5, జులై 2022, మంగళవారం

'థ' - బొడ్డులో చుక్క - 43

సంఘటనలు దారాలు లాంటివి, ఫలితాలు గాలిపటాలు వంటివి. 

కాకాని నుండి పిన్ని కూతురు రోజా వచ్చింది. తన అసలు పేరు సరోజ - 

ఈ మధ్య సినిమా హీరోయిన్  ROJA పాప్యులర్ అయ్యింది, 

అందుకే మోజుగా తన నామాన్ని - మార్చేసుకుంది, "రోజా" అని తనని పిలవమంటున్నది. 

కొత్తవాళ్ళు రోజా - అని పిలుస్తున్నారు, కానీ ..... , ఇంతప్పటి నుండీ కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు, 

కనుక చుట్టాలు పక్కాలకు పాత పిలుపే నాలుకపై ఆడుతుంది కదా, 

'సరోజ' అనే పిలుస్తున్నారు. సరోజ ఉరఫ్ రోజా ఎక్కడ ఉన్నా అంతటా తానే అగుపిస్తుంది, 

అంత కలివిడితనం ఉన్న అమ్మాయి, యువతిగా పరిణామం పొందాక, 

అదే కలుపుగోరుతనం కొన్నిసార్లు వింత సమస్యలను తెచ్చిపెడుతున్నది. 

ఐనా స్వతహాగా ధైరస్థురాలు, కనుక ఎవరినీ లెక్కచేయకుండా ముందుకు సాగుతుంటుంది.  

 రోజా friend సుమాలిని - "సినిమా ఛాన్సు కోసం ఒక్క యాక్షన్ మాత్రమే చాలదు,

డాన్స్ బాగా చెయ్యగలిగి ఉండాలి, కాస్తో కూస్తో మ్యూజిక్ నాలెడ్జ్ ఉండాలి, ఇంకా ..... " 

"ఆగాగు, ముందు డాన్స్ స్కూల్ అడ్రస్ ఇవ్వు." 

సుమాలిని చేరిన institute లో చేరింది.

 "అనుకున్నంత ఈజీ కాదు, డాన్స్ - అంటే ఒళ్ళు హూనం ఔతున్నది ..... , 

అని అనుభవపూర్వకంగా తెలుసుకుంది రోజా. ఐనా తప్పదు, 

తన టార్గెట్ రీచ్ అవ్వాలమంటే ఇంతమాత్రం ఎక్సర్సైజులు తెలియాల్సిందే, తప్పు లేదు" 

శుక్ల పక్షం బహుళ పక్షంలోకి దారి తీస్తున్నది. 

"అప్పుడే రెండు వారాలు గడిచాయి. Dance లో డజను steps కూడా నేర్చుకోలేకపోయింది రోజా.

సుమాలిని "ఇంకా, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, జాగింగ్, ప్రాణాయామం .... " 

అంటూ కొంచెం పెద్ద లిస్టునే చెప్పింది. వాటిలో నుండి ఫస్ట్ యోగా - అని 

సెలెక్ట్ చేసుకున్నది రోజా కమ్  రోజ్ - సుమాలిని ఆమెను - రోజ్' అని పిలుస్తున్నది. 

యోగా కమ్  సర్కస్ ఫీట్స్ practice కి శ్రీకారం చుట్టింది. 

"నిన్న మొన్నటి దాకా - అమ్మ చేతి గోరుముద్దలు తిని, పెరిగిన 

సుకుమారమైన మేను ఇది, ఇప్పుడు అష్టకష్టాలు పడ్త్తున్నది, పాపం!" 

లెక్కలేనన్ని వంకర్లు తిప్పేస్తున్న తన దేహం పైన - తానే జాలి పడసాగింది రోజా. 

"హేయ్, నీ బాడీ అండ్ నడుము కూడా సన్నం ఐనాయి.

రాజశేఖర్ సినిమాలో చెప్పినట్లుగామెరుపు తీగలా ఉన్నావు." 

ఆమెను ఉత్సాహపరచడానికి సుమాలిని చిన్ని చిన్ని అబద్ధాలు చెబ్తుంది నేస్తంతో. 

కానీ, రోజా - నిజమే, అనుకుని, మరింత హుషారుగా ఎక్సర్సైజులు చేస్తున్నది. 

"రోజ్, swimming pool లో నేర్చుకున్నది చాలదు, 

చెరువులు, నదులు, బావులలో free గా ఈత కొట్టగలగాలి. 

కౌబాయ్, folk films లో నీళ్ళలో ఈదుతూ, ముందుకు వెళ్ళాల్సిన scenes ఉంటాయి కదా" 

"హుమ్" శ్వాస దీర్ఘంగా పీల్చి, సుదీర్ఘంగా ఆలోచించింది రోజా.

తన తాతయ్య సోదరి - నానీ ఉండే పల్లెటూరు, అక్కడి చెరువు గుర్తుకు వచ్చాయి. 

"ఇంకేం, ఛల్ ఛలో ఛల్ - ఛల్  ఛలో ఛల్" అంటూ తాను స్టార్ట్ అయ్యింది, 

సుమాలినిని బయల్దేరదీసింది. రోజ్, సుమాలిని - ఫోన్ చేసారు, 

నానీ దంపతులు వారి కోసం ఎదురుచూస్తున్నారు. బస్సు దిగారు ఇద్దరూ, 

దుమ్ము కొట్టుకుపోయిన దుస్తులతో, దుమ్ము నిండిన జుట్టుతో, దుమ్ము పట్టిన వదనారవిందములతో. 

ఢిల్లీ శ్యామల వాళ్ళని చూస్తుంటే, తను కూడా ఈ village లో 

ఎర్రబస్సు నుండి అవరొహణ చేసింది ఈ అవతారంతోనే - గుర్తుకు వచ్చి, నవ్వుకుంది. 

తన project work వచ్చే వారం పూర్తి ఔతుంది, ఢిల్లీకి flight - ticket బుక్ చేసుకుంది శ్యామల. 

"నువ్వు వెళ్తే మాకు తోచదు." అంటూ దిగులు పడసాగారు దంపతులు. 

వారి విషణ్ణ వదనాలలోకి మళ్ళీ చిరునవ్వులు వచ్చి చేరాయి. 

శ్యామల త్వరగానే ఇరువురికీ దోస్త్ అయ్యింది.

****************** ,

ఇక్కడ ఓపెన్ బాత్ రూమ్ - కొత్త తరహా స్నాన పానాలు - తమాషాగా అనిపిస్తున్నవి. 

ప్రతి చిన్న అంశాన్నీ - ఈ తరం యువతకు లాగానే - తమ  మొబైల్సులో ఫొటోలు తీస్తున్నారు. 

"నానీ, మా అమ్మమ్మ చెబుతుండేది, మీ ఊరి చెరువు నిండా తామర పూలు ఉంటాయట కదా"

"అది ఒకప్పటి మాట, అమ్మణ్ణీ, ఇప్పుడు అన్నీ హుళక్కి. 

ఎండా కాలంలో ఐతే, నీళ్ళు ఇంకిపోయి, బురద మాత్రం ఉంటుంది. 

ఇప్పుడు వానాకాలం కాబట్టి నీళ్ళు నిండా ఉన్నాయి." 

"మీ luck బాగున్నది. కరెక్ట్ గా రైనీ సీజన్ లో వచ్చారు." అని శ్యామల ఉవాచ.

"కాకాని రోజా - బటర్ ఫ్లై స్విమ్మింగ్ బాగా చేస్తున్నది." 

శ్యామల మాటలకు నవ్వింది సుమో = సుమాలిని ...., "

'నన్ను రోజ్ ని చేసింది, కనుక సుమాలినిని - నిక్ నేమ్ 'సుమో'- గా స్థిరపరిచింది - రోజా వర్సెస్ రోజా ; 

"సుమారుగా వచ్చు, రీసెంట్ గా ఈత నేర్చుకుంటున్నది రోజా" సుమాలిని తనకే అన్ని విద్యలు, 

ఇతరుల కంటే తనకే కొంచెం ఎక్కువ వచ్చునని విశ్వాసం.

సుమాలిని సైతం స్విమ్మింగ్ చేసింది. గంట తర్వాత ఇల్లు చేరారు ముగ్గురూ.

ఇంటికి చేరాక, ఇద్దరూ ఒళ్ళు బరుక్కోడం మొదలెట్టారు. శ్యామలకు బోధపడింది, 

ఊళ్ళో గేదెలని, జంతువులని కొబ్బరి పీచుతో అతి శుభ్రంగా కడుగుతుంటారు, 

చిత్రం ఏమిటంటే - మొల గుడ్డలు, మురికి గుడ్డలు, 

ఇల్లు తుడిచే సమస్త బట్ట ముక్కలు - అక్కడే ఉతుకుతారు, 

అందులోనే కడవలు, కావడికుండలు, బిందెలు - త్రాగే మంచినీళ్ళు నింపుకుని వెళ్తుంటారు - 

నిర్భయంగా. నిస్సంకోచంగా.

యావత్ సంగతులు - అందరి మాట మంతీలో దొర్లాయి. 

లోకంలోని వాతావరణ కాలుష్యాలు, ప్రపంచ దేశాల నేతల స్వార్ధం - అందుకు మూల కారణాలు - 

*ఏ టూ జడ్ - సమస్త వార్తలు - చుట్టేసాయి. [ = * A to Z ] ;;

నానీ చాలా నొచ్చుకున్నది, పాలేరు భార్య సుబ్బాయికి కబురు పెట్టగానే వచ్చింది.  

శీకాయి, కుంకుడుకాయలు, మందార ఆకులు, చెక్కపొడి, ఆముదం - 

వివిధ ప్రాచీన వస్తు సంభారాదులు - స్నానాల గదిలో పెట్టింది. 

నానీ పురమాయించినట్లుగా - మిత్రిణీ ద్వయానికి, సున్నిపిండి, పసుపు నిండా పులిమింది, 

ఆ ఊళ్ళో కుటీర పరిశ్రమ level లో - నవ మూలికలు కలిపిన హెర్బల్ సమాన పౌడరు 

దోసిలి నిండా తీసుకున్నది సుబ్బాయి - 

నలుగు, నిలువెల్లా అభ్యంగన స్నానాలు - పూర్తి అవడానికి, పూర్తిగా నాలుగు గంటలు పట్టింది. 

సుమో, రోజ్ ఇద్దరి కళ్ళు, శీకాయ్, కుంకుళ్ళ రసం - కళ్ళలో పడి, ఎర్రగా ఉబ్బెత్తు ఐనాయి.

"మనల్ని, ఈ క్షణాన చూసినవాళ్ళు - మనం పూటుగా విస్కీ తాగాము - అనుకుంటారు కదూ రోజ్"

"thank God, నాకు స్విమ్మింగ్ రాదు, కాబట్టి, సరిపోయింది, 

లేకపోతే మీకు మల్లే - తలంటు బాధితుల వర్గంలో చేరిపోయే దాన్ని." 

గుండెల మీద చేతులు వేసుకుని, అభినయ సహితంగా శ్యామల. 

అంతా వింటూనే ఉన్నారు, నానీ దంపతులు. 

ఒకరి వెంబడి ఒకరు - తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

= ఆముదం తలకు అంటుకుంటే జుట్టు అస్సలు ఊడదు, 

శీకాయ్, కుంకుడుకాయలు - జన్మలో కళ్ళ చూపు తగ్గడం వంటివి జరగవు, 

దృష్టి దోషం లాంటివి రావు గాక రావు,...... , ఇత్యాదయః ..,

****************** ,

ఒంటికి అంటుకున్న నలుగు పిండి, బాగా ఊడిన చిక్కుపడిన జుట్టు - - 

నలిచి, నలిచి నెమ్మదిగా - తీసేస్తున్నారు.

"అదేమిటమ్మణీ, నాభికి?" ప్రశ్నార్ధకం చూపులు, 

శ్యామల వారికి సైగ చేసి, చూపించింది - "ఓహో, బొడ్డు అన్న మాట" అర్ధమైది, 

"అది ఫ్యాషన్ రింగు, నానీ!" సిగ్గు పడుతూ చెప్పింది సుమో.

"చెవులకు మల్లే, బొడ్డుకు కూడా, నగలు కుట్టించుకున్నారా!?" 

"villages లో, ముఖ్యంగా కొత్త జాగాలలో, కొత్త వాళ్ళ దగ్గర - 

నిండుగా డ్రెస్ చేసుకోవాలి, రోజా" శ్యామల సలహా.

"ఛాన్స్ దొరికితే, నేను కూడా ఇతరులకు advices ఇవ్వగలను." 

మనసులోని భావాన్ని, పెదవుల మటున బిగబట్టింది సుమో.

"నాది ఊపబొడ్డు, కోయదొర చెప్పిన సొల్యూషన్ ఇది, 

అందుకని అప్పటి నుండి ఇది ఉంచుకున్నాను. 

గుళ్ళో పూజ చేసి, ఇచ్చారు, ఆ కోయవాళ్ళు." 

రోజా అబద్ధం - చమత్కారం - శ్యామల చిటికెలో గ్రహించింది, 

ముసిముసినవ్వులతో కనుబొమ్మలు ఎగరేసింది, "నాకు అర్ధమైందిలే" అన్నట్లు.

"ప్లీజ్. నానీకి చెప్పొద్దు." అన్నట్లు ఆమె వైపు చూపులోనే సైగలను ఇచ్చింది రోజా. 

"బొడ్డు - దగ్గరి నుండి - తల్లిపేగు ఉంటుంది. 

తల్లి ప్రేగు - పుట్టే బిడ్డకు కు - అది - మొక్కకు పాదు లాంటిది. 

ఈ కాలం పిల్లలు - ప్యాంట్లు, విచిత్ర వస్త్రధారణలు - ఎవరికీ చెప్పేటట్లు లేదు కదా." 

నానీ నిట్టూర్చింది. "బాగా అలిసిపోయారు. తొందరగా అన్నం తిందురు గాని, పదండి." 

కళ్ళ మీద మత్తును వదిలించుకుంటూ - నానీ వెనక వెళ్ళారు.

****************** ,

న్యూ యియర్ - ఆఫీసు సెలవులకు, అదనంగా పన్నెండు రోజులు లీవ్ పెట్టి, 

కాకానికి వెళ్ళింది  రోజా, సుమోతో. సుమాలిని - ఫ్యాషన్ పోటీలకు ఫొటోలు తీసుకుంటున్నది. 

కొత్త లొకేషన్స్ కోసం గాలిస్తున్నది, అందుకనే రోజా ఊరికి వచ్చింది. 

రోజా అన్నయ్య  MASTER మోహన క్రిష్ణ - 

ఇంటి ముందు పావంచాలో కూర్చుని, ప్రైవేట్ ట్యూషన్స్ చెబుతున్నాడు. 

గేటు నుండి వస్తున్న చెల్లి సరోజకి, చిరునవ్వు పలకరింపు ఇచ్చాడు.

తల్లి దండ్రులు, తమ్ముళ్ళు ఇద్దరు - సూట్ కేసులను - పడమటి గదిలో పెట్టి, 

పెరట్లో తొట్టి దగ్గరికి వెళ్ళారు. కాళ్ళు కడుక్కుని వచ్చారు. 

టిఫిన్, కాఫీలు తీసుకుంటూ, పరస్పరం - ఊరి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.

బైట మోహన్ కృష్ణ - పిలకాయలకు - హోమ్ వర్క్ దిద్దుతూ, తప్పొప్పులు చెప్పి, కసురుతున్నాడు. 

"ఇదేమిటి, చెంద్రీ, ఎన్ని సార్లు చెప్పినా - అవే తప్పులు రాస్తున్నావు.

- థ - అంటే - బొడ్డులో చుక్క పెట్టాలి ఇట్లాగ."

"బొడ్లో చుక్క - త - థ ... " బెత్తం పట్టుకున్నాడు MK మాస్టారు.

****************** ,

బొడ్డు - అని వినగానే, పట్టరాని నవ్వు వచ్చింది, 

సరోజ, సుమాలిని ఇద్దరి నవ్వులు గదిలో ప్రతిధ్వనిస్తున్నాయి .... ,

మరి, నానీ భర్త వెంకటరమణయ్యగారు - ఈ ఉభయులకు, and శ్యామలకు, 

"బొడ్డు - పద సహస్రం" - కూర్చోబెట్టి, బోధించారు.

"బొడ్డు - సంస్కృతంలో నాభి - పద్మనాభస్వామి - అంటే, 

బ్రహ్మదేవుడు - విష్ణుమూర్తి నాభి నుండి ఉద్భవించిన పద్మంలో పుట్టాడు, 

అందుకనే ఆయన పద్మనాభుడు ; శ్రీలక్ష్మీదేవి - శ్రీవాణి = శ్రీ సరస్వతి - 

తామరపువ్వు, కలువ పువ్వు - అనుబంధం ఉన్న కథలు .... " 

అంటూ ఆపకుండా ఏకధాటిగా, ఆశువుగా చెప్పారు.

- చెప్పారు అనడం కంటే - చిన్న పిల్లల చెవులు మెలిబెట్టి, కూర్చోబెట్టి, బోధించారు - అనడమే కరెక్ట్ ...,

పద సహస్రం - వెయ్యి కాదు, వెయ్యిన్నూట పదహార్లు - అజ్ఞానులకు వడ్డించారు, 

వెంకటరమణయ్య తాతయ్య గారు ఆ రోజు.

"ఇంకా ఏ ఏ తెలుగు letters కి బొడ్డు చుక్కలు ఉంటాయి, అన్నయ్యా?" 

ఎప్పుడూ, తెలుగు - ఇతర సబ్జెక్టులను, చదువు అంటే విసుక్కునే చెల్లెమ్మ సరోజ -

ఇంత శ్రద్ధగా - విద్యా విషయాలను అడుగుతుంటే ఆశ్చర్య వీక్షణాలను ప్రసరింపజేసాడు master MK. 

రోజా - వ్యంగ్యాన్ని దాచిపెడ్తూ,  - థ - అక్షరంలోని బొడ్డు చుక్క గురించి అడుగుతున్నది ..... ,

విపులంగా చెప్పిన నానీ అభిప్రాయాలను - గుర్తు చేసుకుంటూ ....., చిన్నగా నవ్వుకుంటూ ..... ,

****************** ,

[పాత్రలు ;-  నానీ దంపతులు* & రోజా తాతయ్య యొక్క సోదరి = నానీ  ; *నానీ భర్త వెంకటరమణయ్య  ;;

కాకాని పిన్ని కూతురు - రోజా/ సరోజ & అన్నయ్య Master మోహన క్రిష్ణ - & 

friend సుమాలిని - నిక్ నేమ్ సుమో & సుబ్బాయి ]

========================== ,

- tha - boDDulO cukka - 43 ;- story ;- 

samghaTanalu daaraalu lAmTiwi, phalitaalu gaalipaTAlu wamTiwi. 

kAkAni numDi pinni kuuturu rOjA waccimdi. tana asalu pEru sarOja - 

ee madhya sinimaa heerOyin paapyular 

ayyimdi, amdukE mOjugA tana naamaanni - maarcEsukumdi, 

"rOjA" ani tanani pilawamamTunnadi. kottawALLu rOjA - ani pilustunnaaru, 

kaanee - imtappaTi numDI kalisimelisi tirigina wALLu, 

kanuka cuTTAlu pakkaalaku paata pilupE naalukapai ADutumdi 

kadaa, 'sarOja,' anE pilustunnaaru. sarOja ekkaDa unnA amtaTA taanE agupistumdi, amta 

kaliwiDitanam unna ammAyi, yuwatigA pariNAmam pomdaaka, 

adE kalupugOrutanam konnisaarlu 

wimta samasyalanu teccipeDutunnadi. ainaa swatahaagaa dhairasthuraalu, kanuka ewarinee 

lekkacEyakumDA mumduku sAgutumTumdi. 

sarOja uraph rOjA ekkaDa unnA amtaTA tAnE 

agupistumdi, amta kaliwiDitanam unna ammAyi, 

yuwatigA pariNAmam pomdAka, adE kalupugOrutanam 

konnisaarlu wimta samasyalanu teccipeDutunnadi. 

ainA swatahaagAdhairasthurAlu, 

kanuka ewarinI lekkacEyakumDA mumduku sAgutumTumdi.

****************** ,

rOjaa `friend` sumAlini - "sinimaa CAnsu kOsam okka yaakshan maatramE cAladu, 

Dance bAgA ceyyagaligi umDAli, kaastO kUstO myuujik naaleDj umDAli, imkaa ..... " 

"aagaagu, mumdu DAns school address iwwu." 

sumAlini cErina `institute` lO cErimdi. "anukunnamta easy kaadu, 

DAns - amTE oLLu huunam autunnadi ..... , ani 

anuBawapUrwakamgA telusukumdi rOjaa. 

ainaa tappadu, tana TArgeT reach awwAlamMTE 

imtamaatram eksarsaijulu teliyaalsimdE, tappu 

lEdu" Sukla paksham bahuLa pakshamlOki daari teestunnadi. 

"appuDE remDu waaraalu gaDicaayi. 

`Dance` lO Dajanu `steps` kUDA nErcukOlEkapOyimdi rOjA.

sumAlini "imkaa, swimmimg, horse riding, jaagimg, prANAyAmam .... " 

amTU komcem pedda list nE ceppimdi. wATilO numDi first yOga - ani 

select cEsukunnadi rOjA kamm rOj - 

sumAlini aamenu ,rOj,' ani pilustunnadi.

yOgaa cum sarkas feets `practice` ki SrIkAram cuTTimdi. 

"ninna monnaTi dAkA - amma cEti gOrumuddalu tini, perigina 

sukumaaramaina mEnu idi, ippuDu ashTakashTAlu paDttunnadi, paapam!" 

lekkalEnanni wamkarlu tippEstunna tana dEham paina - 

tAnE jaali paDasaagimdi rOjaa. "hEy, nee baaDI amD naDumu kUDA sannam ainaayi. 

rAjaSEKar cinema lO ceppinaTlugAmerupu teegalaa unnAwu." 

aamenu utsaahaparacaDAniki sumAlini cinni cinni 

abaddhaalu cebtumdi nEstamtO. kaanee, rOjaa - 

nijamE, anukuni, marimta hushaarugaa excercises lu cEstunnadi.

****************** ,

"rOj, `swimming pool` lO nErcukunnadi caaladu, 

ceruwulu, nadulu, baawulalO `free` gaa 

eeta koTTagalagAli. coeboy, `folk films` lO neeLLalO eedutuu, 

mumduku weLLAlsina `scenes` umTAyi kadA" 

"humm" Swaasa deerGamgA peelci, 

sudIrGamgA AlOcimcimdi rOjA.tana taatayya sOdari nAnI umDE palleTUru, 

akkaDi ceruwu gurtuku waccaayi. 

"imkEm, Cal CalO Cal - Cal  CalO Cal" amTU 

taanu start ayyimdi, sumAlinini bayaldEradeesimdi.

rOj, sumAlini - phOne cEsAru, nAnI dampatulu waari kOsam 

edurucuustunnaaru. bus digAru iddarU, dummu koTTukupOyina dustulatO, 

dummu nimDina juTTutO, dummu paTTina wadanaarawimdamulatO. 

Dhilhi SyAmala wALLani cuustumTE, tanu kUDA ee `vilage` lO 

errabassu numDi awarohaNa cEsimdi ee awataaramtOnE - 

gurtuku wacci, nawwukumdi. tana `project work` waccE waaram 

puurti autumdi, Dhilliiki `flight - ticket` buk cEsukumdi 

SyAmala. "nuwwu weLtE maaku tOcadu." amTU 

digulu paDasAgAru dampatulu. waari wishaNNa 

wadanAlalOki maLLI cirunawwulu wacci cErAyi. 

SyAmala twaragAnE iruwurikee dOst ayyimdi.

****************** ,

ikkaDa Open bath room - kotta tarahaa snAna pAnAlu - 

tamaashaagaa anipistunnawi. prati cinna amSAnnee - ee taram yuwataku laagAnE - 

tama  mobailsulO phoTOlu teestunnaaru. 

"nAnee, maa ammamma cebutumDEdi, 

mee uuri ceruwu nimDA tAmara pUlu umTAyaTa kadA"

"adi okappaTi mATa, ammaNNI, ippuDu annee huLakki. 

emDA kAlamlO aitE, neeLLu imkipOyi, 

burada mAtram umTumdi. ippuDu waanaakaalam 

kaabaTTi nILLu nimDA unnaayi." 

"mee `luck` baagunnadi. correct gaa rainy season lO waccAru." ani Syaamala uwaaca.

****************** ,

"kAkAni rOjA - baTar phlai swimmimg baagaa cEstunnadi." 

SyAmala mATalaku nawwimdi sumO = sumAlini ...., 

"nannu rOj ni cEsimdi, kanuka sumAlinini sumO - nik nEmm lO 

sthiraparicimdi - rOjaa warses rOjA ; 

"sumaarugaa waccu, recent gaa eeta nErcukumTunnadi 

rOjA" sumAlini tanakE anni widyalu, itarula kamTE 

tanakE komcem ekkuwa waccunani wiSwAsam.

sumAlini saitam swimmimg cEsimdi. gamTa tarwaata illu cEraaru mugguruu.

imTiki cErAka, iddaruu oLLu baruరుtukkODam 

modaleTTAru. Syaamalaku bOdhapaDimdi, uuLLO 

gEdelani, jamtuwulani kobbari peecutO ati SuBramgA kaDugutumTAru, 

citram EmiTamTE - mola guDDalu, muriki guDDalu, 

illu tuDicE samasta baTTa mukkalu - akkaDE utukutaaru, amdulOnE 

kaDawalu, kaawaDikumDalu, bimdelu - 

trAgE mamcinILLu nimpukuni weLtumTAru - nirBayamgA. nissamkOcamgA.

yaawat samgatulu - amdari mATa mamteelO dorlaayi. 

lOkamlOni waataawaraNa kaalushyaalu, prapamca dESAla nEtala swaardham - 

amduku muula kaaraNaalu - *E Tuu jaD - samasta wArtalu - cuTTEsaayi.

[* A to Z ] ;

****************** ,

nAnI caalaa noccukunnadi - paalEru bhaarya subbAyiki kaburu peTTagaanE waccimdi. 

SIkaayi, kumkuDukaayalu, mamdaara aakulu, cekkapoDi, aamudam - 

wiwidha praaceena wastu samBAraadulu - snaanaala gadilO peTTimdi. 

naanee puramaayimcinaTlugaa - mitriNI dwayAniki, sunnipimDi, 

pasupu nimDA pulimimdi,  A ULLO kuTIra pariSrama `level` lO - 

nawa muulikalu kalipina herbal samaana pauDaru dOsili nimDA 

teesukunnadi subbAyi - nalugu, niluwellaa abhyamgana snaanaalu - 

puurti awaDAniki, pUrtigA nAlugu gamTalu paTTimdi. 

sumO, rOj iddari kaLLu, SIkaay, kumkuLLa rasam - 

kaLLalO paDi, erragaa ubbettu ainAyi."manalni, ee kshaNAna cuusinawALLu - 

manam pUTugA wiskee taagaamu - anukumTAru kadU rOj"

"`thank God`, naaku swimmimg raadu, kaabaTTi, saripOyimdi, 

lEkapOtE meeku mallE - talamTu baadhitula wargamlO cEripOyE dAnni." 

gumDela meeda cEtulu wEsukuni, abhinaya sahitamgA 

SyAmala. ;;;;;;;; , amtaa wimTUnE unnaaru, nAnI dampatulu. 

okari wembaDi okaru - tama aBiprAyaalanu wellaDimcAru. 

aamudam talaku amTukumTE juTTu assalu UDadu, SIkaay, 

kumkuDukaayalu - janmalO kaLLa cuupu taggaDam wamTiwi jaragawu, 

dRshTi dOsham lAmTiwi rAwu gAka raawu,...... , ityaadaya@h ..,

****************** ,

omTiki amTukunna nalugu pimDi, baagaa uuDina cikkupaDina juTTu - - 

nalici, nalici nemmadigaa - teesEstunnaaru.

"adEmiTammaNI, naabhiki?" praSnaardhakam cuupulu, 

Syaamala waariki saiga cEsi, cuupimcimdi - 

"OhO, boDDu anna mATa" ardhamaidi, 

"adi phyaashan ring, nAnI!" siggu paDutU ceppimdi sumO.

"cewulaku mallE, boDDuku kUDA, nagalu kuTTimcukunnaaraa!?" "

`villages` lO, mukhyamgaa kotta jaagaalalO, kotta waaLLa daggara - 

nimDugaa Dres cEsukOwaali, rOjA" SyAmala salahaa.

"Chance dorikitE, nEnu kUDA itarulaku `advices` iwwagalanu." 

manasulOni bhaawaanni, pedawula maTuna bigabaTTimdi sumO.

"naadi *uupaboDDu, kOyadora ceppina solyuushan idi, 

amdukani appaTi numDi idi 

umcukunnaanu. guLLO puuja cEsi, iccaaru, aa kOyawaaLLu." 

Syaamala ciTikelO rOjaa abaddham - camatkaaram grahimcimdi, 

musimusinawwulatO kanubommalu egarEsimdi, 

"naaku ardhamaimdilE" annaTlu. 

"pleej. nAnIki ceppoddu." annaTlu aame waipu cuupulOnE saigalanu iccimdi rOjA. 

"boDDu - daggari numDi - tallipEgu umTumdi. 

talli prEgu - puTTE biDDaku ku - adi - mokkaku paadu laamTidi. 

ee kaalam pillalu - pyaamTlu, wicitra wastradhaaraNalu - 

ewarikee ceppETaTlu lEdu kadA." 

nAnI niTTUrcimdi. "baagaa alisipOyaaru. 

tomdaragaa annam timduru gaani, padamDi." kaLLa 

meeda mattunu wadilimcukumTU - nAnI wenaka weLLAru.

****************** ,

New year - aapheesu selawulaku, adanamgaa pannemDu rOjulu leave peTTi, 

kAkAniki weLLimdi rOjaa, sumOtO. sumaalini - 

fashion photo laku phoTOlu teesukumTunnadi. 

kotta lokEshans kOsam gaalistunnadi, amdukanE rOjaa Uriki waccimdi.

rOjaa annayya  MASTER mOhana krishNa - 

imTi mumdu paawamcaalO kuurcuni, private Tuitions  cebutunnADu. 

gate numDi wastunna celli sarOjaki, cirunawwu palakarimpu iccADu.

talli damDrulu, tammuLLu iddaru - suitcase lanu - 

paDamaTi gadilO peTTi, peraTlO toTTi daggariki weLLAru.

kALLu kaDukkuni waccaaru. Tiffin, coffee lu teesukumTU, parasparam - 

uuri muccaTlu ceppukumTunnAru.

baiTa mOhan kRshNa - pilakaayalaku - home work diddutuu, 

tappoppulu ceppi, kasurutunnADu. "idEmiTi, cemdree, enni saarlu ceppinaa - 

awE tappulu raastunnaawu. - tha - amTE - 

boDDulO cukka peTTAli iTlAga."

****************** ,

"boDlO cukka - ta - tha ... " bettam paTTukunnaaDu `MK` maasTAru.

boDDu - ani winagaanE, paTTaraani nawwu waccimdi, sarOja, 

sumaalini iddari nawwu gadilO pratidhwanistunnaayi .... ,

mari, nAnI Barta wemkaTaramaNayyagAru - 

ee ubhayulaku, SyAmalaku, boDDu - pada sahasram - 

kuurcObeTTi, bOdhimcaaru."boDDu - samskRtamlO nABi - 

padmanaaBaswaami - amTE, brahmadEwuDu - wishNumUrti naabhi 

numDi udBawimcina padmamlO puTTADu, amdukanE aayana padmanABuDu ; 

SrIlakshmIdEwi - SreewANi = Sree saraswati - taamarapuwwu, kaluwa puwwu - 

anubamdham unna kathalu .... " 

amTU aapakumDA EkadhATigA, ASuwugA ceppAru. - 

ceppaaru anaDam kamTE - cinna pillala 

cewulu melibeTTi, kuurcObeTTi, bOdhimcaaru - anaDamE correct ...,

pada sahasram - weyyi kaadu, weyyinnUTa padahArlu - 

ajnaanulaku waDDimcaaru, taatayya gaaru aa rOju.

"imkaa E E telugu `letters` ki boDDu cukkalu umTAyi, annayyA?" 

eppuDU, telugu - itara  subjects nu, caduwu amTE wisukkunE cellemma sarOja - 

imta Sraddhagaa - widyaa wishayaalanu 

aDugutumTE AScarya weekshaNAlanu prasarimpajEsADu `MK`.

rOjA - wyamgyaanni daacipeDtuu, boDDu cukka - tha - gurimci aDugutunnadi ..... ,

wipulamgaa ceppina nAnI abhipraayaalanu - gurtu cEsukumTU ....., 

cinnagaa nawwukumTU ..... ,

****************** ,

[ pAtralu ;- nAnI, husband wemkaTaramaNayya & kakani pinni daughter  sarOja/ rOjA 

& rOjA friend sumAlini/ sumO & SyAmala & sarOja brother mOhana krishNa - subbAyi ] ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గాడిదలు - గజరాజు - CK - 1

క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం  మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,  అంచేత ...