30, మార్చి 2021, మంగళవారం

ముద్దు పేర్లు - మొద్దు పేర్లు

ముద్దు పేర్లు - మొద్దు పేర్లు ;-

"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ."  ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలిచారు. 

మేడమీది రూములోనుండి బద్ధకంగా ఆవులిస్తూ ఒక్కొక్కళ్ళూ కిందికి దిగివచ్చారు. 

"పళ్ళు తోముకో లేదా?" "ఇవ్వాళ భౌమ్యవారం కదా పిన్నీ! ఇవాళైనా మమ్మల్ని రెస్టు తీసుకోనీయరేంటి, కాస్త విశ్రాంతి తీసుకుంటే మీరేమైనా అరిగిపోతారా? ఏంటి? 

పెద్దాళ్ళందరూ ఎప్పుడూ ఇంతే!" పెద్ద నాపసానిలా చిట్టి అనబడే గౌరి అన్నది. ఆ రోజులలో సంస్కృతం ఓరియంటల్ చేసింది లవంగిక. 

ఆమెకు దేవభాష అంటే ఇష్టం. ఆమె దగ్గర గౌరికి చనువు, గారాబం ఎక్కువ. 

కనుకనే ఛలోక్తులను కానుకలుగా ఇస్తూంటుంది చిట్టీ ఉరఫ్ గౌరి. 'ఆదివారము'ఐనట్టి SunDay కి భౌమ్యాన్ని పులిమి, చిట్టి తన గీర్వాణభాషా ప్రావీణ్యాన్ని వెల్లడించింది."ఇవాళ సన్ డే, కాస్త గుర్తుంచుకోండి, ప్లీజ్!" 

తరళాక్షి కొడుకు బంటీ అన్నాడు.  "ఏ వారమైనా గంటలు ఇట్టే గడుస్తాయి. గడియారంలో ముల్లు చకచకా కదల్తూనే ఉంటుంది, 

నడినెత్తిపైకి పొద్దు వాలినా నిద్రమత్తుల్ని వదలరు, పైగా ఇట్లాగ నయగారాలు...." అంత గడుసు దీర్ఘోపన్యాసం ఇచ్చిన మనిషి పేరు సత్యమ్మ ఉరఫ్ సత్యవతీదేవి.

మూలనున్న ముసలమ్మ సత్యవతి అప్పటికే వాకిట్లో ముగ్గులేసింది, స్నానం చేసింది, ఇత్తడి గ్లాసులో పావుశేరు కాఫీని గటగటా తాగేసింది. గునగునా అటూఇటూ నడుస్తూ శ్లోకాల్ని పఠిస్తూ,

ఆమె మాటల్ని కనీసం చెవి తమ్మెల దాకానైనా ఎక్కించుకోలేదెవ్వరూ. తొలి పొద్దున ఆలిండియా రేడియో లో అరగంటపాటు వచ్చే 'భక్తిరంజని ' ఎంతో ఆమె మాటల విలువ అంతే! 

రెండింటినీ ఎవ్వరూ పట్టించుకోనే పట్టించుకోరు. :) :) :) 

"అట్లాగ పెట్టీ  నేమ్స్ పెట్టి పిలిస్తే ఊరుకోము" రుసరుసలాడ్తూ అన్నారు పిల్లకాయిలు. "ఏం చేస్తారేంటి?" నవ్వుకుంటూ అన్నది. తరళ. 

"రోజూ ఉండే భాగోతమే కదా ఇది!" నవ్వాపుకుంటూ అన్నది లవంగిక. "అసలు పేర్లు మాని, కొసరు పేర్లు పెట్టి పిలుస్తారేంటి డాడీఈ వీళ్ళు? ఇట్లాగైతే పెట్టేబేడా సర్దుకుపోతామంతే!"  

దంతధావనం పూర్తిచేసుకుని, వంట్టిలోకి వచ్చి, కాఫీకప్పులు తీసుకున్నారు.

"మా ముద్దుపేర్లనే నామకరణం రోజున బియ్యప్పళ్ళెంలో రాసేస్తే సరి పోయేదిగా" బుజ్జీ అన్నాడు కోపంతో. వాడి పరిస్థితి మరీ అన్యాయం. "బుజ్జీ! బజ్జీ! మిరపకాయ సొజ్జీ.........."  అంటూ అర్ధం తెలీకున్నా, రిథమ్‌ బాగా కుదిరింది కదాని, ; ఆ అర్ధంపర్ధం లేని మాటలని పాటలు కట్టి వాణ్ణి బాగా ఎగతాళి చేస్తూంటారు ఆటల వేళలలో తోటి ఫ్రెండ్సు. "ఔను మరి, అట్లాగ నిక్ నేముల్నే బారసాలనాడు పెట్టేసి ఉంటే మాకు తేడా కూడా తెలిసేదే కాదు. ఆ పిలక నేములకు అలవాటు పడి ఉండే వాళ్ళం" ఈ మారు వాళ్ళ కంప్లైంట్సుని ఇవ్వడానికి తాతయ్య దగ్గరికి దారి తీసారు. "చూడు తాతయ్యా! అమ్మ, పిన్నీ మమ్మల్ని ఈ టిక్కీ నేముల్తో బైట కూడా పిలుస్తున్నారు. సినిమాహాలు దగ్గర విని, మా ఎగస్పార్టీవాళ్ళు అవే పేర్లెట్టి పిలుస్తూ ఏడిపిస్తున్నారు."   

[ ఏదో సినిమాలో - పండు - అని ముద్దు పేరు పెట్టినందుకు `parents ని heroine బాగా కోప్పడింది ....... పాపం, ఇట్లాంటి చేదు experiences ని face చేసింది కదా]

తాతయ్య బోసిపళ్ళ నోట్లోంచి మాటలు తుస్సుతుస్సున గాలిని కలుపుకుంటూ వస్తున్నాయి. ` "మరి మీకు పెట్టిన పేర్లు ముసలితరం వాళ్ళవి. అంటే మావి, బామ్మ, అమ్మమ్మ, తాతలవి అన్నమాట." 

"అయితే?......" మనమలు, మనవరాళ్ళ ఏకైక ప్రశ్న. "పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు, మీరు సరిగా చదవక మకురుతనం చేస్తున్నప్పుడు కోపంతో అప్పుడప్పుడు తిట్టాల్సివస్తుంది కదా?" 

"హూ!?" ఈ సారి సౌండులోనే క్వశ్చన్ మార్కును సంధించారు."అట్లాగ తిడితే ఆ పేర్లు ఉన్న మాలాంటి పెద్దవాళ్ళను తిట్టినట్లౌతుంది. అందుకే మీకీ పేర్లు. అవి నిక్ నేములు కాదు, ముద్దు పేర్లు." 

కాస్త సముదాయిస్తూ సమాధానపరిచాడు కన్నింగ్ తాతయ్య. ఆ జవాబు నచ్చినా నచ్చకున్నా ముక్కులు చిట్లించి, పెదవులు ముడుస్తూ బైటికి ఆడుకోడానికి పరుగులు తీసారు. 

*********************, ,

కరుణాకర్ తెలుగు టీచర్. ప్రైవేటుగా కట్టి బి.ఇడి., ఎం.ఇడి. లు పాసయ్యాడు. ఇప్పుడు పిల్లల గోల వలన ఈ నామధేయాల పట్ల కొన్ని సందేహాలు, దాంతో ఉన్నట్లుండి కొన్ని డౌట్లు ఉరవడిగా మదిలో వెల్లువెత్తాయి. "నాన్నా! పెద్దల పేర్లను భక్తితో పెడ్తున్నాము, సరే! కానీ ఎక్కువగా దేవుళ్ళ పేర్లను పెడ్తున్నాము. నాకు మీరు మోహన క్రిష్ణ అని పేరు పెట్టారు. తప్పు కదూ!"  అనూచానంగా వస్తూన్న ఈ ఆచార సంప్రదాయాలని అనుసరించడమే తప్ప అసలు దానిగురించి పట్టించుకోలేదెన్నడూ.  "ఏమిటో? ఇట్లాంటి ధర్మసందేహాలు కలిగితే ఎట్లాగ? జవాబు లేని ప్రశ్నలు ఇవి." 

అని బట్టతలను గోక్కుని, చేతులెత్తాడు. "రామాయణములో ఉన్న పేర్లన్నీ గుర్తున్నంత వర్ఱకూ చెప్పండి నాన్నగారూ!" 

"రామ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, కైకేయి సోదరుడు యుధాజిత్తు, గిరివజ్ర - గిరివ్రజ " 

అప్పుడప్పుడూ ఇద్దరూ ఇంకా ఉన్నవాటిని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ చెప్పారు. "దశరధ, వశిష్ఠ, విశ్వామిత్ర, శబరి, మాతంగ ముని, భరద్వాజ......."  " సుగ్రీవ, వాలి, రుమ, జాంబవంత, అంగద, హనుమంత" "సురమ, విభీషణ, సుమిత్ర, కౌసల్య."  తర్వాత భారత, భాగవతాలకు జంప్ చేసారు. "అర్జున్, భీమ్ - మొదలుకొని - దుర్యోధనుడు, నూర్గురు తమ్ముళ్ళు, చెల్లెలు దుస్సల ఇత్యాదిని కరువు తీరా చెప్పుకున్నారు.  "నాన్నా! ఇతిహాసాల, ప్రబంధాల రచయితలు ఎవరు?" వాల్మీకి, వ్యాస, నన్నయ, తిక్కన, ఎర్రాప్రెగ్గడ, అల్లసాని పెద్దన ............ "  లిస్టును చెప్పుకుంటూ వెళ్ళారు.

'బమ్మెర పోతన, బావమరదులు వగైరాలు పింగళి అక్కన్న, మాదన్న, శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయలు ........" వంట పూర్తి చేసి వచ్చిన ఇంటి ఇల్లాళ్ళు అక్కడికి చేరి, తమకు తోచిన అలనాటి పేర్లను చెప్పసాగారు.

"పల్నాటియుద్ధం లో బాలచంద్రుడు, ఐతాంబ, పేరిందేవి, మాంచాల,...........' ఈ పట్టిక పాతిక పాతపేర్లు కొత్తవాటిని చేర్చుకుంది. సంగీతం నేర్చుకుంటూన్న గౌరి 

'త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, సారంగపాణి, అన్నమయ్య, కంచెర్లగోపన్న, అనగా రామదాసు ....... " 

వెనక తోకలా తగుల్కొన్నాడు కొంచెం సంగీతపరిజ్ఞానం ఉన్న బంటీ ఫ్రెండు "రామదాసుగారూ! ఇదిగో రశీదందుకోండీ......" సత్యం బామ్మ అన్నది "పాతకాలం పేర్లలో దేవుని పేర్లు తక్కువగా కనపడుతున్నాయి. ఆ కాలం వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదో?" సంభాషణలోకి అందరూ వచ్చి చేరగా, పదాల ప్రవాహం వేగం పుంజుకుంది. వంటపూర్తి చేసి, స్త్రీలు హాలులోకి వచ్చారు. తరళాక్షి అన్నది. "నార్త్ ఇండియాలో నకుల్. సహదేవ్, కర్ణ, కౌరవుల పేర్లను పెట్టుకుంటారు. దుర్యోధన్, సుయోధన్, ఇట్లాగ." "డార్జిలింగ్ లో హిడింబికి గుడికూడా ఉన్నదట" "ప్రబంధకాలం గురించి చెప్ప్పండి. భువనవిజయ ఆస్థానంలో పెద్దన, ముక్కు తిమ్మన్న, గోదాదేవి, అట్లాగే ఆకాలానికి ముందు వెనకలుగా అవ్వయ్యార్, మీరాబాయి,  లొల్ల, కథానాయిక మొల్లమాంబ." "కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన."  "కన్నడదేశాన రన్న, పొన్న్న, కుమారవర్మ..." "ప్రాచీనకాలాన చాల ఉన్నాయి. విక్రమార్క, భట్టి, భోజరాజు, హర్షవర్ధన, సముద్రగుప్త, శాతవాహన, మిహిరలకుడు........" "విజయనగర సామ్రాజ్య స్థాపకులు 


ఒకరు బుక్కరాయలు మామూలు పేరే, రెండవ వ్యక్తి హరిహరరాయలు.......... శ్రీకృష్ణదేవరాయలులో క్రిష్ణుని పేరు ఉంది. మహామంత్రి తిమ్మరుసు, అష్టదిగ్గజ కవులు ముక్కుతిమ్మన,

అల్లసానిపెద్దన, వీళ్ళతోబాటు వికటకవి తెనాలి రామకృష్ణుడు, ధూర్జటి  ..."  "మన ఆంధ్ర కవిత్రయం నన్నయ్య,తిక్కన, ఎర్రాప్రెగడ ఐతే - అటు కర్ణాటక దేశాన రన్నడు, పొన్నడు, పంపడు ఎట్సెట్రా ఎట్సెట్రా"

సత్యమాంబ "ఇంతకీ సారాంశమేమిటీ అని?" 

"జనసామాన్యంలో భగవంతుని పేర్లను పెట్టుకోవడం, ఇటీవలి కాలంలో మొదలైంది. అన్నమాచార్యులు, భక్తపోతన, వారి కుటుంబీకులు అక్కన్న, మాదన్నలు. తాళ్ళపాక తిరుమలాంబ, తిరుమలయ్య 

వీరివి పుణ్యక్షేత్రాల పేర్లు ........  "ఇవి వింటుంటే మొద్దు పేర్లు . వీటి కన్నా ముద్దు పేర్లే నయం ....... " సదస్యులలో - ఒకరు - వెనక నక్కి, నొక్కి చెప్పిన వక్కాణం అది.

వక్క, ఆకులు నముల్తూ పెద్దల శాల్తీ కనుబొమ్మలను ప్రశ్నార్ధకంగా మలిచి, "ఇంకా చెప్పుడు ........ " అన్నట్లు వీక్షణాదులను ప్రసరించాడు. 

"శ్రీనాధుని పల్నాటియుద్ధములోని పాత్రలు, నాగమ్మ, ఐతాంబ, మాంచాల, బాలచంద్రుడు, పేరిందేవి, అనపోతరాజు, ఎక్కువగా ఇలాంటివి. తక్కువగా నరసింహ, బ్రహ్మనాయుడు లాంటివి. ప్రబంధపాత్రలు- నలుడు, దమయంతి, ప్రవరుడు, వరూధిని, గిరిక ఇవి చాలా ఉన్నాయి. క్రిష్ణరాయలనాటి మహామంత్రి తిమ్మరుసు, శిల్పి జక్కన, స్థూలంగా చెప్పాలంటే దేవుని పేర్లను సామాన్యులు సాధారణంగా పెట్టుకొనేవాళ్ళుకాదు. ఇటీవల మొదలైన అలవాటు అది. మళ్ళీ సంబోధిస్తూ పిలవాల్సి వచ్చినప్పుడు కలిగే ఇబ్బందుల్ని అధిగమించడానికి ముద్దుపేర్ల తంటాలు ఇదిగో, ఇప్పుడు మన ఇంట్లోకి మల్లేనే!" తరళ అన్నది. "నీకు ఇంత నాలెడ్జి ఉందనుకోనే లేదు నేను." విస్తుపోతూ భర్త రేపటి టెల్గూ రీసెర్చ్ కమ్‌ ప్రొఫెసర్ అన్నాడు.  &

పాత్రలు ;- [తెలుగు టీచర్ కరుణాకర్ - బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ [=  గౌరి ] -  ఉరఫ్  - & తరళాక్షి కొడుకు బంటీ  - తరళ, sister లవంగిక - సత్యమ్మ ఉరఫ్ సత్యవతీదేవి -  మోహన క్రిష్ణ - కొసరు పేర్లు  ;- మూలనున్న ముసలమ్మ సత్యవతి -  తాతయ్య -  ]  &  


మా బామ్మ మాట బంగారు మూట - 2 ;

LINK ;- కోణమానిని - protractar ; 

భానుమతి ది గ్రేట్ లాయర్

 టివి లో 'తోడూ నీడా' సినిమా చూస్తున్నది భాను. తండ్రి షాపు నుండి వచ్చాడు. చదువుతున్న - భగవాన్ రాసిన డిటెక్టివ్ నవలను, టీపాయ్ పైన ఉంచి, లోనికి వెళ్ళి, టిఫిన్, కాఫీలను తెచ్చి, ఇచ్చింది.

