cEyaDamtO kaasta sattuwa waccimdi.

**************** ,

"are, pArdhU, nuwwA! ikkaDA!?" cira paricitamaina gomtu, 

wimTumDagAnE

paadhasaaradhi manasu aanamdamtO gamtulE gamtulu ... ,

ewari kOsamaitE taanu ippaTidaakaa gaalistunnADO aame ….. , 

anwEshi pArdhasAradhi,

**************** , 

sinee sTaillO [style] aame mumdu mOkarillADu, - 

sudha …,  tana sudha - “sudhaa raaga sudhaa, anuraagasudhaa …. ; 

paaTa paaDAlani anukunnnADu gaanee, gadgada swaram - 

gomtulO numDi rAgam kaadu kadaa, kaneesam kuuniraagam kUDA pegallEdu. 

“paardhU! EmiTidi!?” amTU sudha atani BujAlu paTTukuni, lEpimdi. 

“ekkaDikeLLAwu?” paardhu aanamdabaaspaalu nimDina kaLLu, 

udwEgam nimDina hRdayam - “imta daya, imta kanikaram, 

imta jaali ainaa lEwu kadU!?”

appaTikE weeri samdaDiki, iLLalO numDi amdarU baiTiki waccEsaaru.

“lOpaliki weLdaam, pada!” paardhu-

 bhujaana mOstunna bag ni amdukumTU annadi. 

“idEnaa, nuwwumTunna illu?” AScaryaanamdaalu 

phul gaa nimDina atani kwaScan maark [Question mark]

BUtaddamlO maadirigaa bOleDu peddadai, 

gaalilO bommalaa pratyaksham ayyimdi.

**************** ,

“weeLLamdaruu, idi kaadu kaadu - annaarE, 

ee address corect E kadA!”jayaSree mumdugaa aDigimdi, 

“adEmiTi, sudha kadaa, tana pEru?”

“Esu dhArA maNi - amTU aDigADu, ee pillADu ….. "

naanee, bharta wemkaTramaNayya praSaardhakam …, 

naanee “marE … “  amTU amdukunnadi. 

“adEmTi pArdhU, “cinnappuDE anukunnaanu, ippaTikee - 

neeku spellimg misTEkula tikamakalu tappalEdA!??” sudha annadi.

“aitE, cinnappuDu kUDA - Em cEsADu, nI pArdhu?” 

“ceppu sudhAmaNI!” kumdana aatRta ,

“akkA! nuwwu kUDA, paardhu lisTulOki cEripOtunnaawu, 

sudhaa ramaNi … sudhaa maNi kaadu … “ 

“aunaa … imtakee nee lawar cinnappaTi samgatulu, ippaTiwi kUDA ceppu.” 

migataa paTAlam amdarikee mellamellagaa - sudhaa, 

paardhula jeewita wiSEshaalu telisaayi.

**************** , 

palleTUrilO - palaka, balapam -paTTADu.

annee twaratwaragaa nErcukunnADu 

paardhasaaradhi. , a - aa - konni akshara maalalanu - 

wenakki tippi raasEwADu, aTlAgE 

mari konnimTini - R - RU - remDu kommulaku badulugaa - 

naalugu, aidu tagilimcE wADu. 

okkokkasaari ee - uu - laku tOkalanu teragadippE wADu. 

paapam, palaka kUDA, iTuwamTi 

kottarakam  telugu akshara aakRtini mOsee, mOsI alisipOyimdEmO!

kosaki okarOju, daggariki pilicADu, 

“ennisaarlu cuupimcinA, iTlaa raastunnaawu, 

ennimaarlu cuupimcinaa, annee wimta wimtagaa raasunnaawu, 

cainaa, Japan la numDi, ikkaDiki waccaawaa, Em?” 

amTU cewi meli peTTADu. 

paapam, Samkham lAMTi cewi erragaa 

kamilipOyimdi. , aitE aa SrawaNa mamtram phalimcimdi. 

A rOju numDI - acca tenugu akshara 

acculu, hallulu, guNimtaalu - annee mudraSuddhigaa, 

gumDramgaa, cakkagaa raastunnADu paardhu. 

**************** ,

I samghaTanala parampara - marikonnimTini kUDA, telusukuni, 

amdaruu, baagaa `enjoy` cEsaaru.

imtakee, ee `episode` lO tolisaari prawESimcina - 

Esu dhArA maNi - ewarai umTAru!? - 

Esu dhArA maNi - `sir name = A -`  

amTE `A.` sudhaa ramaNi - aame asalu pEru - 

kaanee paardhu ucCAraNatO - puurtigaa 

swaruupam maarcukunna neeli liTmas kaagitam ai kuurcumdi - 

gRhanaamam, remDu padaalu = sudhaa, ramaNi - lanu wirici, 

Esu + dhArA +maNi - ani - palukutunnADu ee nuutana hIrO paardhu.

***************** ,

resTOr rAjA - taditarulu - tama tama aapheesulalO ceppukunnaaru

ee kaameDI [comedy] kathani.

"adEdO sinimaalO - kujadOsham bAbU mOhan - 

weedhi pEru EdO tappu ceppADu ... " 

"`mistake` tO tippalupaDDADu, 

wANiSree imTiki cEri, pillimoggalu wEsADu." 

widyaasaagar, wardhani, aamani - klaariTI [clarity] iccaaru. '''''''' 

“imTi pEru kalipEsi, iTlAga mana paardhu, Esu dhArA maNi - 

amTU mana uraph / paardhasaaradhi -  

pamcakULLa kashaayam cEsaaDu." 

`journalist` camdrika - gamgaadhar, lawaNakumaar -naLini

tatimmaa SrOtala lisT yokka `comments … ,

***************************************** ,

[పాత్రలు ;- ఏసు ధారా మణి/ A. సుధా రమణి = సారధి = పార్ధసారధి -  

నానీ & భర్త - వెంకట్రమణయ్య ; జయశ్రీ -  journalist చంద్రిక - 

రెస్టోర్ రాజా -  కుందనబాల -  గంగాధర్, లవణకుమార్ -నళిని - విద్యాసాగర్, వర్ధని - ఆమని ] ; == ;

[ pAtralu ;- A.sudha ramaNi/ Esu dhArA maNi  & paardhu/ paardhasaaradhi ;; &  ;; 

nAnI -bharta - wemkaTramaNayya - jayaSrI, `journalist` camdrika - gamgaadhar, lawaNakumaar -naLini - widyaasaagar, wardhani,   - aamani ] ;

many colors - 41 story ;- Address 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

single కి many అర్ధాలు -- 59

"రా ! అక్కయ్యా! ఎన్నాళ్ళకు కలిశాము, ఇన్నాళ్ళకు చూస్తున్నాను."  పెదనాన్న కుమార్తె క్రిష్ణవేణి భారంగా లోనికి వచ్చి, సోఫాలో చతికిలబడి...