18, జూన్ 2022, శనివారం

దంత పురాణం

"మా కజిన్స్, రాజశ్రీ, నళిని"  అని  - రెస్టోర్ రాజా - జయశ్రీ పరిచయం చేస్తూ, 
"వీళ్ళకు మంచి ఇల్లు బాడుగకు కావాలి, నానీ" అన్నారు. 
నానీ మేడ మీది మూడు చిన్న పోర్షన్లు house full - 
అందుకని, మూడో వీధి అచ్చమ్మ దద్దరికి పంపించింది. 
మూడు గదులు, కొత్త ఇల్లు - చిన్నదే ఐనా మంచి వసతులు - 
అమ్మాయిలకు కావలసిన భద్రత అక్కడ ఉన్నది, బొత్తిగా తెలీని ఊళ్ళో - 
యువతీలలామలకు ఖచ్చితంగా కావాల్సింది సేఫ్టీ - రక్షణ కదా! 
ఐతే, అక్కడ ఉన్నవారు ట్రాన్స్ఫర్ ఐ వెళ్తున్నారు. 
ఐతే, వాళ్ళు ఖాళీ చేసి, నళిని వాళ్ళకి పోర్షన్ అప్పజెప్పడానికి ఇంకా పది రోజులు పడ్తుంది. 
 అర్జంటు గా ఈ ఊళ్ళో కంపెనీలో - ఎల్లుండి కల్లా రాజశ్రీ జాయిన్ అవాల్సింది, 
నానీ ఆపద్ధర్మ హస్తం అవసర సమయానికి అభయం ఇచ్చింది. 
తాత్కాలికంగా, అత్యవసర సామాన్లు తీసుకుని, నానీ ఇంట్లో బస చేసారు ఇద్దరూ. 
జయశ్రీ కొంచెం గడుసుతనం ఉన్న మనిషి. 
now .... రెస్టోర్ రాజా, ఆమె పెళ్ళికి వెళ్తున్నారు. 
ఎంత మనవాళ్ళు ఐనా ఇంటి తాళం - 
'తన cousins' అని చెప్పిన లేడీస్ చేతికి ఇవ్వలేదు. 
సంసారానికి కావాల్సిన ముందు జాగ్రత్త చర్యలలో 
ఇటువంటి కొన్ని చిట్కాలను పాటించక తప్పదు కదా! 
final గా నానీ ఇల్లు - కొత్త అమ్మాయిలకు ఆశ్రయపీఠం అయ్యింది. 
అస్తు -  శుభమస్తు ;
@@@@@ ,

మర్నాడు ఫెళఫెళార్భాటాలతో జడివాన ...., 
రాజశ్రీకి ఉరుములు మెరుపులు అంటే తగని భయం. 
నానీ తలుపు తట్టింది. "నేనున్నాను గదా, ఎందుకమ్మా, అంత భయం" 
నానీ - రాజశ్రీ వీపు నిమురుతూ ధైర్యం చెప్పేసరికి, రాజశ్రీకి ఊరట లభించింది. 
నళిని ధైర్యస్థురాలు, అందుకేనేమో రాజశ్రీని ఎగతాళి చేయ బుద్ధేసింది. 
నానీ "అట్లాగ ఎగతాళి చేయడం, తప్పు కదమ్మా" అని మందలించడంతో - నళిని బుద్ధిగా ఊరుకుంది. 
@@@@@, 

నానీ ఇల్లు, ఊరి కొసన ఉన్నదనే చెప్పాలి. కొత్తగా డెవలప్ ఔతున్న కాలనీ ఇది. 
ఇంటికి రెండు వైపులా ఖాళీ స్థలం - అందుమూలాన - ఉరుముల ధ్వని - మిక్కుటంగా ఉంది. 
చెవి పక్కనే ఆ సౌండ్ ప్రతిధ్వని - అసలే భయవిహ్వల రాజశ్రీ - 
నవారుమంచం - కొత్తచోటు, నిద్రపట్టక, కూర్చున్నది.
 రాజశ్రీ భయం పోగొట్టడానిని నానీ - ఎన్నో అనుభవాలను పూసగుచ్చినట్టు చెప్పసాగింది. 
తెలిసిన సంఘటనలు, ముచ్చట్లు చెప్పింది. కబుర్లు, ముచ్చట్లతో - 
@@@@@ ,

"నానీ, మా పిన్ని మంచి పేరున్న డెంటిస్టు. మీకు ఫ్రీగా చేయిస్తాను. 
ముందు మూడు పళ్ళూ వేయించుకోండి" 
"ఈ వయసులో కట్టుడు కట్టుడు పళ్ళు పెట్టించుకోవాలా, చాల్లే అమ్మాయ్, 
చుట్టాలు పక్కాలు ఎగతాళి చేస్తారు. చాల్లే, ఊరుకో." 
రాత్రి రాజశ్రీ వద్ద, నులకమంచంలో పడుకుని మాటాడుతున్నప్పుడు 
రాజశ్రీకి నానీ నోట్లో ముందు భాగం బోసిగా అగుపించింది. ముందు మూడు పళ్ళు లేవు. 
 "వద్దు" అని అంటూ క్రమంగా గతకాలం అనుభవాల తెరల వెనుకకి తీసుకెళ్ళాయి - 
నానీ ఆషామాషీ కబుర్లు. రాజశ్రీకి, నళినికి నానీ దంత పురాణం - 
చాలా interest ని కలిగించింది. 
@@@@@  

"పాలపళ్ళు రెండు బాగా వదులు ఐనాయి" 
"పాలపళ్ళు అంటే" అని శ్రోత ప్రశ్న. 
 "అంటేనా - మనుషులకు, జంతువులకీ - అన్నిటికీ - 
చిన్నవయసులో - ఒకసారి పళ్ళు అన్నీ ఊడిపోతాయి. 
ఆనక మళ్ళీ కొత్తపళ్ళు వస్తాయి."
 మనిషికి ఐదు, తొమ్మిది ఏళ్ళ దాకా ఇట్లాగ ఒక్కొక్క పన్ను ఊడి, 
 మళ్ళీ మొలుస్తాయి. ఒక పట్టు అయ్యాక, మళ్ళీ కొత్తపళ్ళు మొలుచుకొస్తాయి. 
ఇప్పుడు నీకూ, నాకూ మన అందరికీ ఉన్నవి అవే, అర్ధమైందా!?" 
"ఓహో, ఐతే మిల్కీ టూత్ అన్న మాట" 
నానీ నుండి రాజశ్రీకి - అన్న మాట - అనే ఊతపదం సంక్రమించింది. " 
"నా చిన్నతనంలో ముందు ఉన్న ఈ పారపళ్ళు - చూడు, 
వీటికి ఒక మంచి నేపథ్యం ఉంది." 
"ఓ, బాక్ గ్రౌండ్ అన్న మాట" రాజశ్రీ కొసరు వేస్తుండగా - 
నానీ చిన్నపాటి కథను చెప్పింది. 
"ఇవి రెండూ సగం, ముప్పావు శాతం ఊడాయి, 
ఆ తర్వాత - చిగురు నుండి  ఊడిరానని మొరాయించాయి. 
ఆ దంతద్వయం పై చిగురుకు అంటిపెట్టుకుని వేళ్ళాడుతూ ఉన్నాయి. 
ఎంతకీ ఊడి రావడం లేదు. పెదవులకు గుచ్చుకుంటుండేవి. 
మాట్లాడ లేక, తినలేక - ఎన్ని ఇబ్బందులు పడ్డాననుకున్నావు ........ "
 "ష్, నిజమే, ఊడీ, ఊడక ... " నళిని లుప్చలు కొట్టింది. = నళిని లుప్చలు కొట్టింది. 
6] నానీ కథనంలో ట్విస్టు రాజశ్రీని ఆశ్చర్యంతో చుబుకంపైన చెయ్యి వేయించింది. 
"మా దొడ్డమ్మ ఓ చిట్కా చెప్పింది. చెప్పడమే కాదు, 
వెనువెంటనే - తక్షణం, ఆచరణలో పెట్టేసింది కూడా. 
[నానీ కొరుకుడు పడని పదాలను వాడినప్పుడల్లా, తోక వెంబడి నారాయణా లాగ, 
తెలుగు మాటను సైతం తగిలిస్తుంది, తన శ్రోతలకు బోధ పడడం కోసం ] 
"మా ఆమ్మ రెండు జానలు దారం కొలిచి తెచ్చింది. 
 సన్నని దారాన్ని నా పంటి చుట్టూ తిప్పి ముడివేసింది, ..... ,
చటుక్కున బిగించి లాగింది, అంతే! 
అది కాస్తా పుటిక్కిన నా ఒళ్ళో పడింది." 
"ఏంటీ, నిజంగానా!?" 
ఈ కొసమెరుపు ఊహించనే లేదు రాజశ్రీ. 
 "మరే, రెండో పన్నును కూడా, అట్లాగే చిటికెలో,
సూత్రబంధనం చేసి, నా అరచేతిలో పెట్టేసింది." 
@@@@@ 

ఊరి నుండి తిరిగివచ్చిన జయశ్రీకి నానీ దంత గాధను రాజశ్రీ చెప్పింది. 
"ఇదే పనికి - మా డెంటిస్ట్ పిన్ని ఐతే, గుప్పెడు ఫీజు, నాలుగైదు రోజులు అప్పాయింటుమెంట్లు - 
మీటింగులు -  కంప్యూటర్ లాబ్ test లకు - అంటూ - తర్వాత పూర్తి అయ్యేది." జయశ్రీ అనుకుంది.
తద్వారా తతిమ్మావాళ్ళకు నెమ్మదిగా *నిస్తంత్రీవార్త చేరింది. 
జయశ్రీ తన భర్తకు పూస గుచ్చినట్లు నళినీ ద్వయం - చెప్పిన కథానిక యావత్తూ చెప్పింది. 
అంతా విన్నాక - రెస్టోర్ రాజా నవ్వు ఆపుకోలేకపోయాడు. 
 గట్టిగా చాలాసేపు నవ్వుతూనే ఉన్నాడు. 
నానీ పరుగెత్తుకు వచ్చింది. తొంగిచూస్తూ, లోపలికి వచ్చింది. 
"ఏంటబ్బాయ్! మా ఇంటి పై కప్పు ఎగిరిపోయేట్లు అంతగా, ఆ నవ్వులు ..., జాగర్త, 
మా కప్పు రిపేరు - నువ్వే చేయించాల్సివస్తుంది మరి." అన్నది, 
మందహాసం చేస్తూ. నానీ ఊహించగలిగింది, అబ్బాయి వికటాట్టహాసానికి కారణం ఏమిటో, 
ముసిముసినవ్వులు నానీ పెదవుల మాటున దాచుకుంటూ, చిన్నగా గదమాయించింది. 
*నిస్తంత్రీవార్త = electro magnetic Radio Waves ;;
[పాత్రలు ;- నానీ - రెస్టోర్ రాజా - జయశ్రీ jayaSrI cousin sisters = రాజశ్రీ & నళిని ] & 
==========================, 
"maa kajins, rAjaSree, naLini" - ani resTOr rAjA - 
jayaSrI paricayam cEstuu, 
"wILLaku mamci illu bADugaku kaawAli, nAnI" 
annAru.
nAnI mEDa meedi mUDu cinna pOrshanlu `house full` - 
amdukani, mUDO wIdhi accamma daddariki pampimcimdi. 
kotta illu, mUDu gadulu - cinnadE ainaa mamci wasatulu - 
ammaayilaku kaawalasina bhadrata akkaDa unnadi, 
bottigaa teleeni ULLO - yuwatIlalAmalaku 
khaccitamgaa kaawaalsimdi sEphTI - rakshaNa kadA!
aitE, akkaDa unnawaaru Traansphar ai weLtunnAru. 
aitE, wALLu KALI cEsi, naLini wALLaki pOrshan 
appajeppaDAniki imkaa padi rOjulu paDtumdi. 
arjamTu gaa ee ULLO kampeneelO - ellumDi kalaa 
raajaSree jaayin awaalsimdi, naanee 
aapaddharma hastam awasara samayaaniki abhayam iccimdi.
taatkaalikamgaa, atyawasara saamaanlu teesukuni, 
naanee imTlO basa cEsaaru iddaruu.
jayaSree komcem gaDusutanam unna manishi. 
resTOr raajaa, aame peLLiki weLtunnaaru. 
emta manawALLu ainA imTi tALam - 
tana kajins ani ceppina lEDIs cEtiki iwwalEdu. 
samsaaraaniki kaawaalsina mumdu jaagratta 
caryalalO iTuwamTi konni ciTkaalanu pATimcaka tappadu kadA!
`final` gaa nAnI illu - kotta ammaayilaku aaSrayapITham ayyimdi.

@@@@@ ,

2] marnADu pheLapheLArBATAlatO jaDiwAna ...., 
rAjaSrIki urumulu merupulu amTE tagani Bayam. nAnI talupu taTTimdi.
"nEnunnaanu gadaa, emdukammaa, amta bhayam"  
nAnI - raajaSrI weepu nimurutuu dhairyam 
ceppEsariki, raajaSrIki uuraTa labhimcimdi. 
naLini dhairyasthuraalu, amdukEnEmO raajaSrIni egatALi cEya buddhEsimdi.
nAnI "aTlaaga egatALi cEyaDam, tappu kadammA" 
ani mamdalimcaDamtO - naLini buddhigaa uurukumdi.  

@@@@@ , 

nAnI illu, uuri kosana unnadanE ceppAli. 
kottagaa Develop autunna kaalanee idi. imTiki remDu waipulA KALI sthalam - 
amdumuulaana - urumula dhwani - mikkuTamgaa umdi. 
cewi pakkanE aa saumD pratidhwani - 
asalE Bayawihwala raajaSrI - nawaarumamcam - 
kotta cOTu, nidrapaTTaka, kuurcunnadi. 
raajaSrI bhayam pOgoTTaDAnini nAnI - 
ennO anubhawaalanu puusaguccinaTTu ceppasaagimdi. 
telisina samghaTanalu, muccaTlu ceppimdi. kaburlu, muccaTlatO - 
raajaSrIki bhayam teleekumDA, Taimm gaDicElA cEyagaligimdi.

@@@@@ ,

"nAnI, maa pinni mamci pErunna DemTisTu. meeku freegA cEyistaanu. 
mumdu mUDu paLLU wEyimcukOmDi" 
"ii wayasulO kaTTuDu kaTTuDu paLLu peTTimcukOwaalaa, 
caallE ammaay,  cuTTAlu pakkaalu egatALi cEstAru. caallE, UrukO." 
rAtri rAjaSrI wadda, nulakamamcamlO paDukuni 
maaTADutunnappuDu raajaSrIki nAnI nOTlO 
mumdu bhaagam bOsigA agupimcimdi. mumdu mUDu paLLu lEwu. 
"waddu" ani amTU kramamgaa 
gatakaalam anubhawaala terala wenukaki teesukeLLAyi - 
nAnI aashAmAshI kaburlu. 
rAjaSrIki, naLiniki nAnI damta purANam - 
caalaa `interest` ni kaligimcimdi.

@@@@@ , 

"paalapaLLu remDu baagaa wadulu ainaayi" 
"pAlapaLLu amTE" ani SrOta praSna. 
"amTEnaa - manushulaku, jamtuwulakee - anniTikI - 
cinnawayasulO - okasaari paLLu annI UDipOtAyi. 
aanaka maLLI kottapaLLu wastaayi." manishiki aidu, 
tommidi ELLa daakaa iTlaaga okkokka pannu UDi, maLLI molustaayi. 
oka paTTu ayyaaka, maLLI kottapaLLu molucukostaayi. 
ippuDu neekuu, naakuu mana amdarikee unnawi awE, ardhamaimdaa!?" 
"OhO, aitE milkee TUt anna mATa" 
nAnI numDi raajaSIki - anna mATa - anE 
Utapadam samkramimcimdi.

@@@@@ ,

"nA cinnatanamlO mumdu unna ee paarapaLLu - cUDu, 
wITiki oka mamci nEpathyam umdi." 
"O, bAk graumD anna mATa" jayaSrI kosaru wEstumDagA - 
nAnI cinnapATi kathanu ceppimdi. 
"iwi remDU sagam, muppAwu SAtam uuDAyi, aa tarwaata - 
ciguru numDi UDiraanani morAyimcAyi. A dantadwayam  pai 
ciguruku amTipeTTukuni wELLADutU unnAyi. 
emtakI UDi raawaDam lEdu. pedawulaku guccukumTumDEwi. 
maaTlADa lEka, tinalEka - enni ibbamdulu paDDAnanukunnaawu ......... " 
"sh, nijamE, UDI, UDaka ... " 
naLini  lupcalu koTTimdi.
nAnI kathanamlO Twist raajaSrIni 
AScaryamtO cubukampaina ceyyi wEyimcimdi. 
"maa doDDamma O ciTkaa ceppimdi. ceppaDamE kAdu, 
wenuwemTanE - takshaNam, aacaraNalO peTTEsimdi kUDA. 
[nAnI korukuDu paDani padaalanu wADinappuDallA, 
tOka wembaDi nArAyaNA lAga, telugu mATanu saitam tagilistumdi, 
tana SrOtalaku bOdha paDaDam kOsam ] 
"maa aamma remDu jaanalu daaram kolici teccimdi. 
sannani daaraanni naa pamTi cuTTU tippi muDiwEsimdi, 
caTukkuna bigimci laagimdi, amtE! 
adi kaastaa puTikkina naa oLLO paDimdi." 
"EMTI, nijamgaanaa!?" 
ee kosamerupu UhimcanE lEdu rAjaSrI. 
"marE, remDO pannunu kUDA, aTlAgE ciTikelO,
suutrabamdhanam cEsi, naa aracEtilO peTTEsimdi." 

@@@@@@

Uri numDi tirigiwaccina jayaSrIki 
nAnI damta gaadhanu rAjaSrI ceppimdi.
"idE paniki - maa DemTisT pinni aitE, 
guppeDu pheeju, naalugaidu rOjulu appaayimTumemTlu 
- meeTimgulu, kampyuuTar laab `test` laku - amTU - 
tarwaata puurti ayyEdi." jayaSrI anukumdi. 
tadwaaraa tatimmAwALLaku nemmadigaa 
*nistamtreewaarta cErimdi.
jayaSrI tana bhartaku puusa guccinaTlu 
naLinee dwayam - ceppina kathaanika yaawattuu ceppimdi. 
amtaa winnaaka -  resTOr rAjA nawwu aapukOlEkapOyADu. 
gaTTigaa caalaasEpu nawwutuunE unnADu. 
nAnI parugettuku waccimdi. tomgicuustuu, lOpaliki waccimdi.
"EmTabbAy! maa imTi pai kappu egiripOyETlu amtagA, 
aa nawwulu ..., jaagarta, 
maa kappu ripEru - nuwwE cEyimcAlsiwastumdi mari." 
annadi, mamdahaasam cEstU.
nAnI uuhimcagaligimdi, 
abbaayi wikaTATTahAsAniki kAraNam EmiTO ... , 
musimusinawwulu nAnI pedawula mATuna daacukumTU, 
cinnagaa gadamaayimcimdi.
&
*nistamtreewaarta =*electro magnetic Radio Waves ;
[pAtralu ;- nAnI - jayaSrI bharta resTOr rAjA - 
jayaSrI cousin sisters = rAjaSree, naLini ]
దంతపురాణం ; story ;
many clrs - 39 story 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...