12, జనవరి 2022, బుధవారం

జర్నలిస్ట్ verses డిటెక్టివ్స్

 రాధేష్ కొత్తగా చేరిన ఉద్యోగం, అదేదో ముతక సామెతను అక్షరమ్ములా నిజం చేస్తున్నాడు. 

ర్నలిస్ట్ జాబ్, మహా హుషారుగా వార్తల కోసం మారుమూల ప్రాంతాలను కూడా దున్నేస్తున్నాడు - 

పొద్దెరగకుండా ..... , 

పలమనేరు దగ్గర ఒక పల్లెటూరులో రాత్రుళ్ళు దయ్యం తిరుగుతున్నదట - 

వైన వైనాలుగా ఆ పుకారు చక్కర్లు కొట్టసాగింది. 

బూచోడు, లేదా బూచమ్మ - కనులారా స్వయంగా చూసి, 

రిపోర్ట్ రాసుకుని, తెమ్మని పత్రిక యాజమాన్యాదులు - రాధేషానికి చెప్పారు. 

హుషారుగా, కావాల్సిన సామగ్రిని తీసుకుని, 

విలేఖరి రాధేష్  అండ్ కెమేరా మాన్ మంజునాధ్ అక్కడికి చేరారు.  

ఉభయులు గ్రామస్థులను ప్రశ్నించారు, అందరిదీ ఒకే మాట, 

"జుట్టు విరబోసుకుని, అమావాస్య నాడు అర్ధరాత్రి - రోడ్డు పైకి వస్తుంది,  

కిచ కిచ నవ్వుతుంది, పళ్ళు నాలిక చూపిస్తూ వికార శబ్దాలు చేస్తుంది." 

కొందరు "మీరు అటుకేసి వెళ్ళకండి బాబూ" మరికొందరు గట్టి సలహా ఇచ్చారు. 

రాధేష్, మంజునాధ్ - తమ వృత్తి ధర్మం ఆచరణలో పెట్టాల్సిందే - అని కృతనిశ్చయులై వచ్చారు, 

కనుక, అమావాస్య, అర్ధరాత్రి - లక్కవరం బాటపైకి వచ్చారు. 

రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు ..., గుబురు ఆకుల వలన భీతి కలిగుతున్నా, 

వెనుకంజ వేయకుండా చెట్ల చాటున నక్కి పొంచి ఉన్నారు. 

ఎంత సేపటికీ వారు అనుకున్న సైతాను రాలేదు. 

"పల్లెవాళ్ళ మూఢనమ్మక ప్రభావం ఇది, అన్నీ రూమర్స్" అనుకుంటూ, 

మర్రి మానుకు చేరగిలబడి, చిన్న కునుకు తీయసాగారు ఇద్దరూ. 

camera man మంజు కుదుపుతో ఉలిక్కిపడి, నిలబడ్డాడు రాధేష్. 

"చూడు, చూడు - గుట్ట మీద ఇంట్లో నుండి ఎవరో వస్తున్నట్లుంది." 

"నిజమే" కళ్ళు నులుముకుని చూస్తూ, రాధేష్ మొబైల్  కెమేరాను ఆన్ చేసేసాడు. 

ఆ మేడ గేటును తీసుకుని, తాపీగా వస్తున్న ఆకారం, ఆడ - మగ - స్పష్టంగా తెలీడం లేదు. 

"తెల్లచీర కట్టుకున్న దెవరి కోసము!? .... " వీల పాట మోగించాడు మంజునాధ్. 

"ఈ సందర్భంలో నీకు అంత చక్కని సాంగ్ ఎట్లా గుర్తు వచ్చిందిరా, బాబూ, 

ఈలపాట మంజునాధా!?" 

గడగడా వణికిపోతూ అన్నాడు రాధేష్. 

ఊడల మర్రి చెట్టు మాను దగ్గర కాస్త, వెనుకమాటుగా నిలబడింది ఆ స్వరూపం. 

"ఆడ దెయ్యమే" ఇద్దరు నిఖార్సు చేసుకున్నారు. 

మూర్ఛ పోయినంత పనై, మూర్ఛనలు శృతి ఔతూన్న వారిని మదిలో మోగుతున్న సరికొత్త రాగాలు - 

గాలికి బాగా వినిపించాయి. నిశేష్ఠులై, ఆ స్థితిలో అట్లాగ ఎంతసేపు ఉన్నారో వారికే తెలీదు. 

తెప్పరిల్లి చూసేసరికి, ఆ మహా పాదపం దగ్గర ఏమీ లేదు. తెల్లవారవస్తున్నది, 

కోడికూతలు - కొక్కొరొక్కో కొక్కొరోకో - పక్షుల కిలకిలారావాలు - 

తూర్పు దిక్కున సింధూర వర్ణం వెలుగు విరజిమ్ముతూ, ప్రభాకరుడు వెలుపలికి వస్తున్నాడు.

********************,

అదే ఊళ్ళో మంజునాధ్ మేనమామలు ఉన్నారు. మిత్రులు ఇద్దరికీ అక్కడ బస దొరికింది, 

కాబట్టి ఇబ్బంది లేదు. "మామయ్య వచ్చారు." మామ పిల్లలు సంతోషంతో గంతులు వేసారు. 

సిటీ వాసులు - వీడియో గేమ్సు, పెయింటింగ్స్, బ్రష్షులు - డ్రాయింగ్ పేపర్సు - గిఫ్ట్సు ఇచ్చారు. 

మారుమూల పల్లెటూరి వాళ్ళు తాము, ఇటువంటివి ఉంటాయనే ఊహ కూడా లేదు మరి ...., 

విజయ లక్ష్మి ఒక్క రోజులోనే చాలా ముగ్గులు వేసింది, అన్నిటినీ చూపించింది. 

ఇంట్లోని పెద్దవాళ్ళకు, సెల్ ఫోన్లు, చిన్న స్టీలు గంగాళం వగైరాలు ఇచ్చారు. 

"ఈ అమ్మాయి చేతిలో ఇంత మంచి కళ ఉంది" హాపీగా మెచ్చుకున్నాడు రాధేష్. 

భోజనాది కార్యక్రమాదులు పూర్తి ఐ, బైట పావంచాలో కూర్చున్నారు. 

మంజునాధ్ అత్త, తతిమ్మావారు, అతిథుల అనుభవాలను తెలుసుకున్నారు. 

మామ కొడుకు మహేష్, కూతురు విజ్జాం - అదేనండీ, 

విజయలక్ష్మి పిలుపు పేరు లేదా ముద్దుపేరు అన్నమాట, - 

"ఇవాళ నేనూ వస్తాను." వాళ్ళను బ్రతిమాలి, ఒప్పించాడు. 

యధా ప్రకారం -  ఇవాళ ఈ నలుగురూ చిట్టడవికి చేరుకున్నారు. 

నిన్న రాత్రి రెండుగంటలకు వచ్చిన దయ్యం, ఇవాళ కరెక్టుగా అర్ధరాత్రి పన్నెండు గంటలకి వచ్చేస్తున్నది, 

'తన అమావాస్య నియమాన్ని కూడా విసర్జించింది కాబోలు" 

మర్రిచెట్టు కాండం దగ్గర స్థిరంగా నిలబడింది, దాని ఒంటో ఏదో వింత కాంతి ...., 

మహేష్ కళ్ళు బైర్లు కమ్మి, కింద పడ్డాడు.

రాధేష్, మంజునాధ్ గాభరాపడసాగారు, విజ్జాం గడగడా వణుకుతున్నది.

"ఈ పిల్లలు ఇద్దరి భద్రత, బాధ్యత తమ మీద ఉంది కదా" ఆ దయ్యం - 

మహేషుని దాటుకుంటూ గుట్ట మీదికి వెళ్ళి మటుమాయం అయ్యింది. తిప్పలు పడి, ఇల్లు చేరారు. 

మేనమామ, అందరూ గాభరా పడ్డారు. 

ఊరివాళ్ళు గుమికూడారు. అంతా గందరగోళం, ఒకటే సందడే సందడి ......, 

మేనమామలు - children మహేష్ - విజయ లక్ష్మి ఉరఫ్ విజ్జాం ;

మహేషుని దాటుకుంటూ గుట్ట మీదికి వెళ్ళి మటుమాయం అయ్యింది. తిప్పలు పడి, ఇల్లు చేరారు. 

మేనమామ, అందరూ గాభరా పడ్డారు. ఊరివాళ్ళు గుమికూడారు. అంతా గందరగోళం, ఒకటే సందడే సందడి ....., 

5 - మంజు, రాధేష్ తమ జేబులలోని కొన్ని టాబ్లెట్సు వాళ్ళకి ఇచ్చారు. 

కానీ, వాటిని అక్కడే ఉంచి, పల్లీయులు, పెద్దలు - కొన్ని ఆకుపసర్లు పిండి పిల్లల ముక్కు, చెవులలో పోసారు. 

ఐదు నిముషాలకి తేరుకున్న వాళ్ళని చూస్తూ, మంజు, మిత్రుడు surprise అయ్యారు. 

"ఈ village people - knowledge ముందు తమ సైన్స్ పరిజ్ఞానం విలువ ఎంత, 

తమ వైద్య జ్ఞానం - ఇక్కడ స్థాణువు ఔతుంది." 

********************, 

మర్నాడు పొద్దున బావి చప్టా మీద దంతధావనం చేసుకుంటున్నారు అందరూ.

"విజ్జక్కా, నిన్న మనకు అగుపడింది మనిషే, దయ్యం కాదు, కానేకాదు" "

హెయ్, నిఝంగా కనపడింది కదా" 

"నాకు అదోలా అయ్యి, కింద పడ్డాను కదా, అప్పుడు ఆ దయ్యం మడిసి - 

నన్ను దాటుకుంటూ వెళ్ళింది కదా .... " 

కదా ....  - వాడి నోట్లో నానుతున్న ఊతపదం.

అప్పటికే మిగతావాళ్ళు తొంగి చూస్తూ, చెవులప్పగించి వినసాగారు.

"అట్లాగ గెంతేసి, నా మీంచి వెళుతున్నప్పుడు, నాకు వాసన వచ్చింది .... " 

మహేష నాసాపుటాల ఆఘ్రాణ శక్తి ఎక్కువ, ఫర్లాంగు దూరం ఉన్నది 

ఏదైనా ఇట్టే వాసన పసిగట్టి చెప్పేయగలడు. ".... ఆ చీర అంచులు, 

ఘాటు వాసన, అది మన ఇంటి ఉతుకు గుడ్డ" "అంటే??" 

మంజునాధ ప్రశ్న, "ఉతికేటప్పుడు సున్నం, వాషిం సోడా, బ్లీచింగు - 

ఇట్లాంటివన్నీ కలుపుతారు. ...." 

మామ వీరభద్రం బల్బు వెలిగింది - 

"ఔన్ను నిజమే, ఎవరి చేతివాటం వాళ్ళది. మేము ఇస్తీ చలవ మడత బాగా వస్తుందని, 

కొన్ని జిగురులను వాడతాం, ఐతే, దాని బట్టి నువ్వు కనిపెట్టేసావా ఏమిట్రా!?" మేనల్లుడిని అడిగాడు.

"ఔను, మామయ్యా, ఆ తెల్ల చీర బార్డరు, బాకరామ్  పెళుసుదనం, నిన్న పొద్దున ఇస్త్రీ చేసి, ఇచ్చాం. 

నేల మీద నా ముక్కుకి సరసరా తగిలింది. నిజం దెయ్యాల కట్టుకునే గుడ్డలు వాసనలు ఒస్తాయా!!?"

మేనత్తలు "మహేషా, నీ తెలివే తెలివిరా" 

అప్పటికప్పుడే వాళ్ళు మనసులలో భావి ప్రణాళికలు రూపకల్పన జరిగింది కూడా, 

తమ కూతురుతో పెళ్ళి చేసేయాలి, తమ ఇంటల్లుడు వీడే"

********************,

విజ్జాం తన డైలాగులకు అదనంగా కొత్త మెరుపులను సమకూర్చసాగింది, 

"ఔను, నాక్కూడా గుప్పన వాసనేసింది. నాకూ ఇదే డౌటు వచ్చింది" అందరూ ఫక్కున నవ్వుతూ 

"విజ్జీ, గడుసుదానివే. ఇప్పటిదాకా భయపడ్డావు. మళ్ళీ  అప్పుడే పెద్ద ధైర్యమంతుల్లా ఫోజు పెడుతున్నావు." 

వాళ్ళ మాటలని ఆట్టే పట్టించుకోలేదు, విజ్జీ - సైతాను విషయం గురించి ప్లాను వేసి, 

రాధేష్, మంజునాధ్ లకు రహస్యంగా చెప్పింది. 

చిన్నారి విజ్జీ, మహేషుల సందేహాలు చెవిని పడ్డాక, అవి కాస్తా వంద ప్రశ్నార్ధకమ్ములుగా మారాయి. 

ఇంకేముంది, విలేఖరి ద్వయం, వీర డిటెక్టివ్ అవతారాలు దాల్చారు. 

ఈ సారి లంచి బాక్సులు, దాల్చిన చెక్క, లవంగం ఆదిగా - మరికొన్ని మసాలా దినుసులు అదనం అయి, వారి బ్యాగులు ఎక్కువ బరువెక్కాయి.

********************, 

మళ్ళీ పూర్వ ప్రదేశానికి చేరారు. ఊడలు పట్టుకుని, పిల్లలు ఇద్దరూ ఉయ్యాలలు ఊగారు. 

