16, జూన్ 2022, గురువారం

లవణకుమార్ Love matter

"నా పేరులోనే లవ్ ఉంది, నా పేరే లవణకుమార్." తరచూ ఏ మాత్రం సందు దొరికినా తన నామధేయాన్ని - 

ప్రతిపదార్ధ సహితంగా ఫ్రెండ్సుకి, మీదుమిక్కిలి జనాలకి చెబుతుంటాడు లవణకుమార్. 

తనకి ఇంత మంచి పేరు పెట్టిన తల్లిదండ్రులని, పెద్దలని తలుచుకుంటుంటాడు. 

నానీ బాడుగకు ఇచ్చిన మూడవ పోర్షన్ లో మాఘమాసంలో చేరాడు మన ప్రస్తుత హీరో లవణకుమార్. 

అతను పాలిటెక్నిక్ పాసై, ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్న చిరుద్యోగి. 

సరిగా ఇవ్వని జీతం డబ్బులను - కొన్ని నెలలకు సరిపుచ్చుకుంటూ 

ఎట్లాగో పొద్దుపుచ్చుతున్న మిడిల్ క్లాస్ జీవి. 

మిషన్లు, స్క్రూ డ్రైవర్లు, బోల్టులను విప్పడం వరకూ చేతనైంది. మరమేకులని మళ్ళీ బిగించడం మాత్రం ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు మన లవణకుమార్. 

"వచ్చే నెల మీకు అద్దె ఇస్తాను, నానీ." చేతులు నులుపుకుంటూ చెప్పాడు లవణకుమార్. 

"దాందేముంది అబ్బాయ్, ఇంట్లో రెండు తలుపులు - కిరకిరా చప్పుడు చేస్తున్నాయి. కాస్త బిగించిపెట్టు." 

"సరే" అని, రెండు ద్వారాలనూ, మరమేకులు బిగించి, గ్రీజు పూసి, 

స్మూత్ చేసాడు లవణకుమార్. అవ్విధంబుగా నానీ - 

తనకు రావాల్సిన అద్దె బకాయికి - వడ్డీ డబ్బులను బాలన్స్ చేసేసింది. 

************, 

నానీ తన ఇంట్లో అద్దెకు వచ్చినవాళ్ళను ఓ కంట కనిపెట్టి ఉంటుంది. 

ఎవరైనా పనికిరాని పనులకు పాల్పడితే - తనకే గదా తిప్పలు!! 

ఆ మాటకొస్తే ఇరుగు పొరుగు, తన వీధిని, చుట్టపక్కాలను, పరిచితులను సైతం కనిపెట్టే ఉంటుంది. 

ఆ కాలం మనిషి కదా. ఇట్లాంటి వ్యక్తులు - అందరికీ ఒకింత ఇబ్బంది కలిగిస్తున్నారు ....

అనే మాట వాస్తవమే ఐనప్పటికీ - సంఘంలోని నీతినియమాలకు సైతం - 

వీరు పెట్టని కోట గోడల వంటి వారే. 

నానీ మాదిరి మనుషులు తమకు తెలీకుండానే - 

తోటివారి ప్రవర్తనా సరళి హద్దులను నిర్దేశించగలుగుతున్నారు. 

వీరి ఉచితసేవ - [నయాపైసా కాంక్షించని] - అందరికీ - 

ఊడే పంటి కింద పలుకురాయి పడ్డట్లు అనిపిస్తుంది, 

కానీ - నేరాలు ఘోరాలు - వంటి ప్రత్యేక శీర్షికలు - TV -

దృశ్యమాధ్యమాలలో ప్రవేశపెట్టే అగత్యం, దుస్థితి పట్టేవి కావు.

సరే, మనం మళ్ళీ మన లవణకుమార్ దగ్గరికి వద్దాం. 

Radio Jockey/ RJ -  లవణ్ ;- 

అతను ప్రైవేట్ జాబ్ - రేడియో జాకీ*గా చేరాడు.

నేటి యువతీ యువకుల మాదిరిగానే - కొత్తరకం ఉచ్ఛారణలను సమాజంలో 

ప్రవేశపెట్టాడు Radio Jockey/ RJ లవణకుమార్. 

అతనికి వత్తులకు, ఊష్మాలకు - శషభిషలు, తేడాలు ససేమిరా తెలీవు. 

తన నాలికను శ్రమ పెట్టే రకం కాదు  RJ లవణకుమార్. 

