10, ఆగస్టు 2022, బుధవారం

నానీ - డబ్బా హాలు - 49

 పైడిరాజు, కావేరి - చెట్ల పాలెం ప్రయాణం "నానీ, మా అక్కయ్య వాళ్ళు ప్రమిద వత్తులు చేసి, 

షాపులకు పంపుతుంటారు." అంటూ తమ ఊరిని చూడటానికి పిలిచారు. 

అందరూ సందడిగా చెట్ల పాలెం  బయలుదేరారు. తలుపు తాళం వేస్తుండగా 

"హాయ్, నానీ, బాగున్నారా!" అంటూ శ్యామల గళం వినిపించింది. 

నానీ వలన జర్నలిస్ట్ చంద్రికకు, శ్యామల మంచి నేస్తం అయ్యింది. 

ఆఫీసు పని మీద జిల్లా సెంటర్ సిటీకి వచ్చి, హోటల్ లో బస చేసింది. 

నానీ ప్రయాణ వార్తలను, నిన్ననే ఫోన్ చేసి చెప్పింది. 

అందుకని, తన ప్రోగ్రామ్స్ పొడిగించుకున్నది శ్యామల. 

చెట్లపాలెం చూడాలని, అనుకున్నది, 

"ఆ ఊరి విశేషాలను, తానే చంద్రికకు చెప్పి, ఆశ్చర్యపరచాలి - అనుకున్నది, 

అందుకే, నానీ, కావేరి బృందంలో కలిసింది. 

చెట్ల పాలెం సాగర తీర సమీపాన ఉన్న బుల్లి ఊరు, బెస్తవారు ఎక్కువగా ఉన్నారు. 

పైడిరాజు ఆడపడుచు ఇంట్లో శుభకార్య వేడుకలు అన్నిటినీ సవివరంగా నమోదు చేసింది శ్యామల. 

పైడిరాజు అక్కయ్య, ఊళ్ళోని ఆడవాళ్ళు - దీపాల వత్తులు చేస్తారు, విస్తళ్ళు కుట్టడం 

అక్కడ మంచి కుటీరపరిశ్రమ మాదిరిగా అభివృద్ధి చెందింది. 

శ్యామల - ఆ స్త్రీల పనితనాన్ని camera లో అచ్చు వేసి, వ్యాసాలను తయారుచేసుకోసాగింది.

పైడిరాజు మేనల్లుళ్ళు "మామయ్యా, సినిమాకెళదాం." అన్నారు. ;

 "సరే" అంటూ యావన్మందీ సినిమా program పెట్టుకున్నారు. ఐదింటి నుండి, 

అక్కడి మైకులో పాటలు జోరుగా హుషారుగా వినిపిస్తున్నారు. 

సినిమా వేయటానికి ముందు రోజూ గ్రామఫోను రికార్డులు వేస్తారు. 

ఏడింటికి* గబగబా భోజనాలు చేసేసారు.  [7 o clock]

ఆ టైమ్  కి సరిగా ఆకలేయదు కదా, ఏదో ఇంత గతికి, చకచకా రెడీ ఐనారు. 

పనిమనిషికి "ఇల్లు చూస్తుండు." అని పైడిరాజు అక్కయ్య వాళ్ళు, 

గ్రూపు మొత్తం పద్ధెనిమిది మంది కబుర్లు చెబుతూ, నడకసాగించారు. 

మూడు వీధుల అవతల సినిమా హాలు ముందర పోస్టర్లు కొన్ని కనిపిస్తున్నాయి. 

శ్యామల కెమేరా బిజీ బిజీ. 

టికెట్లు తీసుకున్నారు. పిల్లలు "మేము నేల ticket లో కూర్చుంటాం." అని ముందుకు వెళ్ళారు. 

అక్కడ వాస్తవంగానే నేల, బెంచీ టికెట్లు నామ సార్ధకం ఔతున్నాయి.

పిలకాయలు కూర్చున్న నేల టికెట్టు - 

ఇసుక వెదజల్లుకుంటూ ఆడుతూ పాడుతూ, పకపకలాడుకుటూ బైఠాయించారు. నానీ వాళ్ళు కూర్చున్న స్థానాలు - 

అక్షరములా బెంచీలు. కొంచెం వెడల్పు ఉన్నవి అవి. 

