పక్కింట్లో నుండి "బుఱ్ బుఱ్ బుర్ బుర్" శబ్దాలు వినిపిస్తున్నాయి. "ఏమిటా sounds ? " భర్త అడిగిందే తడవుగా "నేను వెళ్ళి చూసొస్తానుండండి" అంటూ కావేరి నడుంకి కొంగు దోపుకున్నది. "అమ్మో, వద్దులే, నాకు తలనొప్పిగా ఉంది. అర్జంటుగా కాఫీ ఇవ్వు." పైడిరాజు భార్యని ఆపగలిగాడు. పక్కింట్లో భార్యా భర్తలు ఎప్పుడూ కీచులాడుకుంటుంటారు, ఇది మామూలే. కాకపోతే కావేరికి తొందరపాటు ఎక్కువ. లేనిపోని గొడవలలో తలదూర్చి, ఏదో ఒక కొత్త సమస్యకు సృష్టికర్త ఔతుంటుంది. అందుకని భార్యామణి దృష్టిని మళ్ళిస్తుంటాడు.
ఈ ఇరుగింటికి ఆ పొరుగిల్లు వారు - కుందనబాల, కాశ్యప్ జంట - 9 నెలలు ఐంది అద్దెకు దిగి. ఇవాళ "తెల్లారింది, లెగండో కొక్కొరొక్కో ..... ' పాటను హమ్ చేస్తూ, బ్రూ కాఫీ చేస్తున్నది కుందనబాల. ఆమె మనసులో నాలుగు రోజుల నుండి మొగుడిపై సందేహం గిరగిరా తిరుగుతున్నది. పైడిరాజు చర్యలపైన ఓ కన్నేసి ఉంచింది. ఐనా అతను దొరకలేదు, సంగతి ఏమిటో అంతు పట్టలేదు. కాశ్యప్ సెల్ల్ టాకింగ్ తన చెవిని పడింది.
"వర్ధని ఇంకా రాలేదు." అని పతిదేవుని పద సారాంశం. 'ఎవరా వర్ధని?' మనసులో బండరాయి పడనేపడింది.
పంచగవ్యం - పంచకూళ్ళ కషాయంలా - ఆమె మనసు లోతులలో ఉండి, ఇప్పుడు గొంతులో రింగా రింగా రోజెస్ ఆడుతున్నది. 'ఇవాళ ఐసా పైసా తేల్చాల్సిందే' కాఫీ కప్పును ధడేల్ మని స్టూలు మీద పెట్టింది.
దు@ఖం కాస్తా ఎక్కిళ్ళ రూపం దాల్చింది. ముక్కు జిర్రున చీదింది. ఈ సౌండ్ ఎఫెక్టునే పైడి దంపతులు విన్నారు. మరేం చేద్దాం, మధ్య గోడ పలచగా కట్టినదాయె
మరి. ఈ అకాల వర్షం ధాటికి నివ్వెరపోయాడు - "ఏమంటున్నావు?" అర్ధం కాక కాశ్యపదేవ్ భ్రుకుటి ముడి వేసాడు. "అమాయకచక్రవర్తులు, ఏమీ తెలీనట్లు ఉండగల మేధావులు. నానీ, మీరే బుద్ధి చెప్పండి."
అప్పుడే వచ్చిన నానీకి అప్పజెప్పింది తీర్పు చెప్పే బాధ్యతని. నిన్ననే నానీ వద్ద్ - ఈ డౌటును వైనవైనాలుగా - వర్ణ వర్ణాలుగా ఆరబోసింది కుందనబాల. "కొంచెం శాంతంగా ఉండమ్మాయ్!" అంటూ నానీ "కాశ్యప బాబూ! అర్ధాంగిని ఇట్లాగ క్షోభ పెట్టవచ్చునా!?" అంటూ సోఫాలో ఆసీనురాలౌతూ, "అమ్మాయ్, మీ కోసం పరిగెత్తుకు వచ్చాను.
గుక్కలో కాఫీ ఐనా పోసుకోలేదు. కొంచెం కాఫీనీళ్ళు ఇవ్వమ్మా." అన్నది.
మొగుడితో వ్యవహారాన్ని అమీతుమీ తేల్చుకోదలచింది కుందన. మధ్యాహ్నానికి - తనకి వంట చేసే ఓపిక ఉంటుందో లేదో అని - టీ కూడా ఎక్కువ చేసిపెట్టుకున్నది. ఎందుకైనా మంచిదని, ఇంత కిచిడీ అన్నాన్ని కూడా వండేసింది. కనుక ఒక్క ఉదటున నానీ ఎదుట కాఫీ కప్పు ప్రత్యక్షం అయ్యింది.
