30, అక్టోబర్ 2021, శనివారం

ఆ నవ్వులు ఎందులకు!?

 మంచిమనసులు సినిమా - ఇంటర్ నెట్ వీడియోలో చూస్తున్నది అనిత. "కాంతామణీ, భోజన వేళ అయ్యింది, మహరాణీ" భర్త మధుసూదనరావు మాటలకు లేచి, కంచంలో అన్నం పెట్టింది. తను ప్లేటులో పెట్టుకుని 

తిరుగుతూ తింటూ, బుల్లితెర చూస్తూ, పతిదేవునికి వడ్డిస్తూ, భోజనం తినడం పూర్తిచేసింది. 

"ఇందాక మనమిద్దరం ఏం కూరలని తిన్నాము?" పరధ్యానంగా "బెండ కాయ ఫ్రై" అన్నది. "హు, తింటున్న కాస్సేపైనా -  రుచి enjoy చేస్తూ - తినవచ్చు గదా, మరీ అంత టివి మమైకం ఐతే ఎట్లాగే!? ఇందాక ఆలుగడ్డల కూర వేసావు" అన్నాడు.

అనిత కించిత్తు సిగ్గుపడి, సర్దుకుని నవ్వుతూ అన్నది "కూర సాదకాలను మరిచాను గానీ మిమ్మల్ని కాదుగా" 

"రాంచీకి ట్రైన్ టికెట్ తీసుకున్నాను" : హమ్మయ్య" అన్నది అనిత. మరుసటి వారంలో ఆమె పిన్ని సుభద్ర ఇంట్లో, ఆమె కూతురు కౌసల్య పెళ్ళి సందడిలో హుషారుగా పాల్గొన్నది. కౌసల్య అత్తారిల్లు తమ ఊరికి దగ్గరలోనే. 

అందుకని పెళ్ళయ్యాక తనకు ఈ పాత బాంధవ్యాలు, మళ్ళీ సరికొత్త నగిషీలను అద్దుకో బోతున్నాయి, అందుకే అనితకు చెల్లెలు కౌసల్య పెళ్ళి అంటే సంతోషం. 

ఉదయగిరి కొండ కోనలన్నిటినీ కొత్తజంటకి పరిచయాలు చేసింది అనిత. హనీమూన్ అతి తక్కువ ఖర్చులో ఎంత తృప్తిగా చేసుకోవచ్చునో - అనిత మార్గదర్శక సూత్రాలను చూసి, అందరూ చక్కగా నేర్చుకోవచ్చును 

కూడా. కౌసల్య శ్రీమంతం పండుగ ఇంచుమించు తన భుజాల మీద మోసిందని చెప్పవచ్చు.

కౌసల్య తరఫున వచ్చిన బంధువులలో చెన్నమ్మ, ఇందిరమ్మ కూడా ప్రత్యేకించి చెప్పుకోదగిన వారు. ఆ ఇద్దరు తోడికోడళ్ళు అన్ని పనులలో హుషారుగా భాగస్వాములు ఔతూ నిలబడ్డారు, కాబట్టి కొత్తవారికి కూడా ఇట్టే గుర్తుంటారు. కౌసల్య పుట్టినింటికి బయలుదేరే సమయానికి, కెమేరాలు క్లిక్ మంటుండగా అందరూ కారు దగ్గరికి వచ్చారు అనుకోకుండా ముదరికి వచ్చి చేరారు చెన్నమ్మ, ఇందిరమ్మ. 

"అక్కా, నువ్వు ముందెక్కు" చెన్నమ్మ పక్కకి జరిగింది. ఇందిరమ్మ 

"కాదు చెన్నీ, చిన్నదానివి, నువ్వు ముందు ఎక్కు" అంటూ వెనక్కి రెండడుగులు వేసింది ఇందిరమ్మ. 

అందరూ వారిద్దరికీ ప్రధమ గౌరవస్థానం ఇస్తున్నారు, కనుక వారు ఎక్కాక, కౌసల్య కూర్చుంటుంది - అని చూస్తున్నారు. ఇందిరమ్మ,చెన్నమ్మ పరస్పర మన్ననలు కొంతసేపటిదాకా కొనసగుతూనే ఉన్నాయి. పది నిమిషాలకి చటుక్కున ముందుకు వచ్చాడు సెవెంత్ క్లాసు [వాడికి ఇష్టమైన నిక్ నేమ్ అది] "కౌసల్యక్కా, ఇంక నువ్వు ఎక్కు" అనేసి, కారు డోరుని హాండిల్ నొక్కి చటుక్కున ఓపెన్ చేసాడు. 

ఇందిరమ్మ గబగబా కారులోకి దూరి, "రామ్మా కౌసల్యా" అంటూ మిగతావారిని కూడా పిలిచింది. కారు స్టాట్ అయ్యాక "నీక్కూడా కారు తలుపు తియ్యడం రాదన్న మాట" అంటూ చెన్నమ్మ చెవిలో గుసగుసలాడింది. 

ఆ మాటలు కౌసల్య తల్లి సుభద్ర విననే విన్నది. "ఓసి మీ ఇళ్ళు బంగారం అగునూ, ఇందాక అక్కడే ఆగిపోయి, నువ్వంటే నువ్వంటూ, మీరిద్దరూ అంతంత మర్యాదలు చేసుకున్నారు" అన్నది ఫకాల్న నవ్వుతూ. 

"నీవి పాము చెవులు, అక్కా" చిన్నబుచ్చుకున్నా పైకి కనబరచకుండా తోడికోడళ్ళు చెన్నమ్మ, ఇందిరమ్మ తాము సైతం అందరి పకపకలతో జతగా గొంతు కలిపారు.

************************************** ,

అనిత తమ ఇల్లు చేరగానే, మంచిమనసులు - చలనచిత్రాన్ని, ఆమూలాగ్రం మళ్ళీ చూసింది. 

ఆమెకి ఇప్పుడే వచ్చిన డౌటు - ఎస్.వి.రంగారావు దారిలో తనకు తారసపడిన స్టూడెంట్సు అందరికీ లిఫ్టు ఇచ్చాడు కదా, ఆ ఎక్కినవాళ్ళు మధ్యతరగతి వాళ్ళే - అంటే కారు డోర్ తెరవడం తెలీనివాళ్ళే! 

అట్లాంటప్పుడు ఒక్కొక్కడూ తలుపు తీస్తూ వేసూ కుస్తీ పడుతుంటే ....... .... ఎస్వీఆర్ కారు కాస్తా షెడ్డుకి, కొన్నాళ్ళకి పాత సామాన్లు అంగడికి చేరిపోయి ఉంటుంది కదూ" భార్యామణి ధర్మసందేహాలు విన్న మధుసూదనుడు పది రోజులదాకా ఆఫీసులో కొలీగ్సుకి చెబ్తూ, నవ్వుతూనేఉన్నాడు.  

&

[పాత్రలు - అనిత, husband మధుసూదనరావు, పిల్లలు & పిన్ని సుభద్ర, సుభద్ర కుమార్తె కౌసల్య, తోడికోడళ్ళు చెన్నమ్మ, ఇందిరమ్మ ]

============================= ;

A nawwulu emdulaku? ;- [paatralu - anita, `husband `madhusuudanaraawu, pillalu & pinni subhadra, subhadra kumaarte kausalya, tODikODaLLu cennamma, imdiramma ] ;-

mancimanasulu sinimaa - imTar neT weeDiyOlO cuustunnadi anita. "kaamtaamaNI, BOjana wELa 

ayyimdi, maharANI" bharta madhusuudanaraawu mATalaku lEci, kamcamlO annam peTTimdi. tanu 

plETulO peTTukuni tirugutuu timTU, bullitera cuustuu, patidEwuniki waDDistuu, BOjanam 

tinaDam puurticEsimdi. "imdaa manamiddaram Em kuuralani tinnaamu?" 

paradhyaanamgaa "bemDa kaaya phrai" annadi. "hu, timTunna kaassEpainaa - ruci `enjoy` cEstU - tinawaccu gadaa, 

maree amta Tiwi mamaikam aitE eTlAgE!? imdaaka aalugaDDala kuura wEsaawu" annaaDu. anita 

kimcittu siggupaDi, sardukuni nawwutuu annadi 

"kuura saadakaalanu maricaanu gaanee mimmalni kaadugA" 

"raamceeki Train TikeT teesukunnaanu" : hammayya" 

annadi anita. marusaTi waaramlO aame pinni subhadra imTlO, aame kuuturu kausalya peLLi samdaDilO hushaarugaa paalgonnadi. kausalya attaarillu tama uuriki daggaralOnE. amdukani 

peLLayyAka tanaku ee paata baamdhawyaalu, maLLI sarikotta nagisheelanu addukO bOtunnAyi, 

amdukE anitaku cellelu kausalya peLLi amTE samtOsham. udayagiri komDa kOnalanniTinii kottajamTaki paricayaalu cEsimdi anita. haneemuun ati takkuwa kharculO emta tRptigA cEsukOwaccunO - anita maargadarSaka suutraalanu cuusi, 

amdarU cakkagaa nErcukOwaccunu kUDA. kausalya SrImamtam pamDuga imcumimcu tana bhujAla 

mIda mOsimdani ceppawaccu.

kausalya taraphuna waccina bamdhuwulalO cennamma, imdiramma kUDA pratyEkimci ceppukOdagina waaru. aa iddaru tODikODaLLu anni panulalO hushaarugaa BAgaswAmulu autuu 

nilabaDDAru, kaabaTTi kottawaariki kUDA iTTE gurtumTAru. kausalya puTTinimTiki bayaludErE 

samayaaniki, kemEraalu klik maTumDagA amdaruu kaaru daggariki waccaaru. anukOkumDaa 

mudariki wacci cEraaru cennamma, imdiramma. "akkaa, nuwwu mumdekku" cennamma pakkaki 

jarigimdi. imdiramma "kaadu cennee, cinnadaaniwi, nuwwu mumdu ekku" amTU wenakki 

remDaDugulu wEsimdi imdiramma. amdaruu waariddarikee pradhama gaurawasthaanam istunnaaru, 

kanuka waaru ekkaaka, kausalya kuurcumTumdi - ani cuustunnaaru. imdiramma,cennamma 

paraspara mannanalu komtasEpaTidaakaa konasagutUnE unnAyi. padi nimishaalaki caTukkuna 

mumduku waccADu sewent klaasu [wADiki ishTamaina nik nEmm adi] "kausalyakkaa, imka nuwwu 

ekku" anEsi, kaaru DOruni hAmDil nokki caTukkuna Open cEsADu. 

imdiramma gabagabaa kaarulOki duuri, "raammaa kausalyaa" amTU migataawaarini kUDA 

pilicimdi. kaaru sTAT ayyAka "neekkUDA kaaru talupu tiyyaDam raadanna mATa" amTU cennamma cewilO gusagusalADimdi. aa mATalu kausalya talli subhadra winanE winnadi. "Osi mee iLLu bamgaaram agunuu, imdaaka akkaDE aagipOyi, nuwwamTE nuwwamTU, meeriddaruu amtamta maryaadalu cEsukunnAru" annadi phakaalna nawwutuu. 

"neewi paamu cewulu, akkaa" cinnabuccukunnaa, paiki kanabaracakumDA, tODikODaLLu 

cennamma, imdiramma taamu saitam amdari pakapakalatO jatagaa gomtu kalipaaru.

anita tama illu cEragAnE, mamcimanasulu - calanacitrAnni, aamuulaagram maLLI cuusimdi. 

aameki ippuDE waccina DauTu - es.wi.ramgaaraawu daarilO tanaku taarasapaDina sTUDemTsu 

amdarikee liphTu iccADu kadA, aa ekkinawALLu madhyataragati wALLE - amTE kaaru DOr 

terawaDam teleeniwALLE! aTlAmTappuDu okkokkaDU talupu teestuu wEsU kustI paDutumTE 

....... .... esweeaar kaaru kaastaa sheDDuki, konnALLaki paata saamaanlu amgaDiki 

cEripOyi umTumdi kadU" 

bhaaryaamaNi dharmasamdEhaalu winna madhusuudanuDu padi rOjuladaakaa aapheesulO 

koleegsuki cebtuu, nawwutUnEunnADu.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గాడిదలు - గజరాజు - CK - 1

క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం  మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,  అంచేత ...