అందరూ బెంచీ మార్కులు ఐనారు. రెండు రీళ్ళు అయ్యేసరికి నానీకి నిద్ర వచ్చింది. 

"కొంచెం జరుగు, అమ్మణ్ణీ" అనేసి, హాయిగా కునుకు తీసింది.  

శ్యామల కూర్చున్న చోటు నుండి తెర మీద బొమ్మ రెండు బొమ్మలకు లాగా అగుపడుతున్నది. 

ఎందుంకంటే అది డబ్బా హాలు, ఇనప స్తంభాలు, నిట్రాడులు నిలబెట్టి కట్టారు. 

పిల్లర్లు వెనక సీట్లలో కూర్చున్న వాళ్ళకి - ఈ తిప్పలు తప్పవు. 

హీరో, హీరోయిన్లు యుగళగీతాలు - రెండు వైపుల నిలబడి, 

పాడ్తూ డాన్సు చేస్తున్నట్లుగా అగుపిస్తున్నది. 

శ్యామలకు ఇది తమాషాగా ఉండి, నవ్వువస్తున్నది.

నానీ - ముఖ్యంగా దేవుళ్ళు, దేవతల సీన్సులో - చాలా అసందర్భంగా అనిపించింది, 

ఇక చూడలేక - బెంచీ పైన కొంగు పరుచుకుని నడుం వాల్చింది. 

**************** ; 

శ్యామల "నా లిప్ స్టిక్ ఏది? కనిపించడం లేదు." అనుకుంటూ వెదుక్కుంటూన్నది. 

కావేరి కూడా వెదకసాగింది. కాస్సేపటికి ఇద్దరికీ - డౌట్ వచ్చి, 

పైడిరాజు మేనకోడళ్ళను  పరిశీలిస్తూ చూసారు. 

లలిత, సుశీల వదనారవిందాలలో ఏదో కొత్త వైవిధ్యత అనిపిస్తున్నది.

దగ్గరికి పిలిచారు, కావేరి అడిగింది, "లల్లీ, నీ బొట్టు కొత్తరకంగా ఉంది-" 

"ఔను, అత్తా, శ్యామలక్క పర్సులో బొట్టుముక్క ఉంది కదా, దాంతో బొట్టు పెట్టుకున్నాను."

"బొట్టు ముక్కా, అదేమిటి?" అర్ధం కాక మళ్ళీ ప్రశ్నించింది కావేరి.

"సుద్దముక్క - లాగా ఉంది కదా, ఎర్రగా చిన్న లక్కముద్ద .... "  సుశీల ఆన్సరించింది. 

"ఓహ్! అది నా lipstick కాబోలు." వెదికీ వెదికీ అలసిపోబోతున్న శ్యామల అన్నది.

"నీ లిప్ స్టిక్ ని ఈ పిల్లలు తిలకం బొట్టు అని అనుకున్నారల్లే ఉంది." 

అక్కడికి వచ్చిన పైడిరాజు అన్నాడు, మేనకోడళ్ళ నిర్వాకం చూసి, నవ్వాలా వద్దా అనే సందేహంలో పడ్డాడు.

ఎర్రగా చిన్న లక్కముద్ద -  సుశీల ఆన్సర్ - శ్యామలకి కొత్త పరిశోధన అంశాన్ని ఇచ్చింది. 

"చంద్రికా! లక్క - అంటే తెలుసు కదా!?" అని మొబైల్ చేసింది శ్యామల.

"ఔను, మహాభారతంలో - పాండవులను ఉండమని చెప్పి, కట్టించాడు దుర్యోధనుడు - 

దాన్ని లాక్షా గృహం అని పిల్చారు." చంద్రిక వివరించింది. 

"North India లో పారాణి పెట్టుకుంటారు - లత్తుక - అని మన తెలుగులో చెబుతాము." అన్నది శ్యామల.

"ఇటువైపు చెట్ల మీద పురుగుల ద్వారా సేకరిస్తుంటారు." చంద్రిక వివరణను వింటూ, 

"ఐతే, నీకు చాలా తెలుసునే" మెచ్చుకుంది శ్యామల.

"ఐతే, మన ప్రస్తుత reaserch matter - లాక్షారసం వర్సెస్ లత్తుక వర్సెస్ లక్క - ఔనా!?" 

"అదే అదే." అన్నది శ్యామల మొబైల్ తరంగాలతో పెనవేసుకుని వస్తున్న 

చంద్రిక చిరునవ్వులను ఆస్వాదిస్తూ. 

"ఈ కాలం అమ్మణీలకు చురుకు ఎక్కువ." అంటున్న- 

నానీ మాటలతో ఏకీభవించారు కావేరి, పైడిరాజు, తతిమ్మవాళ్ళు. 

& [పాత్రలు ;-  చెట్ల పాలెం ఆడపడుచు,  పైడిరాజు మేనకోడళ్ళు, పిల్లలు, శ్యామల - చంద్రిక - నానీ, పైడిరాజు, కావేరి ] ;

===========,

= nAnI - Dabbaa haalu ;-  katha ;- paiDirAju, kAwEri - ceTla pAlem prayANam "nAnI, maa 

akkayya wALLu pramida wattulu cEsi, shaapulaku pamputumTAru." amTU tama uurini 

cuuDaTAniki pilicAru.amdaruu samdaDigaa ceTla pAlem  bayaludEraaru. 

*********** ;

talupu tALam wEstumDagA "haay, nAnI, bAgunnAraa!" amTuu SyAmala gaLam winipimcimdi. nAnI 

walana jarnalisT camdrikaku, SyAmala mamci nEstam  ayyimdi. aapheesu pani meeda jillaa 

semTar siTIki wacci, hOTal lO basa cEsimdi. nAnI prayANa waartalanu, ninnanE phOn cEsi 

ceppimdi. amdukani, tana prOgrAmm s poDigimcukunnadi SyAmala. ceTlapAlem cUDAlani, 

anukunnadi, "A Uri wiSEshAlanu, tAnE camdrikaku ceppi, AScaryaparacaali - anukunnadi,

amdukE, nAnI, kAwEri bRmdamlO kalisimdi. 

ceTla pAlem sAgara tIra samIpAna unna bulli uuru, bestawaaru ekkuwagaa unnaaru. 

paiDirAju ADapaDucu imTlO SuBakArya wEDukalu anniTinI sawiwaramgA namOdu cEsimdi SyAmala. 

paiDiraaju akkayya, uuLLOni ADawALLu - deepaala wattulu cEstaaru, wistaLLu kuTTaDam akkaDa mamci kuTIrapariSrama maadirigaa abhiwRddhi cemdimdi. Syaamala - aa streela panitanaanni `camera` lO accu wEsi, wyaasaalanu tayaarucEsukOsaagimdi. 

paiDirAju mEnalluLLu "mAmayyA, sinimaakeLadAm." annAru.

"sarE" amTU yaawanmamdee sinimA `program` peTTukunnaaru. aidimTi numDi,

 akkaDi maikulO pATalu jOrugaa hushaarugA winipistunnAru. 

sinimaa wEyaTaaniki mumdu rOjU graamaphOnu rikaarDulu wEstaaru. 

*EDimTiki gabagabaa BOjanAlu cEsEsAru. aa Taimm ki sarigaa aakalEyadu kadA, EdO imta gatiki, cakacakaa reDI ainaaru. panimanishiki "illu cuustumDu." ani paiDirAju akkayya wALLu, gruupu mottam paddhenimidi mamdi kaburlu cebutuu, naDakasaagimcaaru. mUDu weedhula awatala sinimaa haalu mumdara pOsTarlu konni kanipistunnaayi. SyAmala kemEraa bijii bijee.

TikeTlu teesukunnaaru. pillalu "mEmu nEla `ticket` lO kuurcumTaam." 

ani mumduku weLLAru.

akkaDa waastawamgaanE nEla, bench TikeTlu naama saardhakam autunnaayi.

pilakaayalu kuurcunna nEla TikeTTu - 

isuka wedajallukumTU ADutU pADutuu, pakapakalADukuTU 

baiThAyimcAru. nAnI waaLLu kuurcunna sthaanaalu - 

aksharamulaa bemceelu. komcem weDalpu 

unnawi awi. amdaruu bemcI mArkulu ainAru. 

remDu reeLLu ayyEsariki nAnIki nidra waccimdi. 

"komcem jarugu, ammaNNI" anEsi, hAyigA kunuku tIsimdi.

SyAmala kuurcunna cOTu numDi tera meeda -

bomma remDu bommalaku laagaa agupaDutunnadi. 

emdumkamTE adi DabbA hAlu, inapa stambhaalu, 

niTrADulu nilabeTTi kaTTAru. pillarlu wenaka 

sITlalO kUrcunna wALLaki - ee tippalu tappawu. hero, heroines yugaLageetaalu - 

remDu waipula nilabaDi, pADtU DAnsu cEstunnaTlugA agupistunnadi. 

SyAmalaku idi tamaashaagaa umDi, nawwuwastunnadi.naanee - 

mukhyamgaa dEwuLLu, dEwatala seensulO - caalaa asamdarbhamgaa anipimcimdi, 

ika cUDalEka - bemcee paina komgu parucukuni naDum waalcimdi.

Syaamala "naa lip sTik Edi? kanipimcaDam lEdu." anukumTU wedukkumTUnnadi. 

kaawEri kUDA wedakasaagimdi. kAssEpaTiki iddarikee - 

Doubt wacci, paiDiraaju mEnakODaLLanu  pariSIlistU cuusaaru. 

lalita, suSIla wadanaarawimdaalalO EdO kotta waiwidhyata anipistunnadi.

daggariki pilicaaru, kAwEri aDigimdi, "lallI, nee boTTu kottarakamgaa umdi-" "aunu, attaa, Syaamalakka parsulO boTTumukka umdi kadaa, daamtO boTTu peTTukunnAnu."

"boTTu mukkaa, adEmiTi?" ardham kAka maLLI praSnimcimdi kAwEri.

"suddamukka - laagaa umdi kadaa, erragaa cinna lakkamudda .... " suSIla aansarimcimdi.

"Oh! adi naa `lipstick` kaabOlu." wedikee wedikee alasipObOtunna SyAmala annadi.

"nee lip sTik ni ee pillalu tilakam boTTu ani anukunnArallE umdi." akkaDiki waccina 

paiDirAju annADu, mEnakODaLLa nirwaakam cuusi, 

nawwaalaa waddaa anE samdEhamlO paDDADu.

erragA cinna lakkamudda -  suSIla Ansar - SyAmalaki 

kotta pariSOdhana amSAnni iccimdi. 

"camdrikA! lakka - amTE telusu kadA!?" ani mobail cEsimdi SyAmal.

"aunu, mahABAratamlO - pAmDawulanu umDamani ceppi,

 kaTTimcADu duryOdhanuDu - daanni 

laakshA gRham ani pilcAru." camdrika wiwarimcimdi. 

"`North India` lO pArANi peTTukumTAru 

- lattuka - ani mana telugulO cebutAmu." annadi SyAmala.

"iTuwaipu ceTla meeda purugula dwaaraa sEkaristumTAru." 

camdrika wiwaraNanu wimTU, "aitE, 

neeku caalaa telusunE" meccukumdi SyAmala.

"aitE, mana prastuta `reaserch matter` - 

laakshaarasam warses lattuka warses lakka - 

aunA!?" "adE adE." annadi Syaamala mobail taramgaalatO 

penawEsukuni wastunna camdrika 

cirunawwulanu aaswaadistU.

"I kaalam ammaNiilaku curuku ekkuwa." amTunna -

nAnI mATalatO EkIBawimcAru kAwEri, 

paiDirAju, tatimmawALLu.

&

[pAtralu ;- pillalu - mEnakODaLLu = lalita, suSIla pillalu, 

& Syaamala - camdrika - nAnI, paiDirAju, kAwEri ;; 

[ పాత్రలు ;-  [పాత్రలు ;-  చెట్ల పాలెం ఆడపడుచు,  పైడిరాజు మేనకోడళ్ళు =  లలిత, సుశీల ;, పిల్లలు &

శ్యామల - చంద్రిక - నానీ, పైడిరాజు, కావేరి ] ; = నానీ - డబ్బా హాలు - 49 ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గాడిదలు - గజరాజు - CK - 1

క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం  మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,  అంచేత ...