"వర్ధని ఎవరు? ఆమెకి, నీకు ఎన్నాళ్ళుగా స్నేహం!?" ఎట్లాంటి ఉపోద్ఘాతం లేకుండా, డైరెక్టుగా రంగంలోకి దిగింది నానీ. మైకం వచ్చి, సొమ్మసిల్లినంత పని ఔతున్నది కాశ్యప దేవునికి. "వర్ధని - వర్ధమానం - అసలేమీ బోధపడడం లేదండీ, మీరు ఏమంటున్నారో?"
"చూడండి ఆంటీ, నోట్లో వేలు పెడితే కొరకలేనంత ఇన్నొ'సెంట్' మొహంతో ..." "సెంట్ - అత్తర్లు కూడా వర్ధని కుమారికి సప్లై ఇస్తున్నాడా, మీ ఆయన. హవ్వ." "నానీ" కెవ్వు కేక నాలుగు గోడల అవతలికి చేరింది. కావేరి, పైడిరాజు - రెస్టోర్ రాజా - జయశ్రీ - ఆమని - ఇంకా కొంతమంది వచ్చారు. కాస్సేపు వినోదం చూసి, ఆఫీసులకు కొందరు వెళ్ళారు. తక్కిన జనం - సగం మంది ఈ ముచ్చట లోగుట్టు తెలుసుకునేటందుకు ఆగారు. పావుగంట దాకా ఇల్లు రణగొణ యుద్ధం, రామ రావణ యుద్ధం - దృశ్యాలు ఆవిష్కృతం ఐనాయి.
కాశ్యప్ మొబై కాల్ ని అందుకుని, మాట్లాడసాగాడు.
"yes, జీవితవర్ధని, మాకు అసలు చేరలేదు .... " అంటూండగానే కాశ్యప్ దేవ్ కి అప్పుడే తటిల్లత మెరుపులా -
అంతా అర్ధమైంది. "సరే, మీతో రేపు మాట్లాడతాను లెండి, బై." అని చెప్పేసి, కాల్ ఆపేసాడు.
"అటు మొన్న స్టార్ట్ అయిందన్న మాట, తన ముద్దుల పెళ్ళాం మదిలోని రగడ!?" వర్తమానం లింకులోకి వచ్చేస్తూ, నానీ ఇత్యాది ప్రేక్షకవర్గానికి విడమర్చి చెప్పాడు. అప్పుడు అందరికీ అర్ధమైంది, - గతం - వర్తమానం - వర్ధని - భలేగా ఉంది." నవ్వుకుంటూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇంతకీ ఇంత గోల సాగతీత ఎట్లా జరిగింది? ఘలోమీ అనే రుగ్మత - ప్రపంచమంతా వ్యాపించి, అతలాకుతలం చేసింది. ప్రతి ఒక్కరూ - కడలిలో గరికపోచ ఐనా సరే, పట్టుకుని, ఒడ్డుకు చేరే తాపత్రయాలు, ఆయుర్వేదం, హెర్బల్, యునానీ, హోమియో, చిట్కావైద్యాదులు అన్నిటినీ - భూగోళ పర్యంతం పరిశోధనలలో - మునగానాం, తేలానాం - గా ఉంది పరిస్థితి. ఈ కథానాయకుడు కాశ్యప్ - ఒక మందుకు ఆర్డర్ ఇచ్చాడు. ఆ మందుకు బదులు పొరపాటున ఇంకో మందుని కంపెనీ పంపింది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, కాశ్యప్ ఆతృత హిమాలయ శిఖరమంత ఎత్తు పెరిగింది. ఆ ఆయుర్వేదం మెడిసిన్ పేరు - జీవితవర్ధని - మందు నామధేయ ద్వితీయ భాగం మాత్రమే తన మురిపాల wife చెవిలో పడింది. ఇంకేముంది, ఎవరో లేడి - మాయలాడి - మాయలేడి - మాయలో ఈ మహానుభావుడు - పడ్డాడు - అనుకున్నది. అందుకే ఈ రభస .... ; "ఇంత చదువుకుని, ఇంత తొందరపాటు ఏమిటమ్మాయి - డిగ్రీ పట్టాలు సంపాదిస్తున్నారు గానీ - ఏం లాభం, ఆడబుద్ధి ఇంతే అని ఋజువు చేసేసావు కదా" నానీ - తను కూడా స్త్రీ - అని, వెనకా ముందూ ఆలోచించకుండా - జడ్జిమెంట్ ఇచ్చే పదవిని స్వీకరించి, కాశ్యప్ ని ఎడాపెడా జాడించిన సంగతిని అప్పటికప్పుడే గాలిలో కలిపేసింది. "అమ్మాయ్, కప్పు తీసి లోన పెట్టు. చెయ్యి తగిలితే భళ్ళున పగుల్తుంది." అనేసి, "మా ఆయన కాఫీ కాచుకుని ఉంటాడు." భర్త మణయ్య గురించి తలుచుకుంటూ, మెట్లు దిగింది.
కుందన "ఇదిగోండి సార్! నా తప్పుని సాగదీయకండి. మమ మిస్టేకుని ఒప్పుకుంటున్నాను ... " "ఐతే, కాళ్ళ మీద పడి దణ్ణాలు పెట్టి, నన్ను గాభరా పెట్టకు. చిన్న ముద్దు చాలు, అదే గొప్ప పరిహారం." "ప్లస్ ఫలహారం కూడా ఇస్తాను లెండి, చిటికెలో రెడీ." ఒక చుంబనం ఇచ్చింది కుందనబాల.
&
[పాత్రలు ;- కుందనబాల, కాశ్యప్ దేవ్ & కావేరి, పైడిరాజు ; నానీ + రెస్టోర్ రాజా - జయశ్రీ - ఆమని + EXTRA = నానీ భర్త మణయ్య - జీవితవర్ధని అనే మందు బాటిల్] ;
=================,
wardhani wastunnadi ;- pakkimTlO numDi "bu~r bu~r bur bur" Sabdaalu winipistunnaayi.
"EmiTA `sounds ?` " Barta aDigimdE taDawugA "nEnu weLLi cUsostAnumDamDi" amTU kAwEri
naDumki komgu dOpukunnadi.
"ammO, waddulE, naaku talanoppigaa umdi. arjamTugaa kaaphee iwwu." paiDiraaju bhaaryani
aapagaligADu. pakkimTlO bhAryA Bartalu eppuDU keeculADukumTumTAru, idi mAmUlE. kaakapOtE kAwEriki tomdarapATu ekkuwa. lEnipOni goDawalalO taladuurci, EdO oka kotta samasyaku sRshTikarta autumTumdi. amdukani BAryaamaNi dRshTini maLListumTADu.
ee irugimTiki aa porugillu waaru - kumdanabaala, kASyap jamTa - 9 nelalu aimdi addeku
digi. iwALa "tellaarimdi, legamDO kokkorokkO ..... ' pATanu hamm cEstuu, bruu kaaphee
cEstunnadi kumdanabAla. aame manasulO naalugurOjula numDi moguDipai samdEham giragiraa
tirugutunnadi. paiDirAju caryalapaina O kannEsi umcimdi. ainaa atanu dorakalEdu, samgati
EmiTO amtu paTTalEdu. kASyap sell TAkimg tana cewini paDimdi. "wardhani imkA rAlEdu." ani
patidEwuni pada sArAmSam. 'ewaraa wardhani?' manasulO bamDarAyi paDanEpaDimdi.
pamcagawyam - pamcakULLa kashaayamlaa - aame manasu lOtulalO umDi, ippuDu gomtulO rimgaa
rimgaa rOjes ADutunnadi. 'iwALa aisA paisA tElcaalsimdE' kaaphI kappunu dhaDEl mani sTUlu
meeda peTTimdi. du@Kam kaastA ekkiLLa ruupam dAlcindi. mukku jirruna ceedimdi. ee saumD
ephekTunE paiDi dampatulu winnaaru. marEm cEddaam, madhya gODa palacagaa kaTTinadaaye
mari. ee akAla warsham dhATiki niwwerapOyADu - "EmamTunnAwu?" ardham kaaka kASyapadEw
bhrukuTi muDi wEsADu. "amaayakacakrawartulu, Emee teleenaTlu umDagala mEdhAwulu. nAnI,
meerE buddhi ceppamDi." appuDE waccina nAnIki appajeppimdi teerpu ceppE bAdhyatani.
ninnanE nAnI wadd - ee DauTunu wainawainAlugA - warNa warNAlugA ArabOsimdi kumdanabAla.
"komcem SAmtamgaa umDammAy!" amTU nAnI "kASyapa bAbU! ardhAmgini iTlAga kshOBa
peTTawaccunA!?" amTU sOphaalO AsInuraalautU, "ammaay, mee kOsam parigettuku waccaanu.
gukkalO kaaphI ainA pOsukOlEdu. komcem kaapheenILLu iwwammaa." annadi.
moguDitO wyawahaaraanni ameetumee tElcukOdalacimdi kumdana. madhyaahnaaniki - tanaki
wamTa cEsE Opika umTumdO lEdO ani - TI kUDA ekkuwa cEsipeTTukunnadi. emdukainaa
mamcidani, imta kiciDee annaanni kUDA wamDEsimdi.
kanuka okka udaTuna nAnI eduTa kAphI kappu pratyaksham ayyimdi.
