4, అక్టోబర్ 2021, సోమవారం

జడలో పూలు - జాహ్నవి, జాస్మిన్

జాహ్నవికి పూలజడ అంటే ఎంతో ఇష్టం. అసలు పూల జడ లంటే ఇష్టం, ప్రియం కాని వాళ్ళు ఎవరైనా ఉంటారా!!? చేతనైనవాళ్ళు కూడా పోన్లెద్దూ - అని ఉపేక్ష చేస్తూ, ఊరుకుంటున్నారు. 

ప్రతి మనిషిది ఓపిక, తీరిక, లేని ఉరుకుల పరుగుల జీవనయానం ఐన రోజులు ఇవి. కానుక పూలజడలను వేసేవాళ్ళు, వేయించుకునే వాళ్ళు కూడా ప్రియమైనారు మరి. జాహ్నవి అభిప్రాయం మాత్రం రమారమి ఇంతే. 

జాహ్నవికి రంగు రంగుల పువ్వులజడ అంటే ఎంతో ఇష్టం. అసలు పూల జడ జాహ్నవి నాయనమ్మది పూలజడలు వేయడంలో అందె వేసిన చెయ్యి. అందుకని సెలవులు వస్తే సరి, పని మళ్ళా, నాన్నమ్మ ఊరికి చేరుతుంది జాహ్నవి. సెలవుల్లో పిల్లలందరితోటి ఇల్లంతా సందడే సందడి, నానీ పల్లె కాస్తా రేపల్లె వాడగా మారిపోతుంది.  ;  

**********************, 

కాలేజీ చదువులకు వచ్చారు జాహ్నవి గ్రూపు పిల్లలు. కాలేజి చదువులే కాక, తల్లిదండ్రులు, గురువులు - అదనంగా అనేక విద్యలను పరిచయం చేస్తున్నారు. 

తమ పిల్లలు సకల కళా నిష్ణాతులు కావాలనే పెద్దల ఉబలాటం - సంఘం చైతన్య స్వరూపిణి ఔతున్నది.  ఈ సరి కొత్త - ఉరవడి ఒరవడి -ని అనుసరణలో - జాహ్నవి టేబుల్ టెన్నిస్, బాస్కెట్ బాల్ క్రీడలు ప్రాక్టీస్ చేస్తున్నది. డిజిటల్, కంప్యూటర్ డిప్లొమాలు చేస్తున్నది. 

చాటింగ్ ఫ్రెండ్స్  ఏర్పడ్డారు.. ఆరుగురు విదేశీయులు మంచి మిత్రులు అయ్యారు. వారిలో ఇద్దరు యువతులు, ఒక ప్రౌఢ స్త్రీ ఉన్నారు. ఫేస్ బుక్ - ఇత్యాది అంతర్జాల యవనికలలో జన్నూ ఉరఫ్ జాహ్నవి ఫొటోలు - 

వానిలో పూలజడలు వేసుకున్న దృశ్యాలు మిక్కుటంగా ఆకర్షించాయి.

**********************,  

ఆదానప్రదానాలు - అనే సామాజిక కార్యక్రమాన్ని స్నేహబృందం సృష్టించారు. అందులో భాగంగా ఫారిన్ పరిచయ వల్లిక - గా జానూ ఆహ్వానించింది. ఊరూ వాడా, గుళ్ళు గోపురములు - మన శిల్పకళలు - కొంత 

సాహిత్య పరిమళాలు - ఇత్యాది అన్నిటినీ జానూ వారికి స్థాలీ పులాక న్యాయంగా పరిచయం చేసింది. వారికి పురాతన నాగరికత కలిగిన దేశం కాబట్టి - 

మన భారతదేశంలోని ప్రతి అంశమూ ఆకర్షణీయత - 

ప్రతి చిన్న విశేషాన్నీ తమ మొబైల్, కెమేరాల భాండాగారాలకు భద్రంగా చేర్చుకున్నారు.

**********************,

ఇక మిగిలింది ఒకటి ఉన్నది - అసలు వచ్చిందే దానికోసం - వచ్చీ రాగానే జానూని అడిగారు, ఇక్కడికి వచ్చినందుకు అసలు ధ్యేయాన్ని పునః పునః జాహ్నవికి గుర్తు చేస్తూనే ఉన్నారు. 

ఊరిస్తూ వచ్చిన ప్రధానాంశం పువ్వులజడ ; ముసిముసిగా నవ్వుకుని తాపీగా తమ తాతల పల్లెకు బయలుదేరదీసింది. ఫోన్ చేసి. నానీకి వివరములు చెప్పింది.

మహారాణి ఐనట్లుగా ఫీల్ అయ్యింది నానీ. కేవలం పూలజడలు ఎట్లా అల్లుతారో నేర్చుకోవడానికి - తెల్ల దొరలు, దొరసానమ్మలు - ఇంత దూరం - ఈ కుగ్రామానికి - తనను వెతుక్కుంటూ వస్తున్నారా!? - 

గారెలు, బూరెలు, సున్నుండలు, జంతికలు - సాంప్రాదాయ వంటలు కంచాలలో పేర్చి ఇచ్చింది. వీటి రుచిని కూడా మెచ్చుకోవాలని ఆమె ఉబలాటం. 

అప్పటికే అన్నిచోట్లా హోటళ్ళు, షాపులలో తిన్నారు - చాకోబార్లు, ఐస్ క్రీములకు అలవాటు పడిన జిహ్వలు - వారికి ఈ రుచులు గొప్ప ఆశ్చర్యకరం కాలేదు. జానూ సైగలను అర్ధం చేసుకొని .....  ,

"నానీ, మీ వంటలు అద్భుతం." అంటూ మెచ్చుకున్నారు. కొన్ని తినుబండారాదులు నిజంగానే నచ్చాయి.

మర్నాడు పూలజడ శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నానీ. అప్పటికే గంపలతో పూలు - రెడీగా ఉన్నాయి.    ; 

ఖరీదైన కెమేరాలతో ఇద్దరు చుట్టూ తిరుగుతూ రక రకాల యాంగిల్సులో చిత్రిస్తున్నారు. దారంతో కుట్టడం, అట్ట పైన మొగలి రేకులను కుట్టడం - పూచిక పుల్లలలో మల్లెపూల కాడలను గుచ్చి, గుండ్రని చక్రాల్లా తయారు చేసుకోవడం - అన్నీ వారికి వింతలే.

ఊళ్ళోని కుమారిలకు, ఆడపిల్లలకు వరుసగా వేసింది నానీ, ఆమె ఆధ్వర్యంలో - ఇరుగు పొరుగు -  ఆమె మిత్రబృందం కన్యకలకు, వనితామణులకు వేసారు. వేస్తూ ఓరగంట తాము కెమేరా స్క్రీన్ లలో బాగా వస్తున్నారా - అని గమనించుకున్నారు. సముద్రాలకు ఆవలి దేశాలలో ఎందరికో తమ బొమ్మలు కనిపిస్తాయి - అని వారి మనసులు మోదభరితం ఔతున్నవి. 

**********************,

ఆఖర్న విదేశీ జాస్మిన్ రిక్వెస్ట్ చేసింది, "నానీ, నేను స్వయంగా వేస్తాను. నాకు నేర్పవా!?

I can also learn this marvelous hair style, knitting art, please, tell me the 

techniques!." 

"అంతకంటేనా, బంగారం, రా ఇక్కడ కూర్చో."

నానీ ఒక అమ్మాయికి జడ వేస్తుంటే చూస్తూ - జాస్మిన్ ఇంకో లేడీకి జుట్టు పాయలు అల్లసాగింది.  

నానీ పాపకు జడ వేస్తం పూర్తి అయ్యింది. ఇంక సంపెంగలు,  కనకాంబరం, మల్లె మొగ్గలు - చీపురు పుల్లలకు గుచ్చి, తయారుచేసుకున్న చక్రం వెరైటీలు - చేతిలోకి తీసుకున్నది. జడ పైన ఎట్లాగ తీరుగా నానీ పెట్టాలో జాస్మిన్ కి, మిగతా శిష్య పరమాణువులకి చూపించసాగింది. ఆమె ఇటు తిరిగి చూసింది, జాస్మిన్ బేలగా ముఖం పెట్టి, కూర్చుని ఉంది.

"my fingure here - how ....,  నా రెండు వేళ్ళు ఇరుక్కుని ఉన్నవి, బైటికి ఎట్లాగ తీసుకోవాలి~?"

జాస్మిన్ చేత జడగంటలు పెట్టించుకుంటున్న ఇల్లాలు - "నా తల మీద మిగిలింది ఈ కొద్ది జుత్తు, ఊడిపోతుందో ఏమిటో!?" అంటూ ఒకటే గాభరా పడుతూ, బెంబేలు పడుతున్నది.  

అక్కడి పరిస్థితిని అర్ధం చేసుకోవడానికి కొంచెం టైమ్ పట్టింది. జాస్మిన్ ఈ కొత్త విద్యను నేర్చుకునే ఆతృతలో జరిగిన ఈ వింత అయోమయ సంఘటన - అక్కడ నవ్వుల పందిరి వేసింది.

"పట్టు వదలని విక్రమార్కిణివి నువ్వు, మొత్తానికి ఒక పట్టు పట్టావు, పట్టు జడకుచ్చులు వేసి, మరీ పూల జడ వేయగలుగుతున్నావు." "అందునా మొగలి రేకులు కూర్చి ... " జాహ్నవి మెచ్చుకోలు పలుకులు సంభాషణల సరిగంచు చీర అంచుకు పట్టు కుచ్చులు ఐనవి. 

"what is - పట్టు వదల్ని విక్రమార్కిన్ని !" జాస్మిన్ - English accent -  ఆంగ్ల యాస  తొణుకుతున్న పలుకులలో  - మెరిసిన ప్రశ్న అదే మరి, చుట్టుపక్కల మనుషులు, వారి పలుకులు, భావాలు, అంతరార్ధాలు - అన్నిటినీ పసిగట్టగలుగుతుంది, క్షణమైనా ఏమరని తత్వం ఆ యువతీలలామది.

చూసిన పామును బొక్కలో పడనీయడు - అన్న సామెతకు సరిగ్గా సరిపోతుంది జాస్మిన్.

ఆమె వ్యక్తిత్వం - ఆసక్తికి ప్రతిబింబం. కనుకనే ఆమె అనేక విషయాలను నేర్చుకోగలిగింది, అనేకానేక విశేషాలను తెలుసుకొంటూనే ఉన్నది. తిరుగు ప్రయాణంలో జాస్మిన్ బృందం - కొత్త అలోచనలను మూట కట్టుకున్న - మంచి అనుభవాల సామగ్రితో వీడ్కోలు చెప్పారు.

"ఇప్పటి experiences యావత్తూ inter net లో పెడతాం." అని నొక్కి వక్కాణించారు.

విశాల గగనంలో ఫ్లైట్ ఒక చిన్న విహంగం అనిపిస్తున్నది. జాస్మిన్ బాబ్డ్ హెయిర్ సర్దుకుంటూ, నేస్తాలతో కలిసి, లగేజి వగైరా జాగ్రత్తలు సరి చూసుకుంటూ- సరిచేసుకుంటూ - హడావుడిగా ముందుకు సాగుతున్నది. ;   

**********************,

అన్నట్లు జాహ్నవి ఇచ్చిన గిఫ్టులలో ఒకటి - జాస్మిన్ చేతిలో కనబడుతున్నది. 

విమానం ఎక్కి, "టా టా" చెబ్తున్న జాస్మిన్ చేతిలో రెపరెపలాడుతున్న పేజీలతో "భట్టి విక్రమార్క కథలు, పాత చందమామ - బుజ్జాయి - బాలమిత్ర - లాంటి పత్రికలు, ఇంకా కాశీ రామేశ్వరం కథలు వంటివి - ఇంగ్లీష్ ట్రాన్స్ లేషన్స్ బుక్స్ ..... జాస్మిన్ అప్పటికే కొన్ని చదివేసింది. 

"ఈ బుక్స్ ని నేను మళ్ళీ కొత్తగా రాస్తాను." అంటుంటే, 

చల్లని తూర్పు చిరుగాలి హ్యాపీగా "వల్లె" అంటూ ఆమె కురులలో ఉయ్యాలా ... జంపాలా - ఊగుతున్నది.

**********************,  &

 జడలో పూలు - జాహ్నవి , జాస్మిన్ ;- [పాత్రలు ;- జాహ్నవి ; జాస్మిన్ ; నానీ/ నాన్నమ్మ ; ఇల్లాలు ] ;

********************************************  

కథలు, middle class Telugu stories 2021  ; కథాకళి కాదంబరి 2021 ;

=================================,

jaDalO pUlu ;- jAhnawiki puulajaDa amTE emtO ishTam. asalu pUla jaDa lamTE ishTam, priyam kaani waaLLu ewarainaa umTaaraa!!? cEtanainawaaLLu kUDA pOnledduu - ani upEksha cEstuu, uurukumTunnaaru. prati manishidi Opika, teerika, lEni urukula parugula jeewanayaanam aina rOjulu iwi. kaanuka puulajaDalanu wEsEwALLu, wEyimcukunE wALLu kUDA priyamainaaru mari. jaahnawi abhipraayam maatram ramaarami imtE.

jaahnawiki ramgu ramgula puwwulajaDa amTE emtO ishTam. asalu pUla jaDa jAhnawi 

naayanammadi puulajaDalu wEyaDamlO amde wEsina ceyyi. amdukani selawulu wastE sari, pani maLLA, naannamma uuriki cErutumdi jaahnawi. selawullO pillalamdaritOTi illamtaa samdaDE samdaDi, naanee palle kaastaa rEpalle wADagaa maaripOtumdi

**********************,

kaalEjee caduwulaku waccaaru jaahnawi gruupu pillalu. kaalEji caduwulE kaaka, tallidamDrulu, guruwulu - adanamgaa anEka widyalanu paricayam cEstunnaaru. 

tama pillalu sakala kaLA nishNAtulu kaawaalanE peddala ubalATam - samgham caitanya swaruupiNi autunnadi.  ee sari kotta - urawaDi orawaDi -ni anusaraNalO - jaahnawi TEbul Tennis, baaskeT baal kreeDalu praakTees cEstunnadi. DijiTal, kampyUTar Diplomaalu cEstunnadi. 

cATimg phremDs ErpDDAru. aaruguru widESIyulu mamci mitrulu ayyaaru. waarilO iddaru yuwatulu, oka prauDha stree unnaaru. phEs buk - ityaadi amtarjaala yawanikalalO jannuu uraph jaahnawi phoTOlu - waanilO puulajaDalu wEsukunna dRSyaalu mikkuTamgaa aakarshimcaayi.

**********************,

aadaanapradaanaalu - anE saaamaajika kaaryakramaanni snEhabRmdam sRshTimcAru. amdulO BAgamgA phaarin paricaya wallika - gaa jaanU aahwaanimcimdi. uuruu wADA, guLLu gOpuramulu - mana SilpakaLalu - komta saahitya parimaLAlu - ityaadi anniTinee jaanuu waariki sthaalee pulaaka nyaayamgaa paricayam cEsimdi. waariki puraatana naagarikata kaligina dESam kaabaTTi - 

mana BAratadESamlOni prati amSamuu aakarshaNIyata - 

prati cinna wiSEshaannee tama mobail, kemEraala BAmDAgaaraalaku bhadramgaa cErcukunnaaru.

**********************,

ika migilimdi okaTi unnadi - asalu waccimdE daanikOsam - waccee raagaanE jaanuuni aDigaaru, ikkaDiki waccinamduku asalu dhyEyaanni puna@h puna@h jaahnawiki gurtu cEstuunE unnaaru. 

uuristuu waccina pradhaanaamSam puwwulajaDa ; musimusigaa nawwukuni taapeegaa tama taatala palleku bayaludEradeesimdi. phOn cEsi. naaneeki wiwaramulu ceppimdi.

mahaaraaNi ainaTlugaa pheel ayyimdi naanee. kEwalam puulajaDalu eTlaa allutArO nErcukOwaDAniki - tella doralu, dorasaanammalu - imta duuram - ee kugraamaaniki - tananu wetukkumTU wastunnaaraa!? - gaarelu, buurelu, sunnumDalu, jamtikalu - saampraadaaya wamTalu kamcaalalO pErci iccimdi. weeTi rucini kUDA meccukOwaalani aame ubalaaTam. 

appaTikE annicOTlaa hOTaLLu, shaapulalO tinnaaru - caakObaarlu, ais kreemulaku alawATu paDina jihwalu - waariki ee ruculu goppa aaScaryakaram kAlEdu. jaanuu saigalanu ardham cEsukoni .....  "naanee, mee wamTalu adbhutam." amTuu meccukunnaaru. konni 

tinubamDAraadulu nijamgaanE naccaayi.

marnADu pUlajaDa SikshaNA kaaryakramaaniki Sreekaaram cuTTimdi naanee. appaTikE gampalatO puulu - reDIgA unnaayi. 

********************** ,  

khareedaina kemEraalatO iddaru cuTTU tirugutuu raka rakaala yaamgilsulO citristunnaaru. 

daaramtO kuTTaDam, aTTa paina mogali rEkulanu kuTTaDam - pUcika pullalalO mallepuula 

kADalanu gucci, gumDrani cakraallA tayAru cEsukOwaDam - annee waariki wimtalE.

uuLLOni kumaarilaku, ADapillalaku warusagaa wEsimdi naanee, aame aadhwaryamlO - irugu 

porugu -  aame mitrabRmdam kanyakalaku, wanitaamaNulaku wEsaaru. wEstuu OragamTa taamu kemEraa skreen lalO baagaa wastunnaaraa - ani gamanimcukunnaaru. samudraalaku aawali dESAlalO emdarikO tama bommalu kanipistaayi - ani waari manasulu mOdabharitam autunnawi.

**********************

aakharna widESI jaasmin rikwesT cEsimdi, "naanee, nEnu swayamgaa wEstaanu. naaku nErpawaa!?

`I can also learn this marvelous hair style, knitting art, please, tell me the techniques!`." 

"amtakamTEnaa, bamgaaram, raa ikkaDa kuurcO."

naanee oka ammaayiki jaDa wEstumTE cuustuu - jaasmin imkO lEDIki juTTu paayaalu 

allasaagimdi.

naanee paapaku jaDa wEstam puurti ayyimdi. imka sampemgalu,  kanakaambaram, malle moggalu - ceepuru pullalaku gucci, tayaarucEsukunna cakram weraiTIlu - cEtilOki teesukunnadi. jaDa paina eTlaaga teerugaa naanI peTTAlO jaasmin ki, migataa Sishya paramANuwulaki cUpimcasaagimdi. aame iTu tirigi cuusimdi, jaasmin bElagaa mukham peTTi, kuurcuni umdi.

************************, ;   

"`my fingure here - how .... ` naa remDu wELLu irukkuni unnawi, baiTiki eTlAga teesukOwaaali~?"

jaasmin cEta jaDagamTalu peTTimcukumTunna illaalu - "naa tala meeda migilimdi ee koddi juttu, uuDipOtumdO EmiTO!?" amTU okaTE gABarA paDutuu, bembElu 

paDutunnadi. akkaDi paristhitini ardham cEsukOwaDaaniki komcem Taimm paTTimdi. jaasmin ee kotta widyanu nErcukunE aatRtalO jarigina ee wimta ayOmaya samghaTana - akkaDa nawwula pamdiri wEsimdi.

"paTTu wadalani wikramaarkiNiwi nuwwu, mottaaniki oka paTTu paTTAwu, paTTu jaDakucculu wEsi, maree puula jaDa wEyagalugutunnaawu." 

"amdunaa mogali rEkulu kuurci ... " jaahnawi meccukOlu palukulu sambhaashaNala sarigamcu ceera amcuku paTTu kucculu ainawi. 

"`what is` - paTTu wadalni wikramaarkinni!" jaasmin `English accent ` = aamgla yaasa  toNukutunna palukulalO merisina praSna adE mari, cuTTupakkala manushulu, waari palukulu, bhaawaalu, amtaraardhaalu - anniTinee pasigaTTagalugutumdi, kshaNamainaa Emarani tatwam aa yuwatIlalaamadi.

cuusina paamunu bokkalO paDaneeyaDu - anna saametaku sariggaa saripOtundi jaasmin. 

aame wyaktitwam - aasaktiki pratibimbam. kanukanE aame anEka wishayaalanu 

nErcukOgaligimdi, anEkaanEka wiSEshaalanu telusukomTUnE unnadi. tirugu prayANamlO jaasmin bRmdam - kotta alOcanalanu mUTa kaTTukunna - mamci anubhawaala saamagritO weeDkOlu ceppaaru.

"ippaTi `experiences` yaawattuu `inter net` lO peDataam."  ani nokki wakkANimcaaru.

wiSAla gaganamlO phlaiT oka cinna wihamgam anipistunnadi. jaasmin baabD heyir sardukumTU, nEstaalatO kalisi, lagEji wagairaa jaagrattalu sari cuusukumTU- saricEsukumTU - haDAwuDigA mumduku saagutunnadi. ;

********************** ,

annaTlu jaahnawi iccina giphTulalO okaTi - jaasmin cEtilO kanabaDutunnadi. wimaanam ekki, 

"TA TA" cebtunna jaasmin cEtilO reparepalADutunna pEjeelatO "bhaTTi wikramaarka kathalu, paata chamdamaama - bujjaayi - baalamitra - laamTi patrikalu, imkaa kASee raamESwaram 

kathalu wamTiwi - imgleesh Traans lEshans buks ..... jaasmin appaTikE konni cadiwEsimdi. 

"I buks ni nEnu maLLI kottagaa raastaanu." amTumTE, callani tUrpu cirugAli hyaapeegaa "walle" amTU aame kurulalO uyyaalaa ... jampaalaa - uugutunnadi.

[pAtralu ;- jAhnawi ; jAsmin ; nAnI/ nAnnamma ; illaalu] ;



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...