21, ఏప్రిల్ 2024, ఆదివారం

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!? 

మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు.

ఆమె ఊరినుండి వచ్చిన జర్నలిస్టు వెన్నెల వచ్చిందని తెలిసింది. 

వెన్నెల భర్త ప్రభు "నమస్కారం అంకుల్!" అంటూ 

సుదర్శనశాస్త్రి కాళ్ళకు దండం పెట్టాడు. 

పున్నయ్య కోడలు, కుటుంబం - ఆయనకి నమస్కరిస్తూ, 

తాము తెచ్చిన పూలదండలు, మొక్కులు ఇచ్చారు.

"కొత్త సంవత్సరం - మా ఇంటికి వచ్చి, పంచాంగం చెప్పండి, పంతులుగారూ!"

"క్రోధి నామ సంవత్సరం - తప్పకుండా వస్తానండీ!" సుదర్శనశాస్రి,

"ఐతే మనం ఎనిమిది చోట్లకు వెళ్ళి చెప్పాలి. 

అష్టలక్ష్మీ దేవి అనుగ్రహం శుభం, శుభం" అన్నాడు సుదర్శన తమ్ముడు భరద్వాజశాస్త్రి.

భక్తులు హారతి కళ్ళకు అద్దుకుని, ప్రసాదాలు కళ్ళకు అద్దుకుని తిన్నారు. 

వాళ్ళు వెళ్ళాక, "హమ్మయ్య" అనుకుంటూ తెప్పరిల్లారు శాస్త్రి ద్వయం -. 

పున్నయ్య వాళ్ళు, ఇంకా ఒకరిద్దరు భక్తులు - 

మెట్ల మీద కూర్చుని కొబ్బరిచిప్పలు ముక్కలు తీసి, 

              అతిథులకు పంచిపెడ్తూ, తాము తింటున్నారు.

ఇంతలో మోతుబరి రఘువీర్ వచ్చారు. వారు ఇచ్చిన గుడి టిక్కెట్లు తీస్కుని, 

అష్టోత్తర నామావళి - మొదలైనవిచదవసాగారు, భరద్వాజశాస్త్రి.

పూజ అయ్యాక, బైటికి వచ్చి, శఠగోపం పెడ్తూ, నామాలు చదువుతూ, 

ఆశీస్సులు ఇవ్వసాగారు సుదర్శనం గారు.

"రఘువీర నామస్య, ధర్మపత్ని రంజితాదేవి గారికీ, 

పుత్రులు అశోక్ కుమారు, కుమార్తె చందన పేర్లు మీదుగా అర్చనలు - 

శుభఫలితములు లభిస్తాయి." 

రఘువీర పక్కనే నిలబడి ఉన్న స్త్రీ వేసిన రంకెలు - 

అక్కడ పెద్ద ఉరుములు ఉరిమినట్లుగా ఫెటిల్లుమన్నాయి. 

"ఎవరండీ ఆ రంజితాదేవి?" - ఆయన +, బైట మెట్ల మీద 

కూర్చున్న ఆహూతులు - లోపలికి దబదబా వచ్చి, 

ఆసక్తిగా చూస్తున్నారు.

కాస్సేపటికి అసలు విషయం యావత్తూ ప్రేక్షకులకు బోధపడింది.

           జరిగింది ఏమంటే ............ ,

పూజారి ఆశీర్వచనాలు అందరికీ ఇస్తారు. 

ఆయన మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు ముఖాముఖీ మాట్లాడతారు, 

స్త్రీలతో ఐతే నేరుగా చూడరు, 

గౌరవభావంతో పలకరిస్తారు గానీ పరిశీలనగా గమనించరు. 

వేదపఠనం వలన అలవడిన క్రమశిక్షణ వలన,

ప్రతి ఒక్కరి పేర్లు జ్ఞాపకం ఉంటాయి, గనుక - నామావళి లిస్టు - 

క్షుణ్ణంగా మేధస్సులో ముద్రశుద్ధిగా ముద్రణ ఐ ఉంటాయి, 

కనుక అలవోకగా పేర్లతో సహా వక్కాణించి, పేరు పేరునా దీవిస్తారు.

ఆ హాబీ - ఇవాళ ఇట్లాగ, కథకు వింత మలుపును ఇచ్చింది కదా,

కోవెలలో ఉన్న జనులకు తమ కనులముందు కదిలే ఈ బొమ్మ -

                          చూస్తుండగానే అర్ధమైపోయింది, 

పాపం - సుదర్శనశాస్త్రి మాత్రం ఇంకా కొయ్యబారినట్లుగా ఐ - 

రెప్పలు వేయడం సైతం మరిచిపోయి, చూస్తున్నారు. 

'ఇక్కడ ఏది - ఎందుకు - ఈ మాదిరిగా - జరుగుతున్నదో - ఇంకా అర్ధం కావడంలేదు......,'  

"అన్నయ్యకు లోకం పోకడ - పూర్తిగా అవగతం అవడంలేదు, పెట్రొమాక్స్‌లైట్ ......" brother భరద్వాజ్ పెదవుల మాటున ఉబికివస్తున్న నవ్వులని బిగబట్టుకున్నాడు.

"రంజిత ఈ పెద్దమనిషి రహస్య భార్య, ఎప్పుడూ ఆమెతో వచ్చేవాడు రఘువీర్ - 

ఆమె పేరును చెప్పి, తమ ఇద్దరి తరఫునా పూజ చేయిస్తుండేవాడు, 

"నేడిటుల అసలు వైఫ్ - అనగా ధర్మపత్ని రావడం వలన - 

తెరలమాటున దోబూచులాడుతున్న విశేషం - అనుకోకుండా రచ్చకెక్కింది -

"అతి రహస్యం బట్టబయలు, ఓరి వెర్రి బ్రామ్మడా, ఎంత పని చేసావయ్యా!" 

బైటికి అనలేక, లోలోపలే పళ్ళు కొరుక్కున్నాడు రఘువీర్.

ప్రభు భార్య చెవిలో అన్నాడు, "ఇక నీ కీబోర్డ్‌కి కావలసినంత మేత దొరికింది."

"ఊహు, తప్పు, సంసారాలని చిల్లం పొల్లం చేసే రాతలు నేను రాయను." 

అన్నది వెన్నెల, "ఎవరికి ఫోన్?" అడిగాడు ప్రభు -

"చంద్రికకు చెబ్తాను, తనైతే ఈ matter ని చిలవలు పలవలు చేసి - భలేగా రాస్తుంది.

and నానీ అమ్మకి also చెబ్తాను" అన్నది.

"హమ్మనీ, అమ్మణ్ణీ, ఈ నా భార్యామణితో నేను జాగ్రత్తగా ఉండాలి - దే....ముడా" అనుకున్నాడు ప్రభు, అల్లు అర్జున్ లెవెల్లో. 

======================================, 

pUjAri sudarSanaSAsri guDiki bayaldErADu. "wennelammaa, baagunnaawA!? 

mee snEhituraalu camdrika - amdaruu kuSalamA?" palakaristuu, naDicaaru.

aame uurinumDi waccina jarnalisTu wennela waccimdani telisimdi. wennela bharta prabhu "namaskaaram amkul!" amTU sudarSanaSAstri kaaLLaku damDam peTTADu. punnayya kODalu, kuTumbam - aayanaki namaskaristuu, taamu teccina puuladamDalu, mokkulu iccaaru.

"kotta samwatsaram - maa imTiki wacci, pamcaamgam ceppamDi, pamtulugaarU!"

"krOdhi naama samwatsaram - tappakumDA wastaanamDI!" sudarSanaSAsri,

"aitE manam enimidi cOTlaku weLLi ceppaali. ashTalakshmee dEwi anugraham SuBam, SuBam" annaaDu sudarSana tammuDu BaradwAjaSAstri.

bhaktulu haarati kaLLaku addukuni, prasaadaalu kaLLaku addukuni tinnaaru. 

waaLLu weLLAka, "hammayya" anukumTU tepparillaaru SAstri dwayam -. 

punnayya wALLu, imkaa okariddaru bhaktulu - meTla meeda kuurcuni kobbaricippalu mukkalu teesi, atithulaku pamcipeDtuu, taamu timTunnaaru.

imtalO mOtubari raghuweer waccaaru. waaru iccina guDi TikkeTlu teeskuni, 

ashTOttara naamaawaLi - modalainawi cadawasaagaaru, bharadwaajaSAstri.

puuja ayyaaka, baiTiki wacci, SaThagOpam peDtU, naamaalu caduwutuu, 

ASIssulu iwwasaagaaru sudarSanam gaaru.

"raghuweera naamasya, dharmapatni ramjitAdEwi gaarikee, 

putrulu aSOk kumaaru, kumaarte camdana pErlu meedugaa arcanalu - 

SuBaphalitamulu labhistaayi." 

raghuweera pakkanE nilabaDi unna stree wEsina ramkelu - 

akkaDa pedda urumulu uriminaTlugaa pheTillumannaayi.

"ewaramDI A ramjitaadEwi?" - aayana +

baiTa meTla meeda kuurcunna aahuutulu - lOpaliki dabadabaa wacci, 

aasaktigaa cuustunnaaru.

kaassEpaTiki asalu wishayam yaawattuu prEkshakulaku bOdhapaDimdi.

         jarigimdi EmaMTE ............ ,

puujaari ASIrwacanaalu amdarikee istaaru. aayana magawALLatO maaTlADETappuDu muKAmuKI maaTlADatAru, streelatO aitE nErugaa cuuDaru, gaurawaBAwamtO palakaristaaru, gaanee pariSIlanagaa gamanimcaru. wEdapaThanam walana alawaDina kramaSikshaNa walana, prati okkari pErlu jnaapakam umTAyi, ganuka - naamaawaLi lisTu - kshuNNamgaa mEdhassulO mudraSuddhigaa mudraNa ai umTaayi, kanuka alawOkagaa pErlatO sahaa wakkANimci, pEru pErunA deewistaaru.

aa haabee - iwALa iTlaaga, kathaku wimta malupunu iccimdi kadaa,

kOwelalO unna janulaku tama kanulamumdu kadilE ee bomma - cuustumDagAnE ardhamaipOyimdi, 

paapam - sudarSanaSAstri maatram imkaa koyyabaarinaTlugaa ai - 

reppalu wEyaDam saitam maricipOyi, cuustunnaaru. 

ikkaDa Edi - emduku - ee maadirigaa - jarugutunnadO - imkaa ardham kaawaDamlEdu......,  

"annayyaku lOkam pOkaDa - puurtigaa awagatam awaDamlEdu, peTromaaks^laiT ......" `brother` BaradwAj pedawula mATuna ubikiwastunna nawwulani bigabaTTukunnADu.

"ramjita ee peddamanishi rahasya bhaarya, eppuDU aametO waccEwADu raghuweer - 

aame pErunu ceppi, tama iddari taraphunaa puuja cEyistumDEwADu, 

"nEDiTula asalu waiph - anagaa dharmapatni raawaDam walana - 

teralamATuna dObUculADutunna wiSEsham - anukOkumDA raccakekkimdi -

"ati rahasyam baTTabayalu, Ori werri braammaDA, emta pani cEsaawayyA!" 

baiTiki analEka, lOlOpalE paLLu korukkunnaaDu raGuwIr.

prabhu BArya cewilO annADu, "ika nee keebOrD^ki kaawalasinamta mEta dorikimdi."

"Uhu, tappu, samsaaraalani cillam pollam cEsE raatalu nEnu raayanu." 

annadi wennela,

"ewariki phOn?" aDigADu praBu -

"camdrikaku cebtaanu, tanaitE ee `matter` ni cilawalu palawalu cEsi - 

BalEgA raastumdi, `and` nAnI ammaki `also` cebtaanu" annadi.

"hammanee, ammaNNI, ee naa BAryAmaNitO -

nEnu jaagrattagaa umDAli - dE....muDA" anukunnADu praBu, allu arjun lewellO. 

************************** ,
 pAtralu ;- pUjAri sudarSaaStri, tammuDu BaradwAjaSaastri &
`journalist` wennela,aame bharta praBu & [wennela phremD camdrika & punnayya `family`]raghuweera, [secreat wife' ramjita] & dharmapatni SAtammaabaayi - 
=  & 
పాత్రలు ;- పూజారి సుదర్శనశాస్రి & తమ్ముడు భరద్వాజశాస్త్రి &
 -  journalist వెన్నెల - ఆమె భర్త ప్రభు ; [వెన్నెల మిత్రిణి = friend చంద్రిక]
&  - పున్నయ్య & family ]] &  రఘువీర  -  [secreat wife' = రంజిత] & ధర్మపత్ని శాంతమ్మాబాయి - పుత్రుడు అశోక్ కుమార్, కుమార్తె చందన ; 

మంచి అలవాటే గానీ - 60 ; =  mamci alawATE gaanee - 60 ;; &

&  prev ;-   single కి many అర్ధాలు -- 59  ;; 

& previous story ;- kusuma ;- కరక్కాయ బిరుదాంకిత పురుషోత్తమా! - 58 ;- ధావళ్య అద్దంలో చూసుకుంటూ ... ' ధావళ్య  తల్లి ప్రమోద ; = 
పాత్రలు ;- a] కరక్కాయబిరుదాంకిత -> b] నానీ పతిదేవ -> c] మర్యాదా పురుషోత్తమ రావు, wife నానీ  - & 
ప్రమోద, భర్త వినాయకరావు ; ధావళ్య వుడ్ బి నిశ్చల్ ;; 
బుడుగు, సుధ, జర్నలిస్ట్ చంద్రిక  ;
kusuma 60 Story - naanee - 







;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...