3, ఆగస్టు 2021, మంగళవారం

అంతేనా, సరే మరి

శంకరదేవయ్య కి స్పృహ వచ్చింది. మెల్ల మెల్లగా కళ్ళు తెరిచి, చుట్టూ చూసాడు. పక్కన నిలబడి ఆతృతగా చూస్తున్నారు అందరూ. తను కళ్ళు తెరవగానే, అప్పటిదాకా బిక్కుబిక్కుమంటూ చూస్తున్న మనవళ్ళు, మనవరాళ్ళు - సంతోషంతో గట్టిగా చప్పట్లు కొట్టారు. 

భార్య శాంత, కొడుకులు కోడళ్ళు, కూతురు, అల్లుడు - యావన్మందీ "హమ్మయ్య" అని గట్టిగా విడిచిన నిట్టూర్పుల వెచ్చదనం తన మేనును స్పర్శించింది. తనవైపు చూస్తున్న భార్య శాంత కన్నుల చెమ్మదనం - తన జ్ఞాపకాలను నింపిన పాత్ర ఔతుంటే ..... ,

@@@@@,

శంకర దేవయ్య పుట్టిన ఊరు - బ్రిటీష్ పాలిత భారతదేశంలోని ఒక కుగ్రామం. చాలా ఊళ్ళకు మాదిరిగానే - అక్కడ కూడా - సంఘం స్వరూపం - ఉమ్మడి కుటుంబం - ఆర్ధిక ఇబ్బందులు, కష్టసుఖాల కలబోతలు - లుకలుకలు - హడావుడి, కంగారులతో సందడి సందడిగా ఉన్నది. వ్యవసాయం తప్ప అన్యమెరుగని సమాజం - చాకలి, మంగలి, కుమ్మరి, ఇత్యాది వృత్తుల వారికి - పంటకళ్ళం మీదనే - సం వత్సర ధాన్య పంపిణీ ఇచ్చేవారు. వీలైనంత వరకూ - అందరూ పాటిస్తున్న ఆచార సంప్రదాయాల వలన - సమాజం సమతౌల్యతతో - నింపాదిగా ఉన్నది. కాస్తో కూస్తో - ప్రజలందరికీ జరుగుబాటుకు కలుగుతున్నది, కనుక నిమ్న జాతి, దళిత వర్గం - వంటి మాటలు - ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకో లేదు, రాజకీయ వ్యవస్థకు కొత్త నిర్వచనాలను కల్పించుకున్న పదాలుగా - హీన కులం, ఆ పర్యాయ పదాలు - విపరీత భావాలను పోగు చేసిన ద్వేషపూరిత నిర్వచనాలను రూపొందించిన మాటలుగా ఏర్పడ లేదు.

@@@@@@,

ఆంగ్లేయ పాలిత భారతదేశం - కనుక - యావద్దేశమూ - బీదరికం గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతున్నది.

పేదరికం తాండవిస్తున్న చోట - అందరి పరిస్థితి కొస మెట్టు మీద ఉన్న గ్రాఫిక్ రేఖ - కనుక అందరూ అమసమాజంలో ఉన్నారు అనేది విచిత్రమైన నిజం. 

బాల్య వివాహం వంటివి - మూఢ నమ్మకాలే - అని అందరికీ తెలుసు, తెలిసినా ఆయా ఆచారాలను ఎవరూ విడవడం లేదు. ఇందుకు అనేక రాజకీయ, సామాజిక కారణాలు ......,

శంకరదేవయ్యకు అత్తమామలు, భర్త యొక్క ఎనిమిది మంది సోదర సోదరీ బృందం - వాళ్ళలో అప్పటికే ఆరుగురికి పెళ్ళిళ్ళు ఐనాయి, కనుక ఏడదికి ఒక కాంపు చొప్పున - పురిటి గది - హౌస్ ఫుల్ గా ఉండేది. అంతేకాక - మాయాబజార్ ఘటోత్కచుడు చెప్పినట్లు - బంధు బంధు బందుగులు - అనగా వారి అత్తమామలు, ఇంకా వారి శ్రీమంతం, పురుళ్ళు పుణ్యాలు - బాలసారెలు - ఇన్నిన్ని పండుగల మూలాన - ఇంకా నోములు వ్రతాలు, పండుగలు పేరంటాలు ఇత్యాదులు కామా లేని పట్టిక - ఇల్లు ఒక సంస్థానంలాగా ఎప్పుడూ కళకళలాడుతూనే ఉండేది.

శంకరదేవయ్య పెళ్ళి జరిగింది, అట్లాంటి ఇంట్లోకి కుడి కాలు పెట్టి, లోనికి వచ్చింది నవ వధువు శాంత. ఇంట్లో సరుకులు ఉన్నాయా, నిండుకున్నాయా - అనే మీమాంసకు ఆమె మనసులో తావు లేదు. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు వంచిన తల ఎత్తకుండా అణకువగా ఉండమని, ఉద్బోధలు చేసి, అంపకాలు పెట్టారు. కుమారీ శతకం - నూటికి నూరు శాతం భట్టీ పట్టి, మరీ పుట్టినింటి నుండి బయలుదేరిన హిందూ సాంప్రదాయిక గృహిణి ఆమె, ఆమె మంచితనమే - ఉమ్మడికుటుంబం ప్రామాణికత విలువలను పడిపోకుండా నిలబెట్టింది. ఐతే, ఇంత పెద్ద కుటుంబాన్ని సమర్ధవంతంగా నడపగలుగుతున్నాడు - అని ఇంటికి పెద్ద కొడుకు శంకరదేవయ్యకు ఖ్యాతి దక్కింది. శాంత చిన్నబుచ్చుకోదు, సరి కదా, భర్తకు అంత మంచి పేరుప్రఖ్యాతులు కలగడం - చూసి, ఎంతో సంతోషిస్తుండేది.

చూస్తుండగానే ఏళ్ళు గడిచాయి. అక్క చెల్లెళ్ళు, వారి పిల్ల చదువుసంధ్యలు - స్థితి బాగుండక ఇల్లు చేరిన ముఖ్య బంధువులకు చేయూతను ఇచ్చారు. శంకరదేవయ్య తల్లిదండ్రుల స్థానాన్ని శంకరదేవయ్య ఎక్కాడు. "అదేమన్నా, మయూర సింహాసనమా, మురిసిపోవడానికి?" అని ఎగతాళి చేసేవాళ్ళు కూతురు, కొడుకులు.

శంకరదేవయ్య 12 ఏటనే కరణం బల్ల ముందు పెట్టుకోవాల్సి వచ్చింది. చదువుకొంటూ సరదాగా కాలేజీ విద్యార్ధిగా గడపవలసిన వయసు - కుటుంబం కోసం అంకితం అయ్యింది. రెండో తమ్ముడు స్వాతంత్ర్య పోరాటం కోసం జెండా పట్టుకున్నాడు, జైలు కటకటాలను లెక్కబెట్టాల్సివచ్చింది. తర్వాతి వాడు సైతం - ఉద్యమ బాట పట్టాడు. తల్లిదండ్రుల దుఃఖ బాధ చెప్పనలవి కానిది.

శంకరదేవయ్య తతిమ్మా తమ్ముళ్ళు ఇద్దరినీ బ్రతిమలాడి, చదివించాడు. వారి విద్య కోసం ఎంతో శ్రమ పడ్డాడు. పేరుకు పొలాలే గాని, పంటలు పండని మెరక భూములు తమవి, అందుచేత శంకరదేవయ్య  

అదనంగా - ఊరి ప్రజలకు కోర్టు పనులు చేసిపెట్టేవాడు. క్లిష్టమైన సమస్యల పరిష్కారం, లావాదేవీలు - నెమ్మది మీద అనుభవం పెంపొందించుకున్నాడు. 

అందరికీ తల్లో నాలుక ఐనాడు. శంకరదేవయ్య ఎట్లాంటి పనినైనా సాధిస్తాడని జన విశ్వాసం పొందాడు.

అతను కోర్టు పనుల కోసం తరచు మద్రాసుకు వెళ్ళేవాడు. హోటల్సుకి వెళ్ళేవాడు కాదు. భోజనం మాని, రోడ్డు పక్కన మిర్చి బజ్జీ, ఇడ్లీ దోసెలతో కడుపు నింపుకునేవాడు. స్వంత ఖర్చులు మాని, ఎంతో పొదుపు చేసి, ఇంటి ఖర్చుల కోసం ప్రతి పైసాను కూడబెట్టేవాడు.

ఇల్లు చేరాక గృహిణీ హస్త భోజన తృప్తిగా ఆరగించేవాడు. సాదాసీదాగా గడిపిన జీవితాలు - భార్యాభర్తలు మన@స్ఫూర్తిగా స్వీకరించారు. 

మన దేశానికి స్వాతంత్యం వచ్చింది. తమ్ముళ్ళు చెప్పుకోదగిన ఆదాయాలు కల ఉద్యోగాలతో, పెళ్ళిళ్ళు ఐ, స్థిరపడ్డారు.

ఇంట్లో ఒకరిద్దరు ముదుసలులు ఉండేవారు. వెనుక విశాలమైన పెరడు, పెద్ద చెట్ల కింద నులక మంచాలలో కూర్చుని ఉండేవారు.  అక్కడనే బిలబిలలాడుతూ, అందరి పిల్లలు ఆడుకుంటుండే వాళ్ళు.

మంచంలో ఉన్న ముసలమ్మ/ ముసలయ్యలు ముక్కుతూ మూల్గుతూ పిల్లల్ని పిలిచేవాళ్ళు.

పిల్లలు అవ్వలకు, పెద్దవాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వడం, గాలి ఆడటం లేదంటే విసనకర్ర తెచ్చి, 

విసరడం లాంటి చిన్న చిన్న పనులు చేసిపెట్టే వాళ్ళు.

ఇంటిల్లిపాదీ ఇంటి పనులు మునగానాం తేలానాం గా ఉండేది. రోలు, రోకళ్ళు, తిరగళ్ళు - ఏడాదికి సరిపడా ఊరగాయలు, కూర వరుగులు, గుమ్మడికాయ వడియాలు, అప్పడాలు - చాలదన్నట్లు - స్వతంత్ర కాంక్ష 

- జనాలకు అందించిన క్రొత్త ఒరవడి - రాట్నం తిప్పుతూండడం. ఏకులు తెచ్చుకుని, 

వడికి దారం తీసేవాళ్ళు, కొద్దిదూరంలో ఉన్న ఖాదీ సెంటర్లకు నూలు ఉండలను ఇచ్చేవాళ్ళు. 

పావలా కాసు ఖర్చు ఔతుందని, 

పొలం గట్ల మీద ఐదు మైళ్ళు అలవోకగా నడిచి, చేరి, ఖద్దరు వస్త్రాలను, 

తాము ఇచ్చిన నూలు ధరకు మారుగా తెచ్చుకునేవాళ్ళు.

మూలన ఉన్న అవ్వలు పై లోకాలకు వెళ్తే, ఆ రోజు పల్లె సంప్రదాయాలు అందరూ తుచ తప్పకుండా పాటించేవాళ్ళు. ఇంట్లో వాళ్ళకు ఇరుగు పొరుగు భోజనాలు అందించేవారు.

శాంత, శంకరదేవయ్యలు పాత జ్ఞాపకాలను చెప్పుకుంటూ కలబోసుకుంటున్నారు ఇప్పుడు.

@@@@@@,

తమ ఇల్లు ఒక సంస్థానంలాగా ఎప్పుడూ కళకళలాడుతూనే ఉండేది. 

నిజమే, కానీ బహు కుటుంబీకులు, ఒకరిద్దరి రెక్కల కష్టం మీద అధారపడిన మనుష్యులు ఎక్కువమంది, సహజంగానే మజ్జిగ పలచన ఐ, కొసకు గోకుడు కూడా మిగలని పగిలిన కుండ పెంకులు మిగిలాయి.

శంకరదేవయ్య కనిపిస్తే - చుట్టాలు ఇత్యదులు ముఖం చాటేస్తున్నారు, 

గతంలో అతని సంపాదన తిన్నాము కాబట్టి, అతనిని తగిలించుకుంటే - ఎక్కడ పెట్టాల్సివస్తుందో అని. 

నలిచి నల్లమన్ను పెట్టని పరిచితులు - మొదలైన వారితో - 

వారికి స్నేహబంధాలు బాగానే ఉన్నయ్, 

ఎటొచ్చీ తమ తమ బ్రతుకు బళ్ళు ఒక గాడిన పడి, 

సంఘంలో గుర్తింపు పొందిన రీతిలో నడుస్తున్నాయి 

ఈ శంకరదేవయ్య, శాంతమ్మ ల వలననే - అనే సంగతి -

అసలు గుర్తు ఉండనివాళ్ళకు మల్లే నటిస్తున్నారు, ఇంచక్కా తప్పుకుంటున్నారు.

ఒకప్పటి సంగతులను నెమరువేసుకుంటూ - ఆలుమగలు 

గత జల సేతు బంధనం - కాలం తమ దోసిళ్ళ నుండి జారపోసుకున్న నీళ్ళు ఎంత? - 

అనే లాంటికొలతలు కొలుచుకోదలచుకోలేదు,

తమ సంతానం మంచి స్థితిపరులైనారు, ఇదంతా భగవత్ కృప, 

తాము చేసిన పరోపకారం పుణ్యఫలం - అని సర్దుకుని చెప్పుకుంటూ తృప్తి పడుతున్నారు.

@@@@@@,

ఉన్నట్టుండి తీసుకున్న దృఢ నిశ్చయాన్ని తమ జన్మదాతల నోటి నుండి విని, 

కంగారుపడ్డారు కొడుకులు కోడళ్ళు.

"మీకు ఏం లోపం జరిగింది?" అనుమానంగా తమ భార్యల వైపు చూసారు. 

"మాకు పుట్టిన ఊరికి వెళ్ళాలని, అక్కడే ఈ ముందు రోజులు గడపాలని ఉంది. 

కోడళ్ళు మీరు అందరూ బంగారం" అన్నారు ఇద్దరూ ముక్తకంఠంతో. 

పల్లెటూరులో ఇల్లు బాగు చేయించి, వచ్చారు. అమ్మ నాన్నలను దిగబెట్టడానికి అందరూ వచ్చారు.  

తమ చిన్ననాటి ముచ్చట్లు పిల్లలకు, మనవళ్ళకు వీలు చిక్కినప్పడు చెబ్తూ వచ్చారు. 

కొన్నిసార్లు బోర్ కొట్టినా, బైటకు చెప్పకుండా, పాపం, శ్రద్ధగా వినేవాళ్ళు.

పధ్నాలుగు రోజులు గడిచాయి. "ఆఫీసులకు లీవులు పెట్టాము. ఇంక ఎల్లుండి బైలుదేరారతాము." 

అప్పుడు మనసులో మాట చెప్పారు ప్రౌఢ దంపతులు. "ఇదే ఆవరణలో పిల్లలు, పెద్దలు - 

ఎడతెరపిలోని కబుర్లు, ఆటలు, చిన్న చిన్న తగాదాలు ఎన్నెన్నో, ఎంత సందడిగా ఉండేదో. కొందరు చేతివాటం ప్రదర్శించే వాళ్ళు. ఇంట్లో బియ్యం పప్పు ఉప్పులు దొంగతనంగా అమ్ముకునేవాళ్ళు, 

ఇంటిగుట్టు బైటపడకుండా గృహ యజమానులు నానా తంటాలు పడేవాళ్ళు. 

ఏమిటో, ఒక నవలను చదువుతున్నట్లుగా - రోజులు ఎట్లా గడిచిపోయాయో. 

కాలం అట్లా చులాగ్గా గడిచిపోయింది, అనేది తలచుకుంటుంటే ఇప్పుడు ఎంత తమాషాగా అనిపిస్తున్నదో!" 

"ఇప్పుడు మీకొక విషయం చెప్పాలి" అసలు సంగతి ఏమిటో తండ్రి చెప్పబోతున్నాడని అర్ధమైంది, కొంచెం వంగి ఆసక్తితో చెవులు రిక్కించి వినడానికి ఉపక్రమించారు.

"ఇంటి నిండా బిలబిలలాడుతూ ఉండేవాళ్ళు, మన ఇంట్లోనే కాదు, దాదాపు అందరి ఇళ్ళు ఒక చిన్న సామంత రాజ్యం లాగా తోచేది. పెద్దవాళ్ళకు, ప్రౌఢ - అంటే మధ్యవయస్కులు, వృద్ధులు - అట్లాగే - అక్క చెల్లెళ్ళు, తోడి కోడళ్ళు - ఏ వయసు వారికి ఆ వయసు వారు జతలు జతలుగా ఉండి, కావలసినన్ని ముచ్చట్లు దొర్లించేవాళ్ళు. ఊ అంటే ఆ అంటే ఊళ్ళో మనుషులు - ఇరుగు పొరుగు - తమ తమ ఇళ్ళలో ఏ చిన్న సంఘటన జరిగినా పరుగెత్తుకు వచ్చేవాళ్ళు, మనసులో గుబులు అంతా వలకబోసి, తేలికపడిన మనసులతో తిరిగి వెళ్ళేవాళ్ళు.

"సిటీలో ఉన్నప్పుడు హాస్పిటల్ లో చేరి, ఆరోగ్యం కాస్త బాగైనాక ఇంటికి వచ్చాం కదా. అప్పుడు మీరు అందరూ - మంచం చుట్టూ నిలబడి చూస్తున్నారు. మీ మొఖాల్లో విపరీతమైన భీతి చూసాను. గతకాలంలో - ఆ రోజులలో గంపెడు జనం భయ ఆవేదన దుఃఖాలను అంతమంది పంచుకోవడం జరిగేది, అంటే అట్లాంటి ఫీలింగ్స్ పంపకం ఎక్కువమందికి ఐపోవడం మూలాన - అదో రకం, నేటి పరిస్థితులు - చిన్న ఫ్యామిలీలు - ఇటువంటి భారాలు తటస్థపడితే - ఇక్కడ ఉన్న ఇద్దరు, ముగ్గురు మోయాల్సివస్తున్నది. అలవి కాని బాధ అనే అంతశ్చలనాలను మోపడం - నాకు సబబు అనిపించడం లేదు. అందుకనే నేను, మీ అమ్మతో ఇక్కడికి చేరాను. ఈ పచ్చని చెట్లు, చల్లగాలి, ప్రకృతి అంద చందాలను మా కళ్ళలో నింపుకుని, కాలం వెళ్ళబుచ్చడం సమంజసం కదూ"

అందరూ గట్టిగా వినిపిస్తున్న వారి వాదనలను ఆ ఉభయులు చెవికెక్కిచుకోదలచుకోలేదు, చెట్ల కొమ్మల పూలు, పళ్ళు - గగనంలో రెక్కలు సాచి విహరిస్తున్న విహంగాల కిచకిచ ధ్వనులను ఆస్వాదిస్తున్నారు, 

==========================,

SamkaradEwayya ki spRha waccimdi. mella mellagaa kaLLu terici, cuTTU cUsADu. pakkana nilabaDi AtRtagA cUstunnaaru amdarU. tanu kaLLu terawagaanE, appaTidaakaa bikkubikkumamTU cUstunna manawaLLu, manawaraaLLu - samtOshamtO gaTTigA cappaTlu koTTAru. 

bhaarya SAmta, koDukulu kODaLLu, kuuturu, alluDu - yaawanmamdee "hammayya" ani gaTTigaa wiDicina niTTUrpula weccadanam tana mEnunu sparSimcimdi. tanawaipu cuustunna bhaarya SAmta kannula cemmadanam - tana jnaapakaalanu nimpina paatra autumTE ..... ,

@@@@@,

Samkara dEwayya puTTina uuru - briTIsh paalita bhaaratadESamlOni oka kugraamam. caalaa uuLLaku maadirigaanE - akkaDa kUDA - samgham swaruupam - ummaDi kuTumbam - aardhika ibbamdulu, kashTasuKAla kalabOtalu - lukalukalu - haDAwuDi, kamgaarulatO samdaDi samdaDigA unnadi. wyawasaayam tappa anyamerugani samaajam - caakali, mamgali, kummari, ityaadi wRttula waariki - pamTakaLLam meedanE - samwatsara dhaanya pampiNI iccEwaaru. weelainamta warakuu - amdaruu paaTistunna aacaara sampradaayaala walana - samaajam samataulyatatO - nimpaadigaa unnadi. kaastO kUstO - prajalamdarikee jarugubATuku kalugutunnadi, kanuka nimna jaati, daLita wargam - wamTi mATalu - pratyEka praadhaanyatanu samtarimcukO lEdu, raajakeeya wyawasthaku kotta nirwacanaalanu kalpimcukunna padaalugaa - heena kulam, aa paryaaya padaalu - wipareeta bhaawaalanu pOgu cEsina dwEshapuurita nirwacanaalanu ruupomdimcina mATalugaa ErpaDalEdu.

aamglEya paalita bhaaratadESam - kanuka - yaawaddESamuu - beedarikam guppiTlO cikkukuni wilawilalADutunnadi.

pEdarikam tAmDawistunna cOTa - amdari paristhiti kosa meTTu meeda unna graaphik rEKa - kanuka amdaruu amasamaajamlO unnaaru anEdi wicitramaina nijam. 

baalya wiwaaham wamTiwi - mUDha nammakAlE - ani amdarikee telusu, telisinaa aayaa aacaaraalanu ewaruu wiDawaDam lEdu. imduku anEka raajakeeya, saamaajika kaaraNAlu ......,

SamkaradEwayyaku attamaamalu, bharta yokka enimidi mamdi sOdara sOdaree bRmdam - waaLLalO appaTikE aaruguriki peLLiLLu ainaayi, kanuka EDadiki oka kaanpu coppuna - puriTi gadi - haus phul gaa umDEdi. amtEkaaka - maayaabajaar GaTOtkacuDu ceppinaTlu - bamdhu bamdhu bamdugulu - anagaa waari attamaamalu, imkaa waari Sreemamtam, puruLLu puNyaalu - baalasaarelu - inninni pamDugala muulaana - imkaa nOmulu wrataalu, pamDugalu pEramTAlu ityaadulu kaamaa lEni paTTika - illu oka samsthaanamlaagaa eppuDU kaLakaLalADutUnE umDEdi.

SamkaradEwayya peLLi jarigimdi, aTlAmTi imTlOki kuDi kaalu peTTi, lOniki waccimdi nawa wadhuwu SAmta. imTlO sarukulu unnaayaa, nimDukunnaayaa - anE mImaamsaku aame manasulO taawu lEdu. emdukamTE aame tallidamDrulu wamcina tala ettakumDA aNakuwagaa umDamani, udbOdhalu cEsi, ampakaalu peTTAru. kumaaree Satakam - nUTiki nuuru SAtam bhaTTI paTTi, maree puTTinimTi numDi bayaludErina himduu saampradaayika gRhiNi aame, Ame mamcitanamE - ummaDikuTumbam praamaaNikata wiluwalanu paDipOkumDA nilabeTTimdi. aitE, imta pedda kuTumbaanni samardhawamtamgaa naDapagalugutunnaaDu - ani imTiki pedda koDuku SamkaradEwayya ku KyAti dakkimdi. SAmta cinnabuccukOdu, sari kadaa, bhartaku amta mamci pEruprakhyaatulu kalagaDam - cuusi, emtO samtOshistumDEdi.

@@@@@@,

cuustumDagAnE ELLu gaDicaayi. akka celleLLu, waari pilla caduwusamdhyalu - sthiti baagumDaka illu cErina mukhya bamdhuwulaku cEyuutanu iccaaru. SamkaradEwayya tallidamDrula sthaanaanni SamkaradEwayya ekkADu. "adEmannaa, mayuura sim haasanamaa, murisipOwaDAniki?" ani egatALi cEsEwaaLLu kuuturu, koDukulu.

SamkaradEwayya 12 ETanE karaNam balla mumdu peTTukOwaalsi waccimdi. caduwukomTU saradaagaa kaalEjee widyaardhigaa gaDapawalasina wayasu - kuTumbam kOsam amkitam ayyimdi. remDO tammuDu swaatamtrya pOrATam kOsam jemDA paTTukunnADu, jailu kaTakaTaalanu lekkabeTTAlsiwaccimdi. tarwaati wADu saitam - udyama bATa paTTADu. tallidamDrula du@hkha bAdha cepanalawi kaanidi.

SamkaradEwayya tatimmaa tammuLLu iddarinee bratimalADi, cadiwimcADu. waari widya kOsam emtO Srama paDDADu. pEruku polaalE gaani, pamTalu pamDani meraka bhuumulu tamawi, amducEta SamkaradEwayya  adanamgaa - uuri prajalaku kOrTu panulu cEsipeTTEwADu. klishTamaina samasyala parishkaaram, laawaadEweelu - nemmadi meeda anubhawam pempomdimcukunnADu. amdarikee tallO naaluka ainADu. SamkaradEwayya eTlAmTi paninainaa saadistADani jana wiSwaasam pomdADu.

atanu kOrTu panula kOsam taracu madraasuku weLLEwADu. hOTalsuki weLLEwADu kAdu. BOjanam maani, rODDu pakkana mirci bajjee, iDlee dOselatO kaDupu nimpukunEwADu. swamta kharculu maani, emtO podupu cEsi, imTi kharcula kOsam prati paisaanu kUDabeTTEwADu.

illu cEraaka gRhiNI hasta BOjana tRptigA aaragimcEwADu. saadaaseedaagaa gaDipina jeewitaalu - BAryaaBartalu mana@sphuurtigaa sweekarimcaaru. 

mana dESAniki swaatamtyam waccimdi. tammuLLu ceppukOdagina aadaayaalu kala udyOgaalatO, peLLiLLu ai, sthirapaDDAru.

imTlO okariddaru mudusalulu umDEwaaru. wenuka wiSAlamaina peraDu, pedda ceTla kimda nulaka mamcaalalO kuurcuni umDEwaaru.  akkaDanE bilabilalADutU, amdari pillalu ADukumTumDE wALLu.

mamcamlO unna unna musalamma mukkutU muulgutuu pillalni pilicEwALLu.

pillalu awwalaku, peddawALLaku mamcineeLLu iwwaDam, gaali ADaTam lEamTE wisanakarra tecci, wisaraDam laamTi cinna cinna panulu cEsipeTTE wALLu.

imTillipaadee imTi panulu munagaanaam tElaanaam gaa umDEdi. rOlu, rOkaLLu, tiragaLLu - EDaadiki saripaDA Uragaayalu, kuura warugulu, gummaDikaaya waDiyaalu, appaDAlu - caaladannaTlu - swatamtra kaamksha - janaalaku amdimcina krotta orawaDi - raaTnam tipputuumDaDam. Ekulu teccukuni, waDiki daaram teesEwALLu, koddiduuramlO unna KAdee semTarlaku nuulu umDalanu iccEwALLu. paawalaa kaasu kharcu autumdani, polam gaTla meeda aidu maiLLu alawOkagaa naDici, cEri, khaddaru wastraalanu, taamu iccina nuulu dharaku maarugaa teccukunEwaaLLu.

muulana unna awwalu pai lOkaalaku weLtE, aa rOju palle sampradaayaalu amdaruu tuca tappakumDA pATimcEwaaLLu. imTlO wALLaku irugu porugu BOjanaalu amdimcEwaaru.

SAmta, SamkaradEwayyalu paata jnaapakaalanu ceppukumTU kalabOsukumTunnaaru ippuDu.

@@@@@@,

tama illu oka samsthaanamlaagaa eppuDU kaLakaLalADutUnE umDEdi. nijamE, kaane bahu kuTumbeekulu, okariddari rekkala kashTam meeda adhaarapaDina manushyulu ekkuwamamdi, sahajamgaanE majjiga palacana ai, kosaku gOkuDu kUDA migalani pagilina kumDa pemkulu migilaayi.

SamkaradEwayya kanipistE - cuTTAlu ityadulu mukham cATEstunnaaru, gatamlO atani sampaadana tinnaamu kaabaTTi, atanini tagilimcukumTE - ekkaDa peTTAlsiwastumdO ani. nalici nallamannu peTTani paricitulu waariki snEhabamdhaalu baagaanE unnay, eToccee tama tama bratuku baLLu oka gADina paDi, samghamlO gurtimpu pomdina reetilO naDustunnaayi ee SamkaradEwayya, SAmtamma la walananE - anE samgati asalu gurtu umDaniwaaLLaku mallE naTistunnaaru, imcakkaa tappukumTunnaaru.

okappaTi samgatulanu nemaruwEsukumTU aalumagalu gata jala sEtu bamdhanam - kaalam tama dOsiLLa numDi jaarapOsukunna neeLLu emta - kolatalu kolucukOdalacukOlEdu,

tama samtaanam mamci sthitiparulainaaru, idamtaa bhagawat kRpa, taamu cEsina parOpakaaram puNyaphalam - ani sardukuni ceppukumTU tRpti paDutunnaaru.

@@@@@, 

unnaTTumDi teesukunna dRDha niScayaanni tama janmadaatala nOTi numDi wini, kamgaarupaDDAru koDukulu kODaLLu.

"meeku Em lOpam jarigimdi?" anumaanamgaa tama bhaaryala waipu cuusaaru.

"maaku puTTina uuriki weLLAlani, akkaDE ee mumdu rOjulu gaDapAlani umdi. kODaLLu meeru amdaruu bamgaaram" annaaru iddaruu muktakamThamtO.

palleTUrulO illu baagu cEyimci, waccaaru. amma naannalanu digabeTTaDAniki amdaruu waccaaru.  tama cinnanATi muccaTlu pillalaku, manawaLLaku weelu cikkinappaDu cebtuu waccaaru. konnisaarlu bOr koTTinaa, baiTaku ceppakumDA, paapam, Sraddhagaa winEwALLu.

padhnaalugu rOjulu gaDicaayi.

"aapheesulaku leewulu peTTaamu. imka ellumDi bailudEraarataamu." 

appuDu manasulO maaTa ceppaaru prauDha dampatulu. "idE aawaraNalO pillalu, peddalu - eDaterapilOni kaburlu, aaTalu, cinna cinna tagaadaalu ennennO, emta samdaDigaa umDEdO. komdaru cEtiwATam pradarSimcE wALLu. 

imTlO biyyam pappu uppulu domgatanamgaa ammukunEwALLu, imTiguTTu baiTapaDakumDA gRha yajamaanulu naanaa tamTAlu paDEwALLu. EmiTO, oka nawalanu  caduwutunnaTlugaa - rOjulu eTA gaDicipOyAyO. kaalam aTlaa culaaggaa gaDicipOyimdi, anEdi talacukumTumTE ippuDu emta tamaashaagaa anipistunnadO!" 

@@@@@,

"ippuDu meekoka wishayam ceppaali" asalu samgati EmiTO tamDri ceppabOtunnADani ardhamaimdi, komcem wamgi aasaktitO cewulu rikkimci winaDAniki upakramimcaaru.

"imTi nimDA bilabilalADutuu umDEwaaLLu, mana imTlOnE kAdu, daadaapu amdari iLLu oka cinna saamamta raajyam laagaa tOcEdi. peddawaaLLaku, prauDha - amTE madhyawayaskulu, wRddhulu - aTlaagE - akka celleLLu, tODi kODaLLu - E wayasu waariki aa wayasu waaru jatalu jatalugaa umDi, kaawalasinanni muccaTlu dorlimcEwALLu. uu amTE aa amTE ULLO manushulu - irugu porugu - tama tama iLLalO E cinna samghaTana jariginaa parugettuku waccEwALLu, manasulO gubulu amtaa walakabOsi, tElikapaDina manasulatO tirigi weLLEwALLu." 

@@@@@,

"siTIlO unnappuDu haaspiTal lO cEri, aarOgyam kaasta baagainaaka imTiki waccaam kadaa. appuDu meeru amdaruu - mamcam cuTTU nilabaDi cuustunnaaru. mee mokhaallO wipareetamaina bheeti cuusaanu. gatakaalamlO - aa rOjulalO gampeDu janam bhaya aawEdana du@hkhaalanu amtamamdi pamcukOwaDam jarigEdi, amTE aTlAmTi pheelimgs pampakam ekkuwamamdiki aipOwaDam muulaana - adO rakam, nETi paristhitulu - cinna phyaamileelu - iTuwamTi bhaaraalu taTasthapaDitE - ikkaDa unna iddaru, mugguru mOyaalsiwastunnadi. alawi kaani baadha anE amtaScalanaalanu mOpaDam - naaku sababu anipimcaDam lEdu. amdukanE nEnu, mee ammatO ikkaDiki cEraanu. ee paccani ceTlu, callagaali, prakRti amda camdaalanu maa kaLLalO nimpukuni, kaalam weLLabuccaDam samamjasam kaduu"

amdaruu gaTTigaa winipistunna waari waadanalanu aa ubhayulu cewikekkicukOdalacukOlEdu, ceTla kommala puulu, paLLu - gaganamlO rekkalu saaci wiharistunna wiham gaala kicakica dhwanulanu aaswaadistunnaaru, adi amtE mari.

[ paatralu ;- SamkaradEwayya - bhaarya SAmta, koDukulu kODaLLu, kuuturu, alluDu, manawaLLu, manawaraaLLu ]

&

అది అంతే మరి. =  2021 ఆగస్ట్ ;- కథ ;-  amtEnaa, sarE mari ;-

[ paatralu ;- SamkaradEwayya - BArya SAmta, koDukulu kODaLLu, kUturu, alluDu, manawaLLu, manawarALLu ] ;- 

[ పాత్రలు ; శంకరదేవయ్య, భార్య శాంత, కొడుకులు కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు] 

*************************,

 కథాకళి - శంకరదేవయ్య - శాంత 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...