13, మార్చి 2024, బుధవారం

మబ్బులు వైదొలగినవి - 56

దిలీప్ బీచ్‌లో చతికిలబడ్డాడు. సముద్రం అలలు ఎగిరెగిరిపడ్తున్నాయి, 

ఆకాశాన్ని మూసేయాలని తాపత్రయపడుతున్నాయి. 

ఎగసెగసి ఓ కొండరాయికి తగిలి విరిగిపడుతున్నాయి. 

"సముద్రం బాగుంది. కెరటాల అందం బాగున్నది, 

ఆ పైన సంధ్యారాగం బాగుంది, బాగుండనిది - మనిషి మనసే! ......

సాత్విక భావాలకు మసి పూసి పారేడు కాయను చేస్తూ, 

మంచితనానికి విపరీతార్ధాలు తీస్తూ" 

"హల్లో, దిలీప్" నిర్ఝరి  హుప్‌న దూకినట్టుగా కూర్చుంది. 

ఆమె కూర్చోడంతో అక్కడి ఇసుక ఎగిరి దిలీప్ కళ్ళల్లో పడింది. 

మొహమాటంగా ఇబ్బందిని దాచుకుంటూ, 

ఇటు తిరిగి ఆమెను చిరునవ్వుతూ పలకరిస్తూ, 

అటు తిరిగి జాగ్రత్తగా కళ్ళలోని ఇసకను జాగ్రత్తగా తుడుచుకున్నాడు. 

"ఎంతసేపైంది వచ్చి?" 

"ఇప్పుడే" జాలీగా సాగరతరంగాలను చూస్తూ మాట్లాడుకుంటున్నారు. 

"అరుగో,మా అమ్మానాన్నా వస్తునారు." 

వారు కారులో నుండి దిగి వస్తున్నారు."

"ఓ చల్లగాలీ, స్వాగతము పలుకుమా!" నిర్ఝరి కిలకిలా నవ్వింది. 

"నీలా కవిత్వంలో మాట్లాడాలా నేను కూడా! ఐతే" 

ఇంతలో నిర్ఝరి తమ్ముడు "అక్కా, ఇదిగో ఐస్‌ఫ్రూట్" అని, 

ఇద్దరికీ ఇచ్చి, తాను పుల్ల పట్టుకుని, శబ్దం చేస్తూ పీలుస్తూ, తినసాగాడు.

నిర్ఝరి తమ్ముణ్ణి "పండూ!" అని పిలుస్తుంది. 

పండుకి సైతం ఇసకలో ఎగరడం సరదా, 

అందుకని ముందుజాగ్రత్త చర్యగా - కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు  దిలీప్.

నిర్ఝరి తల్లి అడిగింది "ఏం బాబూ! ఈ మధ్య మా వైపు రావటం లేదు. 

బొత్తిగా శీతకన్నేశావు" - నిర్ఝరి parents కొంత ఆధునిక భావజాల వ్యక్తులు, 

వారు కుమార్తె ఫ్రెండ్స్ సర్కిల్‌ని గౌరవిస్తారు, మనసులో అనుమానాలు వంటివి పెట్టుకోరు. 

                                              @@@@@@  ;

నిన్న సాయంత్రం సైకతతీరాన నిర్ఝరి - గోల్డ్‌స్పాట్ కలర్ పంజాబీ డ్రెస్స్‌లో 

ఎంత అందంగా ఉన్నది, సంధ్యాఛాయల అరుణకాంతులను రంగరించుకున్నా 

ఆమె లేత పెదవులు, రెపరెపలాడే కనురెప్పలు - 

మూసీ మూయని తలుపుల వెనుక అర్ధం కాని ఏవో భావాలను - తెలిపీ తెలపనట్లుగా -  ......,

'నిర్ఝరి పరిచయ వేళావిశేషం - తనకెంతో ఆశ్చర్యకరం, అపురూపం , 

ఆఫీసులోకి వచ్చాక కూడా - జ్ఞాపకముల పరిమళాలు ఆవరించుకున్న మనసు .......,

ఆఫీసులో స్ప్రింగ్‌ఛెయిర్‌లో కూర్చున్నాడు.

ప్యూన్ తెచ్చిన కాఫీని సిప్ చేస్తున్నాడు. సెక్రటరీ ఫోన్‌కాల్‌ని రిసీవ్ చేసుకుని, 

బదులు చెప్పాడు. రెణ్ణిమిషాలలో డోర్ తెరుచుకుని వచ్చిన వ్యక్తిని చూసాడు. 

కొత్తగా జాబ్‌లో జాయిన్ అవుతున్న మనిషి, అతను - 

పాయింటెడ్‌షూస్, బెల్‌బాటమ్ ప్యాంట్, వైట్ షర్ట్ - నేవీ బ్లూ టై - 

పాకెట్‌లో ఫౌంటెన్‌పెన్ - బాగానే ఉన్నాడు, 

నెక్‌టై పర్పుల్ కలర్ ఐతే ఇంకా బాగుండేది - అనుకున్నాడు దిలీప్.     

అతను తన రాకను గుర్తు చేస్తూ సన్నగా దగ్గాడు. 

ఠక్కున సర్దుకుని, దిలీప్ "కూర్చోమని" సైగ చేసాడు.

దిలీప్ తనలో తాను ఆశ్చర్యపడసాగాడు,

"తనకు ఈ పరిశీలనా జాడ్యం ఎప్పణ్ణుండి వచ్చింది? 

నెల క్రితం టైపిస్టు ఉద్యోగంలో చేరిన ధీరవి-ని కూడా 

తను ఈ మాదిరిగానే చూసాడు కాబోలు, 

ఆమె ముఖం చిట్లించుకుంటే గానీ తనకు అర్ధం కాలేదు, 

అప్పుడూ ఇట్లాగే సర్దుకున్నాడు. 

ఈ స్త్రీ పురుష భేదాలు సృష్టి చమత్కారం, సంఘం స్వరూపాన్ని, 

మనిషి మనిషికీ ఉండాల్సిన సంబంధబాంధవ్యాలు - పట్టు దారముల లాంటివి, 

అటువంటి సున్నిత బంధాలను 

నిర్దిష్టంగా తీర్చిదిద్దడానికి తమాషాగా - ఎన్నెన్నో నిబంధనలు ఏర్పడినవి - 

ఆయా సొసైటీలు తమను తాము - మలుచుకున్నవి.

తను ఇప్పుడు - ఈ కొత్త వ్యక్తిని, ఆ రోజు ధీరవిని ఇదే మాదిరిగా చూసిఉంటాడు, 

కానీ - ఇతను మగవాడు కాబట్టి - 

తన ఆలోచనా దృక్కులకు - విపరీతార్ధాలు సంభవించలేదు, 

అదే స్థానంలో ఒక స్త్రీ - ఉండి ఉంటే - 

జనం దృష్టిలో - తనొక కాముకునిగా - 

లాలసపరునిగా - ముద్రపడి ఉండేవాడు.   

వెల్లువంటి వింత ఆలోచనల నుండి తేరుకుని

అప్లికేషన్‌లో చూసి, మురళి - కి చేయాల్సిన వర్క్ అప్పజెప్పాడు దిలీప్. 

                                               @@@@@@  ;

రోజులు కులాసాగా గడుస్తున్నాయి. నిర్ఝరి తమ్ముడు పండూ - 

సమ్మర్ హాలిడేస్ - స్పోర్ట్స్ - టేబుల్‌టెన్నిస్ ఆటను సెలెక్ట్ చేసుకునాడు.

అక్కడ మురళి పరిచయమైనాడు. టేబుల్ టెన్నిస్ కు ఫ్రెండుగా దొరికిన

 - మురళి - అంటే పండుకి అభిమానం ఏర్పడసాగింది.

తన అక్క నిర్ఝరికి మురళిని పరిచయం చేసాడు పండూ.

మురళితో చనువుగా ఉంటున్నది, అది దిలీప్‌కి నచ్చడం లేదు. 

కానీ, బైటపడడం లేదు.  నిర్ఝరి family - ప్రవర్తనాపరంగా ఫార్వార్డుగా - 

ఆధునికంగా ఉంటున్నారాయె మరి, ఇంకెట్లాగ!? - 

తను ఆమెను అనుమానిస్తున్నట్లు కనబడగలడు!!?? - 

వారి దృష్టిలో తను చులకన ఐపోతాడే,

 'ఏమి చేయాలో పాలుపోక, లోలోపల మెలి తిరుగుతున్న మనస్సుతో 

                 క్రుద్ధుడు ఔతున్నాడు దిలీప్.

                                               @@@@@@  ;

మురళి - వెడ్డింగ్ కార్డుని ఇచ్చాడు , 

"హమ్మయ్య"  మన హీరో దిలీప్‌కి ప్రాణం లేచొచ్చింది. 

శుభలేఖలో వదువు ధీరవి - సంతోషంతో మనసు ఉరకలెత్తుతున్నది.

మురళికి 'తన పెళ్ళి అంటే దిలీప్‌కి తన కంటే ఎక్కువ ఆనందం - 

ఆట్టే బోధపడకపోయినా - అది గొప్ప incident అని భావించలేదు.

" నిర్ఝరి ఫామిలీ ని కూడా పిలవండి." 

ఈ ట్విస్ట్ ఎందుకో - ధీరవికి, మురళికి అర్ధం కాలేదు. 

కానీ మురళికి నేస్తం పండూ - కాబట్టి "సరే, సార్" అని 

ఉభయులు ఏకకంఠంతో చెప్పారు.

వారి వెంట వెంటబడి మరీ దిలీప్ వెళ్ళాడు. 

                                              @@@@@@

శుభలేఖ చూస్తూనే  నిర్ఝరి చురుక్కున వేసిన ప్రశ్న ఇదియే ......, 

"అరె, మీ ఇద్దరూ లవ్ జంట......  - ఎప్పణ్ణుండి?" 

దిలీప్ కాబోయే అత్త మామలు - "తప్పకుండా వస్తాం" అని చెప్పారు.

"ముచ్చటైన జంట" అన్నారు మేడ మీద అద్దెకు ఉంటున్న రామకృష్ణ.

"మీ అమ్మాయి సరళకు మురళి ని సెట్ చేద్దామనుకున్నాను, అంకుల్! 

ఈ లోపునే లవ్ అఫైర్, మ్యారేజి సెటిల్ అవడం కూడా జరిగిపోయాయి" 

"ఇందుకోసమా, మురళి పైన అంత శ్రద్ధ చూపిస్తూ వచ్చావు!!!" 

here - hero దిలీప్ మదిలోని సందేహాలన్నీ పటాపంచలు ఐపోయాయి.

"ఫర్వాలేదు నిర్ఝరీ, బ్రహ్మముడి - ముందరే నిర్ణయించబడి ఉంటుంది కదా" 

రామకృష్ణ గారి భార్య అపర్ణాదేవి అన్నది, 

"ఇంతకీ - నీ పెళ్ళి గురించి తాత్సారం చేస్తున్నారే!!?" 

వారి కుమార్తె సరళ నవ్వుతూ అన్నది 

"మీ కళ్యాణతాంబూలాలు ఎప్పుడో, బహిర్గతం చేయండి అక్కా!"

నిర్ఝరి పేరెంట్స్ వైపు అందరూ చూసారు. 

"మా పండూ టెన్త్ క్లాస్ - ప్యాస్ ఐనాడు. 

మా ఊళ్ళో అప్పు తీసుకున్నవాళ్ళు - మాకు మనీ చెల్లించారు. 

ఇక మాకు డబ్బు ఖర్చు నిమిత్తం వెనకా ముందూ ఆడే పని లేదు."

"నిర్ఝరి నిన్ననే చెప్పింది. so now - దిలీప్ మా కాబోయే అల్లుడు" - అన్నది నిర్ఝరి తల్లి.

పండూ అన్నాడు "ఐతే నా డైలాగ్ మాత్రమే మిగిలింది, 

మా ఇంట్లో సన్నాయి మేళం ప్పి ప్పి ప్పీ డుమ్ డుమ్ డుమ్ -...... " - 

============================= ,

mabbulu waidolaginawi - 56 ;- Telugu story ;-

 dileep^ beec^lO catikilabaDDADu. samudram alalu egiregiripaDtunnaayi, 

aakaaSAnni meesEyaalani taapatrayapaDutunnaayi. 

egasegasi O komDaraayiki tagili wirigipaDutunnaayi. 

"samudram baagumdi. keraTAla amdam baagunndi, 

aa paina samdhyaaraagam baagumdi, 

baagumDanidi manishi manasE, saatwika bhaawaalku 

masi puusi maarEDu kAyanu cEstuu

mamcitanaaniki wipareetaardhaalu teestuu" 

"hellO, dilIp" nirJari  hup^na duukinaTTugaa kuurcumdi. 

aame kuurcODamtO akkaDi isuka egiri dilIp kaLLallO paDimdi. 

mohamATamgA ibbamdini daacukumTU, 

iTu tirigi aamenu cirunawwutuu palakaristuu, 

aTu tirigi jaagrattagaa kaLLalOni isakanu jaagrattagA 

tuDucukunnADu. 

"emtasEpaimdi wacci?" 

"ippuDE" jaaleegaa saagarataramgaalanu cUstuu mATlADukumTunnAru. 

"arugO,mA ammAnaannA wastunaaru." car lO numDi digi wastunnaaru."

"O callagaalee, swaagatamu palukumA!" 

nirJari kilakilaa nawwimdi. 

"neelaa kawitwamlO mATlADAlaa nEnu kUDA! aitE" 

imtalO nirJari tammuDu "akkaa, idigO ice fruit" ani, 

iddarikee icci, taanu pulla paTTukuni, Sabdam cEstU peelustuu, tinasAgADu.

nirJari tammuNNi "pamDU!" ani pilustumdi. pamDuki saitam -

isakalO egaraDam saradA, amdukani -

mumdujaagratta caryagaa - kuulimg glaases peTTukunnADu  dilIp.

nirJari talli aDigimdi "Em bAbU! ee madhya maa waipu raawaTam lEdu. 

bottigaa SItakannESAwu"

nirJari `parents` komta aadhunika bhaawajaala wyaktulu, 

waaru kumaarte frends circle ni gaurawistaaru, 

manasulO anumaanaalu wamTiwi peTTukOru.

                                               @@@@@@  ;

ninna saayamtram saikatateeraana nirJari - Gold spot color - 

Punjabi Dress^lO emta amdamgaa unnadi, samdhyaaCAyala aruNakaamtulanu ramgarimcukunnaa aame lEta pedawulu, reparepalaaDE kanureppalu - 

muusee muuyani talupula wenuka ardham kaani EwO BAwaalanu - 

telipee telapanaTlugaa -  ......,

'nirJari paricaya wELAwiSEsham - tanakemtO AScaryakaram, apuruupam , 

aapheesulOki waccaaka kuuDA - jnaapakamula parimaLAlu aawarimcukunna manasu .......,

aapheesulO spring chair lO kuurcunnADu.

pyuun^ teccina kaapheeni sip^ cEstunnADu. 

secretary -phone call ni riseew cEsukuni, badulu ceppADu. 

reNNimishaalalO DOr^ terucukuni waccina wyaktini cuusaaDu. 

kottagaa jaab^lO jaayin awutunna manishi, atanu - 

 pointed shoes, bell bottom pant, white shirt - 

navy blue neckTie - pocket lO fountain pen - baagaanE unnADu, 

nek^Tai parpul kalar aitE imkaa baagumDEdi - anukunnADu dilIp   

atanu tana raakanu gurtu cEstU sannagaa daggADu. 

Thakkuna sardukuni, dileep "kuurcOmani" saiga cEsADu. 

dileep tanalO taanu AScaryapaDasAgADu,

"tanaku ee pariSIlanaa jADyam eppaNNumDi waccimdi? 

nela kritam TaipisTu udyOgamlO cErina dheerawi - ni kUDA 

tanu ee maadirgAnE cUsADu kAbOlu, aame mukham ciTlimcukumTE gaanee 

tanaku ardham kaalEdu, appuDuu iTlAgE sardukunnADu. 

ee stree purusha BEdaalu sRshTi camatkaaram, samgham swaruupaanni, 

manishi manishikee umDaalsina sambamdhabaamdhawyaalu - 

paTTu daaramula lAMTiwi, aTuwamTi sunnita bamdhaalanu 

nirdishTamgaa teercididdaDAniki tamaashaagaa - 

ennennO nibamdhanalu ErpaDinawi - 

aayaa society lu tamanu taamu - malucukunnawi.

tanu ippuDu - ee kotta wyaktini, aa rOju dheerawi

ni idE maadirigaa cuusiumTADu, kanee - itanu magawADu kAbaTTi - 

tana aalOcanaa dRkkulaku - wipareetaardhaalu sambhawimcalEdu, 

adE sthaanamlO oka stree - umDi umTE - janam dRshTilO - 

tanoka kaamukunigaa - laalasaparunigaa - mudra paDiumDEwADu.

application ^lO cuusi, muraLi - ki cEyaalsina wark appajeppADu dileep. 

                                               @@@@@@  ;

rOjulu kulaasaagaa gaDustunnaayi. nirjhari tammuDu pamDU - 

summer holidays - spOrTs - TEbul^Tennis ATanu selekT cEsukunADu.

akkaDa muraLi paricayamainADu. TEbul Tennis ku friend gaa dorikina 

- muraLi - amTE pamDuki abhimaanam ErpaDasaagimdi. 

tana akka nirJariki muraLini paricayam cEsADu pamDU.

muraLitO canuwugaa umTunnadi ......, 

         adi dileep^ki naccaDam lEdu. kaanee, baiTapaDaDam lEdu.  

nirJari `family` - prawartanaaparamgaa phaarwaarDugaa - 

aadhunikamgaa umTunnaaraaye mari, imkeTlAga!? - 

tanu aamenu anumaanistunnaTlu kanabaDagalaDu!!?? - 

waari dRshTilO tanu culakana aipOtaaDE, 

'Emi cEyaalO paalupOka, lOlOpala melititirugutunna manassutO 

                    kruddhuDu autunnADu dileep. 

                                               @@@@@@  ;

muraLi - wedding card ni iccaaDu , 

"hammayya" mana hero dileep^ki prANam lEcoccimdi. 

SubhalEkhalO waduwu dheerawi - samtOshamtO manasu urakalettutunnadi.

muraLiki 'tana peLLi amTE dileep^ki tana kamTE ekkuwa aanamdam - 

ATTE bOdhapaDakapOyinaa - adi goppa `incident` ani bhaawimcalEdu.

" nirJari phaamilii ni kUDA pilawamDi."t

ee Twis emdukO - dheerawiki, muraLiki ardham kaalEdu. 

kaanee muraLiki nEstam pamDU - kaabaTTi 

"sarE, saar" ani ubhayulu EkakamThamtO ceppaaru.

waari wemTa wemTabaDi maree weLLADudileep. 

                                               @@@@@@  ; 

SuBalEkha cUstuunE nirJari curukkuna wEsina praSna idiyE ..... , 

"are, mee iddaruu love jamTa ...... - eppaNNumDi?"  ...... , 

dileep kaabOyE atta maamalu - "tappakumDA wastaam" ani ceppaaru.

"muccaTaina jamTa" annaaru mEDa meeda addeku umTunna raamakRshNa.

"mee ammaayi saraLaku muraLi ni seT cEddaamanukunnaanu, uncle, 

ee lOpunE law aphair, myaarEji seTil awaDam kUDA jarigipOyaayi" 

"imdukOsamaa, muraLi paina amta Sraddha cuupistuu waccaawu!!!" 

dileep madilOni samdEhaalannee paTaapamcalu aipOyaayi.

"pharwaalEdu nirjharee, brahmamuDi - 

mumdarE nirNayimcabaDi umTumdi kadaa" 

raamakRshaNa gaari BArya aparNAdEwi annadi, 

"imtakee - nee peLLi gurimci taatsaaram cEstunnaarE!!?"

waari kumaarte saraLa nawwutuu annadi 

"mee kaLyaaNataambuulaalu eppuDO, 

bahirgatam cEyamDi akkA!"

nirjhari pEremTs waipu amdaruu cuusaaru. 

"maa pamDU Tenth class pass ainADu. 

maa ULLO maa daggara appu teesukunnawALLu - 

maaku manee cellimcaaru. ika maaku Dabbu kharcu nimittam 

wenakaa mumduu ADE pani lEdu."

"nirjhari ninnanE ceppimdi. dileep maa kaabOyE alluDu" - 

annadi nirJari talli.pamDU annADu "

aitE naa Dailaag maatramE migilimdi, 

maa imTlO sannaayi mELam ppi ppi ppee Dumm Dumm dumm ...... " - 

&

Charecters ;- dilIp, nirJari - aame parents & brother pamDU ;;  

muraLi, Typist dheerawi -::

mEDa meedi `family` - raamakRshNa & BArya aparNAdEwi & putrika saraLa ;

mabbulu waidolaginawi - 56 ;

                                               @@@@@@ 

పాత్రలు ;- దిలీప్ & నిర్ఝరి & నిర్ఝరి తమ్ముడు పండూ -  

మురళి & typist ధీరవి  & మేడ మీది family - రామకృష్ణ - భార్య అపర్ణాదేవి & పుత్రిక సరళ ;

& story ;-  మబ్బులు వైదొలగినవి - 56 ;;

& previous story - blog print = భీమరాజ్ అనే హీరోయిన్ - 55 ;- భీమరాజ్ కి చాలా ఆనందం, "ఇంత ప్రముఖ కంపెనీకి - సెక్యూరిటీ గార్డు💂గా ఉద్యోగం అంటేమాటలా!!?  & ;

& ;- prev ;- ఆ ప్రశ్న, ఈ జవాబు - 54  ;-  అది ప్రశ్న - ఇది జవాబు - అందించగలరా!?

[ Answer ;- March, 2020 - నాలుగు శనివారము ల తేదీలు -

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గాడిదలు - గజరాజు - CK - 1

క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం  మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,  అంచేత ...