శ్రీకర్ ;- పల్లవీ! మా ఊరి నుండి - అల్టిమేటమ్ జారీ చేసారు మా మమ్మీ,డాడీ -
ప్లీజ్, త్వరగా మనం డెజిషన్ తీసుకోవలసిన టైమ్ వచ్చింది
పల్లవి ;- అబ్బబ్బ, ఒక్క తెలుగు ముక్కైనా - లేకుండా బ్రహ్మాడంగా
ఇంగ్లీష్‌లో మాత్రమే మాట్లాడగల మేధావివి నువ్వు అక్కడెక్కడో పుట్టి,
ఇక్కడికి ఇప్పుడే దిగివచ్చిన సీమదొరవి బాబూ, నువ్వు.
శ్రీకర్ ;- ఓ సారీ, ఊహు - ఊ....... ఛమించుండ్రి :) డి ......,
పల్లవి ;- చూడు శ్రీకర్, మా ఇంట్లో కొంచెం ఛాదస్తం పాలు ఎక్కువ.
మా నాయనమ్మకు దైవభక్తి ఎక్కువ,
అంతకు మించి పురాణాల మీద ఇంకా ఎక్కువ భక్తి. నెక్‌స్ట్ -
శ్రీకర్ ;- [నెక్ష్త్ అనగానే పల్లవి వంక చూసి, వ్యంగ్యంగా పెదవి విరుస్తూ,
కనుబొమలు ఎగరేస్తూ నవ్వును బైటికి రానీయకుండా ఆపుకుని, శ్రద్ధగా తలూపుతూ]
ఆ నెక్స్ట్ చెపు చెప్పు -
పల్లవి ;- [అతని శ్లేషను గుర్తించలేదు]
మా నాన్నగారికి సంగీతం అంటే ఎక్కువ మక్కువ.
చిన్నప్పుడు పౌరాణిక నాటకాలు సైతం వేసారు. ఎందుకైనా మంచిది,
నువ్వు ఇతిహాస నాటకం నాలుగు డైలాగుల్ని బట్టీ పట్టి రా,
మా గృహసీమలో ఉన్న యావన్మందీ సరే నంటే, జయం మనదే!
శ్రీకర్ ;- యావన్మందీ - అనగా మీ పేరెంట్స్, వారి తల్లిగారు - అంతేకదా -
I am ready, మన ప్రాక్టీసు మామూలుగుండదు మరి.
కానీ, ఒకవేళ ఓకె అనకుంటేనో -
పల్లవి ;- ష్, అభద్రపు మాటలు నువ్వు అనకూడదు, నేను వినకూడదు.
శ్రీకర్ ;- ఇప్పటిదాకా ఈ లవ్లీ పల్లవి పాదాలు పట్టుకుంటూనే ఉన్నాను.
నీ చేయి పట్టుకుని, సప్తపది - వివాహ తతంగం జయప్రదంగా అయ్యే వరకూ -
నా గుండె గుబగుబలాడూనే ఉంటుంది -
పల్లవి ;- నా మీద నాకు నమ్మకం ఉంది,
మా గృహసామ్రాజ్యంలో నా మాటే వేదవాక్కు.
శ్రీకర్ ;- ఐతే ఈ చరణగ్రాహి - తప్పక పాణిగ్రాహి ఔతాడు, అంతకన్నానా ......
పల్లవి ;- నవ్వులు గుమ్మరిస్తూ] నందో రాజా భవిష్యతి. అంతా శుభం -
బై బై ... ; ... goodbye -
@@@@@@
శ్రీకర్ ;- ఇంట్లో ఎవరైనా ఉన్నారా!! పల్లవి ఎక్కడున్నదో, సరే,
ఈ ఛెయిర్‌లో కూర్చుంటాను. [కింద పడ్డాడు]
అబ్బ, నడుం కలుక్కుమంటున్నది. ఐనా,
వరండాలో విరిగిన కుర్చీలు, బెంచీలు ఎవరైనా వేస్తారా!! -
వీళ్ళొక్కళ్ళే కనిపిస్తున్నారు - ఇట్లాంటి సాంప్రదాయం
టీకా తప్పక పాటించేవాళ్ళు. హు...!
సరే, నిన్నటి పద్యాలను ప్రాక్టీస్ చేస్తాను [గొంతు సవరించుకుని]
ఏమీ, అన్న మాటను జవదాటనందువా - కృష్ణా,
ఈ భీముని సోదరభక్తి హిమనగ శిఖరం అంత ఎత్తు ......,
ఊఊఊఊ ......, ఓహో, కంసమామా ......., - 1 -
మామ్మ అప్పచ్చమ్మ ;- ఎవరు నాయనా! మామ్మా అంటూ పిలిచారు!?
[పల్లవి గేటు తీసుకుని, లోపలికి వచ్చింది] ;-
హాయ్, ఎంతసేపైంది వచ్చి?
శ్రీకర్ ;- ఓహో, భామా నీ భరతంబు పట్టెద ......,
అప్పచ్చమ్మ ;- మా నాయనే, నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తున్నది.
ఈ రోజుల్లో కుర్రకుంకలు - టికిల్ టింకిల్ లిటిల్ స్టార్ - అంటుంటారు.
ఇన్నాళ్ళకి సాక్షాత్కరిస్తున్నా - భారత, రామాయణాన్ని చేత పట్టుకున్నవాడివి ...... ,
పల్లవి ;- మా మామ్మకి slight గా చెవుడు - నెమదిగా నువ్వే అలవాటు పడతావు.
శ్రీకర్ ;- నేను భరతం పడతాను - అంటే
మహాభారతం చదవడం అనే అర్ధం కూడా ఉన్నదన్న మాట. - 2 -
పల్లవి ;- నేను డ్రెస్ మార్చుకుని వస్తాను - ఇదిగో, మహిళా ప్రభంజనం -
ఈ మంత్లీ - తిరగేస్తూ, మామ్మతో సందర్భానుసారంగా మాట్లాడుతూండు.
మామ్మ అప్పచ్చమ్మ ;- అమ్ములూ, పల్లవమ్మా, ఈ అబ్బాయికి,
నాకూ చిక్కని కాఫీలు రెండు గ్లాసులు తీసుకురామ్మా.
బాబూ శ్రీ, వ్యాస భారతం పూర్తిగా చదివావా
శ్రీకర్ ;- కొన్ని వ్యాసాలు, అవే ఎస్సేలు - రాసాను,
లోకల్ మేగజైనులలో, మా కాలేజి magazineలో ప్రింట్ ఐనాయి మామ్మ గారూ!
అప్పచ్చమ్మ మామ్మ ;- కర్ణ కథ ఉన్నది చూసావూ ....
శ్రీకర్ ;- మా అంగలకుదురు కరణం చాలా కన్నింగ్‌ఫెలో -
అతనికి రైట్‌హాండ్ మునసబు - నక్కజిత్తులమారి, సెంట్‌పర్సంట్ మోసగాడు -
మామ్మ ;- మౌసల పర్వం కూడా చదివావా,
తెలుగు కవిత్రయం, సంస్కృతం వ్యాస మహర్షి -
రెండూ ఔపోసన పట్టావన్నమాట, బుద్ధిమంతుడివి -
శ్రీకర్ ;- బుద్ధిమంతుడు - సినిమాను ఆరుసార్లు చూసాను మామ్మగారూ -
మామ్మ ;- రామాయణం - సంపూర్ణంగా చదివావా -
పల్లవి ;- అదే, వాల్మీకి మహర్షి రచన - ఇతిహాసం అది -
శ్రీకర్ ;- అదే అదే వాల్మ్ వాల్ వాల్ .....,
పల్లవి ;- మీకి - మీకి రచన -
శ్రీకర్ ;- మీకీ రచన అది,
మామ్మ ;- ప్రాచీనకాలంలో సిరిపూర్ - కాగజ్‌నగర్ - భద్రాచలం పేపర్ మిల్లులు,
దస్తావేజు కట్టలు లేవు కదా, ఐతేనేం -అంతంత ఉద్గ్రంధాలను, ఇతిహాసాలను - కేవలం తాళపత్రాల పైన రాసారు,
ఎంతమాత్రం కష్టం అని అనుకోలేదు వాళ్ళు.
మంచి ఆశయాలు ఉంటే మహా గ్రంధాలు ఉద్భవిస్తాయి.
శ్రీకర్ ;- తాళం పైన ఎట్లాగ రాయగలిగారు? నా దగ్గర అరడజను కీస్ [keys] ఉన్నాయి.
ఒక్కో తాళం పైన five letters కంటే పట్టవు కదా,
పల్లవి ;- ఉహ్హూ, తాళపత్రం - తాళపత్రాలు - అంటే తాటాకులు,
శ్రీకర్ ;- ఓహో-
[పల్లవి తండ్రి సోమశేఖర శర్మ enter] ;-
సోశేశర్మ ;- శాంతమూ సౌఖ్యమూ లేదూ ...... - ఎవరూ?
పల్లవి ;- ఇతను శ్రీకర్ -
సోశేశర్మ ;- ఆ, నిన్న చెప్పావు కదా, sit down - Take u'r seat శ్రీకర్.
[కూతురు ఇచ్చిన కాఫీ కప్పులను అందరూ అందుకున్నారు.] -
"సంగీత సారమూ, భక్తి వినా ....
శ్రీకర్ ;- music is devine - సంగీతం అద్భుతమైనది సార్,
పసిపాపలు - పాపలు - ప్పాపాయిలూ ......,
పల్లవి ;- [చెవిలో] పశువులూ - ఫణములూ ...... ,
శ్రీకర్ ;- ఆ, ఆ! పాపలు, జంతువులు అన్నీ మ్యూజిక్‌ని
సరదాగా, శ్రద్ధగా వింటాయి.
పల్లవి ;- అదే నాన్నా! శిశుర్వేత్తి, పశుర్వేత్తి - వేత్తి గానరసం ఫణిః} -
అని కదా చెబ్తున్నావు, శ్రీ!
శ్రీకర్ ;- హా - హ్హ - హ్హు -
సోశేశర్మ ;-త్యాగరాజు మన తెలుగు వారి అదృష్టం -
శ్రీకర్ ;- ఆ రాజుగారు - మన సౌతిండియా కింగ్ -
[పల్లవి అతని పాదం గట్టిగా తొక్కింది] - అబ్బా, గట్టిగా తొక్కేసావు -
పల్లవి ;- త్యాగయ్య కృతులను రాసారు.
శ్రీకర్ ;- త్యాగాయ్ గారండీ, కృత్తులు, వత్తులు చేసారండీ.
సోశేశర్మ ;- ముత్తుస్వామి దీక్షితర్‌గారికి ఆ పేరు ఎట్లా వచ్చింది?
శ్రీకర్ ;- స్రీ స్వామి వారికి కిస్ ఇస్తానని - అనుకున్నారు - "కాబోలు" -
మామ్మ ;- "చేబ్రోలు"- నుండే మేము మా ఊరు చేరతాము -
[ పల్లవి మళ్ళీ అతని వీపు వెనుక గిల్లింది]
అమ్మో - మరీ గట్టిగా గిల్లావు, మళ్ళీ నన్ను ఈ పద్ధతిలో
స్మార్ట్ వర్నింగ్ ఇవ్వాల్సి వస్తే మాత్రం, కాస్త నెమ్మదిగా - గిచ్చు పల్లూ!
లేకుంటే నేను ఫ్రాక్చర్స్ కట్లు అవతారం వేసుకుని, ఇల్లు చేరాల్సివస్తుంది.
సోశేశర్మ ;- కర్ణాటక సంగీతం సంగతి కాస్సేపు పక్కన పెడదాం గానీ,
మన నాటక, రూపక, డ్రామాలు - గురించి, నీకు తెలిసింది చెప్పు విరించీ -
శ్రీకర్ ;- నేను విరించిని కాను సర్, శ్రీకర్‌ని -
శ్రీకర్ ;- పల్లూ again గిచ్చుతుందేమో, ఆ సోఫా పై మారడం safe,
తండ్రి ;- డ్రామాలు వేసావా!?
శ్రీకర్ ;- ఇప్పుడిప్పుడే - ప్రేమ కోసమై - డ్రామాలు నేర్చుకుంటున్నానండీ.
తండ్రి ;- ఏమిటోయ్, ఇప్పటి దాకా - ఇటు కూర్చున్నవాడివి అటు మారుతున్నావు?
శ్రీకర్ ;- ఇక్కడ గోడకు ఆనుకుని కూర్చుంటే, నా వీపు సేఫ్‌గా ఉంటుందని -
తండ్రి ;- నేను చిన్నతనంలో నాటకాలు నాలుగు వేసాను.
నీ అంత అయ్యాక, యుక్త వయసులో శ్రీకృష్ణస్వామి వేషం కట్టాను.
'చెల్లియో, చెల్లకో తమకు చేసిన ...... ,
శ్రీకర్ ;- నా చెల్లెలు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నది సర్.
పల్లవి ;- హుష్ - ఉష్ -
సోశేశర్మ ;- ఆ పద్యాన్ని గొంతెత్తి పాడాను, శ్రీరామ నవమి పందిరి అంతా -
ప్రేక్షకుల చప్పట్లతో మారుమ్రోగింది. జెండాపై కపిరాజు -
నేను మొదలుపెట్టగానే, వన్స్ మోర్ వన్స్ మోర్ - అంటూ కేకలు, ఈలలు ...... ,
శ్రీకర్ ;- నాకు తెలీక అడుగుతునాను, రాజుగారు జెండాను -
పైన కప్పుకున్నారా, ఎందుకని?
సోశేశర్మ;- చూడు శ్రీకర్, ఇందాకటి నుండి చూస్తున్నాను.
నీకసలు కళల గురించి ఆవగింజంత ఐనా తెలిసినట్లు అనిపించడం లేదు.
నువ్వెవరి అబ్బాయివి?
శ్రీకర్ ;- మా నాన్నగారు శ్రీకృష్ణ గౌతమేశ్వర్ గారు.
సోశేశర్మ;- కృష్ణ గౌతమ్ గారి కుమారుడివా!! ఆయన గొప్ప పండితుడు, విద్వాంసులు - మరైతే నువ్వేమో పండితపుత్రాః పరమ శుంఠ - అనే సూక్తి గుర్తుకు వస్తున్నది -
పల్లవి ;- నాన్నారూ, ప్లీజ్, శ్రీ ఈ ఇంటికి కాబోయే అల్లుడు,
హాస్యం అనుకుని మీరు ఏమేమో మాట్లాడేస్తున్నారు ...... ,
శ్రీకర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, గవర్న్‌మెంట్ ఉద్యోగస్థులున్నూ .......,
సోమ ;- [సర్దుకుని] - ఔనమ్మా, నరం లేని ఈ నాలిక
అనవసరపు మెలికలు తిరుగుతున్నది. సారీ శ్రీకర్!
అప్పచ్చమ్మ మామ్మ ;- ఈ కొత్త పిల్లాడు కాస్త అణకువ ఉన్నవాడు,
నా జనరల్ నాలెడ్గిని కూడా సానబెట్టుకోనీయి, అమ్మడూ!
పల్లవి ;- బామ్మా, మా పెళ్ళి అయ్యాక - శ్రీని దొరకబుచ్చుకో,
ఇప్పటికి వాయిదా వెయ్యి, వెయ్యి దణ్ణాలు నీకు.
అప్పచ్చమ్మ ;- అంతేనంటావా, హూ సరే - ;
[పల్లవి తల్లి తామ్రవల్లి table cloth సర్ది, కప్పులు తీస్తూ .... ]
తామ్రవల్లి ;- నిను హడలగొట్టవద్దని, మా పల్లవి నిన్ననే చెప్పింది,
వీళ్ళ ధాటికి నువ్వు ఆగగలవా, శ్రీ బాబూ! [ అందరూ నవ్వుతారు]
మీ అమ్మగారు, మీ కుటుంబానికీ, మాకు మంచి స్నేహం -
మీ కుటుంబం ఇరుగుపొరుగుతో కలుపుగోరుగా ఉండేవాళ్ళు,
సో.శే. ;- కృష్ణగౌతమ్ మేమూ - పోడూరులో - ఎదురుబదురు ఇళ్ళలో ఉన్నాము.
పాతికేళ్ళ క్రితం చూసాను. ఉద్యోగరీత్యా ఊళ్ళు మారడంతో దూరమైనాము.
ఇప్పుడు బంధుత్వాలు కలుపుకుని, బంధం వేసుకుందాం,
దూరాలు చెరిపేసి, బంధం ఏర్పడడానికి -
పునాదిరాళ్ళు - ఐన మీకు అభినందనలు.
శ్రీకర్ ;- నేను, పల్లవి - కలిసిన మొదటి క్షణం - గొప్పదనం అది, మామయ్యగారూ -
సోమశేఖర శర్మ;- వావ్, నువ్వు కూడా మాటకారివే - శభాష్ అల్లుడూ ......, ;
తామ్రవల్లి ;- మా పల్లవి పాణిగ్రహణం -
సస్పెన్సుకు ఇన్నాళ్ళకు ముడి వీడింది -
మామ్మ ;- మన ఇంటి అల్లుడు మంచివాడే,
పల్లవి ;- శ్రీకర్, ఇప్పుడు నిజమైన పాణిగ్రాహివి ఔతున్నావుగా -
be happy పెళ్ళి తర్వాత సంసారం, కాపురం ఖర్చులను తలుచుకుంటూ -
అట్లాగ మొహం ముడుచుకు కూర్చుంటే ఎట్లాగ? పారాహుషార్ - ;-
================================= ,
pallawi, pANigrAhi - 57 ;-
SrIkar ;- pallawI! maa uuri numDi - alTimETamm jaaree cEsaaru -
maa mammee,DADI - pleej, twaragaa manam Dejishan teesukOwalasina
Taimm [time] waccimdi
pallawi ;- abbabba, okka telugu mukkainaa - lEkumDA brahmADamgaa
imgleesh^lO [ ENGLISH ] mAtramE mATlaaDagala mEdhaawiwi nuwwu, akkaDekkaDO puTTi, ikkaDiki ippuDE digiwaccina seemadorawi baabU, nuwwu.
SrIkar ;- O saaree, uuhu - uu....... CamimcumDri ......,
pallawi ;- cUDu Sreekar, mA iMTlO komcem CAsam pAlu ekkuwa.
maa naayanammaku daiwabhakti ekkuwa, amtaku mimci purANAla mIda
imkaa ekkuwa hakti. nek^sT [next] ; -
SrIkar ;- [`next` anagaanE pallawi wamka cuusi, wyamgyamgaa pedawi wirustuu,
kanubomalu egarEstuu nawwunu baiTiki raanIyakuMDA aapukuni,
Sraddhagaa taluuputuu] aa neksT cepu ceppu -
pallawi ;- [atani SlEshanu gurtimcalEdu] maa naannagaariki samgeetam
amTE ekkuwa makkuwa. cinnappuDu paurANika nATakAlu saitam wEsaaru.
emdukainaa mamcidi, nuwwu itihaasa nATakam naalugu Dailaagulni baTTI paTTi rA,
maa gRhaseemalO unna yaawanmamdee sarE namTE, jayam manadE!
SrIkar ;- yaawanmamdee - anagaa mee pEremTs, waari talligaaru - amtEkadA -
ayaamm reDI, mana praakTeesu maamuulugumDadu mari. kaanee,
okawELa Oke anakumTEnO -
pallawi ;- sh, abhadrapu mATalu nuwwu anakUDadu, nEnu winakUDadu.
Sreekar ;- ippaTidaakaa ee lawlee pallawi paadaalu paTTukumTUnE unnaanu.
nee cEyi paTTukuni, saptapadi - wiwaaha tatamgam jayapradamgaa ayyE
warakuu - naa gumDe gubagubalADUnE umTumdi -
pallawi ;- naa meeda naaku nammakam umdi, maa gRhasaamraajyamlO
naa maaTE wEdawaakku.
Sreekar ;- aitE ee caraNagraahi - tappaka pANigraahi autADu, amtakannaanaa ......
pallawi ;- nawwulu gummaristuu] namdO raajaa bhawishyati. amtA SuBam -
bai bai ... good bye; -
@@@@@@ -
SrIkar ;- imTlO ewarainaa unnaarA!! pallawi ekkaDunnadO, sarE,
ee Ceyir^lO [chair] kUrcumTAnu. [kimda paDDADu] abba,
naDum kalukkumamTunnadi. ainaa, waramDAlO wirigina kurceelu,
bemceelu ewarainaa wEstArA!! - weeLLokkaLLE kanipistunnaaru -
iTlaamTi sAmpradaayam Teekaa tappaka pATimcEwALLu. hu...!
sarE, ninnaTi padyaalanu praakTIs cEstaanu [gomtu sawarimcukuni]
Emee, anna mATanu jawadATanamduwaa - kRshNA,
ee bheemuni sOdarabhakti himanaga Sikharam amta ettu ......,
uuuuuuuu ......,OhO, kamsamaamaa .......,
maamma appaccamma ;- ewaru naayanA! mAmmA amTU pilicAru!?
[pallawi gETu [gate] teesukuni, lOpaliki waccimdi] ;-
pallawi ;- haay, emtasEpaimdi wacci?
SrIkar ;- OhO, BAmA nI Baratambu paTTeda ......,
maamma ;- maa naayanE, ninnu cuustumTE muccaTEstunnadi.
ee rOjullO kurrakumkalu - Tikil Timkil liTil sTAr - amTumTAru.
innaaLLaki saakshaatkaristunnaa - bhaarata, raamaayaNaanni
cEta paTTukunnawADiwi ...... ,
pallawi ;- maa maammaki `slight` gaa cewuDu -
nemadigaa nuwwE alawATu paDatAwu.
SrIkar ;- nEnu bharatam paDataanu - amTE mahaabhaaratam cadawaDam anE
ardham kUDA unnadanna mATa.
pallawi ;- nEnu Dress maarcukuni wastaanu - idigO, mahiLA prabhamjanam -
ee mamtlee [monthly]- tiragEstuu, maammatO
samdarbhaanusaaramgaa maaTlADutUmDu.
maamma ;- ammuluu, pallawammaa, ee abbaayiki,
naakuu cikkani kaapheelu remDu glaasulu teesukurAmmA.
baabuu Sree, wyaasa bhaaratam puurtigaa cadiwaawaa
SrIkar ;- konni wyaasaalu, awE essElu - raasaanu, lOkal mEgajainulalO,
maa kaalEji `magazine`lO primT ainaayi maamma gArU!
maamma ;- karNa katha unnadi cuusaawuu ....
SrIkar ;- maa amgalakuduru karaNam caalaa kannimg^phelO -
ataniki raiT^hAmD munasabu - nakkajittulamaari, semT^parsamT mOsagADu -
maamma ;- mausala parwam kUDA cadiwaawaa, telugu kawitrayam,
samskRtam wyaasa maharshi - remDU aupOsana paTTAwannamATa, buddhimamtuDiwi -
SrIkar ;- buddhimamtuDu - sinimaanu aarusaarlu cuusaanu maammagaaruu -
maamma ;- raamaayaNam - sampuurNamgA cadiwaawaa -
pallawi ;- adE, waalmeeki maharshi racana - itihaasam adi -
Sreekar ;- adE adE waalm waal waal .....,
pallawi ;- meeki - meeki racana -
SrIkar ;- meekee racana adi,
maamma ;- praaceenakaalamlO siripuur - kaagaj^nagar -
bhadraacalam pEpar millulu, dastaawEju kaTTalu lEwu kadaa,
aitEnEm - amtamta udgramdhaalanu, itihaasaalanu - kEwalam -
taaLapatraala paina raasaaru, emtamaatram kashTam ani anukOlEdu wALLu.
mamci ASayaalu umTE mahaa gramdhaalu udbhawistaayi.
SrIkar ;- taaLam paina eTlaaga raayagaligaaru?
naa daggara araDajanu kees [keys] unnaayi. okkO tALam paina
`five letters` kamTE paTTawu kadaa,
pallawi ;- uhhuu, taaLapatram - taaLapatraalu - amTE tATAkulu,
SrIkar ;- OhO-
[ pallawi tamDri sOmaSEKara Sarma `enter`]
sOSESarma ;- SAmtamuu lEKyamuu lEdU ...... - ewaruu?
pallawi ;- itanu Sreekar -
sOSESarma ;- aa, ninna ceppaawu kadaa, `sit down - Take u'r seat` Sreekar.
[kuuturu iccina kaaphee kappulanu amdaruu amdukunnaaru.] -
"samgeeta saaramuu, bhakti winaa ....
SrIkar ;- `music is devine` - samgeetam adbhutamainadi saar, pasipaapalu -
paapalu - ppaapaayiluu ......,
pallawi ;- [cewilO] paSuwuluu - phaNamuluu ...... ,
SrIkar ;- aa, aa! paapalu, jamtuwulu annee myuujik^ni saradAgA, sraddhaagaa wimTAyi.
pallawi ;- adE naannA! SiSurwEtti, paSurwEtti - wEtti gaanarasam phaNi@h} -
ani kadaa cebtunnaawu, SrI!
SrIkar ;- haa - hha - hhu -
sOSESarma ;-tyaagaraaju mana telugu waari adRshTam -
SrIkar ;- aa raajugaaru - mana sautimDiyaa kimg -
[pallawi atani paadam gaTTigaa tokkimdi] - abbA, gaTTigaa tokkEsaawu -
pallawi ;- tyaagayya kRtulanu raasaaru.
SrIkar ;- tyaagaay gaaramDI, kRttulu, wattulu cEsaaramDI.
sOSESarma ;- muttuswaami deekshitar^gaariki aa pEru eTlaa waccimdi?
SrIkar ;- sree swaami waariki kis istaanani - anukunnaaru, kAbOlu -
appaccamma maamma ;- cEbrOlu - numDE mEmu maa uuru cErataamu -
[ pallawi maLLI atani weepu wenuka gillimdi]
ammO - maree gaTTigA gillutunnaawu, maLLI nannu
ee paddhatilO smaarT warnimg iwwaalsi wastE maatram, kaasta nemmadigaa -
giccu pallU, lEkumTE nEnu phraakcars kaTlu awataaram wEsukuni,
illu cEraalsiwastumdi.
sOSESarma ;- karNATaka samgeetam samgati kaassEpu pakkana peDadAm gAnI,
mana nATaka, ruupaka, Draamaalu - gurimci, neeku telisimdi ceppu wirimcI -
SrIkar ;- nEnu wirimcini kaanu sar, Sreekar^ni -
SrIkar ;- palluu again giccutumdEmO, aa sOphaa pai maaraDam `safe`,
tamDri ;- Draamaalu wEsaawaa!?
SrIkar ;- ippuDippuDE - prEma kOsamai - Draamaalu nErcukumTunnaanamDI.
tamDri ;- EmiTOy, ippaTi dAkA - iTu kuurcunnawADiwi aTu mArutunnAwu?
SrIkar ;- ikkaDa gODaku aanukuni kuurcumTE, naa weepu sEph^gaa umTumdani -
tamDri ;- nEnu cinnatanamlO nATakaalu naalugu wEsaanu. nee amta ayyaaka,
yukta wayasulO SreekRshNaswaami wEsham kaTTAnu. '
celliyO, cellakO tamaku cEsina ...... ,
SrIkar ;- naa cellelu Digree phainal^ iyar caduwutunnadi sar.
pallawi ;- hush - ush -
tamDri ;- aa padyaanni gomtetti pADAnu, Sreeraama nawami pamdiri amtaa -
prEkshakula cappaTlatO maarumrOgimdi. jemDApai kapirAju -
nEnu modalupeTTagAnE, wans mOr wans mOr - amTU kEkalu, eelalu ...... ,
SrIkar ;- naaku teleeka aDugutunaanu, raajugaaru jemDAnu paina
kappukunnaaraa, emdukani?
tamDri ;- cUDu SrIkar, imdaakaTi numDi cUstunnaanu.
neekasalu kaLala gurimci aawagimjamata ainaa telisinaTlu anipimcaDam lEdu.
nuwwewari abbaayiwi?
SrIkar ;- maa naannagaaru SrIkRshNa gautamESwar gaaru.
tamDri ;- kRshNa gautamm gAri kumAruDiwA!! aayana goppa pamDituDu,
widwaamsulu - maraitE nuwwEmO pamDitaputrA@h parama SumTha -
anE suukti gurtuku wastunnadi -
pallawi ;- naannaaruu, pleej, Sree ee imTiki kaabOyE alluDu,
haasyam anukuni meeru EmEmO mATlaaDEstunnaaru ...... ,
Sreekar post Graduate, gawarn^memT udyOgasthulunnuu .......,
sOma ;- [sardukuni] - aunammaa, naram lEni ee naalika
anawasarapu melikalu tirugutunnadi. saaree Sreekar,
appaccamma maamma ;- ee kotta pillADu kaasta aNakuwa unnawADu,
naa janaral naaleDgini kUDA saanabeTTukOneeyi, ammaDU!
pallawi ;- baammA, maa peLLi ayyaaka -
Sreeni dorakabuccukO, ippaTiki waayidaa weyyi, weyyi daNNAlu neeku.
appaccamma ;- amtEnamTAwA, huu sarE -
[ pallawi talli taamrawalli `table cloth` sardutuu, cups teestuu - ]-
tAmrawalli ;- ninu haDalagoTTawaddani, maa pallawi ninnanE ceppimdi,
wILLa dhaaTiki nuwwu aagagalawaa, Sree baabU! [ amdaruu nawwutaaru]
talli ;- mee ammagaaru, mee kuTumbaanikee, maaku mamci snEham -
mee kuTumbam iruguporugutO kalupugOrugaa umDEwALLu,
sO.SE. ;- kRshNagautamm, mEmuu - pODUrulO - edurubaduru iLLalO unnaamu.
paatikELLa kritam cuusaanu. udyOgareetyaa ULLu maaraDamtO duuramainaamu.
ippuDu bamdhutwaalu kalupukuni, bamdham wEsukumdaam,
duuraalu ceripEsi, bamdham ErpaDaDAniki -
punaadirALLu - aina meeku abhinamdanalu.
Sreekar ;- nEnu, pallawi - kalisina modaTi kshaNam -
goppadanam adi, maamayyagaarU -
sO.SE ;- waaw, nuwwu kUDA mATakAriwE - SaBAsh alluDU ......, ;
[pallawi talli tAmrawalli `table cloth` sardi, kappulu teestuu .... ]
tAmrawalli ;- maa pallawi pANigrahaNam - saspensuku innaaLLaku muDi wIDimdi -
maamma ;- mana imTi alluDu maciwADE,
pallawi ;- Sreekar, ippuDu nijamaina pANigraahiwi autunnaawugaa - `be happy`
peLLi tarwaata samsaaram, kaapuram kharculanu talucukumTU -
aTlaaga moham muDucuku kuurcumTE eTlaaga? paaraahushaar - ;
**************************************** ,
& చరణగ్రాహి {or} పల్లవి, పాణిగ్రాహి ;- 57 ;- నాటకం ;-
పాత్రలు ;- శ్రీకర్ [ =శ్రీకృష్ణ గౌతమేశ్వర్ - son శ్రీకర్ ] -&
పల్లవి - ఆమె తండ్రి సోమశేఖర శర్మ, పల్లవి తల్లి తామ్రవల్లి - మామ్మ అప్పచ్చమ్మ ] ; =
[ caraNagrAhi [or] pANigraahi ;- 57 ;- drama/ nATakam ; ; hero Sreekar = [SrIkRshNa gautamESwar - `son` Sreekar ] , pallawi, tamDri sOmaSEKara Sarma ; talli taamrawalli ; maamma appaccamma ] ;;
& పల్లవి, పాణిగ్రాహి ; story - 57 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి