23, ఏప్రిల్ 2021, శుక్రవారం

కాటుక భరిణ హంగామా

జ్యోతి, రంజన్, కార్తీక్ - వింతగా చూస్తున్నారు దొడ్డమ్మ కృష్ణవేణి కాటుక తయారుచేయడానికి పెట్టిన సరంజామా అంతటినీ. సెలవుల్లో ఆటవిడుపు కోసమని భామిని Town కి వచ్చారు, తీరిక చేసుకుని అరకు వాలీ చూద్దామని అనుకున్నారు, ఇక్కడ దొడ్డమ్మ కార్యక్రమం మరింత ఇంట్రెస్టుగా ఉన్నది కదా, అరకులోయ సందర్శనను వాయిదా వేసి, ప్రేక్షకవర్గం అయ్యారు రంజన్ group. ఇంతకీ దొడ్డమ్మ కృష్ణవేణి కాటుక ప్రోగ్రామ్ కి మూల కారణం ఉన్నది. పక్క వీధి అమ్మాయి సుధాచంద్రిక - గర్భిణి , "నీకు పుట్టబోయే బిడ్డ మగపిల్లాడా, ఆడపిల్ల తెలుసుకుందాం సుధా! ఇవాళ కాటుక పడ్తాను" అంటూ నడుం బిగించింది. "కాటుక పడితే - జెండర్ తెలుస్తుందా!?" ఆశ్చర్యాన్ని గుమ్మరిస్తూ అడిగారు పిల్లకాయలు. అంజనాద్రి పేరు ఒక కొండకు ఉంది కదా, తిరుపతి ఏడుకొండలలో ఒక hill కి అంటే పద్మావతి అమ్మవారు - కాటుక తయారుచేస్తే - ఆ పేరు వచ్చి ఉంటుందా" సందేహం తీర్చు - అన్నట్లుగా నిలబడ్డాడు రంజన్." ఇంతకీ దీని మూలాన, పుట్టబోయే బేబీ ఎట్లాగ తెలుస్తుంది?" కృష్ణవేణి పిల్లలు ఆదిత్య, ప్రవీణ ఎంటర్ - ప్రశ్నావళి పట్టికకు అదనం అయ్యింది. "ఇదిగో, మూడు రాళ్ళు పెట్టి, పెద్ద ఇత్తడి పళ్ళాన్ని పెట్టాను చూసారు కదా" తర్వాత ఆమె ఆముదం నిండా నింపిన పెద్ద మట్టి ప్రమిదను వెలిగించి, పళ్ళెం కింద పెట్టింది. లావాటి వత్తి - చిన్న జ్యోతి ఐ వెలిగేటట్లు సర్దింది. "గదిలో మూల, గాలి తగలకుండా ఉంచాను. ఎవరూ లోపలికి రాకండి. రేపీ సరికి పళ్ళెం అడుగున - దీపం మసి దట్టంగా, దిట్టంగా పేరుకుని ఉంటుంది. ఆ కాటిక కుప్పలుగా అతుకుతుంది. ఒక్కోసారి సరి సంఖ్య గానీ - ఒక్కోసారి బేసి సంఖ్య రాసులు గానీ ఏర్పడతాయి. దాన్నిబట్టి తల్లి కడుపులో ఉన్న బిడ్డ సంగతిని ఊహిస్తాం అన్నమాట" ఇవాళ కాటుక పడ్తాను" అంటూ నడుం బిగించింది. "కాటుక పడితే - జెండర్ తెలుస్తుందా!?" ఆశ్చర్యాన్ని గుమ్మరిస్తూ అడిగారు పిల్లకాయలు. "మా ఊళ్ళో శరభేశ్వరస్వామికి తైలాల నుండి చేసిన - రకరకాల కాటుకలను సమర్పిస్తారు." కృష్ణవేణి చెల్లెలు కావేరి అన్నది. "అంటే" అక్క ప్రశ్నకు సమాధానం కూడా చెప్పింది, "మందార తైలం నూనె చేసి, దానితో అంజనం చేస్తారు. అదే పద్ధతిలో వివిధ నూనెలను, తద్వారా కాటుకలను చేసి, శరభేశ్వరస్వామి మొక్కులను సమర్పిస్తారు." కావేరి భర్త "వదిన గారు బాగా చేస్తున్నారు. ఈ సారి - ఇక్కడికి వచ్చి, మీ చేతి కాటుక తీసుకుంటాం" అన్నాడు. "తప్పకుండా, నేను అక్కడ - మీ ఊరి గుడిని కూడా చూస్తాను కదా" అన్నది కృష్ణవేణి. ఆమె శుభ్రం చేసిన తాటాకు రేకు పట్టుకుని, పళ్ళెం బోర్లించి, దీపం మసి అంతా నెమ్మదిగా గీరింది. చెల్లెలు పక్కనే ఉండి, అక్క సూచనలు పాటిస్తూ సాయపడుతున్నది. ఆవు పాల వెన్న వేసి, సున్నితంగా నూరసాగారు. పై నుండి నీళ్ళు - సన్న ధారగా పోస్తూ, నూరారు. అట్లా నూరాక, ఒక దగ్గరికి చేరిన నల్లని ముద్దలో కర్పూరం వేసి, నూరారు. "ఇంత కష్టపడితే - మూడు గోళి కాయలంత కాజల్ వచ్చింది" సిసింద్రీలు అననే అన్నారు. భోషాణం పెట్టె అడుగు నుండి దుర్భిణీ వేసి మరీ బైటికి తీసింది, మూడు రాగిభరిణలను. చిన్ని కొక్కెం కలిగి, తెరిచి, ముడవడానికి వీలుగా గుండ్రని కాయ ఆకారం కలిగి ముచ్చట గొలిపే ఆ రాగి భరిణలు - మొబైళ్ళు - Camera ఖజానాలను నింపినాయి. "చిన్నప్పుడు అమ్మ ఇచ్చింది, రాగి కాయలు, కాటుకను వాటిలో నింపి, ఒకటి చెల్లికి ఇచ్చింది, కావేరికి కొత్త గుడ్డను ఇచ్చింది. చేతిగుడ్డ లాంటి ఆ తెల్లని వస్త్రం కొసన కాటుకభరిణ ఉంచి, ముడి వేసింది.తతిమ్మావి - రెండింటిలో ఒకటి తను ఉంచుకున్నది, మూడో దాన్ని సీతాదేవికి ఇచ్చింది. ఎదురింటి సీతాదేవికి పదో తరగతి చదువుతున్న కోడుకు ఉన్నాడు, పిల్లాడికి మంచి మార్కులు వస్తున్నాయి, కాబట్టి తన కూతురును ఇస్తే, ఊళ్ళో సంబంధం - తనకు వెసులుబాటు, ఏమో - భవిష్యత్తులో ఈమె తనకు వియ్యపురాలు ఔతుందేమో, ఎవరు చెప్పగలరు!" కనుక ఆమెతో ఆదాన ప్రాదానాలు, చేబదుళ్ళు ఇచ్చి పుచ్చుకోవడాలు - ఒక స్థాయిలో జరుగుతుంటాయి. ఏడవ తరగతి ఎగ్జామ్స్, కృష్ణవేణి కూతురు గడగడా గట్టిగా చదువుతున్నది, నిగమ శర్మ కథ - అనే పాఠం. కృష్ణవేణి పాట్నాకు - చుట్టాలింటి శుభకార్యానికి వెళ్తున్నది. ఆమె భర్త "పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటానులే" అని ధైర్యం చెప్పి, రైలు ఎక్కించాడు. తెనాలి వద్ద, శంకరం మాస్టారు బోగీ ఎక్కారు. "అరె, నువ్వు కూడా పాట్నా వస్తున్నావా, పెళ్ళి వారి ద్వారా మనం ఇప్పుడు దగ్గరి చుట్టాలం అయ్యామన్న మాట" పకపకా నవ్వుతూ అన్నాడు భోళా శంకరుడు. "పాట్నా అసలు పేరు తెలుసా, పాటలీపుత్రం ... " 'తను చిన్నప్పుడు, పలక బలపం దాచిపెట్టి, స్కూలు ఎగ్గొట్టేది తను. పాపం, పిల్లలను జ్ఞానమూర్తులుగా మార్చాలని, ఎంతో కష్టపడేవారు పంతులుగారు" ఆ రోజులు గుర్తు వస్తుంటే ప్రయాణం సునాయాసంగా సాగింది. పాట్నా ఇజీక్వల్టు పాటలీపుత్రం చేరారు, ఈజీగానే, పెళ్ళి వారి ఇల్లు చేరారు. చాలామంది అప్పటికే వచ్చేసారు. కొత్త మనుషులు, కొత్త భాషల - సంక్రాంతి ముగ్గుల నడుమ పెట్టిన గొబ్బెమ్మల మంచి వాసన వలె ఉన్నది. "కిష్టక్కా, ఇప్పటికి కలిశాం" సంతోషంతో పలకరింపు, సుగుణ గుర్తు పట్టి, గుర్తు చేస్తూ, మరింతమందిని స్నేహాలకు, బంధుత్వాలకు స్టార్ మార్కు గుర్తులుగా అప్పజెప్పుకుంటూ - గంటలు క్షణాల్లాగా గడిచిపోయాయి. "సువర్ణా, బాగున్నావా!?" భోళా మాస్టారు శంకరం మాటలకు అటు తిరిగారు, పరిచయాల సందడి - సువర్ణ ఊరు, వివరాలు ... ; "జాగ్రత్త, ఈ పిల్లది - కాస్త చేతివాటం" ; "అంటే" "కొంచెం దొంగతనం బుద్ధి, కాస్ట్లీ వస్తువుల జోలికి పోదు గానీ, చిన్న చిన్న వస్తువులను కాజేస్తుంది." ట్రైనులో శంకరం మాస్టారు "హోటల్ కి వెళ్ళినప్పుడు - చెంచాలు కాజేసే దోస్త్" గురించి మాటలలో చెప్పారు ....., తమాషా ఏమిటంటే అతను ధనవంతుని సుపుత్రుడే - చేతి తుత్తర, అటువంటి చెయ్యి దురదలకు హేతువు కోసం, మానసిక తత్వ వేత్తల దగ్గరికి వెళ్ళాల్సిందే. సాయంత్రం అందరూ కళ్యాణమండపం చేరారు. సువర్ణ తన దగ్గర మసలుతున్నప్పుడు, సూట్ కేసు తాళం - ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకుంటున్నది. సబ్బు, పౌడరు ఇత్యాదులని జాగ్రత్తగా లోన పెట్టి, లాక్ చేస్తున్నది. పెళ్ళి - తర్వాత అంపకాలు, హంగామా జరుగుతున్నది.కొంచెంసేపటికి - తన చేతిలో ఏదో ఖాళీ ఐనట్లు అనిపించింది, గుండె గుభిల్లుమంది. "కాటుక్కాయ, మిస్సింగ్" కొందరికి - కృష్ణవేణి తన కాటుకభరిణల గొప్పదనాన్ని చెప్పింది, కాటుక తయారీ, స్వీయ అనుభవాలను పూసగుచ్చినట్టు చెప్పి, శభాష్ - అనిపించుకున్నది కూడానూ. నిగమశర్మ అక్క కథ జ్ఞాపకం వచ్చింది. ముక్కెర, బులాకీ, ముక్కుపుడక - చిన్న వస్తువులే కావచ్చు, అవి - సుమంగళి ధరించే సంప్రదాయానికి, భర్త పట్ల భక్తిభావనను ప్రోది చేసే అలంకారం, తద్వారా - కుల ప్రతిష్టకు ఆనవాలు ఐనది ..., అందుకనే వేమన ప్రేయసి - అభిరామి, శిలప్పదిగారం - కన్నగి - ప్రతినాయిక మాధవి లాంటి రంగసాని - "మీ ఇంటి స్త్రీల ముక్కెరలు కావాలి - అని - heros ని villian heroins శోధించారు. కృష్ణవేణి వెక్కిళ్ళు పెడుతూ వెతికింది. సాయంగా సుగుణ అన్వేషిస్తున్నది. కొసకి మొహమాటం వదిలి, అందరి బ్యాగులు వెదకసాగారు. సువర్ణ వంతు రానే వచ్చింది, సోదా చేసాక అందరూ అనుమనించినట్లుగానే సువర్ణ ట్రంకుపెట్టెలోనే దొరికింది, "ఈ కాటుక్కాయ - మా అమ్మ తరం నుండి వస్తున్నది. అందుకనే ఇంత ఖచ్చితంగా ఉన్నాను, మా ఊరికి రా! నీకు మంచి కాటుక ఇస్తాను." అన్నది. "కాటుక ఎట్లాగ చెయ్యాలో నేర్చుకోడానికి తప్పకుండా వస్తాను" అన్నది సువర్ణ, కన్నీళ్ళు తుడుచుకుంటూ. కాటుక ఎట్లాగ చెయ్యాలో నేర్చుకోడానికి - వస్తాను - అన్న పలుకులలో సువర్ణ ఆమె ఆత్మాభిమానం మెరిసింది. "కాటుక కంటి నీరు చనుకట్టు పయి బడ, ఏల ... " భక్త పోతన - సినిమా - mobile లో సన్నగా వినిపిస్తున్నది. & [ పాత్రలు ;- జ్యోతి, రంజన్, కార్తీక్, దొడ్డమ్మ కృష్ణవేణి - సుధాచంద్రిక, సుగుణ & భోళా మాస్టారు శంకరం - కృష్ణవేణి చెల్లెలు కావేరి - కావేరి భర్త ; 7 class కృష్ణవేణి కూతురు [lesson itom - నిగమ శర్మ అక్క ; తెనాలి - శంకరం మాస్టారు ; సువర్ణ ] *********************************************************, ; ;
కాటుక భరిణ హంగామా ;

మట్టి మగువ ప్రభలు

ఏకవీరా దేవి కోవెలలో ప్రదక్షిణలు చేసి, పూజారి స్వామి ఆశీస్సులు అందుకుని, గుడి వసారాలో కూర్చున్నాడు భైరవి రాజ గురు. వృద్ధాప్యం, కాలం - పోటాపోటీగా తన మేనులోని శక్తిని తూకం వేస్తున్నవి. గుడి వరండా పావంచా - మెట్లు ఇరు పక్కలా - ఏనుగులు ఒద్దికగా కూర్చుని, భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉన్నవి. ఆ బొమ్మలను ప్రేమగా నిమురుతూ కూర్చున్నాడు భైరవ, పల్లె పాకలోని గురుకులం మాదిరి పాఠశాల - ఎర్ర ఏగాణీ తీసుకోకుండా గురువుగా గురుతర బాధ్యతలను తృప్తిగా నిర్వహించాడు - అందుకే ఆయన - భైరవి రాజ గురు - పేరులో గురు శబ్దం పొదిగి ఇచ్చారు ప్రజలు. @@@@@@ భైరవయ్య అభిరుచి - జానపద కథలు, గీతాల సేకరణ. జానపద కథలు అనేకం పోగు చేసాడు. అంతేకాదు, అన్నింటినీ పుస్తకములుగా అచ్చొతించాడు. గ్రంధరూపంలో ప్రపంచానికి అందించాడు. మొగిలిచర్ల కొలను నీళ్ళ పైనుండి వీస్తున్న గాలితెమ్మెరలు మృదువుగా పలకరిస్తున్నాయి. ఊరి సర్పంచి సర్వప్ప ప్రతి రోజూ అక్కడికి వస్తాడు భైరప్పా, అంటూ స్నేహపూర్వకంగా వారి కబుర్లు - చల్లని గాలిని పెనవేసుకుంటాయి. మా వంశీయులు ఈ గుడిని కట్టించారూ స్వామీ, ఇప్పుడు చూడండి ..." వేదనగా సర్వప్ప నిట్టూర్పులు గాలిని వేడెక్కిస్తాయి. "నాన్నా, పొద్దుగూకింది. ఇంటికి వెళ్దాం, రండి. సర్వన్నా, ఇదిగోండి, మీరు అడిగిన పుస్తకం" అందించింది రేణుక. ఇంకా, అలనాటి కాశీ మజిలీలు, చింతామణి కథలు చదివే వారున్నారు - అనే సంగతి భైరవయ్య పిల్లలకు సంతోషం కలిగిస్తుంది. "ఈ మహా గ్రంధాలని ప్రచురణలు చేసి - పన్నెండు ఎకరాలు కరిగించాడు, మనకి నాస్తి మిగిలించి" కొడుకులు కాశీ, భట్టు ల చికాకులు ప్రసాదంగా లభిస్తుంటాయి. రేణు, సర్వప్ప వంటి వారి అనునయ వాక్యాలు భైరవ గురు మనసు తోటలోని పచ్చదనాన్ని కాపాడుతున్నాయి. "మీ నాన్నగారు అమెరికాలో పుట్టి ఉంటే, హిమశిఖరంపై కూర్చుని ఉండేవారు కదమ్మా" సర్వప్ప మాటలకు పెదవులపై లేత నవ్వు విరుస్తుంది. @@@@@@ మనవళ్ళు, మనవరాళ్ళు - డాలర్ల దేశంలో స్థిరపడుతున్నారు. మనమరాలు రుద్రమ దేవి "తాతయ్యా, మీరు ఇంటర్ నెట్ యుగం ఇది." అని తాతకు బహుమానంగా ఇచ్చిన టీ.వీ. లో ఆధునిక ఔకర్యాదులన్నిటినీ నేర్పింది. "రిమోట్ - ఇంత చిన్నవస్తువులో అంత జగతి అద్భుతాలు ఇమిడి ఉన్నవి" సంభ్రమంగా భైరవ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.ముఖ్యంగా జానపద సినిమాలను తనివితీరా చూడసాగాడు.  చాలా కథలు - తాను సేకరించిన ప్రాచీన హిందూ సాహిత్య సంపదలే. "మా పూర్వీకులు - కాసె సర్వప్ప - సిద్ధేశ్వర చరిత్ర - రాసారు భరప్పా, మా పూజ గదిలో భద్రంగా ఉన్నది. మీరు మళ్ళీ ప్రతులు చేసి, ప్రింట్ చేస్తారా!?" కాశీ, భట్ సర్వప్పను అరిచారు."అంతగా దురద ఎక్కువైతే, మీ ఎకరం పొలం అమ్మేసి, ప్రచురించండి, కాదన్న వారెవరు, అడ్డుకునే వారెవరు!?" భట్టు కేకలతో సర్వప్ప అభ్యర్ధన మొదటి రోజునే స్పీడ్ బ్రేకర్ వెనుక ఆగిపోయింది. @@@@@@@@ టివి లో గురువును మించిన శిష్యుడు - సినిమాను చూస్తున్నాడు భైరవ రాజ.రేణుక గబగబా వచ్చింది. "నాన్నా! ఎంతసేపూ సినిమాలేనా, హాట్ హాట్ న్యూస్ వస్తున్నది" అని, రిమోట్ తీసుకుని, వార్తా ఛానెల్స్ పెట్టింది. ఒకదాంట్లో ఒక అమ్మాయి స్వరం వేదికని అదరగొడ్తున్నది. ఈశ్వరి అందరినీ నిలదీస్తున్నది, "నాకు అన్యాయం జరిగింది... " అంటూ వాపోతున్నది. అసలేం జరిగిందంటే - " నే రంగమెళ్ళి పోతాను, నారాయణమ్మా ......  "అనే జానపగ గీతం కథ అది. ఆ పల్లె పాట - వెండితెరపైకి ఎక్కగానే, హిట్ సాధించి, విపరీతమైన జోష్ అందుకున్నది. ఏ నోట విన్నా, ఏ రింగ్ టోన్ విన్నా అదే పాట. "నేను మట్టి పిసికే నేలలో పుట్టాను. వీడియోలలో మొదటగా పాడింది నేనే. ఆ సినిమా వాళ్ళు అడగంగానే,అరవై పాటలు, కష్టపడి రాసి ఇచ్చాను. గుండ్రంగా మంచి చేతిరాతతో - మా తమ్ముడి చేత రాయించాను. బోలెడు ఠావు పేపర్లు, జెరాక్సు ఖర్చులు, మా స్థోమతకు మించి ఖర్చు చేసి, ఛార్జీలు పెట్టుకుని వెళ్ళి, సినిమా డైరెక్టర్లు, నిర్మాతలకు అందించాము. మా బోటి వాళ్ళు ఆరుగురి కష్టం వాళ్ళ మనసుకు పట్టలేదు. నన్ను వదిలేసి, వేరే సినిమా గాయని చేత పాడించారు. నన్ను అన్యాయం చేసారు, నేను ఊరుకోను" మూడు రోజుల పాటు - అదే వార్తాంశం సంచలనం కలిగితూ బుల్లితెరలపై ప్రసార ఔతున్నది. ఆనక ఆ చలనచిత్ర సంబంధీకులు రాజీ చేసుకున్నారు. వారం రోజుల తర్వాత ఈశ్వరి టెలివిజన్స్ ద్వారా అందించిన శుభవార్త : "జానపద గేయ నిధి" అనే సంస్థను సినీ వర్గం వారి సహకారం అందుకుని, నెలకొల్పింది. జానపద గేయ నిధి - పల్లె బాణీలను గ్రంధస్థంచేస్తుంది, ప్రసారమాధ్యమాలలో, పుస్తకాలుగా కలకాలం భద్రం అయ్యేలా చేస్తుంది, ఈశ్వరి ఆశయాలు నెరవేరే మంచి ఘడియలు - భైరవి రాజ గురు, సర్వప్ప, రేణు వంటి వారికి మోదం, సమ్మోదం కలిగిస్తున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలు - folk stories వెండితెరను, ముఖ్యంగా మన తెలుగు తెరను స్వర్ణమయం గావించాయి. అయాచితంగా లభించిన నిధులు ఇవి. విజయవంతమైన చిత్రాలకు లభించిన లాభాలలో కనీసం ఐదు శాతం కేటాయిస్తే, అందమైన ఫొటోలతో, పల్లె కథలు - అందరి చేతులలో ఉండేవి. ఇది తన తీపి కల - కొన్నిసార్లు ప్రయత్నించి విఫలుడయ్యాడు భైరవ రాజ గురు. ఈశ్వరి గొంతు ఎత్తిన బంగారు ప్రయత్నం - అద్భుత ఫలితాలను ఒసగింది. ఈ మట్టి చేతుల అమ్మాయి - మన భారతదేశం స్వాతంత్ర్యం పొందిన కొత్త దినాల నాడు ప్రాణం పోసుకున్న తన ఆశని, బీజావస్థ నుండి, మహాతరువుగా పెరిగేలా ప్రోత్సహించగలిగే విశిష్ట మహిళయే ఈశ్వరి, భైరవ, తదితరులు మట్టి మనిషి ఈశ్వరి దీక్ష, ఆచరణలల నుండి వెదజల్లి విరబూస్తున్న అరుణకిరణాల దొంతరల వైపు చూస్తున్నారు. "సామీ, భుజంపైని కండువాను దులిపి వేసుకోండి. ఇంకా స్తబ్ధుగా అట్లాగే కూర్చున్నారే" వాకిట్లో గొబ్బెమ్మలు పెట్టిన ముగ్గు దగ్గర నిలబడిన వ్యక్తి సర్వప్ప కంచుకంఠం అది.  ; [పాత్రలు ;- భైరవి రాజ గురు - ఈశ్వరి - సర్వప్ప  & రేణుక - కాశీ, భట్టు] ; & మట్టి మగువ ప్రభలు ;- Telugu Story - మాలిక web సాహిత్యపత్రిక ; రచన: కాదంబరి కుసుమాంబ ;

సులోచన సులోచనాలు

"తనకింకా 29 ఏళ్ళు పూర్తి అవలేదు. అప్పుడే దృష్టి ఆనడం లేదు" 

సులోచన కొంచెం సిల్లీగా, మరి కొంచెం సిగ్గుగా అనిపిస్తున్నది. 

మేడ మీద రూములో కొత్తగా అద్దెకు వచ్చారు ఇద్దరు బాచిలర్లు.

"వీళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళిచ్చే బాడుగ డబ్బులు తనకు, చన్నీళ్ళకు వేణ్ణీళ్ళుగా తోడ్పడుతున్నాయి"

మేడ మీదికి వెళ్ళి "నిద్ర కళ్ళ మీద కాఫీ ఏం చేసుకుంటారు!? నేను ఇస్తాను. హోటల్ కాఫీకి ఇచ్చే రేటు కంటే తక్కువ ఇవ్వండి, చాలు కదా."

ఆగంతకులు  పృధ్వి, రాజ్ ఉభయులూ సంతోషంగా తలలూపారు.

@@@@@@, ;

సులోచన మధ్య తరగతి గృహిణి. డాబా గది ఎన్నో రిపేర్లు చేస్తేనే అని అనిపించుకుంటుంది. 

పై కప్పు కొన్నిచోట వర్షం కురుస్తుంది, కిటికీ రెక్క ఒక ఒకటి ఊడి వేళ్ళాడుతున్నది. 

గోడలు సున్నం ముఖం చూసి,పదేళ్ళు ఆయె. 

అత్యవసరంగా అద్దెకు దిగిన వాళ్ళు ఒకట్రెండు నెలల్లో వేరే ఇల్లు చూసుకుని మారిపోతున్నారు. 

అందుకే ఈసారి సులోచన కొత్తగా అద్దెకు వచ్చిన ఆగంతకుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.

ఆమె భర్త గవర్నమెంటు ఆఫీసు క్లార్కు, జేభులో ఓ మూలకు ఇమిడే జీతం డబ్బులను బుద్ధిగా భార్య చేతిలో పోసేస్తాడు, 

"తన దగ్గర ఉంటే మాత్రం, ఆరేడు మేడలు కట్టేటంత మనీ వెనకేయ లేడు కదా" 

అందుకే పెళ్ళాం దోసిళ్ళలో పోసేసి, కళ్ళు అరమోడ్చి కూర్చుని, జపం చేస్తూ నిశ్చింతగా కూర్చుంటాడు. 

సులోచన వరండా గోడకు - హనుమంతప్ప - నేమ్ బోర్డ్ - ని తుడిచి, రోజూ నీట్ గా ఉంచి, ఇష్టంగా చూసుకుంటుంది.

ఆమెకు భర్త అంటే ప్రేమ, జాలి కూడా. "సగటు మనిషి కనబడని సంకెళ్ళు ధరించి, స్వీయ బందీ ఐ ఉంటున్నాడు. 

అదృశ్య శృంఖల నిర్మాతలు ఎవరో, కనబడని ప్రశ్నార్ధకములు ఎన్నో"  

@@@@@@, ;


అన్నయ్య అనంతరాముడు - ఇక్కడ ఒక కేసును investigation చేస్తూ వచ్చాడు. 

"భోంచెయ్యి, అన్నయ్యా" "కాదమ్మా, కేసు పని అర్జెంట్ గా వెళ్తున్నాను.

 ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా నీచేతి వంట, మిస్సవను, సరేనా"

అన్న మాట ప్రకారం అన్నయ్య అనంతరాముడు మరుసటి నెలలోనే వ చ్చాడు. సులోచన సంతోషంతో పలకరించింది. 

"ఇవాళ భోజనానికి వస్తాను." అని చెప్పి, బైటికి వెళ్ళాడు. 

"పోలీసెంకట్రాముడు, వంద పనుల మీద వచ్చి ఉంటాడు" నవ్వుతూ అన్నాడు ఆమె భర్త. 

"అంకుల్, మేము ఉద్యోగం, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, చిత్తూరు వెళ్తున్నాం. గురువారం వస్తాము, ఆంటీకి చెప్పండి"  

************

వంట చేస్తూ, కృష్ణ నామాలను వల్లె వేస్తున్న సులోచన, వాళ్ళ మాటలు విని, 

"సరే బాబూ, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి." 

మడి కట్టుకుని, ఉన్నందున లోపలి నుండే జవాబు చెప్పింది సులోచన.

అపరాహ్ణం దాటాక, బైట గేటు దగ్గర జీపు దిగి వస్తున్నాడు అన్న.

సులోచన కంచాలు పెట్టి, మంచినీళ్ళు పెట్టి, వడ్డన ఏర్పాట్లలో, నిమగ్నమైంది. 

అన్నం తిని, అక్క వంటను మెచ్చుకున్నాడు అనంతరాముడు.

తన మొబైలుని ఛార్జిలో పెట్టాడు. "సార్, వాళ్ళ అడ్రసు దొరికింది." అని ఇచ్చాడు కానిస్టేబుల్.

అనంతరాముడు ఆశ్చర్యపోయి, సర్దుకుని, సులోచనను అడుగుదామని అనుకున్నాడు.

గాభరా పడుతుందని,


ఆగాడు. నెమ్మదిగా "చల్లగాలికి మేడ మీదికి వెళ్దాం, బావగారూ" బావతో వెళ్తుంటే, 

"అరగంటలో దిగిరండి. కాఫీ తాగడానికి"  అన్నది అనంతరాముడు. 

మేడ రూములో కూర్చుని, రేడియో వింటున్న యువకుడు జనార్దన్ ని, కాలర్ గుంజి పట్టుకుని కిందకు వచ్చాడు. 

హనుమంతప్ప వణికిపోతూ, 

"వీడు మా బంధువుల పిల్లాడు, జనార్దన్. బుద్ధిమంతుడు మంచివాడు"

@@@@@@ ,

పోలీస్ స్టేషనులో విస్తుబోయే విషయాలు వాళ్ళ చెవుల్లో సీసం పోసినటయ్యింది. 

అద్దెకు వచ్చిన ఆ ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు. బంగారం, విలువైన వస్తువులను దొంగిలించి, 

ఇతర ప్రదేశాలలో అమ్మి సొమ్ము చేసుకొనే నేర్పరులు.

దగ్గరలో ఉన్న ఇతర యువకులతో స్నేహం పెంచుకుని, కుయుక్తి పన్ని, 

వాళ్ళను తాము చేస్తున్న నేరాలలో ఇరికించి, తాము తప్పించుకుంటారు.

ఇదీ వాళ్ళ చోరకళ పద్ధతి.

సులోచన బంధువు - ఖాకీ డ్రెస్సు - జీపు గేటు దగ్గర ఆగి ఉండడం చూసారు, అందుకనే తట్టా బుట్టా అర్దుకున్నారు,

పెట్టే బేడా నెత్తిన పెట్టుకుని, చల్లగా జారుకున్నారు.

and here - ఇక్కడ రేడియోలో విలువైన డైమండ్సును దాచి ఉంచుకున్నారు.

వాటిని మంచి బేరం రేటుకు విక్రయించడానికి రహస్య ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

ఈ లోపున - లాఠీవాలా రాక వాళ్ళ కుతంత్రాలకు గండి వేసింది.

ఇప్పుడు తెలివిగా - "మా సామాను చూస్తూ ఉండు." అని చెప్పి, 

జనార్దనస్వామిని కూర్చుండబెట్టి, అర్జంటుగా ... ఆ ఇరువురు లాఘవంగా తప్పించుకున్నారు. 

ట్రాన్సిస్టర్ లో - రత్నాలు, వజ్రాలు ఉన్నాయి, అని తెలీని జనార్దనుడు, హాయిగా ఆకాశవాణి - వివిధభారతి గానసుధలను ఆస్వాదిస్తూ కూర్చున్నాడు.

బుల్లిపెట్టెతో సహా పోలీసులు పట్టుకుని, చరచరా పొలిస్ స్టేషన్ కి లాక్కెళ్ళారు.

పాపం, జనార్దనస్వామి రాశిఫలాలు - వార ఫలాలలో - "నీ నొసట third degree వాయింపులు రాసిపెట్టి ఉన్నాయి" - 

అని  రాసి ఉన్నవి, కాబోలు- జనార్దన్ ఖాకీ లాఠీ దెబ్బలు తిన్నాడు.

స్వయంగా పోలీస్ ఠాణాకు వచ్చారు, స్వచ్ఛందంగా నిజం కోసం నిలడ్డారు, ఇరుగు పొరుగు, అందరూ చెప్పారు,  

ఏకకంఠంతో నొక్కి వక్కాణించారు - "ఈ పిల్లాడికేమీ తెలీదు, జనార్దన్ అమాయకుడు" -

ఆపద వేళలలో - తమ భారాన్ని పంచుకోవడానికి వచ్చిన స్నేహితులను చూసి, సులోచన కళ్ళు ఆనందబాష్పాలు నిండాయి.

ప్రజల వత్తాసు, అందరి మాటలు "నిజానిజాలు నిర్ధారించుకుని, జనార్దనాన్ని వదిలేసారు పోలీసులు.

@@@@@@  

"జగదంబ మనందరినీ రక్షించింది" సులోచన దంపతులు నిట్టూర్చారు. కర్ణాటక సరిహద్దుల వద్ద, గజదొంగలు పృధ్వి, రాజ్ దొరికారు.

ఈ కేసు ద్వారా, మరికొన్ని నేరాలు బైటపడ్డాయి, క్రూర నేరస్థులు పట్టుబడ్డారు. అనంతరాముడు గారికి అవార్డులు, పురస్కారాలు వచ్చాయి. 

ప్రమోషన్ లిస్టులో మొదటి పేరు అతనిదే. ఇంత భవిష్యత్తుకు రహదారి ఏర్పడడానికి కారణమైన అక్కయ్య ఇల్లు, స్వయంగా చూసి ఉన్నాడు కదా! 

సున్నం పెచ్చులు ఊడి, పురాతన స్థితిలో ఉన్న ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది. 

అనంతరాముడు దగ్గర ఉండి, రిపేర్లు చేయించి, అదనంగా ఇంకొక room కట్టించాడు. 

"అంతా మన మంచికే జరిగింది. అనవసరంగా కేసులో ఇరుక్కున్నామే, తెలీక అట్లాంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చామే" 

అనుకుంటూ అప్పటిదాకా భయపడుతున్న, 

సులోచన & హనుమంతప్ప - గుండెల నిండా గాలి పీల్చుకున్నారు. 

అన్నగారి అండదండలు లభించడంతో నగరంలో హాస్తల్స్ లో ఉన్న - 

హనుమంతప్ప -  సులోచన యొక్క పిల్లల చదువులు కూడా, ఒడిదుడుకులు లేకుండా సాగుతున్నవి.  

@@@@@@,

పృధ్వి వాళ్ళు ఇచ్చిన అడ్వాన్సు - సులోచన కళ్ళద్దాలు కొనడానికి ఉపయోగపడ్డాయి. 

"ఇంత చక్కని కంటి అద్దాలు - కొన్నావు. మనం ఆ విలన్లను కనిపెట్టలేక పోయాం" అన్నాడు హనుమంతప్ప.

"నిజమే, మీకు కూడా కవిత్వం మాట్లాడడం చేతనౌను - నాకిన్నాళ్ళూ తెలీ లేదు సుమీ" అన్నది సులోచన, 

నవ్వుతూ సులోచననాలను సర్దుకున్నది.

;

[ పాత్రలు ; సులోచన & భర్త హనుమంతప్ప -  సులోచన అన్నయ్య Police అనంతరాముడు ; బాడుగ ఇంట దిగిన వాళ్ళు - పృధ్వి, రాజ్,  & హనుమంతప్ప relative జనార్దనస్వామి ] ;;

Kusuma Stories - Telugu 



పల్లవి, పాణిగ్రాహి ;- 57

శ్రీకర్ ;- పల్లవీ! మా ఊరి నుండి - అల్టిమేటమ్ జారీ చేసారు  మా మమ్మీ,డాడీ -            ప్లీజ్, త్వరగా మనం డెజిషన్ తీసుకోవలసిన టైమ్ వచ్చింది  ప...