"wardhani ewaru? aameki, neeku ennALLugaa snEham!?" eTlAmTi upOdGAtam lEkumDA,
DairekTugaa ramgamlOki digimdi nAnI. maikam wacci, sommasillinamta pani autunnadi kASyapa
dEwuniki. "wardhani - wardhamaanam - asalEmee bOdhapaDaDam lEdamDI, mIru EmamTunnArO?"
"cUDamDi AmTI, nOTlO wElu peDitE korakalEnamta innosemT mohamtO ..." "semT - attarlu kUDA
wardhani kumaariki saplai istunnaaDA, mee aayana. hawwa." "nAnI" kewwu kEka naalugu
gODala awataliki cErimdi. kAwEri, paiDirAju - resTOr rAjA - jayaSrI - Amani - imkaa
komtamamdi waccaaru. kaassEpu winOdam cuusi, aapheesulaku komdaru weLLAru. takkina janam
- sagam mamdi ee muccaTa lOguTTu telusukunETamduku aagaaru.
pAwugamTa dAkA illu raNagoNa yuddham, rAma rAwaNa yuddham - dRSyAlu aawishkRtam ainAyi.
kASyap mobai kaal ni amdukuni, mATlADasAgaaDu. "`yes, ` jeewitawardhani, maaku asalu
cEralEdu .... " amTUmDagAnE kASyap dEw ki appuDE taTillata merupulaa - amtaa ardhamaimdi.
"sarE, meetO rEpu maaTlADatAnu lemDi, bai." ani ceppEsi, kaal aapEsADu.
"aTu monna sTArT ayimdanna mATa, tana muddula peLLAm madilOni ragaDa!?"
wartamaanam limkulOki waccEstU, nAnI ityaadi prEkshakawargaaniki wiDamarci ceppADu.
appuDu amdarikee ardhamaimdi, - gatam - wartamaanam - wardhani - BalEgA umdi." nawwukumTU
ewariLLaku wALLu weLLipOyAru.
imtakee imta gOla saagateeta eTlaa jarigimdi? ghalOmee anE rugmata - prapamcamataa
wyaapimci, atalaakutalam cEsimdi. prati okkaruu - kaDalilO garikapOca ainaa sarE,
paTTukuni, oDDuku cErE tApatrayaalu, aayurwEdam, herbal, yunaanee, hOmiyO,
ciTkaawaidyaadulu anniTinee - BUgOLa paryamtam pariSOdhanalalO - munagaanaam, tElaanaam -
gaa umdi paristhiti. ee kathaanAyakuDu kASyap - oka mamduku aarDar iccADu. aa mamduku
badulu porapATuna imkO mamduni kampenee pampimdi. ArOgyamE mahABAgyam kadaa, kASyap
aatRta himaalaya SiKaramamta ettu perigimdi. aa AyurwEdam meDisin pEru - jIwitawardhani -
mamdu naamadhEya dwiteeya BAgam maatramE tana muripaala `wife` cewilO paDimdi. imkEmumdi,
ewarO lEDi - maayalADi - mAyalEDi - maayalO ee mahaanuBAwuDu - paDDADu - anukunnadi.
amdukE ee rabhasa .... ; "imta caduwukuni, imta tomdarapATu EmiTammAyi - Digree paTTAlu
sampaadistunnaaru gaanee - Em lABam, ADabuddhi imtE ani Rjuwu cEsEsAwu kadA" nAnI - tanu
kUDA stree - ani, wenakaa mumduu aalOcimcakumDA - jaDjimemT iccE padawini
sweekarimci, kASyap ni eDaapeDA jADimcina samgatini appaTikappuDE gaalilO kalipEsimdi.
"ammaay, kappu teesi lOna peTTu. ceyyi tagilitE BaLLuna pagultumdi." anEsi, "maa aayana
kaaphee kaacukuni umTADu." bharta maNayya gurimci talucukumTU, meTlu digimdi. kumdana
"idigOmDi sAr! naa tappuni saagadeeyakamDi. mama misTEkuni oppukumTunnaanu ... " "aitE,
kALLa meeda paDi daNNAlu peTTi, nannu gaaBarA peTTaku. cinna muddu caalu, adE goppa
parihaaram." "plas phalahaaram kUDA istaanu lemDi, ciTikelO reDI." oka cumbanam iccimdi
kumdanabAla.
&
[pAtralu ;- kumdanabAla, kASyap dEw & kAwEri, paiDirAju ; nAnI + resTOr rAjA - jayaSrI -
Amani + extra ;- nAnI bharta maNayya - jeewitawardhani anE mamdu baaTil ]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి