30, మార్చి 2021, మంగళవారం

ముద్దు పేర్లు - మొద్దు పేర్లు

ముద్దు పేర్లు - మొద్దు పేర్లు ;-

"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ."  ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలిచారు. 

మేడమీది రూములోనుండి బద్ధకంగా ఆవులిస్తూ ఒక్కొక్కళ్ళూ కిందికి దిగివచ్చారు. 

"పళ్ళు తోముకో లేదా?" "ఇవ్వాళ భౌమ్యవారం కదా పిన్నీ! ఇవాళైనా మమ్మల్ని రెస్టు తీసుకోనీయరేంటి, కాస్త విశ్రాంతి తీసుకుంటే మీరేమైనా అరిగిపోతారా? ఏంటి? 

పెద్దాళ్ళందరూ ఎప్పుడూ ఇంతే!" పెద్ద నాపసానిలా చిట్టి అనబడే గౌరి అన్నది. ఆ రోజులలో సంస్కృతం ఓరియంటల్ చేసింది లవంగిక. 

ఆమెకు దేవభాష అంటే ఇష్టం. ఆమె దగ్గర గౌరికి చనువు, గారాబం ఎక్కువ. 

కనుకనే ఛలోక్తులను కానుకలుగా ఇస్తూంటుంది చిట్టీ ఉరఫ్ గౌరి. 'ఆదివారము'ఐనట్టి SunDay కి భౌమ్యాన్ని పులిమి, చిట్టి తన గీర్వాణభాషా ప్రావీణ్యాన్ని వెల్లడించింది."ఇవాళ సన్ డే, కాస్త గుర్తుంచుకోండి, ప్లీజ్!" 

తరళాక్షి కొడుకు బంటీ అన్నాడు.  "ఏ వారమైనా గంటలు ఇట్టే గడుస్తాయి. గడియారంలో ముల్లు చకచకా కదల్తూనే ఉంటుంది, 

నడినెత్తిపైకి పొద్దు వాలినా నిద్రమత్తుల్ని వదలరు, పైగా ఇట్లాగ నయగారాలు...." అంత గడుసు దీర్ఘోపన్యాసం ఇచ్చిన మనిషి పేరు సత్యమ్మ ఉరఫ్ సత్యవతీదేవి.

మూలనున్న ముసలమ్మ సత్యవతి అప్పటికే వాకిట్లో ముగ్గులేసింది, స్నానం చేసింది, ఇత్తడి గ్లాసులో పావుశేరు కాఫీని గటగటా తాగేసింది. గునగునా అటూఇటూ నడుస్తూ శ్లోకాల్ని పఠిస్తూ,

ఆమె మాటల్ని కనీసం చెవి తమ్మెల దాకానైనా ఎక్కించుకోలేదెవ్వరూ. తొలి పొద్దున ఆలిండియా రేడియో లో అరగంటపాటు వచ్చే 'భక్తిరంజని ' ఎంతో ఆమె మాటల విలువ అంతే! 

రెండింటినీ ఎవ్వరూ పట్టించుకోనే పట్టించుకోరు. :) :) :) 

"అట్లాగ పెట్టీ  నేమ్స్ పెట్టి పిలిస్తే ఊరుకోము" రుసరుసలాడ్తూ అన్నారు పిల్లకాయిలు. "ఏం చేస్తారేంటి?" నవ్వుకుంటూ అన్నది. తరళ. 

"రోజూ ఉండే భాగోతమే కదా ఇది!" నవ్వాపుకుంటూ అన్నది లవంగిక. "అసలు పేర్లు మాని, కొసరు పేర్లు పెట్టి పిలుస్తారేంటి డాడీఈ వీళ్ళు? ఇట్లాగైతే పెట్టేబేడా సర్దుకుపోతామంతే!"  

దంతధావనం పూర్తిచేసుకుని, వంట్టిలోకి వచ్చి, కాఫీకప్పులు తీసుకున్నారు.

