4, ఆగస్టు 2022, గురువారం

గగన హర్మ్యాలు - 48

గుడిలోని అద్భుత tree - చెంగాలమ్మ చెట్టు - అని పేరు, తిరునాళ్ళ, భక్తులు ఆ చెట్టు చుట్టూ చేస్తున్న ప్రదక్షిణాలు - చెంగాలమ్మ కోవెల ;- అన్నిటినీ వీడియో ఫొటోలు తీసింది. వినీల, నానీ మొబైల్ కి అప్ లోడ్ చేసింది. రైలు ఎక్కి వీడ్కోలు తీసుకుంది నానీ. తిరుపతిలో చిన్నక్క ఇంట్లో దిగి, వాళ్ళతో కలిసి ఏడుకొండలస్వామిని దర్శించుకుంది.

ఇంటికి చేరాక - భర్తకు, జయశ్రీ, కావేరి - ప్రభృతులకు - 

వినీల తన మొబైలులో నింపిన దృశ్యమాలికలను చూపించింది, 

చూపిస్తూ నానీ చెప్పిన కబుర్లలో - సూళ్ళూరుపేట ఇతివృత్తం మందిలో ఆవృతం అయ్యింది. 

సహజంగానే, ఆ matter పునరావృత్తం ఔతూ, జయశ్రీ చెల్లెలు జర్నలిస్ట్ చంద్రికకు చేరింది - 

చంద్రిక తన రచనలలోనికి ఈ incident ని కథానికగా మలచడానికి ఆలోచిస్తున్నది. & - ఇక ....., 

అసలు కథ ;- నానీ ట్రైను సూళ్ళూరుపేట స్టేషన్ చేరుతుండగానే - వినీల వచ్చింది.

తిరుపతి వెళ్తుంటే - భవానీశంకర్ గారు, 

"సూళ్ళూరు పేటలో ఉత్సవాలు జరుగుతున్నాయి, 

అక్కడే మా అమ్మాయి ఉద్యోగం - గుళ్ళో అద్భుత చెట్టు ఉంది, మీకు చూపిస్తుంది." అని చెప్పారు.

"సరే" అని - నడుమ ఈ పేట గాని పేట - సూళ్ళూర్ పేటలో దిగింది నానీ. 

ఇప్పుడిప్పుడే పట్టణం బాగా విస్తరిస్తున్నది. 

వినీల ఉంటున్న flat ఊరి కొసన కొత్తగా వెలుస్తూ ఉన్న కట్టడాల సమూహాలలో ఒకటి. 

ఈ రోజు నాగులచవితి - వినీల పూజలు చేసింది. చేతిలో పళ్ళెం, పాల గిన్నె, అన్నిటితో, ఆటో ఎక్కేసారు. 

చాలా దూరం వెళ్ళాల్సివచ్చింది. "హమ్మయ్య" అని నానీ దిగింది - 

"మరీ ఇంత దూరం అని అనుకోనే లేదు, అమ్మడూ." 

గతుకుల రోడ్డులో ఆటో ప్రయాణం, ఒళ్ళు హూనమైంది.

"ఇదివరకు దగ్గరలోనే చాలా పుట్టలు ఉండేవి, నానీ! వాటిని అన్నిటినీ పడగొట్టేసారు, 

ఇప్పుడు మేము ఉంటున్న ఫ్లాటు ఎదుటి వీధిలో మూడు పుట్టలని నేలమట్టం చేసి, 

కొత్తవి కట్టారు అందుకనే ఏవీ లేవు ... " 

వినీల వెంట - చిన్నా వచ్చాడు. పిల్లలకు ట్యూషన్లు* చెబుతున్నది వినీల. 

[*tuitions, privates] ఆమె స్టూడెంటు ఈ పదిహేనేళ్ళ చిన్నా.

"పుట్ట అంటే anthill కదా టీచర్." వాడి ధర్మసందేహాలు తీరుసుంటే, time బోర్ కొట్టకుండా గడిచిపోయింది.

"ఔను బాబులు! పుట్ట అంటే సంస్కృతంలో వల్మీకం. పుట్ట నుండి బైటికి వచ్చాడు 

కాబట్టి, వాల్మీకి - అనే పేరు వచ్చింది." అంటూ .... ,

ఇటు టీచర్, అటు నానీ పిల్లాడికి విజ్ఞానం పంచి ఇచ్చారు. 

పుట్టమన్ను తీసుకున్నాక, ఇంటికి తిరుగుముఖం పట్టారు. 

ఆటో సిటీ పరిసరములను చేరుతున్నది. 

అక్కడ తోపుడుబండి మిరపకాయ్ బజ్జీలు కొని, చిన్నాకి ఇచ్చింది నానీ. 

చిన్నా సంతోషంతో నెమ్మదిగా కొరికి, చప్పరిస్తూ తినసాగాడు. వాడి బజ్జీ పూర్తి అయ్యేసరికి ఇల్లు చేరారు. 

వినీల టెర్రేస్ మీదకి వెళ్ళి, మళ్ళీ సూర్యునికి నైవేద్యం పెట్టింది, ఎందుకంటే, ఆమె ఇవాళ వడియాలు పెట్టింది. 

మినుముల వంటను సూర్యనారాయణమూర్తికి సమర్పిస్తే, 

వాన రాకడ - మర్నాటికి వాయిదా పడుతుంది, 

తను పెట్టిన వడియాలు బాగా ఎండి, చేతిలోకి వచ్చే దాకా - 

మంచి ఎండ కాయి, స్వామీ!" అంటూ మొక్కుకున్నది వినీల. 

ఈ తతంగం అంతా నానీ ఇచ్చిన సలహా చలువ మాత్రమే!

మేడ మీద నుండి చుట్టూ అన్ని ఆకాశ హర్మ్యాలు, నానీ అన్నిటినీ చూస్తూ నిలబడింది.

చిన్నా అన్నాడు, "టీచర్, బోలెడన్ని ఫ్లాట్లు, అన్నీ పుట్టలకు మాదిరి కనిపిస్తాయి కదండీ!!?" 

వాడి మాటలకు "నిజమే, పాముల పుట్టలు ధ్వంసం ఔతున్నాయి. 

మనిషి నిర్మిస్తున్న పుట్టలు అధికం అవుతున్నాయి." 

నానీ పలుకులు వినీల మనసులో under line చేసిన వాక్యాలు ఐనాయి.

[పాత్రలు ;- నానీ ; వినీల [ భవానీశంకర్ కూతురు] ;; వినీల student - స్టూడెంటు పదిహేనేళ్ళ చిన్నా &

తిరుపతిలో చిన్నక్క ఇల్లు ] ;

==================== , 

gagana harmyaalu - 48 ;- story ;- guDilOni adbhuta` tree` -  

chemgaalamma ceTTu - ani pEru, tirunALLa, 

bhaktulu aa ceTTu cuTTU cEstunna pradakshiNAlu - 

chemgaalamma kOwela ;- anniTinee weeDiyO phoTOlu tIsimdi winIla, 

nAnI mobail ki ap lOD cEsimdi. railu ekki weeDkOlu tIsukumdi naanee.

tirupatilO cinnakka imTlO digi, waaLLatO kalisi EDukomDalaswaamini darSimcukumdi.

imTiki cEraaka - bhartaku, jayaSrI, kaawEri - prabhRtulaku - winIla tana mobailulO nimpina dRSyamaalikalanu cuupimcimdi, cuupistuu nAnI ceppina kaburlalO - sULLUrupETa itiwRttam mamdilO aawRtam ayyimdi. sahajamgaanE, aa `matter` punaraawRttam autuu, jayaSree cellelu jarnalisT camdrikaku cErimdi - camdrika tana racanalalOniki ee `incident` ni kathaanikagaa malacaDAniki aalOcistunnadi. & - ika ....., 

asalu katha ;- nAnI Trainu sULLUrupETa sTEshan cErutumDagaanE - wineela waccimdi. 

tirupati weLtumTE - BawAnISamkar gAru, 

"sULLUru pETalO utsawaalu jarugutunnaayi, 

akkaDE maa ammaayi udyOgam - guLLO adbhuta ceTTu umdi, 

meeku cuupistumdi." ani ceppaaru.

"sarE" ani - naDuma ee pETa gAni pETa - sULLUr pETalO digimdi nAnI. 

ippuDippuDE paTTaNam baagaa wistaristunnadi. winIla umTunna `flat` 

uuri kosana kottagaa welustU unna kaTTaDAla samUhaalalO okaTi. 

ee rOju naagulacawiti - winIla puujalu cEsimdi. "

cEtilO paLLem, paala ginne, anniTitO, aaTO ekkEsaaru. 

caalaa duuram weLLAlsiwaccimdi. "hammayya" ani nAnI digimdi - 

"maree imta duuram ani anukOnE lEdu, ammaDU." 

gatukula rODDulO ATO prayANam, oLLu hUnamaimdi.

"idiwaraku daggaralOnE caalaa puTTalu umDEwi, nAnI! 

wATini anniTinI paDagoTTEsAru, ippuDu mEmu umTunna 

phlaaTu eduTi weedhilO muuDu puTTalani nElamaTTam cEsi, 

kottawi kaTTAru amdukanE EwI lEwu ... " 

winIla wemTa - cinnaa waccADu. pillalaku *tuitions, privates cebutunnadi winIla. 

aame sTUDemTu ii padihEnELLa cinnA.

"puTTa amTE `anthill` kadA TIcar." 

wADi dharmasamdEhaalu teerusumTE, `time` bore koTTakumDA gaDicipOyimdi.

"aunu baabulu! puTTa amTE samskRtamlO walmeekam. 

puTTa numDi baiTiki waccADu kaabaTTi, waalmeeki - 

anE pEru waccimdi." amTU iTu Teacher, aTu nAnI pillADiki wijnaanam pamci iccaaru. 

puTTamannu teesukunnaaka, imTiki tirugumukham paTTAru. 

Auto sity parisaramulanu cErutunnadi. 

akkaDa tOpuDubamDi - mirapakaay bajjeelu koni, 

cinnaaki iccimdi naanii. cinnaa samtOshamtO nemmadigA koriki, 

capparistuu tinasaagaaDu. wADi bajjee puurti ayyEsariki iluu cEraaru. 

winIla TerrEs meedaki weLLi, maLLI suuruniki naiwEdyam peTTimdi, 

emdukamTE, aame iwaaLa waDiyaalu peTTimdi. 

minumula wamTanu suuryanaaraayaNamuurtiki samarpistE, 

waana raakaDa - marnATiki waayidaa paDutumdi, 

tanu peTTina waDiyaalu baagaa emDi, cEtilOki waccE dAkaa - 

mamci emDa kaayi,  swaamI!" amTuu mokkukunnadi winIla. 

ee tatamgam amtaa naanee iciina salahaa caluwa maatramE!

mEDa meeda numDi cuTTU anni AkASa harmyAlu, 

nAnI anniTinee cuustuu nilabaDimdi.

cinnaa annADu, "Teacar, bOleDanni phlATlu, 

annee puTTalaku maadiri kanipistaayi 

kadamDI!!?" wADi mATalaku "nijamE, paamula puTTalu 

dhwamsam autunnaayi. manishi nirmistunna puTTalu adhikam awutunnaayi." 

nAnI palukulu winIla manasulO `under line` cEsina waakyaalu ainaayi.

&

[pAtralu ;- nAnI ; wineela [ BawAnISamkar kuuturu] - cinnA winIla `student` & 

tirupatilO cinnakka illu ] ;  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నానీ - డబ్బా హాలు - 49

 పైడిరాజు, కావేరి - చెట్ల పాలెం ప్రయాణం "నానీ, మా అక్కయ్య వాళ్ళు ప్రమిద వత్తులు చేసి,  షాపులకు పంపుతుంటారు." అంటూ తమ ఊరిని చూడటాని...