మొబైల్ కెమేరా కన్నులకు - బోలెడు ఫొటోలు లభించాయి. 

ఊడలు పట్టుకుని ఊగుతున్నప్పుడు, ఎత్తుకి వెళ్ళిన మహీబాబు చిన్నగా అరుస్తూ, రహస్యంగా పిలిచి చెప్పాడు "అంకుల్, దెయ్యం బైల్దేరింది, అదిగో" అందరూ గబగబా చెట్టు ఎక్కి, పెద్ద కొమ్మలలో నక్కి కూర్చున్నారు. 

ఆ శ్వేత వస్ర ధారిణి, చెట్టు కిందికి వచ్చింది. 

"ఇవాళ ఎవరూ రాలేదే!? భయపడ్డారు" విజయగర్వంతో నవ్వుకుంటూ, 

తన చీర కుచ్చిళ్ళ సరిచేసుకుంటున్నది. అక్కడికి ముగ్గురు మనుషులు వచ్చారు. 

"గంగులమ్మా, ఇవాళ వాళ్ళు రాలేదు కదూ. సిటీ మడుసులం, 

మాకు బాగా తెలుసు అనుకుంటారు. 

ఎవడికైనా భయం వేయకుండా ఉంటారా, అదీ మన సత్తా." 

"గంజాయ్, కల్తీ సరుకులు - ఇన్నేళ్ళుగా - మనకు అడ్డు లేదు. 

మన బిజినెస్సు బ్రేకు పడితే ఊరుకుంటామా ఏంది!?" 

మూడోవాడు చుట్టలు, సిగరెట్టు ఇచ్చాడు. ముగ్గురూ వెలిగించి, గుప్పుగుప్పున పొగలు వదుల్తున్నారు. 

మహేష్ నిన్నటి నుండే తన ఆలోచనలకు పదును పెట్టి, కార్యాచరణకు ఉపక్రమించాడు. 

సైతానమ్మ ధరించినది కొత్తచీర, కాబట్టి - ఊళ్ళో ఉన్న ఏకైక టైలర్ రాజేంద్ర దగ్గరికి వెళ్ళాడు. 

వాకబు చేసిన మహేష్ బాబు, రిపోర్టర్స్ ఇద్దరికీ - నిజం అర్ధం అయ్యింది. ''''''''' - 1 - ;

"మన అనుమానం నిజమే. నాలుగు తెల్లచీరలకు - ఫాల్సు వర్కు చేసాడు రాజేంద్ర

చెట్టు వద్ద సీను చూస్తుండగానే మహీబాబు కనుక్కున్నాడు 

"అద్దిరబన్నా, ఆ కంపెనీ సిగరెట్టు - సత్తెయ్య ఒక్కడే వాడ్తున్నాడు, 

పేకాట పండుగాడికి మాత్రమే చేతనౌను, చుట్ట పొగను రింగులు రింగులుగా వదుల్తుంటాడు. 

నేరేడు చెట్టు కింద వీళ్ళు పేకాట ఆడతారు. వీరభద్రం చుట్టపీకలతో, రచ్చబండ నిండిపోతుంది, 

అన్ని చుట్టపీకలు ఉంటాయి." 

"ఓ, చెయిన్ స్మోకర్స్ ఇక్కడా ఉన్నారా!?" రాధేష్ ఆశ్చర్యార్ధకం.

వటవృక్షం పైన దాక్కున్న నలుగురికీ - విషయం సమస్తం బోధపడింది.

మంజునాధ్ పల్లెటూరు మిత్రులకు మెస్సేజ్ ఇచ్చాడు. 

వెంటనే వాళ్ళు సైకిళ్ళు తొక్కుకుంటూ వచ్చేసారు. జనం చుట్టుముట్టే సరికి, సైతాన్ వేషధారిణి, 

ఆ నాటక సృష్టికర్తలు బిత్తరపోయారు. 

ఒక్కొక్క రహస్యం - తొక్క వలిచిన పండు నుండి, తీస్తున్న తొనలు లాగా బైటికి వచ్చాయి. 

తూర్పు దిక్కున వెలుగురేకలు విప్పారుస్తూ, ఉదయబింబం కనువిందు చేస్తున్నది.   

********************,

ఊళ్ళో ఇప్పటికీ ఈ సంఘటనను చెప్పుకుంటున్నారు. ఇంత మంచి వార్త అందించిన 

రాధేష్, మంజునాధ్ లకు పత్రికలో ప్రమోషన్సు లభించాయి. 

ఆ ఏరియాలలో స్మగ్లింగు, సంఘ విద్రోహం పనులకు అడ్డుకట్ట పడింది. 

ఇందుకుగాను మహీ, విజ్జీలకు - జాతీయ సాహస బాలల పురస్కారం - ఇచ్చారు.  

ఈ ఫొటోలు  News papers, టివి ఛానెల్సులలో వచ్చాయి. 

"మా ఊరికి మణిదీపాలు వీళ్ళు." అందరి ప్రశంసలతో వాతావరణం చైతన్యభరితం అయ్యింది.

రాధేష్, మంజనాధ్ - పత్రికల వారి ప్రయత్నాలు - బాలలు ఇద్దరికీ మంచి స్కూళ్ళలో సీటు వచ్చింది, 

పై చదువులు చదివారు. ఉన్నత విద్యావంతులు ఐ, ఉద్యోగస్థులు అయ్యారు విజ్జీ,  మహీ. 

ఇప్పుడు వాళ్ళు - అంధ విశ్వాసాలు అంటే ఏమిటో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు, 

వాళ్ళు స్థాపించిన సంఘం - అనేక గెలుపులను సాధిస్తున్నది. 

సక్సెస్సులను నమోదు చేసుకుంటూ ముందుకు సాగుతున్నది.

********************,

విజయోస్తు, దిగ్విజయోస్తు ;-

కొసమెరుపు ;- అన్నట్టు, వీర డిటెక్టివ్ అవతారాలు దాల్చిన వారికి, తమ లంచి బాక్సుల నుండి - 

విలన్సు మొహాలపై చల్లుదామని తెచ్చుకున్న - 

కారం, దాల్చిన చెక్క, లవంగం ఇత్యాది - మసాలా దినుసులని ప్రయోగించే అవసరం కలగలేదు కదా, 

గ్రామం ప్రజలు - ఇంచక్కా use  చేసారు, పండుగ విందు చేసుకున్నారు. 

న్యూస్ పత్రికలు, ప్రజా సంస్థలు - విరాళాలు ఇచ్చారు, అందుకనే ఆ విందు భోజనం పసందుగా జరిగింది, 

ఆ విందులో వడ్డించిన సాధకములు, అన్ని విషయాలు - 

అక్కడ నివసిస్తున్న మనుషులకి - ఇప్పటికీ ఎప్పటికీ మధురాతి మధురం ఐన జ్ఞాపకమే.

*****************************************************************, , 

[పాత్రలు ;- రాధేష్ జర్నలిస్ట్ -  camera man మంజునాధ్ ; 

మేనమామలు - children విజయలక్ష్మి - ఉరఫ్ విజ్జమ్మ & మహేష్ - ఉరఫ్ మహీబాబు ] 

============================, ;

rAdhEsh kottagaa cErina udyOgam, adEdO mutaka saametanu aksharammulaa nijam cEstunnADu. 

jarnalisT jaab, mahaa hushaarugaa waartala kOsam maarumuula praamtaalanu kUDA 

dunnEstunnADu - podderagakumDA ..... , 

palamanEru daggara oka palleTUrulO raatruLLu dayyam tirugutunnadaTa - 

waina wainaalugaa aa pukaaru cakkarlu koTTasaagimdi. buucODu, lEdA bUcamma - kanulaaraa swayamgaa cuusi, ripOrT raasukuni, temmani patrika yaajamaanyaadulu - rAdhEshaaniki ceppaaru. hushaarugaa, kaawaalsina saamagrini teesukuni, 

wilEKari rAdhEsh  amD kemEraa maan mamjunaadh akkaDiki cEraaru. 

********************, 

ubhayulu graamasthulanu praSnimcaaru, amdaridee okE mATa, "juTTu wirabOsukuni, amaawaasya nADu ardharaatri - rODDu paiki wastumDi, kica kica nawwutumdi, 

paLLu naalika cuupistuu wikaara 

Sabdaalu cEstumdi." komdaru "meeru aTukEsi weLLakamDi bAbU" marikomdaru gaTTi salahaa 

iccaaru. rAdhEsh, mamjunaadh - tama wRtti dharmam aacaraNalO peTTAlsimdE - ani 

kRtaniScayulai waccaaru, kanuka, amaawaasya, ardharaatri - lakkawaram baaTapaiki 

waccaaru. rODDuku iruwaipulaa pedda pedda ceTlu ..., guburu aakula walana bhiiti 

kaligutunnaa, wenukamja wEyakumDA ceTla cATuna nakki pomci unnaaru. 

emta sEpaTikee waaru 

anukunna saitaanu raalEdu. "pallewaaLLa mUDhanammaka prabhaawam idi, annee ruumars" 

anukumTU, marri maanuku cEragilabaDi, cinna kunuku teeyasaagaaru iddaruu. kemEraa mamju 

kuduputO ulikkipaDi, nilabaDDADu rAdhEsh. 

"cUDu, cUDu - guTTa meeda imTlO numDi ewarO 

wastunnaTlumdi." "nijamE" kaLLu nulumukuni cuustuu, 

rAdhEsh mobail  kemEraanu aan 

cEsEsADu. 

aa mEDa gETunu teesukuni, taapeegaa wastunna aakaaram, ADa - maga - spashTamgaa 

teleeDam lEdu. "tellaceera kaTTukunna dewari kOsamu!? .... " 

weela pATa mOgimcADu mamjunaadh. 

"ee samdarBamlO neeku amta cakkani saamg eTlA gurtu waccimdirA, bAbU, 

eelapATa mamjunAdhA!?" gaDagaDA waNikipOtU annADu rAdhEsh. 

UDala marri ceTTu maanu daggara kaasta, wenukamATugA nilabaDimdi aa swaruupam. 

"ADa deyyamE" 

iddaru niKArsu cEsukunnaaru. muurCa pOyinamta panai, muurCanalu SRti autuunna 

waarini madilO mOgutunna sarikotta raagaalu - gaaliki baagaa winipimcaayi. niSEshThulai, 

aa sthitilO aTlaaga emtasEpu unnaarO waarikE teleedu. tepparilli cuusEsariki, aa mahaa 

paadapam daggara EmI lEdu. tellawaarawastunnadi, kODikuutalu - kokkorokkO kokkorOkO - 

pakshula kilakilaaraawaalu - tuurpu dikkuna simdhuura warNam welugu wirajimmutuu, prabhaakaruDu welupaliki wastunnADu.

********************, 

adE ULLO mamjunAdh mEnamaamalu unnAru. mitrulu iddarikee 

akkaDa basa dorikimdi, 

kaabaTTi ibbamdi lEdu. "maamayya waccaaru." mAma pillalu 

samtOshamtO gamtulu wEsaaru. siTI waasulu - weeDiyO gEmsu, peyimTimgs, 

brashshulu - Draayimg pEparsu - giphTsu iccaaru. 

maarumuula palleTUri wALLu taamu, iTuwamTiwi 

umTaayanE Uha kUDaa lEdu mari ...., wijaya lakshmi 

okka rOjulOnE caalaa muggulu wEsimdi, 

anniTinee cuupimcimdi. 

imTlOni peddawALLaku, sel phOnlu, cinna sTIlu gamgALam wagairaalu iccaaru. 

"ee ammaayi cEtilO imta mamci kaLa umdi" haapeegaa meccukunnADu rAdhEsh. 

BOjanaadi kaaryakramAdulu puurti ai, baiTa paawamcaalO kuurcunnaaru. 

mamjunAdh atta, tatimmaawaaru, 

atithula anubhawaalanu telusukunnaaru. mAma koDuku mahEsh, kUturu wijjaam - adEnamDI, wijayalakshmi pilupu pEru lEdaa muddupEru annamATa, - 

"iwALa nEnuu wastaanu." waaLLanu bratimaali, oppimcAru. 

yadhaa prakaaram - ciTTaDawiki cErukunnaaru, iwALa ee naluguruu.

ninna raatri remDugamTalaku waccina dayyam, iwALa karekTugaa ardharaatri pannemDu 

gamTalaki waccEstunnadi, 'tana amaawaasya niyamaanni kUDA wisarjimcimdi kaabOlu" 

marriceTTu kaamDam daggara sthiramgaa nilabaDimdi, daani omTO EdO wimta kaamti ...., 

mahEsh kaLLu bairlu kammi, kimda paDDADu.

rAdhEsh, mamjunAdh gaabharaapaDasaagaaru, wijjaam gaDagaDA waNukutunnadi.

"I pillalu iddari bhadrata, baadhyata tama meeda umdi kadA" aa dayyam - mahEshuni 

dATukumTU guTTa meediki weLLi maTumaayam ayyimdi. 

tippalu paDi, illu cEraaru. mEnamaama, amdaruu gaabharaa paDDAru. 

uuriwALLu gumikUDAru. amtaa gamdaragOLam, okaTE samdaDE samdaDi ......, 

mEnamaamalu - children = mahEsh - wijaya lakshmi uraph wijjaam ;

********************,

mamju, rAdhEsh tama jEbulalOni konni TAbleTsu wALLaki iccAru. kaanee, wATini akkaDE 

umci, palleeyulu, peddalu - konni aakupasarlu pimDi pillala mukku, cewulalO pOsAru. aidu 

nimushaalaki tErukunna wALLani cUstuu, mamju, mitruDu `surprise` ayyaaru. "I `village 

people - knowledge` mumdu tama sains parijnaanam wiluwa emta, tama waidya jnaanam - 

ikkaDa sthANuwu autumdi."

********************,  

marnADu podduna baawi capTA meeda damtadhaawanam cEsukumTunnaaru amdaruu.

"wijjakkaa, ninna manaku agupaDimdi manishE, dayyam kAdu, kaanEkaadu" 

"hey, nijhamgaa kanapaDimdi kadA" 

"naaku adOlaa ayyi, kimda paDDAnu kadaa, appuDu aa dayyam maDisi - 

nannu dATukumTU weLLimdi kadA .... " 

kadaa .... - wADi nOTlO nAnutunna uutapadam.

appaTikE migataawALLu tomgi cuustuu, cewulappagimci winasaagaaru.

"aTlAga gemtEsi, naa meemci weLutunnappuDu, naaku waasana waccimdi .... " 

mahEsha naasaapuTAla aaghrANa Sakti ekkuwa, 

pharlaamgu duuram unnadi EdainA - iTTE wAsana pasigaTTi ceppEyagalaDu. 

".... aa ceera amculu, GATu waasana, adi mana imTi utuku guDDa" "amTE??" 

mamjunaadha praSna, "utikETappuDu sunnam, waashim sODA, bleecimgu - 

iTlAmTiwannI kaluputaaru. ...." maama weerabhadram balbu weligimdi - "

aunnu nijamE, ewari cEtiwATam wALLadi. 

mEmu istee calawa maData baagaa wastumdani, 

konni jigurulanu wADataam, aitE, 

daani baTTi nuwwu kanipeTTEsAwA EmiTrA!?" mEnalluDini aDigADu.

"aunu, maamayyaa, aa tella ceera baarDaru, baakaraamm peLusudanam, 

ninna podduna istree cEsi, iccaam. nEla meeda naa mukkuki sarasaraa tagilimdi. 

nijam deyyaala kaTTukunE guDDalu waasanalu ostaayaa!!?"

mEnattalu "mahEshaa, nee teliwE teliwirA" appaTikappuDE 

wALLu manasulalO BAwi praNALikalu ruupakalpana jarigimdi kUDA, 

tama kuuturutO peLLi cEsEyAli, tama imTalluDu wIDE" 

********************,

wijjAm tana DailAgulaku adanamgA kotta merupulanu samakUrcasAgimdi, 

"aunu, nAkkUDA guppana waasanEsimdi. naakuu idE DauTu waccimdi" 

amdaruu phakkuna nawwutuu "wijjee, gaDusudaaniwE. 

ippaTidaakaa bhayapaDDAwu. maLLI appuDE pedda dhairyamamtullaa phOju 

peDutunnAwu." wALLa mATalani ATTE paTTimcukOlEdu, 

wijjee - saitaanu wishayam gurimci plaanu wEsi, 

raadhEsh, mamjunaadh laku rahasyamgaa ceppimdi.

cinnAri wijjI, mahEshula samdEhAlu cewini paDDAka, 

awi kAstA wamda praSnArdhakammulugA 

mArAyi. imkEmumdi, wilEKari dwayam, weera DiTekTiw awatAraalu daalcaaru. 

ee saari lamci baaksulu, daalcina cekka, lawamgam aadigA - 

marikonni masAlA dinusulu adanam ayi, waari 

byAgulu ekkuwa baruwekkAyi. ` 

********************, `  

maLLI puurwa pradESAniki cErAru. UDalu paTTukuni, pillalu iddarU uyyaalalu uugaaru. 

mobail kemEraa kannulaku - bOleDu phoTOlu labhimcaayi. UDalu paTTukuni uugutunnappuDu, 

ettuki weLLina maheebaabu cinnagaa aristuu, rahasyaMgA pilici ceppADu 

"amkul, deyyam 

baildErimdi, adigO" amdaruu gabagabaa ceTTu ekki, 

pedda kommalalO nakki kuurcunnaaru. A SwEta wasra dhAriNi, 

ceTTu kimdiki waccimdi. 

"iwAL ewaruu raalEdE!? BayapaDDAru" 

wijayagarwamtO nawwukumTU, tana ceera kucciLLu saricEsukumTunnadi. 

akkaDiki mugguru manushulu waccaaru. 

"gamgulammaa, iwALa wALLu 

raalEdu kaduu. siTI maDusulam, maaku baagaa telusu anukumTAru. 

ewaDikainaa bhayam 

wEyakumDA umTArA, adee mana sattaa." "gamjaay, kaltee sarukulu - 

innELLugaa - manaku aDDu 

lEdu. mana bijinessu brEku paDitE uurukumTAmaa Emdi!?" 

mUDOwADu cuTTalu, sigareTTu iccADu. mugguruu weligimci, 

guppuguppuna pogalu wadultunnaaru. mahEsh ninnaTi numDE 

tana aalOcanalaku padunu peTTi, kaaryaacaraNaku upakramimcaaDu. 

saitaanamma dharimcinadi kottaceera, kaabaTTi - ULLO unna 

Ekaika Tailar raajEmdra daggariki weLLADu. 

waakabu cEsina mahEsh baabu, ripOrTars iddarikee - nijam ardham ayyimdi.

"mana anumaanam nijamE. naalugu tellaceeralaku - phaalsu warku cEsADu raajEmdra. 

ceTTu wadda seenu cuustumDagAnE maheebaabu kanukkunnADu 

"addirabannaa, A kampenee sigareTTu - 

satteyya okkaDE wADtunnADu, pEkATa pamDugADiki maatramE cEtanaunu, 

cuTTa poganu rimgulu rimgulugaa wadultumTADu. 

nErEDu ceTTu kimda weeLLu pEkATa ADatAru. weerabhadram 

cuTTapeekalatO, raccabamDa nimDipOtumdi, anni cuTTapeekalu umTAyi." 

"O, ceyin smOkars ikkaDaa unnaaraa!?" raadhEsh AScaryArdhakam.

waTawRksham paina daakkunna nalugurikee - wishayam samastam bOdhapaDimdi.

mamjunaadh palleTUru mitrulaku messEj iccADu. wemTanE 

wALLu saikiLLu tokkukumTuu 

waccEsAru. janam cuTTumuTTE sariki, saitaan wEshadhaariNi, 

aa nATaka sRshTikartalu 

bittarapOyAru. okkokka rahasyam - tokka walicina pamDu numDi, 

teestunna tonalu laagaa 

baiTiki waccaayi. tuurpu dikkuna welugurEkalu wippaarustuu, 

udayabimbam kanuwimdu cEstunnadi.

********************,

ULLO ippaTikee ee samghaTananu ceppukumTunnaaru. 

imta mamci waarta amdimcina raadhEsh, 

mamjunaadh laku patrikalO pramOshansu labhimcaayi. 

A EriyAlalO smaglimgu, samgha widrOham 

panulaku aDDukaTTa paDimdi. imdukugaanu mahee, wijjeelaku - 

jaatIya saahasa baalala puraskaaram - iccaaru.  

ee phoTOlu  `News papers,` Tiwi CaanelsulalO waccaayi. 

"maa uuriki maNidIpAlu wILLu." amdari praSamsalatO 

waataawaraNam caitanyabharitam ayyimdi.

rAdhEsh, mamjanAdh - patrikala waari prayatnaalu - 

baalalu iddarikee mamci skULLalO sITu 

waccimdi, pai caduwulu cadiwaaru. unnata widyaawamtulu ai, 

udyOgasthulu ayyaaru wijjI,  

mahee. ippuDu wALLu - amdha wiSwaasaalu amTE EmiTO 

prajalaku awagaahana kalpistunnaaru, 

wALLu sthaapimcina samgham - anEka gelupulanu saadhistunnadi. 

saksessulanu namOdu cEsukumTU mumduku saagutunnadi.

********************,

wijayOstu, digwijayOstu ;- 

kosamerupu ;- annaTTu, weera DiTekTiw awatAraalu daalcina waariki, 

tama lamci baaksula numDi - wilansu mohaalapai calludaamani teccukunna - 

kaaram, daalcina cekka, lawamgam 

ityaadi - masAlA dinusulani prayOgimcE awasaram kalagalEdu kadaa, 

graamam prajalu - pamDuga wimdu cEsukunnaaru. Newss patrikalu, prajaa samsthalu - 

wirALAlu iccaaru, amdukanE aa wimdu BOjanam pasamdugaa jarigimdi, 

aa wimdulO waDDimcina saadhakamulu, anni wishayaalu - 

akkaDa niwasistunna manushulaki - ippaTikee eppaTikI 

madhurAti madhuram aina jnaapakamE.

&

[pAtralu ;- rAdhEsh jarnalisT - camera man` mamjunAdh - 

mEnamaamalu - children = mahEsh -  uraf Mahee Babu ; wijayalakshmi uraf wijjaam ] 

STORY ;- Journalist verse Ditectives ;


మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...