17, మార్చి 2022, గురువారం

అంబర్ చూసిన ఆ దేశం

కుందనబాల గడప వద్ద sudden గా ప్రత్యక్షం అయ్యింది కావేరి - ఆమె కళ్ళు సంతోషంతో మిలమిలా మెరుస్తున్నవి. "కుందనా! మా మేనల్లుడు గ్రహం మీదికి రాకెట్లో వెళ్తాడట. దేశం సైంటిస్టులు - అందరూ పర్మిషన్ ఇచ్చారట. అంగారక గ్రహం చేరి, అక్కడి మట్టిని తెస్తారట."

"రాకెట్ లో ఆకాశంలోకి సర్రున వెళ్ళడమంటే మాటలా!? అబ్బో." కుందనబాల తమ పొరుగింటి కావేరి ఆనందంలో పాలుపంచుకున్నది. "very luckyfellows, great news ఆ పిల్లల పేర్లు ..."  "అంబర్ ప్రసాద్" ఠక్కున చెప్పేసింది, కాశ్యప్ నోట్లో మాట నోట్లో ఉండగానే. 

"నానీ అప్పుడే చెప్పేసారు, అంబర్ బాబుతో కలిసి, గ్రూప్ ఫొటో తీసుకుందాము - అని." గర్వంగా చెప్పేసి, "మా మొబైల్ ఛార్జిలో లేదు. అందుకని, నేనే వెంటనే వచ్చి, మీకిట్లాగ చెప్పేస్తున్నా."  ఛార్జి తక్కువవడం అనేది ఉట్టి సాకు అని శ్రోతలకు తెలుస్తూనే ఉంది ....,

@@@@@ 

రోజూ దినపత్రికలు చదువుతునే ఉంటాము, డైలీ వార్తా ఛానెల్స్ చూస్తూనే ఉంటాం, అన్నిటినీ ఏదో యధాలాపంగా చూస్తున్నాము, అంతే. ఐతే మనకు తెలిసిన వాళ్ళు, బంధు మిత్రులకు సంబంధించిన news విశేషాలు గనుక అయితే, ఎక్కువ దృష్టి పెట్టి వీక్షిస్తాం. అంబర్ ప్రసాద్ కి ఇప్పుడు లభిస్తున్న జనాదరణ, ఆప్యాయత - ఇటువంటి సహజోక్తియే.

అంబర్ కుటుంబసమేతంగా అందరి ఇళ్ళలో అతిథిసత్కారంబులను అందుకున్నాడు. ఆ అబ్బాయి ప్రతి కదలిక - నానీ మొదలైనవారి దృక్కులలో చేరుతునే ఉంది. అందరి ధ్యాస, ధ్యానం అటుకేసే. 

"అంబర్ ప్రసాదు అంగరఖా* పయానం ఇవాళే కదండీ అమ్మగోరూ" కొందరి పనిమనుషులు సైతం ఆసక్తిగా అడుగుతున్నారు. [ *అంగరఖా = *మార్స్ = అదేనండీ అంగారకగ్రహం]

అంబర్ ప్రసాద్ రోదసీ ప్రయాణం - రాకెట్ స్టార్ట్ అవడం, Mars planet ని చేరడం, దిగడం అన్నీ - నేటి అత్యద్భుత టెక్నాలజీ పుణ్యమా అని, ప్రపంచ ప్రజానీకం చూస్తున్నారు. ఇంతలో ఏ కారణం మూలాన్నో ఏమో గానీ - మాధ్యమిక కనెక్షన్స్ కట్ అయ్యాయి. అంబర్ ప్రసాద్ సంబంధీకులు, అతనితో ఉన్న తోటి వారి బంధు మిత్రాదులు - శ్రేయోభిలాషులు యావన్మందీ గాభరా పడసాగారు. 

గడువు పూర్తి అయ్యేసరికి, చిత్రంగా ఆస్ట్రొనాట్స్ సురక్షితంగా స్వగోళం - భూగోళానికి చేరారు. 

@@@@@

ప్రసారసాధనాలు, ఇంటర్ నెట్ మాధ్యమాలు ద్వారా లోకానికి అనేక వింత విషయాలు తెలిసాయి.

ఖగోళ సందర్శనా కథాక్రమంబు ఈ రీతిగా ఉన్నది, అవధరింపుడు ....,

అంబర్ వర్గం అంగరఖా ... సారీ, అంగారకగ్రహం పైన దిగారు. అనుకోకుండా అకస్మాత్తుగా, రాకెట్ కొన్ని సాంకేతిక లోపాలు తటస్థమైనాయి. చేసేదేమీ లేక,అందరూ ముందుకు నడిచారు. అంబర్ స్థితప్రజ్ఞుడు, 

యోగాసనాలు ప్రాక్టీస్ చేసిన యువకుడు. అతని వ్యక్తిత్వం వలన, మిగతావాళ్ళు నిబ్బరంగా ఉండగలిగారు. మొట్ట మొదట వారు భారత పతాకం నిలిపారు. త్రివర్ణ పతాకం వైపు చూస్తూ దేశభక్తితో అందరి మేనులు ఆనందపారవశ్యాన ఉప్పొంగాయి. వారు ముందు తమ తమ targets - అక్కడి మట్టి సేకరణ, భూమి నుండి తాము తెచ్చిన విత్తనాలు అక్కడ నాటడం మున్నగునవి పూర్తి చేసారు.

@@@@@ 

నూతన గ్రహతలం పైన తచ్చాడసాగారు. ఆ కొత్త ప్లానెట్ లో ఇంకా మునుముందుకు సాగుతున్నారు. అక్కడ కొత్త వారు కనిపించారు. వీరిని సాదరంగా ఆహ్వానించారు వారు. సోదరభావంతో కూడిన ఈ స్వాగతం, మనవాళ్ళను సంతోషంలో ఓలలాడేలా చేసింది. అప్పుడు వారికి ఒక వింత దృశ్యం సాక్షాత్కరించింది. అక్కడ కొందరు ఉజ్వల కాంతితో మెరుస్తున్నారు. దేదీప్యకాంతులు విరాజిల్లుతున్న దేహాలు వారివి. వారందరి దోసిళ్ళలో సురభిళ పుష్పాలు ఉన్నాయి. 

ఎన్నో ఏన్నో ఏళ్ళ నుండి అట్లాగే నిలబడి ఉన్నారు - అని, తమను వెంటబెట్టుకుని, బయలుదేరిన అంగారక గ్రహవాసులు - "ముందు సేదదీరండి. నింపాదిగా వివరిస్తాము." అని చెప్పారు. 

@@@@@ 

"ముందు సేదదీరండి. నింపాదిగా వివరిస్తాము." అని చెప్పారు. అదేమిటంటే ....,

అదేమిటంటే ....,

"మా స్వప్నదేశంలో ఉన్న కొన్ని ఆచార సంప్రదాయాలలో ఇది ఒకటి, ...." అప్పటిదాకా ఉభయ జగత్తులు వారికి పరస్పర విశేషాలు అనేకం తెలుసుకున్నారు. 1. స్వప్నదేశం - వారి ప్రాంతం పేరు, - "ఐతే మీరు అంగారక్కం అని మా ఊరిని పిలుస్తున్నారన్న మాట - అని చిరునవ్వులు చిందించారు. 

2. స్వప్నదేశం - నివసిస్తున్న వారు - ఏ భాష ఐనా సరే, చిటికెలో అర్ధం చేసుకోగలుగుతున్నారు. 3. అక్కడివారికి కళ్యాణం వంటి సన్నివేశాలు తెలీవు. అది తెలిసి, వాసంతిక అన్నది, "మా భూమి పైన అమెరికా - కొన్ని కంట్రీస్ లో కొత్త సమాజ వ్యవస్థలు రూపొందుతున్నాయి, మీ మాదిరిగానే అవి ఉంటున్నవి."

స్వప్నదేశం జీవులు, మనుషుల కన్నా ఎక్కువ మేధావులు - అని కొన్ని సంఘటనల మూలాన తేటతెల్లమైంది. ఇక్కడ విందు పానీయాలు గ్రోలి, బ్రేవ్ మని త్రేన్చారు. "ఇది ఏమి విచిత్ర ధ్వని!?" అంటూ వాళ్ళు అచ్చెరువున కిసుక్కున నవ్వారు. తిరిగి వస్తున్నప్పుడు - ఇందాక స్థాణువుల వలె నిలబడిన వారి గురించి అంబర్ ప్రభృతులు క్వశ్చన్ చేసారు. 

నడుస్తూ నడుస్తూ అప్పుడు నెమ్మదిగా చెప్పారు. అదేమిటంటే ....,

@@@@@ 

స్వప్నదేశం జీవులు ఎంతో సౌమ్యత, మంచి సంగతులకు సంతోషంతో ప్రతిస్పందిస్తుంటారు. అనంత విశ్వంలో ఎక్కడ మంచి విశేషం ఉన్నా హర్షాతిరేకం అనుభూతి పొందుతారు. దుష్ట సంఘటనలు జరిగితే భయపడతారు కూడా!" 

మీ ప్రపంచంలో శాంతిని నెలకొల్పగ ల శక్తి కలవారిని మేము సత్కరిస్తాము." "అంటే యుగపురుషులు, యుగ స్త్రీలు - ఔనా!" వాసంతిక ప్రశ్నార్ధకం అది. "మా కంటే నీకే knooledge ఎక్కువ." గ్రూపు మెంబర్ ఒకరి కామెంట్ అది.

"ఏం, మా female కి అంతటి గౌరవం ఇస్తే, మంచిదే కదా!" అంబర్ వారి వాదనలు శృతి మించకుండా ఆపగలిగాడు. 

"సరే, అసలు విషయాన్ని తెలుసుకొందాం, ప్లీజ్." 

@@@@@@@

"మీ భువిలో ఎన్నోమార్లు మేము ఈ పద్ధతి ప్రకారం  పూలజల్లులను కురిపించాము. కానీ ఎందుకనో మరి, ధర్మదేవత నడవలేక చతికిలపడింది. దోసిళ్ళ నిండా నింపుకున్న పువూలు వెదజల్లే సందర్భం మాకు తటస్థపడలేదు. ఈ విధికి బద్ధులై ఉన్న ఈ దివ్యులు - ప్రతిమలకు మల్లే అట్లాగే ఉండిపోయారు. కల్పతరు పరిమళ ప్రసూనాలు - సంఖ్య అంతే ఉన్నది, ఇప్పటికీ." 

"ఐతే, ఇంతకు పూర్వం - మా భూలోకవాసులు - ఎవరి మీద పుష్పవర్షం కురిపించారు?" 

"మీకు తెలుసు కదా! మీకు వేరే చెప్పాలా!?" దివ్యలోక ప్రభలకు మూలం ఐన వారి మందస్మిత సమాధానాలు - అవి, అంతే! తనివితీరా తమకు ఆతిధ్యం ఇచ్చిన వారి అనేక ఫొటోలు భద్రంగా అట్టిపెట్టుకున్నారు.

& రాకెట్ దగ్గరికి వచ్చారు. అక్కడ తమ రాకెట్ ఏ ట్రబుల్ ఇవ్వట్లేదు. అప్పటికే, కొందరు స్వప్నదేశీయులు - తమ నాయకులు పురమాయించగా రాకెట్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేసారు. "అరె, మా రాకెట్ రెపేర్ ఎప్పుడు చేసారు?" 

"ఇందాక భోజనానంతరం బ్రేవ్ మని అబ్బురపు ధ్వని చేసినప్పుడు."

అందరూ వారి సంభాషణల హాస్యాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఇదే Dialogue ఇంకొక Timeలో వస్తే, 'మమ్మల్ని ఎగతాళి చేస్తున్నావు." అంటూ తగాదా పెట్టుకునేవారు. ఇక్కడి వాతావరణ మహిమ ఒసగిన చక్కని ఫలితం ఇది. 

@@@@@ 

"మన earth కి చేరగానే - వాసంతికా పరిణయ శుభలేఖలు మనకు అందుతాయి." "కాబోయే వరుడు ఎవరోయీ." "మరీ, నోట్లో వేలు పెడితే కొరకలేనంత బుచ్చబ్బాయ్ కదూ నువ్వు!?" "మన అంబర్" 

ఇంకొకతను సందేహ నివృత్తి చేసాడు. 

స్వప్నజగతి గాలి మహిమ అదే కాబోలు, వాసంతిని ఇంతకు ముందు - వక్రదృష్టితో చూసినవాళ్ళకి కూడా - ఇప్పుడు మనసులలో వైషమ్యాలు, కల్మషాలు మచ్చుకైనా కనిపించడం లేదు. 

కొసమెరుపు ;- space station, ఆస్ట్రొనాట్స్ - స్వగృహాలకు చేరుకున్నారు. ప్రెస్ - రెపోర్టర్లు - రీసర్చ్ - సైంటింస్టులు - మొదలుకుని, సాధారణ ప్రజల దాకా అందరికీ ఒకటే ఉత్కంఠ, అదే ఉత్కంఠభరితంగా ఉన్న మన ఖగోళ వీరులు - అన్నిటినీ పూసగుచ్చినట్టు చెప్పారు. "ఫొటోలు చూపించండి." అందరికీ ఆతృత, జిజ్ఞాస ...., బాక్సులు తెరిచి, కెమేరాలు బైటికి తీసారు. కానీ, వాటిలో తమ వదనారవిందాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి, తాము ఇప్పటిదాకా వీళ్ళందరికీ - voice నొప్పి పుట్టేలా  వర్ణనాత్మకంగా చెప్పిన - ఆ గ్రహవాసుల ముఖాలు అచ్చు పడలేదు. 

"ఇదేమిటి, స్వప్నదేశ గ్రహం వాళ్ళ బొమ్మలకు గ్రహణం పట్టిందా, ఏమిటి!!?" 

వీళ్ళు చూసామని చెబుతున్న స్వప్నదేశంలో ఉన్నవాళ్ళు - అద్భుతాలు - అన్నీ కట్టుకథలు. మనకి లేనిపోనివన్నీ కల్పించి చెప్పారు - అని అనుకున్నారు, 

"ఈ విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు. తమ నమ్మకం విశ్వాసం - మూఢత్వం స్థాయికి చేర్చిన ఇటువంటి తమాషా పరిస్థితిని - ఏమని పిలవాలో వాళ్ళకు బోధపడలేదు. 

@@@@@@, 

వాసంతిక, అంబర్ పెళ్ళికార్డును మెచ్చుకుంటూ, మిత్రులు అన్నారు,

"భాసో*, కంచికి దారిని వెదుకుదాం."  "అదేంటి, ఎందుకు?"

"మనం చెప్పిన matters అందరికీ బూటకం లాగా అనిపిస్తున్నది కదా. కంచికి చేర్చేద్దాం, ఈ స్టోరీ క్లైమాక్సుని." 

& భాసో* = భారతీయ సోదరా *  &  [పాత్రలు ;- కావేరి - మేనల్లుడు అంబర్ ప్రసాద్ & కుందనబాల - కాశ్యప్ - నానీ - అంబర్ & వాసంతిక & రాకెట్ స్నేహితులు - స్వప్నదేశ నివాసులు ]

====================,

ambar cuusina aa dESam ;- kumdanabAla gaDapa wadda `sudden` gaa pratyaksham ayyimdi kAwEri - aame kaLLu samtOshamtO milamilaa merustunnawi. "kumdanaa! maa mEnalluDu graham meediki raakeTlO weLtaaDaTa. dESam saimTisTulu - amdaruu parmishan iccaaraTa. amgaaraka graham cEri, akkaDi maTTini testaaraTa." 

"raakeT lO aakaaSamlOki sarruna weLLaDamamTE mATalA!? abbO." kumdanabaala tama porugimTi kaawEri aanamdamlO paalupamcukunnadi. "`very luckyfellows, great news` aa pillala pErlu ..." "ambar prasaad" Thakkuna ceppEsimdi, kASyap nOTlO mATa nOTlO umDagAnE. 

"naanee appuDE ceppEsaaru, ambar baabutO kalisi, gruup phoTO teesukumdaamu - ani." 

garwamgaa ceppEsi, "maa mobail CaarjilO lEdu. amdukani, nEnE wemTanE wacci, meekiTlAga ceppEstunnA.

CArji takkuwawaDam anEdi uTTi sAku ani SrOtalaku telustUnE umdi ....,

@@@@@ 

2] rOjuu dinapatrikalu caduwutunE umTAmu, Dailee waartaa CAnels cuustuunE umTAm, 

anniTinI EdO yadhaalaapamgA cUstunnaamu, amtE. aitE manaku telisina wALLu, bamdhu mitrulaku sambamdhimcina `news` wiSEshaalu ganuka ayitE, ekkuwa dRshTi peTTi weekshistAm. 

ambar prasaad ki ippuDu labhistunna janAdaraNa, Apyaayata - iTuwamTi sahajOktiyE.

ambar kuTumbasamEtamgaa amdari iLLalO atithisatkaarambulanu amdukunnADu. aa abbAyi prati kadalika - nAnI modalainawaari dRkkulalO cErutunE umdi. amdari dhyaasa, dhyaanam aTukEsE. 

"ambar prasAdu amgaraKA* payaanam iwALE kadamDI ammagOrU" komdari panimanushulu saitam 

aasaktigaa aDugutunnAru. [*maars adEnamDI amgaarakagraham]

ambar prasAd rOdasee prayANam - raakeT sTArT awaDam, `Mars planet` ni cEraDam, digaDam annee - nETi atyadbhuta Teknaalajee puNyamaa ani, prapamca prajaaneekam cuustunnaaru. 

imtalO E kaaraNam muulaannO EmO gaanI - maadhyamika kanekshans kaT ayyaayi. ambar prasAd 

sambamdheekulu, atanitO unna tOTi waari bamdhu mitraadulu - SrEyOBilaashulu yaawanmamdee gABarA paDasAgAru. 

gaDuwu puurti ayyEsariki, citramgaa aasTronATs surakshitamgaa swagOLam - BUgOLAniki cErAru. 

@@@@@

prasaarasaadhanaalu, imTar neT maadhyamaalu - dwaaraa lOkaaniki anEka wimta wishayAlu telisaayi.

khagOLa samdarSanaa kathaakramambu ee reetigaa unnadi, awadharimpuDu ....,

ambar wargam amgaraKA ... saaree, amgArakagraham paina digaaru. anukOkumDA akasmaattugaa, 

raakeT konni sAmkEtika lOpaalu taTasthamainaayi. cEsEdEmI lEka,amdaruu mumduku naDicAru. 

ambar sthitaprajnuDu, yOgaasanaalu praakTIs cEsina yuwakuDu. atani wyaktitwam walana, 

migataawaaLLu nibbarmgaa umDagaligaaru. moTTa modaTa wAru BArata pataakam nilipaaru. 

triwarNa pataakam waipu cuustuu dESaBaktitO amdari mEnulu aanamdapaarawaSyaana 

uppomgaayi.

waaru mumdu tama tama `targets` - akkaDi maTTi sEkaraNa, BUmi numDi taamu teccina 

wittanaalu akkaDa nATaDam munnagunawi puurti cEsaaru.

@@@@@ 

nUtana graha talam paina taccADasAgaaru. A kotta plAneT lO imkA munumumduku sAgutunnAru. 

akkaDa kotta waaru kanipimcaaru. waaru weerini saadaramgaa aahwaanimcaaru. sOdaraBAwamtO 

kUDina ee swaagatam, manawaaLLanu samtOshamlO OlalADElA cEsimdi. 

appuDu wAriki oka wimta dRSyam sAkshAtkarimcimdi. akkaDa komdaru ujwala kaamtitO 

merustunnaaru. dEdeepyakaamtulu wiraajillutunna dEhaalu waariwi. waaramdari dOsiLLalO 

suraBiLa pushpaalu unnaayi. ennO EnnO ELLa numDi aTlAgE nilabaDi unnAru - ani, tamanu 

wemTabeTTukuni, bayaludErina amgaaraka grahawaasulu "mumdu sEdadeeramDi. nimpaadigaa wiwaristaamu." ani ceppaaru.

"maa swapnadESamlO unna konni aacaara sampradaayaalalO idi okaTi, ...." appaTidaakaa ubhaya jagattulu waariki paraspara wiSEshaalu anEkam telusukunnaaru. 1. swapnadESam - 

waari praamtam pEru, - "aitE meeru amgaarakkam ani maa uurini pilustunnaaranna mATa - ani cirunawwulu cimdimcaaru. 2. swapnadESam - niwasistunna waaru - E BAsha ainaa sarE, 

ciTikelO ardham cEsukOgalugutunnaaru. 3. akkaDiwaariki kaLyANam wamTi sanniwESaalu teleewu. adi telisi, waasamtika annadi, "mA BUmi paina amerikaa - konni kamTrees lO kotta 

samaaja wyawasthalu ruupomdutunnaayi, mee maadirigaanE awi umTunnawi."

swapnadESam jeewulu, manushula kannaa ekkuwa mEdhaawulu - ani konni samGaTanala muulaana tETatellamaimdi. ikkaDa wimdu paanIyAlu grOli, brEw mani trEn caaru. "idi Emi wicitra dhwani!?" amTU waaLLu acceruwuna kisukkuna nawwaaru. tirigi wastunnappuDu - imdaaka 

sthANuwula wale nilabaDina waari gurimci ambar praBRtulu kwaScan cEsAru. naDustuu naDustU

appuDu nemmadigaa ceppaaru. adEmiTamTE ....,

@@@@@ 

swapnadESam jeewulu emtO saumyata, mamci samgatulaku samtOshamtO pratispamdistumTAru. 

anamta wiSwamlO ekkaDa mamci wiSEsham unnaa harshaatirEkam anubhuuti pomdutaaru. dushTa 

samghaTanalu jarigitE BayapaDatAru kUDA!" 

mee prapamcamlO SAmtini nelakolpaga la Sakti kalawaarini mEmu satkaristaamu." "amTE yugapurushulu, yuga streelu - aunA!" wAsamtika praSnArdhakam adi. "maa kamTE neekE 

`knowledge` ekkuwa." gruupu membar okari kaamemT adi.

"Em, maa `female` ki amtaTi gaurawam istE, mamcidE kadA!" ambar waari waadanalu SRti mimcakumDA ApagaligADu. 

"sarE, asalu wishayaanni telusukomdaam, pleej."

"mee bhuwilO ennOmaarlu mEmu ee paddhati prakaaram - puulajallulanu kuripimcaamu. 

kaanee emdukanO mari, dharmadEwata naDawalEka catikilapaDimdi. dOsiLLa nimDA nimpukunna 

puwuulu wedajallE samdarbham maaku taTasthapaDalEdu. ee widhiki baddhulai unna ee diwyulu 

- pratimalaku mallE aTlaagE umDipOyaaru. kalpataru parimaLa prasuunaalu - samkhya amtE 

unnadi, ippaTikI." 

"aitE, imtaku puurwam - maa BUlOkawaasulu - ewari meeda pushpawarsham kuripimcaaru?" 

"meeku telusu kadA! mIku wErE ceppAlA!?" diwyalOka prabhalaku muulam aina waari 

mamdasmita samaadhaanaalu - awi, amtE!

taniwiteeraa tamaku aatidhyam iccina waari anEka phoTOlu - bhadramgaa aTTipeTTukunnAru.

& rAkeT daggariki waccaaru. akkaDa tama raakeT 

E Trabul iwwaTlEdu. appaTikE, komdaru swapnadESIyulu - tama naayakulu puramaayimcagaa 

rAkeT daggariki weLLi ripEr cEsaaru. "are, maa rAkeT repEr eppuDu cEsAru?" "imdaaka 

BOjanaanamtaram brEw mani abburapu dhwani cEsinappuDu."

amdaruu waari samBAshaNala haasyaanni aaswaadistunnaaru.

idE `Dialogue` imkoka `Time`lO wastE, 'mammalni egatALi cEstunnAwu." amTU tagaadaa 

peTTukunEwAru. ikkaDi waataawaraNa mahima osagina cakkani phalitam idi.

"mana `earth` ki cEragaanE - wAsamtikaa pariNaya SuBalEKalu manaku amdutaayi." 

"kaabOyE waruDu ewarOyI." "maree, nOTlO wElu peDitE korakalEnamta buccabbaay kadU 

nuwwu!?" "mana ambar" imkokatanu samdEha niwRtti cEsADu. 

swapnajagati gaali mahima adE kaabOlu, wAsamtini imtaku mumdu - wakradRshTitO 

cUsinawALLaki kUDA - ippuDu manasulalO waishamyaalu, kalmashaalu maccukainaa kanipimcaDam lEdu. 

kosamerupu ;- `space station`, AsTronATs - swagRhaalaku cErukunnaaru. pres - repOrTarlu - 

reesarc - saimTimsTulu - modalukuni, saadhaaraNa prajala daakaa amdarikee okaTE utkamTha, 

adE utkamThabharitamgaa unna mana KagOLa wIrulu - anniTinee puusaguccinaTTu ceppaaru. 

"phoTOlu cuupimcamDi." amdarikee AtRta, jijnaasa ...., baaksulu terici, kemEraalu baiTiki 

teesaaru. kaane, wATilO tama wadanaarawimdaalu prashpuTamgaa unnaayi, taamu ippaTidaakaa 

weeLLamdarikI - `voice` noppi puTTElA  warNanaatmakamgaa ceppina - aa grahawaasula 

mukhaalu accu paDalEdu. "idEmiTi, swapnadESa graham wALLa bommalaku grahaNam paTTimdaa, 

EmiTi!!?" 

weeLLu cuusaamani cebutunna swapnadESamlO unnawALLu - adbhutaalu - annee kaTTukathalu. 

manaki lEnipOniwannI kalpimci ceppaaru." ee wishayaanni ewaruu nammaDam lEdu. 

tama nammakam wiSwaasam - muuDhatwam sthaayiki cErcina iTuwamTi tamaashaa paristhitini - 

Emani pilawaalO waaLLaku bOdhapaDalEdu. waasamtika, ambar peLLikaarDunu meccukumTU, 

mitrulu annaaru, "BAsO*, kamciki daarini wedukudAm" "adEmTi, emduku?"

"manam ceppina `matters` amdarikee bUTakam lAgaa anipistunnadi kadaa. kamciki cErcEddAm, 

ee sTOree klaimaaksuni." ;

& BAsO* = BArateeya sOdaraa * &

[pAtralu ;- kAwEri - mEnalluDu ambar prasAd & kumdanabAla - kASyap - nAnI - ambar & 

wAsamtika & rAkeT snEhitulu - swapnadESa niwaasulu ] ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గాడిదలు - గజరాజు - CK - 1

క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం  మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,  అంచేత ...