భీమరాజ్ కి చాలా ఆనందం, "ఇంత ప్రముఖ కంపెనీకి -
సెక్యూరిటీ గార్డు💂గా ఉద్యోగం అంటేమాటలా!!?
ఎన్ని రికమెండేషన్‌లను తెచ్చుకోవలసివస్తున్నది -
ఈ కొత్త యూనిఫారంలో తను ఎంత బాగున్నాడో!?"
ఇంటి నుండి బయల్దేరేటప్పుడు అద్దంత్లో ఒకటి రెండు సార్లు చూసుకుని,
తల్లి ఇచ్చిన టిఫిన్ బాక్సు సైకిల్ మీద కంపెనీకి చేరుకుంటాడు.
భీమరాజు పుట్టినప్పుడు పెట్టిన పేరు అది,
now సన్నగా పూచికపుల్లలా కనబడుతూన్న యువకుడు,
గాలి వీస్తే తృళ్ళిపడేలా అగుపిస్తున్న రూపం,
now భీమరాజ్‌కి పెళ్ళి 💁అవడం ప్రశ్నార్ధకం ఐ కూర్చుంది.
"తను తన కొత్త uniform లో హుందాగానే కనిపిస్తున్నాడు కదా"
కొంత తృప్తిగానే రోజులు గడుస్తున్నాయి.
సెక్యూరిటీగార్డులు నాలుగుదిక్కులకూ కలిపి, ఎనిమిది మంది ఉన్నారు.
ఈ నెల భీమరాజ్‌కి కంపెనీ వెనుకవైపు ఉండి,
కాపలా కాసే డ్యూటీ - night shift వచ్చింది.
భీమా కి జతగా ఉండే ప్రయాగ్ రాజ్ - ఆకారపుష్ఠి గొప్పదే,
పాత సినిమాలలో శివరావు మాదిరి - కొబ్బరిబోడాం లాగా ఉన్నాడు ప్రయాగ్.
"లారెల్ అండ్ హార్డీ లాగా - మీ ఇద్దరి జత భలేగా ఉన్నది."
బాస్, సూపర్వైజర్ విష్ణు నవ్వుతూ, డ్యూటీ అప్పజెప్పారు.
********************* ,
పక్షం రోజులు పకడ్బందీగా "లెఫ్ట్ రైట్" అనుకుంటూ, అంటూ ......
ఇద్దరూ కంటిరెప్పలకు నిద్రను దూరం చేసి మరీ కాపలా కాసారు.
భీమ, ప్రయాగ్ లకు - చీకటి అంటే భయం -
ఒకరి భుజాలను ఒకరు తట్టుకుంటూ అటూఇటూ నడుస్తుండేవారు.
పదిహేను రోజులు గడిచాయి,
"ఇంకొక రెండువారమ్ములు గడిచిన చాలును,
డేటైమ్ కి డ్యూటీ మారుస్తారు" అందుకే మరి,
మబ్బుల్లో ఉన్న వర్షబిందువుల కోసం,
వేచిచూస్తున్న చకోర పక్షుల్లా ఈ ఇరువురు ...... left right - march fast ...... ,
దబ్బున చప్పుడు ఐనది -
అంత ఎత్తు కాంపౌండ్ వాల్ పైనుండి నలుగురు దూకారు.
"పిట్టగోడ దగ్గర - చూడు ప్రాయన్నా!"
దాహంతో గొంతు తడారిన పికిలిపిట్టలా భీమా గొంతు బొంగురుపోయి,
వణుకుతూన్న మాటలు కాస్తా - ఏవో శబ్దాల రూపంలో బైటికి వెలువడ్డాయి.
మరింత వణుకుతున్న స్వరం - ఆ చిమ్మచీకటి నుండి వెలుపలికి వినవచ్చింది
"చూస్తూనే ఉన్నాను, భీమన్నా!"
వాళ్ళేమో నలుగురు, వీళ్ళేమో ఇద్దరు ~~~~~~,
చోర చతుష్టయం కిటికీ చువ్వల్ని లాగారు. తుప్పు పట్టి ఉన్నదాయె,
పటుక్కున ఊడి చేతిలోకి వచ్చేసింది.
తీరా చూస్తే అది విలువ లేని చెత్త సామాన్లు - కొన్ని ఉన్న స్టోర్‌రూమ్.
"టైమ్ లేదురా బబ్లూ! తెల్లార్తుంది, త్వరగా ఇవే తీసుకెళ్దాం"
వాళ్ళు అక్కడున్న ఆ కొద్ది సరుకుని మూడు గోనె సంచులలో కట్టుకున్నారు.
వాళ్ళు వెనక్కి మళ్ళారు. అప్పటికి ధైర్యాన్ని కూడగట్టుకున్నారు,
లారెల్ and హార్డీ ద్వయం ......,
బాస్ వాళ్ళకి రెండు చిన్న చురకత్తుల్ని మాత్రమే ఇచ్చారు.
ఎందుకైనా మంచిదని, రెండు గమేళాలని - తాళ్ళు కట్టి, డాలు మాదిరిగా తయారుచేసుకున్నారు.
వారి స్వయంకృషి ఫలితం, ఆ డాళ్ళు / shields -
ఇప్పుడు కాస్త అండగా రక్షా కవచాలైనాయి.
భీమ్ and ప్రయాగ్ -"హెయ్ హెయ్ హుష్ హుష్" అంటూ thieves ఎదుటికి వచ్చారు. ఒకళ్ళనొకళ్ళు - బొమ్మ కత్తులను ఝళిపిస్తూ,
డమ్మీ పిస్తోళ్ళను చూపించి దడిపిస్తూ, వీరంగం చేస్తున్నారు.
భుజాల బరువుతో కాంపౌండ్ వాల్ వైపు పరుగు తీసారు.
వెంట గార్డులు ఛేజింగ్ ...... , చూస్తుంటే - ఒకరి వెనకాతల ఒకరు -
"ఆరు పూసల దండ 'లాగా దృశ్యమానమై,
నింగిలోని చుక్కలు మిణుకు మిణుకు నవ్వులు చిందించినాయి.
భీమరాజ్, friend కి సైగ చేసి, వెనుక గేటు నుండి బయటికి ఉరికారు.
బబ్లూ గోడ దూకినప్పుడు కాలు బెణికింది.
"ఇదేమిటిరా, డొక్కు సామాను - పోన్లే, వచ్చిందే దక్కుడు -
అనుకుని తెచ్చుకుంటుంటే,
ఈ సన్నాసులు మనల్ని రాహు కేతువుల్లా తగులుకున్నారు"
దొంగలు గుసగుసగా బుస్సుబుస్సుమన్నారు.
వారిలో ముగ్గురు స్పీడుగా రన్నింగ్ చేయడంతో,
తొమ్మిదడుగులు ముందున్నారు.
వెనక బబ్లూను భీమరాజ్ పట్టుకున్నాడు.
బబ్లూ మిత్రులు చప్పున ఒక పక్కకి బొమ్మ పిస్టల్సు పేల్చారు.
అవి నిజమైన ఆయుధాలు - అనుకుని, భయపడ్డారు మన హీరోలు.
తృటిలో అనుకోని సంఘటన,
ఎట్లాగూ దొరికాము కదా - అనుకుని, తెగించాడు thief బబ్లూ -
ఇంకేముంది, భీమరాజ్ ని ఒడుపుగా పట్టుకుని,
భుజం పైన వేసుకుని ముందుకి దూకాడు.
ప్రయాగ్‌కి ఏమి జరుగుతున్నదో అర్ధం అయ్యే లోపున - తన ఫ్రెండ్ Bheem -
ఆ చిమ్మచీకటి తెరలలో - gaayab ....... ,
@@@@@@ ,
చుట్టుపక్కలవాళ్ళు, భీమా కుటుంబీకులు, పరిచితులు, అపరిచితులు -
పోలీసులు, పత్రికలవాళ్ళు - ఒకటే హడావుడి, ఇతర కంపెనీల వాచ్‌మెన్లు,
కార్మికులు - సంగతి తెలియగానే వచ్చి,
ఆడియన్స్ సమూహానికి అదనంగా వచ్చి కలిసారు -
"మన కాపలావాళ్ళ బతుకులింతేరా, భద్రత సున్న."
ఇట్లాగ వాళ్ళ కబుర్లు, ఊసులు కొనసాగుతున్నాయి.
వాతావరణం అంతటా అయోమయం వ్యాపించింది.
ఫ్యాక్టరీ ఓనర్స్ "భీమరాజు కి ఏదైనా అపాయం జరిగితే,
తమకు అప్రతిష్ఠ, అంతే కాదు, పనికిమాలిన కేసులు తగుల్కుని,
ఇరుక్కుంటే, బైటపడడం తలకు మించిన భారం ఔతుంది.
బిలబిలలాడుతూ ఎందరో మూగారు.
వాడ వాడలలో ప్రజలు ఈ విషయాన్ని గురించి చెప్పుకుంటున్నారు.
మొత్తానికి గందరగోళం అలుముకుంటూ, యాజమాన్యానికి రెస్ట్ లేకుండా చేస్తున్నది.
అది సరే, ఇంతా చేసి, మన కథానాయకుని కథ ఏమైనట్లు? -
నేస్తమా, అటువేపు దృష్టి సారింతము గాక!
@@@@@@ ,
దొంగల పార్టీ పి.టి.ఉష లాగా రేసుగుర్రం స్పీడుతో పిక్కబలం చూపించారు.
అక్కడ దగ్గరలో, కొంచెపాటి ఎత్తైన - కొండగుట్టలు -
ఆ ఉపరితలం వారికి కొట్టిన పిండి,
పైకి చేరాక, తమను ఎవరూ వెంటాడడం లేదని నిర్ధారించుకున్నాక,
ఆగి గాలి పీల్చుకున్నారు.
బబ్లూది కండపుష్ఠి కల భారీ విగ్రహం,
ఇప్పటిదాకా భీమరాజ్‌ని మోస్తూనే ఉన్నాడు.
"హమ్మయ్య!" భేతాళ విక్రమార్క అవతారం ఎత్తిన అతను,
భీమరాజుని నెమ్మదిగా బండరాయి మీదికి దించాడు.
ఒక పెనుశిల పయిన కూర్చోబెట్టాడు.
ఐతే, ఈ శాల్తీ slow గా జారగిలబడి, ఉలుకూ పలుకూ లేకుండా ఆసీనుడాయెను.
కిమిన్నాస్తి, pin drop silence, అందరూ టార్చిలైటు వేసారు.
భీమా - ఎప్పుడైతే దృఢకాయుడైన బబ్లూ తనని బియ్యం మూటలాగా విసిరి,
భుజంపై వేసుకున్నాడో అప్పుడే మూర్ఛపోయాడు.
"వార్నీ!!! స్పృహ లేని పిరికిసన్నాసిని ఇంతసేపూ మోసామన్న మాట"
"వీణ్ణి ఇక్కడే వదిలేద్దాం" కొంతసేపు తర్జనభర్జనలు పడ్డారు.
చర్చోపచర్చలు ఎందుకు జరిగాయంటే,
దారిలోనే బబ్లూ మనసులో ఒక కొత్త ఐడియా మెరుపులా వచ్చింది.
"తన చెల్లెలు అలివేణి - కుజ దోషం - గాడిద గుడ్డూ గూసూ - కారణాల వలన
పెళ్ళిసంబంధాలు కుదరడం లేదు.
అదీగాక, అలివేణి ఛాయ తక్కువ పిల్ల, ఇత్యాది కారణాలు -
ఆమెను 'పెళ్ళి కాని ప్రసాదమ్మ'గా, కన్యగానే నిలిపాయి.
