22, ఏప్రిల్ 2022, శుక్రవారం

అంతా, రాములోరి దయ

 బాలమ్మ తాటిచెట్టు మానుకి బెల్లం ముద్దను విసిరి కొట్టి, లాగుతున్నది. 

మళ్ళీ మళ్ళీ విసుగు లేకుండా అదే పని ..., 

గుమ్మంలో నిలబడి రోడ్డుకి అవతల బాలమ్మ చేసే ఆ పనిని, నిత్యం చూడడం, 

సుభద్ర దినచర్యలో అంతర్భాగం అయ్యింది. 

కనీసం రెండు గంటలు బెల్లం ముద్దను తీగలు తీగలుగా లాగుతుంది - 

నున్నగా మెరిసేలాగా తయారైన దాన్ని పరీక్షించి చూసుకుంటుంది బాల. 

అటు తర్వాత నవారు తాళ్ళలాగా ఉండే బెల్లం పాయలను సర్దుకుని, ఇంటిముఖం పడ్తుంది బాలమ్మ! ....,

"జబ్బలు నొప్పి పుట్టవా?" ఆ దృశ్యం - సుభద్ర వీక్షణాలలో ఆశ్చర్యం నింపుతుంది. 

******************** ;

"నన్ను బాల అని పిలుస్తాడు మా మామ" కిసుక్కున నవ్వుతూ ......,

మురిపెంగా బాలమ్మ చలాకీగా చెప్పే ఊసులలో ఒకటి ఈ వాక్కు.  

సుభద్ర పండగలు పబ్బాలు వచ్చినప్పుడు, స్వీటు, తినుబండారం 

ఏదో ఒకటి - బాలమ్మ చేతిలో పెడ్తుంటుది.  

అప్పుడప్పుడు పని, శ్రమ ఎక్కువ ఐనప్పుడు, తన ఇంట్లో తాగుబోతు మొగుడు తనని కొట్టినప్పుడు 

"సుభద్రమ్మా!" అంటూ తన బాధలను చెప్పుకుని,

 మనసులోని భారం దించుకుని, రిలీఫ్ ఔతుంది బాలమ్మ. 

సుభద్ర సాంత్వన వచనాలు బాలమ్మకు గొప్ప ఓదార్పు నిస్తాయి.

ఇద్దరు కూర్చుని చెప్పుకునే కబుర్లు - సుభద్ర బాల్యం గుర్తులు సంచారం చేస్తుంటాయి.

"మా చిన్నప్పుడు నువ్వు జీడీ  రుచిని - చాలా నెమ్మదిగా చప్పరిస్తూ, 

ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమో, 

జీడీలను వేలికి ఉంగరంలాగా తగిలించుకుని మురిసిపోతుండే వాళ్ళం." అంటూ, 

"ఈ కాలం పిల్లలకి ఆ రుచులే తెలీడంలేదు. 

ఇప్పుడు పిల్లలకి నువ్వుజీడీలను చేతికి ఇస్తే ముఖం చిట్లిస్తున్నారు. 

"యాక్" అనేస్తున్నారు. క్రీమ్ బిస్కట్లు, చాకోబార్లు చూపించి, నోట్లో వేసుకుని, 

అటు తిరిగి - వీడియో గేమ్సు ఆడుకుంటున్నారు." అని కించిత్తు బాధపడ్తూ చెప్పేది సుభద్రమ్మ. 

******************** ;

అవధులు లేని వేగంతో మారిన కాలం -  

ఈ మార్పులను ఆమోదించడానికి - నేటి సమాజం తంటాలు పడుతున్నది. 

సుభద్రమ్మ కూడా నవీన సంక్లిష్టతల జలకుండంలో - నీటిని నిశ్చలపరచి, 

తన ప్రతిబింబాన్ని చూసుకోవాలనే ప్రయత్నంతో మల్లగుల్లాలు పడుతున్నది. 

బాలమ్మ భర్త చంద్రయ్య కల్లుగీత పని చేస్తాడు. 

చంద్రయ్య కుల వృత్తి, సహజంగానే అతని దేహం, జీవితం - అలవాట్ల పైన పెత్తనం చలాయిస్తున్నది. 

బాలమ్మ "నా మొగుడు పచ్చి తాగుబోతు" యధాలాపంగా చెబుతుంది బాలమ్మ, 

అంతే కానీ అదేదో పెద్ద నేరం అన్నట్లుగా ఆమె ఫీలింగ్సు అనిపించవు, కనిపించవు

మందుబాబు మత్తులో పెళ్ళాన్ని చావమోదుతాడు. 

బాలమ్మ ఏడుస్తూ, తన ఒంటి మీద చంద్రయ్య కొట్టిన దెబ్బలు, వాతలు చూపించేది. 

దుఃఖభారం తగ్గేదాకా సుభద్రకు, తెలిసినవాళ్ళకు చెప్పుకునేది.

సుభద్ర బంధువు కుముద అన్నది 

"అంత కష్టపెట్టే భర్త ఎందుకు, మీ జాతిలో మారుమనువులు ఉన్నాయి కదా! 

వదిలేసి, కొత్త జీవితం స్టార్ట్ చేయి"

"భలేటోరే అమ్మా, కాపురం అన్నాక కలతలు, పొరపొచ్చాలు ఉంటాయి. 

తరాజుకు రెండు సిబ్బెలు ఉండాలి.

 తక్కెడ ఒక ప్లేటు మాత్రమే ఉంటే, తూకం వెయ్యగలమా. 

అంగడి వ్యాపారం సాగడానికి కొలత వస్తువులు, తక్కెడలు కావల్సిందే కాదా."

"ఇదేం లాజిక్కు!?" విస్తుపోయింది కుముద. 

అయిదో క్లాసు చదువు బాలమ్మ ఇంత సూక్ష్మంగా ..... ,

జీవిత సత్యం నిర్వచనం ఇస్తుందని అనుకోలేదు కుముద. 

******************** ;

కుముద నేపథ్యం;- భద్రాచలం కోవెలలో ఉద్యోగిని కుముద. 

తనకు ముగ్గురు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు, 

ఇంటికి పెద్దకూతురు గనుక, కుటుంబభారాన్ని తన భుజాలపైన మోపుకున్నది కుముద. 

"మా పెద్దక్కయ్య మంచిది." అని family చెప్పుకునేది. ముగ్గురు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసింది కుముద. 

తర్వాత తమ్ముళ్ళు తమ జీవితాలలో స్థిరపడ్డారు. 

అప్పటికే  - కుటుంబ అవసరాల నిమిత్తం  చేసిన అప్పులు - కొండంత ఎత్తు పెరిగింది ఋణభారం. 

తమ్ముళ్ళు ఇద్దరూ love marriage లు చేసుకుని, వేరు కుంపట్లు పెట్టుకున్నారు. 

తల్లిదండ్రుల బాధ్యతను అక్క మీదికే నెట్టారు. 

"నీకేం, గవర్నమెంట్ జాబ్ దొరికింది. కంపెనీలో చిన్న ఉద్యోగాలు మావి. 

నాలుగు జీతం రాళ్ళు - మా సంసారం గడవడానికి చాలడం లేదు. 

బడుగు బతుకులు మావి. నువ్వు ఒంటి కాయ శొంఠి కొమ్మువు, 

అదీగాక, సొసైటీలో ఆడపిల్లలు ఒంటరిగా ఉండగలిగే రోజులు కావివి. 

నీకు అమ్మ నాన్నలు తోడు నీడ ఔతారు. సరేనా!?" 

అవాక్కు అవడం మినహా కుముదకు గత్యంతరం ఏముంది గనుక. 

******************** ;

రోజులు నింపాదిగా జరుగుతున్నాయి. కుముద తన కొలీగ్ ని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసింది. 

"కులగోత్రాలు కుదరవు .... " అనేసి అందరూ ముక్తకంఠంతో సెలవిచ్చారు. 

పెళ్ళి కాస్తా పెటాకులు ఐన కొద్దిరోజుల తర్వాత -  ..... ,

ఒక రోజు ఆఫీస్ ఫైల్స్ కొన్ని, ఇంట్లో ఉన్నాయి, తీసుకు వెళ్ళడానికి వచ్చింది కుముద. 

వరండాలో చెప్పులు వదలి - తలుపు తట్టబోయింది. 

ఇంట్లోంచి దూసుకు వచ్చిన సంభాషణ తాలూకు - సారాంశం - 

కుముద సంపాదనతో ఇంటిల్లిపాదీ - పెట్టుపోతలు, అవసరాలు, ఖర్చులు గడుస్తున్నాయి, 

అట్లాంటి పిల్ల - తాళి కట్టించుకుని వెళ్ళిపోతే - తమ గతి గోదారిఅందుకని ...., 

కుముదకు తన ప్రేమ విఫలం అవడానికి కారణం సంప్రదాయాలు కాదు,

 వీరి స్వార్ధపరత్వం - అని అర్ధమైంది. అప్పటి నుండి ఆమెలో నిస్త్రాణ చోటు చేసుకున్నది. 

నిర్లిప్తంగా ఉండసాగింది కుముద. 

తమ వీధిలో ఉన్న సత్తెమ్మ అనుభవాలు దిక్సూచిగా గైకొన్నది. 

నానీ అక్కయ్య సత్తెమ్మ - మరి కొన్నేళ్ళకు - పుట్టపర్తికి వెళ్ళి స్థిరపడడానికి ఏర్పాట్లు చేసుకున్నది.

కుముదకు సత్తెమ్మ ఆలోచనా ధోరణి బాగా నచ్చింది. 

భవిష్యత్తులో - సత్తెమ్మ బాటలో సాగాలని అనుకోసాగింది.

******************** ;

ఆఫీసు పని మీద ఈ ఊరికి వచ్చింది కుముద. ఆమె హోటల్ రూమ్  తీసుకుంది. 

అది తెలిసిన సుభద్ర - "ఐనవాళ్ళం మేము ఉన్నాం, మా దగ్గర ఉండాల్సిందే." 

అని ఖచ్చితంగా నొక్కి వక్కాణించింది.  

సుభద్ర ఇంట్లో - సొంత మనిషిలా చూసుకున్నారు.

కుముద మనసు ఆనందభరితం అయ్యింది.

ఇక్కడికి వచ్చినాక బాలమ్మ - వృత్తి - తదితరాలు పరిచయం ఐనాయి. 

వారం రోజులకి - ఆమెకి ఒక కొత్త సంఘటన ఎదురయ్యింది. . 

చంద్రయ్య మోటారు పైన కల్లు పాకెట్లు, కుండలను తీసుకెళ్ళి, 

బస్తీలో కల్లు దుకాణాలకు అప్పజెప్తాడు. 

కొన్ని రోజుల క్రితం, చుట్టపీక కాలుస్తూ సిటీకి వెళుతున్నాడు. 

చుట్ట నిప్పురవ్వలు ఎదురుగాలికి చెలరేగాయి. 

భుజం ఎత్తు దాకా ఉన్న కల్లు సరుకు అంటుకుని, గాయాలపాలయ్యాడు. 

సుభద్ర తోటి కుముద హాస్పిటల్ కి చంద్రయ్యని చూడడానికి వెళ్ళింది కుముద.

హాస్పిటల్ వైద్యం, బాల శ్రమ ఫలితం దక్కలేదు. కుముద, సుభద్ర ఈ పరిణామానికి నిశ్చేష్ఠులయ్యారు.

******************** ;

అటుతర్వాత, ఇటు కుముద - అటు బాలమ్మ జీవితాలు కొత్త పుంతలు తొక్కాయి. 

కుముదను ఇష్టపడి పెళ్ళాడాడు శ్రీహర్ష.  శ్రీహర్ష - కుముద - ఇద్దరికీ దక్కినవి చేదు జీవిత అనుభవాలే - 35 ఏళ్ళు దాటుతున్న  శ్రీహర్ష - కుముద - ఒక ఇంటివారు ఐనారు. 

"ఈ రోజులలో కొడుకులు, కూతుళ్ళు - కోడళ్ళు - అల్లుళ్ళు - వేర్వేరు కాదు. 

పరిమిత కుటుంబం ముద్దు - అని ఎర్ర త్రికోణం వెలిసింది. పదిమంది పిల్లలు - బాధ్యతలు - 

విసిగించే బాధలు ఉన్న అప్పటి మాదిరి life కాదు. 

కనుక మా తల్లిదండ్రులు - మీ పేరెంట్స్ - ఎవరైనా సమానమే." 

మనస్ఫూర్తిగా responsibilities ని స్వీకరిస్తాననే మనిషి - 

పాత సామెత చెప్పినట్లుగా - కొడుకును కంటాననే కోడలు ఉంటే - వద్దనే అత్త ఉంటుందా!? - 

కనుక - కుముదం - శ్రీహర్ష పరిణయం నిర్విఘ్నంగా జరిగింది.

&

భద్రాచలం కొండ వద్ద చిన్న షాపు కొత్తది వెలిసింది - 

బాలమ్మ వ్యక్తిత్వం కుముద మనసును హత్తుకున్నది. 

 - బాలమ్మ సహజ నైజం ప్రభావం న 

కుముద జీవన దృక్పధం - సుస్పష్టంగా తీర్చుకోగలిగింది.

అందుకే, కుముద - మరిచిపోకుండా బాలమ్మకు చేయూత ఇచ్చింది.  

******************** ;

నువ్వుజీడీలు, పప్పుండలు, పునుగులు, చిరుతిళ్ళు తయారీలో ఆరితేరింది బాలమ్మ. 

బాలమ్మ కాఫీ దుకాణం కిటకిటలాడుతున్నది.

"అంతా, రాములోరి దయ. లేకుంటే సీతమ్మ అవతారం - 

ఈ కుముద తల్లి రూపంలో తనకు తానై రావడం, తనకు చల్లని నీడ ఇవ్వడం, 

ఇన్నీ జరుగుతున్నాయి, అంటే శ్రీరాములు కరుణ కటాక్షాలే కదూ" 

అనుకుంటూ ఉంటుంది బాలమ్మ.

[పాత్రలు ;- బాలమ్మ -  భర్త చంద్రయ్య & సుభద్ర - సుభద్ర బంధువు కుముద - భర్త  శ్రీహర్ష &

నానీ అక్క సత్తెమ్మ - place - భద్రాచలం ] ;

story ;- అంతా, రాములోరి దయ ;

============================ , 

maarpu telusukuni ;-  bAlamma tATiceTTu mAnuki bellam muddanu wisiri koTTi, laagutunnadi. maLLI maLLI wisugu lEkumDA adE pani ..., 

gummamlO nilabaDi rODDuki awatala bAlamma cEsE 

aa panini, nityam cUDaDam, suBadra dinacaryalO amtarBAgam ayyimdi. 

kanIsam remDu gamTalu bellam muddanu tIgalu tIgalugA lAgutumdi - 

nunnagA merisElAgA tayaaraina daanni pareekshimci cuusukumTumdi bAla. 

aTu tarwaata nawaaru taaLLalaagaa umDE bellam paayalanu sardukuni,

imTimukham paDtumdi bAlamma! ....,

"jabbalu noppi puTTawA?" A dRSyam - suBadra wIkshaNAlalO

 AScaryam nimputumdi.  ******************* , 

"nannu bAla ani pilustADu maa maama" 

kisukkuna nawwutuu muripemgaa bAlamma calaakeegaa ceppE 

UsulalO okaTi I waakku. 

suBadra pamDagalu pabbAlu waccinappuDu, sweeTu, 

tinubamDAram EdO okaTi - baalamma cEtilO peDtumTudi. 

appuDappuDu pani, Srama ekkuwa ainappuDu, 

tana imTlO taagubOtu moguDu tanani koTTinappuDu 

"subhadrammaa!" amTU tana baadhalanu ceppukuni, 

manasulOni bhaaram dimcukuni, rileeph autumdi bAlamma. 

subhadra saamtwana wacanaalu bAlammaku goppa Odaarpu nistaayi.

iddaru kuurcuni ceppukunE kaburlu - 

subhadra baalyam gurtulu samcaaraam cEstumTAyi.

"maa cinnappuDu nuwwu jIDI  rucini - cAlA nemmadigA capparistU, 

emta baagA emjaay cEsEwALLamO, 

jIDIlanu wEliki umgaramlaagaa tagilimcukuni murisipOtumDE wALLam." 

amTU, "ee kaalam pillalaki aa ruculE telIDamlEdu. 

ippuDu pillalaki nuwwujIDIlanu cEtiki istE mukham ciTlistunnAru. 

"yaak" anEstunnaaru. kreemm biskaTlu, cAkObArlu cUpimci, 

nOTlO wEsukuni, aTu tirigi - wIDiyO gEmm su ADukumTunnAru." 

ani kimcittu baadhapaDtuu ceppEdi subhadramma. 

******************** , 

awadhulu lEni wEgamtO maarina kaalam -  

ee maarpulanu AmOdimcaDAniki - nETi samAjam tamTAlu paDutunnadi. 

suBadramma kUDA naweena samklishTatala jalakumDamlO - 

nITini niScalaparaci, tana pratibimbaanni cUsukOwAlanE prayatnamtO

 mallagullaalu paDutunnadi. bAlamma bharta camdrayya kallugeeta pani cEstADu. 

camdrayya kula wRtti, sahajamgAnE atani dEham, jeewitam - 

alawATla paina pettanam calaayistunnadi. bAlamma "naa moguDu pacci 

tAgubOtu" yadhAlApamgA cebutumdi bAlamma, 

amtE kaanee adEdO pedda nEram annaTlugA Ame phIlimgsu anipimcawu, kanipimcawu. 

mamdubaabu mattulO peLLAnni caawamOdutADu. baalamma EDustU, 

tana omTi meeda camdrayya koTTina debbalu, waatalu cuupimcEdi. 

du@hkhabhAram taggEdAkaa subhadraku, telisinawALLaku ceppukunEdi.

4] subhadra bamdhuwu kumuda annadi 

"amta kashTapeTTE Barta emduku, mee jaatilO maarumanuwulu unnaayi 

kadA! wadilEsi, kotta jeewitam sTArT cEyi" 

"BalETOrE ammA, kApuram annAka kalatalu, porapoccAlu umTAyi. 

tarAjuku remDu sibbelu umDAli. takkeDa oka plETu maatramE umTE, 

tuukam weyyagalamaa. amgaDi wyApAram sAgaDAniki kolata 

wastuwulu, takkeDalu kAwalsimdE kAdA."

"idEm lAjikku!?" wistupOyimdi kumuda. 

ayidO klAsu caduwu baalamma imta sUkshmamgA jeewita satyam 

nirwacanam istumdani anukOlEdu kumuda.

kumuda nEpatham ;- bhadraacalam kOwelalO udyOgini kumuda. 

tanaku mugguru celleLLu, iddaru tammuLLu, imTiki peddakuuturu ganuka, kuTumbaBAraanni tana bhujaalapaina mOpukunnadi kumuda. 

"maa peddakkayya mamcidi." ani `family` ceppukunEdi. 

mugguru celleLLa peLLiLLu cEsimdi kumuda. 

tarwaata tammuLLu tama jeewitaalalO sthirapaDDAru. appaTikE 

 - kuTumba awasaraala nimittam - cEsina appulu -

komDamta ettu perigimdi RNaBAram. 

tammuLLu iddaruu `love marriage` lu cEsukuni, 

wEru kumpaTlu peTTukunnAru. tallidamDrula baadhyatanu 

akka meedikE neTTAru. "neekEm, gawarnamemT jaab dorikimdi. 

kampeneelO cinna udyOgaalu maawi. naalugu jeetam rALLu - 

maa samsaaram gaDawaDAniki caalaDam lEdu. baDugu batukulu maawi. 

nuwwu omTi kaaya SomThi kommuwu, adeegaaka, 

sosaiTIlO ADapillalu omTarigaa umDagaligE rOjulu kaawiwi. 

neku amma naannalu tODu nIDa autaaru. sarEnA!?" 

awaakku awaDam minahaa kumudaku gatyamtaram Emumdi ganuka. 

**************************** , 

rOjulu nimpaadigaa jarugutunnaayi. 

kumuda tana koleeg ni imTlO wALLaki paricayam cEsimdi. 

"kulagOtraalu kudarawu .... " 

anEsi amdaruu muktakamThamtO selawiccaaru. 

peLLi kaastaa peTAkulu aina koddirOjula tarwaata ....... , - 

oka rOju aaphees phails konni, imTlO unnaayi, 

teesuku weLLaDAniki waccimdi kumuda. waramDAlO ceppulu wadali - 

talupu taTTabOyimdi. imTlOmci duusuku waccina samBAshaNa taaluuku -

 saaraamSam - kumuda sampaadanatO imTillipaadee - 

peTTupOtalu, awasaraalu, kharculu gaDustunnaayi, aTlAmTi pilla - 

tALi kaTTimcukuni weLLipOtE - tama gati gOdaari - amdukani ...., 

kumudaku tana prEma wiphalam awaDAniki kaaraNam sampradaayaalu kaadu, 

weeri swaardhaparatwam - ani ardhamaimdi. appaTi numDi 

aamelO nistrANa cOTu cEsukunnadi. 

nirliptamgaa umDasaagimdi kumuda. 

tama weedhilO unna sattemma anubhawaalu diksuucigaa gaikonnadi. 

naanee akkayya sattemma - mari konnELLaku - 

puTTapartiki weLLi sthirapaDaDAniki ErpATlu cEsukunnadi.

kumudaku sattemma aalOcanA dhOraNi bAgA naccimdi. 

bhawishyattulO - sattemma bATalO saagaalani anukOsaagimdi.

**************************** ,

aapheesu pani meeda ee uuriki waccimdi kumuda. 

aame hOTal ruumm  teesukumdi. adi telisina suBadra - 

"ainawALLam mEmu unnaam, maa daggara umDAlsimdE." 

ani khaccitamgaa nokki wakkANimcimdi. 

subhadra imTlO - somta manishilaa cuusukunnaaru.

kumuda manasu aanamdabharitam ayyimdi.

ikkaDiki waccinaaka baalamma - wRtti - taditaraaalu paricayam ainaayi. 

waaram rOjulaki - aameki oka kotta samghaTana edurayyimdi. . 

camdrayya mOTAru paina kallu pAkeTlu, kumDalanu tIsukeLLi, 

bastIlO kallu dukANaalaku appajeptADu. konni rOjula kritam, 

cuTTapeeka kaalustuu siTIki weLutunnADu. 

cuTTa nippurawwalu edurugaaliki celarEgAyi. 

bhujam ettu daakaa unna kallu saruku amTukuni, gaayaalapaalayyADu. 

subhadra tOTi kumuda haaspiTal ki camdrayyani cUDaDAniki weLLimdi kumuda.

haaspiTal waidyam, baala Srama phalitam dakkalEdu. 

kumuda, subhadra ee pariNAmAniki niScEshThulayyAru.

****************************  ; 

aTutarwaata, iTu kumuda - aTu baalamma jeewitaalu kotta pumtalu tokkaayi. 

kumudanu ishTapaDi peLLADADu SrIharsha.

SrIharsha - kumuda - iddarikee dakkinawi cEdu jeewita anubhawaalE - 

35 ELLu dATutunna  శ్రీహర్ష - kumuda - oka imTiwaaru ainaaru.  

"ee rOjulalO koDukulu, kuutuLLu - kODaLLu - alluLLu - 

wErwEru kAdu. parimita kuTumbam muddu - ani 

erra trikONam welisimdi. padimamdi pillalu - 

baadhyatalu - wisigimcE baadhalu unna appaTi maadiri kaadu. 

kanuka maa tallidamDrulu - mee pEremTs - ewarainaa samaanamE." 

manasphuurtigaa `responsibilities` ni sweekaristaananE manishi - 

paata saameta ceppinaTlugaa - koDukunu kamTAnanE kODalu umTE - 

waddanE atta umTumdaa!? - kanuka - kumudam - 

Sreeharsha pariNayam nirwighnamgaa jarigimdi.

&

BadrAcalam komDa wadda cinna shApu kottadi welisimdi - 

bAlamma wyaktitwam kumuda manasunu hattukunnadi. 

baalamma sahaja naijam prabhaawam - kumuda jeewana dRkpadham - 

suspashTamgaa teercukOgaligimdi.

amdukE, kumuda - maricipOkuMDA baalammaku cEyuuta iccimdi.  

********************, 

nuwwujIDIlu, pappumDalu, punugulu, cirutiLLu tayaareelO aaritErimdi baalamma. 

baalamma kaaphee dukANam kiTakiTalADutunnadi.

"amtA, rAmulOri daya. lEkumTE seetamma awataaram - 

ee kumuda talli ruupamlO tanaku taanai raawaDam, 

tanaku callani nIDa iwwaDam, innee jarugutunnaayi, 

amTE Sreeraamulu karuNa kaTAkshaalE kadU" anukumTU umTumdi bAlamma.

[pAtralu ;- bAlamma - bharta camdrayya ;; suBadra - subhadra bamdhuwu kumuda -  

kumuda husband SrIharsha ;; naanee akka sattemma  -`place` - bhadraacalam ] 

&

Story ;- amtA, rAmulOri daya ;-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...