వాసంతి ;- హల్లో, సౌదా! what r u doing?
సౌదామిని ;- ఇప్పుడే నిద్ర లేచాను, ఇంకా టెన్ ఒ క్లాక్ కూడా అవలేదు,
ఏమ్, ఇవాళ ఇంత ఏర్లీగా లేచావు!?
వాసంతి ;- మా కజిన్ సిస్టర్స్ - విలేజ్ నుండి వస్తున్నారు. స్టేషన్‌కెళ్ళి రిసీవ్ చేసుకుందాం, త్వరగా రా! చంద్ర - పక్కా village girl - మనకు ఈ వీక్ అంతా భలే మంచి కాలక్షేపం.
సౌదామిని ;- అంత పల్లెటూరి గమ్మార్లా, ఐతే మనకు మంచి Time pass - వచ్చేస్తున్నా,
నో స్నానం, సెంట్ స్ప్రే చేసుకుని వచ్చేస్తున్నా.
@@@@@@@@@
[రైల్వే స్టేషన్ - 1] చంద్ర 2] బావ ఈశా 3] బంధువు అంబాజయ్య, 4] వెంకటాద్రి - బోగీ నుండి దిగారు ] ;
వాసంతి ;- చంద్రా! నీ లగేజ్ ఏది, హేయ్, పోర్టర్, come here
చంద్ర ;- వద్దండీ, ఈ సంచీ, ట్రంకుపెట్టె - పెద్ద బరువు కాదు, నేనే తెచ్చుకుంటాను.
పోర్టర్ ;- ఈ అమ్మాయిలాంటోళ్ళు నలుగురు పాసింజర్లు ఉంటే చాలు,
మాబోటి వాళ్ళకు పస్తులే!
సౌదామిని ;- ఈ బాక్సుని ట్రంకుపెట్టె - అని పిలుస్తారా!? వెరీ ఫన్నీ, చంద్రగిరి మ్యూజియంలో పెట్టవచ్చు.
వాసంతి ;- నీకు ముందే చెప్పానుగా, అప్పుడేనా, ఇంకా చూస్తుండు - ........ ,
చంద్రా! వాటిని నువ్వు భుజం మీద పెట్టుకుని వస్తే - నువ్వు కూడా -
ఓ కూలీ అనుకుని, 'ఆ లగేజీ పట్టుకుని రామ్మా' అని నిన్ను పిలుస్తారు. సౌదామినీ!
ఇది మనకు ప్రెస్టేజ్ ఇష్యూ కదా!
సౌదామిని ;- యా, ఔనును - డ్రైవర్!
వాసంతి ;- డ్రైవర్, పోర్టర్ వెంబడే రా!
డ్రైవర్ ;- అట్లాగే మేడమ్!
సౌదా ;- మన విలేజ్ బ్రూట్ - సారీ, విలేజ్ బ్యూటీ - ఈ జనం మధ్యలో తప్పిపోకుండా - చూడు.
driver ;- సరేనండీ సౌదామినీ మేడమ్ గారూ!
సౌదామిని ;-[మనసులో] వీడి మాటలు కొంచెం వంకరగా ఉంటాయి -
వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి ..
@@@@@@@@@
పదము - పదార్ధము [not food] ;-
[వాసంతి, చంద్ర All came home] ;
వాసంతి ;- చంద్రా, జ్యూస్ తాగి, మీల్స్ తిను.
చంద్ర ;- అన్నం కంటే రొట్టెలు ఎక్కువ ఉన్నాయే,
వాసంతి ;- బాలన్సుడ్ డయట్, బాడీకి మంచిది.
సౌదామిని ;- నువ్వు స్లిమ్ గా ఉండాలంటే, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి, చంద్రా!
చంద్ర ;- నేను సన్నగానే ఉన్నాను కదా, ఇంతకంటే సన్నం ఐతే -
పూచిక పుల్ల మాదిరిగా ఉన్నావని, మా వాళ్ళు గేలి చేస్తారు.
వాసంతి ;- ఆ బౌల్స్‌లో ఉన్నవి - ఐస్‌క్రీమ్, సలాడ్స్ - నెమ్మదిగా తిను.
చంద్ర ;- అన్నీ మెత్తటివే కనబడుతున్నాయి! -
వాసంతి ;- చంద్రా! మనం షాపింగ్‌కి వెళ్తున్నాం. నీకు సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు -
ఇంకా నీకేవైనా నచ్చినవీ కొందాం, ఓకేనా!!?
డ్రైవర్ ;- మేడమ్స్ మంచివాళ్ళే, ఈ కొత్త పిల్ల కోసం ఇన్ని కొంటున్నారు.
చంద్ర ;- కేసులు - అంటున్నారు - నాకు చాలా భయం వేస్తున్నది.
మా ఊరి లచ్చిందేవమ్మ - అత్త మామల మీద కేసులు పెట్టింది,
కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నది. ఏళ్ళు గడిచినా - తీర్పు రాలేదు,
కేసులు ఒక కొలిక్కి రానేలేదండీ ..... ,
వాసంతి ;- సౌదా, Today's jokes హమారా ఫన్నీ - [ఘల్లున నవ్వులు ] ;
"ఆముదాలవలస అంబాజయ్య" యొక్క ధర్మ సందేహాలు ;-
అంబాజయ్య ;- అమ్మణ్ణీ, సౌదా - మీ పేరు అంతేనా?
వాసంతి ;- పూర్తి పేరు సౌదామిని -
వెంకటాద్రి ;- సౌదామిని - మీ పేరు చాలా బాగుందండీ!
అంబాజయ్య ;- ఐతే అమ్మలూ! ఇంత చక్కని పేరుకి చక్కని అర్ధం
ఏదైనా ఉండే ఉంటుంది కదా!
సౌదా ;- అంటే meaning ...... ? ఊ...... ఏమో మరి!?
వెంకటాద్రి ;- మా నానీఅమ్మకి ఫోన్ చేసి అడుగుతాను, ఉండండి -
వాసంతి ;- ఓ, నానీ, తాతాజీ - మీకు కూడా చాలా close friends అన్నమాట,
very nice.
సౌదామిని ;- నానీ - `who is HE? or who is SHE`?
అంబాజయ్య ;- నానీ, తాతయ్య పంతులుగారు - మంచీ చెడూ చెప్పడానికి,
అన్నిటికీ మాకు పెద్ద దిక్కు.
చంద్ర ;- ఔనండీ, ఆ ఆలుమగలు - "మీరు మాకు తలలో నాలిక లాంటివాళ్ళు"
అని మెచ్చుకుంటుంటారు.
చంద్ర ;- నానీ అమ్మ, తాతగారు - మీకు వివరం చెబుతారంట,
ఇదిగోండి - ఫోను ; [💥💦 చేతికి ఇచ్చింది]
వాసంతి ;- గుడ్‌మార్నింగ్, శుభోదయ పలకరింపులు, నానీజీ!
కరక్కాయ మాస్టారు* ఉన్నారా!?
= [ కరక్కాయ మాస్టారు* = కక్కామా]
👵నానీ ;- ఉభయకుశలోపరి వాసంతీ! ఏ ధర్మసందేహం కలిగిందో మీకు,
ఇక్కడే ఉన్నారు, మొబిల్లు ఇస్తున్నాను - ఇదిగోండి, ఫోను - అందుకోండి.
కరక్కాయ మాస్టారు ;- అమ్మలూ, బాగున్నారా, మొత్తానికి నన్ను
👴కరక్కాయ మాస్టారు - అని స్థిరం చేసేసారు.
వాసంతి ;- నానీమా! తాతాజీ, మా friend పేరు సౌదామిని - తన name కి అర్ధం
బోధపడడం లేదండీ, తన పేరుకి meaning తెలుసుకోవాలని ఉబలాటపడ్తున్నది,
మీరే మా సందేహాలను నివృత్తి చేయాలి -
మీకు తెలుసు కదా - అని, మా డౌట్‌ని సాల్వ్ చేయండి ప్లీజ్!
సౌదామిని ;- నా name కి మీనింగ్ ఏమిటని మా డౌట్ -
మీరు చాలా ఇంటెలిజెంట్ - అని మన చంద్ర చెబుతున్నది.
కరక్కయ మాస్టారు ;- [ఫోన్‌లో] ;- సౌదామిని అంటే ....... ,
చంద్ర ;- అ, ఆ...... - అంటే ఏంటండీ!?
కక్కామా ;- అంటే - మెరుపుతీగె - తటిల్లత - విద్యుల్లేఖ - ఇత్యాది ఉన్నాయి, అమ్మాయీ!
సౌదాగర్ - అని హిందీలో ఉంది - వ్యాపారం - బిజినెస్ సెంటర్ - అని అర్ధం -
వ్యాపారం - వ్యాపారి - ఇత్యాది తత్సంబంధ పదాలే!
నానీ ;- ఈ కాలం పిల్లలు - మీరు కూడా - ఇంతమాత్రం -
మన భాష 👄గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు,
మాకు చాలా సంతోషం వేస్తున్నది, బంగారులూ!!
సౌదామిని ;- నానీ, మేము మార్కెట్‌కి అటుతర్వాత షాపులకి వెళ్తున్నాము
వాసంతి ;- మేము చంద్ర వాళ్ళను కూడా తీసుకెళ్తున్నాము,
తాతాజీ, ఇక ఉంటామండీ, షాపింగ్ మేటర్స్ - నెక్స్ట్ వీక్ మీకు చెబుతాము.
క.మా. ;- అట్లాగే అమ్మాయీ! అన్నీ పూసగుచ్చినట్లు చెప్పాలి, సరేనా!!
సౌదామిని ;- పూస - u mean - BEEDS -
ఏమిటో, ఈ తెల్గూ సరిగ్గా అర్ధం కాదు 👄👃💢...... హ్హూ ...... ,
వాసంతి ;- ఓకె, బై గ్రాండ్ పా! good bye naaneemaa!
@@@@@@@@@
చంద్ర ;- మీ మహాపట్టణంలో వీధి దీపాల మొదల్కొని, కొట్లు, పెళ్ళిళ్ళ మండపాలు, సమస్తం - ఇన్ని లైట్లు - కళ్ళు జిగేల్‌మనేలా .......,
సౌదా ;- వాసంతీ! లోపలికి అడుగు పెట్టే లోగానే, ఇక్కడే మూర్ఛ పోయేటట్లుంది.
[ ఇద్దరూ పకపకా నవ్వుతూ నడుస్తున్నారు -
డ్రైవర్, వెంకటాద్రి, అంబాజయ్య - అంతా గమనిస్తూ, అనుసరిస్తున్నారు ]
చంద్ర ;- పెట్టెల అంగడి బొమ్మలు భలేగా ఉన్నాయి.
నాకు కూడా అంత బాగా చీర కట్టుకోవడం చేతకాదు.
వాసంతి ;- షోకేసులో బొమ్మలు చూస్తున్నావా,
చంద్ర ;- ఇక్కడ అన్నీ కేసులే వినిపిస్తున్నాయే! మొన్న బ్రీఫు, సూటుకేసు ------
వెంకటాద్రి ;- show case అంటే చూస్తుంటే బోధపడుతున్నది కదా,
అద్దాల పెట్టె - అన్న మాట!
చంద్ర ;- ఔనౌను - ఇందాకనే బోధపడిందిలే బావా!
వాసంతి ;- చంద్రా, ఈ సూట్‌కేసులు, and ఈ cloths చూడు, నీకు నచ్చినవి చెప్పు.
చంద్ర ;- [మొహమాటపడుతూ] అక్కా! మాకు ట్రంకుపెట్టెలు, సరిపడేటన్ని ఓణీలు, పావడాలు, బట్టలు ఉన్నాయి. ఇంత ఖరీదైనవి మాకా, అబ్బే, మాకిప్పుడు ఇవన్నీ ఎందుకండీ!?, వద్దండీ,
వాసంతి ;- పిన్నికి ఇవ్వు, ఇన్నేళ్ళైనా మమ్మల్ని గుర్తుంచుకున్నారు,- అందుకని ......,
అంబాజయ్య ;- ఫర్వాలేదు, అమ్మణ్ణీలు మంచీ చెడూ తెలిసిన పిల్లలే! -
కాస్త వెనకా ముందూ ఆలోచించడం చేతనైనవాళ్ళే!
చంద్ర ;- మీరు చెప్పినట్లే మా అమ్మకు ఇస్తాను. మీ అభిమానం -
మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
సౌదా ;- ఎల్లుండి వంటల పోటీ - కి మనం ఏ రెసిపీ చేయాలి,
ఇల్లు చేరాక ప్లాన్ చేద్దాము వాసూ!
వాసంతి ;- ఇప్పటి నుండే మనం plan చెయ్యాలి, కిచెన్ - ఫుడ్స్ లిస్టు -
ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేయాలి, పద!
@@@@@@@@@
చంద్ర ;- ఇవాళ మీరు వంట చేస్తున్నారా? వంట మనిషి ఇంకా రాలేదా,
ఐతే నేను వంట చేస్తాను లెండి
వాసంతి ;- రేపు మహిళామండలి cooking compitetion ఉంది, అందుకని ఈ ప్రిపరేషన్స్ -
అంబాజయ్య ;- మీ వంటల సన్నాహం - చూడ ముచ్చటగా ఉంది అమ్మలూ
వాసంతి ;- సౌదా, సోపుతో ఈ వెజిటబుల్స్‌ని క్లీన్ చేద్దాం.
ఈశా బావ ;- టేబుల్ కాని టేబుల్ ఇజీక్వల్టు వెజిటేబుల్స్ ;
సౌదా ;- riddles, జోకులు నా!?, ఇదిగో, మేము చాలా బిజీగా, టెన్షన్‌తో ఉన్నాం, calmdown, be calm
ఈశా ;- నిజమేనండి, బి కాం - కాదండీ, సో - అయాం నౌ బి కామ్, అంటే -
మౌనమె నా భాష -
వెంకటాద్రి ;- మంచినీళ్ళు చాలు కదండీ, సబ్బుతో కడగడమేంటి?
చంద్ర ;- బావా, మామయ్యా, మీరు ఇంటి వెనక కరేపాకు చెట్లు ఉన్నాయి, కాస్త కోసుకురండి.
వెంకటాద్రి ;- అంటే, మనం వంటింటి ఛాయలకు రాకూడదు అని,
సరే చంద్రమ్మా! పెరటి తోటలోకి వెళుతున్నాము.
అంబాజయ్య ;- వాసంతమ్మా, మా చంద్ర బాగా వంట చేస్తుంది.
ఒక్క రోజైనా మా చంద్ర చేతి రుచి చూడండమ్మా!
సౌదామిని ;- మీకు మోడరన్ వంటలు తెలీవు. ఇప్పుడు ఫారిన్ ఐటమ్స్ వండి,
చూపిస్తేనే ప్రైజెస్ ఇస్తారు.
వాసంతి ;- టివి ఆన్ చేసాను, ఇదిగో - కొత్త ఫుడ్ - పేరు - డోక్వాంట్ - రెసిపీ బాగుంది,
స్టార్ట్, రెడీ -
సౌదామిని ;- కావల్సినవి నిన్ననే తెచ్చాను, కానీ త్రీ ఐటమ్స్ మార్కెట్‌లోనే లేవు.
వాసంతి ;- [కూనిరాగం తీస్తూ] మూడే కదా, ఫర్వాలేదోయ్ మామా, తతిమ్మా వాటితోనే చేద్దాం, ఫీల్ జోష్.
సౌదామిని ;- డెట్టాల్‌తో వాష్ చేసి ఉంచాను, ఇవిగో, నీ మ్యూజిక్‌తో ఇవాళ్టి కుకింగ్ - కంప్లీట్ ఔతున్నదిగా, పారా హుషార్! పారాహుషార్ -
వాసంతి ;- బౌల్స్ రెడీ, all are ready - మైక్రోఓవెన్ హీట్ ఎంత పెట్టాలో చూసి, చెప్పు సౌదా!
సౌదామిని ;- జింజర్, లవంగ మసాలా - మిక్సీలో వేసి, రుబ్బింగ్ -
అండ్ నాలుగింటిని - పన్నీర్, కర్డ్ - వేసి, మిక్స్ చెయ్యాలి.
చంద్ర ;- అక్కా! మేడ పైని గదిలో ఎయిర్‌కూలర్ సరిగా పనిచేయడం లేదని చెప్పారు కదా, మా బావ వెంకటాద్రి రిపేర్ పని నేర్చుకున్నాడు.
వాసంతి ;- good, ఐతే మీరు ఆ వర్క్ సంగతి చూడండి, సరేనా ...... ,
వెంకటాద్రి ;- ఇదిగోనండి కరేపాకు, కొత్తిమీర, ఉసిరికాయలు కూడా కోసుకొచ్చాను,
చెట్టు నిండా దండిగా ఉన్నాయి.
సౌదా ;- ఉసిరికాయలు - వాటిని ఏం చెయ్యాలి!?
వాసంతి ;- మా డాడీ కి, మమ్మీ కి చెట్లు అంటే ఇష్టం - జపాన్ వెళ్ళేటప్పుడు ఇక్కడ
ఏవేవో నాటారు. మన చెట్లకు ఇంత ఎక్కువ కాయలు ఉన్నాయని అనుకోలేదు,
టోక్యో నుండి కాల్స్ చేస్తున్నప్పుడు గార్డెన్‌ని కూడా వీడియో చూపించమని చెబుతారు.
మమ్మీ, డాడీ ఇద్దరికీ ఎంతో హాపీ happy
[ ఇంతలో వంటలక్క వచ్చింది ]
కుక్ ;- ఆలిస్సం ఐందమ్మా, ఎవరోమంత్రులు వెళ్తున్నారని, వాళ్ళ కార్లు -
డజన్లు డజన్లు - దాకా ఉన్నాయి, అవన్నీ వెళ్ళేదాకా - మిగతా వాళ్ళని వదల్లేదు.
చిటికెలో టిఫిన్లు, వంట పూర్తిచేసేస్తాను, సిటెం జరగండి.
సౌదామిని ;- మా వంట పూర్తయ్యింది.
కుక్ ;- ఏంటీ, మీరు కూడా వంటలు చేస్తున్నారా!?
వాసంతి ;- అంత సర్‌ప్రైజ్ ఎందుకు - hey, ముందు
ఆ తెరిచిన నోరు మూసుకుని, ఈ స్వీట్ టేస్ట్ చెప్పు
చంద్ర ;- అక్కా! పై గదిలో చల్లమిషను బాగా పనిచేస్తున్నది, మా బావ చేతి మహిమ.
వాసంతి ;- థాంక్యూ, వెంకీ - త్రీ మంత్స్ నుండీ చెబుతున్నా, ఆ షాప్ వాళ్ళు
'రేపు పంపిస్తున్నాం ' అంటారే గానీ, టెక్నిషియన్ [technician ] ని
ఇప్పటిదాకా పంపలేకపోయారు. thank God, రిపేర్ పూర్తి అయ్యింది,
మాకు గొప్ప రిలీఫ్ - మీరు కూడా ఈ స్వీట్ రుచి చెప్పండి
వెంకటాద్రి ;- [అంబాజయ్య చెవిలో] పాపం, ఈ వంటామె దొరికిపోయింది, 😃💩😆
ఓ గంట తర్వాత మళ్ళీ వద్దాం. [ఇటు తిరిగి ] - అక్కా! ఇంకా కొరవ మిగిలింది,
అక్కడ పై కప్పు ఫాన్ - కిరకిరా చప్పుడు చేస్తోంది, అది కూడా రిపేర్ చేసి వస్తాం, చిన్నాన్నా, మనం జంప్!
సౌదామిని ;- అహ్హా, మన కుకింగ్ సెక్షన్ కంప్లీట్ -
వాసంతి ;- సాల్ట్, మిర్చి మసాలా - జాగరీ, వంటసోడా - వెనిగరు, ఎసెన్స్, జల్లీ,
మాంగో పౌడర్ - డ్రింకింగ్ సోడా, కోకో - చాక్లెట్ పౌడర్ - ఎన్నెన్నో వేసాం -
సౌదామిని ;- కనుక మన వంట అదుర్స్, సో - చంద్రా, టేస్ట్ చెప్పు -
చంద్ర ;- [తప్పించుకోలేక, బెరుకుగా, తటపటాయిస్తూ]
ఈ పళ్ళెం ధగధగా మెరుస్తూ, బాగుంది
వాసంతి ;- మరి అవి చీనా, జపాన్, ఫ్రాన్స్ - ఫారిన్ ప్లేట్స్ - very valuables -
అందుకనే అందరికీ అవి నచ్చుతున్నాయి
చంద్ర ;- అక్కా, నువ్వు ఇచ్చిన ఫుడ్ చాలా బాగుంది,
కొంచెం ఉప్పు, కొంచెం కారం తగ్గాయి, అంతే,
సౌదామిని ;- అంతే కదా, తినేటప్పుడు ఎవరికి కావాల్సినవి వాళ్ళు వేసుకుంటారులే
చంద్ర ;- కొంచెం మెంతి పొడి వేస్తే ఇంకా బాగుంటుంది అక్కా!
వాసంతి ;- అదేం కాదు, అజనమోటో - మార్కెట్‌లో లేదు, అదొక్కటి వేసి ఉంటే
ఇంకా దిల్ పసందుగా ఉండేది
చంద్ర ;- అవేవో పోటీలకు అని చెబ్తున్నారు కదా,
అందుకని రుచీపచీ - తేడాలు చెప్పాల్సివచ్చింది, ఏమీ అనుకోకండి
సౌదామిని ;- కుక్కక్కా! ఇంకా నువ్వు టేస్ట్ ఎట్లాగ ఉందో - చెప్పలేదు.
కుక్ ;- నన్ను వంటావిడా - అని పిలిచినా ఫర్లేదు, ఇంగ్లీసు కుక్ నీ, తెలుగు అక్క నీ కలిపేసి ఆ మాదిరిగా పిలవకండి, ఇదిగోండి, తిని చెబ్తాను [భయం భయంగా]
దేవుడా, కాపాడు స్వామీ, నేను ఇవాళ క్షేమంగా ఇల్లు చేరగలనో లేదో -
వాసంతి ;- ఏదీ మరిచిపోకుండా అన్నీ కలిపేసాం, ఇక ఫ్రిజ్‌లో పెడ్తున్నాం.
ఎల్లుండి కాంప్‌టీషన్స్‌కి ఇవి రెడీ
కుక్ ;- [-తిని, వాంతి చేసుకుంది] అమ్మా నాకు ఒళ్ళు తిప్పుతున్నది. ఇంటికెళ్తున్నా,
సౌదామిని ;- మరి, సాయంత్రం వస్తావు కదా
వెంకటాద్రి ;- మళ్ళీ వచ్చే వారమో, పది పన్నెండు రోజులకో వస్తుంది లెండి 😉[ నవ్వుతూ]
వాసంతి ;- ఎల్లుండి దాకా అట్టిపెట్టి - వీటినే అక్కడ చూపిస్తున్నారా!?
డ్రైవర్ ;- [లోనికి వస్తూ] ఇవిగోనమ్మా, మీరు చెప్పిన గిఫ్ట్ బాక్సు తాలూకు సరంజామా - అట్టపెట్టెలు, తళుకు కాగితాలు, చెమ్కీలు, లేసులూ -
ఇంకా అదిగోండి వాటి తాలూకు బిల్లులు -
కుక్ ;- ఓ అన్నా, నన్ను ఆ సందు మలుపు కాడ దింపుతావా, అక్కడ సిటీబస్సు ఎక్కి వెళ్తా [సింకు దగ్గరకు వెళ్ళి, వాంతి చేసుకుని, మూతి తుడుచుకుంటూ వచ్చింది ]
driver ;- ఏంటమ్మా, కుక్ గారు భళుక్కున వాంతి చేసుకుంటునారు, కుక్ గారూ,
మీకు గానీ వేవిళ్ళు గట్రా వస్తున్నాయనుకుంటా
కుక్ ;- నీ బొంద, నీ దుంపతెగ, ఇంత వయసు దాన్ని, వాంతులకూ,
వేవిళ్ళకూ తేడా తెలీకుండా ఉన్నావా!!?
డ్రైవర్ ;- అయ్యయ్యో, అట్లాగ తప్పడుతున్నావేంటమ్మా,
నా పెళ్ళానికి నెల తప్పగానే - మూణ్ణెల్ల దాకా ఇట్లాంటి భళుక్కులే,
కుక్ ;- ముందు ఇక్కణ్ణుంచి వెళ్తావా లేదా, చీపురు 😀తెస్తున్నా, నిలు నిలు
డ్రైవర్ ;- అమ్మబాబోయ్ [ run]
@@@@@@@@@
వాసంతి ;- పోటీలకు రెండు వంటలు ఇవ్వొచ్చునట, నాకు తెలీక, ఒక్కటే తెచ్చాను, మంచి ఛాన్స్ మిస్ ఔతున్నాం
సౌదామిమి ;- చంద్ర కారియర్ తెచ్చుకుంది, if here లేట్ ఐతే ఇక్కడ బైట
చెట్ల కింద కూర్చొని తినటానికట [ఎగతాళిగా నవ్వింది ]
వాసంతి ;- thank God, ఏది చంద్రా, ఇటివ్వు
చంద్ర ;- ఇదిగోనండి కారేజీ. కానీ అక్కా, ఇవి మా పల్లె రుచులు కదా
[తటపటాయిస్తూ] మన ఇంటి ఉసిరిక్కాయలు - నెల్లికాయల పచ్చడి -
కారం - మీకు సయిస్తుందో లేదో ...... ,
సౌదామిని ;- ఏదో ఒకటి, అవసరానికి సేవ్ చేస్తాయిలే,
ఇక్కడ పోటీలకి ఇవ్వాలి, సరేనా!!ఇవ్వు చంద్రా!
[తీసుకుని, లోపలికి వెళ్ళారు ఇద్దరూ ]
వెంకటాద్రి ;- మనం మేడ మీద నుండి చూడొచ్చట,
అక్కడ బాల్కనీ ఉంది, చూసొచ్చాను, పదండి!
అంబాజయ్య ;- మన చంద్రమ్మ చేతివంటలు కూడా
పట్టణం పోటీలలో నిలబడుతున్నాయి, భలేగా ఉన్నది.
వాసంతి ;- మధ్యాహ్నం ఔతున్నది. హమ్మయ్య, ఎనౌన్స్ చేస్తున్నారు.
- [ మేనేజర్ & ప్రోగ్రామ్ guest ప్రవేశం - on the stage]
అంబికాదేవి ;- నా పేరు అంబికాదేవి, ఈ ఆర్గనైజేషన్ వారు ఆప్యాయతగా -
చీఫ్ గెస్ట్‌గా నన్ను ఆహ్వానించారు. అందువలన
ఆస్ట్రేలియా నుండి, ఇంతదూరం - వచ్చాను, వారికి నా కృతజ్ఞతలు.
అంబాజయ్య ;- అంత దూరం నుండి ఇంత చిన్న పని కోసం, లక్షలు లక్షలు విమానం ఛార్జీలు పెట్టుకుని వచ్చారా!?
వెంకటాద్రి ;- కొన్నిసార్లు డబ్బు కన్నా "గౌరవం విలువ" 💃 ఎక్కువ బాబాయ్,
ఈశా [బావ] ;- నాకూ స్టేజీ మీద అంత మన్నింపు ఇచ్చేవాళ్ళుంటే నేను కూడా ఎగిరిగంతేసి వెళ్ళిపోతా, ఆ!
అంబిక ;- [మైకును ఊది, సరిచూసి] - ప్రస్తుతం I live in ఆస్ట్రేలియా.
మన ఇండియా ఫుడ్ - ఆస్ట్రేలియాలోను పాప్యులర్ ఔతున్నాయి, అంతేకాదు -
యూరోప్, అమెరికా, కెనడా - ఇతరదేశాల్లో సైతం ప్రజలు ఇష్టపడుతున్నారు.
అక్కడ కొన్ని ఫంక్షస్, పార్టీలలో నేను జడ్జ్‌గా వ్యవహరించాను.
ఇవాళ ఇక్కడ ఈ అవకాశం లభించడం నా అదృష్టం.
సౌదామిని ;- [గుసగుసలాడుతూ] వాసంతీ, ఈమె సొంతడబ్బా వాయించుకోవడానికి
హాఫ్ఎనవర్ పట్టింది. మనం ఇక్కడ సస్పెన్స్‌తో, ఉగ్గబట్టుకుని కూర్చున్నామని
ఎవరైనా గుర్తుకుచేస్తే బావుణ్ణు.
అంబిక ;- ఈ ఆర్గనైజేషన్ వారు - ఇచ్చిన కవర్లు - తెరిచి, మీకు వినిపిస్తాను.
వెంకటాద్రి ;- అంటే, అసలు నిర్ణయం ఈమె స్వంతం కాదన్నమాట.
అంబాజయ్య ;- మరే, మా ఆముదాలవలస 💃💁వాళ్ళే నయం,
అతిథిగా పిలిచి, "మీరు తీర్పు చెప్పండి" - అని చెబ్తారు.
వెంకటాద్రి ;- ఆ, మన ఊళ్ళల్లో - అతిథి గారికి ఆ మాత్రం స్వేచ్ఛ ఇస్తున్నారు,
మనమే నయం. [మ్యూజిక్...... ] - & ;-
వాసంతి గారు తెచ్చిన ఫుడ్స్ రెండు - వాటిలో B ఐటమ్ కి థర్డ్ ప్రైజ్ - పొందింది.
సౌదామిని ;- మనం 10 days నుండీ కష్టపడి, చేసినది వెనక్కి పోయిందా, హు -
వాసంతి ;- గాడ్ సేవ్స్ అస్ - చంద్ర తెచ్చుకున్న కారేజీ - మన పరువును కాపాడింది.
@@@@@@@@@ ;
వెంకటాద్రి ;- మూడువారాలనుండి మీ ఇంట్లో ఉన్నాము,
మీరు మమ్మల్ని మీ ఇంటి మనుషుల మాదిరి చూసుకున్నారు.
అంబాజయ్య ;- ఈ ఊళ్ళో మేము వచ్చిన పని పూర్తి అయ్యింది.
మీ కరుణ మాకు శ్రీరామరక్ష - మా పనులు బేగ పూర్తి ఐనందుకు ఆనందంగా ఉందమ్మా!
వాసంతి ;- మీరు రావడం వలన మాకు టైమే తెలీలేదు.
డైలీ రొటీన్ లైఫ్‌లోని మొనాటనీ తగ్గింది. మా మనసులు, ఫీలింగ్స్ రెఫ్రెష్ ఐనాయి.
చంద్ర ;- ఎక్కువ రోజులు ఉండేటట్లుగా - మా ఊరు రండి అక్కా!
సౌదామిని ;- ష్యూర్, we will come, మార్నింగ్ ఫోన్ చేసాను ఆంటీకి, అదే - మీ మదర్, ఫామిలీ మెంబర్స్‌కీ నా హాయ్ చెప్పు చంద్రా! -
వాసంతి ;- కొత్త వంటలు మాకు నేర్పించాలి. టీచర్ పోస్ట్ నీకే చంద్రా!
[అందరూ నవ్వుతున్నారు ]
@@@@@@@@@
[ పాత్రలు ;- సౌదామిని ;; వాసంతి - & జపాన్ లో ఉన్న వాసంతి యొక్క parents & చంద్ర, బావ ఈశా, బంధువులు - ఆముదాలవలస అంబాజయ్య, వెంకటాద్రి - & ప్రోగ్రామ్ guest = ఆస్ట్రేలియా-అంబికాదేవి - & వంటావిడ, Driver of వాసంతి ;
& బాలల నాటికలు ;- పిల్లలకోసం నాటకములు, డ్రామాలు ;
 |
Drama - kusuma - 3 |
;
=============================== ,
paLLu kAni paLLu ;- [katha = story ] ;-
wAsamti ;- hallO, saudaa! `what r u doing?`
saudAmini ;- ippuDE nidra lEcaanu, imkaa Ten o klaak kUDA awalEdu, Emm,
iwALa imta early gaa lEcAwu!?
wAsamti ;- maa kajin sisTars - wilEj numDi wastunnaaru. sTEshan^keLLi riseew cEsukumdaam, twaragaa rA! camdra - pakkaa `village girl` - manaku ee week amtA BalE mamci kAlakshEpam.
saudAmini ;- amta palleTUri gammaarlaa, aitE manaku mamci `Time pass` - waccEstunnaa, nO snaanam, semT sprE [ `spray`]cEsukuni waccEstunnaa.
@@@@@@@@@
[ railwE sTEshan [`railway station`] - camdra & bAwa ISA & bamdhuwu ambAjayya, wemkaTAdri - bOgI numDi digaaru ] ;
wAsamti ;- camdrA! nee lagEj Edi, hEy, pOrTar, `come here`
camdra ;- waddamDI, ee samcee, TramkupeTTe - pedda baruwu kaadu, nEnE teccukumTAnu.
pOrTar [`porter`] ;- ee ammaayilaamTOLLu naluguru paasimjarlu umTE caalu, maabOTi wALLaku pastulE!
saudAmini ;- ee baaksuni TramkupeTTe - ani pilustaaraa!? weree phannee, camdragiri myuujiyam^lO peTTawaccu.
wAsamti ;- neeku mumdE ceppaanugA, appuDEnaa, imkaa cuustumDu - ........ , camdrA! wATini nuwwu bhujam meeda peTTukuni wastE - nuwwu kUDA O kuulee anukuni, 'aa lagEjii paTTukuni raammA' ani ninnu pilustaaru. saudaaminI! idi manaku presTEj ishyuu kadA!
saudAmini ;- yaa, aununu - Draiwar! [`driver`]
wAsamti ;- Draiwar, pOrTar wembaDE rA!
Draiwar ;- aTlaagE mEDamm!
saudaa ;- mana wilEj brUT - saaree, wilEj byuuTI - ee janam madhyalO tappipOkumDA - cuuDu.
`driver` ;- sarEnamDI saudaaminI mEDamm gArU!
saudaamini ;- wIDi maaTalu komcem wamkaragaa umTAyi - wIDitO kaasta jaagrattagA umDAli ..
@@@@@@@@@
padamu - padaardhamu [=`not food :) 🍒🍒
[waasamti, camdra - `All came home]`
wAsamti ;- camdrA, jyuus taagi, meels tinu.
camdra ;- annam kamTE roTTelu ekkuwa unnaayE,
wAsamti ;- baalansuD DayaT, baaDIki mamcidi. [`balanced diet for body`]
saudaamini ;- nuwwu slim 👀 gaa umDAlmTE, ii Taip aaph phuD tinaali, camdrA!
camdra ;- nEnu sannagaanE unnaanu kadaa, imtakamTE sannam aitE - puucika pulla maadirigaa unnaawani, maa wALLu gEli cEstaaru.
wAsamti ;- aa bauls^lO unnawi - ais^krImm, salADs - nemmadigaa tinu.
camdra ;- annee mettaTiwE kanabaDutunnAyi! -
waasamti ;- camdrA! manam shaapimg^ki weLtunnaam. neeku suuT^kEsulu, breeph^kEsulu - imkaa neekEwainaa naccinawee komdaam, OkEnA!!?
Draiwar ;- mEDams mamciwALLE, ee kotta pilla kOsam inninni komTunnaaru.
camdra ;- kEsulu - amTunnaaru - naaku caalaa bhayam wEstunnadi. maa uuri laccimdEwamma - atta maamala miida kEsulu peTTimdi, kOrTula cuTTU tirugutuunE unnadi. ELLu gaDicinaa - teerpu raalEdu, kEsulu oka kolikki raanElEdamDI ..... ,
waasamti ;- saudaa, `Today's jokes` hamaaraa phannee - [ghalluna nawwulu ] ;
[aamudaalawalasa ambaajayya yokka dharma samdEhaalu ] ;-
ambaajayya ;- ammaNNI, saudaa - mee pEru amtEnaa?
waasamti ;- puurti pEru saudaamini - 🪷
wemkaTAdri ;- saudaamini - mee pEru caalaa baagumdamDI!
ambaajayya ;- aitE ammalU! imta cakkani pEruki cakkani
ardham Edainaa umDE umTumdi kadA!
saudA ;- amTE `meaning` ...... ? uu...... EmO mari!?
wemkaTAdri ;- maa naanee ammaki phOn cEsi aDugutaanu, umDamDi -
waasamti ;- O, naanee, taataajee -meeku kUDA caalaa `close friends` annamATa, `very nice`.
saudaamini ;- naanee, `who is HE? or who is SHE`?
ambaajayya ;- naanee, taatayya pamtulugaaru - mamcee ceDU ceppaDAniki,
anniTkI maaku pedda dikku. ☝😐😎
kakkAmA ;- ammaluu, baagunnaaraa 🙋 ,
mottaaniki nannu karakkaaya maasTAru - ani sthiram cEsEsAru.
[*karakkaaya maasTAru* -> *kakkaamaa ]
camdra ;- aunamDI, aa aalumagalu - "meeru maaku talalO nAlika lAmTiwALLu" ani meccukumTumTAru.
camdra ;- naanee amma, taatagaaru - meeku wiwaram cebutaaramTa, idigOMDi - phOnu
[= phone - cEtiki iccimdi] ;
waasamti ;- guD^mArnimg, SuBOdaya palakarimpulu, naaneejee! karakkaaya maasTAru unnaarA!?
naanee ;- ubhayakuSalOpari waasamtii! E dharmasamdEham kaligimdO meeku,
ikkaDE unnaaru, mobillu istunnaanu - idigOMDi, phOnu - amdukOMDi
waasamti ;- naaneemA! taataajee,- maa `friend` pEru saudaamini,
tana `name` ki ardham bOdhapaDaDam lEdamDI,
ana pEruki `meaning` telusukOwaalani ubalATapaDtunnadi, meerE maa samdEhaalanu niwRtti cEyaali - meeku telusu kadaa - ani,
maa DauT^[doubt]😇ni saalw [solve] cEyamDi, plIj! 👈[please]!
waasamti ;- naanee, mEmu camdra wALLanu kUDA tIsukeLtunnAmu, taataajee, ika umTAmamDI, shaapimg mETars - neksT wIk meeku cebutaamu.
ka.maa. ;- aTlAgE ammAyI! annee puusaguccinaTlu ceppaali, sarEnA!!
saudaamini ;- puusa - `u mean - BEEDS` -
EmiTO, I telguu sariggaa ardham kaadu👄👃💢...... ...... hhuu ...... ,
waasamti ;- Oke, bai graamD pA! good bye naaneemaa!
@@@@@@@@@
camdra ;- mee mahaapaTTaNamlO weedhi deepaala modalkoni, koTlu, peLLiLLa
mamDapaalu, samastam - inni laiTlu[`lights`] - kaLLu jigEl^manElaa .......,
saudaa ;- waasamtI! lOpaliki aDugu peTTE lOgAnE, ikkaDE mUrCa pOyETaTlumdi.
[ iddaruu pakapakaa nawwutuu naDustunnaaru -
Driver, wemkaTAdri, ambaajayya - amtaa gamanistuu, anusaristunnaaru ]
camdra ;- peTTela amgaDi bommalu BalEgA unnaayi. naaku kUDA amta baagaa ceera kaTTukOwaDam cEtakaadu.
waasamti ;- shOkEsu*lO bommalu cuustunnaawaa, = [ * show case ] ;
camdra ;- ikkaDa annee kEsulE winipistunnaayE! monna breephu, sUTukEsu - ----
idEmO shOkEsu[`show case`] - adee idee - naakaitE aa kEsu annE mATa wimTEnE bhayamautunnadi ......,
wemkaTaadri ;- `show case` amTE cuustumTE bOdhapaDutunnadi kadaa,
addaala peTTe - anna mATa!
camdra ;- aunaunu - imdaakanE bOdhapaDimdilE baawA!
waasamti ;- camdraa, ee suuT^kEsulu, `and` ee `cloths` cuuDu, neeku naccinawi ceppu.
camdra ;- [mohamaaTapaDutU] akkA! maaku TramkupeTTelu unnaayi. imta khareedainawi maakaa, ;- abbE, maakippuDu iwannee emdukamDI!?
waasamti ;- pinniki kUDA iwwu, innELLainaa mammalni gurtumcukunnaaru, - amdukani ......,
ambaajayya ;- pharwaalEdu, ammaNNIlu mamcee ceDU telisina pillalE! -
kaasta wenakaa mumduu aalOcimcaDam cEtanainawALLE!
camdra ;- meeru ceppinaTlE maa ammaku istaanu. mee abhimaanam -
mammalni ukkiribikkiri cEstunnadi.
saudaa ;- ellumDi wamTala pOTI - ki manam E resipee cEyaali, illu cEraaka plaan cEddaamu waasuu!
wAsamti ;- ippaTi numDE manam `plan` ceyyaali, kicen [kitchen]`- phuDs [foods list lisTu
[food's list] - imTar^neT^lO serc [search] cEyaali, pada!
@@@@@@@@@
camdra ;- iwALa meeru wamTa cEstunnaaraa? wamTa manishi imkaa raalEdaa,
aitE nEnu wamTa cEstaanu lemDi
wAsamti ;- rEpu mahiLAmamDali `cooking compitetion` umdi, amdukani ee priparEshans -
ambaajayya ;- mee wamTala sannaaham - cUDa muccaTagA umdi ammaluu
wAsamti ;- saudaa, sOpu[soap] tO ee vejiTabuls^[ vegetables] ∞🥜 ni kleen [clean] cEddaam.
ISA baawa ;- TEbul kaani TEbul ijeekwalTu vejiTEbuls ;
saudaa ;- `riddles`, jOkulu naa!?, idigO, mEmu caalaa bijeegaa, Tenshan^tO unnaam, `calmdown, be calm`
ISA ;- nijamEnamDi, bi kaam - kaadamDI, sO - ayaam nau bi kaalm, amTE - mauname naa bhaasha -
wemkaTAdri ;- mamcinILLu caalu kadamDI, sabbutO kaDagaDamEmTi?
camdra ;- baawaa, maamayyaa, meeru imTi wenaka karEpaaku ceTlu unnaayi, kaasta kOsukuramDi.
wemkaTAdri ;- amTE, manam wamTimTi CAyalaku raakUDadu ani, sarE camdrammA! peraTi tOTalOki weLutunnaamu.
ambAjayya ;- waasamtammaa, maa camdra baagaa wamTa cEstumdi. okka rOjainaa maa camdra cEti ruci cUDamDammA!
saudAmini ;- meeku mOdaran wamTalu teleewu. ippuDu phaarin aiTamm s wamDi, cuupistEnE praijes[`prizes`] istaaru.
wAsamti ;- TV aan cEsaanu, idigO - kotta phuD - pEru - DOkwaanT - resipee baagumdi, sTArT, reDI -
saudAmini ;- kaawalsinawi ninnanE teccaanu, kaanee tree aiTamm s maarkeT^lOnE lEwu.
wAsamti ;- [kuuniraagam teestuu] mUDE kadaa, pharwaalEdOy maamaa, tatimmaa wATitOnE cEddAm, pheel[feel] jOsh.
saudAmini ;- DeTTAl [dettol] ^tO waash cEsi umcaanu, iwigO, nee myuujik [music] ^tO iwALTi kukimg - kampleeT [complete] autunnadigaa, paaraa hushaar! paaraahushaar -
wAsamti ;- bauls reDI, [bowls ready] `all are ready` - maikrOOwen heeT[micro oven - heat] emta peTTAlO cuusi, ceppu saudA!
saudAmini ;- jimjar [`ginger`], lawamga masaalaa - mikseelO wEsi, rubbimg - amD naalugimTini - panneer, karD - wEsi, miks ceyyaali.
camdra ;- akkA! mEDa paini gadilO eyir^kuular [air cooler] - sarigaa panicEyaDam lEdani ceppaaru kadaa, maa baawa wemkaTAdri ripEr pani nErcukunnADu.
wAsamti ;- `good`, aitE meeru aa wark samgati cUDamDi, sarEnA ...... ,
wekaTAdri ;- idigOnamDi karEpaaku, kottimeera, usirikaayalu kUDA kOsukoccaanu,
ceTTu nimDA damDigA unnaayi.
saudaa ;- usirikaayalu - wATini Em ceyyaali!?
waasamti ;- maa DaaDii ki ceTlu amTE ishTam - mana ceTlaku imta ekkuwa kaayalu unnaayani anukOlEdu,- Japan weLLETappuDu ikkaDa - EwEwO nATAru. TOkyO numDi kaals cEstunnappuDu gaarDen^ni kUDA weeDiyO cuupimcamani cebutaaru. mammee, DADI iddarikee emtO hApI Happy Happy - ! '∞🥜
@@@@@@@@@
[ imtalO wamTalakka waccimdi ] 🍒🍒
kuk ;- aalissam aimdammA, ewarO mamtrulu weLtunnaarani, wALLa kaarlu Dajanu dozenlu daakaa unnaayi, annee weLLEdaakaa - migataa wALLani wadallEdu. ciTikelO Tiphinlu, wamTa pUrticEsEstAnu, siTem jaragamDi.
saudAmini ;- maa wamTa puurtayyimdi.
kuk ;- EmTI, meeru kUDA wamTalu cEstunnArA!?
wAsamti ;- amta sar^praij emduku - mumdu aa tericina nOru muusukuni, ee sweeT TEsT ceppu
camdra ;- akkA! pai gadilO callamishanu baagaa panicEstunnadi, maa baawa cEti mahima.
waasamti ;- thaamkyuu, wemkee - tree mamts numDI cebutunnaa, aa shaap wALLu 'rEpu pampistunnaam ' amTArE gaanee, టెక్నిషియన్ [`technician`] ni ippaTidaakaa pampalEkapOyaaru. ripEr puurti ayyimdi, maaku goppa rileeph [`relief`]- meeru kUDA ee sweeT ruci ceppamDi ∞ 🥜
wemkaTAdri ;- [ambaajayya cewilO] paapam, wamTaame dorikipOyimdi, ∞ 🥜 O gamTa tarwaata maLLI waddaam. [iTu tirigi ] - akkA! imkaa korawa migilimdi, akkaDa pai kappu phaan - kirakiraa cappuDu cEstOmdi, adi kUDA ripEr cEsi wastaam, cinnaannA, manam jamp! jump!
saudAmini ;- ahhA, mana kukimg sekshan kampleeT - [cooking section complete]
waasamti ;- saalT, mirci masaalaa - jaagaree, wamTasODA - wenega, esens, jallee, maamgO pouDar - Drinkimg sODA, kOkO - caakleT pauDar - ennennO wEsAm -
saudAmini ;- kanuka mana wamTa adurs, sO - camdraa, TEsT ceppu -
camdra ;- paLLem dhagadhagaa merustuu, baagumdi
wAsamti ;- mari awi ceenaa, japaan, phraans[ France] - phaarin plETs[Foriegn Plates]
- `very valuables` amdukanE amdarikee awi naccutunnaayi
camdra ;- akkaa, nuwwu iccina phuD caalaa baagumdi, komcem uppu, komcem kaaram taggaayi, amtE,
saudAmini ;- amtE kadaa, tinETappuDu ewariki kaawaalsinawi wALLu wEsukumTaarulE
camdra ;- komcem memti poDi wEstE imkaa baagumTumdi akkA!
wAsamti ;- adEM kaadu, ajanamOTO - maarkeT^lO lEdu, adokkaTi wEsi umTE imkaa dil pasamdugaa umDEdi
camdra ;- awEwO pOTeelaku ani cebtunnAru kadA, amdukani ruceepacee - tEDAlu ceppaalsiwaccimdi, Emee anukOkamDi
saudAmini ;- kukkakkA! imkaa nuwwu TEsT eTlaaga umdO - ceppalEdu.
cook ;- nannu wamTAwiDA - ani pilicinaa pharlEdu, imgleesu kuk nee, telugu akka nee kalipEsi aa maadirigaa pilawakamDi, idigOMDi, tini cebtaanu [bhayam bhayamgaa] dEwuDA, kaapADu swaamee, nEnu iwALa kshEmamgaa illu cEragalanO lEdO - \\\\\\\\\
wAsamti ;- Edee maricipOkumDA annee kalipEsaam, ika phrij^lO peDtunnaam. ellumDi kaamp^TIshans^ki iwi reDI
kuk ;- [tini, waamti cEsukumdi] ammaa naaku oLLu tipputunnadi. imTikeLtunnaa,
saudAmini ;- mari, saayamtram wastaawu kadaa
wemkamTAdri ;- maLLI waccE waaramO, padi pannemDu rOjulakO wastumdi lemDi [ nawwutuu]
wAsamti ;- ellumDi daakaa aTTipeTTi - weeTinE akkaDa cuupistunnaarA!?
Driver ;- [lOniki wastuu] iwigOnammaa, meeru ceppina giphT baaksu taaluuku saramjaamaa - aTTapeTTelu, taLuku kaagitaalu, cemm keelu, lEsuluu - imkaa adigOMDi waaTi taaluuku billulu -
kuk ;- O annaa, nannu aa samdu malupu kaaDa dimputaawaa, akkaDa siTIbassu ekki weLtaa [ simku daggaraku weLLi, waamti cEsukuni, muuti tuDucukumTU waccimdi ]
`driver` ;- EiTammA, kuk gaaru bhaLukkuna waamti cEsukumTunaaru, kuk gaaruu, meeku gaanee wEwiLLu gaTrA wastunnaayanukumTA
kuk ;- nee bomda, nee dumpatega, imta wayasu daanni, waamtulakuu, wEwiLLakuu tEDA teleekumDA unnAwA!!?
Draiwar ;- ayyayyO, aTlaaga tappaDutunnaawEMTammaa, naa peLLAniki nela tappagaanE - mUNNella daakaa iTlAmTi bhaLukkulE,
kuk ;- mumdu ikkaNNumci weLtaawaa lEdaa, ceepuru testunnaa, nilu nilu
Draiwar ;- ammabaabOy [ `run`] !!!!!!!!!!! !!!!!!!!!!!!!!!!!!!!!!
@@@@@@@@@
wAsamti ;- pOTIlaku remDu wamTalu iwwoccunaTa, naaku teleeka, okkaTE teccaanu, mamci CAns mis [ chance miss] autunnaam
saudaamimi ;- camdra kaariyar teccukumdi, if here lET [`late`] aitE ikkaDa baiTa ceTla kimda kurcuni tinaTAnikaTa [egatALigaa nawwimdi ]
waasamti ;- `thank God`, Edi camdraa, iTiwwu
camdra ;- idigOnamDi kaarEjee. kaanee akkaa, iwi maa palle ruculu kadaa,
[taTapaTAyistU] mana imTi usirikkaayalu - nellikaayala paccaDi - kaaram - meeku sayistumdO lEdO ...... ,
saudaamini ;- EdO okaTi, awasaraaniki sEw [ save ]cEstaayilE,
ikkaDa pOTIlaki iwwaali, sarEnA!! iwwu camdraa [teesukuni, lOpaliki weLLAru iddaruu ]
wemkaTAdri ;- manam mEDa meeda numDi cuuDoccaTa, akkaDa baalkanee umdi, cuusoccaanu, padamDi -
ambAjayya ;- mana camdramma cEtiwamTalu kUDA paTTaNam pOTIlalO nilabaDutunnaayi, BalEgA unnadi. 👦💃💥
waasamti ;- madhyaahnam autunnadi. hammayya, enauns [`anounce`]cEstunnaaru.
mEnEjar & prOgraamm `guest` ambikAdEwi - prawESam - `on the stage ]
ambikaadEwi ;- naa pEru ambikaadEwi, ee aarganaijEshan [organisation] waaru aapyaayatagaa - nannu aahwaanimcaaru. amduwalana -
aasTrEliyaa numDi, imtaduuram - waccaanu, waariki naa kRtajnatalu. .
ambaajayya ;- amta duuram numDi imta cinna pani kOsam, lakshalu lakshalu wimaanam CArjeelu [charge] peTTukuni waccaarA!?
wemkaTAdri ;- konnisaarlu Dabbu kannaa "gaurawam wiluwa" ekkuwa baabaay, naakuu sTEjee meeda amta mannimpu iccEwALLumTE nEnu kUDA egirigamtEsi weLLipOtA, aa!
ambika ;- [maiku [= mike] nu uudi, saricuusi] - mana imDiyaa phuD [`India Food] - Australia` lOnu paapyular atunnaayi, amtEkaadu - yuurOp, amerikaa, kenaDA - itaradESAllO saitam prajalu ishTapaDutunnaaru. akkaDa konni phamkshas, paarTIlalO nEnu jaDj^gaa wyawaharimcaanu. iwALa ikkaDa ee awakASam labhimcaDam naa adRshTam.
saudaamini ;- [gusagusalaaDutuu] waasamtii, eeme somtaDabbaa waayimcukOwaDAniki haaph^en&awar paTTimdi. manam ikkaDa saspens^tO, uggabaTTukuni kuurcunnaamani ewarainaa gurtukucEstE baawuNNu.
ambika ;- ee aarganaijEshan waaru iccina kawarlu - terici, meeku winipistaanu.
wemkaTAdri ;- amTE, asalu nirNayam eeme swamtam kaadannamATa.
ambaajayya ;- marE, maa aamudaalawalasa wALLE nayam, atithigaa pilici, "meeru teerpu ceppamDi" - ani cebtaaru.
wemkaTAdri ;- aa, mana ULLallO - atithi gaariki aa maatram swEcCa istunnaaru, manamE nayam.
[mujik = music ...... ] - & ;- waasamti gaaru teccina phuDs remDu -
waaTilO `B` *aitamm ki `third prize - ` pomdimdi.
saudaamini ;- manam 10 `days` numDI kashTapaDi, cEsinadi wenakki pOyimdaa, hu -
waasamti ;- gAD sEws `us` - camdra teccukunna kaarEjii - mana paruwunu kaapADimdi!!
@@@@@@@@@
wemkaTAdri ;- muuDuwaaraalanumDi mee imTlO unnaamu, meeru mammalni mee imTi manushula maadiri cuusukunnaaru.
ambaajayya ;- ee uuLLO mEmu waccina pani puurti ayyimdi. mee karuNa maaku Sreeraamaraksha - maa panulu bEga puurti ainamduku aanamdamgaa umdammA!
wAsamti ;- meeru raawaDam walana maaku TaimE teleelEdu. Dailee roTIn laiph^lOni monaaTanee taggimdi. maa manasulu, pheelimgs rephresh ainaayi.
camdra ;- ekkuwa rOjulu umDETaTlugaa - maa uuru ramDi akkA!
saudaamini ;- shyuur, `we will come`, maarnimg phOn cEsaanu AMTIki,
adE - mee madar, phaamilee membars^kee naa haay ceppu camdrA! -
wAsamti ;- kotta wamTalu maaku nErpimcaali. TIcar pOsT neekE camdrA! [amdaruu nawwutunnaaru ]
@@@@@@@@@
camdra - bAwa "ISA" & bamdhuwulu = AmudAlawalasa ambAjayya, wemkaTAdri -
&`driver, [porter] ;` - - manager & program chief guest` AsTrEliyA ambikAdEwi ]
१ = 1 ;; २ = 2 ;; ३ = 3 ; - ४ = 4 ;; ५ = 5 ;; ६ = 6 ;; ७ = 7 ;; ८ = 8 ;; ९ = 9 ;; १० = 10 ;;
వంటల పోటీ - నాటకం = 3 ; కథ - 62 ; &
పాత్రలు ;- సౌదామిని ;; వాసంతి - & జపాన్ లో ఉన్న వాసంతి యొక్క parents ;
& చంద్ర - బావ "ఈశా" & బంధువులు = ఆముదాలవలస అంబాజయ్య, వెంకటాద్రి -
driver - [porter] ;
బాలల నాటికలు ;- పిల్లలకోసం నాటకములు, డ్రామాలు ;
baalala naaTikalu ;- pillalakOsam naaTakamulu, Draamaalu ;-