24, ఏప్రిల్ 2022, ఆదివారం

సగటు మనిషి సంసారం

మంగపతి మధ్య తరగతి గృహస్థు. భార్య, ముగ్గురు సంతానం - ఒబ్బిడిగా ఉంటే, బాగనే జరుగుబాటు ఉండే ఇల్లు అయ్యేది, కానీ ఈ సగటు మనిషి భుజాలు మోయ లేనంత బరువు బాధ్యతలు, ముందే ఉన్నాయి. - మంగపతి హైస్కూల్ చదువు పూర్తి అవకుండానే మీద పడె ..... - సగటు మనిషి సంసారం - అనడానికి replica మంగపతి గృహ జీవనం ; 

ముసలి ఎద్దు లాగుతున్న బండిలాంటిది - కుంటుకుంటూ ఐనా - ఎట్లాగో తిప్పలు పడి, రొప్పుకుంటూ - ఏదో ఒక గమ్యం లాంటి స్థానానికి చేరుస్తుంది, మసక పడే వేళకి. ఇవాళ ఆఫీసుకు బయలుదేరుతున్నాడు. now మొబైల్ మాట్లాడాడు] & 

********************************** ,

మంగపతి ;- ఇప్పటికి నలుగురు వరసగా ఫోన్ చేస్తున్నారు, నిజమే, వారి దగ్గర డబ్బు తీసుకున్నాను, 

అన్న మాట ప్రకారం - అప్పులు తీర్చలేని సాధారణ జీవికి - ఇంతకంటే గొప్ప శ్రీముఖాలు వస్తాయని 

ఆశిస్తామా ఏమిటి!? ....., పంకజం, పంకజం! నా ఆఫీసు బ్యాగు వెతికిపెట్టు, ఎక్కడో పెట్టాను.

రమేష్ ;- ఇదిగో మామయ్యా, పొద్దున స్నానానికి వెళ్తూ, టివి మీద పెట్టావు. 

బ్యాగు జారి, టీవీ వెనక్కి పడిపోయింది.

మంగపతి ;- మా మేనల్లుడు సహస్రాక్షుడు, వెయ్యి కళ్ళు - అన్నీ గమనిస్తాడు.

గౌతమి ;- ఔను మంగా, నా కన్నకొడుకు - నాకు, అందరికీ పేరు తెస్తాడని నా ఆశ. 

మీ నాన్న - పోతూ పోతూ మా తల్లీ కొడుకులను నీకు అప్పగించి పోయాడు. 

మా బాధ్యతలు నిన్ను కుంగదీస్తున్నాయి. ఎంతత్వరగా, ఇంజనీర్ చదువు పూర్తి చేయాలి, 

మా రమేష్ మంచి మంచి ఉద్యోగంలో చేరాలి, నీకు ఊరట ఇవ్వగలుగుతాము.

పంకజాక్షి ;- ఇన్నేళ్ళుగా మోస్తున్నాం. ఇన్ని బరువులు, మాకు స్థిమితం కూడానా!?

గౌతమి ;- మా ఆస్థిని, అన్న [brother] అని కదా నమ్మి చేతుల్లో పెట్టాడు, 

మా ఆయన. ఊరికే ఇంటి మీద పడి తినట్లేదు.

పంకజ ;- అందుకనేగా మా మీదకి నెట్టారు మామగారు. మీ ఆయన, మామయ్య కలిసి, 

గూడూరు మైకా వ్యాపారంలోకి దిగారు, ఇల్లు గుల్ల చేసారు.

గౌతమి ;- వాళ్ళని ఎందుకు ఆడి పోసుకోవాలి!? అవే గనుల్లో లాభాలు వస్తే, 

మనమే లొట్టలేసుకుంటూ, అనుభవించే వాళ్ళం కదూ!

పంక ;- నిజమే, ఎవరి కెంత ప్రాప్తమో అంత దక్కుతుంది.

గౌతమి ;- అరె, మంగా, నీ చొక్కాకి వెనక పెద్ద చిల్లి పడింది. కుట్టిస్తాను, ఇటివ్వు.

మంగ ;- ఫర్వాలేదులే, మా ఆఫీసులో కొంతమంది డ్రెస్సుల కంటే, నా షర్టు నయం.

రమేష్ ;- బీరువా మీద - నెహ్రూ కోటు ఉంది, షర్టు మీద వేసుకోండి, hole కనబడదు.

మంగపతి ;- అంత గట్టిగా విదిలించావు రమేష్, ఎంత దుమ్ము ఉందో చూడు, అందరికీ తుమ్ములు, దగ్గులు ....,

గౌతమి ;- నిన్న నీ కూతురు కౌసల్య - స్కూల్ ప్రోగ్రామ్ ఉందట, డబ్బులు అడిగింది. ఇంద, 

మూడో ఇంటి గరుడయ్య వడ్డీ ఇచ్చాడు, బుజ్జమ్మకు ఇవ్వు- మంగా , 

పంకజ ;- అప్పులు ఇచ్చి, వడ్డీలకు తిప్పగలవు, 

మీకు మీరే సాటి. చన్నీళ్ళకు వేణ్ణీళ్ళ తోడుగా, అవసరానికి చెయ్యి అందిస్తున్నారు.

గౌతమి ;- సగటు బతుకులు మనవి, అంత మాత్రం, దక్షత, ఒడుపు ఉండాలి కదా, పంకజం!

పెద్ద కొడుకు రాజారావు ;- అమ్మా, ఇదిగో, ఆనపకాయ, సాయంత్రం అందరికీ రాచిప్ప పులుసు పెట్టు.

మంగ ;- అందరికీ, చెట్లు, మొక్కలు ఇష్టం. జానెడు జాగాలో, కుండీలలో పెంచుతున్నారు.

పంకజ ;- క్యారియరు సర్దుతున్నాను, ఉండండి. 

మంగ ;- అదేమిటి, కారేజి గిన్నెలో కప్పు బోర్లిస్తున్నావు?

పంకజాక్షి ;- నెలాఖరు కదా, ఉన్న బియ్యం, సామాను - అందరమూ సర్దుకోవాలి. 

ఈ కప్పు గిన్నె ఇట్లాగ బోర్లించాను కదా, దీని పైన అన్నం పెడ్తున్నాను. 

ఇప్పుడు, గిన్నె నిండా ఉన్నట్లుగా కనబడుతుంది.

మంగ ;- ఒకటో తరగతిలో - కథ గుర్తుకొస్తున్నది. నీళ్ళు పైకి రావడానికి కాకి కడవలో పట్టినన్ని రాళ్ళు వేసిందట.

గౌతమి ;- అమ్ములు మంచి తెలివైనది. నీ పక్క సిబ్బంది దగ్గర, నువ్వు వెలితి పడకుండా, 

ఎంత సమర్ధతతో బండి నెట్టుకు వస్తున్నదో, మా బంగారు తల్లి -

మంగ ;- ఔను కదా, సరే, ఇంక బయలుదేరనా, అత్తా!?

గౌతమి ;- రాజా, రమేష్, చెల్లి రమణి, తమ్ముడు రాంబాబు - జాగర్తగా వెళ్ళండి.

పిల్లలు ;- సరే, టాటా 

నాన్నా, అమ్మా, అత్తమ్మా, 

రమేష్ ;- పదండి ముందుకు ....., 

@@@@@@@@@@@@ ,

మంగపతి ;- రమేష్ మంచి జాబ్ లో చేరాడు, మొహం చాటేసి, 

మొండి చెయ్యి చూపిస్తాడేమో అనుకున్నాను. లోన్ - చీటీ కట్టి, డబ్బు ఇచ్చాడు.

పంకజాక్షి ;- ఔనండీ, నేనూ అదే అనుమానపడేదాన్ని, కానీ, నిజాయితీగా ....., 

తన చదువుకు, తిండికి, వసతికి మనం పెట్టిన ఖర్చు - అణా పైసలతో సహా ఇచ్చేసాడు.

మంగపతి ;- మన పిల్లల భవిష్యత్తు గురించి, నేను దిగులు పడనక్కర్లేదు.

గౌతమి ;- మంగా, పంకజం, భద్రాచలంలో రమేష్ కి క్వార్టర్సు ఇచ్చారంట.

మంగ ;- ఔను, ఇందాకనే, నాక్కూడా శుభవార్త ఫోన్ చేసి చెప్పాడు. 

ఈ కుండీ మొక్కల మీద సూర్య కిరణాలు హాయిగా ఆడుతున్నాయి కదూ.

పంకజాక్షి ;- భలే వారే, మీకు మంచి మూడు వస్తే - కవి అవతారం దాలుస్తారు. ఇదిగోండి, కారేజి ....,

రమణి ;- నాన్నా, స్టీలు బౌలు బోర్లించిపెట్ట లేదు. ఇప్పుడు, నిజంగానే నిండా భోజనం, సాధకాలు ఉన్నాయి.

రాజా ;- రాంబాబు, అక్క కూడా జోకులు వేయగలదు - హ్హ హ్హ హ్హ ... [నవ్వులు]

రాంబాబు ;- అన్నయ్యా, అందరమూ హాపీ మూడ్ తో ఉన్నాం కదా, అదీ సంగతి.

మంగపతి ;- బుజ్జాయి - అమ్ములు - చిన్నోడా, విలువైన దుస్తులు లేవు, 

కడుపు నిండా తిండి కరువు, పెచ్చులు  ఊడుతున్న ఇల్లు - ఇన్నిటినీ దిగదుడిచి, బైటికి విసిరేయగల శక్తి - 

ఒక్క ప్రేమకే ఉంది. ఇన్నేళ్ళుగా - నా అంతరాళmలోని క్షోభను ..... - 

మన మంచి పరివారం, ఆ అద్భుత ప్రేమ శక్తి - బాధల వేదనలను  ........, 

చెలియలి కట్టను దాటకుండా నిలవేయగలిగింది. ఇదే నా గొప్ప భాగ్యం.  ;

[పాత్రలు ;- మంగపతి, భార్య పంకజాక్షి, ముగ్గురు పిల్లలు = పెద్ద కొడుకు రాజారావు, 

రమణి, రాంబాబు & విధం చెడిన మేనత్త గౌతమి, గౌతమి కొడుకు రమేష్ ] ;

******************************************** ,

నాటిక డ్రామా Drama ;- సగటు మనిషి సంసారం ;;


2 కామెంట్‌లు:

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...