"మా ముద్దుపేర్లనే నామకరణం రోజున బియ్యప్పళ్ళెంలో రాసేస్తే సరి పోయేదిగా" బుజ్జీ అన్నాడు కోపంతో. వాడి పరిస్థితి మరీ అన్యాయం. "బుజ్జీ! బజ్జీ! మిరపకాయ సొజ్జీ.........."  అంటూ అర్ధం తెలీకున్నా, రిథమ్‌ బాగా కుదిరింది కదాని, ; ఆ అర్ధంపర్ధం లేని మాటలని పాటలు కట్టి వాణ్ణి బాగా ఎగతాళి చేస్తూంటారు ఆటల వేళలలో తోటి ఫ్రెండ్సు. "ఔను మరి, అట్లాగ నిక్ నేముల్నే బారసాలనాడు పెట్టేసి ఉంటే మాకు తేడా కూడా తెలిసేదే కాదు. ఆ పిలక నేములకు అలవాటు పడి ఉండే వాళ్ళం" ఈ మారు వాళ్ళ కంప్లైంట్సుని ఇవ్వడానికి తాతయ్య దగ్గరికి దారి తీసారు. "చూడు తాతయ్యా! అమ్మ, పిన్నీ మమ్మల్ని ఈ టిక్కీ నేముల్తో బైట కూడా పిలుస్తున్నారు. సినిమాహాలు దగ్గర విని, మా ఎగస్పార్టీవాళ్ళు అవే పేర్లెట్టి పిలుస్తూ ఏడిపిస్తున్నారు."   

[ ఏదో సినిమాలో - పండు - అని ముద్దు పేరు పెట్టినందుకు `parents ని heroine బాగా కోప్పడింది ....... పాపం, ఇట్లాంటి చేదు experiences ని face చేసింది కదా]

తాతయ్య బోసిపళ్ళ నోట్లోంచి మాటలు తుస్సుతుస్సున గాలిని కలుపుకుంటూ వస్తున్నాయి. ` "మరి మీకు పెట్టిన పేర్లు ముసలితరం వాళ్ళవి. అంటే మావి, బామ్మ, అమ్మమ్మ, తాతలవి అన్నమాట." 

"అయితే?......" మనమలు, మనవరాళ్ళ ఏకైక ప్రశ్న. "పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు, మీరు సరిగా చదవక మకురుతనం చేస్తున్నప్పుడు కోపంతో అప్పుడప్పుడు తిట్టాల్సివస్తుంది కదా?" 

"హూ!?" ఈ సారి సౌండులోనే క్వశ్చన్ మార్కును సంధించారు."అట్లాగ తిడితే ఆ పేర్లు ఉన్న మాలాంటి పెద్దవాళ్ళను తిట్టినట్లౌతుంది. అందుకే మీకీ పేర్లు. అవి నిక్ నేములు కాదు, ముద్దు పేర్లు." 

కాస్త సముదాయిస్తూ సమాధానపరిచాడు కన్నింగ్ తాతయ్య. ఆ జవాబు నచ్చినా నచ్చకున్నా ముక్కులు చిట్లించి, పెదవులు ముడుస్తూ బైటికి ఆడుకోడానికి పరుగులు తీసారు. 

*********************, ,

కరుణాకర్ తెలుగు టీచర్. ప్రైవేటుగా కట్టి బి.ఇడి., ఎం.ఇడి. లు పాసయ్యాడు. ఇప్పుడు పిల్లల గోల వలన ఈ నామధేయాల పట్ల కొన్ని సందేహాలు, దాంతో ఉన్నట్లుండి కొన్ని డౌట్లు ఉరవడిగా మదిలో వెల్లువెత్తాయి. "నాన్నా! పెద్దల పేర్లను భక్తితో పెడ్తున్నాము, సరే! కానీ ఎక్కువగా దేవుళ్ళ పేర్లను పెడ్తున్నాము. నాకు మీరు మోహన క్రిష్ణ అని పేరు పెట్టారు. తప్పు కదూ!"  అనూచానంగా వస్తూన్న ఈ ఆచార సంప్రదాయాలని అనుసరించడమే తప్ప అసలు దానిగురించి పట్టించుకోలేదెన్నడూ.  "ఏమిటో? ఇట్లాంటి ధర్మసందేహాలు కలిగితే ఎట్లాగ? జవాబు లేని ప్రశ్నలు ఇవి." 

అని బట్టతలను గోక్కుని, చేతులెత్తాడు. "రామాయణములో ఉన్న పేర్లన్నీ గుర్తున్నంత వర్ఱకూ చెప్పండి నాన్నగారూ!" 

"రామ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, కైకేయి సోదరుడు యుధాజిత్తు, గిరివజ్ర - గిరివ్రజ " 

అప్పుడప్పుడూ ఇద్దరూ ఇంకా ఉన్నవాటిని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ చెప్పారు. "దశరధ, వశిష్ఠ, విశ్వామిత్ర, శబరి, మాతంగ ముని, భరద్వాజ......."  " సుగ్రీవ, వాలి, రుమ, జాంబవంత, అంగద, హనుమంత" "సురమ, విభీషణ, సుమిత్ర, కౌసల్య."  తర్వాత భారత, భాగవతాలకు జంప్ చేసారు. "అర్జున్, భీమ్ - మొదలుకొని - దుర్యోధనుడు, నూర్గురు తమ్ముళ్ళు, చెల్లెలు దుస్సల ఇత్యాదిని కరువు తీరా చెప్పుకున్నారు.  "నాన్నా! ఇతిహాసాల, ప్రబంధాల రచయితలు ఎవరు?" వాల్మీకి, వ్యాస, నన్నయ, తిక్కన, ఎర్రాప్రెగ్గడ, అల్లసాని పెద్దన ............ "  లిస్టును చెప్పుకుంటూ వెళ్ళారు.

'బమ్మెర పోతన, బావమరదులు వగైరాలు పింగళి అక్కన్న, మాదన్న, శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయలు ........" వంట పూర్తి చేసి వచ్చిన ఇంటి ఇల్లాళ్ళు అక్కడికి చేరి, తమకు తోచిన అలనాటి పేర్లను చెప్పసాగారు.

"పల్నాటియుద్ధం లో బాలచంద్రుడు, ఐతాంబ, పేరిందేవి, మాంచాల,...........' ఈ పట్టిక పాతిక పాతపేర్లు కొత్తవాటిని చేర్చుకుంది. సంగీతం నేర్చుకుంటూన్న గౌరి 

'త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, సారంగపాణి, అన్నమయ్య, కంచెర్లగోపన్న, అనగా రామదాసు ....... " 

వెనక తోకలా తగుల్కొన్నాడు కొంచెం సంగీతపరిజ్ఞానం ఉన్న బంటీ ఫ్రెండు "రామదాసుగారూ! ఇదిగో రశీదందుకోండీ......" సత్యం బామ్మ అన్నది "పాతకాలం పేర్లలో దేవుని పేర్లు తక్కువగా కనపడుతున్నాయి. ఆ కాలం వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదో?" సంభాషణలోకి అందరూ వచ్చి చేరగా, పదాల ప్రవాహం వేగం పుంజుకుంది. వంటపూర్తి చేసి, స్త్రీలు హాలులోకి వచ్చారు. తరళాక్షి అన్నది. "నార్త్ ఇండియాలో నకుల్. సహదేవ్, కర్ణ, కౌరవుల పేర్లను పెట్టుకుంటారు. దుర్యోధన్, సుయోధన్, ఇట్లాగ." "డార్జిలింగ్ లో హిడింబికి గుడికూడా ఉన్నదట" "ప్రబంధకాలం గురించి చెప్ప్పండి. భువనవిజయ ఆస్థానంలో పెద్దన, ముక్కు తిమ్మన్న, గోదాదేవి, అట్లాగే ఆకాలానికి ముందు వెనకలుగా అవ్వయ్యార్, మీరాబాయి,  లొల్ల, కథానాయిక మొల్లమాంబ." "కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన."  "కన్నడదేశాన రన్న, పొన్న్న, కుమారవర్మ..." "ప్రాచీనకాలాన చాల ఉన్నాయి. విక్రమార్క, భట్టి, భోజరాజు, హర్షవర్ధన, సముద్రగుప్త, శాతవాహన, మిహిరలకుడు........" "విజయనగర సామ్రాజ్య స్థాపకులు 


ఒకరు బుక్కరాయలు మామూలు పేరే, రెండవ వ్యక్తి హరిహరరాయలు.......... శ్రీకృష్ణదేవరాయలులో క్రిష్ణుని పేరు ఉంది. మహామంత్రి తిమ్మరుసు, అష్టదిగ్గజ కవులు ముక్కుతిమ్మన,

అల్లసానిపెద్దన, వీళ్ళతోబాటు వికటకవి తెనాలి రామకృష్ణుడు, ధూర్జటి  ..."  "మన ఆంధ్ర కవిత్రయం నన్నయ్య,తిక్కన, ఎర్రాప్రెగడ ఐతే - అటు కర్ణాటక దేశాన రన్నడు, పొన్నడు, పంపడు ఎట్సెట్రా ఎట్సెట్రా"

సత్యమాంబ "ఇంతకీ సారాంశమేమిటీ అని?" 

"జనసామాన్యంలో భగవంతుని పేర్లను పెట్టుకోవడం, ఇటీవలి కాలంలో మొదలైంది. అన్నమాచార్యులు, భక్తపోతన, వారి కుటుంబీకులు అక్కన్న, మాదన్నలు. తాళ్ళపాక తిరుమలాంబ, తిరుమలయ్య 

వీరివి పుణ్యక్షేత్రాల పేర్లు ........  "ఇవి వింటుంటే మొద్దు పేర్లు . వీటి కన్నా ముద్దు పేర్లే నయం ....... " సదస్యులలో - ఒకరు - వెనక నక్కి, నొక్కి చెప్పిన వక్కాణం అది.

వక్క, ఆకులు నముల్తూ పెద్దల శాల్తీ కనుబొమ్మలను ప్రశ్నార్ధకంగా మలిచి, "ఇంకా చెప్పుడు ........ " అన్నట్లు వీక్షణాదులను ప్రసరించాడు. 

"శ్రీనాధుని పల్నాటియుద్ధములోని పాత్రలు, నాగమ్మ, ఐతాంబ, మాంచాల, బాలచంద్రుడు, పేరిందేవి, అనపోతరాజు, ఎక్కువగా ఇలాంటివి. తక్కువగా నరసింహ, బ్రహ్మనాయుడు లాంటివి. ప్రబంధపాత్రలు- నలుడు, దమయంతి, ప్రవరుడు, వరూధిని, గిరిక ఇవి చాలా ఉన్నాయి. క్రిష్ణరాయలనాటి మహామంత్రి తిమ్మరుసు, శిల్పి జక్కన, స్థూలంగా చెప్పాలంటే దేవుని పేర్లను సామాన్యులు సాధారణంగా పెట్టుకొనేవాళ్ళుకాదు. ఇటీవల మొదలైన అలవాటు అది. మళ్ళీ సంబోధిస్తూ పిలవాల్సి వచ్చినప్పుడు కలిగే ఇబ్బందుల్ని అధిగమించడానికి ముద్దుపేర్ల తంటాలు ఇదిగో, ఇప్పుడు మన ఇంట్లోకి మల్లేనే!" తరళ అన్నది. "నీకు ఇంత నాలెడ్జి ఉందనుకోనే లేదు నేను." విస్తుపోతూ భర్త రేపటి టెల్గూ రీసెర్చ్ కమ్‌ ప్రొఫెసర్ అన్నాడు.  &

పాత్రలు ;- [తెలుగు టీచర్ కరుణాకర్ - బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ [=  గౌరి ] -  ఉరఫ్  - & తరళాక్షి కొడుకు బంటీ  - తరళ, sister లవంగిక - సత్యమ్మ ఉరఫ్ సత్యవతీదేవి -  మోహన క్రిష్ణ - కొసరు పేర్లు  ;- మూలనున్న ముసలమ్మ సత్యవతి -  తాతయ్య -  ]  &  


మా బామ్మ మాట బంగారు మూట - 2 ;

LINK ;- కోణమానిని - protractar ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...