"ఇట్లాంటి పుస్తకాలను చదువుతున్నావా!?" నవ్వుతూ అన్నాడు తండ్రి నాగేశ్వర మూర్తి. "నేను లాయర్ అవ్వాలంటే - ఇట్లాంటి బుక్స్ కూడా useful ఔతాయి నాన్నా" భానుమతిని, ఎంతో ఇష్టంగా లాయర్ చదివిస్తున్నాడు.

 అతను ఆర్ధిక లోటు వలన - తాను అందుకోలేని మ్రానిపండు న్యాయవిద్య - తన కూతురి నేమ్ బోర్డ్ - లాయర్ భానుమతి - అని ఉండాలని ఆశ. 

ఉప్మా తింటూ, రింగ్ ఔతున్న ఫోన్ నడిచాడు నాగేశ్వర మూర్తి. చిన్ననాటి స్నేహితులలో ఆత్మీయుడు రంగబాబు ఫోన్ కాల్ అది. వాళ్ళ అల్లుడు సీతారామ్ కి 'బెస్ట్ రైతు - రాష్ట ప్రభుత్వం బహుమతి వచ్చిందట, భానూ" చెప్పాడు. "నేను కూడా అక్కడికి వస్తాను నాన్నా, జానకిని కలిసి మూడేళ్ళు ఔతున్నది." చాలా నెలలు ఐంది" 

పల్లెటూళ్ళో ఏ చిన్న ఉత్సవమైనా చాలా సందడిని సంతరిచుకుంటాయి.  

రంగబాబు అల్లుడు సీతారామ్  వ్యవసాయంలో మేలైన పద్ధతులను అనుసరించి, మెండు పంటను సాధించినందుకు గవర్నమెంట్ అవార్డ్, సర్టిఫికేట్స్ అందుకుంటున్నప్పుడు, ప్రజల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. చుట్టుపక్కల అరవై ఊళ్ళ జనుల  కోలాహలం ఇంతింతని చెప్పనలవి కావనే చెప్పాలి.ఎందరో జనుల ఆప్యాయతలను అందుకున్న సీతారామ్ వ్యక్తిత్వంలోని గొప్పదనాన్ని తండ్రి మెచ్చుకుటున్నప్పుడు గుర్తించింది భానుమతి. పొలాలు దున్నే రైతులు, పాడిపంటల అందచందాలు అన్నీ జానకితో కలిసి షికార్ చేస్తూ, తనివితీరా చూసింది భాను. "జానకి పెళ్ళి, శోభనం నాడు భాను చేసిన హడావుడి, చిలిపి అల్లరి ... " గుర్తుకు తెచ్చుకుంటూ సిగ్గులమొగ్గ అయ్యింది జానకి. "మూడేళ్ళు ఇట్టే గడిచిపోయాయి 

కదూ" అనుకుంటుండగా, జానకి వెనుక నుండి వచ్చి వాటేసుకుంది హిమబాల. "నీ మేనకోడలు - అనిపించదు, ఈ పిల్ల నీ కన్నకూతురు అనుకుంటారు ఎవరైనా" భాను. జానకి నవ్వి చిన్నరి హిమబాలను చంకన ఎత్తుకుని, గోరుముద్దలు తినిపించింది. జానకి అన్నయ్య కృష్ణమోహన్ కూతురు చిన్నారి హిమబాల - "పండూ, భాను ఆంటీకి ముద్దివ్వమ్మా" అనగానే. చటుక్కున ముద్దు పెట్టేసింది. వీడ్కోలు తీసుకుని, స్వగృహం చేరాక, భానుమతి, LAW పుస్తకాలలో లీనమైంది.  ********,

భానుమతి లాయర్ డిగ్రీ సాధించింది. ప్లీడర్ ప్రాక్టీస్ మొదలెట్టిన ఐదు నెలలకు - బాధ కల్గించే వార్త తటస్థపడింది. పల్లెలో జానకి - ఒక మదం ఎక్కిన ఆంబోతు కొమ్ములకు బలైంది. అక్కడికి వెళ్ళివచ్చిన నాగేశ్వర మూర్తి, భాను మనసులు కకావికలం ఐనాయి. భార్యావియోగి సీతారామ్మ్ గురించి, ఎక్కువగా - అతని మామ దిగులు పడ్డాడు.  జానకిని రేయింబవళ్ళూ తలచుకొని కుమిలిపోతున్నాడు సీతారామ్. మామ స్థానంలో ఉన్న రంగబాబు కన్నతండ్రి కంటే ఎక్కువగా వ్యధ చెందాడు. అల్లుని పునర్వివాహ బాధ్యతను తన భుజస్కంధాలపైన వేసుకున్నాడు. 

రంగబాబు "నాగూ, మా అల్లుడు వజ్రపు తునక, నీకూ తెలుసు కదా. సంసారపక్షంగా ఉన్న అమ్మాయి, నీకు తెలిసినవారిలో ఉంటే చెప్పు" నాగేశ్వరమూర్తి "సరే" అన్నాడు. అతి తక్కువ వ్యవధిలోనే, భానుమతి ఇష్టపూర్వక అంగీకారంతో - భాను  సీతారామ్  ల పేర్లు - ఆలుమగలు రూపంగా వెలిసాయి. 

నాగేశ్వరమూర్తి ఫోను అందుకుని మాట్లాడాడు. భాను చెప్పిన విశేషాలు 1. రంగబాబు కొడుకు కృష్ణ - గౌతమి ల స్వార్ధం మితిమీరింది.  2. రంగబాబు వారి వైఖరికి విసిగిపోయిన / ఆస్థి మొత్తం - అల్లుడు సీతారామ్ పేరున రాసాడు. అటు వెనుక అన్ని సంఘటనల పరంపర - విచిత్ర మలుపులు తిరిగాయి.3. ఉక్రోషంతో హిమబాలను లాక్కెళ్ళిపోయారు - ఆ చిన్నారి యొక్క parents & + జానకి అన్న వదిన ఐన గౌతమి, క్రిష్ణ. వాళ్ళు మామా అల్లుళ్ళను కోర్టుకు ఈడ్చారు.

 సీతారామ్ "నాకు ఆస్థి అసలు అక్కర్లేదు. నా జానకి మధుర జ్ఞాపక సంపదలు నాకు చాలు" అన్నాడు.

 కానీ కోర్టు పాలు చేసిన వారిపై కోపంతో రగులుతున్నాడు సీతారామ్ యొక్క father in law - రంగబాబు. 

కేసులో ముందుకు సాగడానికే కృతనిశ్చయంతో ఉన్నాడు. కేసులో గెలుపు కార్డు కోసం, అప్పటికప్పుడు - కల్పనలు వెలుస్తున్నాయి. 

వాటిలో ఒకటి - సీతారామ్  ఇన్నేళ్ళూ ఈ ఇంట్లో పడి తిన్నాడు, కనుక అతను తమకు - కొన్ని లక్షలు చెల్లించాలి, ఈ అభియోగాన్ని ఎవరూ ఊహించలేదు, భానుమతి కూడా.... , 

భానుమతి మీద ఇప్పుడు బాధ్యతలు పడ్డాయి, హిమబాల సంరక్షణ ;

భానుమతి తన భర్త సీతారామ్  కోసం  & మామగారు  కోసం  - తన ఫ్యామిలీ కోసమే మొదటి కేసును చేపట్టడం విధివిలాసం - సీతారామ్  పక్షాన ఊరు ఊరంతా నిలబడింది. సీతారామ్మ్ పొందిన ప్రభుత్వ సన్మానం, సర్టిఫికెట్స్ - 

అనేక సంవత్సరాలు - పొలాల్లో అతను చేసిన కాయకష్టం, వ్యవసాయం పట్ల అతని ఇష్టం, 

నిబద్ధతలకు దర్పణాలు./ అతి సులభంగా న్యాయం గెలిచింది. 

కానైతే, సీతారామ్ - మామగారు రంగబాబు ఇచ్చిన ఆస్థిలో సగం వాటాను - తన బావమరిదికి ఇచ్చాడు. 

బామ్మరిది తనలోని స్వార్ధ మానవుని గుర్తించి, కించిత్తు సిగ్గు పడి, క్షమాపణలు అడిగాడు.ది గ్రేట్ లాయర్  భానుమతి "నాకు ఇంత ఈజీ కేసు దొరికింది. నా మొట్ట మొదటి కేసు మరీ ఇంత సులువు ఐనది దొరుకుంతుందని అనుకో లేదు" పకపకా నవ్వుతూ అన్నది. 

&

 [ పాత్రలు ;- భానుమతి లాయర్ - నాగేశ్వర మూర్తి & రంగబాబు ;  జానకి, సీతారామ్ ; చిన్నారి హిమబాల & చిన్నారి యొక్క parents & + జానకి అన్న వదిన ఐన గౌతమి, క్రిష్ణ ]

కథాకళి కాదంబరి 2021 - 2 ; భానుమతి ది గ్రేట్ లాయర్  =  The Great lawyer  Banumati ;

========================,

TV lO 'tODU nIDA' sinimA cUstunnadi BAnu. tamDri shaapu numDi waccADu. caduwutunna - BagawAn raasina 

DiTekTiw nawalanu, TIpAy paina umci, lOniki weLLi, Tiphin, kaapheelanu tecci, iccimdi. "iTlAmTi pustakAlanu 

caduwutunnaawaa!?" nawwutuu annADu tamDri nAgESwara mUrti. "nEnu laayar awwaalamTE - iTlAmTi buks kUDA 

`useful` autAyi nAnnA" BAnumatini, emtO ishTamgaa laayar cadiwistunnADu atanu aardhika lOTu walana - taanu 

amdukOlEni mraanipamDu nyaayawidya - tana kuuturi nEmm bOrD - laayar BAnumati - ani umDAlani ASa. 

upmaa timTU, rimg autunna phOn naDicADu  nAgESwara mUrti.  

 cinnanaaTi snEhitulalO aatmeeyuDu ramgabaabu phOn kaal adi. wALLa alluDu seetaaraamm ki 'besT raitu - 

raashTa prabhutwam bahumati waccimdaTa, BAnU" ceppADu. "nEnu kUDA akkaDiki wastAnu nAnnA, jAnakini kalisi 

mUDELLu autunnadi." caalaa nelalu aimdi" 

palleTULLO E cinna utsawamainaa caalaa samdaDini samtaricukumTAyi.  ramgabAbu alluDu sItArAmm 

wyawasaayamlO mElaina paddhatulanu anusarimci, memDu pamTanu saadhicinamduku gawarnamemT awaarD, 

sarTiphikETs amdukumTunnappuDu, prajala karatALa dhwanulu minnamTAyi. cuTTupakkala arawai ULLa janula  

kOlaahalam imtimtani ceppanalawi kaawanE ceppAli.

