10, జూన్ 2022, శుక్రవారం

డబ్బుకు లోకం దాసోహం

చిన్నారావు - సుభద్ర - సుప్రజ - పక్కింట్లో దిగారు. వాళ్ళతో మాట కలిపి, జయశ్రీ ఆరా తీసింది. 

తాను కనుగొన్న కొత్త వారి సరికొత్తవిశేష వివరాదులని నానీ గ్రూపుకు చేరవేసింది. 

జయశ్రీ - చిన్నాన్న ఉంటున్న అద్దెగదికి వెళ్ళింది.

 "మా పక్కిళ్ళలో కొత్తగా వచ్చారు -" అని చెప్పింది. "మన ఊరివాళ్ళే., అన్నది.

చిన్నాన్న భవానీ శంకరంకి చిన్నారావు బొత్తిగా గుర్తుకు రాలేదు. ఐతే  ..... , 

"ఆ ఆ ఆ! నాకు బాగా తెలిసినవాడే" అనేసాడు.

"ఏమో, ఏ పరిచయం - ఏ సందర్భంలోనైనా కాపాడుతుంది" అనేది మధ్య తరగతి ఫిలాసఫీ.

చిన్నారావు - సుభద్ర - సుప్రజ టీమ్ వర్క్ ముచ్చటగా ఉంది - ఇంట్లోనే కూర్చుని, చీటీ వ్యాపారం చేస్తున్నారు.

త్రి సభ్య కూటమి చిన్నారావు బృందం - చిట్టీల వ్యాపారం చాలా బాగా జరుగుతున్నది. 

భవానీ శంకర్ చేతిలో ధనం ఇల్లె, అందువలన చీటీ కట్ట లేదు, కాస్తైనా మనీ ఉండి ఉంటే .... , - 

తను కూడా తప్పకుండా చిన్నా చీటీని కట్టి ఉండే వాడు. 

నానీ - బొత్తిగా ఆ జోలికి పోనేలేదు. 

కుముదబాల, అంబర్, ఇత్యాది వర్గం - రమారమి డెబ్భైమంది - చిన్నా స్కీములో చేరారు. 

అందరికీ నిజాయితీగా నెల నెలా వెన్నెల మాదిరి, డబ్బులు ఇస్తున్నారు. 

ప్రజలలో విశ్వాసాన్ని పొందడంతో - సుప్రజ, సుభద్ర 

"మన బిజినెస్ మూడు పూలు, ఆరు కాయలుగా పెరుగుతున్నది." అంటూ సంతోషపడుతున్నారు. 

**************** , 

సుభద్ర వాళ్ళు నెమ్మదిగా - అదే ఇంట్లో దుస్తులు, దుప్పట్లు, స్టీలు గిన్నెలు, కుక్కర్లు - 

మొదలైన వస్తువులను అమ్ముతాము - అని అందరికీ ప్రచారం చేసారు. 

ఊళ్ళో అందరూ మంచి మిత్రులు అయ్యారు.

సుప్రజ వాళ్ళు - main road మీది షాపులలో పోస్టర్లు అంటించారు, పాంప్లెట్లు పంచిపెట్టారు. 

సుప్రజ వయసు పదహారేళ్ళు - లేతదనం, కొంచెం పాటి అమాయకత్వం - 

సుప్రజ తమ వద్దకు - తనే వచ్చి, ఏదైనా అడిగితే ఎవరూ కాదనలేరు. 

చిన్నా గ్రూపు - మొదటి వాయిదా వెయ్యి రూపాయలు కడితే చాలు, వస్తువుని ఇస్తున్నారు.

కూలర్లు, మిక్సీలు, వాషింగ్ మెషీన్లు - ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు - 

కేవలం గుప్పెడు రుపీస్ తో లభిస్తుంటే - 

జనంలో ఎక్కడ లేని హుషారు ..... , ఈ వీధి నుండి ఆ వీధి దాకా పెద్ద క్యూ - 

తండోపతండాలుగా జనం జనం మహాజనం ..... ,

పోలీసులలో కొందరికి 'ఇందులో ఏదో మెలిక ఉంది, ఏదో మతలబు జరుగుతున్నది - 

ఏదో కిరికిరీ మతలబు జరగబోతున్నది .... ' అనిపిస్తున్నది, గుసగుసలుగా చెప్పుకుంటున్నారు.

వారం రోజుల దాకా - లాటరీ పద్ధతిని, దామాషా పద్ధతిని అనుసరిస్తూ, ముప్ఫై వస్తువులను ఇచ్చారు.

అంగడి వీధి మనుషుల సందడితో కళకళలాడుతున్నది.

షాపుల ఓనర్సు చిన్నా వాళ్ళకి - నమ్మకం మీద జంటగిన్నెలు, గంగాళాలు, డేగిసాలు, టి.వీలు - 

అడిగినవి అన్నీ ఇస్తున్నారు. రక్షకభటులు - ఊరి పెద్దమనుషులు నలుగురికి - 

చిన్నావాళ్ళు - కొన్ని వస్తువులను ముందే ఇచ్చేసారు. ఇంకేముంది.... , 

వీరి వ్యాపారం జామ్ జామ్ గా సాగుతున్నది.

**************** ,

"అమ్మడూ, నువ్వు కొన్న కొత్త టేబులు ఇదేనా!?"

"ఇది, మొన్న సంక్రాంతికి మా పుట్టింటివాళ్ళు ఇచ్చారు. డైనింగ్ టేబుల్ కి బదులు బీరువా ఇమ్మన్నాను. 

కొచ్చిన్ నుండి వచ్చే ఆదివారం ట్రాన్స్ పోర్ట్ లో వస్తుందట." నానీకి వర్ధని సమాధానం ఇది. 

**************, ;

"మా అక్కయ్య సుభద్రకు కడుపునొప్పి వచ్చింది, ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ చెయ్యాలిట - 

మా ఫ్యామిలీ డాక్టర్ అపర ధన్వంతరి, ఈరోడ్ కి వెళ్తున్నాం." అని చెప్పింది సుప్రజ.

ఊరి పెద్దమనిషి ఒకరు "మా కారులో వెళ్ళండి." అని డ్రైవరుని కూడా ఇచ్చాడు. 

ఇద్దరు ఆడవాళ్ళు "చాలా కృతజ్ఞతలు, థాంక్యూలు" చెబుతూ కారు ఎక్కి, ప్రజలందరికీ వీడ్కోలు చెప్పారు. 

పొద్దెక్కి, ఎనిమిది గంటలు అయ్యింది. రోజూ ఉదయాన్నే మూడున్నరకు నిద్ర లేస్తాడు చిన్నా. 

ఆ రోజు నిశ్శబ్దంగా ఉన్నది, ఇరుగుపొరుగులు, జనం, ఇంటి తలుపులు తట్టారు. 

ఇంటి యజమాని "అయ్యో, తలుపులు విరగ్గొట్టకండి." అని లబలబలాడాడు. 

తాళాలు రిపేర్ చేసే మనిషిని రప్పించారు, తాళాలు ఊడగొట్టి, లోనికి వెళ్ళారు, అక్కడ అంతా ఖాళీ ... ..., 

నాలుగో రోజు చిన్నారావు - పెట్టెబేడా, చిన్నపాటి వస్తువులను వదిలేసి, 

మంది నుండి వసూలు చేసిన డబ్బుతో ఉడాయించాడు - అని యావన్మందికీ అర్ధం అయ్యింది. 

"వాణ్ణి నమ్మి, వలూబ్లె వస్తువులన్నీ ఇచ్చాము." అంటూ దుకాణాల వాళ్ళు ఘొల్లుమన్నారు. 

"మా కారు గతి ఏమైందో!?" అంటూ కంప్లైంట్ ఇవ్వడాని పరిగెత్తాడు ఊరి మంచిమనిషి. 

driver కుంటుకుంటూ వచ్చాడు. నీరసంగా వేళ్ళాడుతూ ఎదుట ప్రత్యక్షమైన డ్రైవర్ రాముడు - 

పెళ్ళాం పిల్లలు వాటేసుకున్నారు, "నువ్వు మాకు ఇట్లాగైనా దక్కావు. అంతే చాలు." అన్నారు. 

నానీ విభూతిని నీళ్ళలో వేసి ఇచ్చింది, డ్రైవరు గడగడా తాగి, సేదదీరాడు. 

కొంచెం ధైర్యం వచ్చాక, అతని మాటల సారాంశం ఇది - భామామణులు అతనికి కూల్ డ్రింకు ఇచ్చారు, 

తాగిన వెంటనే మైకం కమ్మింది. మత్తు వదిలి, కళ్ళు తెరిచి చూస్తే, 

తాను తుమ్మపొదలలో, తుప్పల్లో పడి ఉన్నాడు. ఓపిక తెచ్చుకుని, ఇక్కడికి ఇట్లాగ చేరాడు.... , 

"ఆ ఆడరాక్షసిలు నాకు ఏ హాని చేయకుండా వదిలిపెట్టారు, అంతే నాకు చాలు - అనుకుని, 

దేవుడికి వెయ్యి దణ్ణాలు పెట్టుకున్నా, ఎట్లాగోలా, ఇదిగోండి, ఇట్లాగ ఇక్కడికి చేరున్నా." 

డ్రైవర్ పెళ్ళాం పిల్లలు, అప్పటికే అతని క్షేమం కోరుకుంటూ కోటి మొక్కులు మొక్కుకున్నారు.

కారు ఓనర్ "ఆ మాత్రం ఒళ్ళూ పై తెలీని మత్తులో ఎట్లా పడ్డావురా!?" అంటూ చిందులు తొక్కాడు, 

తానే ఒక విధమైన మైకానికి గురి ఐ, పిలిచి, మరీ వారికి కారుని అప్పజెప్పాడు - అనే విషయాన్ని మరిచిపోయి. 

ఉచితంగా దొరికిన సామానుతో - మొదటి వారం - బహుమతులను పొందిన కొద్దిమంది, ఇళ్ళలోనే ఉండిపోయారు, తమ సన్నిహితులను ఇక్కడికి పంపారు, 

మొబైల్సుని క్రింద పెట్టకుండా - జరుగుతున్న ప్రతి సంఘటనను - 

అప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. 

ఒక్క పైసా పెట్టుబడి లేకుండా - చేసిన కుటిల వ్యాపారం ఇది, 

వస్తువులు కూడా షాపులలోనివి - తమ ఇంట్లోనివి కావు, 

లాటరీ పేరు చెప్పి, గడుసుగా కానుకలు కొన్ని పంచి ఇచ్చాడు, తతిమ్మావి మూటగట్టుకున్నాడు, 

కోట్లాది రూపాయిలని తన బ్యాంక్ అకౌంటులోకి \శుభ్రంగా వేసేసుకున్నాడు. 

బినామీ - ఆచరణలకు ఖచ్చితమైన "బేనామీ నమూనాలు వీళ్ళు - 

ఇటువంటివాళ్ళను ఎందుకు నమ్మబుద్ధివేస్తుంటుంది - ధనాశకి ఉన్న శక్తి అదే మరి, 

ఎన్నిసార్లైనా మానవజాతిని ఏమారుస్తూనే ఉంటుంది, అది అంతే!! 

*धनं मूलं इदं जगत। - ధనమూలమిదం జగత్ ;-

అనవసర ఆడంబర అతిశయాలను ఆశించని నానీ లాంటి వాళ్ళు, ప్రేక్షక స్థానంలో నిలబడి ఉంటారు, 

వారి వ్యక్తిత్వాలు - సంఘానికి శ్రీరామరక్ష - ఔతుంటాయి. 

& 1.  **धनं मूलं इदं जगत। -  = ధనమార్జిత కాకుత్స ధనమూలమిదం జగత్I = 

2. *बेनामी = 1.. जो किसी के स्वामित्व में न हो  ; 2. जिसपर किसी का अधिकार न हो  ;

3. बिना नाम की (वस्तु) ; 

**************** , **************** , **************** ,

[ పాత్రలు ;-  నానీ - త్రి సభ్య కూటమి చిన్నారావు బృందం =  car owner ఊరి మంచిమనిషి - his driver - family & చిన్నారావు - సుభద్ర - సుప్రజ& - వర్ధని -  జయశ్రీ - చిన్నాన్న భవానీ శంకరం ; కుముదబాల, అంబర్ ] ;;

================================ ;

Dabbuku lOkam dAsOham ; ;- story ;- 

cinnArAwu - suBadra - supraja - pakkimTlO digaaru. wALLatO mATa kalipi, 

jayaSree aaraa 

teesimdi. taanu kanugonna kotta waari sarikottawiSEsha wiwaraadulani 

nAnI gruupuku 

cErawEsimdi. jayaSrI - cinnaanna umTunna addegadiki weLLimdi. 

"maa pakkiLLalO kottagA waccAru -" ani ceppimdi. 

"mana uuriwALLE., annadi.

cinnaanna BawAnI Samkaramki cinnArAwu bottigaa gurtuku raalEdu. aitE ........ , 

"A A A! naaku baagaa telisinawADE, anEsADu.

"EmO, E paricayam - E samdarbhamlOnainaa kaapADutumdi" anEdi -

madhya taragati philaasaphee. 

cinnArAwu - suBadra - supraja TImm wark muccaTagaa umdi - 

imTlOnE kuurcuni, ceeTee wyaapaaram cEstunnaaru.

tri sabhya kUTami cinnArAwu bRmdam - ciTTIla wyApAram cAlA bAgA jarugutunnadi. BawAnI Samkar cEtilO dhanam ille, amduwalana ceeTI kaTTa lEdu, 

kaastainaa manee umDi umTE - tanu 

kUDA tappakumDA cinnA cITIni kaTTi umDE wADu. nAnI - 

bottigaa aa jOliki pOnElEdu. 

kumudabaala, ambar, ityaadi wargam - ramaarami DebBaimamdi - 

cinnA skImulO cEAru. 

amdarikee nijaayiteegaa nela nelaa wennela maadiri, Dabbulu istunnaaru. prajalalO 

wiSwAsAnni pomdaDamtO - supraja, subhadra "mana bijines mUDu puulu, 

aaru kaayalugaa perugutunnadi." amTU samtOshapaDutunnAru.

suBadra wALLu nemmadigaa - adE imTlO dustulu, duppaTlu, sTeelu ginnelu, kukkarlu - 

modalaina wastuwulanu ammutaamu - ani amdarikee pracaaram cEsaaru. 

ULLO amdaruu mamci mitrulu ayyaaru.

supraja wALLu - `main rOad` meedi shaapulalO pOsTarlu amTimcaaru, paampleTlu 

pamcipeTTAru. supraja wayasu padahArELLu - lEtadanam, komcempaaTi amaayakatwam - supraja tama waddaku - tanE wacci Edainaa aDigitE ewaruu kaadanalEru. 

cinnaa gruupu - modaTi waayidaa weyyi ruupaayalu kaDitE cAlu, wastuwuni istunnaaru.

kularlu, mikseelu, waashimg mesheenlu - khareedaina elakTrAnik wastuwulu - 

kEwalam guppeDu rupees tO labhistumTE - janamlO ekkaDa lEni hushaaru ..... , 

ee weedhi numDi A wIdhi dAkA pedda kyuu - 

tamDOpatamDAlugA janam janam mahaajanam ..... ,

pOleesulalO komdariki 'imdulO EdO melika umdi, EdO matalabu jarugutunnadi - 

EdO kirikirI matalabu jaragabOtunnadi .... ' anipistunnadi, 

gusagusalugaa ceppukumTunnaaru.

waaram rOjula daakaa - lATarI paddhatini, daamaashaa paddhatini anusaristuu, mupphai 

wastuwulanu iccaaru.

amgaDi weedhi manushula samdaDitO kaLakaLalADutunnadi.

shaapula Onarsu cinnaa wALLaki - nammakam meeda jamTaginnelu, 

gamgALAlu, DEgisAlu, Ti.weelu - aDiginawi annee istunnaaru. rakshakaBaTulu - 

uuri peddamanushulu naluguriki - 

cinnaawALLu - konni wastuwulanu mumdE iccEsAru. imkEmumdi, 

weeri wyaapaaram jaamm jaamm gaa saagutunnadi.

**************** ,

"ammaDuu, nuwwu konna kotta TEbulu idEnA!?" 

"idi, monna samkraamtiki maa puTTimTiwALLu iccaaru. Daining Table ki badulu -

beeruwaa immannaanu. koccin numDi waccE AdiwAram Traans pOrT lO wastumdaTa." 

nAnIki wardhani samaadhaanam idi. 

**************, ;

"maa akkayya subhadraku kaDupunoppi waccimdi, irawai naalugu gamTallO 

aaparEshan ceyyaaliTa - maa phyaamilee DAkTar apara dhanwamtari, 

ERODE ki weLtunnaam." ani ceppimdi supraja. 

Uri peddamanishi okaru "maa kaarulO weLLamDi." 

ani Draiwaruni kUDA iccaaDu. iddaru ADawALLu 

"caalaa kRtajnatalu, thaamkyuulu" cebutuu kaaru ekki, parajalamdarikee 

weeDkOlu ceppaaru. poddekki, enimidi gamTalu ayyimdi. rOjuu udayAnnE 

mUDunnaraku nidra lEstADu cinnA. 

A rOju niSSabdamgA unnadi,iruguporugulu, janam, imTi talupulu taTTAru. 

imTi yajamaani "ayyO, talupulu wiraggoTTakamDi." ani labalabalADADu. 

tALAlu ripEr cEsE manishini rappimcaaru, tALAlu uuDagoTTi, lOniki weLLAru, 

akkaDa amtA KALI ... ..., naalugO rOju cinnaaraawu - peTTebEDA, 

cinnapATi wastuwulanu wadilEsi, mamdi numDi wasUlu cEsina DabbutO uDAyimcaaDu - 

ani yaawanmamdikee ardham ayyimdi. 

"wANNi nammi, `valuable` wastuwulannee iccaamu." 

amTU dukANAla wALLu ghollumannaaru. "maa kaaru 

gati EmaimdO!?" amTU kamplaimT iwwaDAni parigettADu Uri mamcimanishi. 

Driver kumTukumTU waccADu. neerasamgaa wELLADutuu eduTa pratyakshamaina 

'Driver' rAmuDu - peLLAm pillalu wATEsukunnaaru, 

"nuwwu maaku iTlAgainA dakkAwu. amtE cAlu." annaaru. nAni 

wibhuutini nILLalO wEsi iccimdi, Drawaru gaDagaDA taagi, sEdadeerADu. 

komcem dhairyam waccaaka, atani mATala saaraamSam idi - 

BAmAmaNulu ataniki kuul Drimku iccaaru, taagina wemTanE maikam kammimdi. 

mattu wadili, kaLLu terici cuustE, tumma podalalO, tuppallO taanu 

paDi unnADu. Opika teccukuni, ikkaDiki iTlaaga cErADu.... ,

"A ADaraakshasilu naaku E haani cEyakumDA wadilipeTTAru, 

amtE naaku cAlu - anukuni, dEwuDiki weyyi daNNAlu peTTukunnaa, 

eTlAgOlA, idigOMDi, iTlaaga ikkaDiki cErunnA." 

Draiwar peLLAm pillalu, appaTikE atani kshEmam kOrukumTU .... ,

kOTi mokkulu mokkukunnAru. car Owner 

"A mAtram oLLuu pai teleeni mattulO eTlA paDDaawurA!?" 

amTU cimdulu tokkADu, taanE oka widhamaina maikaaniki guri ai, pilici, 

maree waariki kaaruni appajeppADu - anE wishayaanni maricipOyi.

ucitamgaa dorikina saamaanutO - modaTi waaram - 

bahumatulanu pomdina koddimamdi, iLLalOnE 

umDipOyAru, tama sannihitulanu ikkaDiki pampaaru, mobile suni 

krimda peTTakumDA - jarugutunna prati sam ghaTananu - appaTikappuDu telusukumTUnE unnAru. 

okka paisaa peTTubaDi lEkumDA - cEsina kuTila wyaapaaram idi, 

wastuwulu kUDA shaapulalOniwi - tama imTlOniwi kaawu, lATaree pEru ceppi, 

gaDusugaa kaanukalu konni pamci iccADu, tatimmaawi 

mUTagaTTukunnADu, kOTlaadi ruupaayilani tana bank accout lOki SuBramgA wEsEsukunnADu. 

धनं मूलं इदं जगत। = dhanamuulamidam jagat ;-

*binaamee - aacaraNalaku khaccitamaina namuunaalu wILLu - 

iTuwamTiwALLanu emduku nammabuddhiwEstumTumdi - 

dhanASaki unna Sakti adE mari, 

ennisaarlainaa maanawajaatini EmArustuunE umTumdi, adi amtE!! 

anawasara ADambara atiSayaalanu ASimcani nAnI lAmTi 

wALLu, prEkshaka sthaanamlO nilabaDi umTAru, waari wyaktitwaalu - 

samGAniki Sreeraamaraksha - autumTAyi. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గాడిదలు - గజరాజు - CK - 1

క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం  మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,  అంచేత ...