13, అక్టోబర్ 2023, శుక్రవారం

జడల కోలాటం, కోలాహలం

గంటలు అంటే బెల్స్(bells) కదా!? అవి మన ఇంట్లోనే ఉన్నాయా, 

ఏవి? ఎక్కడ? చూపించు ఆమ్మా!!"

భారతరాజధాని నుండి చెల్లెళ్ళు ఇద్దరు, 

తమ తమ సంసారములతో వచ్చారు. 

వారి పిల్లలు సుషుమ్న, సభిక్, ధావళ్య, 

                ఆజ్ఞేష్, పుడమి, కల్హార, సుత్రామ్ లు. 

హిందీ, ఇంగ్లీష్ లను నాలికపై రంగరించి  -

నాకించినట్లున్నారు జన్మదాతలు, 

బొత్తిగా మాతృభాషను మరిచిపోయారు. 

అచ్చతెలుగు పదాలను - నేర్పాల్సిన బాధ్యత - 

ఆమ్మ అని పిలువబడుతూన్న 

దొడ్డమ్మ అండ్ కో భుజస్కంధాలపైన ఉంచుకున్నారు.

'ఈ ఆర్భాటం, ఎందులకీ మోత బరువు బాబు!" 

అని వీరికి అనిపించడం లేదు. 

ఈ నూతన బంధు ఆగంతకుల బృందానికి బోధించేటప్పుడు 

అందరికీ కొత్త వాతావరణం వినోదభరితం ఔతూన్నది.

"అమ్మా! సుషుమ్న - కుంకమ్మ - అంటే ఏమిటో తెలుసా?" 

"ఊహు! నువ్వే చెప్పు!" డిక్షనరీ ప్రకారం - '

కుంకుమ అంటే కుంకమ్మ ' అన్నమాట."

తమ పిల్లలు, ఊళ్ళోని తమ స్నేహితులతో కలిసి, 

'ఈ ఢిల్లీవాసులను ఎగతాళి చేస్తున్నారు ' అని ఆమ్మకు అర్ధమైంది.

"తప్పు! అట్లాగ హేళన చేయొచ్చునా!?" కోప్పడింది.

"అబ్బే మేమేమీ ఎగతాళి చేయట్లేదమ్మా! 

ఊరికనే ఆట పట్టిస్తున్నాము, అంతే!" 

సుషుమ్న బృందాన్ని చనువుగా పిలుస్తూ, 

తమ బృందంలోకి చేర్చేసుకున్నారు. 

వాళ్ళందరూ తాము ఎరిగిన క్రీడలు, కోతీకొమ్మచ్చి, 

నేలబండ, గిల్లీదండ, కప్పగంతులు లాంటి ఆటల్ని బిడ్డలకు నేర్పారు. 

అదే  స్పీడుతో క్రికెట్, హాకీ, ఫుట్ బాల్ వంటి క్రీడల్ని నేర్చుకున్నారు.

"పెన్నాన్నా!" పిల్లల పిలుపు, వాళ్ళ సంబోధనలో - 

పెదనాన్న కాస్తా - పెన్నాన్నగా పరిణామం చెందింది.  

ట్రంకుపెట్టె*ను గాలిస్తున్నారు. 

[ట్రంకుపెట్టె* = * Trunk box ] 

బొత్తిగా భయమనే ఊసే లేదు కదా! 

అటక మీది నుండి అంత పెద్ద ట్రంకుపెట్టెని దించేసారు. 

ఈ వానరమూకకే అది సుసాధ్యమైంది.

"దేవుళ్ళాడుతున్నారు?" మొదటి వాస్కోడిగామా క్వశ్చన్. 

"ఇదేంటి పెన్నాన్నా! ఇందులో ఉన్నవాళ్ళెవరు?" "అసలు ఇదేంటి?" 

"ఆ మాత్రం తెలీదా? దాన్ని ఫొటో అంటారు, మొహమా!"

పెద్దవాళ్ళు బూతుల్ని నిషేధించినారు, కాబట్టి ...... ,

కొత్తరకం "సంబోధనల" ను - సుత్తి వీరభద్రరావు -టైపులో 

కనిపెట్టేస్తున్నారు పిల్లకాయలు. 

ద్వితీయ వాస్కోడిగామా కెలుకుడు ప్రశ్నార్ధకముతో పెన్నాన్న 

వాళ్ళ  చేతుల్లోని దీర్ఘచతురశ్రముగా ఉన్న శాల్తీని 

తన హస్తకమలములలోకి తీసుకున్నాడు.

అప్పటికే భర్త వెనకాల వచ్చి నిలబడి ఉన్నది ఆమ్మ.

"ఓర్నీ ఇల్లు బంగారం అగును! ఇది నా భామామణి వేషం!"

గతకాలపు తీపి జ్ఞాపకములలో మునకలు వేస్తూన్న 

పతిదేవుని చూస్తూన్న ఆమ్మ బుగ్గలు కెంపులైనవి. 

12 ఏళ్ళ నాటికే నాటకములలో వేషాలు వెయ్యాలని బుద్ధి పుట్టింది 

Purushottam కి - అదే పెదనాన్న అన్నమాట. 

"అప్పటి కింకా మీ వయసు నిండా పన్నెండేళ్ళే!" 

అంటే మీ అంత వయసునాటి ఫొటో అది!" 

"మరీ నల్లగా మరకలు మరకలుగా ఉంది." 

"ఇప్పుడు కదా కలర్ ఫొటోలు, ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ వే, 

ఒక్క ఫొటో తీయించుకోడం కూడా ఘనం, చుక్కలు కనబడేవి అందరికీ." 

"సరే గానీ, ఆమ్మా, ఈ photo లో - ఈ ఆడపిల్ల  ఎవరు?" 

"అది నేనే!" ఈ మారు పెన్నాన్న సిగ్గులమొగ్గ అవుతూంటే, 

అందరి నవ్వులతో ఇల్లు మార్మ్రోగింది. 

"హ్హ హ్హ హ్హ"

******************** ,

రంగమెక్కి ఆడాలని అనిపించగానే -

డ్రామా కంపెనీల చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగాడు. 

ఓ రోజు సత్యభామ పాత్రధారుడు రాకపోయే సరికి - 

మన లేత దిగ్గజం పురుషోత్తానికి అవకాశం వచ్చింది. 

పూసగుచ్చినట్లు భార్యాభర్తలు వంతులవారీగా 

అలనాటి సంగతులను వివరిస్తూ చెప్పారు. 

"పెద్దనాన్న అప్పట్లో బుల్లినాన్న అన్నమాట!" 

బృందంలోని అల్లరి బుడుగు -

గొప్ప విజ్ఞానం పూలగొడుగును అందరికీ -

ఎత్తి పట్టుకున్న విరించిలాగా 

చిరునవ్వుల్ని చిందిస్తూ చెప్పాడు. 

"ఔనురా! అప్పుడు మా నాన్న నాలాగే 

తాళ్ళు, బొందులూ ఉన్న నిక్కరునే వేసుకునేవాడు." 

పేద్ద అర్ధమైనట్లు తక్కిన వాళ్ళందరూ

ఏకగ్రీవంగా ఒప్పుకోలు ఓటును వేసేసారు. 

"అట్లాగ మీ మానాన మీరు చెప్పుకుంటూపోతే 

పెదనాన్న ఇంకేమీ చెప్పరు, అంతే!" 

అన్నం పెళ్ళల్ని పెద్ద బేసినులో వేసి, 

కమ్మసున్ని, పెసరపచ్చడిలను కలిపింది ఆమ్మ. 

వేడి వేడి అన్నం మీద ఆవునెయ్యి వేయగానే 

ఆవిరులతో ఘుమఘుమలు మిళాయించి, 

అందరి ముక్కుపుటాలు అటువైపు పరుగులు తీసేలా చేసినవి. 

పెన్నాన్న. చిన్నాన్నలు, మామయ్యలు, 

కొసాకి తాతయ్య కూడా 'తాము పెద్దోళ్ళమని  

మరిచిపోయారు కామోసు, బేసిన్ చుట్టూ చేరిన -

                    పిల్లల బంతిలో చేరిపోయారు.  

"హన్నా! ఈ పెద్దోళ్ళు మనకు అస్సలు అర్ధం కారు." 

కించిత్తు సందేహం రంగరించిన విసుగును ప్రదర్శించాడు ఓ గడుగ్గాయి. 

బేసిను పంక్తి భోజనాల దగ్గర చెప్పిన

పెన్నాన్న వాక్కుల టీకా, టిప్పణీ - తిప్పుడు తిప్పళ్ళు 

ఇవిగో! అవధరించండి చదువరులారా! 

"అప్పటి కాలంలో ...... " 

"అంటే బి.సి. నాటి రోజుల్లో నన్నమాట."

"ష్! గప్ చుప్ గా ఉంటారా, లేకపోతే 

ఇప్పటికిప్పుడు నా కథకి ఏకంగా పుల్ స్టాప్ పెట్టేస్తాను." 

"వద్దు!వద్దు! మేం బుద్ధిగా కూర్చుని వింటాం" 

బాలబాలికలు ఆ విధంబుగా చేతులు కట్టుకుని కూర్చున్నారు. 

ఆనక ఈ కొనసాగింపు ఈ రీతిగా జరిగెను: 

"అప్పట్లో డ్రామాలాటలంటే అందరికీ చిన్నచూపు ......"   

"చిన్నచూపు అంటే మెల్లకళ్ళు, మెల్లగా చూట్టం అనా?" 

ఈ సారి సాఫ్టు బాయ్ జాగ్రత్తగా తన పక్కన ఉన్న 

'పుడమి ' చెవిలో గుసగుసలను గుమ్మరించాడు. 

ముఖానికి రంగులు పులుముకుని తైతక్కలాడ్తే -

అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఝాడించేస్తారు  ఎవరైనా గానీ." 

నానమ్మ జనాంతికంగా - అందరికీ వినబడేలాగానే గట్టిగా అనేసింది - 

మూడుపొళ్ళ ముక్కుపుడకను మిలమిలా మెరిసేలా సవరించుకుంటూ, 

మూతీ ముక్కూ విరుచుకుంటూ. కిసుక్కున కొందరు నవ్వారు. 

పెన్నాన్న పురుషోత్తమమ్ వాక్ ప్రవాహం -

వర్షఋతువులో పెన్నానది ప్రవాహానికి మల్లే  బిరబిరా సాగిపోయింది.

"నాకేమో వేదికపైన పద్యాలు ఆలపించాలని ఆశ. 

రహస్యంగా నా ప్రయత్నాలు నేను చేసాను. 

సత్యభామ వేషధారుడు డుమ్మా కొట్టేసాడు. 

అనుకోకుండా నాకు ఆ సువర్ణావకాశం దక్కింది. ..... 

ఆడవాళ్ళు ఇంటిగడప దాటితే పెద్ద నేరంగా 

పరిగణిస్తూండే వాళ్ళు." 

"థాంక్స్ గాడ్! మనం ఆ రోజుల్లో పుట్టలేదు!" 

"ముmదుగా సూత్రధారులు తెర  పట్టుకునేవాళ్ళు. 

భామామణి తెర వెనక నిలబడాలి, 

ఆమె జడను మాత్రం ఆ తెర మీదుగా ఇవతలికి వేసి ఉంచుతారు,

సత్యభామామణి జడను తనివితీరా వర్ణిస్తారు. 

ఆ తర్వాత తెర తీస్తారు. అప్పుడు వయ్యారంగా వస్తుంది 

శ్రీకృష్ణుని ముద్దులభార్య సత్యాదేవి. 

ఇదిగో, ఆ జడకి అంత ప్రాధాన్యాన్ని ఇచ్చారు ఆనాటి ప్రజలు. ***************************** ;

వలయంగా కూర్చున్న అందరి మధ్య, పాత్రలోని అన్నం -

కువలయపుష్పాన్ని గుర్తుచేస్తున్నది. 

పెదనాన్నకి ఇన్నాళ్టికి ఇంత మంచి అవకాశం దొరికింది. 

ఇక బాల్యస్మృతులనీ, సాంప్రదాయపు తీగన పూసిన 

పాriఇజాత, కల్పతరువు ప్రసూనాల పుప్పొళ్ళు 

ఆయన నుడువులలో వెదజల్లారు. 

చిన్నపిల్లాడిలా గడ్డప్రుగన్నం గుజ్జును జుర్రుకుంటూ 

"బ్రేవ్" త్రేనుస్తూ, అంత పెద్ద పెదనాన్న = పురుషోత్తం అన్నాడు

"భుక్తాయాసంగా ఉన్నది. చెయ్యి కడుక్కోవడానికి నీళ్ళు పెట్టండి."   

"అబ్బ! ఆశ దోశ వడ అప్పడం, 

ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, తెల్సిందా!?" 

నిన్నెప్పుడో చెప్పిన తాతయ్య పాఠాన్ని -

ఆయనగారి కొడుకు, వురఫ్ పెదనాన్నకి అప్పజెప్పనే చెప్పాడు ఇంకో సిసింద్రీ.

             "ఆ కృత్రిమ జడ బోలెడు బావుంది."

"బావ కాదు, బాగా - 'గ, గా' అని చెప్పాలి." 

మూగమనసులు సినిమాలో నాగేసర్రావు మాదిరిగా - 

కల్హార ఉచ్ఛారణని సరిదిద్దాడు బుజ్జి. 

అప్పటికే వచ్చిన ఇరుగు-పొరుగు వారితో 

బహు కోలాహలంగా మారిపోయింది వాతావరణం. 

పైనుండి కిందిదాకా క్రమక్రమంగా వివరించారు.

'నల్లని పట్టుదారాలను తెచ్చి, మేము చేసాము. 

మామూలుగా మీ పిన్ని, అమ్మమ్మ, 

స్త్రీలు మూడుపాయలు అల్లుకుంటారు కదా! 

కానీ నాలో నేనే ఆలోచించుకుని, 

ఐదు పాయలుగా ఈ కృత్రిమ జుత్తును అల్లాను. 

అందుకు ఒక కారణం ఉంది ...... " 

సస్పెన్సు కోసమని మాటల్ని ఆపి చుట్టూతా చూసాడు.

"ఎందుకని? ఎందుకనీ?" 

జడ వెడల్పుగా ఉంటే పూలజడ కుదురుతుంది. 

వీటిని తిలకించండి!" 

"ఆ! సమోసా పొట్లాల్లా ఉన్నాయి." 

నీ, బంతీ చేమంతీ పారిజాతం పువ్వులనీ 

నేనే దగ్గర ఉండి చేయించాను." 

గర్వంగా కాలరు  ఎగరేసాడు. 

"అంతా బడాయి! ఈయనకేమీ తెలీదు. 

ఆ కంసాలి ఈశ్వరయ్య చేతి పనితనం." 

"మగాళ్ళ గాలి తుస్సున తీసేయడంలో 

ఈ వనితారత్నాలు ప్రజ్ఞాధురీణలు సుమీ!" అన్నాడు మామయ్య, 

వంత పాడారు తాతయ్యలు. 

"బంగారం పూత వెలిసిపోయింది గానీ, 

ఈ భామజడ ధగధగలు - కళ్ళు జిగేల్ మనిపిస్తాయి." 

ఆమ్మ - ఆ వెండి మొగలిరేకుల జడని చేతుల్లోకి తీసుకుని అన్నది.

"దీనికి మెరుగులు పెట్టిస్తాను. 

మళ్ళీ వచ్చే వారానికి మీరు వేషం కడుదురు గాని. 

అప్పటిదాకా మెరు రిహార్సలు చేయండి. 

డైలాగుల్నీ, పద్యాల రాగవరుసల్నీ అన్నిటినీ గుర్తుకు తెచ్చుకోండి." 

అంటూ హాండ్ బాగ్ 

లో వేసుకుని, బైటికి ఉరికింది.

"నేనా? ఇప్పుడా? ఈ వయసులోనా?" 

              బెంబేలెత్తుతూన్న పురుషోత్తమరావుని 

"గుర్తుకు తెచ్చుకోండి ప్లీజ్ ప్లెజ్!" అంటూ 

యావన్మందీ పారాహుషార్ చేస్తున్నారు. 

"మరే, మంది మాట వినక తప్పుతుందా?" 

అన్నారు ఆయన యొక్క పెద్దవాళ్ళు =

= ఇజీక్వల్టు - తాతయ్యలు, బహు ఈజీగా.

మరుసటి వారం విజయదశమి - "జడకోలాటం పోటీల ఆటలు." 

దొడ్డమ్మ తెచ్చిన జడకుచ్చులు తళతళా మెరుస్తున్నాయి.  

ఇదీ అదీ భేదం లేకుండాపిన్నలూ పెద్దలూ -

అన్ని రకాల పోటీల్లోనూ  పాల్గొన్నారు. 

ప్రద్యుమ్నకుమారికి రంగోలీలో ప్రైజు వచ్చింది. 

కర్రముగ్గులు, పందిరి ముగ్గులలో నానమ్మ, అమ్మమ్మలకు 

కన్సొలేషన్ ప్రైజులు వచ్చాయి.

"ఏదో నడుం నొప్పులు, మోకాళ్ళ నొప్పుల మూలాన్న సరిగ్గా వంగలేకపోయాం. 

లేకుంటే మొదటి బహుమతి మాకే వచ్చేది, తెలుసునా!?" 

కొంచెం గీరతనం వాళ్ళ నేత్రాల నుండి తొణికిసలాడుతూ జారి, 

ముక్కుపుడకలు, బేసరి - మెరుపులీనాయి.

"గంటలు కాని గంటలు - అంటే ఏమిటి?"

"జడగంటలు, అట్లాగే కుచ్చులు కాని కుచ్చులు - 

అంటే జడకుచ్చులు, మాష్టారుగారూ!" 

అంటూ సుత్రామ్ చటుక్కున పొడుపుకథలను విప్పి, 

ఫస్టు ప్రైజుల్ని గెలిచాడు.

'జేజేలు హర్షధ్వానాలతో ఆవరణ అంతా పరిమళాలను గుబాళిస్తూ - 

దసరా సరదాలకు ప్రతిబింబం ఐనది.  

మర్నాటి స్థానిక పేపర్లలో - పురుషోత్తం జడకోపు కోలాటం 

ప్రత్యేక విశేషంగా ప్రధాన శీర్షికలలో నిలబడింది. 

పెద్దమ్మ కొత్త నోము నొకదాన్ని - తానే సృష్టించింది,

వ్రతం కోసం ఏతెంచిన స్త్రీలను/

వాయనాలు వెంటనే ఇవ్వకుండా ఆపింది 

పేరంటాళ్ళు అందరికీ, వారి ఫ్యామిలీలకీ - 

పేరు పేరునా పిలిచి - news papers లో ప్రచురించిన 

తమ ఫొటోలని చూపించసాగింది. 

కొన్ని నెలలదాకా ఈ చిరు గెలుపుల మధుర జ్ఞాపక సందోహాలు* - 

సరికొత్త పున్నమల పాల వెన్నెల కాంతులను వెదజల్లుతూనే ఉన్నవి.

&

 సందోహాలు* = groups/ bundles ;

[Story ;- బాపు బొమ్మకు కథ ;- ఇది అచ్చతెనుగు కథ ; 

జడల కోలాటం, కోలాహలం ;  ;; 

[పాత్రలు ;- పెదనాన్న పురుషోత్తం - ఆమ్మ - బుజ్జి - సిసింద్రీ - 

సుషుమ్న, సభిక్, ధావళ్య, ఆజ్ఞేష్, పుడమి, కల్హార, సుత్రామ్ ; ప్రద్యుమ్నకుమారి ;;

========================================= , 

]gamTalu amTE bels(`bells`) kadaa!? awi mana imTlOnE unnAyA, 

Ewi? ekkaDa? cUpimcu AmmA!!"

BArataraajadhaani numDi celleLLu iddaru, tama tama samsaaramulatO waccAru. 

waari pillalu sushumna, sabhik, dhaawaLya, aajnEsh, puDami, kal haara, 

sutraamm lu. himdee, imgliish 

lanu naalikapai ramgarimci naakimcinaTlunnaaru. janmadaatalu, 

bottigaa maatRbhaashanu maricipOyaaru. 

accatelugu padaalanu - nErpaalsina baadhyata - 

aama ani piluwabaDutUnna 

doDDamma amD kO BujaskamdhAlapaina umcukunAru.

'I aarBATam, emdulakI mOta baruwu bAbu!" ani 

weeriki anipimcaDam lEdu. 

ee nuutana bamdhu Agamtakula bRmdaaniki bOdhimcETappuDu 

amdarikee kotta waataawaraNam winOdaBaritam autuunnadi.

"ammA! sushumna - kumkamma - amTE EmiTO telusA?" 

"Uhu! nuwwE ceppu!" DikshanarI prakAram 

- 'kumkuma amTE kumkamma ' annamATa."

tama pillalu, ULLOni tama snEhitulatO kalisi, 

'ee Dhilleewaasulanu egatALi cEstunnaaru ' 

ani aammaku ardhamaimdi.

"tappu! aTlaaga hELana cEyoccunA!?" kOppaDimdi.

"abbE mEmEmI egatALi cEyaTlEdammA! 

UrikanE ATa paTTistunnaamu, amtE!" 

sushumna bRmdAnni canuwugaa pilustuu, 

tama bRmdamlOki cErcEsukunnaaru. wALLamdaruu taamu 

erigina krIDalu, kOtIkommacci, nElabamDa, 

gilleedamDa, kappagamtulu lAMTi ATalni 

biDDalaku nErpaaru. adE spIDutO krikeT, haakI,

 phuT bAl wamTi krIDalni nErcukunnaaru.

2] "pennAnnA!" pillala pilupu, wALLa sambOdhanalO - 

pedanaanna kaastaa - pennAnnagA pariNAmam cemdimdi.  

TramkupeTTenu gaalistunnaaru. bottigA BayamanE uusE lEdu kadA! 

aTaka mIdi numDi amta pedda TramkupeTTe*ni dimcEsAru. 

[*Trunk box] ee waanaramuukakE adi susaadhyamaimdi.

"dEwuLLADutunnAru?" modaTi wAskODigAmA kwaScan. 

"idEmTi pennAnnA! imdulO unnawALLewaru?" 

"aslu idEmTi?" 

"aa maatram teleedA? dAnni phoTO amTAru, mohamA!"

peddawALLu bUtulni nishEdhimcinaaru, kAbaTTi kottarakam 

"sambOdhanala" nu - sutti weerabhadraraawu -

TaipulO kanipeTTEstunnAru pillakaayalu. 

dwiteeya wAskODigAmA kelukuDu 

praSnArdhakamutO pennAnna wALLa cEtullOni 

deerghacaturaSramugaa unna SAltIni tana 

hastakamalamulalOki teesukunnADu.

appaTikE bharta wenakaala wacci nilabaDi unnadi Amma.

"OrnI illu bamgaaram agunu! idi nA BAmaamaNi wEsham!"


gatakaalapu teepi jnaapakamulalO munakalu wEstUnna 

  patidEwuni cUstUnna Amma buggalu kempulainawi. 

"appaTiki padArELLE, amTE mI amta wayasunATi phoTO adi!" 

"maree nallagaa marakalu marakalugaa umdi." 

"ippuDu kadA kalar phoTOlu, A rOjullO blaak amD waiT wE, 

okka phoTO teeyimcukODam kUDA 

Ganam, cukkalu kanabaDEwi amdarikI." 

"sarE gaanee, AmmA, I `photo` lO - eeADapilla ewaru?" 

"adi nEnE!" I mAru pennAnna 

siggulamogga awutUmTE, amdari nawwulatO illu mArmrOgimdi. 

"hha hha hha" 

*************************** ,

4] 12 ELLa nATikE naaTakamulalO wEshaalu weyyaalani buddhi puTTimdi purushOttAniki adE pedanaanna annamATa. [= repeat ???????? ] }}}}}}}}}}}}}]]] 

ramgamekki ADAlani anipimcagAnE 

Draamaa kampeneela cuTTU pradakshiNAlu cEyasAgADu. 

O rOju satyaBAma paatradhaaruDu rAkapOyE sariki - 

mana lEta diggajam purushOttaaniki awakASam 

waccimdi. puusaguccinaTlu BAryABartalu 

wamtulawaareegA alanATi samgatulanu wiwaristuu ceppaaru. 

"peddanaanna appaTlO bullinAnna annamATa!" 

bRmdamlOni allari buDugu goppa 

wijnaanam puulagoDugunu amdarikee etti paTTukunna wirimcilaagaa 

cirunawwulni cimdistU ceppADu. 

"aunurA! appuDu maa naanna nAlAgE tALLu, 

bomdulU unna nikkarunE wEsukunEwADu." 

pEdda ardhamainaTlu takkina wALLamdarU 

EkagreewamgA oppukOlu OTunu wEsEsAru. 

"aTlAga mI mAnAna meeru ceppukumTUpOtE 

pedanaanna imkEmI cepparu, amtE!" annam peLLalni  

4] 12 ELLa nATikE naaTakamulalO wEshaalu weyyaalani 

buddhi puTTimdi purushOttAniki adE pedanaanna annamATa.

 [= repeat ???????? ] }}}}}}}}}}}}}]]] 

ramgamekki ADAlani anipimcagAnE 

Draamaa kampeneela cuTTU pradakshiNAlu cEyasAgADu. 

O rOju satyaBAma paatradhaaruDu rAkapOyE sariki - 

mana lEta diggajam purushOttaaniki awakASam 

waccimdi. puusaguccinaTlu BAryABartalu 

wamtulawaareegA alanATi samgatulanu wiwaristuu ceppaaru. 

"peddanaanna appaTlO bullinAnna annamATa!" 

bRmdamlOni allari buDugu goppa 

wijnaanam puulagoDugunu amdarikee 

etti paTTukunna wirimcilaagaa cirunawwulni cimdistU 

ceppADu. "aunurA! appuDu maa naanna nAlAgE tALLu, 

bomdulU unna nikkarunE wEsukunEwADu." 

pEdda ardhamainaTlu takkina wALLamdarU 

EkagreewamgA oppukOlu OTunu wEsEsAru. 

"aTlAga mI mAnAna meeru ceppukumTUpOtE 

pedanaanna imkEmI cepparu, amtE!" 

annam peLLalni pedda bEsinulO wEsi,

       kammasunni,  pesarapaccaDilanu kalipimdi Amma. 

wEDi wEDi annam meeda aawuneyyi wEyagAnE 

aawirulatO GumaGumalu miLAyimci, 

amdari mukkupuTAlu aTuwaipu parugulu teesElA cEsinawi. 

pennaanna. cinnaannalu, maamayyalu, kosaaki 

taatayya kUDA 'tAmu peddOLLamani  

maricipOyAru kAmOsu, 

bEsin cuTTU cErina pillala bamtilO cEripOyAru.  

"hannA! I peddOLLu manaku assalu ardham kaaru." 

kimcittu samdEham ramgarimcina wisugunu 

pradarSimcADu O gaDuggAyi. 

***********************,

bEsinu pamkti BOjanaala daggara 

ceppina pennAnna waakkula TIkA, TippaNI - tippuDu tippaLLu 

iwigO! awadharimcamDi caduwarulArA! 

"appaTi kAlamlO ...... " "amTE -

B.C. nATi rOjullO nannamATa."

"sh! gap cup gA umTAraa, 

lEkapOtE ippaTikippuDu nA kathaki EkamgA -

pul sTAp peTTEstaanu." 

"waddu! waddu! mEm buddhigaa kuurcuni wimTAm" 

baalabaalikalu aa widhambugaa cEtulu kaTTukuni kuurcunnaaru. 

aanaka ee konasaagimpu ee reetigaa jarigenu: 

"appaTlO DrAmAlaaTalamTE amdarikI cinnacUpu ......"

"cinnacuupu amTE mellakaLLu, mellagA cUTTam anA?" 

I sAri saaphTu baay jaagrattagaa tana 

pakkana unna 'puDami ' cewilO gusagusalanu gummarimcADu. 

muKAniki ramgulu pulumukuni taitakkalADtE 

appuDE kAdu, ippuDu kUDA JADimcEstAru  ewarainA 

gAnI." naanamma janaamtikamgaa - 

amdarikee winabaDElAgaanE gaTTigA anEsimdi - 

mUDupoLLa mukkupuDakanu milamilaa merisElA sawarimcukumTU, 

muutee mukkuu wirucukumTU.

komdaru kisukkuna nawwaaru. 


pennaanna purushOttamamm waak prawaaham 

warshaRtuwulO pennaanadi 

prawaahaaniki mallE birabiraa saagipOyimdi.

"naakEmO wEdikapaina padyaalu aalapimcaalani ASa. 

rahasyamgaa naa prayatnaalu nEnu cEsAnu. 

satyaBAma wEshadhAruDu DummA koTTEsADu. 

anukOkumDA nAku A suwarNAwakaaSam dakkimdi. ..... 

ADawALLu imTigaDapa dATitE 

pedda nEramgaa parigaNistUmDE wALLu." 

"thanks God! manam A rOjullO puTTalEdu!" 

"mumdugA sUtradhArulu tera  paTTukunEwALLu. 

BAmaamaNi tera wenaka nilabaDAli, 

aame jaDanu maatram 

aa tera meedugaa iwataliki wEsi umcutAru. 

satyaBAmaamaNi jaDanu taniwiteeraa warNistAru. 

A tarwAta tera tIstaaru. 

appuDu wayyaaramgA wastumdi SreekRshNuni -

muddulabhaarya satyAdEwi. 

idigO, aa jaDaki amta 

praadhaanyaanni iccaaru aanATi prajalu. 

******************************** ,

walayamgaa kuurcunna amdari madhya, 

paatralOni annam - *kuwalayapushpaanni 

[= * kaluwa puwwu ] -  [= * కలువ పువ్వు ] - 

gurtucEstunnadi. pedanaannaki innALTiki 

imta mamci awakASam dorikimdi. ika 

baalyasmRtulanee, saampradaayapu teegana puusina 

paarijaata, kalpataruwu prasuunaala 

puppoLLu Ayana nuDuwulalO wedajallAru. 

cinnapillADilA gaDDaprugannam gujjunu jurrukumTU 

"brEw" trEnustU, amta pedda pedanaanna, 

"BuktAyaasamgaa unnadi. 

ceyyi kaDukkOwaDAniki nILLu peTTamDi." 

purushOttam annADu.  

"abba! ASa dOSa waDa appaDam, 

ewari panulu wALLE cEsukOwAli, telsimdA!?" 

ninneppuDO ceppina taatayya pAThAnni 

aayanagaari koDuku, wuraph pedanaannaki 

appajeppanE ceppADu imkO sisimdrI.

"A kRtrima jaDa bOleDu baawumdi."

"baawa kaadu, baagaa - 'ga, gaa' ani ceppaali." 

muugamanasulu sinimaalO naagEsarrAwu mAdirigA 

kal haara ucCaaraNani sarididdADu bujji. 

appaTikE waccina irugu-porugu waaritO 

bahu kOlAhalamgA mAripOyimdi waataawaraNam.

painumDi kimdidaakaa - 

kramakramamgaa wiwarimcaaru.

'nallani paTTudaaraalanu tecci, mEmu cEsAmu. 

maamuulugA mI pinni, ammamma, streelu 

mUDupAyalu allukumTAru kadaa! 

kAnI naalO nEnE aalOcimcukuni, ....... ,

- aidu paayalugA I kRtrima 

juttunu allaanu. amduku oka kAraNam umdi ...... " 

`suspence` kOsamani mATalni aapi cuTTUtA cUsADu.

"emdukani? emdukanee?"

"jaDa weDalpugaa umTE puulajaDa kudurutumdi. 

wITini tilakimcamDi!" 

"A! samOsA poTlAllA unnaayi." 

"wemDirEkulatO mogalirEkulanee, 

bamtee cEmamtI paarijaatam puwwulanee -

nEnE  daggara umDi cEyimcAnu." 

garwamgA kAlaru  egarEsADu. 

"amtA baDAyi! IyanakEmI telIdu. 

aa kamsaali ISwarayya cEti panitanam." 

"magALLa gaali tussuna teesEyaDamlO 

ee wanitAratnaalu prajnaadhurINalu sumee!" 

annADu maamayya, wamta pADAru tAtayyalu. 

"bamgAram puuta welisipOyimdi gaanee, 

I BAmajaDa dhagadhagalu - 

kaLLu jigEl manipistaayi." 

Amma - aa wemDi mogalirEkula jaDani 

cEtullOki tIsukuni annadi.

"deeniki merugulu peTTistAnu. 

maLLI waccE wAraaniki meeru wEsham kaDuduru gaani. 

appaTidAkA meru rihaarsalu cEyamDi. Dailaagulnee, 

padyaala raagawarusalnee anniTinI 

gurtuku teccukOMdi." amTU -

`hand bag` lO wEsukuni, baiTiki urikimdi.

"nEnA? ippuDA? I wayasulOnA?" 

            bembElettutUnna purushOttamaraawuni 

"gurtuku teccukOmDi plIj plej!" amTU -

yaawanmamdee paaraahushaar cEstunnaaru. 

"marE, mamdi mATa winaka 

tapputumdA?" annaaru aayana yokka peddawALLu =

ijeekwalTu = taatayyalu, bahu eejeegaa.

***************** ;

marusaTi wAram wijayadaSami - 

"jaDakOlATam pOTIla ATalu." 

doDDamma teccina jaDakucculu 

taLataLA merustunnAyi.  idee adee BEdam lEkumDA

pinnaluu peddaluu anni rakaala pOTIllOnU  paalgonnaaru. 

pradyumnakumaariki ramgOlIlO praiju waccimdi. 

karramuggulu, pamdiri muggulalO naanamma, 

ammammalaku kansolEshan praijulu waccaayi.

"EdO naDum noppulu, mOkALLa noppula muulaanna 

sariggaa wamgalEkapOyAm. lEkumTE modaTi 

bahumati maakE waccEdi, telusunA!?" 

komcem gIratanam wALLa nEtraala numDi toNikisalADutU 

jaari, mukkupuDakalu, bEsari merupuleenaayi.

gamTalu kaani gamTalu - amTE EmiTi?"

"jaDagamTalu, aTlAgE kucculu kaani kucculu - 

amTE jaDakucculu, maashTArugaarU!" amTU 

sutraamm caTukkuna poDupukathalanu wippi, 

phasTu praijulni gelicADu.

'jEjElu harshadhwaanaalatO aawaraNa amtaa 

        parimaLAlanu gubAListuu - 

dasaraa saradaalaku pratibimbam ainadi.  

marnATi sthaanika pEparlalO - 

purushOttam jaDakOpu kOlATam - 

pratyEka wiSEshamgaa pradhaana SIrshikalalO nilabaDimdi. 

peddamma kotta nOmu nokadaanni - 

                                  taanE sRshTimcimdi, 

wratam kOsam Etemcina streelu - lanu/ 

waayanaalu wemTanE iwwakumDA Apimdi.   =

pEramTALLu amdarikee, 

waari `Families -` kee - pEru pErunA pilici `

news papers` lO pracurimcina tama phoTOlani 

cuupimcasaagimdi. konni nelaladaakaa 

ee ciru gelupula madhura jnaapaka samdOhaalu - 

sarikotta punnamala paala wennala kaamtulanu wedajallutuunE unnawi.

******************** ,

Link ;- My Story ;-  బాపు బొమ్మకు కథ ;- &

*******************************************************  ,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గాడిదలు - గజరాజు - CK - 1

క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం  మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,  అంచేత ...