30, అక్టోబర్ 2021, శనివారం

చారుల్ అనబడే నేను .....

 "మై నేమ్ ఈజ్ చారుల్ ..... " అంటూ పాత పాట ట్యూన్ అనుసరిస్తూ హమ్  చేస్తున్నాడు. 

"అదేం పేరు?". స్నేహితులు సంధించిన ప్రశ్నకు బదులిస్తూ, 

"మరే, నా అసలు నామధేయం - క్రిష్ణతులసీ రామవరప్రసాద్ - నా లవర్ చారులత - కనుక మదీయ నామాన్ని - సింపుల్ గా చారుల్ అని మార్చుకున్నాను, అంతే." 

"గురూ! బారసాల రోజున బియ్యంలో నీ పేరెంట్స్ రాసిన పేరుని తుంగల్లో తొక్కి, ఒక nice name ని select చేసుకున్నావు, బాగానే ఉంది. కానీ నీ సరి కొత్త పేరుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి నమోదు చేసుకోవాలి. అంతే కానీల్, నోటిమాటగా ఏదో మార్చేసుకున్నాను, అని అనుకుంటే ఏ మాత్రం సరిపోదు"

 "ఔనా, అంత తతంగం ఉంటుందా!?" కొంచెం కంగారు పడ్డాడు చారుల్ అనబడు క్రిష్ణ తులసీ రామవర ప్రసాద్. బెంబేలుపడుతున్న ఫ్రెండును చూస్తూ, వాళ్ళు జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేసారు. 

*********,

పార్ట్ - 1 ;- "ఊ, మీ న్యూ పేరు చారుదత్త కదూ" "కాదు సార్, చారుల్." పళ్ళబిగువన కోపాన్ని అణచిపెట్టుకుంటూ అన్నాడు. ఇప్పటికి నెలన్నర పైనే అయ్యింది, ఈ గవర్నమెంటు ఆఫీసు చుట్టూ తిరగడం మొదలుపెట్టి. చారుల్ ని ఓ కంట కనిపెట్టి ఉన్న హంగు వర్గం స్టాఫు రెస్టోర్ పక్కకి పిలిచాడు. చారుల్ విసిగిపోయాడని నిర్ధ్హరించుకన్న పిమ్మట స్టాఫు రెస్టోర్ రంగంలోకి అడుగు మోపాడు. పై రాబడిని సాధించి, అందరికీ పంచిపెట్టడంలో పెట్టాడు, ఈ డబ్బు సేకరణకు అతను ఎంచుకున్న మార్గాలలో ఇది ఒకటి. తమ దగ్గరికి వచ్చే పాసెంజర్లు ఏ పద్ధతికి అనువు ఔతున్నారో అంచనా వేసి, పైలంగా ఆర్జనను సాధిస్తాడు, కనుకనే 'restore' అని, ముద్దు పేరు పెట్టుకున్నారు సాటి సిబ్బంది. 

అతని అసలు పేరు ఎవరికీ తెలీదు, అవసరం లేదు కూడా. 

"మిస్టర్ చారుదత్తా, ఆమ్యామ్యా కొంచె ఇస్తే, మీ ఫైలు త్వరత్వరగా కదులుతుంది." గొప్ప రహస్యాన్ని చెబుతున్నట్లు నటిస్తూ చెప్పాడు. "ఆమ్యమ్యానా, అంటే కొత్తరకం సేమ్యానా?" అతని అగ్నానానికి పగలబడి నవ్వాడు. 

"బాపూ సినిమాలు తెలీని అభాగ్యుడివి. ఇంటికి వెళ్ళి, బుద్ధిగా బుద్ధిమంతుడు ANR సిన్మాను చూడు. ముందు కొన్ని పచ్చనోట్లు బల్ల కింద నుండి నా చేతిలో పెట్టు, చారుదత్తుడు గారూ." 

"ఏమిటి, నా పేరుని మార్చేస్తున్నావు, చారుల్ - సింపుల్" 

"మీ పెద్దోళ్ళు పెట్టిన పేరుని నువ్వు ఛేంజ్ చేసుకుంటున్నావు కదా, ఇంక ఏ పేరైతేనేమిటి." "హ్హు" హుంకరింపుని తిప్పలు పడి, నిట్టూర్పుగా మార్చేసి, restore అడిగినంత మనీ సమర్పించుకున్నాడు. 

"ఉండండి, ముక్కాలు గంటలో, మీ పని పూర్తి ఔతుంది." లోపలికి వెళ్ళాడు. ఈ సారి తనకి బహువచనం ఇచ్చి, మర్యాద ఇచ్చాడు - అని స్ఫురణకు వచ్చింది చారుల్ గారికి. బైటికి వెళ్ళి హోటలులో హాట్ హాట్ కాఫీ తాగి, చారులతకు ఫోన్ చేసి,  చాటింగ్ చేసాడు. మూడు నాలుగు గంటలు గడిచాయి. రెస్టోర్ అతని ఎదుట ప్రత్యక్షం అయ్యాడు."చారుల్ - అనే పేరు బానే ఉంది గానీ, చారుదత్త అనే పేరు ఇంకా బాగుంటుంది. మనసు మారి, నేను చెప్పిన name సెలెక్ట్ చేసుకుంటే, ఈమారు, మీ ఫీజు 35 పర్సంట్ డిస్కౌంట్ ఇస్తాను." "తమరు తెలిపిన పేరుకు స్పెషాలిటీ ఏమిటో" చిరాకుతో కీచుమని అరిచాడు.

"శూద్రకుడు అనే మహాకవి - మృచ్ఛకటికం అని సంస్కృత నాటకం రాసాడు. ప్రాచీనకాలం, బిసి నాటికే గొప్ప విప్లవ థీముతో స్టోరీని మనకు గొప్ప వరంగా అనుగ్రహించాడు ..... "

చారుల్ ఏక్ దమ్మున వీధి కొస దాకా పరుగో పరుగు. "అరె, అక్కడ నా మోపెడ్ ఉన్నదే, ఎట్లా?" అంతలో అతని కళ్ళకు మిరుమిట్లు ఇస్తూ, చారులత నిలబడింది. తనే వెళ్ళింది, మోపెడ్ తెచ్చింది. "నేను అక్కడే ఉంటే వాడు యాన్షియంట్ పురాణాల లిస్టు అంతా నా చేత బట్టీ పట్టించేవాడు " చారు ద్వయం నవ్వులతో మోపెడ్ స్టార్ట్ అయ్యింది. 

============================,

cArul anabaDE nEnu ..... ;- [cArul muukee kathalu ;- 1 ] = చారుల్ అనబడే నేను ..... ;- [చారుల్ మూకీ కథలు ;- 1 ] ;- "mai nEmm eej caarul ..... " amTU paata pATa Tyuun anusaristuu hamm cEstunnADu. "adEm pEru?". snEhitulu samdhimcina praSnaku badulistuu, "marE, naa asalu naamadhEyam - krishNatulasI rAmawaraprasAd - naa lawar cArulata - kanuka madIya nAmAnni - simpul gaa cArul ani maarcukunnaanu, amtE." "gurU! baarasaala rOjuna biyyamlO nI pEremTs 

rAsina pEruni tumgallO tokki, oka `nice name` ni `select` cEsukunnaawu, baagAnE umdi. 

kaanee nee sari kotta pEruni prabhutwa kaaryaalayaalaku weLLi namOdu cEsukOwaali. amtE kAnIl, nOTimATagA EdO mArcEsukunnAnu, ani anukumTE E mAtram saripOdu" "aunaa, amta tatamgam umTumdaa!?" komcem kamgAru paDDADu cArul anabaDu krishNa tulasI rAmawara prasAd. bembElupaDutunna phremDunu cuustuu, wALLu jOkulu wEsukumTU emjaay cEsaaru. 

**********,

pArT - 1 ;- "U, mI nyU pEru cArudatta kadU" "kaadu saar, cArul." paLLabiguwana kOpAnni aNacipeTTukumTU annADu. ippaTiki nelannara painE ayyimdi, ee gawarnamemTu aaphIsu cuTTU tiragaDam modalupeTTi. cArul ni O kamTa kanipeTTi unna hamgu wargam sTAphu resTOr pakkaki pilicADu. cArul wisigipOyADani nirdhharimcukanna pimmaTa sTAphu resTOr ramgamlOki aDugu prTTADu. pai raabaDini saadhimci, amdarikee pamcipeTTaDamlO peTTADu, ee Dabbu sEkaraNaku atanu emcukunna maargaalalO idi okaTi. tama daggariki waccE pAsemjarlu E paddhatiki anuwu autunnaarO amcanA wEsi, pailamgA Arjananu saadhistADu, kanukanE ristOru ani, muddu pEru peTTukunnaaru sATi sibbamdi. atani asalu pEru ewarikee teleedu, awasaram lEdu kUDA.

"misTar cArudattA, aamyaamyaa komce istE, mee phailu twaratwaragaa kadulutumdi." goppa 

rahasyaanni cebutunnaTlu naTistU ceppADu. "aamyamyaanaa, amTE kottarakam sEmyAnA?" atani agnaanaaniki pagalabaDi nawwADu. 

"bApU sinimaalu teleeni abhaagyuDiwi. imTiki weLLi, buddhigaa buddhimamtuDu `ANR` sinmaanu cUDu. mumdu konni paccanOTlu balla kimda numDi naa cEtilO peTTu, caarudattuDu gaarU." 

"EmiTi, nA pEruni mArcEstunnaawu, cArul - simpul" 

"mI peddOLLu peTTina pEruni nuwwu CEmj cEsukumTunnaawu kadA, imka E pEraitEnEmiTi." "hhu" humkarimpuni tippalu paDi, niTTUrpugA mrcEsi, `restore` aDiginamta manee  samarpimcukunnADu. 

"umDamDi, mukkaalu gamTalO, mee pani puurti autumdi." lOpaliki 

weLLADu. I saari tanaki bahuwacanam icci, maryaada iccADu - ani sphuraNaku waccimdi cArul gaariki. baiTiki weLLi hOTalulO hAT hAT kaaphee taagi, caarulataku phOn cEsi, cATim 

cEsAdu. mUDu naalugu gamTalu gaDicaayi. resTOr atani eduTa pratyaksham ayyADu."caarul - anE pEru baanE umdi gaanee, cArudatta anE pEru imkaa baagumTumdi. manasu maari, nEnu ceppina `name` selekT cEsukumTE, eemaaru, mee pheeju 35 parsamT DiskaumT istaanu." 

"tamaru telipina pEruku speshaaliTI EmiTO" ciraakutO keecumani aricADu.

"SUdrakuDu anE mahaakawi - mRcCakaTikam ani samskRta nATakam raasADu. praaceenakaalam, bisi nATikE goppa wiplawa theemutO sTOreeni manaku goppa waramgaa anugrahimcADu ..... "

cArul Ek dammuna wIdhi kosa dAkA parugO parugu. 

"are, akkaDa naa mOpeD unnadE, eTlaa?" 

amtalO atani kaLLaku mirumiTlu istuu, caarulata nilabaDimdi. tanE weLLimdi, mOpeD 

teccimdi. "nEnu akkaDE umTE wADu yaanshiyamT purANAla lisTu amtaa naa cEta baTTI 

paTTimcEwADu." cAru dwayam nawwulatO mOpeD sTArT ayyimdi.

చారుల్ అనబడే నేను .....  [  చారుల్ = క్రిష్ణతులసీ రామవరప్రసాద్ - లవర్ చారులత 

చారుల్ stories ; 1 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గాడిదలు - గజరాజు - CK - 1

క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం  మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,  అంచేత ...