17, ఏప్రిల్ 2022, ఆదివారం

అంచనాలు త్రివిధములు

 సురభి, సునీత సేల్స్ గర్ల్స్ ఉద్యోగినులు. భామిని షాపులోకి వస్తున్నది. 

ఆమె రెగ్యులర్ కస్టమర్. ఐతే భామిని రాకతో అంగడి మొత్తం, టేబుల్ రాక్స్ పైకి చేరుతుంది. 

అలమరలలోని దుస్తులు సర్వం దింపిస్తుంది. 

“ఇవాళ పార్టీ మీటింగుకి వెళ్ళాను, అటునుండి నేరుగా మీ షాపుకి వచ్చాను” 

భామినికి ఉన్న టాలెంట్ అదే, డబ్బా వాయించుకున్నట్టు కనిపించదు, 

యధాలాపంగా చెబ్తున్నట్లుగా అనిపిస్తూ, చమత్కారంగా తన గొప్పదనాన్ని చెప్పేస్తుంది.

సురభి, సునీత కొన్ని చీరలను బల్లమీద పరిచారు. వాటిలోని మూడు శారీలను పక్కన బెడ్తూ అన్నది 

“ఈ చీర కొడవలి గుర్తు కమ్యూనిజ్మ్, ఇది రష్యా ఇజ్మ్, అండ్ ఇదేమో ప్రజాస్వామ్యం” అన్నది. 

“అంటే?” తెల్ల మొహాలు వేసారు పడతులు ఇద్దరూ. 

“ఒకటి – తడి తగిల్తే ముద్ద ఐపోతుంది,  ..... - ఇంకొకటి, ఒక్కసారి జాడిస్తే చాలు, ........ - and

చీలికలు పీలికలు ఐ కూర్చుంటుంది” 

“మరి, ప్రజాస్వామి వలువ కథ ఏమిటండీ?”, 

సునీత కుతూహం వేసిన ప్రశ్నార్ధకం. 

“ఆ వలువలు గంజి పెట్టి, ఇస్త్రీ చేసినప్పుడు భలే మెరుస్తుంటాయి. 

వాషింగ్ మిషన్ నుండి తీసినప్పుడు ముడతలు పడి ఉంటాయి. మళ్ళీ ఐరన్ చేయగానే, 

ఇస్త్రీ కళతో, కళకళ్ళాడుతుంటాయి. ” 

భామిని టాలెంట్ అదే, పొలిటికల్ ఫీల్డ్ లో తన వాగ్ధాటి సుపర్బ్ – అని చెప్పకనే చెప్పేస్తుంది.

[పాత్రలు ;- భామిని - సురభి, సునీత ] ; & 

[ కాదంబరి - కార్డు కథ - 1 ] ; 

= amcanaalu triwidhamulu ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...