emdarO janula aapyaayatalanu amdukunna sItArAmm wyaktitwamlOni goppadanaanni tamDri 

meccukuTunnappuDu gurtimcimdi BAnumati. polaalu dunnE raitulu, pADipamTala amdacamdaalu annI jaanakitO 

kalis shikaar cEstU, taniwiteerA cuusimdi BAnu. "jaanaki peLLi, SOBanam nADu BAnu cEsina haDAwuDi, cilipi allari 

... " gurtuku teccukumTuu siggulamogga ayyimdi jAnaki. "mUDELLu iTTE gaDicipOyaayi kadU" anukumTumDagaa, 

jAnaki wenuka numDi wacci wATEsukumdi himabAla. "nI mEnakODalu - anipimcadu, ee pilla nee kannakuuturu 

anukumTAru ewarainA" BAnu. jAnaki nawwi cinnari himabAlanu camkana ettukuni, gOrumuddalu tinipimcimdi. 

jaanaki annayya kRshNamOhan kuuturu cinnAri himabAla - "pamDU, bhaanu AMTIki muddiwwammA" anagaanE. 

caTukkuna muddu peTTEsimdi. weeDkOlu teesukuni, swagRham cEraaka, BAnumati, `LAW` pustakaalalO 

leenamaimdi.  BAnumati laayar Digree saadhimcimdi. pleeDar praakTIs modaleTTina aidu nelalaku - baadha kalgimcE wArta 

taTasthapaDimdi. pallelO jaanaki - oka madam ekkina aambOtu kommulaku balaimdi. akkaDiki weLLiwaccina 

nAgESwara mUrti, BAnu manasulu kakaawikalam ainaayi. BAryaawiyOgi sItArAmm gurimci, ekkuwagaa - atani 

maama digulu paDDADu.  jaanakini rEyimbawaLLU talacukoni kumilipOtunnADu sItArAmm. maama sthaanamlO 

unna ramgabAbu kannatamDri kamTE ekkuwagaa wyadha cemdADu. alluni punarwiwaaha baadhyatanu tana 

bhujaskamdhaalapaina wEsukunnADu. 

ramgabAbu "naagU, maa alluDu wajrapu tunaka, neekuu telusu kadA. samsaarapakshamgaa unna ammaayi, nIku 

telisinawArilO umTE ceppu" nAgESwaramUrti "sarE" annADu. ati takkuwa wyawadhilOnE, BAnumati ishTapuurwaka 

amgeekaaramtO - BAnu  sItArAmm la pErlu - aalumagalu ruupamgaa welisaayi.

nAgESwaramUrti phOnu amdukuni mATlADADu. BAnu ceppina wiSEshaalu 1. ramgabaabu tana koDuku kRshNa 

- gautami la swaardham mitimeerimdi. wAri waikhariki wisigipOyina / aasthi mottam - alluDu sItArAmm pEruna 

raasADu. aTu wenuka anni samghaTanala parampara - wicitra malupulu tirigaayi. 3. ukrOshamtO himabAlanu 

laakkeLLipOyaaru - aa cinnaari yokka `parents` & + jAnaki anna wadina aina gautami, krishNa. wALLu maamaa 

alluLLanu kOrTuku IDcAru.

sItArAmm "naaku aasthi asalu akkarlEdu. naa jaanaki madhura jnaapaka sampadalu naaku cAlu" annADu. kaanee 

kOrTu paalu cEsina wAripai kOpamtO ragulutunnaaDu ramgabaabu. kEsulO mumduku sAgaDAnikE 

kRtaniScayamtO unnADu. kEsulO gelupu kArDu kOsam, appaTikappuDu - kalpanalu welustunnaayi. wATilO okaTi - 

sItArAmm innELLU ee imTlO paDi tinnADu, kanuka atanu tamaku - konni lakshalu cellimcaali, ee abhiyOgaanni 

ewaruu uuhimcalEdu, BAnumati kUDA.... ,

BAnumati meeda ippuDu baadhyatalu paDDaayi, himabaalanu - sItArAmm kOsam BAnumati tana bharta, 

maamagaaru - tana phyaamilI kOsamE modaTi kEsunu cEpaTTaDam widhiwilaasam - sItArAmm pakshaana uuru 

uuramtA nilabaDimdi. sItArAmm pomdina prabhutwa sanmaanam, sarTiphikeTs - anEka samwatsaraalu - polaallO 

atanu cEsina kaayak

Lawer win

ashTam, wyawasaayam paTla atani ishTam, nibaddhatalaku darpaNAlu./ ati sulabhamgaa 

nyaayam gelicimdi. kaanaitE, seetaaraamm - maamagaaru ramgabaabu iccina aasthilO sagam wATAnu - tana 

baawamaridiki iccADu. baammaridi tanalOni swaardha maanawuni gurtimci, kimcittu siggu paDi, kshamaapaNalu 

aDigADu. di grET laayar  BAnumati "naaku imta eejee kEsu dorikimdi. naa moTTa modaTi kEsu marI imta suluwu 

ainadi dorukumtumdani anukO lEdu" pakapakA nawwutuu annadi.

[ pAtralu ;- jaanaki,  The Great lawyer  Banumati ;- nAgESwara mUrti ;;  jAnaki - 

sItArAmm -biTragumTa rAmgabAbu = jaanaki tamDri - & himabAla `parents` & + 

jAnaki anna wadina = gautami, krishNa - cinnAri himabAla] ;

24, మార్చి 2021, బుధవారం

కథ దొరికింది - సూపర్ మాన్

 'సూపర్ మాన్' - ఇంగ్లీష్ సినిమా టివి లో వస్తున్నది.  విద్యా సాగర్ "pin drop silence, అల్లరి చేయొద్దు, 

సౌండ్ వినపడకూడదు, జాగ్రత్త" అని హెచ్చరించాడు. పిల్లకాయలు మామయ్య ఆజ్ఞని బుద్ధిగా పాటించారు, అతనిని డిస్టర్బ్ చేయలేదు. సినిమాలో పూర్తిగా లీనమై, enjoy చేసాడు విద్యా సాగర్. 

"హమ్మయ్య, ఐపోయింది. మామయ్యా! సూపర్ మాన్ వెనకాతల తగిలించుకుంటాడే, దాన్ని ఏమంటారో చెప్పు"  

ఖంగు తిన్నాడు  విద్యా సాగరుడు. 

"తనకెప్పుడూ పొరపాటున కూడా ఇట్లాంటి డౌటే రాలేదు. ఈ కాలం పిల్లలు అసాధ్యులు సుమీ" అనుకున్నాడు.  రహస్యంగా మొబైల్ తీసుకున్నాడు, "గూగుల్ మాతా, నమో నమః" అనుకుంటూ. 

"గప్ చుప్ - సాంబార్ బుడ్డి, internet ని అడగకూడదు బాబూ"  "హు, కనిపెట్టేసారే. గడుగ్గాయిలు, మీరే చెప్పండి" ఓటమిని ఒప్పుకున్నాడు. " కేప్ - అంటారు"  "సి ఎ పి ఇ - ఇజీక్వల్టు - కేప్ ... " కృష్ణవేణి విడమరిచి చెప్పింది.  కామేశం స్కూల్లో ఫాన్సీ డ్రస్సు పోటీలో పాల్గొన్నాడు.  విద్యాసాగర్ మార్గదర్శి అవగా, సూపర్ మ్యాన్ డ్రెస్సు వేసుకున్నాడు, ప్రైజు గెలిచాడు. ఇంటికి వచ్చేసరికి, మేనత్త కుటుంబం, వచ్చి ఉన్నది. 

"అత్త, మీరు నిన్న వచ్చి ఉంటే బాగుండేది, అన్నయ్య స్టేజీ మీద ఫ్యాన్సీ డ్రెస్సు వేసి, భలేగా నడిచాడు.  మీరు మిస్ అయ్యారు." కాత్యాయని అన్నది. "ఇప్పుడు మాత్రం ఏమీ మించిపోలేదు. రేపు మన ఇంట్లోనే వేషం వేసి, చూపించండి. కన్నులారా చూస్తాము" అన్నారు బంధువులు.

@@@@@ 

 డాబా మీద మర్నాడు సూపర్ మేన్ వేషంతో పాటుగా - తతిమ్మా పిల్లలు, ఆ వెనువెంటనే పెద్దలు సైతం -  వివిధ వేషాలు అప్పటికప్పుడు వేసారు. వాతావరణంలో హుషారు నిండింది. మేడ మీద మిర్చి ఆరబోయడానికి వచ్చిన పక్కింటి ఆవిడ చూసి,  తన వాళ్ళని తీసుకువచ్చింది. అందరికీ స్ఫూర్తి అయ్యింది ఈ ప్రోగ్రామ్. తర్వాత వచ్చిన ఉగాది పండుగ నాడు, గృహప్రాంగణమున - ఇంచక్కా విచిత్ర వేషధారణ నిర్వహించారు. మంది ఎక్కువ అయి, program మరింత రంజుగా జరిగింది. అవాళ -  విద్యా సాగర్  కూడా - super man వేషం ధరించాడు. డైలాగులు చెబుతూ, అటూ ఇటూ నడిచాడు.

మూడో క్షణం ఒక తమాషా జరిగింది. విద్యాసాగర్  వీపు వెనక వేళ్ళాడే cape కాస్తా ఊడి కింద పడింది. ప్రేక్షకులు పకపకా నవ్వసాగారు. "మామయ్యా, ఏ టైలర్ దగ్గర కుట్టించుకున్నావు?" వాళ్ళు ఎగతాళి చేస్తుంటే, విద్యా సాగర్  చిన్నబుచ్చుకోలేదు, సరి కదా, హాయిగా enjoy చేసాడు. 

ఫ్రెండ్ నుండి ఫోన్ కాల్ - సరదాగా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీయాలని, ప్లాన్ చేస్తున్నారు. కథ గురించి గాలిస్తూ, చర్చించుకుంటున్నారు. 

"మంచి స్టోరీ దొరికింది." అన్నాడు విద్యా సాగర్. ఈ కొత్త పని గురించి చెప్పగా, విద్యా సాగర్ తల్లిదండ్రులు అన్నారు, 

"సాగర్! డబ్బులు చెట్లకు కాస్తున్నాయా. వృధా చేస్తున్నారు"  ఇది ముందుగా ఊహించిన సమస్యే, 

జవాబు చెప్పడం తన బాధ్యత, ఇప్పుడు. - తన ఫ్రెండ్స్ ఐతే, ఇంటి పెద్ద వాళ్ళతో తగవులు పెట్టుకున్నారు.

 "నాన్నా! మన దగ్గర పెళ్ళి ఫొటోలు, ఫంక్షన్స్ ఆల్బమ్స్- చాలా ఉన్నాయి కదా." 

ఉపోద్ఘాతంలోని విషయం పెద్దలకు, బాధ్యలు నిర్వహిస్తున్న వారికి బోధపడింది.   "తాతయ్య నానీ నాయనమ్మ ల రోజులలో పెళ్ళి శుభలేఖలు, ఫొటోలు నూతికో కోటికో ఒక్కరికి ఉండేవేమో! అందుకనే అప్పటివాళ్ళు - ఆ ఒకటి రెండు photos ని దాచిపెట్టుకుని, అపురూపంగా చూసుకునేవాళ్ళు.  బ్లాక్ అండ్ వైట్ - మీ పెళ్ళి ఫొటోలు - చిన్న ఆల్బమ్ ఉన్నది, ఇప్పటికీ మేము సరదాగా పిల్లలతో కలిసి, చూస్తుంటాము.  మమ్మీ, అమ్మమ్మ, ఆ ఆల్బమ్ కి ఎక్కువ ఖర్చు ఐంది, అనే వాళ్ళు.  శ్రీమంతాలు, పుట్టినరోజులు, పండగలు, ఇంకా - పేరంటాలు, నోములు, వ్రతాలు - ఇన్నిటికీ కాస్తో కూస్తో ఖర్చు చేసూనే ఉన్నాం కదా!" అక్కడ ఉన్న స్త్రీ వర్గం ఉలిక్కిపడింది.  "మేము చాలా ఖర్చులు తగ్గించుకున్నాం. 

మీరు గుర్తుచేసినప్పటికీ ... నేను నాలుగేళ్ళ నుండీ కొత్త డ్రస్సులు కొనుక్కోలేదు.  ట్యూషన్స్ చెబ్తున్నాను, ట్యుటోరియల్ కాలేజీలో part time job చేస్తున్నాను, నా హాబీ - short films కోసమే" "మన విద్యా సాగర్ తెలివైన వాడే, డబ్బులు ఎక్కడ ఎట్లాగ ఖర్చు చెయ్యాలో - ఎప్పుడు పొదుపు చేయాలో తెలిసిన వాడు,  మనం కాపలా కాసి, జాగ్రత్తలు చెప్పాల్సిన పని లేదు" అనుకున్నారు పెద్దోళ్ళు. అందరి ముఖాల్లో ప్రసన్నత కనబడింది. relief గా ఫీల్ ఔతూ అన్నాడు సాగర్, 

"ఇవాళ సూపర్ మాన్ - ఊహనినాకు,  ఈ కార్యక్రమాల ద్వారా అందించారు. మీకు many many thanks." అన్నాడు.

@@@@@

కొస మెరుపు ;- ఊరి బయట బంగ్లాలో హత్య జరిగింది.. చిన్న గుడ్డ ముక్క దొరికింది,  

ఆ ఆధారం పుచ్చుకుని, CID బృందం అన్వేణ ప్రారంభించింది.  

ఆ వేగుల లీడర్ విద్యాసాగర్, వారం రోజుల్లో సి.ఐ.డి. గ్రూప్ హంతకుణ్ణి పట్టుకున్నారు.  

అది ఎట్లనిన ... ఆస్థి కోసం బంధువైన జగ్గారావు - చేసిన మర్డర్ అది.  కొన్నాళ్ళు ముందుగా - property యజమాని భాగ్యమూర్తిని - దయ్యం వేషం వేసుకుని, భయపెట్టాడు  జగ్గారావు.  భాగ్యమూర్తిని మానసికంగా బలహీనుని చేసేటందుకు జగ్గా వేసిన పన్నాగం అది.  పిశాచి వేషంలో అతను cape ధరించి, గాలిలో దిగుతున్నట్లు ఏర్పాటు చేసుకున్నాడు.  అతని వింత డ్రెస్సును కుట్టిన టైలర్, గుర్తు పట్టి - "జగ్గారావు కుట్టించుకున్నాడు" అని చెప్పాడు.  

విలన్  జగ్గారావు విసనకర్రలా రెపరెపలాడే కేప్ ని కాల్చేసాడు. ఋజువులు దొరకకుండా అతను తీసుకున్న ముందు జాగ్రత్తలు అవి.  ఐతే షర్టును కుట్టి ఇచ్చిన దర్జీ - ద్వారా విలన్ దొరగారిని సులభంగా పట్టుకున్నారు, సి.ఐ.డి లు. కేప్ కుట్టిన కుట్లు - STICHING HOLES ఆనవాళ్ళు - అతన్ని పట్టిచ్చాయి. 

@@@@@

"దొంగ దొరికాడు, భలే" అరుపులకు ఇంటిల్లిపాదీ రూములోకి పరుగు పరుగున వచ్చేసారు.  

"లే లే! నిద్ర లే సాగర్!"  "ఓహ్, ఇదంతా కలేనా. భళీ, మా షార్ట్ ఫిల్మ్ కి మంచి సరుకు ఉన్న కథ దొరికింది." 

అంటూ  బెడ్ మీద నుండి దూకి, సెల్ ఫోన్ చేతబుచ్చుకున్నాడు విద్యాసాగర్,  

"నీ స్వప్న వృత్తాంతం భేషుగ్గా ఉంది. చిన్న సినిమాకు రేపే శుభముహూర్తం."  

అప్పుడే family members కొందరు సాగరునికి - రిక్వెస్ట్ చేయసాగారు,  "మా వదనాలు కూడా మా ముని మనవళ్ళు చూసుకునే అవకాశం, మీ బుల్లి రీళ్ళలో యాక్ట్ చేస్తాం, ప్లీజ్"  

కథ దొరికింది - సూపర్ మాన్ - అను - ఉగాది పండుగ - Fancy Dress ;

[పాత్రలు ;- విద్యా సాగర్ - కృష్ణవేణి - కామేశం - కాత్యాయని - మేనత్త కుటుంబం,ఇరుగు పొరుగు, పిల్లలు - సూపర్ మాన్ fancy dress ] ;

story ;- కుసుమ కాదంబరి [pen name ] ; ;

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...