ఈత రాని చేప నీళ్ళలో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అతడి జిహ్వ ....,

తెలుగు భాషా పదాలతో తంటాలు పడడం. 

************, 

లవణకుమార్ ఆధునిక తెల్గూ - కొత్తగా ఇక్కడ అడుగు పెట్టి, 

నేర్చుకుంటున్న విదేశీయుల మాటలు లాగా ఉంటున్నవి. 

ఇంగ్లీషు వాడి తెలుగు వాక్కు మాదిరిగా -   ఆంధ్రపదావళి - గాలి ఊదుతున్న letters కి మల్లే అనిపిస్తుంటాయి. 

ఉచ్ఛారణలో కొన్ని మాటలు మచ్చుకి చూడొచ్చు. లచిమి, పుసపా, రానీ - పరమీల - వంటివి. 

ఇవి కూడా అమ్మాయిల నామావళి అవడం విశేషం. లక్ష్మి, పుష్ప, రాణి, ప్రమీల - మున్నగునవి.

వాళ్ళు గనక ఈ లవణకుమార్ పిలుపులు వింటే, వేరే ఎవరినో పిలిచాడని అనుకుంటారు. 

పుష్ప "నన్ను కరెక్టుగా పిలు, అప్పుడు నీ గురించి ఆలోచిస్తా" అన్నది పకపకా నవ్వుతూ. 

శ్రీశ్రీశ్రీ లవణకుమారుడు - పుష్ప - అని పలకడం కోసం - తన జిహ్వను కథాకళి చేయించాడు. 

ఊహు, అస్సలు ఆ సంయుక్తాక్షరం - అతని స్వరానికి లొంగను - అని మొరాయించింది. 

సెమిస్టర్ పుణ్యకాలం కాస్తా గడిచే సరికి, అతని చేతిలో శుభలేఖ పెట్టింది పుష్ప. 

తన వుడ్ బీ తో సహా వచ్చి మరీ - ఇచ్చింది వెడ్డింగ్ కార్డుని. 

పుష్ప జోడీ = husband తన కన్నా అందగాడే ...  ,

మనసులోనే అసూయపడ్డాడు. పుష్ప మారేజికి వెళ్ళలేదు

అదే రోజు లవణకుమారునికి అర్జంటు పని మీద తమిళనాడుకి వెళ్ళాల్సి వచ్చింది మరి.

సూపర్ హిట్టు - పుష్పరాజ్ సినిమా వచ్చాక - ఇప్పుడు వర్ణనాతీతం అతని మనోవేదన. 

అంత గొప్ప హీరో - పుసప - అన్నాడే, 

ఇంక షకారం లేని పుసప - పేరే తనకీ నచ్చింది. సరే, ఏం చేద్దాం!!? 

జీవితం అన్నాక, ఒక పెళ్ళాం అవసరం కాట్టి, ఆటిన్ మార్కు వేయడం కోసం, 

సాగిస్తున్న అతని అన్వేషణ ఫలించింది. అతగాని దక్షిణ రాష్ట్ర విహారం వృధా కాలేదు.

లవణకుమార్ నవీన girl friend ఆమని, 

"ద్విత్వాలు, సంయుక్త అక్షరమ్ములు లేని పేరు, 

కనుకనే భగవంతుడు ఇచ్చిన కానుక ఆమని, హమ్మయ్య" - అని  అనుకుని లవణ్ ఫీల్ అయ్యాడు. 

కన్యాకుమారిలో తటస్థపడిన ఆమని మెళ్ళో మూడు ముళ్ళు వేసాడు. 

"నానీ, మీ ఇల్లు మాకు కలిసివచ్చింది. నేనొక ఇంటివాణ్ణి అయ్యాను" 

లవణకుమార్ డైలాగులకు మురిసిపోతూ, 

"నీకు చక్కనైన పెళ్ళాం దొరికింది అబ్బాయ్, అదృష్టవంతుడివే." 

నానీ వ్యాఖ్యలు కొంచెం తికమకపెట్టినా, సంతోషించాడు లవణకుమార్.

 ఎందుకంటే, తమ బంధువులు కొందరు "కాకి ముక్కుకి దండపండులా ... " అనే 

ముతక సామెతను అప్పటికే నిర్దయగా ప్రయోగించేసారు తనమీద. 

లవణకుమార్ పక్క వాటా రెస్టోర్ రాజా భార్య జయశ్రీ - మాటల్లో 

"ఆమని మాకు బంధువే" అంటూ వరస కలిపింది.

ఆమని మూడవ తరం - అంటే ఆమె ముత్తాత వాళ్ళు - ఆ అరవదేశానికి వలస వెళ్ళారు. 

"చూసావా, ఈ నేలతో మీకు ఋణానుబంధం ఉన్నది. 

అందుకనే మళ్ళీ లవణకుమార్ భార్యవై, ఇక్కడ గృహప్రవేశం చేసావు." అన్నది జయశ్రీ

&;

 [పాత్రలు ;- నానీ - లవణకుమార్ wife ఆమని - రెస్టోర్ రాజా - జయశ్రీ & లవణ్ First friend = పుష్ప]  ;

=====================, 

lawaNakumAr `Love matter` ;-  Telugu Story ;-

"naa pErulOnE law umdi, naa pErE lawaNakumAr." 

taracU E maatram samdu dorikinA tana naamadhEyaanni - pratipadaardha 

sahitamgaa phremDsuki, meedumikkili janaalaki cebutumTADu lawaNakumAr. 

tanaki imta mamci pEru peTTina tallidamDrulani, 

peddalani talucukumTumTADu. 

nAnI bADugaku iccina mUDawa 

pOrshan lO mAGamaasamlO cErADu mana prastuta hero lawaNakumAr.

atanu paaliTeknik pass ai, oka phyaakTareelO pani cEstunna cirudyOgi. 

sarigaa iwwani jeetam Dabbulanu - konni nelalaku saripuccukumTU 

eTlaagO poddupuccutunna miDil klaas 

jeewi. mishanlu, skruu Draiwarlu, bOlTulanu wippaDam warakuu cEtanaimdi. 

maramEkulani maLLI bigimcaDam maatram imkaa nErcukunE daSalOnE 

unnADu mana lawaNakumAr . 

"waccE nela meeku adde istaanu, nAnI." cEtulu nulupukumTU 

ceppADu lawaNakumAr. 

"daandEmumdi abbaay, imTlO remDu talupulu - kirakiraa cappuDu cEstunnaayi. 

kaasta bigimcipeTTu." "sarE" ani, remDu dwaaraalanuu, maramEkulu bigimci, 

greeju puusi, smuut cEsADu lawaNakumAr. 

awwidhambugaa - tanaku raawaalsina adde bakaayiki - 

waDDee Dabbulanu balance cEsEsimdi nAnI. 

************, 

Radio Jockey/ RJ - lawaN ;-

nAnI tana imTlO addeku waccinawaaLLanu 

O kamTa kanipeTTi umTumdi. 

ewarainaa panikiraani panulaku paalpaDitE - 

tanakE gadaa tippalu!! 

A mATakostE irugu porugu, tana weedhini, 

cuTTapakkAlanu, paricitulanu saitam kanipeTTE umTumdi. 

aa kaalam manishi kadaa. 

iTlAmTi wyaktulu - amdarikee okimta ibbamdi kaligistunnaaru, 

anE mATa wAstawamE ainappaTikI - samghamlOni neetiniyamaalaku saitam - 

weeru peTTani kOTa gODala wamTi wArE. 

nAnI maadiri manushulu tamaku teleekumDAnE - 

tOTiwaari prawartanaa saraLi haddulanu 

nirdESimcagalugutunnaaru. weeri ucitasEwa - [nayaapaisaa kaamkshimcani] - 

amdarikee - UDE pamTi kimda palukuraayi paDDaTlu anipistumdi, kaanI -

nErAlu GOrAlu - wamTi pratyEka SIrshikalu - 

dRSyamaadhyamaalalO prawESapeTTE agatyam, dusthiti paTTEwi kAwu.

sarE, manam maLLI mana lawaNakumAr daggariki waddaam. 

atanu praiwET jaab - rEDiyO jaakIgA cErADu.

************, 

Radio Jockey/ RJ - lawaN ;- 

nETi yuwatee yuwakula mAdirigAnE - kottarakam ucCAraNalanu

 samaajamlO prawESa peTTADu lawaNakumAr . 

ataniki wattulaku, uushmaalaku - Sashabhishalu, tEDAlu sasEmirA teleewu. 

tana naalikanu Srama peTTE rakam kaadu Radio Jockey lawaN. 

Ita raani cEpa nILLalO tirugutunnaTlu anipistumdi

 ataDi jihwa telugu bhAshA padaalatO tamTAlu paDaDam. 

lawaNakumAr aadhunika telguu - kottagaa ikkaDa aDugu peTTi, 

nErcukumTunna widESIyula maaTalu laagaa umTunnawi. 

imgleeshu wADi telugu waakku maadirigaa -  aamdhrapadAwaLi - 

gaali uudutunna `letters` ki mallE anipistumTAyi. 

ucCAraNalO konni mATalu maccuki cuuDoccu. 

lacimi, pusapA, rAnI - parameela - wamTiwi. 

iwi kUDA ammaayila naamaawaLi awaDam wiSEsham. 

lakshmi, pushpa, rANi - munnagunawi. wALLu ganaka 

ee lawaNakumAr pilupulu wimTE, wErE ewarinO pilicADani anukumTAru. 

pushpa "nannu karekTugaa pilu, appuDu nee gurimci AlOcistA" 

annadi pakapakA nawwutU. 

SreeSreeSree lawaNakumAruDu - pushpa - ani palakaDam kOSam - 

tana jihwanu kathakaLi cEyimcADu. 

uuhu, assalu aa sam yuktaaksharam - atani swaraaniki lomganu - 

ani moraayimcimdi. semisTar puNyakaalam kaastaa gaDicE sariki, 

atani cEtilO SubhalEKa peTTimdi pushpa. 

tana wuD bee tO sahaa wacci maree - iccimdi weDDimg kArDuni. 

pushpa jODI tana kannaa amdagADE ... manasulOnE asuuyapaDDADu. 

pushpa maarEjiki weLLalEdu,

adE rOju lawaNakumAruniki arjamTu 

pani meeda tamiLanADuki weLLAlsi waccimdi mari.

**********,

super hit - pushparaaj sinimaa waccaaka - 

ippuDu warNanaateetam atani manOwEdana. 

amta goppa herO - pusapa - annADE, imka shakaaram lEni pusapa - 

pErE tanakee naccimdi. sarE, Em cEddAm!!?

 jeewita annaaka, oka peLLAm awasaram kATTi, 

ATin maarku wEyaDam kOsam, saagistunna atani anwEshaNa phalimcimdi. 

atagaani dakshiNa raashTra wihaaram wRdhA kAlEdu.

lawaNakumAr naweena `girl friend` Amani, lawaNakumAr dwitwaalu, 

sam yukta aksharammulu lEni pEru, kanukanE .... ,

bhagawamtuDu iccina kaanuka Amani - ani pheel ayyADu. kanyaakumaarilO 

taTasthapaDina Amani meLLO mUDu muLLu wEsADu. 

"nAnI, mee illu maaku kalisiwaccimdi. nEnoka imTiwANNi ayyAnu" 

lawaNakumAr Dailaagulaku murisipOtU, 

"nI peLLAm cakkanaina peLLAm dorikimdi abbaay, 

adRshTawamtuDiwE." naanee wyaakhyalu komcem tikamakapeTTinaa, 

samtOshimcADu lawaNakumAr. 

emdukamTE, tama bamdhuwulu komdaru 

"kaaki mukkuki damDapamDulaa ... " 

anE mutaka saametanu appaTikE nirdayagaa prayOgimcEsaaru tanameeda.

lawaNakumAr pakka wATA - resTOr rAjA bhArya jayaSrI - mATallO 

"Amani maaku bamdhuwE" amTU warasa kalipimdi. 

Amani mUDawa taram - amTE Ame muttAta wALLu - 

A arawadESAniki walasa weLLAru. 

"cuusaawaa, ee nElatO meeku RNAnubamdha unnadi. 

amdukanE maLLI lawaNakumAr 

bhaaryawai, ikkaDa gRhaprawESam cEsAwu." 

annadi jayaSrI.

& [pAtralu ;- nAnI - `Radio Jockey/ RJ`lawaN/ lawaNakumAr - Amani - 

resTOr rAjA wife = jayaSrI] ; &

story ;-  లవణకుమార్ Love matter ;

[పాత్రలు ;- నానీ - Radio Jockey/ RJ లవణ్ / లవణకుమార్ - ఆమని - రెస్టోర్ రాజా wife - జయశ్రీ]  ;

many colors June - kusuma - 39



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గాడిదలు - గజరాజు - CK - 1

క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం  మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,  అంచేత ...