4, జులై 2022, సోమవారం

నార్యాణి - అనే బిర్యానీ తయారీ - 42

 శ్యామల వస్తున్నది అని - ఫోన్ చేసి చెప్పాడు ఢిల్లీ నుండి శ్రీకంఠం ; '"మా స్నేహితుల కూతురు శ్యామల , విజయవాడ హోటల్ రూములో బస, ఓ సారి పల్లెటూరు కళలను చూడాలని - 

ఆ పిల్ల ఉత్సాహం. శ్యామల డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి ఔతున్నది, 

కనుక భవిష్యత్తు గురించి అనేక ప్లాన్స్ - ఆమె మనసులో గిరగిరా తిరుగుతున్నాయి. 

"ఇంత దూరం వచ్చిన అమ్మాయి - మన ఊళ్ళో పదిరోజులైనా ఉండాలి శ్రీకంఠం!" - అని చెప్పింది నానీ.

శ్రీకంఠ ప్రసాద్ ని - అమ్మాయి అభిరుచులు - వివరాదులు కనుక్కున్నది నానీ. 

"శ్యామలకి బిర్యానీ అంటే ఇష్టం." నానీ గతుక్కుమన్నది, 

తనకు పులిహోర, దద్ధోజనం, గారెలు ఇత్యాదులు తెలుసు, 

మరి ఈ కొత్త వంటకం పేరు తన చెవిని చేరుతూనే ఉంది, గానీ ఆ విదేశీ వంటకం పట్ల ఆసక్తి లేదు 

కాబట్టి పట్టించుకో లేదు. ఇప్పుడు - అంత దూరం నుండి, 

ఈ మూల ఉన్న ఊరు అంటే జిజ్ఞాసతో వస్తున్న పిల్లదాని పట్ల ప్రేమ కలిగింది, 

అందుకని, బిర్యానీ [ बिरयानी ]తయారీ గురించి ఎంక్వైరీ మొదలుపెట్టింది. 

నాలుగో వీధి అచ్చమ్మ కొన్నిసార్లు బిర్యానీ చేసిందట. వెంటనే కొంగు నడుముకి దోపుకుని 

"ఇదుగోనయ్యోవ్, విస్తట్లో అన్నం పెట్టాను. పక్కనే అన్నీ ఉన్నాయి, 

జాగర్తగా చూసుకుని, వడ్డించుకుని తిను. గంటలో వస్తాను." 

నానీ పతిదేవుడు మణయ్య = వెంకటరమణయ్య "సరే" అని తల ఊపాడు, 

ఐతే నానీ ఆయన అంగీకారం కోసం ఆట్టే ఎదురుచూసే రకం కాదు. 

బుడిబుడి నడకలతో గునగునా నడిచివెళ్ళింది. "బయల్దేరిన వేళ బాగుంది, అచ్చీ! ఇంట్లోనే ఉన్నావు." 

"నేనెక్కడికి వెళ్తానని!?" నొసలు చిట్లించింది, అచ్చమ్మ. 

ఆమెకు నానీ పలుకులలో ఉన్న సూక్ష్మం, వ్యంగ్యం ఇట్టే బోధ పడుతుంది.

అచ్చమ్మ తన మాటల్లోని శ్లేష్హార్ధాన్ని పసిగట్టింది, అని నానీకి తెలుసు కూడా, గుర్తించనట్లే నటిస్తుంది. 

తాను వచ్చిన పనిని సవివరంగా వల్లె వేసింది. ఇట్లాంటి వ్యంగ్యాలు గురించి వాళ్ళు మనసు పాడు చేసుకోరు. చిన్నపాటి హాస్యం మిళితమై ఉండే ఎత్తిపొడుపులు నిత్య జీవితంలో అంతర్భాగంగా స్వీకరిస్తారు. 

అందుకనే ఎప్పుడు ఎదురైనా, మళ్ళీ చనువుగా పలకరించుకుంటుంటారు. 

మర్నాడు పొద్దున్నే నానీ ఇంట్లో ప్రత్యక్షం అయ్యింది అచ్చమ్మ. 

నానీ భర్తకి తొందరగా అన్నం వడ్డించింది. మణయ్య బావి చప్టా దగ్గర చేతులు కడుక్కుని వచ్చే లోపు, 

తమ ఇద్దరికీ వడ్డించింది. "అచ్చీ! నా చేతి పులుసు - ఏడూళ్ళలో పెట్టింది పేరు, తెలుసా!" 

అంటూ కొసరి కొసరి వడ్డించింది. - 'బిరియాణీ తనకు తెలీదు ' అని - అచ్చమ్మ దృష్టిలో - 

తనకు చిన్నతనం కాకూడదని, మాటల మెలికలు కొనసాగించింది. 

"నిజంగానే, నీ చేతి వంట అమృతం, అక్కాయ్." 

మనస్ఫూర్తిగా మెచ్చుకున్నది అచ్చమ్మ, బ్రేవ్ బ్రేవుమని త్రేనుస్తూ.

కాస్సేపు రెస్ట్ తీసుకున్నాక, వంటగదిలోనికి అడుగుపెట్టారు. అచ్చమ్మ గబగబా స్టవ్వు వెలిగించింది. 

ఇన్నాళ్ళూ ఆమె కుంపటి, రాళ్ళ పొయ్యి మీద వంట చేసుకున్నది. 

ఈ మధ్యనే ఆమె అల్లుడు పిల్లల సెలవులకు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చాడు. 

"కట్టెల పొగతో అవస్థ పడుతున్నారు. అత్తమ్మా" నానీ son in law -నొచ్చుకున్నాడు. 

తమ ఇంట్లో కొత్త మోడల్ స్టవ్వు కొనుక్కున్నారు, 

కాబట్టి, నానీ కూతురు ఉరఫ్ తన భార్యతో వచ్చి, స్టవ్ ఇచ్చాడు. 

కొత్తది కొని ఇవ్వలేదని, సణగలేదు, సంతోషంగా తీసుకున్నది. 

అందుకే తనకూ స్టవ్వుని వాడటం తెలుసునని - ఇక్కడ నిరూపించేసింది.

"మా అల్లుడు మమ్మల్ని కొడుకులాగా చూసుకుంటాడు" అని, 

మాటల్లో సందర్భాన్ని దొరకబుచ్చుకుని, చెప్పేటప్పుడు ఆమె కళ్ళలో సంతోషం గంతులు వేస్తుంది.

"బిర్యానీ ఆకు - దీన్ని తేజుపత్తా [ तेजपत्ता ] అంటారు." అంటూ 

చిన్న ప్లాస్టిక్ బాక్సులో తెచ్చిన మసాలా దినుసులను అరచేతిలో పెట్టుకుని, చెబ్తూ, 

"పలావ్ బాసుమతి బియ్యాన్ని తెచ్చాను. మనం రోజూ వాడే బియ్యం పనికిరాదు." అన్నది. 

హాలులో పడక్కుర్చీలో కూర్చుని, నోట్స్ రాసుకుంటున్నది శ్యామల. 

వీరి సంభాషణ యావత్తూ శ్యామల వింటున్నది.

శ్యామలకు కూడా బిర్యానీ తినడం తెలుసు గానీ, వండే విధానం తెలీదు. 

ఆ మాటకొస్తే - అన్నం వండటం కూడా చేతకాదు. 

తన తల్లి ఊరికి వెళ్ళినప్పుడు. తప్పనిసరై వండిన అన్నం - చిమిడిపోయింది, 

"దీని పేరు ఏంటి అక్కాయ్!" అడిగాడు తమ్ముడు ఆ రోజు.

అందుకని కొత్త వంటల గురించి కనుక్కొనే ఇంటరెస్టును పెంపొందించుకున్నది శ్యామల. 

ఇప్పుడు లోపల ఇద్దరు వనితల గరిటెలు, పాత్రలు చేస్తున్న కథాకళి నాట్యాలను గమనిస్తున్నది. 

పుస్తకం, పెన్ను రెడీగా పెట్టుకున్నది, बिरयानी - cum वेज पुलाव చేయు విధంబును 

తెలుసుకుని, తెల్ల కాగితమ్ములలో రాసుకొనుటకు. 

అచ్చమ్మ బేసిన్ తీసుకుని, ప్రత్యేక రకం బియ్యాన్ని కడిగింది. 

"ఈ పంజాబు బియ్యం కాస్త నానాలి."

పంజాబ్ - అనే మాటను నొక్కి పలికింది, తనకు జనరల్ నాలెడ్జి ఎక్కువే ఉందని, తెలిసేటట్లుగా

అచ్చమ్మాంబ ప్రయత్నం వ్యర్ధం అయిందనే చెప్పాలి, 

నానీ ముచ్చట కోసమన్నా ఈమె లోకజ్ఞానాన్ని గుర్తించలేదు ..... అనడం కంటే గుర్తించదలుచుకోలేదు - 

అని చెప్పడం సబబు. అంతలోనే ఆమె చకచకా కూరలన్నీ తరిగింది. 

"భవాణీ ఏది!?" అని అంటూ, వంగి మూకుడుని తీసుకుంది. 

స్టవ్ పైన పెట్టి, చెంచా నూనె వేసి, "డాల్డా వెయ్యాలి." అన్నది. 

"అయ్యయ్యో, డాల్డా జంతువుల కొవ్వు అంట. మా ఇంటాయనకి వనస్పతి అస్సలు పడదు." 

"సరే" అని పక్కన పెట్టి, నూనెను కొంచెం ఎక్కువ వేసింది అచ్చమ్మ. 

కూరలు వేసి, పలావ్ ఆకుని వేయబోయింది. 

"వద్దు అచ్చీ, నాకు ఆ వాసన గిట్టదు."  

"నీకా, మీ ఆయనగారికా పడనిది!?" అచ్చమ్మ సందేహం నిజమే, 

చాలావరకు - భర్త పేరు మీద, తన అభిరుచులను చలామణీ చేస్తుంటుంది నానీ.

చిటెం సేపు ముక్కలని మగ్గనిచ్చి, బియ్యన్ని వేసింది. ఆనక బ్రెడ్ పీసులు బైటికి తీసింది. 

అప్పటికే కొత్తిమీర, కరివేఆకుల్ని కలిపింది నానీ. 

"రొట్టెముక్కలు యాక్, మాంసం కంపు - దాని బదులు, వడియాలు వేద్దాం." 

అచ్చమ్మ అయోమయంలో పడింది, ఆమెతో పాటు . 

బైట కూర్చుని ఉన్న శ్రోత కూడా కన్ ఫ్యూషన్లో తలమునకలౌతున్నది. 

"ఈ రెసిపీని బిర్యానీ అని పిలవవచ్చునా!?" అని గొప్ప మీమాంసలో కూరుకుపోయింది శ్యామల.

"మరీ చప్పగా ఉంటే ఏం బాగుంటుందీ!?" అన్నది నానీ. 

"మరే" అని ముక్తసరి జవాబు అచ్చమ్మ పెదవుల నుండి వెలువడింది.

శ్యామల white pages మార్జిన్లు, కూడికలు, కొట్టివేతలు - 

వస్తువుల లిస్టు సమీకరణాలు - వెరసి - ఖరాబు అయింది. 

"ఇక్కడ గనక, హోటల్ మేనేజిమెంట్ స్కూలు పెడితే ఇంతే సంగతులు, 

నల భీములు కూడా గింగిర్లెత్తి, ఢమాల్" నవ్వుకున్నది శ్యామల. 

రాత్రి అరిటాకులు పరిచి, వడ్డించారు, వేడి సెగలు పొగలతో, ముక్కుపుటాలకు కమ్మగా సోకాయి వాసనలు. 

మణయ్య "మా ఆవిడ కొత్త వంట చేస్తున్నది, రండి, రుచిచూద్దురు." 

అంటూ పిలిచిన నలుగురు అతిథులు - పంక్తి భోజన శ్రేణిలో అదనంగా కలిసారు. 

బితుకుబితుకుమంటూ నోట్లో ప్రధమ కబళం పెట్టుకున్నది శ్యామల.

చిత్రంగా చాలా బాగుంది, నానీ బిర్యాణీ.

శ్యామల నూతన బిర్యానీ రెండు ముద్దలు ఎక్కువగానే లాగించింది, 

తక్కిన నలుగురు సైతం అంతే, ఫలితం - గిన్నె ఖాళీ. అడుగూ బొడుగూ గిన్నెలోది గోకి, 

గరిటెడు ముద్దని తినగలిగారు పచన కర్తలు ఇద్దరు. 

'రుచి ఎట్లాగ ఉందో తెలుసుకోవడం కోసమే - ఆ కొంచెమైనా సాధించగలిగారు మహిళాద్వయం.

"ఎట్లా చెయ్యాలో నాకు తెలిసింది అచ్చీ! ఈసారి మళ్ళీ వండి పెడతాను. తృప్తిగా తిందాం." 

నానీకి తమ గృహసామ్రాజ్యంలో ఇవాళ ఇంతమంది ప్రీతితో, కడుపు నిండా తిన్నారు కదా - 

అనే సంతోషం నానీ కడుపు నిండినంత తృప్తి కలిగి, బ్రేవ్ మని త్రేంచింది.

స్త్రీల పత్రికకు, ఈ రెసిపీని వివరంగా రాసి, పోస్ట్ చేసింది శ్యామల. పత్రిక వాళ్ళు,

పారితోషికం + పత్రిక కాపీ పంపారు. "

మాగజైనులో అచ్చు వేస్తే - డబ్బులు కూడా పంపిస్తారు.' అనే విషయం అప్పుడే తెలిసింది. 

తన పేరుని ముద్రణలో చూసుకుని, ఫ్రెండ్సుకి చూపించి, మురిసిపోయింది శ్యామల. 

అప్పటి నుండి ఆమె లేఖలు, రెవ్యూలు, కథలు కాకరకాయలు రాసే మంచి అలవాటు సంక్రమించింది.

"తన ఇంట్లో విశేషం అది. తాము చేసిన వంటలు పత్రికలలో వచ్చి, లోక ప్రసిద్ధం ఔతున్నాయి." 

నానీ అల్ప సంతోషి, "నా ఇంట్లో విస్తట్లో తిని, చెయ్యి కడుక్కున్న పిల్లది మంచి రచయిత్రి అయ్యింది సుమా!" 

అని అందరికీ చెబుతున్నది. 

కొసమెరుపు ;- ఇంతకీ శ్యామల ఈ ఆహార పదార్ధానికి పెట్టిన పేరు ఏమిటై ఉంటుంది!?

 magazine లో శ్యామల విరచిత పాకశాస్త్ర అంశం యొక్క హెడింగు - *"నార్యాణి" అని ;

నానీ + బిర్యాణీ/ నీ = అని శ్యామల చేసిన నామకరణం .... ,

&

[పాత్రలు ;- నానీ - శ్యామల [[శ్రీకంఠం/ శ్రీకంఠ ప్రసాద్ from ఢిల్లీ - మిత్రుల పుత్రిక - నాలుగో వీధి అచ్చమ్మ - 

నానీ  భర్త రమణయ్య =  వెంకటరమణయ్య ] 

========================= ,

naaryaaNi - anE biryaanee tayaaree - 42 ;- 

Syaamala wastunnadi ani - phOn cEsi ceppADu Delhi numDi SrIkamTham ; 

"maa snEhitula kuuturu,  SyAmala VijayawADa hotel ruumulO basa, 

O saari palleTUru kaLalanu cUDAlani - aa pilla utsAham. 

SyAmala Digree final year pUrti autunnadi, kanuka bhawishyattu gurimci 

anEka plaans - aame manasulO giragiraa tirugutunnAyi. 

"imta dUram waccina ammAyi - 

mana ULLO padirOjulainA umDAli SrIkamTham!" - ani ceppimdi nAnI.

SrIkamTha prasAd ni - ammaayi abhiruculu - wiwaraadulu kanukkunnadi nAnI. 

"SyAmalaki biryaanI amTE ishTam." 

nAnI gatukkumannadi, tanaku pulihOra, daddhOjanam, gaarelu ityaadulu telusu, 

mari ee kotta wamTakam pEru tana cewini cErutuunE umdi, gaanI -

aa widESI wamTakam paTla aasakti lEdu kaabaTTi paTTimcukO lEdu. 

ippuDu - amta duuram numDi, ee muula unna uuru amTE -

jijnaasatO wastunna pilladaani paTla prEma kaligimdi, amdukani, 

biryAnI tayArI gurimci emkwairee modalupeTTimdi. 

nAlugO wIdhi accamma konnisaarlu biryAnI cEsimdaTa. 

wemTanE komgu naDumuki dOpukuni 

"idugOnayyOw, wistaTlO annam peTTAnu. pakkanE annee unnaayi, 

jaagartagaa cuusukuni, waDDimcukuni tinu. gamTalO wastAnu." 

nAnI patidEwuDu maNayya = wemkaTaramaNayya 

"sarE" ani tala uupADu, aitE nAnI aayana amgeekaaram kOsam ATTE 

edurucUsE rakam kAdu. buDibuDi naDakalatO gunagunA naDiciweLLimdi. 

"bayaldErina wELa baagumdi, accee! imTlOnE unnAwu." 

"nEnekkaDiki weLtaanani!?" nosalu ciTlimcimdi, accamma. 

aameku nAnI palukulalO unna suukshmam, wyamgyam iTTE bOdha paDutumdi.

accamma tana mATallOni SlEshhaardhaanni pasigaTTimdi, ani nAnIki telusu kADA, 

gurtimcanaTlE naTistumdi. taanu waccina panini sawiwaramgaa walle wEsimdi. iTlAmTi 

wyamgyaalu gurimci wALLu manasu pADu cEsukOru. cinnapATi haasyam miLitamai umDE 

ettipoDupulu nitya jeewitamlO amtarBAgamgaa sweekaristAru. amdukanE eppuDu edurainaa, 

maLLI canuwugA palakarimcukumTumTAru. 

marnADu poddunnE nAnI imTlO pratyaksham ayyimdi 

accamma.nAnI bhartaki tomdaragaa annam waDDimcimdi. 

maNayya baawi capTA daggara cEtulu kaDukkuni 

waccE lOpu, tama iddarikee waDDimcimdi. 

"accI! naa cEti pulusu - EDULLalO peTTimdi pEru, 

telusA!" amTU kosari kosari waDDimcimdi. 'biriyANI tanaku telIdu ' 

ani accamma dRshTilO - tanaku cinnatanam kaakUDadani, 

maaTala melikalu konasaagimcimdi. 

"nijamgAnE, nI cEti wamTa amRtam, akkAy." manasphUrtigA meccukunnadi accamma,

 brEw brEwumani trEnustuu.

kAssEpu resT teesukunnaaka, wamTagadilOniki aDugupeTTAru. 

************** , 

accamma gabagabaa stove weligimcimdi. innALLU aame kumpaTi, 

rALLa poyyi meeda wamTa cEsukunnadi. 

ee madhyanE nAnee alluDu pillala selawulaku sakuTumba sapariwaara samEtamgA 

waccADu. "kaTTela pogatO awastha paDutunnAru. attammA" nAnI son in law noccukunnADu. 

tama imTlO kotta mODal sTawwu konukkunnaaru, 

kaabaTTi, kUturu uraph tana bhaaryatO wacci, sTaw iccADu. 

kottadi koni iwwalEdani, saNagalEdu, samtOshamgaa teesukunnadi. 

amdukE tanakuu sTawwuni wADaTam telusunani - ikkaDa niruupimcEsimdi.

"maa alluDu mammalni koDukulaagaa cUsukumTADu" ani, mATallO samdarBAnni 

dorakabuccukuni, ceppETappuDu aame kaLLalO samtOsham gamtulu wEstumdi.

"biryAnI Aku - deenni tEjupattaa [ तेजपत्ता ] amTAru." 

amTU cinna plaasTik baaksulO teccina 

masaalaa dinusulanu aracEtilO peTTukuni, cebtuu,

"palav basumati biyyaanni teccaanu. 

manam rOjU wADE biyyam panikiraadu." annadi.

haalulO paDakkurceelO kuurcuni, nOTs raasukumTunnadi SyAmala. 

weeri samBAshaNa yaawattU SyAmala wimTunnadi.

"maa alluDu mammalni koDukulaagaa cUsukumTADu" ani, mATallO 

samdarBAnni dorakabuccukuni, ceppETappuDu aame kaLLalO 

samtOsham gamtulu wEstumdi.

"biryAnI Aku - deenni tEjupattaa [ तेजपत्ता ] amTAru." 

amTU cinna plaasTik baaksulO teccina 

masaalaa dinusulanu aracEtilO peTTukuni, cebtuu, 

"बिरयानी - baasumati biyyaanni teccaanu. 

manam rOjU wADE biyyam panikiraadu." annadi.

haalulO paDakkurceelO kuurcuni, nOtes raasukumTunnadi SyAmala. 

weeri samBAshaNa yaawattU SyAmala wimTunnadi.

SyAmalaku kUDA biryAnI tinaDam telusu gaanee, 

wamDE widhAnam telIdu. A mATakostE - annam wamDaTam kUDA cEtakaadu. 

tana talli uuriki weLLinappuDu. tappanisarai wamDina annam - 

cimiDipOyimdi, "dIni pEru EmTi akkAy!" aDigADu tammuDu A rOju.

amdukani kotta wamTala gurimci kanukkonE interest nu 

pempomdimcukunnadi SyAmala. 

ippuDu lOpala iddaru wanitala gariTelu, paatralu 

cEstunna kathaakaLi nATyaalanu gamanistunnadi. 

pustakam, pennu redey gaa peTTukunnadi, 

biryAnI - बिरयानी - cum वेज पुलाव - cEyu widhambunu telusukuni, 

tella kaagitammulalO raasukonuTaku. 

accamma bEsin teesukuni, pratyEka rakam biyyaanni kaDigimdi. 

"I punjab biyyam kaasta naanaali." 

punjab  - anE mATanu nokki palikimdi, 

tanaku janaral naaleDji ekkuwE umdani, telisETaTlugaa. 

accammaamba prayatnam wyardham 

ayimdanE ceppAli, nAnI muccaTa kOsamannA  

eeme lOkajnaanaanni gurtimcalEdu ..... anaDam kamTE -

gurtimcadalucukOlEdu - ani ceppaDam 

sababu. amtalOnE aame cakacakaa kuuralannii tarigimdi. 

"BawANI Edi!?" ani amTU, wamgi muukuDuni teesukumdi. 

stove paina peTTi, cemcA nuune wEsi, 

"DAlDA weyyaali." annadi. 

"ayyayyO, DAlDA jamtuwula  kowwu amTa. 

maa imTAyanaki wanaspati assalu paDadu." 

"sarE" ani pakkana peTTi, nUnenu komcem ekkuwa wEsimdi accamma. 

kuuralu wEsi, tEj pattaa - తేజ్ పత్తా [palaaw aaku]ni wEyabOyimdi. 

"waddu accI, naaku A waasana giTTadu." 

"neekaa, mee aayanagaarikA paDanidi!?" 

accamma samdEham nijamE, calaawaraku - bharta pEru 

meeda, tana abhiruculanu caalaamaNI cEstumTumdi nAnI.

ciTem sEpu mukkalani magganicci, biyyanni wEsimdi. 

aanaka breD peesulu baiTiki teesimdi. 

appaTikE kottimeera, kariwEAkulni kalipimdi nAnI. 

"roTTemukkalu yaak, maamsam kampu - daani badulu, waDiyAlu wEddAm." 

accamma ayOmayamlO paDimdi, aametO pATu . 

baiTa kuurcuni unna SrOta kUDA confusion lO talamunakalautunnadi.

"I recipie biryaanee ani pilawawaccunaa!?" ani 

goppa meemaamsalO kuurukupOyimdi SyAmala.

"maree cappagA umTE Em baagumTumdI!?" annadi nAnI. 

"marE" ani muktasari jawaabu accamma pedawula numDi weluwaDimdi.

SyAmala `white pages` mArjinlu, kUDikalu, koTTiwEtalu - 

wastuwula lisTu sameekaraNAlu - werasi - kharaabu ayimdi. 

"ikkaDa ganaka, hOTal mEnEjimemT skUlu peDitE imtE samgatulu, 

nala bheemulu kUDA gimgirletti, DhamAl" nawwukunnadi SyAmala. 

raatri ariTAkulu parici, waDDimcaaru, wEDi segalu pogalatO, 

mukkupuTAlaku kammagaa sOkaayi waasanalu. maNayya 

"maa aawiDa kotta wamTa cEstunnadi, ramDi, rucicuudduru." amTU 

pilicina naluguru atithulu pamkti BOjana SrENilO adanamgaa kalisaaru. 

bitukubitukumamTU nOTlO pradhama kabaLam peTTukunnadi SyAmala. 

citramgaa caalaa baagumdi, nAnI biryANI.

SyAmala nuutana biryaanee remDu muddalu ekkuwagaanE laagimcimdi, 

takkina naluguru saitam amtE, phalitam - ginne KALI.

aDuguu boDugU ginnelOdi gOki, gariTDu muddani tinagaligaaru 

pacana kartalu iddaru. 'ruci eTlaaga umdO telusukOwaDam kOsamE - 

aa komcemainaa saadhimcagaligaaru mahiLAdwayam.

"eTlaa ceyyaalO naaku telisimdi accI! Isaari maLLI wamDi peDataanu. 

tRptigaa timdaam." nAnIki tama gRhasaamraajyamlO iwALa imtamamdi preetitO, 

kaDupu nimDA tinnAru kadA - anE samtOsham 

nAnI kaDupu nimDinamta tRpti kaligi, brEw mani trEncimdi.

streela patrikaku, ee resipeeni wiwaramgaa raasi, 

pOsT cEsimdi SyAmala. patrika wALLu,  

paaritOshikam + patrika copy pampaaru. 

"maagajainulO accu wEstE - Dabbulu kUDA pampistaaru.' 

anE wishayam appuDE telisimdi. tana pEruni mudraNalO cuusukuni, 

friendsu ki cuupimci, murisipOyimdi SyAmala. 

appaTi numDi aame lEKalu, review lu, kathalu 

kaakarakaayalu raasE mamci alawATu samkramimcimdi.

"tana imTlO wiSEsham adi. taamu cEsina wamTalu patrikalalO wacci, 

lOka prasiddham autunnAyi." nAnI alpa samtOshi, 

"naa imTlO wistaTlO tini, ceyyi kaDukkunna pilladi 

mamci racayitri ayyimdi sumA!" ani amdarikee cebutunnadi. 

kosamerupu ;- imtakee Syaamala ee aahaara padaardhaaniki -

peTTina pEru EmiTai umTumdi!? 

`magazine` lO Syaamala wiracita pAkaSAstra amSam yokka heading - 

"naaryANi" ani.

 naanee + biryaaNI/ nee = ani Syaamala cEsina naamakaraNam .... ,

& ********************** + ;- =

[pAtralu ;- nAnI - SyAmala from Delhi  [SrIkamTham/ SrIkamTha prasAd - yokka mitrula 

putrika] - nAnI bharta maNayya = wemkaTaramaNayya ; nAlugO wIdhi accamma ] 

= [పాత్రలు ;- నానీ - శ్యామల [[శ్రీకంఠం/ శ్రీకంఠ ప్రసాద్ from ఢిల్లీ - మిత్రుల పుత్రిక] -  నాలుగో వీధి అచ్చమ్మ ] ;; 

నానీ  భర్త మణయ్య = వెంకటరమణయ్య ] ;

నార్యాణి - అనే బిర్యానీ తయారీ - 42 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మహర్షులు - ప్రకృతి సేవలు - sEwalu - 1

మహర్షులు సంచారజీవులు. ఋషి జీవనవిధానం - కొన్ని నియమ నిబంధనలను అనుసరించి కొనసాగుతుంది. మితాహారం, దేహ కఠిన శ్రమ - తపో నిష్ఠ, నిష్కామ పద్ధతి, భగ...