ఇప్పుడు ఇంక ఫైన డెజిషన్‌కి వచ్చేసాడు.
"ఈ మనిషి పనిలో సిన్సియర్‌గానే ఉన్నాడు,
అదీగాక, కాస్త భయస్థుడు,
ఒక చెల్లికి అన్నగా - అది తనకి ప్లస్ పాయింటు.
జీవితంలో నిలదొక్కుకోగల - కష్టపడే తత్వం ఇతనిలో ఉన్నది.
కనుక అలివేణీ నాధుడు - ఖాయంగా ఇతడే!"
@@@@@@
పదిరోజులలో బబ్లూ ఆలోచన అమలులోనికి వచ్చేసింది.
భీమరాజ్ పెళ్ళికొడుకై, అలివేణీ పతియై, ఒక ఇంటివాడైనాడు✌✌.
తమ ఇంటికి కళ్యాణ తోరణాలు రెపరెపలాడాయి,
కనుక భీమా ఫ్యామిలీ ఆల్సో వెరీ హ్యాపీ.
- అండ్ కథకు పరిపుష్ఠం చేసిన ఇతర అంశాలు ఉన్నవి, అవి ఏవనగా ......,
"నలుగురు దొంగలు పరిగెడ్తూ, మా కంట పడ్డారు. వారిని వెంటాడాము.
అప్పుడు వాళ్ళు సంచీలని పారేసి, పారిపోయారు."
కంపెనీలో కొంచెంసేపు ద్వంద్వం యుద్ధం లాంటిది చేసినందువలననూ ......,
రాళ్ళ మీద కింద పడేసినప్పుడు - భీమరాజ్ కి గాయాలు ఐనాయి.
కాబోయే బావమరిది కనుక, బబ్లూ చెప్పమన్నట్లుగానే చెప్పాడు, మక్కికి మక్కీగా -
"ఇవి ఆట్టే ఖరీదైన వస్తువులు కాదు కదా!" అని -
company owners ఆ సంఘటనను serious గా తీసుకోలేదు.
భీమరాజు, ప్రయాగులకి శాలరీని పెంచారు.
"ఈ రిజల్టు తనకు కూడా అనుకూలం అవడంతో ప్రయాగ్ సైతం
భీమ్ and Bablu గ్రూపుకి వత్తాసు పలికాడు.
భారీ కేసులు కాకుండా - ఏవేవో మెలికలు పడి, తమను తిప్పలు పెట్టకుండా -
ఇన్‌సిడెంట్ సుఖాంతం అయ్యింది, కనుక - ఊపిరి పీల్చుకున్న యాజమాన్యం,
శ్రామికుల యోగ క్షేమాల కోసం - మనసు పెట్టి, పనిచేయాలి - అని అనుకున్నారు.
"రూపాయికి ఒక రోటీ - ఆదివారం సెలవు దినాలలో -
ఆటలు, డ్రామాలు, నాట్యాలు వంటి కళలను ప్రదర్శించడానికి,
పనివాళ్ళకు వెన్నుదన్నుగా నిలబడదాము."
"సరే, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే బిడ్డ పుట్టాడు - అంటే, ఇదే కదూ!"
భీమా తల్లిదండ్రులు - తమ పుత్రరత్నం మూలాన -
ఇంత వింతగా - అనేకమందికి వసతి సౌకర్యాలు ఏర్పడడం చూసి,
"బాగుంది, బహు బాగుంది" అనుకుని, సంతోషిస్తున్నారు, కాస్త విస్తుబోతూ ...... ,
&
పాత్రలు ;- భీమరాజ్ - ప్రయాగ్‌రాజ్ - company staff - భీమాస్ family ;
=====================,
BImaraaj anE heerOyin ;-
BImarAj ki caalaa aanamdam,
"imta pramukha kampeneeki security guard gA udyOgam amTEmATalA!!?
enni rikamemDEshan^lanu teccukOwalasiwastunnadi -
ee kotta yuuniphaaramlO tanu emta baagunnADO!?"
imTi numDi bayaldErETappuDu addamtlO okaTi remDu sArlu cUsukuni,
talli iccina Tiphin baaksu saikil meeda kampeneeki cErukumTADu.
BImarAju puTTinappuDu peTTina pEru adi,
sannagaa puucikapullalaa kanabaDutuunna yuwakuDu,
gaali weestE tRLLipaDElaa agupistunna rUpam, `now`
BImarAj^ki peLLi awaDam praSnArdhakam ai kUrcumdi.
tanu "tana kotta `uniform` lO humdaagaanE kanipistunnADu kadaa"
komta tRptigAnE rOjulu gaDustunnaayi. sekyuuriTIgArDulu naalugudikkulakuu kalipi,
enimidi mamdi unnaaru. ee nela BImarAj^ki kampenee wenukawaipu umDi,
kaapalaa kaasE DyUTI - `night shift` waccimdi.
BImaa ki jatagaa umDE prayAg raaj - aakaarapushThi goppadE,
paata sinimaalalO Siwaraawu maadiri - kobbaribODAm laagaa unnaaDu prayaag.
"laarel amD hArDI lAgaa - mee iddari jata BalEgA unnadi."
Bosss, superviser wishNu nawwutuu, Duty appajeppaaru.
********************* ,
paksham rOjulu pakaDbamdeegaa "lephT raiT" anukumTU, amTU
iddaruu kamTireppalaku nidranu duuram cEsi maree kaapalaa kaasaaru.
BIma, prayAg laku - ceekaTi amTE Bayam -
okari bhujaalanu okaru taTTukumTU aTUiTU naDustumDEwAru.
padihEnu rOjulu gaDicaayi,
"imkoka remDuwaarammulu gaDicina caalunu, DE Taimm^ki DyUTI mArustaaru"
amdukE mari, mabbullO unna warshabimduwula kOsam,
wEcicuustunna cakOra pakshullaa ee iruwuru ...... `left right - march fast` ...... ,
dabbuna cappuDu ainadi - amta ettu kaampaumD waal painumDi naluguru duukaaru.
"piTTagODa daggara - cuuDu praayannA!"
daahamtO gomtu taDArina pikilipiTTalaa bheemaa gomtu bomgurupOyi,
tilwaNukutuunna mATalu kaastaa - EwO SabdAla rUpamlO baiTiki weluwaDDAyi.
marimta waNukutunna swaram - aa cimmacIkaTi numDi welupaliki winawaccimdi
"cuustuunE unnaanu, BImannA!"
wALLEmO naluguru, wILLEmO iddaru ~~~~~~,
cOra catushTayam kiTikee cuwwalni laagaaru. tuppu paTTi unnadaaye,
paTukkuna UDi cEtilOki waccEsimdi.
teeraa cUstE adi wiluwa lEni cetta saamaanlu konni unna sTOr^ruumm.
"Taimm lEduraa bablU! tellartumdi, twaragaa iwE teesukeLdAm"
wALLu akkaDunna aa koddi sarukuni mUDu gOne samculalO kaTTukunnaaru. @@@@@@
wALLu wenakki maLLAru. appaTiki dhairyaanni kUDagaTTukunnAru,
laarel haarDI dwayam ......,
baas wALLaki remDu cinna curakattulni maatramE iccaaru.
emdukainaa mamcidani, remDu gamELAlani -
taaLLu kaTTi, DAlu mAdirigaa tayaarucEsukunnaaru.
waari swayamkRshi phalitam, A DALLu ippuDu kAsta amDagaa rakshaa kawacaalainaayi.
BIM prayaag -"hey hey hush hush" amTU `thieves` eduTiki waccaaru.
okaLLanokaLLu - bomma kattulanu JaLipistuu,
DammI pistOLLanu cuupimci daDipistuu, weeramgam cEstunnaaru.
bhujaala baruwutO kaampaumD waal waipu parugu teesaaru.
wemTa gaarDulu CEjimg ...... , cUstumTE - oakari wenakaatala okaru -
"aaru puusala damDa 'laagaa dRSyamaanamai,
nimgilOni cukkalu miNuku miNuku nawwulu cimdimcinaayi.
BImarAj, phremDi ki saiga cEsi, wenuka gETu numDi bayaTiki urikaaru.
babluu gODa duukinappuDu kaalu beNikimdi.
"idEmiTiraa, Dokku saamaanu - pOnlE,waccimdE dakkuDu -
anukuni teccukumTumTE,
ee sannaasulu manalni raahu kEtuwullaa tagulukunnaaru"
domgalu gusagusagaa bussumannaaru. waarilO mugguru speed gaa running cEyaDamtO, tommidaDugulu mumdunnaaru. wenaka babluunu BImarAj paTTukunnADu.
babluu mitrulu cappuna oka pakkaki bomma pisTalsu pElcaaru.
awi nijamaina aayudhaalu - anukuni, BayapaDDAru mana heerOlu.
tRTilO anukOni samghaTana, eTlaaguu dorikaamu kadaa - anukuni, tegimcADu bablU -
imkEmumdi, BImarAj ni oDupugaa paTTukuni, bhujam paina mumduki duukADu.
prayaag^ki Emi jarugutunnadO ardham ayyE lOpuna -
tana friend - cimmacIkaTi teralalO - - gaayab ....... ,
*********************************** ,
cuTTupakkalawALLu, bheemaa kuTumbeekulu, paricitulu, aparicitulu - pOleesulu, patrikalawALLu - okaTE haDAwuDi, itara kampeneela waac^menlu,
kaarmikulu - samgati teliyagAnE wacci, ADiyans samuuhaaniki adanamgaa wacci kalisaaru - "mana kaapalaawALLa batukulimtEraa, bhadrata sunna."
iTlaaga waaLLa kaburlu, Usulu konasaagutunnaayi. waataawaraNam amtaTA ayOmayam wyaapimcimdi.
phyaakTaree Onars "BImarAju ki Edainaa apaayam jarigitE, tamaku apratishTha,
amtE kaadu, panikimaalina kEsulu tagulkuni, irukkumTE,
baiTapaDaDam talaku mimcina bhaaram autumdi. bilabilalADutuu emdarO muugaaru.
wADa wADalalO prajalu ee wishayaanni gurimci ceppukumTunnaaru.
mottaaniki gamdaragOLam alumukumTU, yaajamaanyaaniki resT lEkumDA cEstunnadi.
adi sarE, imtaa cEsi, mana kathaanaayakuni katha EmainaTlu? -
nEstamaa, aTuwEpu dRshTi saarimtamu gaaka!
@@@@@@ ,
domgala pArTI pi.Ti.usha laagaa rEsugurram spIDutO pikkabalam cuupimcaaru.
akkaDa daggaralO, komcepATi ettaina - komDaguTTalu - aa uparitalam waariki koTTina pimDi,
paiki cEraaka, tamanu ewaruu wemTADaDam lEdani nirdhaarimcukunnaaka,
aagi gaali peelcukunnaaru.
bablUdi kamDapushThi kala BArI wigraham, ippaTidAkA BImarAj^ni mOstUnE unnADu.
"hammayya!" BEtALa wikramaarka awataaram ettina atanu, BImarAjuni dimcADu.
oka penuSila payina kuurcObeTTADu.
aitE, ee SAltI nemmadigaa jaaragilabaDi, ulukuu palukuu lEkumDA aaseenuDAyenu.
kiminnaasti,
`pin drop silence`, amdaruu Torch lights wEsaaru.
BImaa - eppuDaitE dRDhakaayuDaina babluu tanani biyyam mUTalaagA wisiri,
bhujampai wEsukunnaaDO appuDE mUrCapOyADu.
"waarnee, spRha lEni pirikisannaasini imtasEpU mOsaamanna maaTa"
"weeNNi ikkaDE wadilEddAm" komtasEpu tarjanabharjanalu paDDAru.
carcOpacarcalu emduku jarigaayamTE, daarilOnE babluu manasulO
oka kotta aiDiyaa merupulaa waccimdi.
"tana cellelu aliwENi - kujadOsham - gaaDida guDDU gUsU - kaaraNAla walana peLLisambamdhaalu kudaraDam lEdu. adeegaaka, aliwENi CAya takkuwa pilla,
ityaadi kaaraNAlu - aamenu 'peLLi kaani prasaadamma 'gaa, kanyagaanE nilipaayi.
ippuDu imka paina decision ki waccEsADu.
"I manishi panilO sinsiyar^gaanE unnADu, adeegaaka, kaasta bhayasthuDu,
oka celliki annagaa - adi tanaki plas paayimTu. jeewitamlO niladokkukOgala -
kashTapaDE tatwam itanilO unnadi. kanuka aliwENii naadhuDu - khaayamgaa itaDE!"
@@@@@@
padi rOjulalO babluu aalOcana amalulOniki waccEsimdi.
BImarAj peLLikoDukai, aliwENI patiyai, oka imTiwADainADu. tama imTiki kaLyaaNa tOraNAlu reparepalADAyi, kanuka bheemaa phyaamilee aalsO weree hyaapee.
- amD kathaku paripushTham cEsina itara amSAlu unnawi, awi EwanagA ......,
"naluguru domgalu parigeDtuu, maa kamTa paDDAru. waarini wemTADAmu. appuDu wALLu samceelani paarEsi, paaripOyaaru."
kampeneelO komcemsEpu dwamdwam yuddham laamTidi cEsinamduwalananuu ......, rALLa meeda kimda paDEsinappuDu - BImarAj^ ki gaayaalu ainaayi.
kaabOyE baawamaridi kanuka, babluu ceppamannaTlugaanE ceppADu, makkiki makkeegaa -
&
"iwi ATTE Kareedaina wastuwulu kaadu kadA!" ani seeriyas^gaa aa sam ghaTananu teesukOlEdu.
BImarAju, prayagulaki SAlareeni pemcaaru.
"ee rijalTu tanaku kUDA anukuulam awaDamtO prayaag saitam
BImm gruupuki wattaasu palikADu.
BAree`cases` kaakumDA - EwEwO melikalu paDi,
tamanu tippalu peTTakuMDA - insiDemT sukhaamtam ayyimdi, kanuka -
uupiri peelcukunna yaajamaanyam,
Sraamikula yOga kshEmaala kOsam - manasu peTTi, panicEyaali - ani anukunnaaru.
"ruupaayiki oka rOTI - aadiwaaram selawu dinaalalO -
ATalu, Draamaalu, naaTyaalu wamTi kaLalanu pradarSimcaDAniki,
paniwALLaku wennudannugaa nilabaDadaamu."
"sarE, kalisoccE kaalaaniki naDicoccE biDDa puTTADu - amTE, idE kadU!"
BImaa tallidamDrulu - tama putraratnam muulaana - imta wimtagaa -
anEkamamdiki wasati saukaryaalu ErpaDaDam cuusi,
"baagumdi, bahu baagumdi" anukuni, samtOshistunnaaru, kaasta wistubOtU ...... ,
********************,
& prev story ;- ఆ ప్రశ్న, ఈ జవాబు - 54 ;- అది ప్రశ్న - ఇది జవాబు - అందించగలరా!? ;; [ Answer ;- March, 2020 - నాలుగు శనివారము ల తేదీలు -
= ఏడవ ఎక్కం - వరుసగా ఇవే ;- 7 - 14 - 21 - 28 ; so .......... ;-
Answer ;- ఏడవ ఎక్కం ] ;;
& + charecters ;- BImrAj, prayAg raj, BablU -
company staff, BIM family ;
Story - 55 ; భీమరాజ్ అనే హీరోయిన్ ;-
భీమాస్ పెళ్ళి కథ - 55 |
;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి