23, ఏప్రిల్ 2021, శుక్రవారం
కాటుక భరిణ హంగామా
జ్యోతి, రంజన్, కార్తీక్ - వింతగా చూస్తున్నారు దొడ్డమ్మ కృష్ణవేణి కాటుక తయారుచేయడానికి పెట్టిన సరంజామా అంతటినీ. సెలవుల్లో ఆటవిడుపు కోసమని భామిని Town కి వచ్చారు, తీరిక చేసుకుని అరకు వాలీ చూద్దామని అనుకున్నారు, ఇక్కడ దొడ్డమ్మ కార్యక్రమం మరింత ఇంట్రెస్టుగా ఉన్నది కదా, అరకులోయ సందర్శనను వాయిదా వేసి, ప్రేక్షకవర్గం అయ్యారు రంజన్ group. ఇంతకీ దొడ్డమ్మ కృష్ణవేణి కాటుక ప్రోగ్రామ్ కి మూల కారణం ఉన్నది. పక్క వీధి అమ్మాయి సుధాచంద్రిక - గర్భిణి ,
"నీకు పుట్టబోయే బిడ్డ మగపిల్లాడా, ఆడపిల్ల తెలుసుకుందాం సుధా! ఇవాళ కాటుక పడ్తాను" అంటూ నడుం బిగించింది. "కాటుక పడితే - జెండర్ తెలుస్తుందా!?" ఆశ్చర్యాన్ని గుమ్మరిస్తూ అడిగారు పిల్లకాయలు.
అంజనాద్రి పేరు ఒక కొండకు ఉంది కదా, తిరుపతి ఏడుకొండలలో ఒక hill కి అంటే పద్మావతి అమ్మవారు - కాటుక తయారుచేస్తే - ఆ పేరు వచ్చి ఉంటుందా" సందేహం తీర్చు - అన్నట్లుగా నిలబడ్డాడు రంజన్."
ఇంతకీ దీని మూలాన, పుట్టబోయే బేబీ ఎట్లాగ తెలుస్తుంది?" కృష్ణవేణి పిల్లలు ఆదిత్య, ప్రవీణ ఎంటర్ - ప్రశ్నావళి పట్టికకు అదనం అయ్యింది.
"ఇదిగో, మూడు రాళ్ళు పెట్టి, పెద్ద ఇత్తడి పళ్ళాన్ని పెట్టాను చూసారు కదా" తర్వాత ఆమె ఆముదం నిండా నింపిన పెద్ద మట్టి ప్రమిదను వెలిగించి, పళ్ళెం కింద పెట్టింది.
లావాటి వత్తి - చిన్న జ్యోతి ఐ వెలిగేటట్లు సర్దింది. "గదిలో మూల, గాలి తగలకుండా ఉంచాను. ఎవరూ లోపలికి రాకండి.
రేపీ సరికి పళ్ళెం అడుగున - దీపం మసి దట్టంగా, దిట్టంగా పేరుకుని ఉంటుంది. ఆ కాటిక కుప్పలుగా అతుకుతుంది. ఒక్కోసారి సరి సంఖ్య గానీ - ఒక్కోసారి బేసి సంఖ్య రాసులు గానీ ఏర్పడతాయి. దాన్నిబట్టి తల్లి కడుపులో ఉన్న బిడ్డ సంగతిని ఊహిస్తాం అన్నమాట"
ఇవాళ కాటుక పడ్తాను" అంటూ నడుం బిగించింది. "కాటుక పడితే - జెండర్ తెలుస్తుందా!?" ఆశ్చర్యాన్ని గుమ్మరిస్తూ అడిగారు పిల్లకాయలు.
"మా ఊళ్ళో శరభేశ్వరస్వామికి తైలాల నుండి చేసిన - రకరకాల కాటుకలను సమర్పిస్తారు." కృష్ణవేణి చెల్లెలు కావేరి అన్నది.
"అంటే" అక్క ప్రశ్నకు సమాధానం కూడా చెప్పింది, "మందార తైలం నూనె చేసి, దానితో అంజనం చేస్తారు.
అదే పద్ధతిలో వివిధ నూనెలను, తద్వారా కాటుకలను చేసి, శరభేశ్వరస్వామి మొక్కులను సమర్పిస్తారు."
కావేరి భర్త "వదిన గారు బాగా చేస్తున్నారు. ఈ సారి - ఇక్కడికి వచ్చి, మీ చేతి కాటుక తీసుకుంటాం" అన్నాడు.
"తప్పకుండా, నేను అక్కడ - మీ ఊరి గుడిని కూడా చూస్తాను కదా" అన్నది కృష్ణవేణి.
ఆమె శుభ్రం చేసిన తాటాకు రేకు పట్టుకుని, పళ్ళెం బోర్లించి, దీపం మసి అంతా నెమ్మదిగా గీరింది. చెల్లెలు పక్కనే ఉండి,
అక్క సూచనలు పాటిస్తూ సాయపడుతున్నది.
