ధావళ్య అద్దంలో చూసుకుంటూ అన్నది "నానీ! నీ taste భలేగుంది"
ధావళ్య తల్లి ప్రమోదవి కాస్త ఆధునిక ఆలోచనల ఛాయ కలిగిఉంటుంటాయి,
"మా పిన్ని నానీ అభిరుచినే చెప్పుకోవాలి, నిన్ను బిసి కాలంలోకి తీసుకెళ్తుంది."
తన చెల్లెలి కుమార్తె ప్రమోద - వ్యంగ్యోక్తులకు నానీ బదులిచ్చింది
"ఈ రోజుల్లో మళ్ళీ అవే ఫ్యాషన్లు - అంటూ -
మళ్ళీ మళ్ళీ తెర మీదికి వస్తూనే ఉన్నాయి కదా! నువ్వేమో పేపరు చదవవు అనుకుంటా!"
"లేదు నానీ, మమ్మీ టివి న్యూస్ ఎక్కువగానే చూస్తుంది. సరిగ్గా మనసు పెట్టదు అంతే!" అన్నది.
కృష్ణా పుష్కర వేడుకలు తెలుగునాట - నానీ గృహసీమలో సైతం ఆ పండుగ సందడి
enjoy చేస్తున్న అతిథి గ్రూప్‌లో - నానీ సోదరి కుటుంబం కూడా + ...... ,
నానీ భర్త మర్యాదా ఫురుషోత్తం "ఇవి కూడా పెట్టు" అంటూ భార్య చేతికి
వెండి కాలిగజ్జెలు ఇచ్చాడు. అవి కూడా తెగ నచ్చేసాయి
- చిన్నారి ధావళ్య ఘల్లుఘల్లు గజ్జెల చప్పుడును చేసుకుంటూ, ఆటలకు వెళ్ళిపోయింది.
'కూతురు తమ ఇంటికి సిరులను తెచ్చిన శ్రీమహాలక్ష్మి" అని నమ్మకం,
ధావళ్య తల్లి దండ్రులకు - ఆమె అడగితే కాదనరు, ఏదైనా సరే, కొనిపెడ్తారు.
ధావళ్యకు స్వతహాగా ఆభరణాలంటే ఎంతో ఇష్టం. ధగధగలాడే నగలు -
ఆ పిల్ల అడగడమే తరువాయి, ఆమె మేను పైన వెలుస్తాయి.
@@@@@@ @@@@@@ @@@@@@
ట్రాన్స్‌ఫర్లు గట్రాలు - ఐదు ఊళ్ళు తిరిగారు - ప్రమోద దంపతులు ఫ్యామిలీ -
ధావళ్య, సుషుమ్న, ఆజ్ఞేష్ ల చదువులు పూర్తి ఔతున్నాయి.
ధావళ్య కొత్తగా ఉద్యోగంలో చేరింది. ప్రైవేట్ / private జాబ్,
చేతి నిండా ఉండేటంత మంచి జీతం,
"త్వరలో బ్రెజిల్‌కి మా ధావళ్య వెళ్తుంది" కూతురు ధావళ్యను చూస్తూ గర్వపడుతూ
"ఈ కాలంలో ఆడపిల్లలకు ఎంత మంచిరోజులు వచ్చాయి" అనుకుంటున్నది ప్రమోద.
"ఇతను నా college - co - student, and -
Now - మా ఆఫీస్-లోనే job చేస్తున్నాడు - పేరు నిశ్చల్." అని చెప్పింది,
ఇంట్లో అందరూ కులాసా కబుర్లు చెప్పుకుంటూ ఉన్న శుభలగ్నం ఎంచుకుని,
జాగ్రత్తగా - తను ఎన్నుకున్న జీవితభాగస్వామి -ని introduce చేసేసింది.
కూతురి నిర్వాకానికి ధావళ్య parents ఉలిక్కిపడ్డారు,
ప్రమోద, భర్త వినాయకరావులకు కొంత టైమ్ పట్టింది ఈ వాస్తవానికి అలవాటు పడి,
బ్రతుకు పయనంలో తటస్థపడే ఒక సంఘటనగా మనఃస్ఫూర్తిగా స్వీకరించడానికి.
@@@@@@ @@@@@@ @@@@@@
పెళ్ళి నిశ్చయతాంబూలాలు - engagement invitation card - ఆహ్వానం అందుకుని,
నానీ, మర్యాదా పురుషోత్తమ రావు - ఉభయులు రెక్కలు కట్టుకుని వాలారు.
ధావళ్య సంతోషంతో ఎగిరి గంతేసి, వాటేసుకుంది.
"నానీ, ఎన్నాళ్ళెకెన్నాళ్ళకు, రండి రండి" లోపలికి తోడ్కొని వెళ్ళింది.
"అమ్మా, ఎవరొచ్చారో చూడు"
"ఆహా, వెల్‌కమ్ పిన్నీ, బాబాయ్" - తండ్రి - అందరూ - వివిధ పనుల మీద
బైటికి వెళ్ళారు. మొబైల్స్‌లో విష్ చేసారు,
ఆనక ఇంటికి వచ్చి, నానీ దంపతులను పలకరించారు.
నాలుగో రోజున - ముహూర్తం, సుషుమ్న, - స్త్రీలోకం అక్కడ వెలిసింది,
వన్నెల, హరివిల్లులు చేతులు కట్టుకుని, ఒక్కచోటే విప్పారినట్లుగా ఉంది అక్కడ.
"ఆడ మళయాళం, కోలాహలం, కోలాట ఉల్లాసం మీ గలగలల మాటలు." అన్నాడు ఆజ్ఞేష్.
"ఇది women's world ' అని తెలిసీ, ఇక్కడే ఉన్నావా, ఇంకా రావలసిన ఫ్రెండ్సు, గెస్టు, రెలటివ్సు - ఉన్నరేమో - చూడు, మనం ఎవరి పేర్లైనా మరిచినామేమో, వెరిఫై చేసి, కాల్స్ చెయ్యి, టెర్రేస్ మీదికి వెళ్ళు."
మహిళామణుల కిలకిలలతో Ajnesh మేడ పైకి పరుగో పరుగు...... ,
"ఈ అలంకరణోత్సాహం - శుభప్రదం" అన్నారు పురుషోత్తమరావూజీ.
"మనం మార్కెట్‌కు వెళ్దాం." ఒక బంధువు అనగానే ఎనిమిదిమంది లేచి, నిలబడ్డారు,
'మేమూ ఉన్నామంటూ'. తలా ఒక పనిని అంది పుచ్చుకుంటుంటే,
ఏ ఉత్సవమైనా ఉల్లాసకరంగా, ఉత్సాహభరితంగా ఉంటుంది కదా!
ధావళ్య "నానీ, పాపిటబిళ్ళను మీరే పెడ్తారా, మీకైతే బాగా చేతనౌతుంది."
అని ఇచ్చింది. ఆమె తల వంచి, నానీ ఎదుట కూర్చున్నది -
"పాపిడి వంకరగా ఉంటే బ్రతుకంతా వంకరేనట 😠😬🙉- మా పెద్దలు చెబ్తుండేవాళ్ళు." -
అన్నది నానీ, విన్నది ధావళ్య - ఫక్కున నవ్వారు అక్కచెల్లెళ్ళు,
"అవి ట్రాష్, సూపర్‌స్టిషన్స్" సుషుమ్న అంటుంటే ,
ధావళ్య చెల్లెలి అరచెయ్యి గిల్లుతూ, "ష్, ఊరుకో" అన్నట్లుగా సైగ చేసింది.
"ఇప్పుడు వంకరగా పాపిడి - ఇంకా మాట్లాడితే
అసలు పాపిడే లేకుండా దువ్వుకుంటున్నారు..... "
"అదే ఇప్పటి ఫ్యాషన్ అంటున్నావు, అంతేగా మరి, కానీ ఏం చేస్తాం, ప్రమోదా!
మా కాలం సూపర్‌స్టిషన్లు - సూపు పెట్టుకుని, తాగడానికైనా పనికొస్తాయంటావా!??"
నవ్వుతూ నానీ, ధావళ్య తల్లికి - సగం మాటల్లోనే కామెంట్‌ని ఇచ్చింది నవ్వుతూ, నానీ.
మామిడాకుల సంచీని అప్పగిస్తూ, పురుషోత్తమరావు రంగప్రవేశం చేసారు.
ధావళ్య ముడి చుట్టూ కూడా అవసరమైన ఆభరణాలను అలంకరించడం
పూర్తిచేసింది నానీ, అప్పటికే తన నాధుడు - ఏదో ఒక అంశం పైన
వివరణలను విపులీకరించే మూడ్‌లో ఉన్నారని, గమనించేసింది నానీ.
"శీర్ష్ పట్టీ - అని పాపిడిబిళ్ళని - హిందీలో అంటారు"
"చిన్నాన్నా, మీకున్నంత నాలెడ్జ్ మాకు లేదు.
మీరు చెబుతుంటే మేము బుద్ధిగా వింటాం."
నానీ ఓర చూపులలో ప్రత్యేక ప్రశంస విప్పారింది,
ఇంకేం, పతిదేవునిలోని అంతర్యామి - జ్ఞానబిక్ష అవిరళంగా కొనసాగింది.
నానీనాధుని ఉవాచ ;-
1] మొదటి మాట శీష్‌పట్టీ - ఇంకా శీష్‌ఫూల్ అని కూడా పిలుస్తున్నారు. ...... ,
జర్నలిస్టు చంద్రిక - పురుషోత్తమ = పు.రా. వాగ్ధోరణి
కంటిన్యూ చేయడానికి లింకు అందించింది -
"శిరస్సు పైన పెట్టుకునేవి కాబట్టి, శీర్షపట్టీలు ఐనాయి ..... "
ప్రశంసాపూర్వకంగా చూసి, పు.రా. బోధలను కొనసాగించారు
"ఉత్తరాదిలో - మాతాపట్టీలు ఎక్కువగా లైక్ చేస్తారు"
"మాతాపట్టీ - అంటే??" అందరి ప్రశ్నార్ధకములు
గదిలో పెద్ద పచ్చికబయలును పరిచాయి.
"చాయ్ చాయ్" లోనుండి కాఫీ, టీ - మజ్జిగలు - ఎవరికి కావలసినవి వారు తీసుకున్నారు.
పాపిటబిళ్ళ - సింపుల్‌గా జుట్టుకి నడుమ - చిన్న దారిలా-
కనిపిస్తున్న పై పాపిటిలో ధరించే నగ, కాగా..... -
మాతాపట్టీ = ఇజీక్వల్టు - పాపిటబిళ్ళకు - అదనంగా -
ముంగురుల మీదుగా తల చుట్టూ వేయగలిగే రత్నాభరణ సముహం ;
"తెలిసింది, ఐశ్వర్యారాయ్ - దీపికా లాంటోళ్ళు వేసుకున్నారు.
అబ్బ, అంత బరువు మోస్తే - hair అంతా ఊడిపోతుందేమో తాతగారూ"
"అందుకేనా, మా ముత్తవ్వకు జుట్టు థిన్‌గా ఉంది. నానీ,
మీ జుట్టు కూడా పలచనగా ఉందనుకుంటా"
బుడుగు స్టూల్ వేసుకుని, నిలబడి, నానీ -
తతిమ్మవాళ్ళ హెయిర్‌స్టైల్స్‌ని చూసే పరిశోధనను start చేయబోతున్నాడు,
"నిజమే, కానీ - ఈ సిసింద్రీలను ఎట్లాగ కంట్రోల్ చేయాలి?"
ధావళ్య తండ్రి వినాయకరావు గుండె గుభిల్లుమంది -
"క్రికెట్ స్టార్ట్ ఔతున్నది" చెవులబడడం ఆలెస్సెం -
పిల్లగ్యాంగు, పెద్దలు అనబడేవారిలో సగమ్మంది చల్లగా హాలులోకి జారుకున్నారు.
"శీర్ష్ టిక్కా - అని కూడా మన పాపిటబిళ్ళని పిలుస్తారు.
వాళ్ళు సింధూరం పాపిట్లో చల్లుకుంటారు.
ఆ ఆచారానికి ఎక్కువ విలువను ఇవ్వడం మూలాన్న -
శీష్‌టిక్కా అయ్యింది. దీనికన్నా చాలా పెద్ద సైజ్ కాబట్టి -
సాంతం కలిపి - మాతాపట్టీ - అంటున్నారు."
ఆయనకి హుషారు పాళ్ళు ఎక్కువై, కామా లేకుండా స్పీచ్ ఇచ్చేస్తున్నాడు.
అప్పటికే తక్కిన శ్రోతలు సగమ్మంది హాలులోకి నెమ్మదిగా వెళ్ళిపోయారు.
అయాచితంగా దొరికిన బిరుదు ;-
"కరక్కాయ మాస్టారు Speech ఎక్కువసేపు వినాలంటే బోరు బాబూ" -
సిసింద్రీ సుధ - పురుషోత్తం గారికి ఇచ్చిన బిరుదు అది -
చిన్నప్పుడు సుధ అమ్మమ్మ - కరక్కాయ నూరి, నాలుకకి పూసి,
మందు, టానిక్కులుగా ఇచ్చింది.
కరక్కాయ అంటే - సుధకి అందుకే అంత విసుగు,
ఈ తడవ - మర్యాదా పురుషోత్తం తాతయ్యకి
అడక్కుండానే బిరుదుప్రదానం చేసేసింది సుధ - ~~~ 😀😉😉:) :)
@@@@@@ @@@@@@ @@@@@@
పిలకాయలు రహస్యంగా చేసిన ఈ నామకరణం సంగతి -
ఆ మర్నాడే నానీకి బోధపడింది,
"భడవల్లారా!"అంటూ చూపుడువేలు [తర్జని] చూపిస్తూ,
"శృతి మించితే ....... " ముక్కు కోస్తాను ' అన్నట్లు - సంజ్ఞలు చేస్తూ చూపించింది.
నిశ్చయతాంబూలం - వర్సెస్ engagement function పండుగ వేడుక
నిర్విఘ్నంగా జరిగింది.
"ఇంక పెళ్ళి వచ్చే నెలలోనేనా!? వచ్చే శ్రావణంలో
మంచి ముహూర్తాలు చాలా ఉన్నాయి కదా!" అన్నది నానీ.
"అప్పుడే పెళ్ళి ఏంటి నానీ,
నాకు pramotion తర్వాత next స్టెప్ తీసుకుంటాను,
నిశ్చల్‌కి జర్మనీలో ఛాన్స్ దొరికింది."
"అంటే నీ కాబోయే భర్త జర్మనీ - నువ్వు బ్రెజిల్ చేరతారా!"
విస్తుబోవడం కరక్కాయ పురుషోత్తమ్, నానీ దంపతుల వంతు ఔతున్నది.
******************************** ,
పాత్రలు ;- a] కరక్కాయబిరుదాంకిత b] నానీ పతిదేవ - c] మర్యాదా పురుషోత్తమ రావు,
wife నానీ - & ప్రమోద, భర్త వినాయకరావు ; ధావళ్య వుడ్ బి నిశ్చల్ ;;
బుడుగు, సుధ, జర్నలిస్ట్ చంద్రిక ;
======================================== ,
karakkaaya birudaamkita purushOttamA! ;- story 58 ;
karakusuma dhAwaLya addamlO cuusukumTU annadi
"nAnI! nee `taste` bhalEgumdi"
dhAwaLya talli pramOdawi kaasta aadhunika aalOcanala CAya kaligiumTumTAyi,
"maa pinni nAnI abhirucinE ceppukOwaali, ninnu bisi kaalamlOki teesukeLtumdi."
tana celleli kumaarte pramOda - wymgyOktulaku nAnI baduliccimdi
"ee rOjullO maLLI awE phyaashanlu - amTU -
maLLI maLLI tera meediki wastuunE unnayi kadA!
nuwwEmO pEparu cadawawu anukumTA!"
"lEdu nAnI, mammee Tiwi nyuus ekkuwagaanE cuustumdi.
sariggaa manasu peTTadu amtE!" annadi.
kRshNA pushkara wEDukalu telugunATa -
naanee gRhaseemalO saitam aa pamDuga samdaDi - `enjoy` cEstunna
atithi gruup^lO -naanee sOdari kuTumbam kUDA + ...... ,
naanee bharta maryaadaa purushottam "iwi kUDA peTTu" amTU
BArya cEtiki wemDi kaaligajjelu iccADu. awi kUDA tega naccEsAyi.
cinnAri dhAwaLya GalluGallu gajjela cappuDu cEsukumTU ATalaku weLLipOyimdi.
కరక్కాయ బిరుదాంకిత పురుషోత్తమా! - story 58 ;
పాత్రలు ;- a] కరక్కాయబిరుదాంకిత b] నానీ పతిదేవ - c] మర్యాదా పురుషోత్తమ రావు,
wife నానీ - & ప్రమోద, భర్త వినాయకరావు ; ధావళ్య వుడ్ బి నిశ్చల్ ;;
బుడుగు, సుధ, జర్నలిస్ట్ చంద్రిక ;
prev = 14, మార్చి 2024, గురువారం = పల్లవి, పాణిగ్రాహి ;- 57 ;-
శ్రీకర్ ;- పల్లవీ! మా ఊరి నుండి - అల్టిమేటమ్ జారీ చేసారు మా మమ్మీ,డాడీ -
ప్లీజ్, త్వరగా మనం డెజిషన్ తీసుకోవలసిన టైమ్ వచ్చింది ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి