సీతా కోక చిలకమ్మలు
వచ్చేసాయి! వచ్చేసాయి! ||
అడవిలొ , సీతకు ఇచ్చిన కోకలు
ఇవే! ఇవే! " అని చూపిస్తూన్నవి
తమ రంగుల రెక్కలు ! ||
"సభలో ద్రౌపది కొసగుట కొరకై
శ్రీ కృష్ణుడు మమ్మే పిలిచేనంటూ "
వన్నెల రెక్కల వయ్యారముల
గీర పోవుచూ, ఎగురు చున్నవి!
సింగారాల సీతా కోకలు :
నయగారాల సీతా కోకలు :
నయాగరా జలపాతాల అందాలున్న ....
చిలకలుకాని చిలకమ్మలు -
ఈ విహారమ్ముల సీతాకోకచిలకమ్మలు! ||
;
Link ;- 21, జనవరి 2009, బుధవారం ; butterflies ;-
కోణమానిని ;
![]() |
butterflies poetry protractor |