19, జులై 2024, శుక్రవారం

కాలమహిమ ఇదేనా!? ఔరా- 62

"తాతయ్యా, జిమ్ కి వెళ్ళొస్తా" 

మనవడిని పిలుస్తూ నాయనమ్మ అన్నది "ఉరేయ్, మీ తాతయ్య ఖళ్ళు ఖళ్ళున దగ్గుతున్నాడు. రాత్రంతా కంటి మీద కునుకు లేదు" 

"ప్చ్, పాపం, నైట్ నిద్ర లేదు, అదన్న మాట నీ బాధ" జోక్ వేశాననుకున్నాడు మనవడు జాకీ - ఉరఫ్ జానకిరాముడు. జాకీ తల్లిదండ్రులు ఊరికి వెళ్ళారు - అందువలన - మనవణ్ణి అడగాల్సివచ్చింది. 

ఓ పట్టాన ఏ పని చెప్పినా - జాకీ చెయ్యడు. 

"ఇంత చిన్న పని - పనమ్మాయి వస్తుంది కదా, చెప్పు బామ్మా!" అనేసాడు.   

ఇంతలో ఊరి నుండి వచ్చారు కొడుకు, కోడలు - ఆటోకి డబ్బులిచ్చి, లోనికి వచ్చారు. "జాకీ! ఆటోలో సూట్‌కేసు ఉంది,  కాస్త తీసుకు రా" 

"హు, ఇది కూడా నాకు చెప్పాలా మమ్మీ! ఆటో డ్రైవర్‌ని తెమ్మంటే తెస్తాడు కదా!" 

"వాటిలో గిఫ్టులు, వాల్యుబుల్స్ ఉన్నాయి." తల్లి అన్నది. 

విసుక్కుంటూనే జాకీ తక్కిన లగేజీ తెచ్చాడు. 

"ఇంక జిమ్ కి టైమ్ అయింది, బై!" పరుగు లాంటి నడకతో వెళ్ళి, బైక్ స్టార్ట్ చేసాడు. 

తాతయ్య గొణిగాడు, "స్టేషన్‌కి వెళ్ళి, అమ్మా నాన్నలను ఇంటికి తీసుకురావొచ్చు కదా!  ఏమిటో, ఈ కాలం పిల్లలు" నిట్టూర్చింది నానీ - 

భర్త నిట్టూర్పుకు ఒక డ్యూయట్ మాదిరిగా .... ,

ఇదివరకు ఒకసారి ఇంటిల్లిపాదీ - జిమ్ [zim] 💆🙍 కి వెళ్ళి, చూసొచ్చారు

జిమ్ లో జరుగుతున్న జిమ్మిక్కులు, మ్యాజిక్కులు వాళ్ళని విస్మయపరిచాయి.-

ట్రెడ్‌మిల్లు, వెయ్యింగ్ మిషను - బరువులు ఎత్తడం - అనేక వింత పరికరాలు - కండలు  కరిగేటందుకు, ఆరోగ్యం కోసము - మిషన్ల పైన - 

కనీసం ఆరు మైళ్ళు అదేమైన పరుగులు - చెమటలు కారితే 

ఒంట్లో చెడ్డ నీళ్ళు అన్నీ వదిలి, హెల్త్ బాగుంటుందిట.  

"ఆరోగ్యమే మహా భాగ్యం, ఇదీ బాగానే ఉంది" అనుకున్నారు పెద్దలు.

కోడలు వాచ్‌మన్‌ని పిలిచి - కిరాణాకొట్టు, మెడికల్ షాపుల నుండి తేవాల్సిన  Itoms 

లిస్ట్‌ని చెప్పి, మనీ ఇచ్చింది. 

"నాకు అర్ధం కానిది ఒకటే! అట్లాగ వ్యాయామశాలలు, ఈత కొలనులు - 

వెళ్తునారు, Zim excercise ఏవేవో చేసూ, ఆపసోపాలు పడ్తున్నారు, 

ఇంటి పని చెయ్యమంటే అంత విసుక్కుంటున్నారే" అన్నది నానీ. 

"ఈ కాలం పిల్లలు అంతే - అని - మన మాయాబజార్ - సినిమాలో క్రిష్ణయ్య చెప్పనే చెప్పాడు కదా!" అన్నాడు జాకీ తాతయ్య జనాంతికంగా, 

ఆయనకి పాతకాలం పౌరాణిక మూవీ డైలాగుల నుండి - బోలెడు కొటేషన్స్ - 

ఇట్టే వెలికి తీసి, ముందు పరుస్తాడు.

"ఔను సుమీ! అన్నీ మనకి - పూర్వం వాళ్ళు ముందే చెప్పారు." 

భర్త వెంకటప్పయ్య గారి విషయపరిజ్ఞానానికి మురిసిపోతూ వంత పాడింది నానీ.

కోడలు పనమ్మాయికి గిన్నెలు  వేసి, వేణ్ణీళ్ళ గిన్నెను వారి ముందర పెట్టింది - 

కొడుకు దుప్పటి, టవలు తెచ్చి, 

"నాన్నా, ముందు ఆవిరి పట్టుకోండి, జలుబు తగ్గుతుంది." 

అంటూ దగ్గర కూర్చుని, చిట్కా వైద్యానికి ఉపక్రమించాడు. ------------ 

టాబ్లెట్లు, టానిక్కులు - ఇంటికి వచ్చేలోపున - 

ఐనవారి నుండి లభిస్తున సాంత్వన

వారికి ఎంతో ఉపశమనం ఇస్తున్నది మరి.

వాచ్‌మాన్ - సిబ్బంది - షాపులకి వెళ్ళి, 

తెచ్చిచ్చిన ఐటమ్స్ ని తీసుకున్నారు, ఇంతలో జాకీ వచ్చాడు. 

బైక్ దిగి, కొత్త సినిమా సాంగ్సుని హమ్ చేస్తూ సోఫాలో కూలబడ్డాడు, 

"మమ్మీ, టిఫిన్" కేకేసాడు పుత్రరత్నం జాకీ.

పాట - గట్టిగానే  *'సాంగి'స్తున్నాడు - [*song]

ఆ song సారాంశం మనసుకి పట్టకుండానే - 

"దేనికదే, దానికదే - 

     దీనికిదే - దేనికదే - 

        మై లవ్! ఓ మేరా బేబీ ...... "  

నానీ గ్రాండ్‌సన్ దగ్గరికి వెళ్ళింది, మాట్లాడాలని .... ,  - 

చెవులలో అవేవో వైర్లను పెట్టుకున్నాడు - ఇంకేవీ వినిపించవు .... , 

అది అంతే! 

కారుమబ్బులు కమ్ముకువస్తూ, ఆకాశంలో ఉద్భవిస్తున్న విద్యుల్లతలు - 

"బిజిలీ, బిజిలీ, బిజీ బిజీ - " జాకీ కూనిరాగం తీస్తున్నాడు -

"కక్కామా, నాకో సందేహం, 'మనవడు '-

కూనిరాగం తీస్తున్నాడు కదా ...... "

"ఔను, 'మనవాడు' -

ఏదో పాట అనుకుంటూ ఏదో రాగాన్ని ఖూనీ చేస్తున్నాడు. 

అదే కదా భామినీ, అదే కదా, నీ డౌటు" 

వెంకటప్పయ్య ఉరఫ్ కక్కామా - పుసుక్కున నవ్వాడు. 

"ఊహు, అది కాదండీ! వాడు కమ్మగా పాడుతున్నాడు కదా,  👂

చెవుల్లో వైర్లు పెట్టేసుకుని. కనీసం తన పాట తనకైనా వినిపిస్తుందా - అని!?"

కొడుకు, కోడలు పకపకా నవ్వుతూ అన్నారు, 

"ఆ వైర్లను `ear phones` అంటారు అత్తయ్యగారూ!" 

"అమ్మా! నువ్వన్న మాట కరెక్టే, నిజంగానే - ఇక రాబోయే కాలం ఇదే మాదిరి ఔతుందేమో, ఇప్పటికి - పెద్దల మాటలు చెవికి ఎక్కడం లేదు. 

ఇక రానురానూ ...... మనిషికి - తన మాట తనకే వినిపించదేమో - తెలీడం లేదు."

"యంత్రయుగం తర్వాత - కంప్యూటర్ యుగం మొదలైంది,

పక్కన నిలబడి మాట్లాడే వారే కరువయ్యారు.

కాలక్రమంలో - సైన్సు స్పీడు ధాటికి - 

ఈ మనిషి - తనను తానే మర్చిపోతున్నాడు,

తన అస్తిత్వాన్ని ఏ తుంగల్లోనో తొక్కేసుకుంటూ -

ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాడు, ఔరా"

ఆ ఇంట్లో వారి నిట్టూర్పులు - ఆ నాలుగు గోడల మధ్య ఉన్న

గాలి కెరటాలలో కలిసిపోతున్నాయి.

====================================== , 

kAlamahima idEnA!?aurA - 62 ; naanee story - 62

"taatayyaa, jim [zim] ki weLLostaa" 

manawaDini pilustuu nAyanamma annadi "urEy, mee taatayya KaLLu KaLLuna daggutunnADu. raatramtaa kamTi meeda kunuku lEdu" 

"pc, paapam, naiT nidra lEdu, adanna mATa nI baadha" 

jOk [joke] wESAnu ani anukunnaaDu manawaDu jAkI - uraph jaanakiraamuDu. 

jaakee tallidamDrulu uuriki weLLAru - amduwalana - manawaNNi aDagaalsiwaccimdi. 

O paTTAna E pani ceppinaa - jaakee ceyyaDu. 

"imta cinna pani - panammaayi wastumdi kadaa, ceppu bAmmA!" anEsADu.   

 imtalO uuri numDi waccaaru koDuku, kODalu - ATOki Dabbulicci, lOniki waccAru. 

"jaakI! aaTOlO sUT^kEsu umdi,  kaasta teesuku rA" 

"hu, idi kUDA naaku ceppaalaa mammI! ATO Draiwar^ni temmamTE testADu kadA!" 

"wATilO giphTulu, waalyubuls unnaayi." talli annadi. 

wisukkumTUnE jaakee takkina lagEjI teccaaDu. 

"imka jim^ki Taimm ayimdi, bai!" parugu laamTi naDakatO weLLi, 

baik sTArT cEsADu. 

taatayya goNigADu, "sTEshan^ki weLLi, ammA naannalanu imTiki teesukuraawoccu kadA! EmiTO, I kAlam pillalu" niTTUrcimdi naanee - bharta niTTUrpuku oka DyUyaT maadirigaa .... ,

 [ Zim excercise 

idiwaraku okasAri imTillipAdee - jimm ki weLLi, cUsoccaaru

jimm lO jarugutunna jimmikkulu, myaajikkulu wALLani wismayaparicaayi.-

TreD^millu, weyyimg mishanu - baruwulu ettaDam - anEka wimta parikaraalu - kamDalu  karigETamduku, aarOgyam kOsamu - mishanla paina - kaneesam aaru maiLLu adEmaina parugulu - cemaTalu kaaritE omTlO ceDDa nILLu annI wadili, helt baagumTumdiTa.  "ArOgyamE mahA BAgyam, idee bAgaanE umdi" anukunnaaru peddalu.

kODalu waac^man^ni pilici - kirANAkoTTu, meDikal shApula numDi tEwaalsina lisT^ni ceppi, manee iccimdi. 

"naaku ardham kaanidi okaTE! aTlAga wyaayaamaSAlalu, Ita kolanulu - weLtunaaru, 

EwEwO cEsU, aapasOpaalu paDtunnaaru, 

imTi pani ceyyamamTE amta wisukkumTunnaarE" annadi nAnee. 

"I kaalam pillalu amtE - ani - mana maayaabajaar - sinimaalO krishNayya ceppanE ceppADu kadA!" annaaDu jaakee taatayya janaamtikamgaa, 

Ayanaki paatakaalam paurANika muuwee Dailaagula numDi - bOleDu koTEshans - iTTE weliki teesi, mumdu parustADu.

"aunu sumI! annee manaki - puurwam waaLLu mumdE ceppaaru." 

Barta wemkaTappayya gaari wishayaparijnaanaaniki 

murisipOtuu wamta paaDimdi naanee.

kODalu panammaayiki ginnelu  wEsi, 

wENNILLa ginnenu waari mumdara peTTimdi - 

koDuku duppaTi, Tawalu tecci, 

"naannaa, mumdu aawiri paTTukOmDi, jalubu taggutumdi." 

amTU daggara kuurcuni, ciTkA waidyaaniki upakramimcaaDu. ------------ 

TAbleTlu, TAnikkulu - imTiki waccElOpuna - 

ainawaari numDi labhistuna saamtwana - 

waariki emtO upaSamanam istunnadi mari. [ఐటమ్స్ ]

waac^maan - sibbamdi - shaapulaki weLLi, 

tecciccina aiTamm s^ ni teesukunnaaru, imtalO jaakee waccaaDu. 

baik digi, kotta sinimaa saamgsuni hamm cEstU sOphaalO kuulabaDDADu, 

"mammee, Tiphin" kEkEsADu putraratnam jAkI.

paaTa - gaTTigaanE saamgistunnADu - aa `song` saaraamSam manasuki paTTakumDAnE - 

"dEnikadE, daanikadE - 

"deenikidE - dEnikadE - 

   mai law! O mEraa bEbI ...... "  

naanee graamD^san daggariki weLLimdi, mATlADAlani .... ,  - 

cewulalO awEwO wairlanu peTTukunnADu - imkEwI winipimcawu .... , 

adi amtE! 

kaarumabbulu kammukuwastuu, aakaaSamlO udbhawistunna widyullatalu - 

"bijilee, bijilee, bijee bijee - " jaakee kuuniraagam teestunnADu -

"kakkaamaa, naakO samdEham, 'manawaDu '-

kuuniraagam teestunnADu kadA ...... "

"aunu, 'manawADu ' -

EdO pATa anukumTU EdO raagaanni KUnI cEstunnaaDu. 

adE kadaa BAminI, adE kadaa, nI DauTu" 

wemkaTappayya uraph kakkaamaa - pusukkuna nawwADu. 

"Uhu, adi kaadamDI! waaDu kammagaa paaDutunnaaDu kadaa, 

👂cewullO wairlu peTTEsukuni. kaneesam tanapaTa tanakainaa winipistumdaa - ani!?"

koDuku, kODalu pakapakaa nawwutuu annaaru, 

"A wairlanu `ear phones` amTAru attayyagaarU!" 

"ammA! nuwwanna maaTa karekTE, nijamgaanE - ika raabOyE kaalam idE maadiri autumdEmO, ippaTiki - peddala mATalu cewiki ekkaDam lEdu. 

ika rAnuraanuu ...... manishiki - tana mATa tanakE winipimcadEmO - teleeDam lEdu."

"yamtrayugam tarwaata - kampyUTar yugam modalaimdi,

pakkana nilabaDi mATlADE wArE karuwayyaaru.

kaalakramamlO - sainsu spIDu dhATiki - 

ee manishi - tananu taanE marcipOtunnaaDu,

tana astitwaanni E tumgallOnO tokkEsukumTU -

mumduku naDici weLLipOtunnADu, auraa"

aa imTlO waari niTTUrpulu - aa naalugu gODala madhya unna

gaali keraTAlalO kalisipOtunnaayi.

*************************************** 

పాత్రలు ;-  నానీ = నాయనమ్మ & తాత వెంకటప్పయ్య = కక్కామా ;;  కొడుకు, కోడలు - main charector = మనవడు జాకీ - ఉరఫ్ జానకిరాముడు ;

previous story ;- జూన్ 2024 = రాజా కార్టూన్ గీకుడు, గోకుడు - కథ - 61 ;- 

"నానీ, ఈ కార్టూన్ చూడండి" వీక్లీ ని చేతిలో పెట్టింది కుందనబాల ;  నానీ - పత్రిక లో - కుందన చూపిస్తున్న cartoonనిచూసి, చదువుతూ -  "హమ్మ, భడవా!" అనుకున్నది పైకే అనేసింది.

story - 62 - now ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గాడిదలు - గజరాజు - CK - 1

క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం  మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,  అంచేత &qu...