24, మార్చి 2021, బుధవారం

కథ దొరికింది - సూపర్ మాన్

 'సూపర్ మాన్' - ఇంగ్లీష్ సినిమా టివి లో వస్తున్నది.  విద్యా సాగర్ "pin drop silence, అల్లరి చేయొద్దు, 

సౌండ్ వినపడకూడదు, జాగ్రత్త" అని హెచ్చరించాడు. పిల్లకాయలు మామయ్య ఆజ్ఞని బుద్ధిగా పాటించారు, అతనిని డిస్టర్బ్ చేయలేదు. సినిమాలో పూర్తిగా లీనమై, enjoy చేసాడు విద్యా సాగర్. 

"హమ్మయ్య, ఐపోయింది. మామయ్యా! సూపర్ మాన్ వెనకాతల తగిలించుకుంటాడే, దాన్ని ఏమంటారో చెప్పు"  

ఖంగు తిన్నాడు  విద్యా సాగరుడు. 

"తనకెప్పుడూ పొరపాటున కూడా ఇట్లాంటి డౌటే రాలేదు. ఈ కాలం పిల్లలు అసాధ్యులు సుమీ" అనుకున్నాడు.  రహస్యంగా మొబైల్ తీసుకున్నాడు, "గూగుల్ మాతా, నమో నమః" అనుకుంటూ. 

"గప్ చుప్ - సాంబార్ బుడ్డి, internet ని అడగకూడదు బాబూ"  "హు, కనిపెట్టేసారే. గడుగ్గాయిలు, మీరే చెప్పండి" ఓటమిని ఒప్పుకున్నాడు. " కేప్ - అంటారు"  "సి ఎ పి ఇ - ఇజీక్వల్టు - కేప్ ... " కృష్ణవేణి విడమరిచి చెప్పింది.  కామేశం స్కూల్లో ఫాన్సీ డ్రస్సు పోటీలో పాల్గొన్నాడు.  విద్యాసాగర్ మార్గదర్శి అవగా, సూపర్ మ్యాన్ డ్రెస్సు వేసుకున్నాడు, ప్రైజు గెలిచాడు. ఇంటికి వచ్చేసరికి, మేనత్త కుటుంబం, వచ్చి ఉన్నది. 

"అత్త, మీరు నిన్న వచ్చి ఉంటే బాగుండేది, అన్నయ్య స్టేజీ మీద ఫ్యాన్సీ డ్రెస్సు వేసి, భలేగా నడిచాడు.  మీరు మిస్ అయ్యారు." కాత్యాయని అన్నది. "ఇప్పుడు మాత్రం ఏమీ మించిపోలేదు. రేపు మన ఇంట్లోనే వేషం వేసి, చూపించండి. కన్నులారా చూస్తాము" అన్నారు బంధువులు.

@@@@@ 

 డాబా మీద మర్నాడు సూపర్ మేన్ వేషంతో పాటుగా - తతిమ్మా పిల్లలు, ఆ వెనువెంటనే పెద్దలు సైతం -  వివిధ వేషాలు అప్పటికప్పుడు వేసారు. వాతావరణంలో హుషారు నిండింది. మేడ మీద మిర్చి ఆరబోయడానికి వచ్చిన పక్కింటి ఆవిడ చూసి,  తన వాళ్ళని తీసుకువచ్చింది. అందరికీ స్ఫూర్తి అయ్యింది ఈ ప్రోగ్రామ్. తర్వాత వచ్చిన ఉగాది పండుగ నాడు, గృహప్రాంగణమున - ఇంచక్కా విచిత్ర వేషధారణ నిర్వహించారు. మంది ఎక్కువ అయి, program మరింత రంజుగా జరిగింది. అవాళ -  విద్యా సాగర్  కూడా - super man వేషం ధరించాడు. డైలాగులు చెబుతూ, అటూ ఇటూ నడిచాడు.

మూడో క్షణం ఒక తమాషా జరిగింది. విద్యాసాగర్  వీపు వెనక వేళ్ళాడే cape కాస్తా ఊడి కింద పడింది. ప్రేక్షకులు పకపకా నవ్వసాగారు. "మామయ్యా, ఏ టైలర్ దగ్గర కుట్టించుకున్నావు?" వాళ్ళు ఎగతాళి చేస్తుంటే, విద్యా సాగర్  చిన్నబుచ్చుకోలేదు, సరి కదా, హాయిగా enjoy చేసాడు. 

ఫ్రెండ్ నుండి ఫోన్ కాల్ - సరదాగా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీయాలని, ప్లాన్ చేస్తున్నారు. కథ గురించి గాలిస్తూ, చర్చించుకుంటున్నారు. 

"మంచి స్టోరీ దొరికింది." అన్నాడు విద్యా సాగర్. ఈ కొత్త పని గురించి చెప్పగా, విద్యా సాగర్ తల్లిదండ్రులు అన్నారు, 

"సాగర్! డబ్బులు చెట్లకు కాస్తున్నాయా. వృధా చేస్తున్నారు"  ఇది ముందుగా ఊహించిన సమస్యే, 

జవాబు చెప్పడం తన బాధ్యత, ఇప్పుడు. - తన ఫ్రెండ్స్ ఐతే, ఇంటి పెద్ద వాళ్ళతో తగవులు పెట్టుకున్నారు.

 "నాన్నా! మన దగ్గర పెళ్ళి ఫొటోలు, ఫంక్షన్స్ ఆల్బమ్స్- చాలా ఉన్నాయి కదా." 

ఉపోద్ఘాతంలోని విషయం పెద్దలకు, బాధ్యలు నిర్వహిస్తున్న వారికి బోధపడింది.   "తాతయ్య నానీ నాయనమ్మ ల రోజులలో పెళ్ళి శుభలేఖలు, ఫొటోలు నూతికో కోటికో ఒక్కరికి ఉండేవేమో! అందుకనే అప్పటివాళ్ళు - ఆ ఒకటి రెండు photos ని దాచిపెట్టుకుని, అపురూపంగా చూసుకునేవాళ్ళు.  బ్లాక్ అండ్ వైట్ - మీ పెళ్ళి ఫొటోలు - చిన్న ఆల్బమ్ ఉన్నది, ఇప్పటికీ మేము సరదాగా పిల్లలతో కలిసి, చూస్తుంటాము.  మమ్మీ, అమ్మమ్మ, ఆ ఆల్బమ్ కి ఎక్కువ ఖర్చు ఐంది, అనే వాళ్ళు.  శ్రీమంతాలు, పుట్టినరోజులు, పండగలు, ఇంకా - పేరంటాలు, నోములు, వ్రతాలు - ఇన్నిటికీ కాస్తో కూస్తో ఖర్చు చేసూనే ఉన్నాం కదా!" అక్కడ ఉన్న స్త్రీ వర్గం ఉలిక్కిపడింది.  "మేము చాలా ఖర్చులు తగ్గించుకున్నాం. 

మీరు గుర్తుచేసినప్పటికీ ... నేను నాలుగేళ్ళ నుండీ కొత్త డ్రస్సులు కొనుక్కోలేదు.  ట్యూషన్స్ చెబ్తున్నాను, ట్యుటోరియల్ కాలేజీలో part time job చేస్తున్నాను, నా హాబీ - short films కోసమే" "మన విద్యా సాగర్ తెలివైన వాడే, డబ్బులు ఎక్కడ ఎట్లాగ ఖర్చు చెయ్యాలో - ఎప్పుడు పొదుపు చేయాలో తెలిసిన వాడు,  మనం కాపలా కాసి, జాగ్రత్తలు చెప్పాల్సిన పని లేదు" అనుకున్నారు పెద్దోళ్ళు. అందరి ముఖాల్లో ప్రసన్నత కనబడింది. relief గా ఫీల్ ఔతూ అన్నాడు సాగర్, 

"ఇవాళ సూపర్ మాన్ - ఊహనినాకు,  ఈ కార్యక్రమాల ద్వారా అందించారు. మీకు many many thanks." అన్నాడు.

@@@@@

కొస మెరుపు ;- ఊరి బయట బంగ్లాలో హత్య జరిగింది.. చిన్న గుడ్డ ముక్క దొరికింది,  

ఆ ఆధారం పుచ్చుకుని, CID బృందం అన్వేణ ప్రారంభించింది.  

ఆ వేగుల లీడర్ విద్యాసాగర్, వారం రోజుల్లో సి.ఐ.డి. గ్రూప్ హంతకుణ్ణి పట్టుకున్నారు.  

అది ఎట్లనిన ... ఆస్థి కోసం బంధువైన జగ్గారావు - చేసిన మర్డర్ అది.  కొన్నాళ్ళు ముందుగా - property యజమాని భాగ్యమూర్తిని - దయ్యం వేషం వేసుకుని, భయపెట్టాడు  జగ్గారావు.  భాగ్యమూర్తిని మానసికంగా బలహీనుని చేసేటందుకు జగ్గా వేసిన పన్నాగం అది.  పిశాచి వేషంలో అతను cape ధరించి, గాలిలో దిగుతున్నట్లు ఏర్పాటు చేసుకున్నాడు.  అతని వింత డ్రెస్సును కుట్టిన టైలర్, గుర్తు పట్టి - "జగ్గారావు కుట్టించుకున్నాడు" అని చెప్పాడు.  

విలన్  జగ్గారావు విసనకర్రలా రెపరెపలాడే కేప్ ని కాల్చేసాడు. ఋజువులు దొరకకుండా అతను తీసుకున్న ముందు జాగ్రత్తలు అవి.  ఐతే షర్టును కుట్టి ఇచ్చిన దర్జీ - ద్వారా విలన్ దొరగారిని సులభంగా పట్టుకున్నారు, సి.ఐ.డి లు. కేప్ కుట్టిన కుట్లు - STICHING HOLES ఆనవాళ్ళు - అతన్ని పట్టిచ్చాయి. 

@@@@@

"దొంగ దొరికాడు, భలే" అరుపులకు ఇంటిల్లిపాదీ రూములోకి పరుగు పరుగున వచ్చేసారు.  

"లే లే! నిద్ర లే సాగర్!"  "ఓహ్, ఇదంతా కలేనా. భళీ, మా షార్ట్ ఫిల్మ్ కి మంచి సరుకు ఉన్న కథ దొరికింది." 

అంటూ  బెడ్ మీద నుండి దూకి, సెల్ ఫోన్ చేతబుచ్చుకున్నాడు విద్యాసాగర్,  

"నీ స్వప్న వృత్తాంతం భేషుగ్గా ఉంది. చిన్న సినిమాకు రేపే శుభముహూర్తం."  

అప్పుడే family members కొందరు సాగరునికి - రిక్వెస్ట్ చేయసాగారు,  "మా వదనాలు కూడా మా ముని మనవళ్ళు చూసుకునే అవకాశం, మీ బుల్లి రీళ్ళలో యాక్ట్ చేస్తాం, ప్లీజ్"  

కథ దొరికింది - సూపర్ మాన్ - అను - ఉగాది పండుగ - Fancy Dress ;

[పాత్రలు ;- విద్యా సాగర్ - కృష్ణవేణి - కామేశం - కాత్యాయని - మేనత్త కుటుంబం,ఇరుగు పొరుగు, పిల్లలు - సూపర్ మాన్ fancy dress ] ;

story ;- కుసుమ కాదంబరి [pen name ] ; ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...