15, జులై 2022, శుక్రవారం

రచ్చబండ అరుగు - 45

నానీ అరుగు మీద కూర్చుని వత్తులు చేస్తున్నది. ఆ టైము అందరికీ ఆటవిడుపు లాంటిది, 

పనులన్నీ పూర్తి చేసుకుని, అరుగు పైకి చేరతారు. చిన్నపాటి రచ్చబండ వాతావరణం రూపుదిద్దుకుంటుంది. 

లోకాభిరామాయణం కొనసాగుతుంటుంది అక్కడ. భవానీశంకర్ ప్రెస్ నుండి -

తను అద్దెకు ఉన్న ఇంటికి వెళుతున్నాడు. నానీ చెయ్యెత్తి పిలిచింది. 

సైకిల్ దిగి వచ్చాడు భవానీశంకర్

నానీ ఆప్యాయంగా పలకరిస్తుంది, అతనికి ఇప్పుడిప్పుడే అర్ధమౌతున్నది.

తను గృహ అవసర సాయం నిమిత్తం జయశ్రీ ఇంటికి వచ్చాడు. 

ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో చాలా బిడియంగా ఫీల్ అయ్యాడు. 

సాధారణంగా - బస్తీ నివాసం ఎంత క్లిష్టమైనదో మునుపే విని ఉన్నాడు, 

"తన మూలాన్న నీళ్ళ ఖర్చు, కరెంట్ ఖర్చు, అవీ ఇవీ తడిసి మోపెడు ఔతాయి, కనుక - 

ఇంటి ఓనర్* నానియమ్మ ఏమనుకుంటుందో ... ' అని భీతి. [*house Owner] ;

అందుకే ఆమె కళ్ళల్లో పడకుండా తప్పించుకునేటందుకు తాను ప్రయత్నిస్తూండేవాడు. 

నాని వచ్చినప్పుడు - బాత్రూమ్ లోకి దూరడమో, బైటికి వెళ్ళడమో చేసేవాడు.

త్వరత్వరగా బాడుగ ఇల్లుకి మారాడు తను. ఆ రోజు ప్రసాదం ఇవ్వడానికి వచ్చింది నానీ, 

తను హర్రిబుర్రీగా మార్కెట్ నెపం పెట్టి ఇవతలికి వచ్చేసాడు. 

"అదేంటే అమ్మాయ్! ప్రసాదం తీసుకోకుండా అట్లాగ వెళ్ళిపోయాడు!?" 

అంటూ నానీ పదేపదే నొచ్చుకున్నది. 

జయశ్రీ ఈ వివరం చెప్పేసరికి, భవానీశంకర్ మనసు సంతోషంతో ఆర్ద్రం అయ్యింది. 

ఈ రోజుల్లో కూడా నానీ వంటి వాళ్ళు ఉన్నారు, 

ధర్మం అనే భావన - చల్లగాలిలా వీస్తున్నది - అనుకుంటూ 

"నమస్కారం నానియమ్మా!" అని ఆమె కాళ్ళకు దణ్ణం పెట్టాడు. 

పైడిరాజు, భార్య కావేరి, జయశ్రీ చెల్లెలు చంద్రిక వచ్చి కూర్చున్నారు. 

"మీరు వత్తులు చెయ్యడం భలేగా ఉంది నానీ" 

"ఇది కూడా ఒక గొప్ప కళ చంద్రికా!" కావేరి అన్నది. 

"నిజమే, నేను గమనించలేదు. మా పేపర్ కి 

ఇది మంచి ఆర్టికల్." అంటూ చంద్రిక వీడియో తీయసాగింది. 

కాశ్యప్ "నానీ వేళ్ళతో పత్తిని సున్నితంగా మెదిపి, మెలిపి చేస్తున్నారు. 

అనాది నుండీ దేశంలో ఆడవాళ్ళు ఇంత మంచి Art/ఆర్టుని కాపాడుతూవస్తున్నారు. 

ప్రతి అంశం వివరంగా వచ్చేటట్లు రాయి, చంద్రికా!" 

కాశ్యప్ journalist మరదలుకి సూచనలు ఇస్తూ, మెట్లు ఎక్కి, మేడ మీదికి వెళ్ళిపోయాడు. 

"చంద్రి అక్కడే కూర్చుందా, పైకి వచ్చి కాఫీ తాగి వెళ్తే బాగుండేది కదా." అంటూ 

జయశ్రీ బాల్కనీ చీడీల దగ్గరికి వచ్చి, "కాఫీ తాగి వెళ్ళు, చంద్రీ!" అని కేకేసింది, తొంగిచూస్తూ.

"అట్లాగే." అన్నదే కానీ, వీడియో పని పూర్తిచేసుకుని, అరగంటకి వచ్చింది, 

వీడియో సగంలో ఆపేస్తే - ఇంక ఆ మూడ్ రాదు, పని సగంలో ఆగిపోయి, 

నత్తనడక నడుస్తూ - ఎప్పటికో పూర్తి ఔతుంది.

పైడిరాజు "మా అమ్మగారు, అమ్మమ్మ, నాయనమ్మ - పెద్దతరం వాళ్ళు 

ప్రతి నిత్యం వత్తులుచేసేవాళ్ళు. నానీ, మీ వలన ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి." 

అని కాంప్లిమెంటరీ ఇచ్చాడు. భవానీశంకర్ కి కూడా తమ ఇళ్ళలో -

కుండవత్తులు, లక్ష వత్తుల నోములు గుర్తుకు వచ్చాయి, 

తను కూడా ఆ జ్ఞాపకములను పైడిరాజు, బృందంతో పంచుకున్నాడు.

భర్త వెంట కావేరి వెళ్ళింది, టిఫిన్, టీలు ఇవ్వడానికి.

మరుసటి నెలకి జయశ్రీ బిజీ బిజీ ...., తన చెల్లెలు చంద్రిక తయారుచేసిన - నానీ, 

ప్రమిద వత్తులు సృష్టి - ఒక కళ - అనే శీర్షిక కలిగిన వార్తాకదంబం - పేపర్ లో ఫొటోలతో సహా వచ్చింది. 

తెలిసిన వాళ్ళందరినీ పేరు పేరునా పిలిచి, పేపరులో -

ఫొటోలు, వ్యాసాన్ని చూపించింది జయశ్రీ "ఇది మా చెల్లెలు రాసింది." అంటూ.

టివీలో వచ్చినప్పుడు సంబరమే సంబరం ...., నానీ, పక్కన కూర్చున్న కావేరి - 

తను కూడా అందులో కనిపిస్తున్నది - అని మురిసిపోతూ, 

బంధువులకు స్నేహితులకు ముందు రోజే ఫోన్ చేసి చెప్పింది, 

ఫలానా ప్రోగ్రామ్, ఫలానా టైమ్ కి వస్తున్నది, చూడండి - అంటూ ఎలర్ట్ చేసింది కావేరి

భార్య ఆనందం చూస్తూ, పైడిరాజు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. 

మేడ మీద ఉన్నప్పుడు, జయశ్రీ అన్నది 

"చంద్రీ, నన్ను పిలిస్తే అరుగు దగ్గరికి వచ్చేదాన్ని కదా! 

నేను కూడా ఫొటోలో వచ్చేదాన్ని కదా!" అన్నది నిష్ఠూరంగా. 

కుందనబాల కూడా "మీ చెల్లెలికి మనం గుర్తుంటామా, ఏం !!?" అన్నది -

మూతి ముప్ఫై వంకరలు తిప్పుతూ. నాలుక కొరుక్కుంటూ చంద్రిక అన్నది, 

"సారీ అక్కా! ఈసారి మరో ప్రోగ్రామ్ ని రెడీ చేసి ఉంచు. 

నానీతో పాటు నిన్ను కూడా high light చేసి, చూపిస్తాను."

"ఐతే, మీ అక్క కూడా వత్తులు నలిచే పనిని నేర్చుకోవాలన్న మాట" నవ్వుతూ 

అన్నాడు కాశ్యప్, భార్య కుందనబాల ముక్కోపం అతనికి ముద్దు - 

అలక వచ్చినప్పుడు కుందన బుంగమూతి పెట్టి, మాట్లాడుతుంది. 

అందుకే కాశ్యప్ - చిన్న చణుకును విసిరాడు ఇట్లాగ. 

& ;-

రచ్చబండ అరుగు  - 45 ;

[పాత్రలు ;- నానీ - జయశ్రీ - చెల్లెలు చంద్రీ/ చంద్రిక ;; 

కుందనబాల, భర్త కాశ్యప్ ;;  పైడిరాజు,భార్య కావేరి ;; భవానీశంకర్ ] 

================================ ,

raccabamDa arugu - 45 ;- story ;- 

nAnI arugu meeda kuurcuni wattulu cEstunnadi. 

aa Taimu amdarikee ATawiDupu lAMTidi, 

panulannI pUrti cEsukuni, arugu paiki cErataaru. 

cinnapATi raccabamDa waataawaraNam ruupudiddukumTumdi. 

lOkABirAmAyaNam konasAgutumTumdi akkaDa. 

BawAnISamkar pres numDi tanu addeku unna imTiki weLutunnADu. 

nAnI ceyyetti pilicimdi. saikil digi waccADu BawAnISamkar. 

nAnI aapyaayamgaa palakaristumdi, 

ataniki ippuDippuDE ardhamautunnadi.

tanu gRha awasara saayam nimittam jayaSrI imTiki waccADu. 

ee imTiki waccina kottallO caalaa biDiyamgaa feel ayyADu. 

saadhaaraNamgaa - bastii niwaasam emta klishTamainadO munupE wini unnADu, 

"tana muulaanna nILLa Karcu, karemT kharcu, 

awee iwee taDisi mOpeDu autaayi, 

kanuka - imTi house Owner nAniyamma EmanukumTumdO ... ' ani bheeti. 

amdukE aame kaLLallO paDakuMDA 

tappimcukunETamduku tAnu prayatnistUMDEwADu. 

naani waccinappuDu - baatruumm lOki duuraDamO, 

baiTiki weLLaDamO cEsEwADu.

twaratwaragaa bADuga illuki maarADu tanu. 

aa rOju prasaadam iwwaDAniki waccimdi naanee, 

tanu harriburreegaa maarkeT nepam peTTi iwataliki waccEsADu. 

"adEmTE ammAy! prasaadam teesukOkumDA aTlAga weLLipOyADu!?" 

amTU nAnI padEpadE noccukunnadi. 

jayaSrI ee wiwaram ceppEsariki, 

tana manasu samtOshamtO aardram ayyimdi. 

ee rOjullO kUDA nAnI wamTi wALLu unnAru, 

dharmam anE BAwana - callagaalilaa weestunnadi - anukumTU 

"namaskaaram naaniyammA!" ani aame kALLaku daNNam peTTADu.

paiDiraaju, bhaarya kAwEri, jayaSree cellelu camdrika wacci kuurcunnaaru. 

"meeru wattulu ceyyaDam bhalEgaa umdi nAnI" 

"idi kUDA oka goppa kaLa camdrikA!" kAwEri annadi. 

"nijamE, nEnu gamanimcalEdu. maa pEpar ki idi mamci aarTikal." 

amTU camdrika vedio teeyasaagimdi. 

kASyap "nAnI wELLatO pattini sunnitamgaa 

medipi, melipi cEstunnaaru. anaadi numDI dESamlO -

ADawALLu imta mamci ART ni kaapADutUwastunnaaru. 

prati amSam wiwaramgaa waccETaTlu raayi, camdrikA!" 

kASyap `journalist` maradaluki suucanalu istuu, 

meTlu ekki, mEDa meediki weLLipOyADu. 

"camdri akkaDE kuurcumdaa, paiki wacci -

coffee taagi weLtE baagumDEdi kadA." amTU 

jayaSree balcony ceeDeela daggariki wacci, 

"coffee taagi weLLu, camdree!" ani kEkEsimdi, tomgicuustuu.

"aTlAgE." annadE kaanii, vedio pani puurticEsukuni, aragamTaki waccimdi, 

weeDiyO sagamlO aapEstE - imka aa mUD raadu, pani sagamlO AgipOyi, 

nattanaDaka naDustuu - eppaTikO puurti autumdi. 

paiDiraaju "maa ammagaaru, ammamma, naayanamma - 

pedda taram wALLu prati nityam 

wattulucEsEwALLu. nAnI, mee walana iwannI gurtukostunnAyi." 

ani comlimentary iccADu.  BAwAnISsmkar ki kUDA 

tama iLLalO kumDa wattulu, laksha wattula nOmulu-

 gurtuku waccaayi, tanu kUDA aa jnaapakamulanu -

paiDiraaju, bRmdamtO pancukunnaaDu.

bharta wemTa kAwEri weLLimdi - Tifin, Tea lu iwwaDAniki. 

marusaTi nelaki jayaSree buzy bijee ...., 

tana cellelu camdrika tayaarucEsina - nAnI, 

pramida wattulu sRshTi - oka kaLa - anE SIrshika kaligina 

waartaakadambam - pEpar lO phoTOlatO sahA waccimdi. 

telisina waaLLamdarinee pEru pErunaa pilici, 

pEparulO phoTOlu, wyAsaanni cuupimcimdi jayaSrI 

"idi mA cellelu raasimdi." amTU, 

TVlO waccinappuDu sambaramE sambaram ...., 

naanee, pakkana kuurcunna kaawEri - tanu kUDA amdulO kanipistunnadi - 

ani murisipOtuu, bamdhuwulaku snEhitulaku mumdu rOjE phone cEsi ceppimdi, 

phalaanaa prOgraamm, phalaanA Time ki wastunnadi, cuuDamDi - amTU 

alerT cEsimdi kaawEri. BArya aanamdam cUstuu, 

paiDiraaju kUDA happy gaa feel ayyADu.

mEDa meeda unnappuDu, jayaSree annadi 

"camdree, nannu pilistE arugu daggariki waccEdaanni kadA! 

nEnu kUDA phoTOlO waccEdaanni kadA!" annadi nishThUramgA. 

`kumdanabaala kUDA "mee celleliki manam gurtumTAmA, Em !!?" annadi,

muuti mupphai wamkaralu tipputuu.

naaluka korukkumTU camdrika annadi, 

"sArI akkA! eesaari marO prOgraamm ni reDI cEsi umcu. 

nAnItO pATu ninnu kUDA `highlight` cEsi, cuupistaanu." annadi.

"aitE, mee akka kUDA wattulu nalicE panini nErcukOwaalanna mATa" 

nawwutU annADu kASyap.

bhaarya kumdanabaala mukkOpam ataniki muddu - 

alaka waccinappuDu kumdana bumgamuuti 

peTTi, mATlADutumdi. amdukE kASyap - cinna caNukunu wisirADu iTlaaga.

&

[pAtralu ;- nAnI - jayaSrI, cellelu camdrI/ camdrika ;;  

kASyap - wife kumdanabAla ;; paiDirAju, wife kAwEri ] ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...