15, జులై 2022, శుక్రవారం

తాత పేరు కిరికిరీ - 44

"టీచర్స్ అందరికీ ఎలెక్షన్స్ డ్యూటీ పడింది, కుందనా!" కాశ్యప్ మాటలకి నవ్వింది కుందనబాల. 

"కానీండి ఇంక మీ కంచి గరుడ సేవ, ఏం చేద్దాం." అన్నది. 

వివిధ వర్గాలు చేసి, ఒక్కొక్క గ్రూపుకి వివిధ పనులను ప్రభుత్వం అప్పజెప్పింది. 

కాశ్యప్ friends కొందరి work duty, ప్రజల names ని నమోదు చేయడం. 

వారిలో జయశ్రీ చెల్లెలు ఒకతె. free lance journalist కావడంతో, మహా హుషారుగా తన duty ని చేస్తున్నది. 

తన అక్క జయశ్రీ ఉన్న వీధికి వచ్చింది. 

"హమ్మయ్య, మీ బాడుగ ఇళ్ళు ఐదింటివీ పూర్తి చేసాను, ఇంక మీ owner నానీ family బాకీ .... , 

ఊళ్ళో ఉంటే, ముందు వాళ్ళ list రాసి ఉండేదాన్ని." అన్నది చంద్రిక.

కుందనబాల తమ ఊరి పిల్ల, అందుకని ఆమె అంటే జయశ్రీకి స్నేహభావం ఎక్కువ. 

"చంద్రీ, వెళ్ళేటప్పుడు  కుందనబాలకు ఈ ములక్కాడల పులుసు, గారెలు ఇవ్వు.

" భోజనం పూర్తి చేసిన చంద్రిక, పక్క పోర్షన్ కి వెళ్ళింది. 

"అక్కా, మా అక్క ఇవ్వమంది." అన్నది. 

"కుందనని sister చేస్తే ఎట్లాగ, నిన్ను మరదలు వరసతో పిలుస్తున్నాను కదా!" హాస్యంగా అన్నాడు కాశ్యప్.

"అక్క  ఎడం కాలి చెప్పు తీసేదాకా, మీ సరసోక్తులు సాగుతుంటాయి." అన్నది చంద్రిక.

కుందనబాల తన భర్త పైన అనుమానం లేదు గానీ ఓ కంట కనిపెట్టి ఉంటుంది, అందరి మాదిరిగానే. 

జయశ్రీ పంపిన గిన్నెలను తీసుకుని, వేరే గిన్నెలలో, తను చేసిన పకోడీ, కజ్జికాయలు ఇచ్చి పంపింది.

"నానీ ఊరి నుండి వచ్చారు." అక్క ఫోన్ చేసింది. చంద్రిక అక్కడికి వస్తూ, 

"కాశ్యప్, చిన్న doubts ... " అంటూ మొబైల్ చేసి, అడిగింది.

చంద్రిక చెప్పిన విషయాన్ని, కాశ్యప్ - భార్యకి చెప్పాడు. 

"నిజమే, నానీ అమ్మ హబ్బీ పేరు వెంకటరమణ మూర్తి గారు, మీరు పొరబడుతున్నారు." అన్నది కుందనబాల. "మిస్టేక్ ఎట్లా ఔతుంది. గవర్నమెంట్  లిస్టులో ఈ పేరు ఉంది. %%% 

నానీ వాళ్ళు ఎన్నికలలో ఓటు హక్కును use చేసుకోకుండా ఊరుకున్నారు. 

ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళు నానీ అమ్మ, తాతగారు - ఇద్దరు, అంత శ్రద్ధ చూపలేదు. 

ఇప్పుడు మనం, వాళ్ళ చేత vote ఎట్లాగైనా, వేసేటట్లు చె//య్యల్సిందే, ఇది మన శపథం." అన్నది చంద్రిక. 

జయశ్రీ "మరి పేరు తప్పు ఉంటే కుదరదనుకుంటా. కాబట్టి, నానీకి చెబుదాం." అన్నది.

ముగ్గురూ వెళ్ళారు, కాలింగ్ బెల్ నొక్కారు. నానీ మడి కట్టుకుని, తులసి చెట్టుకు నీళ్ళు పోస్తున్నది. 

అందుకని, ఆమెను disturb చేయలేదు. ఇంతలో తాతగారు రుద్రాక్ష మాలను తిప్పుతూ వచ్చారు. 

కుందనబాల "తాతయ్యా, మా శ్రీవారు తెచ్చారు." అంటూ పేపర్సుని చూపించింది. 

ఓటర్ల లిస్టు - చూస్తూ అన్నారు "మేమెప్పుడూ ఓటు వేయడం లేదు, అమ్మాయీ." 

చంద్రిక "అదేమిటి, పెద్దవారు, మీరే అంత నిర్లిప్తంగా ఉండటం బాగోలేదు." అంటూ 

తన వాగ్ధాటితో ఆయన నిర్లిప్తతను తొలగించగలిగింది. 

చంద్రిక వాదనకు ముగ్ధుడై, "సరే." అని అంగీకరించారు.

వంట, పూజలు పూర్తి చేసి, వంటింటి నుండి, ముందు గదిలోకి అడుగుపెట్టింది నానీ.

కుందనబాల భర్త కాశ్యప్ తన దగ్గరి లిస్టుని చూపించాడు. 

"ఇందులో ఫొటోలు కూడా సరిగ్గానే ఉన్నాయి, తాతగారి పేరు మాత్రం తప్పు పడింది. 

వెంకటరమణ - కాస్తా - వెంకటప్పయ్య - అని print అయ్యింది." 

నానీ, వెంకటరమణ తాత - దంపతులు పకపకా నవ్వారు. తాతగారు

 "నా అసలు పేరు అదే, నాయనా!" అన్నాడు.

"మరి, ఇక్కడ వాకిలి పక్కన name board లో వెంకటరమణ - అని ఉన్నది కదండీ!?" జయశ్రీ ఒత్తి పలికింది.

"మీ నానీకి వెంకటప్పయ్య అనే పేరు నచ్చలేదు. అల్లటప్పయ్య మాదిరిగా ఉంది - అనేసింది. 

అప్పణ్ణుండీ నేను వెంకటరమణ మూర్తిని ఐనాను."

"నేరం అంతా నాదైనట్లు చెబుతున్నారు, చూడు అమ్మణ్ణీ! తనకి కూడా తన పేరు నచ్చలేదు - 

ఆ మాట ఒప్పుకోరు గాక ఒప్పుకోరు కదా. అయ్యగారికి కూడా నేను చెప్పిన కొత్త పేరు నచ్చింది, 

కనుకనే, వెంటనే మార్చేసుకున్నారు - వెంకటరమణమూర్తి - అని."

"నిజమే నానీ, ఇష్టం లేకుంటే, వద్దు - అని, మంకుపట్టు పట్టే వారే కదా!" అన్నది కుందన.

"నా బంగారం, మంచిగా చెప్పావు. నీ నోట్లో చక్కెర పోస్తాను."

"ఆ పనిని ఇప్పటికి వాయిదా వేయండి నానీ, ఇప్పుడు ప్రస్తుత చర్చనీయాంశం - అసలు పేరు గురించి." 

"నా కొత్త పేరుని - అక్కడ వేయండి." తాతయ్య ఉవాచ. 

"ఇప్పటికిప్పుడు వీలు కాదండీ, ఎలక్షన్సు ముందర ఏ ఇతర పనులూ, ఫైళ్ళూ - 

ముందుకు కదలవు." చెప్పింది చంద్రిక. 

"టప్పయ్య - వెంకటప్పయ్య గా నేను ఓటు వెయ్యను" అన్నారు వెంకటప్పయ్య ఉరఫ్ వెంకటరమణమూర్తి.

"హవ్వ, మా ఆయన అసలు పేరు ఇది, అని తెలిస్తే ఎంత నామర్దా!?" అన్నది నానీ.

మళ్ళీ కథ మొదటికి వచ్చింది. కాశ్యప్ వేడెక్కిన నుదురును గట్టిగా ఒత్తుకున్నాడు.

"నానీ, అసలు పేరును ప్రభుత్వం అచ్చు వేసిన కాగితాల నుండి మార్చకండి. 

ఎన్నో ఏళ్ళ నుండి - వెంకటప్పయ్య - అని ఉంది కదా. ఈ పేరుని మారిస్తే, చట్టం ఒప్పుకోదు. 

మీదు మిక్కిలి, ఈ రహస్యం తెలిస్తే, మీ పొలాలు, స్థలాలు - ఆస్థిపాస్థులకు - 

మీ బంధువులే ఎసరు పెట్టే ఛాన్సు ఉంది." చంద్రిక అక్కను మెచ్చుకోలుగా చూసింది.

"మీరు ఓటు వెయ్యకుంటే, ఆస్థులు అనాధాశ్రమాలకు వెళ్తాయ్." 

జయశ్రీ, చంద్రికలు చక్రం అడ్డు వేసారు. 

మొత్తానికి దంపతులు ఈసారి elections కి తక్కుతూ, తారుతూ వెళ్ళారు. 

ఈ ఎన్నికలకు - ఇద్దరి వేళ్ళ పైన left hand - index finger - proximal nail fold - cuticle -  పైన 

phosphoric ink mark - నీలం మార్కు - ముద్దుగా వెలిసింది.

"ఈ బులుగు [=Blue color] రంగు బాగుంది, అమ్మణీ." అన్నది నానీ. 

"ఔనేవ్, సిరా చుక్క చక్కగా ఉంది." మురిపెంగా అన్నారు -

వెంకటప్పయ్య - సారీ - వెంకటరమణయ్య/ కాదు కాదు - వెంకటరమణ మూర్తి గారు. ;

& తాత పేరు కిరికిరీ ;- కథ - 44 ;;

&  [పాత్రలు ;- journalist చంద్రిక, జయశ్రీ &  కుందనబాల, భర్త కాశ్యప్ - 

నానీ దంపతులు = వెంకటరమణ మూర్తి / వెంకటప్పయ్య  ] ;; 

======================== ,

tAta pEru kirikiree - 44 ;- story ;- 

"TIcars amdarikee elekshans DyUTI paDimdi, kumdanA!" kASyap  mATalaki nawwimdi kumdanabAla. "kaanIMDi imka mee kamci garuDa sEwa, Em cEddaam." annadi. 

wiwidha wargaalu cEsi, okkokka gruupuki wiwidha panulanu prabhutwam appajeppimdi. 

kASyap `friends` komdari `work duty`, prajala `names` ni namOdu cEyaDam. 

waarilO jayaSrI cellelu okate. `free lance  journalist` kaawaDamtO, 

mahaa hushaarugaa tana `duty` ni cEstunnadi. tana akka jayaSrI unna weedhiki waccimdi. 

"hammayya, mee baaDuga iLLu aidimTiwee puurti cEsaanu, 

imka mee `owner` nAnI `family` baakee ..... , 

ULLO umTE, mumdu wALLa `list` raasi umDEdaanni." annadi camdrika.

kumdanabAla tama uuri pilla, amdukani Ame amTE jayaSreeki snEhaBAwam ekkuwa. 

"camdree, weLLETappuDu  kumdanabAlaku ee mulakkaaDala pulusu, gaarelu iwwu." 

BOjanam puurti cEsina camdrika, pakka pOrshan ki weLLimdi.

"akkA, maa akka iwwamamdi." annadi. "kumdanani `sister` cEstE eTlAga, ninnu maradalu 

warasatO pilustunnaanu kadA!" haasyamgaa annADu kASyap.

"akka eDam kaali ceppu teesEdaakaa, mee sarasOktulu saagutumTaayi." annadi camdrika.

kumdanabAla tana bharta paina anumaanam lEdu gaanI O kamTa kanipeTTi umTumdi, 

amdari maadirigAnE.

jayaSrI pampina ginnelanu teesukuni, wErE ginnelalO, tanu cEsina pakODI, 

kajjikaayalu icci pampimdi.

"nAnI uuri numDi waccaaru." akka phone cEsimdi. camdrika akkaDiki wastuu, 

"kASyap, cinna `doubts` ... " amTU mobail cEsi, aDigimdi.

camdrika ceppina wishayaanni, kASyap - bhaaryaki ceppADu. 

"nijamE, nAnI amma habbee pEru wemkaTaramaNa mUrti gaaru, 

meeru porabaDutunnaaru." annadi kumdanabAla. 

"misTEk eTlaa autumdi. gawarnamemT lisTulO ee pEru umdi.

nAnI wALLu ennikalalO `vote` hakkunu `use` cEsukOkumDA uurukunnaaru. 

innALLU, innELLu nAnI amma, taatagaaru - iddaru, amta Sraddha 

cUpalEdu. ippuDu manam, wALLa cEta `vote` eTlaagainaa, 

wEsETaTlu ceyyalsimdE, idi mana Sapatham." annadi camdrika. jayaSree "

mari pEru tappu umTE kudaradanukumTA. 

kaabaTTi, nAnIki cebudAm." annadi.

3] mugguruu weLLAru, caling bell nokkaaru. 

nAnI maDi kaTTukuni, tulasi ceTTuku nILLu pOstunnadi. 

amdukani, aamenu `disturb` cEyalEdu. imtalO 

taatagaaru rudraaksha maalanu tipputuu waccaaru. 

kumdanabAla "taatayyaa, maa Sreewaaru teccaaru." amTU 

papers ni cuupimcimdi. voters list - cuustuu annaaru 

"mEmeppuDU OTu wEyaDam lEdu, ammAyI." 

camdrika "adEmiTi, peddawaaru, meerE amta nirliptamgaa umDaTam baagOlEdu." amTU 

tana waagdhATitO aayana nirliptatanu tolagimcagaligimdi. camdrika waadanaku mugdhuDai, 

"sarE." ani amgeekarimcaaru.wamTa, puujalu puurti cEsi, 

wamTimTi numDi, mumdu gadilOki aDugupeTTimdi nAnI.

kumdanabAla bharta kASyap tana daggari lisTuni cuupimcADu. 

"imdulO photo lu kUDA sariggaanE unnaayi, 

taatagaari pEru maatram tappu paDimdi. wemkaTaramaNa - kaastaa - 

wemkaTappayya - ani `print` ayyimdi." 

nAnI, wemkaTaramaNa taata - dampatulu pakapakaa nawwaaru. 

tAtagaaru "naa asalu pEru adE, naayanaa!" annADu.

"mari, ikkaDa waakili pakkana `name board` lO wemkaTaramaNa - ani unnadi kadamDI!?" 

jayaSrI otti palikimdi.

"mee nAnIki wemkaTappayya anE pEru naccalEdu. allaTappayya maadirigaa umdi - 

anEsimdi. appaNNumDI nEnu wemkaTaramaNa muurtini ainaanu."

"nEram amtaa naadainaTlu cebutunnaaru, cUDu ammaNNI! tanaki kUDA tana pEru naccalEdu - aa 

mATa oppukOru gAka oppukOru kadA. ayyagaariki kUDA nEnu ceppina kotta pEru naccimdi, 

kanukanE, wemTanE maarcEsukunnaaru - wemkaTaramaNamuurti - ani."

"nijamE nAnI, ishTam lEkumTE, waddu - ani, mamkupaTTu paTTE waarE kadA!" annadi kumdana.

"naa bamgaaram, mamcigaa ceppaawu. nI nOTlO cakkera pOstaanu."

"A panini ippaTiki wAyidaa wEyamDi nAnI, 

ippuDu prastuta carcaneeyAMSam - asalu pEru gurimci."

"naa kotta pEruni - akkaDa wEyamDi." taatayya uwaaca. "ippaTikippuDu wIlu 

kaadamDI, elakshansu mumdara E itara panuluu, phaiLLU - mumduku kadalawu." ceppimdi 

camdika. "Tappayya gaa nEnu OTu weyyanu" annaaru -

wemkaTappayya uraph wemkaTaramaNamuurti.

"hawwa, maa aayana asalu pEru idi, ani telistE emta nAmardaa!?" annadi nAnI.

maLLI katha modaTiki waccimdi. kASyap wEDekkina nudurunu gaTTigaa ottukunnADu.

"nAnI, asalu pErunu prabhutwam accu wEsina kaagitaala numDi maarcakamDi. 

ennO ELLa numDi - wemkaTappayya - ani umdi kadaa. ee pEruni maaristE, caTTam oppukOdu. 

meedu mikkili, ee rahasyam telistE, mee polaalu, sthalaalu - aasthipaasthulaku - 

mee bamdhuwulE esaru peTTE CAnsu umdi." 

camdrika akkanu meccukOlugaa cuusimdi.

"meeru OTu weyyakumTE, aasthulu anaadhaaSramaalaku weLtaay." -

jayaSree, camdrikalu cakram aDDu wEsaaru.

mottaaniki dampatulu eesaari `elections `ki takkutuu, taarutuu weLLAru.

ee ennikalaku - iddari wELLa paina `left hand - index finger - proximal nail fold - cuticle` -  

paina `phosphoric ink mark - neelam maarku muddugaa welisimdi. 

"I bulugu ramgu [`Blue color`] baagumdi, ammaNI." annadi nAnI. 

"aunEw, siraa cukka cakkagaa umdi." muripemgaa annaaru wemkaTappayya - saaree - 

wemkaTaramaNayya/ kaadu kaadu 

- wemkaTaramaNa muurti gaaru.

&

nAnI dampatulu = wemkaTaramaNa muurti/ wemkaTappayya ]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గాడిదలు - గజరాజు - CK - 1

క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం  మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,  అంచేత ...