29, జులై 2022, శుక్రవారం

లొత్తబుగ్గలు - పళ్ళసెట్టు - 47

అప్పూరాజా - కుటుంబం, నానీ ఇంట్లో దిగారు, now అప్పూరాజా family members = 

తల్లి అహల్య -  తండ్రి రాధాకృష్ణమూర్తి ; చెల్లి హేమమాలిని  ;  తమ్ముడు నిఖిల్ &  

అహల్య అక్కయ్య క్రిష్ణాదేవి  - అందరూ నెమ్మదిగా లోపలికి వచ్చారు.

అప్పూ తల్లి అహల్య - ఆమె అక్కయ్య క్రిష్ణాదేవి - భారీ శరీరం, ఆయాసపడుతూంటే - 

"కూర్చోమ్మా" అని నానీ మంచినీళ్ళు ఇచ్చింది.

అహల్య భర్త రాధాకృష్ణమూర్తి సూట్ కేసులు గట్రా మోసుకొచ్చి, ఇంట్లో పెట్టాడు. 

"ఐతే మీరు కూడా తీర్ధయాత్రలు చేస్తున్నారన్న మాట." 

ఆమె డైలాగ్స్ వింటూ, "అదేమిటి నానీ - సరదాగా ఇటువేపు ఉన్న 

టెంపుల్స్ చూస్తున్నాము. అంత పెద్ద పేరు పెట్టారే!" అప్పూ తల్లి అన్నది. 

ఆమె ప్రకృతి ప్రేమిక - తీర్ధం, ప్రసాదం రెండూ దక్కుతున్న్నాయి - అన్నట్లుగా, 

కోవెల సందర్శనాలు - అటు పుణ్యం, ఇటు పురుషార్ధము కూడా" అన్నాడు వెంకటప్పయ్య.

@@@@@@@@@  ,

అప్పూరాజా - కుటుంబం, నానీని కూడా తమతో temples కి తీసుకెళ్ళారు, 

"మీకు ఈ చుట్టుపక్కల ప్రదేశాలు బాగా తెలుసు, మీరు మాకు తోడు ఉంటే మాకు ధైర్యం." 

అప్పూ తల్లి అహల్య ప్రశంస చల్లని వారుణాస్త్రం """"""""""" , - 

"నేను ఇంట్లో ఉంటాను, నడవలేను" అన్నాడు వెంకటప్పయ్య, 

భర్తకు ఆరోగ్య రక్షణ - అన్ని జాగ్రత్తలు చెప్పి, బయలుదేరింది నానీ.

వారితో కలిసి, మినీ బస్సులో - ఇతర friends ని కలుపుకుని, ప్రయాణాలకు - 

భాగస్వామ్య బాధ్యతలు గైకొన్నది నానీ.

పెద్దలు, పిల్లలు - ఆబాలగోపాలం -  - ప్రతి scene నీ enjoy చేసారు. 

అన్నిచోట్లా అప్పూరాజా సందడే సందడి ; అన్ని ఫొటోలలోనూ వాడు పళ్ళికిలిస్తూ ఇచ్చిన ఫోజులే ; 

"మా పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు ఆసియా గేమ్సు - టివిలో వచ్చేవి. ఏదో వండిపెట్టి, 

టివి ముందు కూర్చునేది. కనే దాకా ఆటలు చూసింది, అందుకనే మా అప్పూకి స్పోర్ట్స్ అంటే అంత ఇష్టం." 

ధైర్యంగా పుష్కరిణిలో దిగి, ఈత కొడుతున్న కొడుకును చూస్తూ 

గర్వంగా చెప్పాడు రాధాకృష్ణమూర్తి. 

"ఐతే అప్పూకి ఇప్పుడు ఏడేళ్ళన్న మాట." నానీకి చెప్పింది భారీ మనిషిణి కృష్ణాదేవి. 

అప్పూ తమ్ముడు నిఖిల్, చెల్లెలు హేమమాలిని - అన్నయ్య స్విమ్మింగ్ చేస్తుంటే, 

ఒడ్డున మెట్ల మీద కూర్చుని, సంతోషంగా చూస్తూ కూర్చున్నారు. 

"మీరు ఈత నేర్చుకున్నాక, అన్నయ్య లాగా బాగా స్విమ్ చేద్దురు గాని." 

అహల్య పిల్లలకు నచ్చజెప్పింది. అందుకే ఆ ఇద్దరు మారాం చేయకుండా బుద్ధిగా, 

అప్పూరాజా సాహసవిన్యాసాలను enjoy చేసారు.

దివ్యదేశ సందర్శనాలు అన్నీ తృప్తిగా చేసారు. వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చారు, 

'అచ్చమ్మ తన భర్తకు, ఏమేమి వంటలు చేసి పంపింది, భర్త సరిగ్గా తిన్నారా!?' 

అన్నీ కనుక్కుని, ఆ తర్వాత కాస్త స్థిమితపడి, నిత్యకార్యక్రమాలు, ఇంటి పనులలోకి అడుగు పెట్టింది నానీ. ;

@@@@@@@@@  ,

కాకదంతపరీక్షాన్యాయం ;-  काकदन्तपरीक्षान्यायः  ;-

అప్పూ ఇప్పుడు తాతగారితో మాటలు కలిపాడు. తన ఫోజుల mbl photos ని చూపించాడు.

"తాతయ్యా! నీ టీత్ ఏవి?" అడగనే అడిగాడు. వెంకటప్పయ్య ఫెళ్ళున నవ్వాడు. "

*కాక దంత పరీక్ష చేస్తున్నావా భడవా!" 

"అంటే?" big question mark ని ఎదుట నిలబెట్టాడు ఈ భడవ.

"కాకి నోట్లో దంతాలు - అంటే, పళ్ళను లెక్కబెట్టడం - అని." 

"నేను కౌంట్ చేస్తాను." 

"ఊహు, కాకికి, పక్షులకు ముక్కు ఉంటుంది, ముక్కూ అదే, నోరూ అదే కదా, 

అందులో పళ్ళు అస్సలు ఉండవు." 

"నానీ టీత్ బాగున్నాయి కదా, నీకు మాత్రం లేవు."  

'గడుగ్గాయి సబ్జెక్టు సాగతీతలో ఘనుడు,' అనుకున్నాడు తాత. 

"కాక దంత పరీక్ష - అంటే ఏమిటి, బాబాయ్ గారూ?" అడిగింది కృష్ణాదేవి

సందేహప్రాణులు తటస్థపడితే వెంకటప్పయ్యకు మహా హుషారు, 

వారి doubts ని తీరుస్తూ, అనేక విశేషాలను చెబుతాడు. 

భర్త అందరికీ జ్ఞానబోధ చేస్తుంటే, నానీకి మురిపెంగా ఉంటుంది. 

ఇవాళ వెంకటప్పయ్య అన్నిటినీ - కూలంకషంగా చెబుతుంటే, 

ఆ గది చక్కని చర్చావేదిక అయ్యింది. వారి వాక్కుల సారాంశం ;- 

"కాకి నోట్లో పళ్ళు ఉండవు కదా - లేని దంతాలను లెక్కపెట్టాలని ప్రయత్నిస్తే, 

పని దండగ, time వేస్ట్ - నిరర్ధకమైన పనులు చేయకూడదని చిన్న హెచ్చరిక - అని భావం." : 

"మరి తాతగారూ! black crow కి, and birds కి ముక్కు ఉంటుంది, నోరు ఎక్కడుంటుంది?"

 అప్పూ చెల్లి హేమమాలిని అడిగింది.

వెంకటప్పయ్య కి చటుక్కున ఏం చెప్పాలో తోచలేదు. 

అహల్య చెప్పింది, "పక్షులకు దేవుడు ముక్కు, నోరు ఒకటే ఉంటాయని వరం ఇచ్చాడు." 

చిన్న కొడుకు నిఖిల్ కూడా - మరేదైనా - మరో ప్రశ్న అడుగుతాడేమో అని 

గబగబా వంటింట్లోకి వెళ్ళింది అహల్య, కత్తిపీట తీసుకుని, కూరలు తరగసాగింది. 

చాకుతో వెజిటబుల్స్ కట్ చేసే అలవాటు - అందుకని - ఆమెకు ఇది అలవాటు లేని ఔపోసన - 

కొంచెం నెమ్మదిగా తరుగుతున్నది.

@@@@@@@@@  ,

ఆ పరిసరముల పరిధిలో ఉన్న ఇతర గుళ్ళు గోపురాదులను దర్శించుకున్నారు కదా, 

ఇంక ఈ ఊళ్ళోని డబ్బా సినిమాహాలులో ముచ్చెంగా మూడు సినిమాలు చూసారు. 

పిల్లలకు స్కూళ్ళు తెరుస్తున్నారు, అప్పూ family - ఎల్లుండి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు. 

తొలి పొద్దున నిద్ర లేచింది నానీ. కెవ్వున అరిచింది, 

"ఏమయ్యోవ్! ఇక్కడ ఏదో కొత్తరకం పురుగు -" 

భీతితో వణుకుతున్నది, 

"ఏదీ, ఎక్కడ?" అడుగుతూ, భార్య చూపించిన దిశకు మళ్ళాడు. 

చేపాటి కర్రను పట్టుకున్నాడు. టేబుల్ మీద వెదుకుతూ, కథాకళి ఆడుతున్నాడు. 

అక్కడ కనిపిస్తున్నదేదో అర్ధం కాని వెంకటప్పయ్య - 

గట్టిగా కొట్టడానికి - చేతిలోని కర్రని పైకి ఎత్తాడు. 

దంపతుల కేకలకు అందరూ ఒక్క ఉదటున అక్కడికి చేరారు.

ఈసారి కెవ్వున అరిచిన వంతు కృష్ణాదేవిది అయ్యింది. 

"ఆగండి." అంటూ Table దగ్గరికి గెంతి, 

అద్దానిని చటుక్కున తీసుకుని, అపురూపంగా దోసిట్లో మూసింది.

"అయ్యయ్యో, పురుగు కుడుతుంది." వృద్ధ దంపతులు అరిచారు.

"అది మా దొడ్డమ్మ పళ్ళ సెట్టు తాతా" నిఖిల్ చెప్పాడు. 

క్రిష్ణాదేవి కించిత్తు సిగ్గుపడి, అటుకేసి వెళ్ళింది, కిటికీ కర్టెన్ పక్కకి నెట్టింది. 

రాధాక్రిష్ణ - "భలేగా ఉంది, మీకు పళ్ళు లేవా!?" ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ అన్నాడు.

"మా పెద్దక్కయ్య - ఇదే problem వచ్చింది, ఆట్టే పట్టించుకోలేదు. 

పళ్ళన్నీ ఊడిపోయాయి, బుగ్గలు సొత్తలు పడ్డాయి." 

"ఔను, తాతగారికి లాగానే, బోసినోరు, ఇట్లాగ చప్పరిస్తుంది ఆమె." 

అప్పూ అభినయిస్తూ చూపిస్తున్నాడు. 

"తప్పు, ఎవరినీ అట్లాగ ఎగతాళి చేయకూడదు." అన్నది హేమమాలిని - పెద్ద ఆరిందా లాగా.

"మా పెద్దక్కది నిండు మొహం, ఇప్పుడు వసివాడిన పువ్వు మాదిరి అయ్యింది. 

మా కిష్టక్కయ్య - దడుచుకున్నది. అందుకే ఎప్పటికప్పుడు డెంటిస్ట్ దగ్గర టెస్ట్ చేయించుకుంటూ, 

ముందుగానే  జాగ్రత్త పడింది. నాలుగు teeth ఊడిపోయాయి, పెట్టించుకుంది." 

అహల్య చెప్పడం పూర్తి అయ్యా క - కృష్ణాదేవి విండో దగ్గర నుండి ఇవతలికి వచ్చింది.

"ఐతే నేను కూడా కట్టించుకుంటాను. 

ఇన్నాళ్ళూ భయపడి, ఇంతే - అనుకుని ఊరుకున్నాను, అమ్మణ్ణీ!" అన్నాడు వెంకటప్పయ్య.

"చాల్లెండి సంబడం, చిగుళ్ళు పాతాళానికి ఇంకి ఉన్నాయి, 

ఇంత ఆలస్యం చేసాక, వెళ్ళినా ఏం లాభం ఉంటుంది, 

అహల్య పెద్దక్క సంగతి ఇప్పుడే తెలిసింది కదా!" నానీ కసురుకుంది.

"ఈ రోజుల్లో - రోజు రోజుకు - క్షణ క్షణానికి - టెక్నాలజీ డెవలప్ ఔతూనే ఉన్నది నానీ, 

అంతా సెట్ ఔతుందేమో, చెప్పలేం కదా!" అన్నాడు రాధాక్రిష్ణ. 

"మరే" వెంకటప్పయ్య పలుకులలో త్రుళ్ళిపడుతున్న ఆశలు ......... , 

"ఔనేమో, సరే, ఈ కొత్త వివరం కనుక్కుంటాను." నానీ అన్నది.

"మీ ఆయన అందంగా మారితే, నీకే సంతోషం కదా!" అన్నాడు ముసలయ్య వెంకటప్పయ్య.

"నువ్వు నా కళ్ళకు బోసినోటి గాంధీ మాదిరి. సరేనా, దిగులుపడకు." అన్నది నానీ.

గది నిండా నవ్వులు మార్మోగాయి. అప్పటికే కృష్ణాదేవి పెదవుల వెనుక 

దంతమౌక్తిక రోచిస్సులు మెరుస్తున్నాయి- ఆమె పెరట్లోకి వెళ్ళి, secreat గా set సర్దుకుని, లోపలికి వచ్చింది.

"ఈ లోపల ఎప్పుడు వాటిని సర్దుకున్నావు?" నానీ కి తెగ surprise, అచ్చెరువు ....., 

&

[పాత్రలు = నానీ ;; నానీ భర్త వెంకటప్పయ్య ; అప్పూరాజా - 

తల్లి అహల్య -  father రాధాకృష్ణమూర్తి ; అప్పూ చెల్లి హేమమాలిని  ;  తమ్ముడు నిఖిల్ &  

అహల్య అక్కయ్య క్రిష్ణాదేవి]  ;

=====================================  ,

lottabuggalu-paLLa set ;- story ;-

appUrAjA - kuTumbam, nAnI imTlO digaaru. appuuraajaa `family members` =  

talli ahalya ; father rAdhAkrishNamuurti - sister hemamalini ; 

brother nikhil & Ahalya sister krishNaadEwi -

amdaruu nemmadigaa lOpaliki waccaaru.

ahalya akkayya krishNaadEwi - bhaaree Sareeram, aayaasapaDutuumTE - 

"kUrcOmmaa" ani nAnI mamcinILLu iccimdi. 

Ame Barta rAdhAkRshNamUrti sUT kEsulu gaTraa mOsukocci, imTlO peTTADu.

"aitE meeru kUDA tiirdhayaatralu cEstunnaaranna mATa."

aame Dailaags wimTU, "adEmiTi nAnI - 

saradaagaa iTuwEpu unna Temples cuustunnaamu. 

mta pedda pEru peTTArE!" appuu talli annadi. aame prakRti prEmika - 

teerdham, prasaadam remDuu dakkutunnnaayi - annaTlugA,

 kOwela samdarSanaalu - aTu puNyam, iTu purushaardhamu kUDA" 

annADu wemkaTappayya.

@@@@@@@@@@@@ ,

appUrAjA - kuTumbam, nAnIni kuuDA tamatO `temples` ki teesukeLLAru, 

"meeku ee cuTTupakkala pradESAlu baagaa telusu, 

meeru maaku tODu umTE maaku dhairyam." 

appuu talli ahalya praSamsa callani waaruNAstram """""" , 

"nEnu imTlO umTaanu, naDawalEnu" annADu wemkaTappayya, 

bhartaku ArOgya rakshaNa - anni jaagrattalu ceppi, 

bayaludErimdi nAnI. waaritO kalisi, 

mini bus lO - itara `friends` ni kalupukuni, prayANAlaku - 

BAgaswaamya baadhyatalu gaikonnadinAnI. 

peddalu, pillalu - aabaalagOpaalam - prati `scene` nee `enjoy` cEsaaru.

"maa peddODu kaDupulO unnappuDu aasiyaa gEmm su - 

TV lO waccEwi. EdO wamDipeTTi, Tiwi mumdu kuurcunEdi. 

kanE daakaa ATalu cuusimdi, amdukanE maa appUki spOrTs amTE amta ishTam." 

dhairyamgaa pushkariNilO digi, eeta koDutunna koDukunu cuustuu 

garwamgaa ceppADu rAdhAkRshNamUrti. 

"aitE appUki ippuDu EDELLanna mATa." 

nAnIki ceppimdi BArI manishiNi kRshNAdEwi. 

appU tammuDu nikhil, cellelu hEmamaalini - annayya swimmimg cEstumTE, 

oDDuna meTla mIda kUrcuni, samtOshamgaa cUstU kUrcunnAru. 

"meeru eeta nErcukunnaaka, annayya laagaa baagaa swimm cEdduru gaani." 

ahalya pillalaku naccajeppimdi. amdukE aa iddaru 

maaraamcEyakumDA buddhigaa, appUrAjA saahasawinyaasaalanu `enjoy` cEsaaru. 

diwyadESa samdarSanaalu annee tRptigaa cEsaaru. waaram rOjula tarwaata imTiki waccaaru.

@@@@@@@@@ ;

काकदन्तपरीक्षान्यायः ;- kAkadamtaparIkshAnyAyam ;- 

"kaaka damta pareeksha - amTE EmiTi, bAbAy gArU?" aDigimdi kRshNAdEwi. 

samdEhaprANulu taTasthapaDitE wemkaTappayyaku mahaa hushaaru, waari 

`doubts` ni teerustuu, anEka wiSEshaalanu cebutADu. bharta amdarikee 

jnaanabOdha cEstumTE, nAnIki muripemgaa umTumdi. 

iwALa wemkaTappayya anniTinee - kuulamkashamgaa cebutumTE, 

A gadi cakkani carcaawEdika ayyimdi. waari waakkula saaraamSam ;- 

"kAki nOTlO paLLu umDawu kadaa - lEni damtaalanu lekkapeTTAlani prayatnistE, 

pani damDaga, `time` wEsT - nirardhakamaina panulu 

cEyakUDadani cinna heccarika - ani BAwam." : 

"mari taatagaarU! `birds` ki mukku umTumdi, nOru ekkaDumTumdi?" 

appU celli hEmamAlini aDigimdi.

wemkaTappayya ki caTukkuna Em ceppAlO tOcalEdu. 

ahalya ceppimdi, "pakshulaku dEwuDu mukku, nOru okaTE umTAyani waram iccADu." 

cinna koDuku niKil kUDA - marEdainaa - marO praSna aDugutADEmO ani 

gabagabaa wamTimTlOki weLLimdi ahalya, kattipITa teesukuni, 

kuuralu taragasaagimdi. caakutO wejiTabuls kaT cEsE alawATu - 

amdukani - Ameku idi alawATu lEni aupOsana - komcem nemmadigaa tarugutunnadi.

@@@@@@@@@@ 

8] aa parisaramula paridhilO unna itara guLLu gOpuraadulanu darSimcukunnaaru kadaa, imka ee ULLOni Dabbaa sinimaahaalulO muccemgaa mUDu sinimaalu cuusaaru.

pillalaku skULLu terustunnaaru, appuu `family` - ellumDi Train TikeT buk cEsukunnaaru. 

toli podduna nidra lEcimdi nAnI, kewwuna aricimdi, 

"EmayyOw! ikkaDa EdO kottarakam purugu -" BItitO waNukutunnadi, 

"EdI, ekkaDa?" aDugutU, BArya cuupimcina diSaku maLLADu. 

cEpATi karranu paTTukunnADu. TEbul meeda wedukutU, kathAkaLi ADutunnADu. 

@@@@@@@@@ ;

akkaDa kanipistunnadEdO ardham kaani wemkaTappayya - 

gaTTigA koTTaDAniki - cEtilOni karrani paiki ettADu. dampatula kEkalaku 

amdaruu okka udaTuna akkaDiki cEraaru.

eesaari kewwuna aricina wamtu kRshNAdEwidi ayyimdi. "aagamDi." 

amTU `Table` daggariki gemti, 

addaanini caTukkuna teesukuni, 

apuruupamgA dOsiTlO muusimdi.

"ayyayyO, purugu kuDutumdi." 

wRddha dampatulu aricaaru.

"adi maa doDDamma paLLa seTTu tAtA" nikhil ceppADu. 

krishNaadEwi kimcittu siggupaDi, 

aTukEsi weLLimdi, kiTikI karTen pakkaki neTTimdi. raadhaakrishNa - 

"bhalEgaa umdi, meeku paLLu lEwA!?" AScaryaanni wyaktam cEstU annADu.

"maa peddakkayya - idE `problem` waccimdi, ATTE paTTimcukOlEdu. 

paLLannI UDipOyaayi, buggalu sottalu paDDAyi." 

"aunu, taatagaariki laagaanE, bOsinOru, iTlaaga capparistumdi aame." 

appU abhinayistuu cuupistunnADu. 

"tappu, ewarinee aTlaaga egatALi cEyakUDadu." annadi hEmamaalini - 

pedda Arimdaa laagaa.

"mA peddakkadi nimDu moham, ippuDu wasiwADina puwwu maadiri ayyimdi. 

mA kishTakkayya - daDucukunnadi. amdukE eppaTikappuDu DemTisT daggara TesT cEyimcukumTU, mumdugAnE  jAgratta paDimdi. naalugu `teeth` 

UDipOyaayi, peTTimcukumdi." ahalya ceppaDam pUrti ayyAka - 

krishNAdEwi wimDO daggara numDi iwataliki waccimdi.

"aitE nEnu kUDA kaTTimcukumTAnu. innaaLLU BayapaDi, 

imtE - anukuni uurukunnaanu, ammaNNI!" 

"caallemDi sambaDam, ciguLLu paatALAniki imki unnaayi, 

imta aalasyam cEsaaka, weLLinA Em lABam umTumdi, ahalya -

peddakka samgati ippuDE telisimdi kadA!" 

nAnI kasurukumdi. 

"ee rOjullO - rOju rOjuku - kshaNa kshaNAniki - Technology Develop autUnE unnadi nAnI, 

amtaa seT autumdEmO, ceppalEm kadA!" 

annADu raadhaakrishNa. 

"marE"  wemkaTappayya palukulalO truLLipaDutunna ASalu ......... , 

@@@@@@@@@ 

లొత్తబుగ్గలు - పళ్ళసెట్టు - 47 ;-  story ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...