క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం
మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,
అంచేత "బోండాం బొబ్బన్న" అనే నిక్‌నేమ్ ని పిలకాయలు అనుగ్రహించారు కూడా.
బొబ్బన్న సారు - టేబుల్ మీద బెత్తంతో కొట్టీ కొట్టీ అలసిపోయారు.
విసుగెత్తిన బొబ్బన్న "సైలెన్స్ సైలెన్స్" అరిచీ అరిచీ అలిసిపోయారు.
"హ్హు, గాడిదలన్నీ ఒకే మందలో కలిసి కూర్చున్నాయి - ఇక్కడ"
గట్టిగా పెడబొబ్బ పెట్టారు.
ముందు బెంచీపై కూర్చున్న కిట్టూ లేచినిలబడ్డాడు.
బుద్ధిమంతుడిలాగా చేతులు కట్టుకుని, నిలబడి అన్నాడు కదా ......,
"ఇన్ని గాడిదలను కంట్రోల్ చేయడానికి,
ఒక్క - "ఏనుగు" - మాత్రం నిలబడే ఉంది, సార్!"
వేలెడు లేడు గానీ తన*ని ఇంత మాట అన్నాడు కదా - అని కోపం వచ్చింది,
బోండాం బొబ్బన్న మాస్టారు* గారికి.
కానీ, చిన్నోడి మాటల్లో కూసింత చమత్కారం చురుక్కుమంటున్నది ......,
అతి వినయంగా చేతులు కట్టుని - అమాయకంగా కనురెప్పలు రెపరెపలాడిస్తూ -
పెదవులు బిగించి నవ్వులు దాచుకుంటున్న తులిపి విద్యార్ధి ఫోజు నవ్వుతెప్పించింది.
మెల్లగా కోపం చల్లారిపోతుండగా - బొబ్బన్న నవ్వాడు.
class లో విద్యార్ధులు కూడా ఇప్పటిదాకా ........ ,
పెదవుల మాటున బిగబట్టిన నవ్వులను వెదజల్లారు.
&
& పాత్రలు ;- మాస్టారు బొబ్బన్న - స్కూలు విద్యార్ధులు - కిట్టూ ;
==================,
klaasulO pillalu okaTE allari cEstunnaaru, wALLa gOlanu kamTrOl cEyaDam maasTaaru wallakaawaDam lEdu. bobbanna maasTAru laawugaa unnaaru, amcEta
"bOmDAM bobbanna" anE nik^nEmm ni pilakaayalu anugrahimcaaru kUDA.
bobbanna saaru - TEbul meeda bettamtO koTTee koTTI alasipOyaaru.
wisugettina bobbanna - "sailens sailens" aricee aricee alisipOyaaru.
"hhu, gaaDidalannee okE mamdalO kalisi kuurcunnaayi - ikkaDa"
gaTTigaa peDabobba peTTAru.
mumdu bemceepai kuurcunna kiTTU lEcinilabaDDADu.
buddhimamtuDilaagaa cEtulu kaTTukuni, nilabaDi annaaDu kadaa ......,
"inni gADidalanu kamTrOl cEyaDAniki,
okka - "Enugu" - maatram nilabaDE umdi, sAr!"
wEleDu lEDu gaanee tanani imta mATa annADu kadA -
ani kOpam waccimdi, bOMDAM bobbanna maasTAru gaariki.
kaanee, cinnODi maaTallO kuusimta camatkaaram curukkumamTunnadi ......,
ati winayamgaa cEtulu kaTTuni - amaayakamgaa kanureppalu reparepalADistuu -
pedawulu bigimci nawwulu daacukumTunna
tulipi widyaardhi phOju nawwuteppimcimdi.
mellagaa kOpam callaaripOtumDagaa - bobbanna nawwADu.
`class` lO widyaardhulu kUDA ippaTidaakaa pedawula maaTuna
bigabaTTina nawwulanu wedajallaaru.
&
& paatralu ;- maasTAru bobbanna - skuulu widyaardhulu - kiTTU ;
sTuuDemTsu - biTTU wagairaa ;
& పాత్రలు ;- మాస్టారు బొబ్బన్న - స్కూలు విద్యార్ధులు - కిట్టూ ;
గాడిదలు - గజరాజు - 1 ; హాస్యం క్లిప్ కింగ్ - 1 ; &
కార్డు కథ small stories, CK <- క్లిప్కింగ్స్ = CLIP Kings ;
గాడిదలు - గజరాజు - CK - 1 ;
********************************* ,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి