టివి లో భానుమతి సినిమాలో కామెడీ సీను వస్తున్నది. కుందనబాల, జయశ్రీ -
"వైశాఖం నోము నోచుకున్నాము, నానీ!" అంటూ వచ్చారు.
నానీకి వడపప్పు ప్రసాదం ఇచ్చింది కుందనబాల, జయశ్రీ బొబ్బట్లు ప్రసాదం ఇచ్చింది.
"పెసరపప్పు నాకు అరగదు అమ్మణ్ణీ, బొబ్బట్లు నా పుట్టింట్లో పండగ వస్తే చాలు,
ఇల్లంతా బొబ్బట్ల వాసనలు ... ఘుమఘుమలాడుతుండేది." నానీ మాటలతో -
తను తెచ్చిన ప్రసాదాన్ని ఆమె తినదని,
తతిమ్మావాళ్ళకు ఇస్తుందని అర్ధమైంది కుందనబాలకు.
ఇవాళ తమ పాత టివి ని మార్చి, కొత్తది కొని తెచ్చారు, నానీకి చూపించాలనే ఉబలాటం .... ,
అందుకే, నోము నెపంతో వచ్చింది కుందనబాల. జయశ్రీ కూడా కొత్త గ్లాస్ టేబుల్ కొన్నది,
పనిలో పనిగా నానీకి చెప్పి, చూపించొచ్చు - అని కుందనబాల వెంట వచ్చింది.
బుల్లితెరపై - ఒక అమ్మాయికి సంగీతం నేర్పుతున్నది గురు భాను*.
[=*భానుమతి] పాపం, ఆ పిల్లకు గాత్రశుద్ధి బొత్తిగా లేదు.
"ఈ హార్మణీ పెట్టెలో, నువ్వు పాడుతున్న స్వరాలకు మెట్లు కూడా లేవు."
అంటూ భానుమతి యాక్షన్ ....,
జయశ్రీ - "ఇదేమి మొరటు హాస్యం, బాబూ." అన్నది.
కుందనబాల "నేను పెద్ద కర్ణాటక సంగీతవిద్వాంసినిని ఔతానని, మా అమ్మ, ఒక *హార్మోనియం కొన్నది.
మమ్మల్ని చూసి, మా కాలనీ ఫ్రండ్స్ మరో ముగ్గురి ఇళ్ళలో - మూడు పెట్టెలు వెలిసాయి."
"ఔనా!? ఇన్నాళ్ళూ తెలీలేదు. రేపు మీ ఇంట్లో నీ కచేరీ - మేము జరూర్ హాజర్."
"అబ్బే, అంత సీన్ లేదు. మా నలుగురివీ పెళ్ళిళ్ళ సంగీతాలు, నాది మా బామ్మ ఇంట్లో పెట్టేసాను.
ఎవరైనా సంగీతం ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్పాను." అన్నది కుందనబాల.
"ఐతే ఒక కొత్తరకం టూర్ ప్రోగ్రామ్ ..., మ్యూజిక్ మ్యాజిక్ - అన్వేషణ -
బాగుందా నేను ఇచ్చిన tour name!?" అన్నది జయశ్రీ. ,
************ ,
కుందన అండ్ కో - ముందుగా శంపాలత దగ్గరికి వెళ్ళారు. అచ్చట్లు ముచ్చట్లు ఐనాయి.
నెమ్మదిగా అసలు విషయానికి వచ్చారు. "ఎప్పటి హార్మణీ ... " surprise ఔతూ -
దాన్ని ఆర్ఫనేజ్ కి ఇచ్చేసాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళకి ఉపయోగం ఔతుందని."
శంపాలత సమాధానం - కుందనలత - next journey - జయశ్రీ ఫిక్స్ చేసింది.
మంజీర ఊరు చేరారు మిత్ర బృందం.
నానీ "ఈ ఊరు మా పిన్నమ్మది." అన్నది.
"అంటే ఊరంతా పిన్నమ్మ ఆస్థి కదూ, నానీ!" నవ్వుతూ అన్నది జయశ్రీ.
నానీ తమ పిన్ని ఇంటికి వెళ్ళింది, కుందనబాల, జయశ్రీ మంజీర గృహం తలుపు తట్టారు.
ఆమె తలుపు తెరిచి, "మీ ఫోన్ కాల్ వచ్చినప్పటి నుండీ -
నిన్నటినుండీ వైట్ చేస్తూనే ఉన్నాను." అంటూ ఆహ్వాన వాక్కుని అందించింది.
మధ్యాహ్న భోజనాదులు ఐనాయి. అప్పటిదాకా సస్పెన్స్ ని కొనసాగించింది మంజీర.
"పాత సామాన్లకి అమ్మేసాను." అని చెప్పింది.
నాలుగో దోస్త్ భవానీ అడ్రసు కనుక్కుని, వెళ్ళారు.
నానీ - తన పిన్నమ్మ ఇంటి సంగతులు వివరిస్తూ చెబుతుంటే ...,
గంటలు క్షణాల్లాగా గడిచాయి. భవానీ - తన వాద్యపరికరాన్ని డ్రామా కంపెనీకి ఇచ్చింది.
"ఆ కంపెనీలో శ్యామలి - నాకు ఇంతప్పటి నుండీ తెలుసు." నానీ అన్నది.
జయశ్రీకి కొత్త హుషారు కలిగింది. "నానీ! మనం ఆ డ్రామా కంపెనీకి వెళ్దాం."
అప్పటికే జయశ్రీ కొన్ని అడుగులు ముందుకు వేసింది.
తన జర్నలిస్ట్ చెల్లెలు చంద్రికను, ఆమె సంగీతం టీచర్ పద్మినీరాణి లని రప్పించింది.
అందరూ భాసుర నాటక కంపెనీ వాళ్ళను కలిసారు.
ఊరి బైట రేకుల కప్పులు వేసిన ఇళ్ళు వంటి వాటిలో ఉంటున్నారు వాళ్ళు.
భాసుర నాటక కంపెనీ పిల్లలు - చాలా బాగా పద్యాలు ఆలపిస్తూ, పాటలు పాడుతూ
*హార్మణీ పై తమ వేళ్ళను చకచకా కదిలిస్తున్నారు.
వాళ్ళ మహత్తర నైపుణ్యాలు అందరినీ ఆనందంలో ఓలలాడిస్తునాయి.
**************** ************************* ,
& *; హార్మోనియం/ హార్మనీ పెట్టె - హార్మణీ పెట్టె/ harmonium - music ;
& [ పాత్రలు ;- నానీ - జయశ్రీ - కుందనబాల ; జయశ్రీ చిన్నాయన భవానీ శంకర్ - జయశ్రీ యొక్క జర్నలిస్ట్ చెల్లెలు చంద్రిక & శంపాలత - మంజీర - భవానీ & భాసుర నాటక కంపెనీ పిల్లలు - సంగీతం టీచర్ పద్మినీరాణి - ] ;-
& హార్మణీ పెట్టె - రాగాల మణి నిధి - 40 ;
================================ ;
hArmNI peTTe - rAgAla maNi nidhi - 40 ;- story ;-
TV lO BAnumati sinimaalO kaameDI sInu wastunnadi.
kumdanabAla, jayaSree "waiSAKam nOmu
nOcukunnaamu, nAnI!" amTU waccaaru.
nAnIki waDapappu prasaadam iccimdi kumdanabAla,
jayaSrI bobbaTlu prasaadam iccimdi.
"pesarapappu naaku aragadu ammaNNI, bobbaTlu
naa puTTimTlO pamDaga wastE caalu, illamtaa
bobbaTla waasanalu ... ghumaghumalADutumDEdi."
nAnI mATalatO - tanu teccina prasaadaanni
aame tinadani, tatimmAwALLaku istumdani ardhamaimdi kumdanabAlaku.
iwALa tama paata TV ni maarci, kottadi koni teccaaru,
naaneeki cuupimcaalanE ubalATam
.... , amdukE, nOmu nepamtO waccimdi kumdanabAla.
jayaSrI kUDaa kotta glaas Table konnadi,
panilO panigaa naaneeki ceppi, cuupimcoccu - ani
kumdanabAla wemTa waccimdi.
bulliterapai - oka ammAyiki samgItam nErputunnadi guru bhAnu.
pApam, A pillaku gAtraSuddhi bottigA lEdu.
"I haarmaNI peTTelO, nuwwu pADutunna swaraalaku meTlu kUDA
lEwu." amTU BAnumati yaakshan ....,
jayaSreeki - idi moraTu haasyam, bAbU." annadi.
kumdanabAla "nEnu pedda karNATaka samgeetawidwaamsinini autAnani,
mA amma, oka haarmOniyam konnadi.
mammalni cuusi, maa colony friends
marO mugguri iLLalO - mUDu peTTelu welisaayi."
"aunA!? innALLU teleelEdu. rEpu mee imTlO nee kacErI - mEmu jaruur haajar."
"abbE, amta scene lEdu. maa naluguriwee peLLiLLa samgItAlu,
naadi maa baamma imTlO peTTEsaanu. ewarainaa samgeetam aasakti
unna wALLaki iwwamani ceppaanu." annadi kumdanabAla.
"aitE oka kottarakam TUr prOgraamm ...,
music majic - anwEshaNa - baagumdaa nEnu
iccina `tour name`!?" annadi jayaSrI.
kumdana and co - mumdugaa SampAlata daggariki weLLAru.
accaTlu muccaTlu ainaayi.
nemmadigaa asalu wishayaaniki waccaaru.
"eppaTi haarmaNI ... "
surprize autuu - daanni aarphanEj ki iccEsaanu.
imTresT unnawALLaki upayOgam autumdani.
" SampAlata samaadhaanam - kumdanalata -
`next journey` - jayaSrI fix cEsimdi.
mamjeera uuru cEraaru mitra bRmdam.
nAnI "I Uru maa pinnammadi." annadi.
"amTE uuramtaa pinnamma aasthi kaduu, nAnI!"
nawwutuu annadi jayaSrI.
nAnI tama pinni imTiki weLLimdi,
kumdanabAla, jayaSrI mamjIra gRham talupu taTTAru.
aame talupu terici, "mee phOn kaal waccinappaTi numDI -
ninnaTinumDI waiT cEstUnE unnaanu."
amTU aahwaana waakkuni amdimcimdi.
madhyaahna BOjanaadulu ainaayi. appaTidaakaa
saspence ni konasaagimcimdi mamjIra. "paata
saamaanlaki ammEsaanu." ani ceppimdi.
naalugO dOst BawAnI aDrasu kanukkuni, weLLAru.
nAnI - tana pinnamma imTi samgatulu
wiwaristuu cebutumTE ..., gamTalu kshaNAllAgA gaDicAyi.
BawAnI tana waadyaparikaraanni Drama company ki iccimdi.
"aa kampeneelO Syaamali - naaku imtappaTi numDI telusu." nAnI annadi.
jayaSrIki kotta hushaaru kaligimdi.
"nAnI! manam A Draamaa kampeneeki weLdAm."
appaTikE jayaSrI konni aDugulu mumduku wEsimdi.
tana jarnalisT cellelu camdrikanu,
Ame samgItam Teacher padminIrANilani rappimcimdi.
amdarU BAsura nATaka kampenI wALLanu kalisAru.
uuri baiTa rEkula kappulu wEsina iLLu wamTi waaTilO umTunnAru wALLu.
BAsura nATaka kampenI pillalu - cAlA bAgA padyAlu AlapistU,
pATalu pADutU hArmaNI pai, tama wELLanu cakacakaa kadilistunnaaru.
wALLa mahattara naipuNyAlu amdarinI aanamdamlO OlalADistunnAyi.
**************** ************************* ,
[ pAtralu ;- nAnI - jayaSrI - her journalist cellelu camdrika ; her cinnAyana BawAnI Samkar ; & kumdanabAla &SampAlata - mamjeera - BawAnI - jayaSrI yokka , samgItam Teacher padminIrANi - BAsura Drama company - students ];
[పాత్రలు ;- నానీ - జయశ్రీ, her చిన్నాయన భవానీ శంకర్, her జర్నలిస్ట్ చెల్లెలు చంద్రిక , కుందనబాల &
శంపాలత - మంజీర - భవానీ & భాసుర నాటక కంపెనీ పిల్లలు - సంగీతం టీచర్ పద్మినీరాణి ] ;
many colors - 40 story ; harmonium -NANI |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి