పున్నయ్య గుడి ఆవరణలో ఎదురుచూస్తున్నాడు. స్నేహితుడు గేటు దగ్గర కనిపించగానే - ఇంతింత అని చెప్ప్లేనంత ఆనందం ....., కనకాంబరం చేతిలో కాగితాల బొత్తిని అందుకున్నాడు. రోజూ మాదిరిగానే ఇద్దరి ఠావు పేపర్లను మార్చుకున్నారు. "నీ కథ చాలా బాగుంది, కనకాంబరం!" మెచ్చుకున్నాడు పున్నయ్య.
పూజారి సుదర్శన శాస్త్రి - భక్తులు వెళ్ళాక, తీరిక దొరకడంతో వారి రచనల చర్చలలో పాలుపంచుకోవడానికి వచ్చాడు. కనకాంబరం - పున్నయ్య - ఇద్దరి ఎదుటకొంచెం ఎడంగా స్టూలు మీద కూర్చున్న్నాడు. కనకాంబరం - పున్నయ్యలకు అతని విశ్లేషణలు ఇష్టం, అతని అభిప్రాయాలు తమ కథలు, వ్యాసాలు గట్రా రచనలకు సానరాయిగా ఉపయోగ పడుతున్నది.
"నా కథానికని - `తెలుగు కానుక` పత్రికకు పంపించి, నాలుగు నెలలైంది. అచ్చు వేస్తారా, లేదా - అన్న సంగతి ఇప్పటిదాకా తెలీదు"
"మా మేనకోడలు జర్నలిస్టు, ఫోన్ చేసి, కనుక్కోమని చెబుతాను, నిబ్బరంగా ఉండండి, సార్" సుదర్శన శాస్త్రి మాటలకు తెప్పరిల్లారు ఇద్దరూ. పున్నయ్య "మీ చల్లని మాట సాయం, మాకు హుషారు ఇస్తుంది" అన్నాడు.
సుదర్శన శాస్త్రి పరిచయం చేసిన విలేఖరి వెన్నెల - ఇద్దర్నీ తన కారులో తీసుకెళ్ళింది.
కారులో ఆసీనులయ్యారు. లోకాభిరామాయణం, పిచ్చాపాటీ మాటలు దొర్లుతున్నాయి.
వెన్నెల వారి కబుర్లు ఇంటరెస్టింగుగా ఉన్నాయి - అనిపించి, రహస్యంగా - రికార్డ్ చేయసాగింది.
పున్నయ్య అన్నాడు - "రాను రానూ తెలుగు, మాతృభాష అంటే మమకారం తగ్గుతున్నాయి.
ఇంగ్లీషు తప్ప అన్యధా శరణం నాస్తి - అంటున్నారు. మా మనవలకు తెలుగు రాయడం రాదు, చదవడం రాదు. వాళ్ళకి తెలుగు నేర్పిసే ఇష్టంగా నేర్చుకుంటారు గానీ, ఇప్పటికే లెక్క లేనన్ని సబ్జెక్టులు - హోమ్ వర్కులు - చాలదన్నట్లు - మ్యూజిక్, డాన్స్, స్పోర్ట్స్ - అంటూ - ఎంత భారమో. మా చిన్నప్పుడు రుక్మిణీ కళ్యాణం, గజేంద్ర మోక్షం - పంచతంత్రం - ఒకట్రెండు శతకాలు - కంఠతా పట్టేస్తే సరిపోయేది. అదిన్నీ, ఆరేడు ఏళ్ళకి - బైట గిల్లీదండ, గోళీకాయలు, బొంగరాలాట - తనివితీరా ఆడుకునే వాళ్ళం" కనకాంబరం తన సమవయస్కుని అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, అందుకున్నాడు -"పొద్దున్న పెరట్లో చెట్ల కింద కూర్చుని, పెద్దోళ్ళు పెట్టిన చద్దన్నాలు తిని, పలక బలపాలు - చంకన పెట్టుకుని, ఏకైక పంతులు మంగయ్య గారి దగ్గరికి చేరేవాళ్ళం. లాగుల తాళ్ళు భుజాల మీంచి జారిపోతుంటే లాక్కుంటే, భలేగ ఉండేవి ఆ అమాయకపు రోజులు"
"ఇప్పుడు మన సంతానం - బిజీ బిజీ - టిఫిన్లు చేసి, టేబుల్ మీద, పెడితే - గొంతులో కుక్కుకుని పరుగులు తీస్తున్నారు. వంటావార్పులు - వారి పిల్లల చదువులు, హాబీలు - ప్రతి క్షణం కనిపెట్టి ఉంటున్నారు. స్కూల్లో టీచర్లు చెప్పింది చాలదు - అమదరిలో అగ్రస్థానం - పోటీ, ఫస్టు ప్లేస్ సాధించాలి - ముందరి తరం - అందుకు ఒక్క సెకండు తీరిక లేకుండా - విపరీతంగా శ్రమ పడుతున్నారు. ఇంట్లో ఎంత హైరానా ...., తమ పిల్లల భవిష్యత్తు గూర్చి ఎంత తపన - నిజంగా మన పిల్లల తరం - మనోభారం - మనం కొలవగలమా!!?"
"నిజమే, నిశ్చింతగా జరిగిపోయిన కాలం మనది. మన కాలంలో ఇంత ఉరుకులు పరుగులు ఎరగం"
పున్నయ్య అంటుండగానే - తెలుగు కానుక - వార పత్రిక కార్యాలయానికి చేరారు.
వెన్నెల - రికార్డ్ చేసిన సంభాషణలను - మెల్లగా తన బ్యాగులో పెట్టి, కార్ డోర్ తెరిచింది. అందరూ లోనికి వెళ్ళారు.
*********************,
మాగజైన్ ఎడిటర్ వద్దకు వెళ్ళి, చెప్పింది. అతను మిత్రద్వయం పున్నయ్య - కనకాంబరం - తమ పత్రికకు పంపిన ఆర్టికల్సుని ఫైళ్ళ కట్టలలో నుండి వెలుపలికి తీయించాడు. మూడేళ్ళ కిందటివి కూడా ఉన్నాయి, వాటిలో నాలుగు ఐదు మాత్రం అతనికి నచ్చాయి. మిగతావి దాదాపు డజను ఉన్నవి. దరిమిలా హామీ ఇస్తున్న ఉపశమన వచనాలు సంపాదకుని నోటి నుండి వచ్చాయి,
"కొన్ని బాగున్నాయి, వచ్చే నెల ప్రచురిస్తాము" సంతోషంతో కళ్ళు చెమర్చాయి. "మేము షష్ఠిపూర్తి గడిచి పన్నెండు వత్సరాలౌతున్నది. మావి మహా గొప్ప రచనలు కావు.
కానీ రాసేదాకా తెలీదు, ఇతరులకు ఏవి నచ్చుతాయి - అనే విషయం. ముద్రణ రూపంలో చూసుకుంటే ఆ ఆనందమే వేరు. ఉదయాన్నే నిద్ర లేస్తాము కదా, అనుకుంటామూ - హమ్మయ్య, ఇవాళ పొద్దును చూస్తున్నాము, ఈ గాలిని పీలుస్తున్నాము ......, ఈ చెట్లు, పిట్టలు, మబ్బులు, ఆకాశం - ప్రకృతి - నడుస్తున్న జనాలు - జంతువులు, ఎగురుతున్న పక్షులు - ఇన్నింటిని వీక్షిస్తున్నాము కదా - అని అనుకుంటాము. మా రచనలు కూడా అంతే. ఈ కళ్ళు - అక్షర పంక్తుల్ని చదవడం - అంటే అదో సంతోషం" అన్నారు స్నేహితులు. ;
మరుసటి వారమే - తెలుగు కానుక - సచిత్ర పత్రికలో తమ రచనలు అచ్చైనాయి. వెన్నెల స్వయంగా వచ్చింది, మామయ్య సుదర్శన శాస్త్రితో. వీక్లీ ఇచ్చి, పేజీలు తెరిచి మరీ చూపించింది.
ఇద్దరు ఆనందిస్తుంటే, తృప్తిగా నవ్వుతూ, "మా మేనకోడలు పెళ్ళి" అని శుభలేఖ ఇచ్చాడు సుదర్శన శాస్త్రి. వరుడి పేరు చూసి అన్నాడు పున్నయ్య - "ఎక్కడో విన్నట్లు ఉన్నది. బాగా తెలిసిన వాళ్ళు అనిపిస్తున్నది"
"ఔనండీ, మీ కోడలి అన్నయ్య - ప్రభు"
"అరె, ఐతే మనం దగ్గరి బంధువుల ఔతున్నాం అన్నమాట" సంభ్రమంగా అన్నాడు పున్నయ్య.
"మీ కోడలు ఆసక్తి ఇందుకు కారణం. ఆమె కృషి, ప్రయత్నం వలననే ఈ శుభకార్యానికి శ్రీకారం చుట్టగలిగాము" అన్నాడు సుదర్శన శాస్త్రి. ఆయన అందించిన కొబ్బరికాయ, ప్రసాదాలను కళ్ళకు అద్దుకుని, అందుకున్నారు కనకాంబరం, పున్నయ్య, వెన్నెలను ఆశీర్వదించారు.
"మీ ఆశీస్సులు విలువైనవి" అని పలికాడు సుదర్శన శాస్త్రి.
*************************,
వెన్నెల పత్రికా సంపాదకునికి - వినిపించిన ఇద్దరి సంభాషణలు - నచ్చాయి.
"జనరేషన్ గ్యాప్ పెరుగుతున్నది మరి. కాలం స్పీడును అందుకోవాలనే ప్రయత్నాలు ఈ తరం వారిది. నేటి వాస్తవాలు - రేపటికి చరిత్ర ఔతాయి" అన్నాడు.
"విలువైన డైలాగ్సు, చక్కగా రికార్డ్ చేసావు" అని మెచ్చుకున్నాడు. "వాళ్ళు రాసిన పద్ధెనిమిది రచనలలో - నాలుగు ప్రింటుకు తీసుకున్నాను. నిజంగా బాగున్న కథలు, అవి" అని నవ్వాడు ముక్తాయింపుగా.
కోవెల ప్రాంగణంలో మళ్ళీ కలిసినప్పుడు - ఇదంతా చెప్పింది సుదర్శనశాస్త్రికి వెన్నెల.
&
కళ్యాణం బొట్టు - కలం చుట్టిన శ్రీకారం ;- Telugu + English ;- [పాత్రలు ;- పున్నయ్య - కనకాంబరం - పూజారి సుదర్శన శాస్త్రి - మేనకోడలు journalist / జర్నలిస్టు/ విలేఖరి వెన్నెల ] ;
===========================,
kaLyANam boTTu - kalam cuTTina Sreekaaram ;-
punnayya guDi aawaraNalO edurucuustunnADu. snEhituDu gETu daggara kanipimcagAnE - imtimta ani cepplEnamta aanamdam ....., kanakAmbaram cEtilO kaagitaala bottini amdukunnADu. rOjuu maadirigAnE iddari Thaawu pEparlanu maarcukunnaaru. "nee katha caalaa baagumdi, kanakAmbaram!" meccukunnADu punnayya.
pUjAri sudarSana SAstri - bhaktulu weLLAka, teerika dorakaDamtO waari racanala carcalalO paalupamcukOwaDAniki waccADu. kanakAmbaram - punnayya - iddari eduTa komcem eDamgaa sTUlu meeda kuurcunnnADu. kanakAmbaram - punnayyalaku atani wiSlEshaNalu ishTam, atani abhipraayaalu tama kathalu, wyaasaalu gaTraa racanalaku saanaraayigaa upayOga paDutunnadi.
"naa kathaanikani - telugu kaanuka patrikaku pampimci, naalugu nelalaimdi. accu wEstAraa, lEdaa - anna samgati ippaTidaakaa teleedu"
"maa mEnakODalu jarnalisTu, phOn cEsi, kanukkOmani cebutAnu, nibbaramgaa umDamDi, sAr" sudarSana SAstri mATalaku tepparillaaru iddaruu. punnayya "mI callani mATa saayam, maaku hushaaru istumdi" annADu.
sudarSana SAstri paricayam cEsina wilEKari wennela - iddarnee tana kaarulO teesukeLLimdi.
kaarulO aaseenulayyaaru. lOkABirAmaayaNam, piccaapATI mATalu dorlutunnaayi. wennela waari kaburlu imTaresTimgugaa unnaayi - anipimci, rahasyamgaa - rikaarD cEyasaagimdi.
punnayya annADu - "raanu raanuu telugu, maatRBAsha amTE mamakAram taggutunnaayi. imgleeshu tappa anyadhaa SaraNam naasti - amTunnaaru. maa manawalaku telugu raayaDam rAdu, cadawaDam rAdu. wALLaki telugu nErpisE ishTamgaa nErcukumTAru gaanee, ippaTikE lekka lEnanni sabjekTulu - hOmm warkulu - caaladannaTlu - myuujik, DAns, spOrTs - amTU - emta BAramO. maa cinnappuDu rukmiNI kaLyANam, gajEmdra mOksham - pamcatamtram - okaTremDu Satakaalu - kamThataa paTTEstE saripOyEdi. adinnee, aarEDu ELLaki - baiTa gilleedamDa, gOLIkaayalu, bomgaraalATa - taniwiteeraa ADukunE wALLam"
kanakAmbaram tana samawayaskuni abhipraayaalatO EkIBawistU, amdukunnADu -"poddunna peraTlO ceTla kimda kuurcuni, peddOLLu peTTina caddannAlu tini, palaka balapaalu - camkana peTTukuni, Ekaika pamtulu mamgayya gaari daggariki cErEwALLam. laagula tALLu bhujaala meemci jaaripOtumTE laakkumTE, bhalEga umDEwi A amaayakapu rOjulu"
"ippuDu mana samtaanam - bijee bijee - Tiphinlu cEsi, TEbul meeda, peDitE - gomtulO kukkukuni parugulu teestunnaaru. wamTAwaarpulu - waari pillala caduwulu, haabeelu - prati kshaNam kanipeTTi umTunnaaru. skuullO TIcarlu ceppimdi caaladu - amadarilO agrasthaanam - pOTI, phasTu plEs saadhimcaali - mumdari taram - amduku okka sekamDu teerika lEkumDA - wipareetamgaa Srama paDutunnaaru. imTlO emta hairaanaa ...., tama pillala bhawishyattu guurci emta tapana - nijamgaa mana pillala taram - manOBAram - manam kolawagalamaa!!?"
"nijamE, niScimtagaa jarigipOyina kaalam manadi. mana kaalamlO imta urukulu parugulu eragam" punnayya amTumDagaanE - telugu kaanuka - waara patrika kaaryaalayaaniki cEraaru.
wennela - rikaarD cEsina sambhaashaNalanu - mellagaa tana byaagulO peTTi, kaar DOr tericimdi. amdaruu lOniki weLLAru.
*********************,
maagajain eDiTar waddaku weLLi, ceppimdi. atanu mitradwayam punnayya - kanakAmbaram - tama patrikaku pampina aarTikalsuni phaiLLa kaTTalalO numDi welupaliki teeyimcADu. muuDELLa kimdaTiwi kUDA unnaayi, waaTilO naalugu aidu maatram ataniki naccaayi. migataawi daadaapu Dajanu unnawi. darimilaa haamee istunna upaSamana wacanaalu sampaadakuni nOTi numDi waccaayi,
"konni baagunnaayi, waccE nela pracuristaamu" samtOshamtO kaLLu cemarcaayi. "mEmu shashThipuurti gaDici pannemDu watsaraalautunnadi. maawi mahaa goppa racanalu kaawu.
kaanee raasEdaakaa teleedu, itarulaku Ewi naccutaayi - anE wishayam. mudraNa ruupamlO cuusukumTE A aanamdamE wEru. udayaannE nidra lEstaamu kadaa, anukumTaamuu - hammayya, iwALa poddunu cuustunnaamu, ee gaalini peelustunnaamu ......, ee ceTlu, piTTalu, mabbulu, aakASam - prakRti - naDustunna janaalu - jamtuwulu, egurutunna pakshulu - innimTini weekshistunnAmu kadaa - ani anukumTaamu. maa racanalu kUDA amtE. ee kaLLu - akshara pamktulni cadawaDam - amTE adO samtOsham" annaaru snEhitulu.
********************************************,
marusaTi waaramE - telugu kaanuka - sacitra patrikalO tama racanalu accainaayi. wennela swayamgaa waccimdi, maamayya sudarSana SAstritO. weeklee icci, pEjeelu terici maree cuupimcimdi. iddaru aanamdistumTE, tRptigaa nawwutuu, "maa mEnakODalu peLLi" ani SubhalEKa iccADu. waruDi pEru cuusi annaaDu punnayya - "ekkaDO winnaTlu unnadi. baagaa telisina wALLu anipistunnadi"
"aunamDI, mI kODali annayya - prabhu"
"are, aitE manam daggari bamdhuwula autunnaam annamATa" sambhramamgaa annaaDu punnayya. "mee kODalu aasakti imduku kaaraNam. aame kRshi, prayatnam walananE I Subhakaaryaaniki Sreekaaram cuTTagaligAmu" annADu sudarSana SAstri. aayana amdimcina kobbarikaaya, prasaadaalanu kaLLaku addukuni, amdukunnaaru kanakAmbaram, punnayya, wennelanu ASIrwadimcaaru.
"mee ASIssulu wiluwainawi" ani palikADu sudarSana SAstri.
*********************,
wennela patrikaa sampaadakuniki - winipimcina iddari sambhaashaNalu - naccaayi. "janarEshan gap perugutunnadi mari. kaalam speeDunu amdukOwaalanE prayatnaalu ee taram waaridi. nETi waastawaalu - rEpaTiki caritra autaayi" annaaDu.
"wiluwaina Dailaagsu, cakkagaa rikaarD cEsAwu" ani meccukunnADu. "waaLLu raasina paddhenimidi racanalalO - naalugu primTuku teesukunnaanu. nijamgaa baagunna kathalu, awi" ani nawwADu muktaayimpugaa.
kOwela praamgaNamlO maLLee kalisinappuDu - idamtaa ceppimdi sudarSanaSAstriki wennela.
[pAtralu ;- punnayya - kanakAmbaram - pUjAri sudarSana SAstri ] ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి