5, ఏప్రిల్ 2024, శుక్రవారం

single కి many అర్ధాలు - 59

"రా ! అక్కయ్యా! ఎన్నాళ్ళకు కలిశాము, ఇన్నాళ్ళకు చూస్తున్నాను." 

పెదనాన్న కుమార్తె క్రిష్ణవేణి భారంగా లోనికి వచ్చి, సోఫాలో చతికిలబడింది. 

నానీ ఇచ్చిన నిమ్మరసం గుట గుటా తాగేసి, "హమ్మయ్య!" అన్నది, 

ఆనక ఉభయుల కబుర్ల కలబోతలతో నాలుగురోజులు ఇట్టే గడిచిపోయాయి.

క్రిష్ణవేణి మొబైల్ చేతిలో పెట్టుకుని, అరుగు మీద కూర్చున్న చెల్లెలి దగ్గరికి వచ్చింది.

ఆమె ఫోన్ నుండి - "ఛార్జింగ్ లేదు ...... " అంటూ హెచ్చరికలు పదేపదే వస్తున్నవి. 

"ఇదేమిటోనే, ఫోన్ రావడం లేదు." నానీకి ఇచ్చింది. 

'ఈ చెల్లెమ్మ దృష్టిలో తను గొప్ప మేధావి -' 

కానీ నానీకి కొంచెంకొంచెం మాత్రమే మొబైల్ నాలెడ్జి - 

"ఆ! దీన్ని చార్జర్ ప్లగ్గులో పెట్టి, ఛార్జింగ్ చెయ్యాలి. అంటే మళ్ళీ కొత్త శక్తిని నింపాలి." 

ఛార్జర్ తెచ్చి, యధావిధిగా అమలుచేసారు ఇద్దరూ. 

గంట అయ్యాక, బైటికి తీసి, ఆన్ చేసారు, కానీ మళ్ళీ అదే రొద - -  

"ఛార్జింగ్ లేదు - ఇల్లె ......" అంటూ. 

గత్యంతరం తోచని నానీ - కాస్సేపు కిందామీదా అయ్యాక - నుదురు నిమురుకుని, 

తల గోక్కుంటూ ఆలోచిస్తున్నది. అప్పటికి సాయంసంధ్య ఐ, 

మేడమీది రావుగారి కొడుకు స్కూలు నుండి వచ్చాడు. 

ఆపద్బాంధవుడు దొరికాడు, వాణ్ణి కేకేసి, పిలిచింది నానీ .

"ఇదేమిటో కాస్త చూసిపెట్టు బాబూ!" అడిగింది. క్షణంలో సందేహం తీర్చాడు - 

"ఛార్జింగ్ అంటే - మన్త్లీ ఛార్జి - మనీ - ఇప్పుడు మీరు మనీ కట్టాలి, నానీ" 

'అదన్నమాట, అసలు సంగతి, దీనికి ఫీజు కట్టలేదు కాబోలు అక్కా!" అన్నది. 

"ఏమో, ఎప్పుడూ కోడలు కడ్తున్నది, నాకు ఈ గోల తెలీదు."  

"వీడు ఫిఫ్త్ ఫారం చదువుతున్నాడు, చూసావా, మన కాలంలో మాదిరి కాదు ,

ప్పటి పిల్లలు, చిటెకెలో అన్నిటినీ కనిపెట్టేస్తున్నారు." మెచ్చుకోలుగా అన్నది.

"నానీ, ఫిఫ్త్ ఫారమ్మ్ ఏమిటి? నేను టెన్త్ క్లాస్" అంటూ 'బై' చెప్పేసి వెళ్ళిపోయాడు.  

నానీ అక్క క్రిష్ణ కోడలికి ఫోన్ చేసింది, ఆమె - ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించింది, 

కృష్ణవేణి సమస్య సాల్వ్ అయింది. నెమ్మదిగా నిట్టూరుస్తూ అన్నది నానీ - 

ఆ డైలాగ్ అక్కాచెల్లెలు ఇద్దరికీ స్వగతం మాదిరిగా వర్తించింది ...... ,

"అక్కాయ్, ప్రతి మాటకీ వెయ్యి అర్ధాలు ఉంటుంటే, ఎట్లాగ వేగగలం, 

అందులోనూ ఈ అయోమయం ఇంగ్లీషుతో" 

కరక్కాయ మాస్టారు అనబడుతున్న పురుషోత్తం అక్కడికి వచ్చారు.

విశ్వనాధ సత్యనారాయణ గారు "విష్ణుశర్మ - ఇంగ్లీషు చదువు " అనే చిన్న నవల రాసారు, 

ఆ నవలిక size లో చిన్నదే, కానీ - పెద్ద ప్రశ్నలు - 

అప్పటికే అందరిలోనూ మిరమిరలాడ్తున్నవి - వెలిబుచ్చారు. 

put పుట్ అంటే, but బట్ - అంటారు - ఇదేం భాష? - అనేసారు."

"ఇక్కడే ఉన్నారా, ఇందాకట్నుండీ మేము అవస్థ పడుతున్నాం కదా, 

సాయం చెయ్యడానికి రాలేదేమి?" 

"నాకు ఈ కాలం యంత్రాలు, టెక్నాలజీలు తెలీవు గనుక" చల్లగా జారుకున్నారు - 

"తన భార్య మనసులో తాను గొప్ప మేధావి

ఇప్పుడు ఇట్లాగ బైట పడాల్సి వచ్చింది కదా!" అనుకుంటూ 

పెద్దాయన కూజాలోని నీళ్ళు వంచుకుని తాగారు.

ఆయన ముసిముసి నవ్వులు గుబురు మీసాల మాటున దాక్కున్నవి. 

************************** , 

& పాత్రలు ;- నానీ పెదనాన్న కుమార్తె కృష్ణవేణి - మేడమీది రావుగారి  10th class కొడుకు ;; 

=========================== ,

"raa ! akkayyaa! ennALLaku kaliSAmu, innALLaku cUstunnaanu." 

pedanaanna kumaarte kRshNawENi BAramgaa lOniki wacci, sOphaalO catikilabaDimdi. 

nAnI iccina nimmarasam guTa guTA taagEsi, "hammayya!" annadi, 

aanaka ubhayula kaburla kalabOtalatO naalugurOjulu iTTE gaDicipOyAyi.

krishNawENi mobail cEtilO peTTukuni, arugu mIda kUrcunna celleli daggariki waccimdi.

aame phOn numDi - "CArjimg lEdu ...... " amTU heccarikalu padEpadE wastunnawi. "idEmiTOnE, phOn raawaDam lEdu." nAnIki iccimdi. 

'ee cellemma dRshTilO tanu goppa mEdhaawi -' 

kaanee nAnIki komcemkomcem mAtramE mobail naaleDji/ knowledge - 

"A! deenni caarjar plaggulO peTTi, CArjimg ceyyaali. amTE maLLI kotta Saktini nimpaali." charger tecci, yadhaawidhigaa amalucEsaaru iddaruu.

gamTa ayyaaka, baiTiki teesi, aan cEsaaru, kaanee maLLI adE roda - -  "

CArjimg lEdu - ille ......" amTU. 

gatyamtaram tOcani nAnI - kaassEpu kimdaameedaa ayyaaka - nuduru nimurukuni, 

tala gOkkumTU aalOcistunnadi. appaTiki saayamsamdhya ai, 

mEDameedi raawugaari koDuku skuulu numDi waccADu. 

aapadbaamdhawuDu dorikADu, wANNi kEkEsi, pilicimdi nAnI .

"idEmiTO kaasta cuusipeTTu bAbU!" aDigimdi. kshaNamlO samdEham teercADu - 

"CArjimg amTE - man tlee CArji - manee - ippuDu meeru manee kaTTAli, nAnI" 'adannamATa, asalu samgati, deeniki pheeju kaTTalEdu kaabOlu akkA!" annadi. 

"EmO, eppuDU kODalu kaDtunnadi, naaku ee gOla teleedu."  "weeDu 5th form caduwutunnADu, cuusaawaa, mana kaalamlO maadiri kaadu ippaTi pillalu, 

ciTekelO anniTinee kanipeTTEstunnaaru." meccukOlugaa annadi.

"nAnI, phipht phaaramm EmiTi? nEnu Ten t klaas" amTU bai ceppEsi weLLipOyADu.  

nAnI akka krishNa kODaliki phOn cEsimdi, aame - aan lain lO Dabbulu cellimcimdi, kRshNawENi samasya saalw ayimdi. nemmadigaa niTTUrustU annadi nAnI - 

aa Dailaag akkaacellelu iddarikee swagatam maadirigaa wartimcimdi ...... ,

"akkaay, prati mATakee weyyi ardhaalu umTumTE, eTlaaga wEgagalam, amdulOnU 

ee ayOmayam imgleeshutO" 

karakkaaya maasTAru anabaDutunna purushOttam akkaDiki waccaaru.

wiSwanaadha satyanaaraayaNa gaaru - wishNuSarma - imgleeshu caduwu - 

anE cinna nawala raasaaru, aa nawalika `size` lO cinnadE, kaanee - pedda praSnalanu - appaTikE amdarilOnuu miramiralADtunnawi - welibuccaaru. 

           `put` puT amTE, `but` baT - amTAru - idEM BAsha? - anEsaaru."

"ikkaDE unnaaraa, imdaakaTnumDI mEmu awastha paDutunnaam kadaa, 

saayam ceyyaDAniki raalEdEmi?" 

"naaku ee kaalam yamtraalu, Teknaalajeelu teleewu ganuka" callagaa jaarukunnaaru - 

"tana BArya manasulO taanu goppa mEdhaawi - 

ippuDu iTlaaga baiTa paDaalsi waccimdi kadA!" 

anukumTU peddaayana kuujaalOni nILLu wamcukuni taagaaru.

aayana musimusi nawwulu guburu meesaala maaTuna daakkunnawi. 

************************** , 

& pAtralu ;- nAnI pedanaanna kumaarte kRshNawENi ;; mEDameedi raawu gaari 10`th class` koDuku ; 

story - 59 ; single word కి many అర్ధాలు - 59 ;/ single కి many అర్ధాలు -- 59 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...