ఆవు పాల వెన్న వేసి, సున్నితంగా నూరసాగారు. పై నుండి నీళ్ళు - సన్న ధారగా పోస్తూ, నూరారు. అట్లా నూరాక,
ఒక దగ్గరికి చేరిన నల్లని ముద్దలో కర్పూరం వేసి, నూరారు.
"ఇంత కష్టపడితే - మూడు గోళి కాయలంత కాజల్ వచ్చింది" సిసింద్రీలు అననే అన్నారు.
భోషాణం పెట్టె అడుగు నుండి దుర్భిణీ వేసి మరీ బైటికి తీసింది, మూడు రాగిభరిణలను. చిన్ని కొక్కెం కలిగి, తెరిచి,
ముడవడానికి వీలుగా గుండ్రని కాయ ఆకారం కలిగి ముచ్చట గొలిపే ఆ రాగి భరిణలు - మొబైళ్ళు - Camera ఖజానాలను నింపినాయి.
"చిన్నప్పుడు అమ్మ ఇచ్చింది, రాగి కాయలు, కాటుకను వాటిలో నింపి, ఒకటి చెల్లికి ఇచ్చింది, కావేరికి కొత్త గుడ్డను ఇచ్చింది.
చేతిగుడ్డ లాంటి ఆ తెల్లని వస్త్రం కొసన కాటుకభరిణ ఉంచి, ముడి వేసింది.తతిమ్మావి - రెండింటిలో ఒకటి తను ఉంచుకున్నది,
మూడో దాన్ని సీతాదేవికి ఇచ్చింది.
ఎదురింటి సీతాదేవికి పదో తరగతి చదువుతున్న కోడుకు ఉన్నాడు, పిల్లాడికి మంచి మార్కులు వస్తున్నాయి,
కాబట్టి తన కూతురును ఇస్తే, ఊళ్ళో సంబంధం - తనకు వెసులుబాటు, ఏమో - భవిష్యత్తులో ఈమె తనకు వియ్యపురాలు ఔతుందేమో, ఎవరు చెప్పగలరు!"
కనుక ఆమెతో ఆదాన ప్రాదానాలు, చేబదుళ్ళు ఇచ్చి పుచ్చుకోవడాలు - ఒక స్థాయిలో జరుగుతుంటాయి.
ఏడవ తరగతి ఎగ్జామ్స్, కృష్ణవేణి కూతురు గడగడా గట్టిగా చదువుతున్నది, నిగమ శర్మ కథ - అనే పాఠం.
కృష్ణవేణి పాట్నాకు - చుట్టాలింటి శుభకార్యానికి వెళ్తున్నది. ఆమె భర్త "పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటానులే" అని ధైర్యం చెప్పి, రైలు ఎక్కించాడు.
తెనాలి వద్ద, శంకరం మాస్టారు బోగీ ఎక్కారు. "అరె, నువ్వు కూడా పాట్నా వస్తున్నావా, పెళ్ళి వారి ద్వారా మనం ఇప్పుడు దగ్గరి చుట్టాలం అయ్యామన్న మాట"
పకపకా నవ్వుతూ అన్నాడు భోళా శంకరుడు. "పాట్నా అసలు పేరు తెలుసా, పాటలీపుత్రం ... "
'తను చిన్నప్పుడు, పలక బలపం దాచిపెట్టి, స్కూలు ఎగ్గొట్టేది తను. పాపం, పిల్లలను జ్ఞానమూర్తులుగా మార్చాలని, ఎంతో కష్టపడేవారు పంతులుగారు"
ఆ రోజులు గుర్తు వస్తుంటే ప్రయాణం సునాయాసంగా సాగింది.
పాట్నా ఇజీక్వల్టు పాటలీపుత్రం చేరారు, ఈజీగానే, పెళ్ళి వారి ఇల్లు చేరారు. చాలామంది అప్పటికే వచ్చేసారు.
కొత్త మనుషులు, కొత్త భాషల - సంక్రాంతి ముగ్గుల నడుమ పెట్టిన గొబ్బెమ్మల మంచి వాసన వలె ఉన్నది.
"కిష్టక్కా, ఇప్పటికి కలిశాం" సంతోషంతో పలకరింపు, సుగుణ గుర్తు పట్టి, గుర్తు చేస్తూ,
మరింతమందిని స్నేహాలకు, బంధుత్వాలకు స్టార్ మార్కు గుర్తులుగా అప్పజెప్పుకుంటూ - గంటలు క్షణాల్లాగా గడిచిపోయాయి.
"సువర్ణా, బాగున్నావా!?" భోళా మాస్టారు శంకరం మాటలకు అటు తిరిగారు, పరిచయాల సందడి - సువర్ణ ఊరు, వివరాలు ... ;
"జాగ్రత్త, ఈ పిల్లది - కాస్త చేతివాటం" ; "అంటే" "కొంచెం దొంగతనం బుద్ధి, కాస్ట్లీ వస్తువుల జోలికి పోదు గానీ, చిన్న చిన్న వస్తువులను కాజేస్తుంది."
ట్రైనులో శంకరం మాస్టారు "హోటల్ కి వెళ్ళినప్పుడు - చెంచాలు కాజేసే దోస్త్" గురించి మాటలలో చెప్పారు .....,
తమాషా ఏమిటంటే అతను ధనవంతుని సుపుత్రుడే - చేతి తుత్తర, అటువంటి చెయ్యి దురదలకు హేతువు కోసం, మానసిక తత్వ వేత్తల దగ్గరికి వెళ్ళాల్సిందే.
సాయంత్రం అందరూ కళ్యాణమండపం చేరారు. సువర్ణ తన దగ్గర మసలుతున్నప్పుడు,
సూట్ కేసు తాళం - ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకుంటున్నది. సబ్బు, పౌడరు ఇత్యాదులని జాగ్రత్తగా లోన పెట్టి, లాక్ చేస్తున్నది.
పెళ్ళి - తర్వాత అంపకాలు, హంగామా జరుగుతున్నది.కొంచెంసేపటికి - తన చేతిలో ఏదో ఖాళీ ఐనట్లు అనిపించింది, గుండె గుభిల్లుమంది.
"కాటుక్కాయ, మిస్సింగ్" కొందరికి - కృష్ణవేణి తన కాటుకభరిణల గొప్పదనాన్ని చెప్పింది, కాటుక తయారీ, స్వీయ అనుభవాలను పూసగుచ్చినట్టు చెప్పి,
శభాష్ - అనిపించుకున్నది కూడానూ.
నిగమశర్మ అక్క కథ జ్ఞాపకం వచ్చింది. ముక్కెర, బులాకీ, ముక్కుపుడక - చిన్న వస్తువులే కావచ్చు,
అవి - సుమంగళి ధరించే సంప్రదాయానికి, భర్త పట్ల భక్తిభావనను ప్రోది చేసే అలంకారం, తద్వారా - కుల ప్రతిష్టకు ఆనవాలు ఐనది ...,
అందుకనే వేమన ప్రేయసి - అభిరామి, శిలప్పదిగారం - కన్నగి - ప్రతినాయిక మాధవి లాంటి రంగసాని -
"మీ ఇంటి స్త్రీల ముక్కెరలు కావాలి - అని - heros ని villian heroins శోధించారు.
కృష్ణవేణి వెక్కిళ్ళు పెడుతూ వెతికింది. సాయంగా సుగుణ అన్వేషిస్తున్నది. కొసకి మొహమాటం వదిలి, అందరి బ్యాగులు వెదకసాగారు.
సువర్ణ వంతు రానే వచ్చింది,
సోదా చేసాక అందరూ అనుమనించినట్లుగానే సువర్ణ ట్రంకుపెట్టెలోనే దొరికింది, "ఈ కాటుక్కాయ - మా అమ్మ తరం నుండి వస్తున్నది.
అందుకనే ఇంత ఖచ్చితంగా ఉన్నాను, మా ఊరికి రా! నీకు మంచి కాటుక ఇస్తాను." అన్నది.
"కాటుక ఎట్లాగ చెయ్యాలో నేర్చుకోడానికి తప్పకుండా వస్తాను" అన్నది సువర్ణ, కన్నీళ్ళు తుడుచుకుంటూ.
కాటుక ఎట్లాగ చెయ్యాలో నేర్చుకోడానికి - వస్తాను - అన్న పలుకులలో సువర్ణ ఆమె ఆత్మాభిమానం మెరిసింది.
"కాటుక కంటి నీరు చనుకట్టు పయి బడ, ఏల ... " భక్త పోతన - సినిమా - mobile లో సన్నగా వినిపిస్తున్నది.
&
[ పాత్రలు ;- జ్యోతి, రంజన్, కార్తీక్, దొడ్డమ్మ కృష్ణవేణి - సుధాచంద్రిక, సుగుణ & భోళా మాస్టారు శంకరం -
కృష్ణవేణి చెల్లెలు కావేరి - కావేరి భర్త ; 7 class కృష్ణవేణి కూతురు [lesson itom - నిగమ శర్మ అక్క ; తెనాలి - శంకరం మాస్టారు ; సువర్ణ ]
*********************************************************, ;
;
కాటుక భరిణ హంగామా ;
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మహర్షులు - ప్రకృతి సేవలు - sEwalu - 1
మహర్షులు సంచారజీవులు. ఋషి జీవనవిధానం - కొన్ని నియమ నిబంధనలను అనుసరించి కొనసాగుతుంది. మితాహారం, దేహ కఠిన శ్రమ - తపో నిష్ఠ, నిష్కామ పద్ధతి, భగ...

-
"నానీ, ఈ కార్టూన్ చూడండి" వీక్లీ ని చేతిలో పెట్టింది కుందనబాల ; నానీ - పత్రిక లో - కుందన చూపిస్తున్న cartoonనిచూసి, చదువుతూ - ...
-
మంగపతి మధ్య తరగతి గృహస్థు. భార్య, ముగ్గురు సంతానం - ఒబ్బిడిగా ఉంటే, బాగనే జరుగుబాటు ఉండే ఇల్లు అయ్యేది, కానీ ఈ సగటు మనిషి భుజాలు మోయ లేనంత బ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి