జయశ్రీ మేనత్త సుబ్బులక్ష్మి - చిన్న గ్రూపుని కూడగట్టింది. సుబ్బులక్ష్మి గుళ్ళు గోపుర సందర్శనాలు - సాధు దర్శనం - ఇత్యాది వేదాంత కార్యక్రమాలను ఆసక్తికరంగా మలచగలుగుతున్నది. సుబ్బులక్ష్మి గారికి పుట్టుకతో వచ్చిన సహజ ఆసక్తి ఇది, కనుకనే - ఇటువంటి టూర్లు - ఆమె ఆధ్వర్యాన జయప్రదంగా నడుస్తున్నాయి. డజను మంది group ను తన వెంట తెచ్చింది. మామూలుగా - చిన్న హోటల్స్ లో బస చేస్తారు,
కానీ పవిత్ర కృష్ణా నది పుష్కరములు అవడంతో ఎక్కడా సత్రాలు లాంటివి కూడా దొరకలేదు. తప్పనిసరై, జయశ్రీ ఇంటికి మందీ మార్బలంతో వచ్చింది. ఐతే ఆమె దగ్గర గొప్ప ప్లస్ పాయింట్ ఉన్నది, ఎక్కడా డబ్బు ఖర్చు దగ్గర పీనాసితనం లేదు, జయశ్రీ - వంటి తెలిసిన ఇళ్ళలో దిగినప్పటికీ - ఎంత ఖర్చు ఔతుందో లెక్క చూసి, అంతకంటే కొంత ఎక్కువ డబ్బు ఇస్తుంది. అట్లాగే వంటవారు, చేతికింద చిన్న పొన్న పనులకు, పనివాళ్ళను - తెచ్చుకుంటుంది. అందుకనే ఆమె వస్తే ఎవరూ ముఖం చిట్లించరు. సుబ్బులక్ష్మమ్మ రాక - సాధారణంగా - సాధారణ మధ్య తరగతి కుటుంబ యజమానులకు సంతోషదాయిని ఔతుంది.
**** **** **** ;
"నానీ, మా నిరంజన్ నాటకం వేస్తున్నాడు." అమితానందంతో చెప్పింది మాలిని.
"నేనెప్పుడో చెప్పాను కదా, నీ కొడుకు డాన్సులు బాగా చేస్తాడు అని. ఎప్పుడు, ఎక్కడ?" నానీ మెచ్చుకుంటూ, వివరాలు అన్నీ తెలుసుకున్నది. జయశ్రీ నుండి కాలనీలో వాళ్ళందరికీ ఈ సమాచారం చేరింది. జయశ్రీ, సుబ్బులక్ష్మి వెంట వచ్చిన వారిలో ముగ్గురు -
"మాలినీ పుత్రా నిరంజనా, నువ్వు వెయ్యబోతున్న వేషం ఏమిటి, చూపించు" అంటూ హుషారు తెచ్చారు.
మిద్దె పైన నిరంజన్, ఫ్రెండ్స్ వేయబోతున్న డ్రామా ప్రాక్టీస్ - ఈ కొత్త ప్రేక్షకుల వలన జోష్ పెరిగి, కొనసాగుతున్నది. వారం తర్వాత - శ్రీరాముల కోవెలలో - ప్రదర్శనకు - కిటకిటలాడుతున్న జనం. మధ్యాహ్నం ముందే వచ్చేసిన ఏడుగురు - నిరంజనానికి, తతిమ్మా నటీ నటులకు మేకప్ చేయడం మొదలెట్టారు. హైస్కూలు చదువుల గురించి, సిలబస్ గురించి మాటలలో తెలుసుకున్నది, సుబ్బులక్ష్మి టూరింగ్ గ్రూపు మెంబర్ శ్రీరమణి, ఆమె ఒరిస్సాలో ప్రభుత్వ పాఠశాల టీచర్. నిరంజన్ ఒక సన్యాసి వేషం వేస్తున్నాడు, కాషాయం రంగు డ్రస్సులను మాలిని తెచ్చిఉంచింది.
