16, అక్టోబర్ 2026, శుక్రవారం

వెన్నెలల అడుగుజాడలు - English script

భవ్య ఉలిక్కిపడింది. 

పొద్దుటినుండీ ఆమె మనసు అదీ ఇదీ అని చెప్పలేని దిగులు, 

విప్పి చెప్పలేని గుబులు, ఒక రూపు కట్టని చిత్రంలా, 

ఆమె ఆలోచనలు కేవలం వర్ణ సమ్మేళన చాలనంలా మిగిలిపోతూ, 

ఆ ఆలోచనల ఉరవడిల సుడిగుండంలో చిక్కుకుపోయి, 

ఒంటరిగా సతమతమవుతూంది ......!  

కిటికీ దగ్గర కూర్చున్న భవ్యకు పక్కింటి అమ్మాయి - జనని - 

      ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. 

జనని, ఆమె భర్త  ప్రసన్నకుమార్‌లకు తమ ఇంట్లో ముందు గది అద్దెకిచ్చి ఏడాది అవవస్తున్నది.  జనని ప్రవర్తన నడవడికలు ' క్రమశిక్షణ అనే తరాజుకు రెండు తూకపు సిబ్బెలుగా ఉంటాయి.

వాస్తవానికి ఆమె వచ్చాక, తమ ఇంట్లోకి జీవచైతన్య కిరణం ఒకటి దారితప్పి వచ్చిందేమో అనిపిస్తుంది.

తమ వాకిట్లో, పెరట్లో గడ్డిగాదంతో అడ్డదిడ్డంగా - అడ్డగోలుగా, అడ్డుగోడలుగా పెరిగిన చెత్తనంతా శుభ్రం చేసి, 

చిన్న సైజు బృందావనంలా తన కళాభిరుచికి అద్దం పట్టినట్లు తీర్చిదిద్దింది  జనని.

అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఉదయరాగంలో ఒక తెగిన తంత్రి ధ్వని దూకింది.

నిన్ననే,  జనని తల్లితండ్రులు వచ్చారు.

ఎవరి ఇంటికైనా తల్లిదండ్రులు రావడంలో వింత ఏమున్నది!!?

జనని దంపతులు - అంటే ఆమె భర్త ప్రసన్నకుమార్‌ల తరఫున ఎప్పుడూ బంధువులు ఎవరూ వచ్చినట్లు కనబడలేదు ...... ,

ప్రప్రధమంగా నిన్ననే వచ్చిన వారి జన్మదాతలు రావడమే తుఫానులా విరుచుకు పడ్డారు.

అప్పుడు తెలిసింది వీధిలోని వారికి, అందరికీ ...... ,

జనని - లేచిపోయి వచ్చిన అమాం బాపతు సరుకు - అని.

వాడకట్టు, చీరకట్టులను సవరించుకుని, నడుం కట్టుకువచ్చి, చోద్యమంతా చూసి, మరీ మరీ నోళ్ళు నొక్కుకున్నారు.

ఎట్లాగో ఆచూకీ కనుక్కుని వచ్చి, ఆ భార్యా భర్తల రక్తసంబంధీకులు -

వాకిట్లో భీభత్సంగా అరిచారు. కానీ, స్థిరచిత్తంతో, కృతనిశ్చయంతో -  

జననీ ప్రసన్నకుమార్ జంట - ఏమాత్రం తొణకకుండా ఒక్కటే చెప్పేసారు -

"మేమిద్దరమూ భార్యాభర్తలుగానే జీవిస్తాము, మమ్మల్ని ఎవరూ విడదీయలేరు."అని. ఓడిపోయిన వారి చుట్టపక్కాలు - వాడిపోయిన మోములతో - 

ధుమధుమలాడ్తూ వెనక్కి మళ్ళక తప్పలేదు. 

నిన్న సాయంత్రం నుండీ భవ్య యోచనాసాగరంలో మునిగిపోయింది.

************************************ ,

భవ్య బూజు పట్టి, దుమ్ము పట్టిన తన ముఫ్ఫై ఒక్క ఏళ్ళ 'బ్రతుకు పుస్తకాన్ని ' తిరగేసుకోసాగింది.

భవ్య ముగ్గురు చెల్లెళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళతో కూడిన సంసారంలో పుట్టింది ..... కాదు కాదు, మధ్య తరగతి కుటుంబంలో మొదటి కూతురుగా పుట్టించబడింది. ఇవి చాలవన్నట్లు, మంచంలో తాతయ్య, నీరసంతో మంచానికి ఆనుకుని జేరగిలబడి, విటమిన్లూ, పోషక పదార్ధాలూ లేని శుష్కదేహానికి ఆనవాలుగా రోగిష్ఠి తల్లి, ఆమె ఒళ్ళో పాలకై ఏడ్చీ ఏడ్చీ పాలే లేని ఖాళీ "చను పీక"ను పీలుస్తూ ఆకలితో అట్లాగే సొమ్మసిల్లి, నిద్రలోకి జారుకునే ఒక చంటిబిడ్డ - సగటు జీవితపు భిత్తికపై మరకలే - నైరూప్య చిత్రంగా మిగిలిపోయిన - బాల్యావస్థ నుండీ భవ్య నడయాడిన ఇల్లు అది ...... ,

మితిమీరిన అప్పులు తీర్చే మార్గం లేక - తండ్రి ఆఫీసులో డబ్బు తీసుకున్నాడు. దొంగతనం తప్పు, నేరమే కాబట్టి - సస్పెండ్ ఐ, శిక్షకు గురి అయ్యాడు. 

ఫలితంగా కుటుంబ భారం  భవ్య భుజాలపై పడింది. 

కళ్యాణ మండపంలో కూర్చోవలసిన లేత వయసులో ఆమె ఆఫీసులో కూర్చుంది. 

పర్మనెంటు అవని ప్రైవేటు ఉద్యోగాలు - ఏడాదికి రెండు మూడు మారేది. నాలుగేళ్ళ తర్వాత ఎట్లాగో ఒక ఉద్యోగంలో కుదురుగా సెటిల్ అయ్యింది.

ఆమె తాతయ్య పోయాడు. 

ఆ స్థానంలో మేనత్త మీనాక్షమ్మ - తన ముగ్గురు పిల్లలతో దిగి, ఆ కాస్తా భర్తీ చేసేసింది. 

మీనాక్షమ్మ భర్త స్థితి, అలవాట్లు కూడా ఇంచుమించు - 

భవ్య తండ్రికి డిటో డిటోనే - కానైతే ఒక అదనపు సుగుణాలంకారం తగిలించుకున్న మనిషి, అతను పక్కా పేకాటరాయుడు - దొరికినంత మేరా అప్పులు చేసాడు. ఆనక ఇకపై - పై డబ్బు, పైసలు, మనీ - కనీసం ఆ పర్యాయపదాలు కూడా మబ్బుల్లో నీళ్ళు అనీ, ఇంక అప్పులు దొరకవు అనే సంగతిని తేల్చుకుని, కనుచూపుమేరలో అగుపించకుండా - సింపుల్‌గా పారిపోయాడు. 

కనుకనే - తప్పని పరిస్థితులలో మేనత్త మీనాక్షమ్మ అన్నగారి పంచన చేరింది. 

వదిన, అన్నల పంచన చేరిన ఆమెకు తెలియకనా - ఈ ఇల్లు ఆకులు రాలిన శిశిర వృక్షమనీ, ఆ చిటారు కొమ్మని ఒక ఆకుపచ్చని ఆకు - ఈ చేవ లేని చెట్టుకు చిగురులు వేయించాలని చూస్తూ, నిస్సహాయతలో కూరుకుపోయిందనీ - తెలుసును. తెలిసినా తప్పనిసరి ........ ,

మురిగిపోయే ఆచారాలకు అవగాహన కాదు - తరచిచూస్తూ, పుండును కెలికే లోకం - ఆ ఆర్తిని అర్ధం చేసుకోదు, అసలు పట్టించుకునే అవసరం ఈ జగతికి లేనేలేదు కదా!!!,   

       భవ్యకు వయసు వచ్చిందనీ, వివాహం చేయాలనీ తెలిసినా - తల్లిదండ్రులు ఉదాసీనంగా ఊరుకున్నారు. ఆర్ధిక అవసరాలు 'తమ కుమార్తెది కూడా ఒక జీవితమేననీ, అది కళకళలాడాలనీ ' వారిని గుర్తించకుండా చేసాయి. 

      మీదుమిక్కిలి, పెద్ద చెల్లెలు "నీ వలననే నేనిట్లాగ మోడులా ఉండిపోవలసి వచ్చింది." అంటూ తన రెండో చెల్లెలు రుసరుసలాడుతుండేది,

 "పెళ్ళీ పెటాకులూ లేకుండా మాకు అడ్డుగా ఉన్నావు." అంటూ నిందలు గుప్పించారు. సినిమాలకు, జేబు ఖర్చులకు - వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వలేకపోయేది. ఇంట్లో చిల్లర దొంగతనాలు మొదలైనాయి. 

చిన్న చెల్లెళ్ళనీ, తమ్ముళ్ళనీ - మేనత్త కుటుంబీకులనీ చిన్న మాట ఐనా అనలేని దౌర్భాగ్యస్థితిలో మానసికంగా కుంగిపోయేది.

      భవ్య ఇద్దరు  చెల్లెళ్ళ పెళ్ళిళ్ళను సైతం తన చేతుల మీదుగానే చేయక తప్పలేదు. వాళ్ళిద్దరూ ప్రేమవ్యవహారాలు నడిపి, 

తమ నెత్తిమీదకు సమస్యలను తీసుకువచ్చిన ఘటికులు.

తన కుటుంబ పరువు ప్రతిష్ఠలు నిలవాలి కదా! అందుకే తనవారి శృతి మించిన వ్యవహారాలను - సమాజం అనే పాత్రలో ఇమిడేటట్లుగా చేసేటందుకు - యావజ్జీవితాన్నీ ఫణంగా పెట్టాల్సివచ్చింది.

తండ్రి విడిచిపెట్టిన గృహసామ్రాజ్యం ఇది,  

భవ్య భుజస్కంధాలపై పడిన ఈ భారాన్ని మోస్తూన్న 

జీవన మార్గ గమనం - పన్నెండేళ్ళు - ఔతున్నది.

ఇప్పటికి కొస సోదరీ సోదరుల చదువులు హైస్కూలు, కాలేజీ మెట్లు ఎక్కుతున్నవి.  

      ఈ మధ్యలో ఒక సంఘటన - మేనత్త పెద్ద కుమార్తె 

"కొత్త సినిమాకు వెళ్తాను." అన్నది, అడిగీ అడగంగానే డబ్బులు ఇవ్వలేదని, సినిమాకు పంపించలేదనిన్నీ - 

ఏదో మందు మింగేసి, ప్రాణాల మీదికి తెచ్చుకుంది, 

ఆ పిల్లని హాస్పిటల్లో చేర్చి, నయం చేయించడానికి, భవ్య తలప్రాణం తోకకి వచ్చింది.

      ఇట్లాంటి అడ్డగోలు ఖర్చులు, ఇంటి సభ్యుల పెళ్ళిళు, ఆనక పదహారు రోజుల పండుగలు, పిమ్మట శ్రీమంతాలు - పురుళ్ళు, బారసాలలు - వెరసి తడిసి మోపెడు ఔతున్న వ్యయాల లిస్టులు - [`list ] `తరుముకు వస్తూనే ఉన్నాయి. 

ఎలాగోలా శుభకార్యాదు //క్రా//యా//దులన్నిటినీ పూర్తిచేస్తూనే వచ్చింది, ఐనా మూతి ముడుపులూ, ముక్కు విరుపులూ తప్పలేదు.

      కాలేజీలో  [`college`] చేరిన తర్వాత - చెల్లెళ్ళు అండ్ తమ్ముళ్ళు అండ్ కో -

"క్లాసులో ఫ్రెండ్స్ మాదిరిగా ఉండాలి" - అనుకునే పిల్లకాయితనం - 

ఆకతాయి కోర్కెలు - 'తోటివారికి మల్లే, ఖరీదైన బట్టలు లేవు" అంటూ నసగసాగారు. వారి గొంతెమ్మ కోరికలు తీర్చడానికి సతమతమౌతుండగనే, ముప్ఫై వసంతాలు//లి// జరిగిపోయాయి. 

"భవ్య ముది మొహం పడిపోయింది.' అంటూ కామెంట్ చేయడాన్ని భరించలేక, 

లోలోన కృంగుబాటు. 

భవ్య చిన్ననాటి క్లాస్‌మేట్స్, స్నేహితురాళ్ళు, స్నేహితులు చక్కని కాపురాల కుదుళ్ళలో భద్రంగా కనిపిస్తూ, కళళలాడుతున్నారు.  

ఆఫీసుకు [`office`] ` వెళుతుంటే వారూ వీరూ తటస్థపడుతుండేవారు,

 దారిలో, షాపింగులో, పెళ్ళిపేరంటంలో - ఆమె తల్లిదండ్రుల స్నేహబృందం, 

ముక్కూ మొహం తెలిసినవాళ్ళూ. తెలీనివాళ్ళూ - &

భవ్య నేస్తాలు, పలకరించేవారు. 

వారు మనస్ఫూర్తిగా పలకరించినా కూడా 

భవ్య ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్సుతో ముడుచుకు పోతూ, దూరదూరంగా జరిగిపోతుండేది.

      సామాజిక కట్టుబాట్ల వరద వలయంలో ఒంటరిగా మిగిలిపోయింది భవ్య. 

తమ ఇంట్లో జరిగిన జననీ, ప్రసన్న కుమార్ జంట సంఘటనలు, 

భవ్య మనోద్వారపు వాడిపోయిన తోరణాలను, తిరిగి రెపరెపలాడేలా చేస్తున్నాయి.  

లేచిపోవడం తప్పుగా భావించింది తాను ఇన్నాళ్ళూ! 

ఇంటి పెద్దలు నలుగురూ కూర్చుని, కుదిర్చి, 

సాంప్రదాయబద్ధంగా చేసిన వివాహాలు సైతం భగ్నం ఔతున్నాయి కదా! 

ఫెయిల్ అవడానికి ఆస్కారం ఉన్నప్పుడు 'లేచిపోవడం ' -

         అనేది ఎంత తప్పో - 'పెళ్ళి ' కూడా అంతే తప్పు ఔతుంది కదా!!  

కాకపోతే కళ్యాణం విషయంలో -  దంపతుల కాపురం గతుకుల బాటలో పడినప్పుడు - 

వారి మధ్య విభేదాలు - సమస్యలను పరిష్కరించేటందుకు - సంఘం చేసే ప్రయత్నాలు - కొంత బాసటగా నిలుస్తాయేమో - ఏమో ...... అదీ సందేహమే ..., 

మాటలవరకేగానీ, చేతల వరకూ వచ్చేసరికి, బంధుమిత్రులు 

చేదోడుగా నిలుస్తారనే సంగతి అనుమానాస్పదమే!! 

సక్సెస్ [success] అయిన "జననీ ప్రణయ - పరిణయం" 

విజయపతాకాన్ని  రూపొందిస్తూన్న "కాలపరిణామానికి ప్రతీక" గా నిలుస్తూ, హసిస్తున్నది.

భవ్యలో ఆలోచనా కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నవి.

పెళ్ళి వైపు దృష్టిని సారించనీయక, ఇన్నాళ్ళుగా భవ్య నయనద్వయికి అడ్డుగా నిలిచి ఉన్న - సాంప్రదాయ అభేద్యకుడ్యాలు బీటలు వారుతున్నాయి. ఆ పగుళ్ళ సందుల గుండా చల్లనైన కొంగ్రొత్త వెలుతురులు ప్రసరిస్తూ వచ్చి, భవ్య పెదవులపై వెలుస్తూ ఉన్న దరహాసాల వేదికపై నర్తించసాగాయి ......  

 ======================================= ,

ceekaTi daariloa wennelala aDugujADalu -                                                     

ceekaTi daariloa wennelala aDugujADalu -   &  pi. kusumakumaari ;, `Hyderabad` ;-  

     Bawya ulikkipaDimdi. podduTinumDI Ame manasu adee idee ani ceppaleani digulu, wippi ceppaleani gubulu, oka ruupu kaTTani citramlA, aame aaloacanalu keawalam warnha sammealhana caalanamalaa migilipoatuu, A Aloacanala urawaDila suDigumDamlO cikkukupoayi, omTarigA satamatamawutUmdi ......! 

kiTikee daggara kuurcunna Bawyaku pakkimTi ammaayi - janani - ippuDu spashTamgA kanipistunnadi. janani, aame bharta prasannakumaar^laku tama imTlO mumdu gadi addekicci EDAdi awawastunnadi.  janani prawartana naDawaDikalu ' kramaSikhaNa 'ane taraajuku remDu tUkapu sibbelugA umTAyi.

waastawaaniki aame waccaaka, tama imTlOki jeewacaitanya kiranham oakaTi daaritappi waccimdeamoa anipistumdi.

tama wAkiTlO, peraTlO gaDDigaadamtO aDDadiDDamgaa - 

aDDagOlugaa, aDDugoaDalugA perigina cettanamtaa SuBram cEsi, cinna saiju bRmdaawanamlA tana kaLABiruciki addam paTTinaTlu teercididdimdi  janani.

appaTidAkA praSAmtamgA unna udayaraagamloa oka tegina tamtri dhwani duukimdi.

ninnanea,  janani tallitamDrulu waccaaru.

ewari imTikainAtallidamDrulu raawaDamlO wimta eamunnadi!!?

 janani dampatulu - amTE Ame bharta prasannakumaar^la taraphuna eppuDU bamdhuwulu ewaruu waccinaTlu kanabaDaleadu ...... ,

prapradhamamgaa ninnanea waccina waari janmadaatalu

 raawaDamE tuphaanulaa wirucuku paDDAru.

appuDu telisimdi weedhi amdarikee ...... ,

janani - leacipoayi waccina amaam baapatu saruku - ani.

wADakaTTu, ceerakaTTulanu sawarimcukuni, naDum kaTTukuwacci, 

coadyamamtaa cuusi, maree maree noalhlhu nokkukunnaaru.

eTlAgO aacuukee kanukkuni wacci, aa BAryaaBartala raktasambamdheekulu waakiTlO BIBatsamgA aricaaru. kaanee, sthira kRtaniScayamtO -  jananii prasannakumaar jamTa - eamaatram tonhakakumDA okkaTE ceppEsaaru -

"mEmiddaramU BAryaaBartalugAnE jeewistaamu, mammalni 

ewaruu wiDadIyalEru."ani. ODipOyina waari cuTTapakkAlu 

wADipOyina moamulaoa - dhumadhumalaaDtU weanakki malhlhaka tappaleadu. 

ninna saayamtram numDI bhawya yoacanaasaagaramloa munigipoayimdi.  

aame buuju paTTi, dummu paTTina tana muphphai okka ELLa 

'bratuku pustakaanni ' tirageasukoasaagimdi.

Bawya mugguru cellelhlhu, mugguru tammulhlhatoa kUDina samsaaramloa puTTimdi ..... 

kaadu kaadu, madhya taragati kuTumbamlO 

modaTi kUturugA puTTimcabaDimdi. iwi caalawannaTlu, 

mamcamloa taatayya, neerasamtoa mamcaaniki aanukuni jearagilabaDi, 

wiTaminlU [`vitamins`], poashaka padaardhaaluu leani 

Sushkadeahaaniki aanawaalugaa roagishThi talli, 

aame olhlhoa paalakai eaDcee eaDcee -

paalea leani KALI "canu peeka"nu peelustuu aakalitoa aTlaagea sommasilli, nidraloaki jaarukunea oka camTibiDDa - sagaTu jeewitapu bhittikapai marakalea - 

nairuupya citramgaa migilipoayina - baalyaawastha numDI Bawya naDayaaDina illu adi ...... ,

       mitimeerina appulu teercea maargam leaka - 

tamDri aapheesuloa Dabbu teesukunnADu. domgatanam tappu, nearamea kAbaTTi - 

saspemD [`suspend`] ai, Sikshaku guri ayyADu. phalitamgaa kuTumba BAram 

Bawya bhujaalapai paDimdi. kalhyaanha mamDapamlO 

kuurcoawalasina leata wayasuloa aame aapheesuloa kuurcumdi. 

parmanemTu awani praiweaTu udyoagaalu - EDAdiki remDu mUDu mArEdi. 

naalugELLa tarwaata eTlaagO oka udyoagamloa kudurugaa seTil ayyimdi.

      aame taatayya poayADu. aa sthaanamloa meanatta - 

tana mugguru pillalatoa digi, aa kaastaa bhartee ceaseasimdi. 

meanatta bharta sthiti kUDA imcumimcu - DiTO DiTOnea - 

kaanaitea oka adanapu sugunhaalamkaaram tagilimcukunna manishi, atanu pakkaa peakATarAyuDu - dorikinamta mearaa appulu ceasADu. aanaka ikapai - 

pai Dabbu, paisalu, manee - kaneesam aa paryaayapadaalu kUDA 

mabbulloa nILLu anee, 

imka appulu dorakawu anea samgatini tealcukuni, 

kanucuupumearaloa agupimcakumDA - 

simpul^gA paaripoayADu. kanukanea - 

tappani paristhitulaloa meanatta meenaakshamma annagaari pamcana cearimdi. 

wadina, annala pamcana cearina aameku teliyakanaa - 

ee illu aakulu raalina SiSira wRkshamanI, aa ciTAru kommani oka aakupaccani aaku - 

ee cEwa leani ceTTuku cigurulu weayimcaalani cuustuu, 

nissahaayataloa kuurukupoayimdanee - telusunu. telisinA tappanisari ........ ,

murigipoayea aacaaraalaku awagaahana kaadu - taracicuustuu, 

pumDunu kelikea lOkam - aa aartini ardham ceasukoadu, 

asalu paTTimcukunea awasaram ee jagatiki leanealeadu kadA!!!,

    Bawyaku wayasu waccimdanee, wiwaaham ceayaalanee telisinaa - 

tallidamDrulu udaaseenamgaa uurukunnaaru. aardhika awasaraalu 'tama kumaartedi kUDA oka jeewitamEnanI, adi kalhakalhalADAlanI ' waarini gurtimcakumDA cEsAyi.

      meedumikkili, pedda cellelu "nI walananea neaniTlAga

 moaDulaa umDipOwalasi waccimdi." amTU tana remDO cellelu rusarusalaaDutumDEdi, 

"pelhlhee peTAkulU leakumDA maaku aDDugaa unnaawu." 

amTU nimdalu guppimcaaru. sinimAlaku, jeabu kharculaku - waalhlhu aDiginamta Dabbu iwwalEkapOyEdi. imTlO cillara domgatanaalu modalainaayi. 

cinna cellelhlhanee, tammulhlhanee - meanatta kuTumbeekulanee 

cinna maaTa ainaa analeani daurbhaagyasthitiloa maanasikamgaa kumgipoayeadi.

      Bawya iddaru  cellelhlha pelhlhilhlhanu saitam 

tana ceatula meedugaanea ceayaka tappaleadu. waaLLiddarU preamawyawahaaraalu naDipi, 

tama nettimeedaku samasyalanu teesukuwaccina GaTikulu.

tana kuTumba paruwu pratishThalu nilawaali kadaa! amdukea tanawaari SRti mimcina wyawahaaraalanu - samaajam anea paatraloa imiDETaTlugaa ceaseaTamduku - yAwajjeewitaannee phanhamgaa peTTAlsiwaccimdi.

tamDri wiDicipeTTina gRhasaamraajyam idi,  Bawya Bujaskamdhaalapai paDina ee BAraanni moastuunna jeewana maarga gamanam - pannemDElhlhu - autunnadi.

ippaTiki kosa soadaree soadarula caduwulu haiskuulu [`high school`], kaaleajee meTlu ekkutunnawi.  

      ee madhyaloa oka samghaTana - meanatta pedda kumaarte "kotta sinimaaku welhtaanu." annadi, aDigI aDagamgAnE Dabbulu iwwaleadani, sinimaaku pampimcaleadaninnee - eadoa mamdu mimgeasi, praaNAla mIdiki teccukumdi, aa pillani haaspiTallO cErci, nayam ceayimcaDAniki, Bawya talapraanham toakaki waccimdi.

      iTlAMTi aDDagOlu Karculu, imTi sabhyula pelhlhilhu, 

aanaka padahaaru roajula pamDugalu, pimmaTa Sreemamtaalu - purulhlhu, baarasaalalu - 

werasi taDisi mOpeDu autunna wyayaala lisTulu - tarumuku wastuunea unnaayi. elaagoalaa SubhakaaryaadulanniTinI puurticeastuunea waccimdi, 

[`list ] `ainaa muuti muDupuluu, mukku wirupuluu tappaleadu.

      kaaleajeeloa [`college`] cearina tarwaata - cellelhlhu amD tammulhlhu amD kO - "klaasuloa phremDs maadirigaa umDAli" - anukunea pillakaayitanam - 

          aakataayi koarkelu - 'toaTiwAriki mallE, khareedaina baTTalu leawu" 

amTU nasagasAgaaru. waari gomtemma koarikalu teercaDAniki satamatamautumDaganE, mupphai wasamtaalu jarigipoayaayi. 

"bhawya mudi moham paDipOyimdi.' amTU kAmemT cEyaDAnni Barimcaleaka, loaloana kRmgubATu. 

Bawya cinnanATi klaas^mETs, snEhiturALLu, snEhitulu cakkani kaapuraala kuduLLalO bhadramgaa kanipistuu, kaLaLalADutunnAru.

aapheesuku [`office`] ` welhutumTea wAruu weeruu taTasthapaDutumDEwAru,

 daariloa, shaapimguloa, pelhlhipearamTamlO -

aame tallidamDrula sneahabRmdam, mukkuu moham telisinawALLU. teleeniwALLU - 

Bawya neastaalu, palakarimceawaaru. 

waaru manasphuurtigaa palakarimcinaa kUDA 

Bawya in^phIriyAriTI kaampleksutO [`inferiority complex ] -`

muDucuku pOtuu, duuraduuramgaa jarigipoatumDEdi. 

      saamaajika kaTTubATla warada walayamloa omTarigaa migilipoayimdi Bawya. tama imTlO jarigina jananee, prasanna kumaar jamTa samghaTanalu, Bawya manoadwaarapu waaDipOyina toaranhaalanu, tirigi reparepalADElA cEstunnAyi.  

      leacipoawaDam tappugaa bhaawimcimdi taanu innaalhlhuu! imTi peddalu naluguruu kuurcuni, kudirci, saampradaayabaddhamgaa ceasina wiwaahaalu saitam bhagnam autunnaayi kadA! 

pheyil awaDAniki aaskaaram unnappuDu 'leacipoawaDam ' aneadi emta tappoa - 'pelhlhi ' kUDA amtE tappu autumdi kadA!!  

[ kaakapoatea kalhyaanham wishayamloa - dmapatula kaapuram gatukula bATaloa paDinappuDu - waari madhya wibheadaalu - samasyalanu parishkarimceaTamduku - samgham ceasea prayatnaalu - komta baasaTagA nilustaayeamoa - eamoa ...... adee samdeahamea ...,

maaTalawarakeagaanee, ceatala warakuu wacceasariki, 

bamdhumitrulu ceadoaDugaa nilustaaranea samgati anumaanaaspadamea!! ] 

      sakes [`success`] ayina "janaee pranhaya - parinhayam"  

wijayapataaknu ruupomdistuunna kaala parinhaamaaniki prateekagaa nilustuu, hasistunnadi.

Bawyaloa aaloacanaa keraTAlu uwwettuna leastunnawi.

      pelhlhi waipu dRshTini saarimcaneeyaka, innaalhlhugaa Bawya nayanadwayiki aDDugA nilici unna - saampradaaya aBEdyakuDyaalu bITalu wArutunnaayi. aa pagulhlha samdula gumDA callanaina komgrotta weluturulu prasaristuu wacci, Bawya pedawulapai welustuu unna darahaasaala weadikapai nartimcasaagaayi ......  - 🏃🏃; 

🏃🏃; చీకటి దారిలో వెన్నెలల అడుగుజాడలు - English script 🏃🏃; 

LINK ;- చీకటి దారిలో వెన్నెలల అడుగుజాడలు - 1 [64 ] -

13, అక్టోబర్ 2026, మంగళవారం ; 

************************** , 

 PREV ;- పూలు ఫూల్సు - 63 - A =  దిలీప్ బృందంతో  నల్లమల సీమను చేరాడు. సినిమా దర్శకత్వం చాన్స్ లభించింది - అందుకే ఈ హుషారు -Hills  దగ్గరలోనే చక్కని బంగ్లా - గెస్ట్ హౌస్ సౌకర్యాలు - అన్నీ ఉన్నది - ముందే బుక్ చేసుకుని వచ్చారు, కనుక ఏమీ ఇబ్బంది లేకుండానే చకచకా పనులు జరుగుతున్నాయి. ఆర్డర్ చేసిన టిఫినీలు, మీల్సు - అవీ ఇవీ - అనేమిటి, అన్నీ దగ్గరికి వస్తున్నవి. స్క్రిప్ట్ రై టర్ - యాక్టర్స్ -  జోక్స్ వేసుకుంటూ, నవ్వులు త్రుళ్ళింతలలో ...... ;; [  7, జులై 2025, సోమవారం ] ;;

చీకటి దారిలో వెన్నెలల అడుగుజాడలు - 1 [64 ] ; &

తెలుగు జ్యోతి ; magazine ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వెన్నెలల అడుగుజాడలు - English script

భవ్య ఉలిక్కిపడింది.  పొద్దుటినుండీ ఆమె మనసు అదీ ఇదీ అని చెప్పలేని దిగులు,  విప్పి చెప్పలేని గుబులు, ఒక రూపు కట్టని చిత్రంలా,  ఆమె ఆలోచనలు కే...