24, జులై 2022, ఆదివారం

ముంజెల బండి - రామదండు - 46

 "బెర్రీ అంటే, పుల్ల రేగిపళ్ళు, తెలుసా!?" తన జనరల్  నాలెడ్జిని గుమ్మరిస్తుంటాడు 

అప్పుడప్పుడూ, అప్పూ రాజా. అసలు పేరు అప్పారావు - 

చాలదన్నట్లు sir name తో కలిపి, పొందిన రూపాంతరం - కప్పారావు - 

తన పేరు k.అప్పారావు - ఐతే, ఈ చుప్పనాతి మనుషులు - 

అవహేళన చేస్తూ, frog not come గా చేసేసారు.

"విచిత్ర సోదరులు" అనే ఓ సినిమా వచ్చింది - 

సూపర్ డూపర్ హిట్ ఐన ఆ film - అందిపుచ్చుకున్నాడు - 

మన కప్పారావ్, తన నామాన్ని కాస్తా - అప్పూరాజా - మార్చుకున్నాడు - 

"నేను సర్కస్ అప్పూరాజా, కమల్ హసన్ ని" అని. తనని అప్పూరాజా - 

అని పిలిచే వాళ్ళను మాత్రమే ఆటల్లో చేర్చుకుంటున్నాడు. 

పొరపాటున పాత నిక్ నేమ్ పెట్టి, పిలిచారో, వాళ్ళతో ఇంక కటీఫ్, తన జేబులోని మిక్చర్ ఇవ్వడు, 

ఇంట్లో అమ్మ, నానీ వాళ్ళు ఇచ్చిన - లడ్డు, బొరుగులు, పుట్నాలు, అటుకులు పెట్టను గాక పెట్టడు.

కప్పూ ……. సారీ - అప్పూ సారధ్యంలో పిల్లల దండు - తాటిముంజెల బండి - తయారు చేసారు. 

ముందుగా తాటిమాను కింద అప్పుడే  తాటిపళ్ళు పడ్డాయి, వాటిని తెచ్చారు రామదండు, 

మూరెడు బారెడు కర్రలను తెచ్చారు, రెండు పళ్ళకు అడ్డంగా కర్రలని గుచ్చారు. 

ఇంకో రెండు  కర్రల్ని ముందుకు మడిచి చేసేసరికి - ముక్కోణం షేపులో  

చక్కటి బండి రెడీ అయ్యింది, ఒకడు బండెక్కి కూర్చుంటే, 

తతిమ్మా వాళ్ళు వంతుల వంతులవారీగా ముందుకు లాగుతుంటారు.  

@@@@@@@@@ ,

సంక్రాంతి పండుగ - గొబ్బిదేవరను కాలవలో కలపడానికి, ఊరి జనం అంతా కదిలివచ్చారు. 

పిల్లలు కనిపెట్టిన కొత్త ముంజెల వాహనం చూసారు అందరూ. 

మొబైల్స్ లో పండగ సీన్స్ అన్నిటినీ తీస్తూ, 

అప్పూరాజా బండి ఆటను కూడా వీడియోలు తీసారు. నానీకి - 

మన అప్పూరాజా గారి డిస్కవరీ భలేగా నచ్చింది. 

“ఈ సంగతిని చంద్రికకి చెప్పాలి, పత్రికలలో రాస్తుంది.” అనుకున్నది. 

@@@@@@@@@ ,

ఊరు చేరాగనే, జయశ్రీ దగ్గరికి వెళ్ళి, ఆమె చేత - చంద్రికకు ఫోన్ చేయించి - 

పల్లెలలోని కొత్త దృశ్యాల వివరములను తెలిపింది నానీ.

చంద్రికకు గుర్తు చేస్తూ “అమ్మణ్ణీ, మొన్న మా సత్యవతి వాళ్ళ ఊళ్ళో - 

తాటి ముంజెల బండి సంగతి చెప్పాను ….  ”  

“గుర్తుంది నానీ, ఈ నడుమ రాయడానికి - 

కొత్త matters for essays  లేక, బోర్ కొడ్తున్నది. మీరు మంచి విశేషాలను, 

నా కోసం గుర్తుపెట్టుకుని, ఫోన్ చేసి చెబుతున్నారు, 

ఇంత interest చూపిస్తున్నారు, 

మీకు many many thanks, నానీ!” అన్నది జర్నలిస్ట్ చంద్రిక. 

జయశ్రీకి “నానీ అంటే ఇష్టం పెరిగుతున్నది, 

“ఈ పెద్దావిడ, తన చెల్లెలికి ఉచిత సాయాలు చేస్తున్నది.” 

అందుకే జయశ్రీ “నానీ, మా ఊరి నుండి, మా అమ్మావాళ్ళు పంపించారు.” అంటూ 

త్యాగలు, జామపళ్ళు, రేగిపళ్ళు మొదలైనవి ఇచ్చింది. 

నానీ భర్త వెంకటప్పయ్య “అమ్మలూ, జయశ్రీ, తాటి ముంజెలు 

పళ్ళకు మంచిది.” అన్నాడు చేతిలోకి పళ్ళను తీసుకుంటూ.

“ఓసోస్, గాంధీకి మల్లే - నీది బోసినోరు, ఈ పళ్ళు - నీ నోట్లో పళ్ళు ..... ,

 కొరకలేవు, గానీ, అచ్చమ్మకి ఇస్తాను, రసం చేసి ఇస్తుంది.” అన్నది. 

కొంచెం ఉడుకుమోతుతనంతో - “పోన్లే, మహాత్మా గాంధీ గారితో - పోల్చావు నన్ను, అది చాలు.” 

“మరే, చాలు అనే వయసు ఇది, కానీ - ఇంకా తింటాను, అనే వయసు కాదు గదా.” 

జయశ్రీ ఫెళ్ళున నవ్వుతూ, నానీ ఇచ్చిన కందిపచ్చడిని తీసుకుని, వెళ్ళిపోయింది. 

@@@@@@@@@ ,

ఈ news అందుకుని, చంద్రిక కొత్త ట్రిప్ ప్లాన్ చేసుకున్నది.

తన సరంజామాని తీసుకుని, అప్పూరాజా వాళ్ళ ఊరు చేరి, న్యూస్ కవరేజి చేయగలిగింది. 

ఇందుకు మూడు నెలలు పట్టింది చంద్రికకి. 

కొరియర్ లో చంద్రిక - అప్పూ వాళ్ళకి, నానీ ఆవరణలోని

bunch of houses వాళ్ళకి పత్రికలను పంపించింది.

అందరూ ఆసక్తితో చదివారు, ముఖ్యంగా జయశ్రీ, నానీ -

ప్రతి line ని చదివి ఆనందించారు.

తాటిముంజెల బండి, చుట్టూ నిలబడి చూస్తున్న జనంలో ఉన్న నానీ -

ఫొటోలలో స్పష్టంగా - కనిపిస్తున్నది.

నానీ "మా ఇంటాయనకు చూపిస్తాను." అంటూ -

"అమ్మాయ్ జయశ్రీ, నువ్వు చదవడం పూర్తి ఐనాక,

నాకివ్వు. నా బొమ్మ వచ్చింది కదా ...., "

అదనపు magazine ని కలెక్ట్ చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది.

@@@@@@@@@ ,

సుమాలిని బంధువు ఉదయ్ కుమార్ - గ్లాస్, మిర్రర్స్ బిజినెస్ పెట్టాడు. 

కొత్త వ్యాపారానికి పునాది తనే, విస్తరణ బాధ్యత తనదే. 

కనుక కనబడినవాళ్ళకి, తన బిజినెస్ గురించి చెబుతుంటాడు. 

చిన్న అద్దం ఇచ్చాడు సుమాలినికి - 

"ఇంత చిన్న అద్దానికి ఇంత చక్కని frame, వెరీ నైస్." సంతోషంగా తీసుకుంది.

కాకాని సరోజకి వీడియో కాల్ చేసి, small tiny mirror ని చూపించింది. 

"ఐతే మా ఉదయ్ కి మంచి మార్కులు వేసావన్నమాట." నవ్వుతూ అని, ఉదయ్ కి చెప్పింది సుబంధు. 

"మీ కాకాకి నచ్చింది కదా, హ్యాపీ." ఉదయ్ ఉవాచ. next step కి ఆ అద్దాలు - నానీ వర్గానికి చేరాయి. 

"ఇటువంటివి ఇంకో నాలుగు తెచ్చిపెట్టండి." అంటూ ఆర్డర్స్ వచ్చాయి, 

కావేరి, జయశ్రీ ప్రభృతుల నుండి.

చిత్రమేమిటంటే - చేదోడు అచ్చమ్మ, నానీ వంటివారు సైతం - బుల్లి అద్దాలు తెమ్మని - చెప్పడం. 

తన glaass - mirrors వ్యాపారం జోరుగా హుషారుగా సాగుతుంటే, 

ఉదయ్ కుమార్ లో ఎనలేని జోష్ పెరుగుతున్నది. 

& @@@@@@@@@ ,

మధ్యే మార్గ పరిచయః ఉదయ కుమార దర్పణ ప్రదర్శనలు - 

వాటిని కొన్న చంద్రిక, అతని బిజినెస్ అభివృద్ధికి - వృత్తిపరంగా - 

పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం వంటి హెల్ప్ చేసింది

=========================== ;

"berree amTE, pulla rEgipaLLu, telusA!?" tana General knowledgeni 

gummaristumTADu appuDappuDU, appuu raajaa. asalu pEru appaaraawu - 

caaladannaTlu `sir name` tO kalipi, pomdina ruupaamtaram - 

kappaaraawu - tana pEru `k`.appArAwu - aitE, eecuppanaati manushulu - 

awahELana cEstU, `frog not come` gaa cEsEsAru.

"wicitra sOdarulu" anE O sinimaa waccimdi - suupar DUpar hiT aina aa `film` - 

amdipuccukunnADu - mana kappaaraaw, tana naamaanni kaastaa - 

appuuraajaa - maarcukunnADu - "nEnu sarkas appuuraajaa, kamal hasan ni" ani. 

tanani appuuraajaa - ani pilicE wALLanu maatramE ATallO cErcukumTunnADu. 

porapATuna paata nik nEmm peTTi, pilicaarO, waaLLatO imka kaTIph, 

tana jEbulOni mikcar iwwaDu, imTlO amma, nAnI wALLu iccina - laDDu, 

borugulu, puTnaalu, aTukulu peTTanu gAka peTTaDu.

@@@@@@@@@ ,

kappU ……. sArI - appU saaradhyamlO pillala damDu - 

tATimumjela bamDi - tayaaru cEsaaru. ,mumdugaa tATimaanu kimda 

appuDE  tATipaLLu paDDAyi, wATini teccaaru raamadamDu, 

mUreDu baareDu karralanu teccaaru, 

remDu paLLaku aDDamgaa karralani guccaaru. 

imkO remDu  karralni mumduku maDici cEsEsariki - 

mukkONam shEpulO  cakkaTi bamDi reDI ayyimdi, 

okaDu bamDekki kuurcumTE, tatimmA wALLu -

wamtula wamtulawArIgA mumduku laagutumTAru.  

@@@@@@@@@ ,

samkraamti pamDuga - gobbidEwaranu kaala walO kalapaDAniki, 

uuri janam amtaa kadiliwaccaaru. , pillalu kanipeTTina 

kotta mumjela waahanam cuusaaru amdaruu. mobiles lO 

pamDaga scenes anniTinee teestuu, 

appUrAjA bamDi ATanu kUDA vedio lu tIsAru. 

nAnIki - mana appuuraajaa gaari Diskawaree bhalEgA naccimdi

“I samgatini camdrikaki ceppaali, patrikalalO raastumdi.” anukunnadi. 

@@@@@@@@@ , ;

Uru cEraaganE, jayaSree daggariki weLLi, 

aame cEta - camdrikaku phOn cEyimci - pallelalOni kotta dRSyAla 

wiwaramulanu telipimdi naanee.

camdrikaku gurtu cEstuu “ammaNNI, 

monna maa satyawati wALLa ULLO - 

tATi mumjela bamDi samgati ceppaanu ….  ”

“,gurtumdi nAnI, ee naDuma raayaDAniki - 

kotta `matters for essays ` lEka, bOr koDtunnadi. 

meeru mamci wiSEshaalanu, naa kOsam gurtupeTTukuni, 

phOn cEsi cebutunnaaru, 

imta `interest` cuupistunnaaru, 

meeku `many many thanks, nAnI!” annadi journalist camdrika. 

jayaSrIki nAnI amTE ishTam perigutunnadi, 

“I peddAwiDa, tana celleliki ucita saayaalu cEstunnadi.” 

amdukE jayaSrI “nAnI, maa Uri numDi, 

maa ammaawALLu pampimcaaru.” amTU tyaagalu, jaamapaLLu, 

rEgipaLLu modalainawi iccimdi. “nAnI bharta wemkaTappayya 

“ammalU, jayaSrI, tATi mumjelu paLLaku mamcidi.” annaaDu

 cEtilOki paLLanu tIsukumTU.

“OsOs, gaamdheeki mallE - needi bOsinOru, ee paLLu - 

nI nOTlO paLLu korakalEwu, gaanee, accammaki istaanu, 

rasam cEsi istumdi.” annadi.

komcem uDukumOtutanamtO - “pOnlE, mahaatmaa gaamdhI gaaritO - 

pOlcaawu nannu, adi caalu.” “marE, caalu anE wayasu idi, kaanii - 

imkaa timTAnu, anE wayasu kaadu gadA.” 

jayaSree pheLLuna nawwutuu,

 nAnI iccina kamdipaccaDini teesukuni, weLLipOyimdi. 

@@@@@@@@@ ,

ee `news` amdukuni, camdrika kotta Trip plan cEsukunnadi.

tana saramjaamaani teesukuni, appUrAjA wALLa Uru cEri, 

news coverage cEyagaligimdi. 

imduku mUDu nelalu paTTimdi camdrikaki. 

koriyar lO camdrika - appuu wALLaki, 

naanee aawaraNalOni`bunch of houses` waaLLaki 

patrikalanu pampimcimdi.

amdaruu aasaktitO caduwaaru, 

mukhyamgaa jayaSree, nAnI -

prati `line` ni cadiwi aanamdimcaaru.

tATimumjela bamDi, cuTTU nilabaDi cuustunna janamlO unna naanee -

phoTOlalO spashTamgaa - kanipistunnadi.

naanee "maa imTAyanaku cuupistaanu." amTU -

"ammaay jayaSree, nuwwu cadawaDam puurti ainaaka,

naakiwwu. naa bomma waccimdi kadaa ...., "

adanapu `magazine` ni kalekT cEsE kaaryakramaalaki Sreekaaram cuTTimdi.

@@@@@@@@@ , &

madhyE maarga paricaya@h udaya kumaara darpaNa pradarSanalu - 

wATini konna camdrika, atani bijines abhiwRddhiki - 

wRttiparamgaa - patrikalalO prakaTanalu iwwaDam wamTi help cEsimdi. 

@@@@@@@@@ ,

[ పాత్రలు ;- " సుబంధు - గ్లాస్ బిజినెస్" ఉదయ్ కుమార్ = సుమాలిని బంధువు ::

కాకా = కాకాని సరోజ-  కావేరి,  చేదోడు అచ్చమ్మ ప్రభృతులు ;; జయశ్రీ sister =-  JOURNALIST చంద్రిక ] 

&

ముంజెల బండి - రామదండు - 46 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...