"గోల్డ్ స్పాట్ కలర్ పంచె, భలే బాగుంది." అన్నది అనితాదేవి.
"గోల్డ్ స్పాట్ రంగు అంటే ... ?" నిరంజన్ గ్రూపు అమ్మాయి సుగుణవల్లి డౌట్ -
"ఈ కాలం వాళ్ళకి ఎట్లా అర్ధం అయ్యేలా చెప్పగలం!? అది మా చిన్నప్పుడు అనగా అనగా రోజుల నాటి కూల్ డ్రింక్." ఫక్కున నవ్వింది నానీ - "సర్లెండి, కబుర్లతో కాలక్షేపం చాలు, వేగిరం వీళ్ళ దుస్తులు, బొట్లు పూర్తి చేయండి" అన్నది.
"రమణీ, సాధువులకి దండ కమండలాలు కావాలి కదా. ఏవీ?" మాలిని మూడు కర్రలకు - పేపర్లు చుట్టి అతుకులు పెట్టి "టి" ఆకారం రెడీ చేసింది. T - shape సాధించిన ఆమెని మెచ్చుకున్నది గౌరి.
"నిరూ బాబు టీకు టాకుగా ముస్తాబు అయ్యాడు." నానీ కామెంట్.
"ఇక కమండలం చేతికి ఇస్తే సరిపోతుంది, మన సాధు పంత్ మహారాజ్ గారికి." శ్రీరమణి అన్నది. అప్పుడు, గమనిక వచ్చి, మాలిని గాభరా పడసాగింది.
"అరరే, అది మర్చిపోయానండీ" ఇప్పుడు అందరి ప్రశ్నలు, సమాధానాలు, వ్యాఖ్యానాలు - కలగాపులగంగా - సౌండిస్తున్నాయి.
నానీ "మా ఇంట్లో అట్లాంటి వస్తువు ఒకటి - అటక మీదున్నది." అని, కొందరు పిల్లలతో - ఆటోలో తన ఇల్లు చేరింది. అటక పైన ఉన్న ఇత్తడి పాత్రను కనుగొన్నారు. ఏళ్ళ తరబడి మకిలి పట్టి ఉన్నదాయిరి, పావు కిలో చింతపండు వాడితే గానీ - ఆ మురికి వదల్లేదు. ఇప్పుడు తళ తళలాడుతున్న ఆ ఇత్తడి వస్తువును - గుళ్ళో మేకప్ ఉమన్ - శ్రీరమణికి ఇచ్చింది.
"ఇదేమిటి నానీ?"
"కెటిల్ అమ్మాయీ! నిఖార్స్ ఐన ఇత్తడి కేటిల్ - మా ఇంటికి దొరలు వస్తే, దీంట్లో నుండే కాఫీ - కప్పులలోకి వంచి, ఇచ్చే వాళ్ళం."
నానీ - తమ ఇంటికి తెల్లదొరలు వచ్చారు - అనే గొప్ప విశేషాన్ని -
ఈ పగిదిని, సందర్భం దొరకబుచ్చుకుని, యావన్మందికీ చెప్పేసింది.
"సరేనండీ, కానీ కెటిల్ - ఏ కోశానా కమండలం అవదు కదా."
"ఐతే, నువ్వు చెప్పిన కమండలం, బైట షాపులలో దొరుకుతుందా!?"
"నిజమే, ఈ భూమండలంలో దొరకదు నానీ." అనితాదేవి ఒప్పుకున్నది.
**** **** **** ;
నిన్న, మొన్న కృష్ణా స్నానాలు చేసివచ్చారు అందరూ. సుబ్బులక్ష్మి అప్పటికప్పుడు -
మళ్ళీ రేవుకి మాలినితో వెళ్ళింది. సుబ్బులక్ష్మి నది గట్టున కూర్చున్న -
సాధువులు కొందరికి, పళ్ళు ఫలాలు ఇచ్చి, ఆశీర్వాదాలు అందుకున్నది.
ఒక సాధువును మాలిని గుర్తు పట్టింది. అతను తమ ఊరి మనిషి ...,
"మీరు కొండల్రావు కదూ." మాలిని క్వశ్చను అతణ్ణి బెదరగొట్టింది. పేకాట వ్యసనం - ఓడిపోయి,
అప్పులలో మునిగిపోవడం, దారి తెన్ను కానరాలేదు, తనూ, వీరాస్వామి, రంగన్న -
ఊరి నుండి పారిపోయారు. గత్యంతరం లేక - సన్యాసులలో కలిసారు.
సాధు జీవనం - వారి వ్యక్తిత్వాలు - మేలు బాటలో నడిచేటట్లు మలిచింది.
సుబ్బులక్ష్మి వచ్చిన పనిని గుర్తుచేసింది - దాంతో మాలిని
అప్రస్తుతాన్ని వదిలి, ప్రస్తుతంలోకి వచ్చేసింది.
"కొండయ్యా, మాకు ఒక వస్తువు కావాలి."
"నా ప్రస్తుత నామం ధ్యాన గురుస్వామి అమ్మా!" అంటూ గుర్తు చేసాడు పూర్వ నామధేయ కొండలరావు,
కొంచెం లోగొంతుకలో.
"సరేనండీ, తపస్వి అయినాక, పేర్లు మార్చేస్తారంట కదా, I forget సారీ, ఏమీ అనుకోకండి."
సుబ్బులక్ష్మి కూడా మళ్ళీ క్షమాపణలు చెప్పింది, అప్పటికి పరిస్థితి గాడిన పడింది.
"మాకు కమండలం అర్జంటుగా కావాలి స్వామీ, మీరు పెద్ద మనసు చేసుకుని, ఇవ్వండి." అంటూ బ్రతిమాలారు. అరగంట సేపు వీరి విన్నవింపులు, వారి మొహమాట ధర్మ మీమాంసలు సాగాయి.
కొసకు తప్పనిసరి ఐ, కొండల్రావు - సారీ, ధ్యాన గురుస్వామి అనేక షరతులు విధించి, వారికి వస్తువుని ఇచ్చాడు. మొత్తానికి - కార్యసాధకులు - అని - ప్రాంతీయ బిరుదులను - నానీ, తదితరులు అనుగ్రహించారు ఈ మహిళలకు.
**** **** **** ;
వేదికపైన మన బాలల నాటకం అద్భుతః, & కమండలం గాలింపుకు - వీరు పడిన అవస్థలు,
చేసిన అలుపెరుగని సాహసాలు ఆ నోటా ఆ నోటా అందరికీ తెలిసి, చెప్పుకుంటూ నవ్వుకోసాగారు.
నిర్వాహకులు కూడా - వీరి కష్టానికి ప్రత్యేక బహుమతిని, క్రిక్కిరిసిన సభలో ఇచ్చారు.
**** **** **** ;
మాలినితో పాటు, నానీ - మిగతా వారు - కలిసి పెద్ద సమూహమే - తయారైంది, అందరూ - గుడికి వెళ్ళారు. సాధువులను కలిసి మాట్లాడారు, సెల్ఫీలు తీసుకున్నారు.
నానీ, ఇతర సందర్శకులలో కొందరు - ఈ ముగ్గురు సాధువులను తమ ఊళ్ళకు ఆహ్వానించారు.
కాలం చేసే గమ్మత్తులు కొన్ని, మంచి పరిణామాలను ఏర్పరచి, మంచి గుర్తులుగా గుర్తుండటం - జరుగుతూంటుంది.
"మీరు చేసే తపస్సు మా ఊరికి శ్రీరామరక్ష." అంటూ ప్రజలు ఆశ్రమాలు కట్టించి ఇచ్చారు.
**** **** **** ;
ఈ మార్పుకు అసలైన హేతువులు కొన్ని ఉన్నాయి.
హిందూ ధర్మం అనుసరణలు - ఇందువలన - కోవెలలో కొలువైన దేవీ దేవతలకు విలువైన ఆభరణాలు, సంపద ఏర్పడుతున్నవి. అందువలననే భక్తులను - గర్భగుడిలోనికి ప్రవేశం నిషేధం. పూజారుల భుజస్కంధాల మీద - ట్రస్టీలకు - రక్షణ బాధ్యత పడుతున్నది. కాపలాదార్లు, వాచ్ మెన్స్ - ఈ రోజులలో దొరకడం లేదు. గ్రామాలు, చిన్న చిన్న గుళ్ళు - ఇటువంటి జీతభత్యాలను - అధికంగా ఖర్చు చేయగల స్థోమత ఉండదు.
సన్యాసులు, ముముక్షువులు - ప్రాచీనా కమ్యూనిజం వ్యవస్థ - ప్రతీకలు ...,
వీరికి ఆస్థులు, సంపదలు - స్వంతానికి నిలవ ఉంచుకోవడం - నిషేధం. నిష్కామంగా ఉండడం అనేది -
వారికి స్వయంగా విధించుకున్న కఠిన నియమావళి,
అందువలన - అటు ఆలయాలకు, ఇటు తమ ఊరికి తాయెత్తులు, రక్షరేకులు ఔతారు,
అందుకనే పల్లెటూరు, ఊళ్ళవాళ్ళు - సమర్ధమైన, నిజమైన యోగులకోసం - అన్వేషణ చేస్తుంటారు.
ఆ క్రమంలో - ఈ నూతన త్రయ యోగులు - ధ్యాన గురుస్వామి [= కొండల్రావు] , వీరాస్వామి, రంగన్న -
మూడు ప్రదేశాలలో - తమ నవీన ఆశ్రమ నామాలతో - స్థిరపడ్డారు.
ప్రజలకు తమ ఉపదేశాలను ఇస్తున్నారు,
తమకు చేతనైనంతలో - సంఘంలో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు.
కొండయ్య ఉరఫ్ ధ్యాన గురుస్వామి - మిలమిలా మెరుస్తున్న తన కమండలం చూస్తూ
అనుకుంటుంటాడు అప్పుడప్పుడు -
"ఇంత చిన్న వస్తువు, నా జీవితాన్ని ఇంత మలుపు తిప్పింది, ఆహా!" ;
**** **** **** ;
& పాత్రలు ;- మాలిని son - నిరంజన్ - నిరంజన్ గ్రూపు girl సుగుణవల్లి & జయశ్రీ, జయశ్రీ మేనత్త సుబ్బులక్ష్మి ; + , సుబ్బులక్ష్మి వెంట వచ్చిన వారు ladies ;- ఒరిస్సాలో ప్రభుత్వ పాఠశాల టీచర్ శ్రీరమణి [మేకప్ ఉమన్ ] - గౌరి & నానీ - అనితాదేవి &
సాధువులు ముగ్గురు - కొండల్రావు [ = ధ్యాన గురుస్వామి] , వీరాస్వామి, రంగన్న ] ;- &
ఇంత కమండలం అంత పని చేసింది ;- కథానిక ;
====================================,
imta kamamDalam amta pani cEsimdi ;- kathaanika ;- story ;-
jayaSree mEnatta subbulakshmi - cinna gruupuni kUDagaTTimdi. subbulakshmi
guLLu gOpura samdarSanaalu - saadhu darSanam - ityaadi wEdaamta kaaryakramaalanu
aasaktikaramgaa malacagalugutunnadi. subbulakshmi gaariki puTTukatO waccina @@ sahaja
aasakti idi, kanukanE - iTuwamTi TUrlu - aame aadhwaryaana jayapradamgaa naDustunnaayi.
Dajanu mamdi `group` nu tana wemTa teccimdi. mAmuulugA - cinna hOTals lO basa cEstAru,
kAnI kRshNa pushkaramulu awaDamtO ekkaDA satrAlu lAmTiwi kUDA dorakalEdu. tappanisarai, jayaSrI imTiki mamdee maarbalamtO waccimdi. aitE aame daggara goppa plas paayimT unnadi,
ekkaDA Dabbu kharcu daggara peenaasitanam lEdu, jayaSrI - wamTi telisina iLLalO
diginappaTikI - emta kharcu autumdO lekka cuusi, amtakamTE komta ekkuwa Dabbu istumdi.
aTlAgE wamTawaaru, cEtikimda cinna ponna panulaku, paniwaaLLanu - teccukumTumdi. amdukanE Ame wastE ewaruu mukham ciTlimcaru. subbulakshmamma raaka - saadhaaraNamgaa - saadhAraNa madhya taragati kuTumba yajamaanulaku samtOshadaayini autumdi.
**** **** **** ;
"naanee, maa niranjan nATakam wEstunnADu." amitaanamdamtO ceppimdi mAlini.
"nEneppuDO ceppAnu kadA, nee koDuku DAnsulu baagaa cEstADu ani. eppuDu, ekkaDa?"
nAnI meccukumTU, wiwaraalu annee telusukunnadi. jayaSree numDi kaalaneelO waaLLamdarikI ee samaacaaram cErimdi. jayaSrI, subbulakshmi wemTa waccina waarilO mugguru - "mAlinI putrA niranjanaa, nuwwu weyyabOtunna wEsham EmiTi, cUpimcu" amTU hushaaru teccaaru.
midde paina niranjan, phremDs wEyabOtunna DrAmA praakTIs - ee kotta prEkshakula walana
jOsh perigi, konasaagutunnadi. waaram tarwaata - SrIraamula kOwelalO - pradarSanaku -
kiTakiTalADutunna janam.
madhyaahnam mumdE waccEsina EDuguru - niramjanaaniki, tatimmaa naTI naTulaku mEkap
cEyaDam modaleTTAru. haiskuulu caduwula gurimci, silabas gurimci mATalalO telusukunnadi,
subbulakshmi TUrimg gruupu membar SreeramaNi, aame orissaalO prabhutwa pAThaSAla TIcar.
niramjan oka sanyAsi wEsham wEstunnADu, kaashaayam ramgu Drassulanu mAlini tecciumcimdi.
"gOlD spAT kalar pamce, BalE baagundi." annadi anitAdEwi. "gOlD spAT ramgu amTE ... ?" niramjan gruupu ammaayi suguNawalli DauT - "I kaalam wALLaki eTlaa ardham ayyElA ceppagalam!? adi maa cinnappuDu anagaa anagaa rOjula naaTi kuul Drimk." phakkuna nawwimdi nAnI - "sarlemDi, kaburlatO kAlakshEpam caalu, wEgiram wILLa dustulu, boTlu puurti cEymDi" annadi.
"ramaNI, saadhuwulaki damDa kamamDalaalu kaawaali kadaa. EwI?" maalini mUDu karralaku - pEparlu cuTTi atukulu peTTi "Ti" aakaaram reDI cEsimdi. `T - shape` saadhimcina aameni meccukunnadi gauri.
"niruu baabu TIku TAkugA mustaabu ayyADu." nAnI kaamemT. "ika kamamDalam cEtiki istE saripOtumdi, mana saadhu pamt mahaaraaj gaariki." SrIramaNi annadi. appuDu, gamanika wacci, maalini gABarA paDasAgimdi. "ararE, adi marcipOyAnamDI" ippuDu amdari praSnalu, samaadhaanaalu, wyAKyAnAlu - kalagaapulagamgaa - saumDistunnAyi.
nAnI "maa imTlO aTlaamTi wastuwu okaTi - aTaka mIdunnadi." ani, komdaru pillalatO - ATOlO tana illu cErimdi. aTaka paina unna ittaDi paatranu kanugonnaaru. ELLa tarabaDi makili paTTi unnadaayiri, paawu kilO cimtapamDu wADitE gAnI - aa muriki wadallEdu. ippuDu taLa taLalADutunna aa ittaDi wastuwunu - guLLO mEkap uman - SreeramaNiki iccimdi.
"idEmiTi nAnI?" "keTil ammaayI! niKArs aina ittaDi kETil - maa imTiki doralu wastE,
dImTlO numDE kaaphee - kappulalOki wamci, iccE wALLam." nAnI - tama imTiki telladoralu
waccaaru - anE goppa wiSEshaanni - ee pagidini, samdarbham dorakabuccukuni,
yaawanmamdikee ceppEsimdi. "sarEnamDI, kaanee keTil - E kOSAnaa kamamDalam awadu kadA."
"aitE, nuwwu ceppina kamamDalam, baiTa shaapulalO dorukutumdA!?" "nijamE, I BUmamDalamlO dorakadu nAnI." anitAdEwi oppukunnadi.
**** **** **** ;
ninna, monna kRshNA snaanaalu cEsiwaccaaru amdarU. subbulakshmi appaTikappuDu maLLI
rEwuki mAlinitO akkaDiki weLLimdi.subbulakshmi nadi gaTTuna kuurcunna saadhuwulu komdariki, paLLu phalaalu icci, ASIrwaadaalu amdukunnadi. oka saadhuwunu mAlini gurtu paTTimdi. atanu tama uuri manishi ..., "meeru komDalraawu kadU." maalini kwaScanu ataNNi bedaragoTTimdi.
pEkATa wyasanam - ODipOyi, appulalO munigipOwaDam, daari tennu kaanarAlEdu, tanuu, weerAswAmi, ramganna - uuri numDi paaripOyaaru. gatyamtaram lEka -
sanyaasulalO kalisaaru. saadhu jeewanam - waari wyaktitwaalu - mElu bATalO naDicETaTlu malicimdi.
**** **** **** ;
subbulakshmi waccina panini gurtucEsimdi - daamtO maalini aprastutaanni wadili, prastutamlOki waccEsimdi. "komDayyaa, maaku oka wastuwu kaawaali."
"naa prastuta naamam dhyaana guruswaami ammA!" amTU gurtu cEsADu puurwa nAmadhEya komDalaraawu, komcem lOgomtukalO. "sarEnamDI, tapaswi ayinaaka, pErlu maarcEstaaramTa kadaa, `I forget` saaree, Emee anukOkamDi." subbulakshmi kUDA maLLI kshamApaNalu ceppimdi, appaTiki paristhiti gADina paDimdi. "maaku kamamDalam arjamTugaa kaawaali swaamI, miiru pedda manasu cEsukuni, iwwamDi." amTU bratimaalaaru. aragamTa sEpu weeri winnawimpulu, waari mohamATa dharma meemaamsalu saagaayi. kosaku tappanisari ai, komDalraawu - saaree, dhyaana guruswaami anEka sharatulu widhimci, waariki wastuwuni iccADu. mottaaniki -kaaryasaadhakulu - ani - praamteeya birudulanu - naanee, taditarulu anugrahimcaaru ee mahiLalaku.
wEdikapaina mana baalala nATakam adbhuta@h. kamamDalam gaalimpuku - weeru paDina
awasthalu, cEsina aluperugani saahasaalu aa nOTA aa nOTA amdarikee telisi, ceppukumTU nawwukOsaagaaru. nirwaahakulu kUDA - weeri kashTAniki pratyEka bahumatini, krikkirisina sabhalO iccaaru.
**** **** **** ;
maalinitO pATu, naanee - migataa waaru - kalisi pedda samuuhamE - tayaaraimdi, amdaruu - guDiki weLLAru. saadhuwulanu kalisi, mATlaaDAru, selpheelu teesukunnaaru. naanee, itara samdarSakulalO komdaru - ee mugguru saadhuwulanu tama ULLaku aahwaanimcaaru. kaalam cEsE gammattulu konni, mamci pariNAmaalanu Erparaci, mamci gurtulugaa gurtumDaTam - jarugutuumTumdi. "meeru cEsE tapassu maa uuriki Sreeraamaraksha." amTU prajalu ASramaalu kaTTimci iccaaru.
& ee maarpuku asalaina hEtuwulu konni unnaayi.
himduu dharmam anusaraNalu - imduwalana - kOwelalO koluwaina dEwee dEwatalaku wiluwaina ABaraNAlu, sampada ErpaDutunnawi. amduwalananE bhaktulanu - garBaguDilOniki prawESam nishEdham. puujaarula bhujaskamdhaala meeda - TrasTIlaku - rakshaNa baadhyata paDutunnadi. kaapalaadaarlu, waac mens - ee rOjulalO dorakaDam lEdu. graamaalu, cinna cinna guLLu - aalaya nirwaahakulaku - iTuwamTi jeetabhatyaalanu - adhikamgaa kharcu cEyagala sthOmata umDadu.
sanyaasulu, mumukshuwulu - praaceenaa Communism wyawastha - prateekalu ..., weeriki
aasthulu, sampadalu - swamtaaniki nilawa umcukOwaDam - nishEdham. nishkaamamgaa umDaDam anEdi - waariki swayamgaa widhimcukunna kaThina niyamAwaLi, amduwalana - aTu aalayaalaku, iTu tama uuriki taayettulu, raksharEkulu autaaru, amdukanE palleTUru, uuLLawaaLLu - samardhamaina, nijamaina yOgulakOsam - anwEshaNa cEstumTAru.
aa kramamlO - ee nuutana traya yOgulu - dhyaana guruswaami [= komDalraawu] , weerAswAmi, ramganna - mUDu pradESAlalO - tama naweena ASrama naamaalatO - sthirapaDDAru. prajalaku tama upadESAlanu istunnaaru, tamaku cEtanainamtalO - samghamlO SAmtini nelakolpaDAniki prayatnistunnaaru. komDayya uraph dhyAna guruswAmi - milamilaa merustunna tana kamamDalam cuustU anukumTumTADu appuDappuDu -
"imta cinna wastuwu, naa jeewitaanni imta malupu tippimdi, aahaa!"
**** **** **** ;
story roles / characters ;- mAlini `son` - niranjan ; - niranjan group girl suguNawalli ;; & jayaSrI & jayaSrI mEnatta subbulakshmi ; & ;- ladies wemTa waccina Ladies ;; orissA school Teacher SreeramaNi [Makeup woman] ; gauri & nAnI - & anitAdEwi & sAdhuwulu mugguru - komDalrAwu [= dhyaana guruswaami] , weerAswAmi, ramganna ]
**** **** **** ;
previous Telugu story ;- మార్చి 2022 ;- అంబర్ చూసిన ఆ దేశం ;- కుందనబాల గడప వద్ద sudden గా ప్రత్యక్షం అయ్యింది కావేరి - ఆమె కళ్ళు సంతోషంతో మిలమిలా మెరుస్తున్నవి. "కుందనా! మా మేనల్లుడు గ్రహం మీదికి రాకెట్లో వెళ్తాడట. దేశం సైంటిస్టులు - అందరూ పర్మిషన్ ఇచ్చారట. అంగారక గ్రహం చేరి, అక్కడి మట్టిని తెస్తారట."
Super kusma gaaru
రిప్లయితొలగించండిthank u Lekha rani gaaruu
రిప్లయితొలగించండి