27, జూన్ 2021, ఆదివారం

కటక కవి కేతి

తూర్పు కొండ - సూర్యకిరణాలతో శోభిల్లుతున్నది. 

"రత్నం, స్కూలుకి టైమౌతున్నాది. రా!" 

కటక కవి - కటకట కవి - వికటకవి - ఇత్యాది నిక్ నేములు కలిగిన కేతిగాడు. 

భుజాన మోకు వేసుకుని, తాటి తోపుకు వెళ్తూ, 

"రత్నం, రోజూ కేతిగాడు తొందరగా వసాడు. నీకింత బద్ధకం, బైటికి బయల్దేరడానికి" 

తండ్రి హెచ్చరించి, కదిలాడు. 

రత్నం, కేతిగాడు - కబుర్లు చెప్పుకుంటూ స్కూలు చేరేసరికి ఐదు నిముషాలు పట్టింది. 

జనం అందరితో పాటు, స్కూలు చదువుల బాలబాలికలు కూడా - 

భుజాలకు సంచీలు తగిలించుకుని బయలుదేరే సరికి, 

తొమ్మిది గంటలు అయ్యింది, బడి గంట మ్రోగింది.

టీచర్ లక్ష్మీకాంత కొన్ని ఠావు పేపర్లు ఇచ్చి, చెప్పింది 

"రత్నం! ఈ తెల్ల కాగితాల పైన నీట్ గా లైన్లు గీస్తావా!" 

"ఓ, అట్లాగే మేడమ్" హుషారుగా కాయితాల బొత్తిని జాగ్రత్తగా పట్టుకుని, 

తను కూర్చునే చోటికి నడిచాడుతొమ్మిదేళ్ళ రత్నం. 

కేతిగాడు పలకను చేతిలోకి తీసుకున్నది టీచరమ్మ, 

పలక పైన రాసిన ఎక్కాలను దిద్దుతూ, తక్కిన పిలకాయలను, 

"హోమ్ వర్క్ చేసారా?" అని అడిగింది. 

రత్నం పక్కన కూర్చునే విద్యార్ధులకు - ముఖ్యంగా కేతిగాడికి - 

లక్ష్మీకాంత వార్నింగ్ ఇచ్చింది, "జాగ్రత్త, రత్నంని డిస్టర్బ్ చేయకండి" 

తన కోసం ప్రత్యేకంగా తతిమ్మా పిల్లలకు హెచ్చరిక జారీ చేసింది టీచరమ్మ - 

ఈ విశేషం - రత్నంకి కొంచెం గర్వం, ఎంతో సంతోషం కలిగించింది. 

అన్ని పేజీలనూ అరగంటలోనే పూర్తి చేసి, ఇచ్చాడు రత్నం. 

లక్ష్మీకాంత టీచరమ్మ లక్ష్మికాంతమ్మకి ఆశ్చర్యం కలిగింది. 

ప్రతి లైనుకు మధ్య - ఇంత ఖచ్చితమైన ఖాళీ ఉంచి, 

అచ్చు, అచ్చు వేసిన కాపీ బుక్కులో మల్లే గీసాడు రత్నం.

"భళిరా భలే బాగా గీసావు. ప్రింటింగ్ బుక్ లాగానే ఉన్నది." ఆమె మెచ్చుకున్నది. 

"మరంతే కదా మేడమ్, రత్నం నాయన వరెవ్వాగా - కల్లుగీత చేస్తాడు" 

అది సహజం, సాధారణం - అన్నట్టు ఒక డైలాగుని విసిరాడు కేతిగాడు. 

"వీడింతే, మన స్కూలు వికటక కవి, తెనాలి రామకృష్ణ మాదిరి" 

క్లాసులో నవ్వులు ప్రతిధ్వనించాయి. ఔను, నిజమే, సహజ స్ఫూర్తి - 

వాడి నోట్లోంచి వెలువడే మాటలు - హాస్యం తృళ్ళిపడుతుంటాయి. 

తరగతి స్తబ్ధుగా ఉన్నప్పుడు - ఇట్లాంటి కామెడీలు - 

వాతావరణంలో చైతన్యం ఉప్పతిల్లేలా చేస్తాయి కదూ. 

అందుకే మన కేతి - కటక కవి ఐనాడు, 

కానీ-  అందరూ అతణ్ణి కటకట కవి - అని కూడా పిలుస్తున్నారు మరి, అది అంతే! 

[పాత్రలు ;- స్టూడెంట్స్ రత్నం, కేతిగాడు - టీచర్ లక్ష్మీకాంత & రత్నం తండ్రి ]

========== ============,

tUrpu komDa - suuryakiraNAlatO SOBillutunnadi. 

"ratnam, skuuluki Taimautunnaadi. raa!"

kaTaka kawi - kaTakaTakawi - wikaTakawi -  

ityaadi nik nEmulu kaligina kEtigADu. 

bhujaana mOku wEsukuni, tATi tOpuku weLtU, 

"ratnam, rOjuu kEtigADu tomdaragaa wasaaDu. 

neekimta baddhakam, baiTiki bayaldEraDAniki" 

tamDri heccarimci, kadilADu. 

ratnam, kEtigADu - kaburlu ceppukumTU skuulu cErEsariki

aidu nimushaalu paTTimdi. janam amdaritO pATu, 

skuulu caduwula baalabaalikalu kUDA - 

bhujaalaku samceelu tagilimcukuni bayaludErE sariki, 

tommidi gamTalu ayyimdi, baDi gamTa mrOgimdi.

tommidELLa ratnam. 
kEtigADu palakanu cEtilOki teesukunnadi TIcaramma, 
palaka paina rAsina ekkaalanu diddutuu, takkina pilakaayalanu, 
4]] "hOmm wark cEsaaraa?" ani aDigimdi. 
ratnam pakkana kUrcunE widyaardhulaku - 
mukhyamgA kEtigADiki - lakshmeekAmta wArnimg iccimdi, 
"jAgratta, ratnam ni DisTarb cEyakamDi" 
tana kOsam pratyEkamgaa tatimmaa pillalaku 
heccarika jaaree cEsimdi TIcaramma - 
I wiSEsham - ratnamki komcem garwam, emtO samtOsham kaligimcimdi. 
anni pEjIlanU aragamTalOnE puurti cEsi, iccADu ratnam.  
lakshmIkAmta TIcaramma lakshmikAmtammaki AScaryam kaligimdi. 
prati lainuku madhya - 
imta Kaccitamaina KALI umci, 
accu, accu wEsina kaapee bukkulO mallE geesADu ratnam.
"BaLiraa bhalE baagaa gIsaawu. primTimg buk laagaanE unnadi." 
aame meccukunnadi. 
"maramtE kadaa mEDamm, ratnam naayana warewwaagaa - 
kallugeeta cEstADu" 
adi sahajam, saadhaaraNam - annaTTu oka Dailaaguni wisirADu kEtigADu. 
"wIDimtE, mana skuulu wikaTaka kawi, tenaali rAmakRshNa maadiri" 
klaasulO nawwulu pratidhwanimcaayi. aunu, nijamE, 
sahaja sphUrti - wADi nOTlOmci weluwaDE mATalu -
haasyam tRLLipaDutuMTAyi. 
taragati stabdhugaa unnappuDu - iTlAmTi kAmeDIlu - 
waataawaraNamlO caitanyam uppatillElaa cEstaayi kadU. 
amdukE mana kEti kaTaka kawi ainADu, 
kaanee,  amdaruu ataNNi kaTakaTa kawi - 
ani kUDA pilustunnaaru mari, adi amtE!
; &
[pAtralu ;- sTUDemTs ratnam, kEtigADu - TIcar lakshmIkAmta & ratnam tamDri ]
;

20, జూన్ 2021, ఆదివారం

జీవన కెరటాలు

నాట్య గురు బాలవ్యాస, తోటి స్టూడెంట్సుతో కలిసి, సర్కస్ చూస్తున్నది. సర్కస్ అద్భుతంగా ఉంది గోమతి. అమ్మాయిలు అబ్బాయిలు - సాహస విన్యాసాలు గుండె ఝల్లుమనేలా సాగుతున్నాయి. 

ఆఖరి షో - పై కప్పున ఉయ్యాలలు ఊగుతున్నారు, కింద నాలుగు దిక్కుల కట్టి ఉన్నది వల, అందులోకి అలవోకగా దూకుతున్నారు. 

"ఆ వల గట్టి తాళ్ళతో పేని తెచ్చారు కాబోలు, ఇంతమంది ఆటగాళ్ళు దూకుతున్నా చెక్కుచెదరడం లేదు" 

గురు బాలవ్యాస - గోమతి మాటలు నిజమే - అని ఒప్పుకున్నాడు.

గోమతి ఉలిక్కిపడింది, మళ్ళీ మళ్ళీ కళ్ళు నులుముకుని చూసింది, 

"కింద net లోకి దూకుతున్న ఆమె, అంజని ...., 

తల్లిదండ్రులతో అంజని అభిప్రాయ విభేదాలు - కలహాలు - ఫలితం - ఇంట్లోంచి వెళ్ళిపోయింది. 

ఇంటివాళ్ళు, పోలీస్ కంప్లైంట్లు - చేసిన ప్రయత్నాలు విఫలం ఐనాయి. ఖచ్చితంగా ఈమె - అంజనికుమారి, చిన్నప్పుడు ఇల్లు వదిలి బైటికి వచ్చిన పల్లెపిల్ల - ఎడమ చెవి కింద చెంప మీద పెద్ద పుట్టుమచ్చ, 

కుడి మోచేతి పైన - హనుమంతుని బొమ్మ పచ్చబొట్టు - సందేహం లేదు, తనే" 

ఆశ్చర్యంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బౌతూ అందరికీ చెప్పింది. సినిమాలలో నవలల్లో వార్తల్లో సంఘటన - నిజంగా తమ ఎదుట ప్రత్యక్షం ఔతుంటే, తక్కిన వారికి కూడా వింత జిజ్ఞాస, anxiety, కనుకనే సహ విద్యార్ధులు - 

సర్కస్ పూర్తి అయ్యేదాకా ఆగారు. ఓపిక పట్టి షో తర్వాత, సర్కస్ మేనేజర్, తదితరులను కలిసారు. 

ఎట్టకేలకు అంజనీ దర్శనం అయ్యింది. 

అంజని కూడా ఊహించని సంఘటనకు ఆశ్చర్యావేశాలతో కౌగిలించుకుంది. గోమతి ప్రతిపాదనకు 

"నేను ఇంటికి వెళ్ళాను, ఇంటి గడప తొక్కితే కాళ్ళు విరగ్గొడతాను, అన్నారు. ....

ఎట్లా రాగలను!? నువ్వే చెప్పు" 

గురు బాలవ్యాస "డాన్స్ నేర్పుతాను, మా డాన్స్ స్కూలులో ఉందువు గాని" 

ఈ కొత్త ఆలోచన గోమతికి సైతం నచ్చింది. సర్కస్ యజమానులు 

"ఇన్నేళ్ళు భోజనం, వసతి ఇచ్చి, అన్ని విద్యలను నేర్పించాము. 

మా కంపెనీ నుండి వెళ్ళడానికి కుదరదు" అంటూ అభ్యంతరం చెప్పారు. 

బాలవ్యాస వారు అడిగిన డబ్బు, పెద్ద మొత్తమే - చెల్లించాడు.

నాట్య గురు ఉదారతకు అందరూ ముగ్ధులయ్యారు.

సర్కస్ అనుభవం ఉన్న అమ్మాయి, 

కనుక ఎట్లాంటి కష్టతరమైన భంగిమనైనా చిటికెలో చేస్తున్నది అంజని కుమారి. 

బాలవ్యాస ఊహించినది నిజమయ్యింది, 

తమ నాట్యాలయానికి పేరు తేగల అమ్మాయి అంజనికుమారి - 

అతని ఆలోచన అచిరకాలంలోనే వాస్తవరూపం దాల్చింది. 

దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ, బిజీగా ఉంటున్నది అంజని. 

"మా కుమార్తె మాకు పేరు ప్రతిష్ఠలను తెస్తున్నది" అని సంతోషించసాగారు 

ఆమె ఫ్యామిలీ, బంధువర్గం వారు. కొందరు ఇది నచ్చక ముఖం చిట్లించారు. 

ఐతే ఆ విరోధాభాస కళలను గురించి ఆలోచించే టైమ్ లేదు అంజనికి.

"నాట్యరాణి" నాట్య మయూరి" బిరుదులను, సత్కారాలను పొందిన 

నవశకం - ఆరంభం ఐనది ఆమె జీవితంలో. ఐదేళ్ళు గడిచాయి, 

గోమతి, ఆమె సహ విద్యార్ధినులు ఆరుగురు - సంప్రదాయబద్ధమైన వివాహాలతో - 

గృహిణి పదవులను చేపట్టారు. 

గోమతి అత్తగారింట్లో "గజ్జెల గుర్రంలా గంతులు వేస్తే నామర్దా" అన్నారు, 

తమ వారికి వత్తాసు పలికాడు గోమతి భర్త. 

Now ఇద్దరు మాత్రం నాట్యావధానం కొనసాగిస్తున్నారు.

@@@@@@@@@ ; 

ముగ్గురు పిల్లల తల్లిగా గోమతి తన బాధ్యతలను సంతృప్తిగానే నిర్వహిస్తున్నది. 

ఆరేళ్ళు తిరిగేసరికి గోమతి బ్రతుకు బాటలో అవాంతరం - గోమతి భర్త మారుతి రావు 

"నేను బాల్యం నుండీ ఇష్టపడుతున్న శ్యామలరాణి, మా పక్కింటి అమ్మాయి" అన్నాడు, 

అంటూ, "తన కొత్త జీవితం - ఇదే పద్ధతి" - అన్నాడు.

అత్తమామలు "ఏం చేస్తాం, సర్దుకుపోమ్మా" అని ఉచిత సలహాలు పారేసి, 

తేలు కుట్టిన దొంగల్లా - ఢిల్లీలో ఉన్న కూతురి దగ్గరికి వెళ్ళిపోయారు - అనే కంటే..... 

చల్లగా జారుకున్నారు - అనడమే సబబు.

@@@@@@@@@,

గోమతి గత్యంతరం లేని పరిస్థితులలో ఒక ప్రైవేట్ కంపెనీలో job సంపాదించుకుంది. 

పుట్టింటి వాళ్ళు - రెండు నెలలకోసారి కొంత డబ్బు పంపిస్తున్నారు, 

ఆ కొద్ది మొత్తం కూడా చన్నీళ్ళకు వేణ్ణీళ్ళకులా సాయం ఔతున్నది. 

అప్పుడప్పుడు ఆమె అత్త మామలు కూడా పుట్టినరోజు, రాఖీ పండుగలు వగైరా 

సందర్భాలు చూసుకుని, పంపిస్తున్న పైకం - 

మానవత్వం పట్ల నమ్మకం తాలూకు పచ్చదనం - గోమతి మనసులో నిలుపుతున్నవి. 

ఫోన్ మొబైల్ ఆధునిక వాక్ వాహినులు ..... - 

అంజనికుమారి & మిత్రుల అనుబంధాలకు ఊపిరి పోస్తున్నాయి. 

@@@@@@@@@,

అంజని జీవితచక్రం ఏర్పరచిన జాడలు కొన్ని తీపి గుర్తులను, 

కొన్ని చేదు జ్ఞాపకాలను ఏర్పరుస్తున్నాయి. 

ఆమెకు విధి కలిపిన బంధం - గురువు  బాలవ్యాస బంధువు జక్కబాబు. 

జక్కబాబు ఆలోచనలలో - "ఆదర్శ భార్య - స్టాండర్డ్సు పరిధిలో ....

తన కాపురం ఉండే అవకాశం లేదు" అనే bitter experience అనుభవంలోకి వచ్చింది.  

బంధు వర్గాలు, చుట్టుపక్కల వారు - తమ సాంప్రదాయక దృష్టి కోణం గొప్పది - అనే భావన అందరిదీ. 

ఎక్కువ హుషారుగా చలాకీతనం కనిపిస్తున్న అంజనికుమారి ప్రతి కదలికను ఎగతాళి చేస్తుండే వారు.

అంజనిని పెళ్ళాడేక, జక్కబాబుకు - తన నిత్య జీవితాన్ని భంగపరిచగల 

ఇట్లాంటి సంఘటనలు తటస్థపడుతూ, చీకాకు పెడ్తున్నవి. 

@@@@@@@@@, 

అంజని, జక్కబాబు విడిపోయారు. జక్కబాబు అంజనికి ఒక ఫ్లాట్ కొనిచ్చాడు. 

గోమతి, ఆమె ఆహ్వానం మీద అక్కడికి చేరి, కొత్త జీవిత స్వరూపాన్ని రూపొందించుకోవడం నేర్చుకొంటూన్నది. నేస్తం రాకతో అంజనికి సాంత్వన లభించింది.

స్నేహితుల పిల్లలు ఐదుగురు ఒకే స్కూలులో చేర్చడం, పిల్లల మధ్య ప్రేమ, అనుబంధం - 

ఇద్దరి జీవితాలలో పరిమళాలను నింపుతున్నాయి. 

జక్కబాబు ప్రతి నెల వచ్చి, పిల్లలతో ఆడుకుని, అంజనిని పలకరించి, మనీ ఇచ్చి వెళ్తున్నాడు.

విశాల విశ్వంలో - విధాత ఒసగిన విశేష శీతల పవన వీచిక - నిరంతరాయంగా కొనసాగే కాలగమనం ......,

కొన్ని సమస్యలకు నెమ్మది మీద ఊరట లభిస్తుండటం విచిత్రంగా జరుగుతుంటాయి.

జక్కబాబు విచ్ఛిన్న జీవిత బంధం స్థానంలో - మరొక కొత్త బంధాన్ని నెలకొల్పాలని, అతని కుటుంబం, చుట్టాలు ప్రయత్నించారు. 

అదంత సులువు కాదని అర్ధం ఐ, తాము చేసింది పొరపాటు అని, తెలుసుకున్నారు. 

అతని వద్ద తప్పు ఒప్పుకున్నారు. 

రెండేళ్ళకు అంజనికుమారి, సంతానం - భర్త చేరికతో - ఫ్యామిలీ ఫొటో - కళకళలాడసాగింది.

గోమతి భర్త వైఖరి మారలేదు. 

అతని రెండో భార్య  శ్యామలరాణి "మాటలతోనే వేధించే శాడిస్టు భర్త" -

శ్యామలరాణి కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు.

పాత బంధం గురించి ఆట్టే పట్టించుకోకపోయినా - 

గోమతికి ఆకాశరామన్న - ఆకాశ సీతమ్మల ఉచిత సేవలు అందుతునే ఉన్నాయి. 

వార్తా విశేషాలు తెలుస్తూనే ఉన్నాయి. శ్యామలరాణిని కలిసింది, ఆమె భుజానికి తన చేయి అందించింది. 

చంకను బిడ్డతో బైటికి అడుగు పెట్టిన శ్యామలరాణి, గోమతి - ఒక పంచ కిందికి చేరారు.

మెరుపులు గుండె ఝల్లుమనిపిస్తూ భయపడ్తాయి, 

కానీ ఆ తటిల్లతల వెలుగులు సైతం దారి చూపిస్తాయి.

నిలకడగా ఉండే నీళ్ళలోనే కలువలు, తామరలు విరబూస్తాయి.

ఆగకుండా కదిలే నదీ ప్రవాహం లాంటి బ్రతుకులు నిస్తేజంగా ఉండవు, 

ఆ వాహిని అలలు వెన్నెల బంగారు పళ్ళాలు ఔతాయి.

అటు అంజని - ఇటు గోమతి, శ్యామలరాణి జీవన శైలి - విభిన్న మార్గాలలో సాగుతూనే ఉన్నాయి. 

నీలాకాశంలో మేఘాల మాటుగా దోబూచులాడుతున జాబిల్లి - చల్లని వెన్నెలను కురుస్తున్నది - శాంతంగా ...., ;

;

[పాత్రలు ;- గోమతి గోమతి  భర్త మారుతి రావు & మారుతి రావు second wife శ్యామలరాణి - + -

గోమతి Friend అంజనికుమారి ; జక్కబాబు wife అంజనికుమారి - + - గురువు బాలవ్యాస, బంధువు జక్కబాబు] ;

================, 

jeewana keraTAlu ;- 

nATya guru bAlawyAsa, tOTi sTUDemTsutO kalisi, sarkas cuustunnadi. sarkas adbhutamgaa umdi gOmati. ammaayilu abbaayilu - saahasa winyAsAlu gumDe jhallumanElaa saagutunnaayi. aakhari shO - pai kappuna uyyaalalu uugutunnaaru, kimda nAlugu dikkula kaTTi unnadi wala, amdulOki alawOkagaa duukutunnaaru. "aa wala gaTTi tALLatO pEni teccAru kaabOlu, imtamamdi ATagALLu duukutunnaa cekkucedaraDam lEdu" guru bAlawyAsa - gOmati mATalu nijamE - ani oppukunnADu.

gOmati ulikkipaDimdi, maLLI maLLI kaLLu nulumukuni cUsimdi, "kimda `net` lOki duukutunna aame, amjani ...., tallidamDrulatO abhipraaya wiBEdaalu - kalahaalu - phalitam - imTlOmci weLLipOyimdi. imTiwALLu, pOliis kamplaimTlu - cEsina prayatnaalu wiphalam ainaayi. khaccitamgaa eeme - anjanikumAri, cinnappuDu illu wadili baiTiki waccina pallepilla - eDama cewi kimda cempa meeda pedda puTTumacca, kuDi mOcEti paina - hanumamtuni bomma paccaboTTu - samdEham lEdu, tanE" AScaryamtO aanamdamtO ubbitabbibbautU amdarikee ceppimdi. sinimaalalO nawalallO waartallO samghaTana - nijamgaa tama eduTa pratyaksham autumTE, takkina waariki kUDA wimta jijnaasa, `anxiety`, kanukanE saha widyaardhulu - sarkas puurti ayyEdaakaa aagaaru. Opika paTTi shO tarwaata, sarkas mEnEjar, taditarulanu kalisaaru. eTTakElaku amjanee darSanam ayyimdi. 

amjani kUDA Uhimcani samghaTanaku AScaryAwESAlatO kaugilimcukumdi. gOmati pratipAdanaku "nEnu imTiki weLLAnu, imTi gaDapa tokkitE kALLu wiraggoDataanu, annAru. eTlaa rAgalanu!? nuwwE ceppu"  guru bAlawyAsa "DAns nErputaanu, maa DAns skuululO umduwu gaani" ee kotta aalOcana gOmatiki saitam naccimdi. sarkas yajamaanulu "innELLu BOjanam, wasati icci, anni widyalanu nErpimcaamu. maa kampenee numDi weLLaDAniki kudaradu" amTU aByamtaram ceppAru. bAlawyaasa waaru aDigina Dabbu, pedda mottamE - cellimcADu. nATya guru udaarataku amdaruu mugdhulayyaaru.

sarkas anubhawam unna ammaayi, kanuka eTlAmTi kashTataramaina bhamgimanainaa ciTikelO cEstunnadi amjani kumAri. bAlawyAsa uuhimcinadi nijamayyimdi, tama nATyaalayaaniki pEru tEgala ammayi amjanikumAri - atani aalOcana acirakaalamlOnE waastawaruupam daalcimdi. dESa widESAlalO pradarSanalu istuu, bijeegaa umTunnadi amjani. "maa kumArte maaku pEru pratishThalanu testunnadi" ani samtOshimcasaagaaru aame phyaamilee, bamdhuwargam waaru. komdaru idi naccaka mukham ciTlimcAru. aitE aa wirOdhaabhaasa kaLalanu gurimci aalOcimcE Taimm lEdu amjaniki.

"nATyarANi" nATya mayUri" birudulanu, satkArAlanu pomdina nawaSakam - aarambham ainadi aame jeewitamlO.

@@@@@@@@@,

4] aidELLu gaDicaayi, gOmati, aame saha widyaardhinulu aaruguru - sampradaayabaddhamaina wiwaahaalatO - gRhiNi padawulanu cEpaTTAru. 

gOmati attagaarimTlO "gajjela gurramlaa gamtulu wEstE naamardaa" annaaru, tama waariki wattaasu palikADu gOmati bharta.

iddaru maatram nATyAwadhaanam konasaagistunnaaru.

@@@@@@@@@ ;

mugguru pillala talligaa gOmati tana baadhyatalanu samtRptigaanE nirwahistunnadi.

aarELLu tirigEsariki gOmati bratuku bATalO awaamtaram - aame bharta "nEnu baalyam numDI ishTapaDutunna SyAmalarANi, maa pakkimTi ammaayi" annADu, amTU, "tana kotta jeewitam - idE paddhati" - annADu. 

atta maamalu "Em cEstaam, sardukupOmmaa" ani ucita salahaalu paarEsi, tElu kuTTina domgallaa - DhilliilO unna kuuturi daggariki weLLipOyaaru - anE kamTE callagaa jaarukunnaaru - anaDamE sababu.

@@@@@@@@@ ;

gOmati gatyamtaram lEni paristhitulalO oka praiwET kampeneelO `job` sampaadimcukumdi. puTTimTi wALLu - remDu nelalakOsAri komta Dabbu pampistunnaaru, aa koddi mottam kUDA cannILLaku wENNILLakulaa saayam autunnadi. appuDappuDu aame atta maamalu kUDA puTTinarOju, rAKI pamDugalu wagairaa samdarBAlu cuusukuni, pampistunna paikam - maanawatwam paTla nammakam taaluuku paccadanam - gOmati manasulO niluputunnawi. phOn mobail aadhunika waak waahinulu - amjanikumAri & mitrula anubamdhaalaku uupiri pOstunnaayi. 

@@@@@@@@@,

amjani jIwitacakram Erparacina jADalu konni teepi gurtulanu, konni cEdu jnaapakAlanu ErparustunnAyi. Ameku widhi kalipina bamdham -guruwu  bAlawyAsa bamdhuwu jakkabAbu. jakkabAbu alOcanalalO AdarSa BArya - sTAmDarDsu paridhilO tana kaapuram umDE awakASam lEdu" anE awakASam anuBawamlOki waccimdi. 

bamdhu wargAlu, cuTTupakkala waaru - tama saampradaayaka dRshTi kONam goppadi - anE BAwana amdaridee. ekkuwa hushArugA calAkItanam kanipistunna amjanikumAri prati kadalikanu egatALi cEstumDE wAru. amjanini peLLADEka, jakkabAbuku - tana nitya jeewitaanni bhamgaparicagala iTlAmTi samGaTanalu taTasthapaDutuu, ceekaaku peDtunnawi

@@@@@@@@@ ;

amjani, jakkabaabu wiDipOyAru. jakkabaabu amjaniki oka phlAT koniccADu. gOmati, aame aahwaanam meeda akkaDiki cEri, kotta jeewita swaruupaanni ruupomdimcukOwaDam nErcukomTUnnadi. nEstam rAkatO amajaniki saamtwana labhimcimdi. snEhitula pillalu aiduguru okE skuululO cErcaDam, pillala madhya prEma, anubamdham - iddari jeewitaalalO parimaLAlanu nimputunnaayi. 

jakkabaabu prati nela wacci, pillalatO ADukuni, amjanini palakarimci, maney icci weLtunnADu.

@@@@@@@@@ ;

wiSAla wiSwamlO - widhaata osagina wiSEsha SItala pawana weecika - niramtaraayamgaa konasAgE kaalagamanam ......,

konni samasyalaku nemmadi meeda UraTa labhistumDaTam wicitramgaa jarugutumTAyi.

jakkabaabu wicCinna jeewita bamdham sthaanamlO - maroka kotta bamdhaanni nelakolaalani, atani kuTumbam, cuTTAlu prayatnimcaaru. adamta suluwu kaadani ardham ai, tamu cEsimdi porapATu ani, telusukunnaaru. atani wadda tappu oppukunnaaru. remDELLaku amjanikumaari, samtaanam - bharta cErikatO - phyaamilee phoTO - kaLakaLalADasAgimdi.

gOmati bharta waikhari maaralEdu. atani remDO BArya  SyAmalarANi "mATalatOnE wEdhimcE SADisTu bharta" kOrTu meTlu ekkaka tappalEdu.

paata bamdham gurimci ATTE paTTimcukOkapOyinA - gOmatiki AkASarAmanna - aakASa sItammala ucita sEwalu amdutunE unnAyi. waartaa wiSEshAlu telustUnE unnAyi. SyAmalarANini kalisimdi, aame bhujaaniki tana cEyi amdimcimdi. camkanu biDDatO baiTiki aDugu peTTina SyAmalarANi, gOmati - oka pamca kimdiki cEraaru. merupulu gumDe jhallumanipistuu bhayapaDtaayi, kaanee aa taTillatala welugulu saitam daari cuupistaayi. nilakaDagaa umDE nILLalOnE kaluwalu, taamaralu wirabuustaayi.

;

[pAtralu ;- gOmati & `second wife` SyAmalarANi = `Husband` jakkabAbu - `his` bamdhuwu - guruwu = bAlawyAsa & gOmati `Friend `amjanikumAri ] ; 

katha June 2021 - ksm 


1, జూన్ 2021, మంగళవారం

కోట కోసం ఐసరబజ్జా

పెళ్ళి ఐన పుష్కరానికి స్వంత ఇల్లు కట్టుకున్నారు గిరిజ, కృష్ణారావు దంపతులు.  మిగిలి ఉన్న కొరవ పనులను చేయిస్తున్నది గిరిజ. గిరిజకి తులసి కోట అంటే ఎంతో ఇష్టం. మేస్త్రీ పర్జన్యకు ఈ నిర్మాణ కార్యక్రమాన్ని పురమాయించింది.

మేస్త్రీ పర్జన్య “రోడ్డు పక్కన మంచి తులసి కుండీలు దొరుకుతున్నాయి, ఇంత శ్రమ ఎందుకమ్మా!” అన్నాడు.

అతను ఇప్పటిదాకా తులసి మొక్కకు పెరటి కుండీని కట్టే అవసరం రాలేదు. అందుకని ఈ నాన్పుడు వ్యవహారం.

గిరిజ మేస్త్రీ మాటలను పెడచెవిని పెట్టింది.  భర్త క్రిష్ణారావు కూడా చెప్పి చూసాడు,

కానీ ఆమెది ఉడుం పట్టు కదా మరి, పట్టు మరి వీడలేదు.

మేస్త్రీ పర్జన్య లోపల్లోపల బెరుకుగానే ఉన్నప్పటికీ, గిరిజా కుమారి ఆనతిని పాటించక తప్పలేదు.

కాగితం మీద డిజైన్లు గీసి ఇచ్చింది. ఇంటర్నెట్ నుండి చాలా ఫొటోలు చూపించింది. 

మొత్తానికి పర్జన్య పని పూర్తి చేసాడు.

గిరిజమ్మ చెప్పినట్లు రాకున్నా, కాస్త బాగానే కుదిరింది.

“ఆహా, నాకు కోట కట్టడం చేతనయ్యింది. ఇంక – మనకి ఇది కొత్త మలుపు. ఇంట్లో పెళ్ళాం ఖాళీగానే ఉంది.

తులసి కోటలు చేసి, సైడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను.” సంతృప్తిగా అనుకున్నాడు పర్జన్య.

పాత మట్టి కుండీలోని మొక్కను జాగ్రత్తగా తీసి, కొత్త కోటకు మార్చింది. 

ఇల్లిల్లూ గాలించి, కృష్ణ తులసి మొక్కను తెచ్చి, అందులోనే నాటింది.

స్పెషల్ గా కొన్ని కొత్త వ్రతాలు, నోములు కనిపెట్టింది. 

అంతర్జాల మహిమ కతంబున ఉత్తరాది మరాఠీ వగైరా వ్రతాలను సేకరించింది.

ఇరుగు పొరుగు – స్నేహితులను, బంధువులను విడతలవారీగా పిలిచి, బొట్టు తాంబూలం వాయనాలు ఇచ్చేది.

తర్వాత పెరట్లోకి తీసుకెళ్ళి, “నేను చాలా కష్టపడి కట్టించాను. చూడండి, ఎంత అందంగా ఉందో!” అని నొక్కి వక్కాణించేది.

పేరంటాళ్ళు “ఆహా, ఎంత బాగున్నదో. నువ్వు చదువుకొని ఉంటే ఇంజనీర్ అయ్యేదానివి.” అని ఫ్రశంసించే వారు. 

“ఏమిటో అక్కా! పైటచెంగు వెయ్యడం ఆలస్యం, గుండెల మీద కుంపటి ఆడపిల్ల అంటూ అనుకుంటూ – 

నన్ను పెళ్ళిపీటలు ఎక్కించేసారు. సంసారం, జంఝాటం, విద్యకు ఆస్కారం ఎక్కడుంటుంది, చెప్పు.” 

నిట్టూర్చేది గిరిజ. నూతన గృహప్రవేశం సంరంభం, ఆనందం మనసారా ఆస్వాదిస్తున్నది గిరిజ. 

ఇంతలో ఆమె భర్తకు ప్రమోషన్ వచ్చింది, బదిలీ అయ్యింది. 

“ట్రాన్స్‌ఫర్ వాయిదా కుదుర్తుందేమో, కొంచెం ట్రై చెయ్యండి.” అన్నది.

“ప్రమోషన్ తో వచ్చిన బదిలీ కదా గిరీ, చెన్నై సిటీ లైఫ్ బాగుంటుందని, మా అన్నయ్య చెప్పాడు” క్రిష్ణారావు ఉవాచ.

అన్ని సామాన్లు సర్దుకున్నారు. లారీలోకి ఇంటెడు సామగ్రిని చేర్చారు నలుగురు కూలీలు. 

చీకటి పడడంతో, “కొద్ది సరంజామానే కదండీ, రేపు ఎక్కిస్తాం.” అని వెళ్ళిపోయారు.

మిగిలింది గిరిజకుమారికి ప్రాణప్రదం ఐన తులసికోట.

“మధ్యాహ్నం 3 గంటలకి ఫ్లైట్, లారీ వాళ్ళింకా రాలేదే.” అంటూ … 

తొలి పొద్దు మసక చీకటి నుండే గాభరా పడసాగాడు  క్రిష్ణారావు.

11 గంటలకు డ్రైవర్, క్లీనర్ వచ్చారు. త్వరత్వరగా తక్కిన కొద్ది లగేజీని లారీలో పెట్టారు. 

ఇక ఉన్న ఆ ఏకైక వస్తువు, గిరిజ చూపించింది,

వాళ్ళకు గుండె గుభిల్లుమంది. “ఇంత పెద్ద తొట్టిని ఎట్లాగ మొయ్యాలి!?”

“తొట్టి కాదు, తులసి కోట – అనాలి.” ఆమెతో పాటు, వాళ్ళున్నూ భయభక్తులతో చెంపలు వేసుకుని 

“ఇప్పుడెట్లా!” అని తర్జనభర్జనలు పడ్డాక,

“మనమే తిప్పలు పడదాము. తప్పుతుందా!?” అనుకుని, ధైర్యం తెచ్చుకున్నారు.

గుండె దిటవు చేసుకుని, ఇద్దరు దాన్ని లేపాలని try చేసారు. ఊహూ … వీలు కాలేదు,

ఎగస్ట్రా పనులకి కూలీల కోసం దెవుళ్ళాడేరు గానీ ఎవరూ దొరకలేదు.

ఇక ఆ ఇద్దరు దొర్లించుకు వద్దామని చిట్టి చెట్టు పైన చెయ్యి వేయ్యబోయారు.

అక్కడ నిలబడి ఉన్నది వేరెవరో కాదు, యజమానిని గిరిజా కుమారి … ,

“భుజం పైన పెట్టుకోండి, నెమ్మదిగా తియ్యండన్నా!” 

'అన్నా'- అని ఆ పిలుపు – కరిగిపోయారు.

“ఐసరబజ్జా! హుప్” అంటూ అతి కష్టమ్మీద కొంచెం ఎత్తగలిగారు.

పది గోతాలు తెచ్చి, అడుగున పెట్టి, నేల పైన నెడ్తూ ముందుకు తీసుకెళ్ళారు.

“మేమేమన్నా బాహుబలి అనుకుంటున్నావా ఏంటమ్మా!!?” ఏడుపు మొహాలు పెట్టారు, చెమటలు కక్కుతూ. 

వాహనం దాకా ఈడుస్తూ తెచ్చారు, గానీ, పైకెక్కించే పని సంగతి గతి ఏమిటి? ….  ,

అప్పటికి అపరాహ్ణం దాటవస్తున్నది. కృష్ణారావు వచ్చి, ఓ చెయ్యి వేసాడు. క్లైమాక్స్ ఘట్టం జయప్రదమైంది. 

“పట్టపగలే చుక్కలు కనబడటం అంటే ఇదే కాబోలు, హమ్మయ్య” క్లీనర్ చతికిలపడ్డాడు. 

“మా అమ్మ దగ్గర తాగిన *మొరుంబాలతో సహా అన్నీ అరిగిపోయాయమ్మా!” 

డ్రైవర్ మాటలకు పగలబడి నవ్వాడు క్లీనర్ కోటబొమ్మాళి. గిరిజాపతి, వాళ్ళకి నాలుగు నూర్లు ఇచ్చి,

“దారిలో ఏ హోటల్ దగ్గరైనా ఆగి, మీల్సు తినండి. మీకు థాంక్స్, నిజంగా చాలా కష్టపడ్డారు.”

జతగా  రామతులసి మొక్కను కూడా సంపాదించాలి, 

"ఐతే నాకు next town లో కావలసినంత పని అన్న మాట." భర్త నవ్వుతూ అన్నాడు

లారీ బయలుదేరింది, గిరిజ దంపతులు, విమానశ్రయాన్ని చేరుకున్నారు.

లగేజీ చెకింగ్ పూర్తి ఐనాక, ఛెయిర్స్ లో కూర్చున్నారు. ఇంటి దగ్గర ఇందాకటి డైలాగులు గుర్తు వస్తుంటే, 

తెగ నవ్వుకుంటూ … , ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్నారు.

***********

 *మొరుంబాలు = *మొర్రుంబాలు - తల్లి వద్ద బిడ్డ త్రాగే తొలి పాల చుక్కలు ;

************************************************,

[ పాత్రలు ;-  కృష్ణారావు దంపతులు ;; మేస్త్రీ పర్జన్య -క్లీనర్ కోటబొమ్మాళి ] 

కోట  కోసం ఐసరబజ్జా ;  story ; 

June 2021 My Telugu story 



29, మే 2021, శనివారం

మేలిమి మలుపులు

భూపేంద్ర మనసు అతలాకుతలంగా ఉన్నది. 

హైస్కూలు నుండీ కాలేజి  ప్రాంగణం దాకా -

పుస్తక హస్త భూషణాలు కలిమి కలిగిన -  సుభద్రతో 

తన పరిచయాన్ని కూడా ప్రవృద్ధమానం చేసింది. 

తమ విద్య తమను ఉద్యోగ సోపానంపై నిలబెట్టింది. 

ఇక పెద్దల సన్నిధికి వెళ్ళి, పెళ్ళికి అనుమతి అడిగారు. 

"ప్రేమ, పెళ్ళి నిషేధం" తిరస్కారం ఎదురైంది. 

సుభద్ర "తల్లిదండ్రులను ఎదిరించి, ఎందాకా పరుగులు తీస్తాము!!? 

వారి ఆశీస్సులను పొందలేని లోటు అడుగడుగునా 

మన హృదయాలను, ఫీలింగ్స్ నీ వెంటాడుతుంటే, 

మనం జీవితాన్ని శాంతంగా గడపలేము కదా" 

ప్రేయసి పలుకులలోని నిజాన్ని భూపేంద్ర కాదన లేకపోయాడు. 

ఫలితం - అనేక విఫల ప్రేమ కథలలో సుభద్రా భూపేంద్ర ప్రణయ వృత్తాంతం కూడా చేరింది.

సుభద్ర - తన ఇంటివారు నిర్ణయించిన వరుడు సూర్యారావు ఇల్లాలు అయ్యింది. 

************, 

భూపేంద్ర ఆజన్మబ్రహ్మచారిగానే జీవితం గడపాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. 

రెండేళ్ళు ఉద్యోగరీత్యా అరకు వాలీలో ఉన్నాడు. 

ఆ రోజులలో పరిచయం ఐంది అంబుజ. 

ఆమె సాన్నిధ్యం అతని మనసుకు శాంతిని ఇచ్చింది. 

అరకు వ్యాలీ స్నేహం సైతం పెళ్ళి అనే ప్రసాదం అతనికి ఇవ్వలేదు. 

అంబుజ తండా వాళ్ళు అందరూ కర్రలు పట్టుకుని వాకిలి వద్ద వలయం తీరారు. 

మర్యాద, వినయం ఉట్టి పడేటట్లుగా, 

"మీరు మా గూడెం పిల్లతో సరదా చేసుకున్నారు, సరే, ఇంతటితో మరిచిపొండి. 

మా చెరువులో నీళ్ళు మా చెర్లోనే ఉండాలి. 

ఎవరైనా అమృతాన్ని బైటికి తరలిస్తారా, సొంత బావులు, కొలనులు ఎండబెట్టుకుంటారా!??" 

అంటూ తమ తండా సామెతలను కూడా గుమ్మరించారు. 

భూపేంద్ర 'తన భగ్న ప్రణయిని సుభద్రను మరిచిపోదామనుకున్నాడు, 

కొత్త బ్రతుకు బాటను నిర్మించుకోవాలని ప్రయత్నించాడు. 

వెక్కిరిస్తున్న విధిని ఇంక తలచుకోదలచుకో లేదు. 

తక్షణం ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు.  

***************, 

కాలం అలుపెరుగని నిరంతర ప్రయాణీకుడు. కొన్ని ఏళ్ళు గడిచాయి.  

మంచం పట్టిన తల్లి భూపేంద్ర వద్ద ప్రమాణం తీసుకున్నది, 

తత్ఫలితంగా భూపేంద్ర వివాహం చేసుకున్నాడు. అతని భార్య పేరు జానకి.

 పట్టణంలో సుభద్ర సంగతి .....,  సహజంగానే దుష్ట చింతనతో ....,

ఇతరుల జీవితాలను ధ్వంసం చేసి, ఆనందించే శాడిస్టులు, 

పవిత్రభారతంలో కొందరు ఉండనే ఉంటారు. 

అదిగో అట్లాంటి దుష్టులు - సుభద్ర పాత ప్రేమ గాధను - ఆమె భర్త చెవిలో విషం ఊదారు. 

సుభద్ర - సూర్యారావు నుండి విడాకులు తీసున్న స్త్రీగా, ఇద్దరు పిల్లల తల్లిగా సంఘంలో నిలబడింది. 

బంధువులు ఇస్తున్న చేయూత ద్వారా, 

ఆమె బ్రతుకు బండి చిన్న చిన్న ఒడిదుడుకులతో నింపాదిగా జరిగిపోతున్నది.

ఇక అంబుజ - తండా మనుషులు చేసిన పెళ్ళితో ఒక ఇంటి ఇల్లాలు అయ్యింది, 

ఆమె భర్త తాగుబోతు, ఐనా సర్దుకుపోయే సంసార పక్షం వనితగా కొనసాగుతున్నది. 

"బతుకు అంటే ఈ మాత్రం సమస్యలు ఉండవా!??" అని నవ్వేసి, ఇంటి పనిలోకి దూరుతుంది.

భూపేంద్ర భార్య జానకి గొప్ప కోరికలు, అభిలాషలు లేని మహిళ, 

so సంసారపక్షంగా రోజులు ముందుకు వెళ్తున్నాయి.

రోజులు ..... కేలండర్ లోని తేదీలను - నెలలు, సంవత్సరాలుగా మారుతూ, 

లోకంలోని సామాజిక, ఆర్ధిక, దేశ, ప్రపంచ సంఘటనలను కుప్పలు బోస్తూనే ఉన్నాయి.

భూపేంద్ర మాత్రం అనుకుంటుంటాడు, 

"బ్రహ్మ బహు విచిత్రమైన వాడు, ఊబిలోని బురద మట్టిని దోసిళ్ళలో నింపుకుంటాడు, 

ఆ మట్టితో దిట్టమైన తాళ్ళు పేనుతాడు ........, 

ఔను మరి, స్త్రీ పురుష సంబంధాలు అనే బలమైన త్రాళ్ళు అవి, 

వాటి శక్తి ఎంతో ఎవరికీ అర్ధం కాని విషయం సుమీ!"

తన సంతానం చిలిపి అల్లరిని భరిస్తూ, వారితో ఆడుకుంటూ, "జానకీ, కాఫీ" అని కేక వేసాడు.

"ఇది నాలుగోసారి, మీ ఆరోగ్యం జాగ్రత్త" ఆమె హెచ్చరిక విని, 

"నీ చేతి స్ట్రాంగ్ కాఫీ రుచి అట్లాంటిది, ఇంద్రుడు కూడా పైనుండి దిగివచ్చి, ఇక్కడే తిష్ఠ వేసేస్తాడు" 

"చాల్లెండి సంబడం" జానకి నవ్వులను కొలవడం కోసం 

కిటికీలో నుండి ఏటవాలుగా పడ్తున్న ఉషాకిరణాలు - తరాజులాగా మారుతున్నాయి. 

&

[పాత్రలు - భూపేంద్ర - జానకి ; సుభద్ర - సూర్యారావు - అంబుజ] 

=============================================,

BUpEmdra manasu atalAkutalamgA unnadi. haiskUlu numDI 

kaalEji prAmgaNam dAkA pustaka hasta BUshaNaalu - 

AmetO tana paricayAnni kUDA prawRddhamAnam cEsimdi. 

tama widya tamanu udyOga sOpAnampai nilabeTTimdi. 

ika peddala sannidhiki weLLi, peLLiki anumati aDigAru. 

"prEma, peLLi nishEdham" tiraskaaram eduraimdi. suBadra 

"tallidamDrulanu edirimci, emdAkA parugulu tiistaamu!!? 

waari ASIssulanu pomdalEni lOTu aDugaDugunA mana hRdayAlanu, 

phIlimgs nI wemTADutumTE, manam jeewitaanni SAmtamgA gaDapalEmu kadA" 

prEyasi palukulalOni nijAnni BUpEmdra kAdana lEkapOyADu. phalitam - 

anEka wiphala prEma kathalalO suBadrA BUpEmdra praNaya wRttAmtam kUDA cErimdi.

suBadra imTiwaaru nirNayimcina waruDu sUryArAwu illaalu ayyimdi.

************,

BUpEmdra Ajanma brahmacaarigaanE jeewitam gaDapaalani kRtaniScayamtO unnADu. 

remDELLu udyOgareetyaa araku 

waaleelO unnADu. aa rOjulalO paricayam aimdi ambuja. 

aame saannidhyam atani manasuku SAmtini iccimdi. 

araku wyaalee snEham saitam peLLi anE prasaadam ataniki iwwalEdu. 

ambuja tamDA wALLu amdaruu karralu paTTukuni waakili wadda walayam teeraaru. maryaada, 

winayam uTTi paDETaTlugA, 

"meeru maa gUDem pillatO saradA cEsukunnAru, sarE, imtaTitO maricipomDi. 

maa ceruwulO neeLLu maa cerlOnE umDAli. ewarainaa 

amRtaanni baiTiki taralistaaraa, somta baawulu, kolanulu emDabeTTukumTArA!??" 

amTU tama tamDA saametalanu 

kUDA gummarimcaaru. BUpEmdra 'tana bhagna praNayini suBadranu maricipOdaamanukunnADu, kotta bratuku 

bATanu nirmimcukOwaalani prayatnimcADu. wekkiristunna widhini 

imka talacukOdalacukO lEdu. takshaNam TrAns phar cEyimcukunnADu.  

***************, 

kAlam aluperugani niramtara prayANeekuDu. konni ELLu gaDicAyi. 

paTTaNamlO subhadra samgati ....., sahajamgaanE dushTa cimtanatO itarula jeewitaalanu dhwamsam cEsi, 

aanamdimcE SADisTulu, pawitrabhaaratamlO komdaru umDanE umTAru. 

adigO aTlAmTi dushTulu - subhadra paata prEma gaadhanu - aame bharta cewilO wisham uudaaru. 

mamcam paTTina talli BUpEmdra wadda pramANam teesukunnadi, tatphalitamgaa BUpEmdra wiwaaham 

cEsukunnADu. atani bhaarya pEru jaanaki.

suBadra - sUryArAwu numDi wiDAkulu teesunna streegaa, iddaru pillala talligaa samghamlO nilabaDimdi. aame 

bamdhuwulu istunna cEyuuta dwaaraa, bratuku bamDi cinna cinna oDiduDukulatO nimpaadigaa jarigipOtunnadi.

ambuja - tamDA manushulu cEsina peLLitO oka imTi illaalu ayyimdi, aame bharta taagubOtu, ainaa sardukupOyE 

samsaara paksham wanitagaa konasaagutunnadi. "batuku amTE ee mAtram samasyalu umDawA!??" ani nawwEsi, 

imTi panilOki duurutumdi.

BUpEmdra bhaarya jaanaki goppa kOrikalu, abhilaashalu lEni mahiLa, `so` samsaarapakshamgaa rOjulu mumduku 

weLtunnaayi.

rOjulu ..... kElamDar lOni tEdeelanu - nelalu, samwatsaraalugaa maarutuu, lOkamlOni saamaajika, aardhika, dESa, 

prapamca samghaTanalanu kuppalu bOstuunE unnaayi.

BUpEmdra maatram anukumTumTADu, 

"brahma bahu wicitramaina wADu, UbilOni burada maTTini dOsiLLalO 

nimpukumTADu, aa maTTitO diTTamaina tALLu pEnutADu ........, aunu mari, 

stree purusha sambamdhaalu anE balamaina trALLu awi, 

wATi Sakti emtO ewarikee ardham kaani wishayam sumee!"

tana samtaanam cilipi allarini bharistuu, waaritO ADukumTU, 

"jaanakee, kaaphee" ani kEka wEsADu.

"idi naalugOsaari, mee aarOgyam jaagratta" aame heccarika wini, 

"nI cEti sTrAmg kAphI ruci aTlAmTidi, imdruDu 

kUDA painumDi digiwacci, ikkaDE tishTha wEsEstADu" 

"caallemDi sambaDam" jaanaki nawwulanu kolawaDam 

kOsam kiTikIlO numDi ETawAlugA paDtunna ushaakiraNAlu - taraajulaagaa maarutunnaayi. 

*************************,

Canvas - Turnings 


రంగనాధ రాజు చేతిలో పరశువేది

ఎక్కడో హస్తినాపురంలో - అదేనండీ ఢిల్లీలో ఉద్యోగరీత్యా ఉన్న నాకు 
ఇన్నేళ్ళకు నా చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం లభించింది. 
 బాల్య స్నేహితుడు రంగనాధ్ పుణ్య కారణాన ఒక మంచి విశేషం కోసం 
ఈ ప్రయాణం సంభవించడం కొంచెం వింతగా అనిపిస్తున్నది. 
 ఫేస్ బుక్, ఇంటర్ నెట్ మాధ్యమాలను అందిపుచ్చుకున్న ఘనాపాఠీ అతను. 
 అంతర్జాలం, మొబైల్ వగైరా మార్గాల ద్వారా నాటి నేస్తాలను ఒక చోటికి చేరుస్తున్నాడు. 
భోజనాలు, వసతి కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల కోసం - 
అందరమూ డబ్బులు ముందే పంపాము. 
 ఒక కూడలి వద్దకు పాతిక మందిని రప్పించడం అంటే మాటలా!!? 
అతని కృషికి మనీ ఎంత చెల్లించినా తక్కువే ఔతుంది. 
రంగనాధ రాజు పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు. అతని సీనియర్స్ retire అయ్యారు. 
 రంగా పోస్టల్ సర్వీస్ సేవలు మొదలెట్టి పదిహేడు సంవత్సరాలు ఔతున్నాయి. 
 మరల యుగం - అదేనండీ, ఆధునిక యంత్ర యుగం - missions era ...., 
మనుషులకు అందించిన inter net సౌకర్యాదులు - వాయువేగంతో విజృంభించాయి. 
 మా తరం వాళ్ళం అనుభవించినవీ, ఆస్వాదించినవీ - 
 ఇప్పటి వాళ్ళకు బోధపడేలా చెప్పడానికి తగిన భాష కోసం తడుముకోవాల్సి వస్తున్నది. 
అంతర్జాల మాయేంద్రజాలం మహిమ - టపాలుకు ప్రాముఖ్యత నెమ్మది మీద తగ్గుతున్నది. 
******** ; 
 కాలేజీ రోజుల నుండీ ఎన్నో ఆదర్శ భావాలకు నిలువెత్తు రూపం రంగనాధ రాజు. 
 ఏ పనినైనా చేస్తే సంఘానికి, దేశానికి - ఈ పని ఉపయోగిస్తుందా!? అనే కోణంలోనే 
 రంగనాధ్ ఆలోచనలు సాగుతుండేవి. ఈ జీవన పయనంలో బాటసారి అతను. 
 ఈ జీవిత గమనంలో మాతృభాషకు సైతం అనుకోకుండా రంగనాధ్ చేసిన సేవలు గొప్పవే! 
తలచుకుంటే, ఇంకా గొప్ప jobs లభించేవే కానీ, అతను ఇష్టపూర్వకంగా ఎంచుకున్న బాట ఇది, 
 కనుక పోస్టల్ ఉద్యోగిగా మధ్య తరగతి వ్యక్తిగా స్థిరపడి, సంతృప్తికకరమైన లైఫ్ స్టైల్ ను గడుపుతున్నాడు. 
ప్రమోషన్లు పొంది, మంచి ఇంటిలో ఉన్నాడు. 
మేము నలుగురు మిత్రులం - 'మా బ్రతుకుతెరువులు వేర్వేరు ఊళ్ళకు మమ్మల్ని చేర్చింది. 
ఒకప్పటి కుగ్రామం, ఇప్పుడు పెద్ద పట్నం అయ్యింది. 
రంగా తల్లి, భార్య - ఎన్నెన్నో జ్ఞాపకాల పరిమళాలను గ్రుమ్మరిస్తుంటే, 
 మా మనసులు దేవ పారిజాత పుష్పాలు ఐనాయి. 
"మా రంగా ఎంత కష్టపడ్డాడో తెలుసా ..." అంటూ కళ్ళకు కట్టినట్లు చెబ్తుంటే 
 మా హృదయాలు ఆర్ద్రతతో చెమ్మగిల్లాయి, కళ్ళు ఆనందబాష్పాలతో నిండాయి. 
పోస్ట్ బాక్సులు - ఇప్పుడు ఖాళీగా ఉంటున్నవి. నిరాశగా ఊరుకుంటే, 
అతను రంగనాధరాజు ఎందుకౌతాడు!? పక్షుల సంరక్షణా సంస్థకు ఖాళీ post box లని ఇచ్చాడు, 
కునారిల్లుతున్న ఆ బర్డ్స్ సంస్థ నిర్వహణకు చందాలు సేకరించి ఇచ్చాడు. 
 అన్నీ తానే ఐ - పూనుకుని ఆ సంస్థను పెంపొందించాడు. 
 సొంత బిడ్డలను తల్లిదండ్రుల మాదిరిగా రంగా పక్షుల రక్షణ చేస్తున్నాడు. 
అతని నిష్కామ శ్రమ, దీక్షా దక్షతలు - క్రమంగా - సంస్థ ప్రెసిడెంట్ గా నిలబెట్టాయి. 
కాలేజిలో తోటి స్టూడెంట్సు, లెక్చరర్లు 
"నీ చేతిలో పరశువేది విద్య ఉంది. దేనినైనా బంగారం చేస్తావు." అనేవాళ్ళు. 
 ఔను, ఆ వాక్యపు పచ్చదనం ఇప్పటికీ రంగాని పై మెట్టు మీదే నిలబెడుతున్నది. 
ఇది నూటికి నూరు పాళ్ళు నిజం. & కథ - రంగనాధ రాజు హస్తవాసి / రంగనాధరాజు చేతిలో పరశువేది ; ==========================, 
;
ramganaadha raaju hastawaasi / ramganaadharaaju cEtilO paraSuwEdi ;-
 ekkaDO hastinaapuramlO - adEnamDI DhilleelO udyOgareetyaa unna 
 naaku innELLaku naa cinnanaaTi snEhitulanu kalusukunE awakASam labhimcimdi. 
 baalya snEhituDu ramganaadh 
 puNya kaaraNAna oka mamci wiSEsham kOsam ee prayANam 
sambhawimcaDam komcem wimtagA anipistunnadi. phEs buk, 
imTar neT mAdhyamAlanu amdipuccukunna ghanApaaThI atanu. amtarjaalam, 
mobail wagairaa maargaala dwaaraa nATi 
nEstaalanu oka cOTiki cErustunnaaDu. BOjanaalu, wasati kaaryakramaala
nirwahaNa kharcula kOsam - amdaramuu Dabbulu mumdE pampaamu. 
 oka kUDali waddaku paatika mamdini rappimcaDam amTE mATalA!!? 
 atani kRshiki manee emta cellimcinaa takkuwE autumdi. 
pOsTaapheesulO udyOgam cEstunnADu. atani seeniyars `retire` ayyAru. 
 ramgaa pOsTal sarwees sEwalu modaleTTi padihEDu samwatsaraalu autunnaayi. 
marala yugam - adEnamDI, aadhunika yamtra yugam - missions era ...., 
manushulaku amdimcina `inter net` saukaryaadulu - waayuwEgamtO wijRmBimcAyi. 
maa taram wALLam anubhawimcinawee, aaswaadimcinawee - 
ippaTi wALLaku bOdhapaDElA ceppaDAniki tagina bhaasha kOsam 
taDumukOwaalsi wastunnadi. ; amtarjaala maayEmdrajaalam mahima - 
Tapaaluku praamukhyata nemmadi meeda taggutunnadi. 
******** ; 
 kaalEjee rOjula numDI ennO aadarSa BAwaalaku niluwettu ruupam 
ramganaadha raaju. E paninainaa cEstE samghaaniki, dESAniki - ee pani upayOgistumdaa!? 
 anE kONamlOnE ramganaadh aalOcanalu saagutumDEwi. 
ee jeewana payanamlO bATasaari atanu. ee jeewita gamanamlO maatRBAshaku saitam 
 anukOkuMDA ramganaadh cEsina sEwalu goppawE! talacukumTE, imkaa goppa `jobs` 
labhimcEwE kAnI, atanu ishTapuurwakamgaa emcukunna bATa idi, kanuka pOsTal udyOgigaa 
madhya taragati wyaktigaa sthirapaDi, samtRptikakaramaina laiph sTail nu gaDuputunnADu. 
 pramOshanlu pomdi, mamci imTilO unnaaDu. mEmu naluguru mitrulam -
'maa bratuku teruwulu wErwEru ULLaku mammalni cErcayi. okappaTi, kugraamam, 
ippuDu pedda paTnam ayyimdi. ramgaa talli, bhaarya - ennennO jnaapakaala 
 parimaLAlanu grummaristumTE, maa manasulu dEwa paarijaata pushpaalu ainaayi. 
"maa ramgaa emta kashTapaDDADO telusaa ..." amTU kaLLaku kaTTinaTlu cebtumTE 
maa hRdayaalu aardratatO cemmagillaayi, kaLLu aanamdabaashpaalatO nimDAyi. 
pOsT bAksulu - ippuDu KALIgaa umTunnawi.nirASa uurukumTE, 
 atanu ramganaadha raaju emdukautADu!?
pakshula sam rakshaNA samsthaku wATini iccADu, 
kunaarillutunna aa barDs samstha nirwahaNaku camdaalu sEkarimci iccADu. 
somta biDDalanu tallidamDrula maadirigaa 
 ramgaa pakshula rakshaNa cEstunnADu. annee taanE ai - 
puunukuni aa samsthanu pempomdicADu. 
atani nishkaama Srama, deekshaa dakshatalu - kramamgaa - 
samstha presiDemT gaa nilabeTTAyi. kaalEjilO aarOjulalO tOTi sTUDemTsu, lekcararlu "
nee cEtilO paraSuwEdi widya umdi. dEninainaa bamgaaram cEstaawu." anEwALLu. 
aunu, aa waakyapu paccadanam ippaTikee ...., ramgaani pai meTTu meedE nilabeDutunnadi. 
 nUTiki nUru pALLu idi nijam. ;
;
Canvas - Tune - 6 birds story 

మల్లీశ్వరి స్వప్న సారాంశం

 రాజమౌళి శ్రీకూర్మం రాగానే చేసే మొదటి పని,  పుష్కరిణిలో కాళ్ళు కడుక్కుని, ఆవరణలో ఒక మూల ఉన్న నక్షత్ర తాబేళ్ళను చూడడం. వాటిని కొంతమంది ఔత్సాహికులు ఇష్టంగా పెంచుతున్నారు. సరస్వతీదేవి చేతి వీణ పేరు కచ్ఛపి, అంటే తాబేలు పై డిప్పతో చేయబడినది. ఆదిమహావిష్ణుమూర్తి అవతారం , కనుకనే రాజమౌళికి ఈ కోవెల సందర్శనం చాలా ఇష్టం. గుళ్ళో వరండాలో కూర్చుని, కొందరు స్త్రీలు, పురుషులు - శ్రీరామ నామావళి, విష్ణు సహస్రం పఠిస్తున్నారు. 40 రోజులు పారాయణం చేస్తారు, కొంతసేపు కొందరు చదివి, వెళుతున్నారు, ఆ డ్యూటీని అందుకుంటున్నారు కొత్తవాళ్ళు. గొలుసుకట్టు పద్ధతిలో సాగుతున్న ఈ పారాయణం బహు ముచ్చటగా ఉంది  శ్రవణానందకరంగా శ్లోక పఠనం పూర్తిగా మండలం రోజులు చేస్తారు. 

రాజమౌళి గర్భగుడిలో పూజా కార్యక్రమాలు అయ్యాక, ప్రసాదం అందుకున్నాడు. గుళ్ళో ఈసారి ఒక కొత్తదనమేదో తోచింది రాజమౌళికి , అదేమిటో అతనికి ఇతమిత్థంగా బోధపడ లేదు. బైటికి వచ్చి అక్కడ ఉన్న పుస్తకం తీసుకుని, కూర్చుని తానూ దైవ స్తోత్రంలో పాల్గొన్నాడు. గంట చదివి, అప్పుడే వచ్చిన కొత్త వ్యక్తికి పుస్తకం ఇచ్చి బయలుదేరాదు. గుడికి కొందరు ఫ్రెండ్స్ వచ్చారు. 

"రాజమౌళీ! పూనా నుండి ఎప్పుడు వచ్చావు?" అంటూ పలకరించారు. పాత స్నేహితుల కలయిక అంటే - నిన్న మొన్నటి జ్ఞాపకముల గాలి నిండి, మనసు వేణువు అవడమే. 

ఆలయ పూజారి కూడా వారి ఊసుల అభిరుచులను పంచుకుంటూ తానూ కొంచెం చక్కెర పలుకులను కలుపుతూంటే - వాతావరణం మరింత ఆహ్లాదంగా మారింది. దేవాలయం ప్రసాదాలు,కబుర్లు కాకరకాయలతో అందరి మనసులు పూర్ణం ఔతున్నవి. 

అందరూ సెల్ఫీలు తీసుకొనే ప్రోగ్రామ్-మొదలెట్టారు. గుడి పక్కనే కోనేరు దగ్గరికి వచ్చారు. ఫొటోలు తీసుకుంటున్నప్పుడు బోధపడింది, ఆ పుష్కరిణీ నీళ్ళు స్ఫటిక స్వచ్ఛంగా మెరుస్తున్నవి.

ఔను, నిజమే, తన కళ్ళని తానే నమ్మలేక పోతున్నాడు రాజమౌళి. ఇదివరకు వచ్చినప్పుడు కొలను దగ్గరికి వచ్చేసరికే పాచి వాసన వచ్చింది. పచ్చగా ఉన్న నీళ్ళ నిండా ఆకులు అలములు, చెత్త చెదారం ఉండేది. వెగటు పుడుతున్నా, ఏదో శాస్త్రానికి నీళ్ళు మీద చల్లుకుని, గుళ్ళోకి దారి తీసేవారు. ఇప్పుడు దోసిట్లోకి తీసుకుని, హ్యాపీగా తాగి, నెమ్మదిగా మెట్లెక్కి వచ్చాడు తను,

రాజమౌళికి తేడా అర్ధం అయ్యింది, పుష్కరిణి జలం - అద్దంలా ఉంది - ఆకాశం ప్రతిఫలిస్తున్నది, మనల్ని మనం అద్దంలో మాదిరిగా చూసుకోగలుగుతున్నాము. 

తనకు తోచిన ఆ సంగతినే- పక్కన నిలబడి, మాట్లాడుతున్న వారితో చెప్పాడు.  

"అయ్యారే, ఐతే ఈ మధ్య చాలా మార్పులు వచ్చాయి, రాజమౌళీ" అంటూ ఒక్కొక్కళ్ళు అతనికి చెప్పిన విశేషాల సారాంశం ఇదిగో -  

@@@@@@

మల్లమ్మ అనే ఆవిడ ఈ ఊరు చేరింది. ఆమె పూజారి సోమేశ్వర శర్మ కుటుంబానికి 

సుపరిచితయే.  మల్లమాంబ వార్ధక్య దశలో మతిస్థిమితం లేనిదై, ఇంట్లోంచి బైటికి వచ్చింది. పాపం, ఇంట్లో వాళ్ళు 'తప్పిపోయింది' అని పేపర్ ప్రకటన ఇచ్చినా నిష్ప్రయోజనం అయ్యింది. 

కొన్ని రోజులకు ఈ ఊరు చేరిన మల్లమ్మను గుర్తు పట్టారు. ఆమె పిల్లలకు ఫోన్లు చేసి చెప్పారు అతనికి ఆలయ అర్చకుడు సోమేశ్వరశర్మ.  అసలేం జరిగింది - అర్ధమవడాని కొంత సమయం పట్టింది. 

@@@@@@

నాటి మల్లీశ్వరి ఇజీక్వల్ట్ - నేటి మల్లమ్మ భర్త రాధాకృష్ణమూర్తి. మల్లమ్మ సంతానం నలుగురు, బాగానే సెటిల్ ఐనారు. రాధాకృష్ణమూర్తి రిటైర్ ఐనాక, భార్య మల్లీశ్వరితో స్వంత పల్లెను చేరారు. మల్లీశ్వరి ఉరఫ్ మల్లమ్మ, గ్రామీణ వాతావరణంలో స్థిమితంగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. అమ్మాయి, అబ్బాయిలు "మా దగ్గర వచ్చి, ఉండండి" అంటూ పిలిచారు.  దంపతులు అక్కడికి వెళ్ళారు గాని, టౌను గాలి పడలేదు, అక్కడ ఇమడలేక తిరిగి వచ్చారు.    

@@@@@@

కొన్ని ఏళ్ళ తర్వాత,  రాధాకృష్ణమూర్తికి దేశ రాజధానిలో మంచి అవకాశం రావడం, ఇద్దరూ ఢిల్లీకి చేరడం జరిగిపోయాయి. ఆర్ కె ఎమ్ ఉరఫ్ రాధా ఉరఫ్ రాధాకృష్ణమూర్తిలో కొత్త జాబ్ హుషారు మెల్ల మెల్లగా చప్పబడింది.   

మహానగరంలో పరుగుల జీవిత రీతికి, వయసు అనుమతించడం లేదు. "కంపెనీ వారికి రాసి ఇచ్చిన బాండ్ ఇక నాలుగు నెలలకు పూర్తి ఔతుంది. మళ్ళీ మన ఊరు వెళ్ళి తృప్తిగా గడుపుదాం." అన్నాడు భార్యతో. ఉన్నట్టుండి, ఒక రోజు "కూరలు తెస్తానని" వెళ్ళిన మల్లమ్మ ఇంటికి తిరిగిరాలేదు. గుండె గుభిల్లుమన్న రాధాకృష్ణమూర్తి, పిల్లలు, చుట్టాలుపక్కాలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసారు.  వాళ్ళ అన్వేషణ సాగుతుండగా, ఏడాది తర్వాత, కూర్మం చేరిందని తెలుసుకుని, "హమ్మయ్య" అని అనుకుని, RKM భార్య మల్లమ్మను కలిసాడు. 

@@@@@@

కొన్ని రోజులు ఉన్నాక - మరలి వెళదామని అనుకున్నాడు. మల్లి "ఇక్కడే ఉందాం" - అన్నది. "సరే!" అని ఒప్పుకున్నాడు రాధా. "రాత్రి నాకో కల వచ్చిందండీ." పంచపాళీలో కూర్చున్న రాధాకృష్ణమూర్తి "ఏమిటో చెప్పు." అన్నాడు. చండ్రనిప్పులు చెరుగుతున్న వేసంగి కాలం, ఊరుకూరికే చెమటలు పడ్తూంటే, ఒకటే విసుగు పుడ్తున్నది. మల్లి నుడివిన స్వప్న సారాంశం  ఆర్ కె ఎమ్ కి నవ్వు పుట్టించింది. వింతగా అనిపించినా అంగీకారం తెల్పాడు. కొన్ని మాసాలకే సత్ఫలితాలను ఇచ్చింది వారి ఆచరణ. 

ఎండా కాలంలో గుడిలోని సరస్సు, ఎండిపోతుంది. అందుచేత బురద మిగిలింది. ఎవరైనా కాళ్ళు కడుక్కుందామని దిగితే, మోకాలు దాకా బురదలో కూరుకుపోతారు. అందులో మీనులు, జలచరాల సంగతి చెప్పేందుకు ఏముంటుంది గనుక.   @@@@@@

మల్లమ్మ అర్చకులకు, తనకు వచ్చిన కల గురించి చెప్పింది. 

సాక్షాత్తూ భగవంతుని ఆదేశం కదా, సోమేశ్వరశర్మ తదితరులు "ఇది మంచి ఆలోచనే కదా." అని ఆమోదముద్ర వేసారు. 

ఈ నేల పుణ్యభూమి, కనుక ఇక్కడి మట్టి పవిత్ర మైనది. కనుక, గుడి పుష్కరిణి  మాత్రమే కాక, 

ఊరి బావులు, ఇత్యాది జాగాలలో నుండి అడుగుబొడుగు బురద మన్నును బైటికి తెచ్చి, పిడకలుగా చేయసాగారు. కలబంద, చెట్ల ఆకు పసర్లు కలిపి, ఉండలు చేసి, అరచేతుల్లో తట్టి, గోడల మీద, నేల మీద పేరుస్తున్నారు. మధ్యలో బెజ్జాలు పెట్టి, చేసింది మల్లమ్మ. 

తక్కిన వారు కూడా, ఆమెను ఫాలో ఐతున్నారు. పురికొసను దూర్చి, కట్టి, మేకులకు వేళ్ళాడదీసింది. గారెల దండల్లా ఉన్నయ్ అవి. ఇంటింటా 'మిత్తి దండలు  వెలిసాయి. , ఆ మట్టి గారెలు - వడమాలలులా అగుపిస్తున్నవి.

యజ్ఞ యాగాలు, పూజలలో ఆ మట్టి బిళ్ళను ఉంచే వారు. కర్షకులు వాటిని భక్తితో తీసుకుని, నీళ్ళలో కలిపి, పొలాలలో  చల్లుకున్నారు. పంటలు సమృద్ధిగా పండాయి. నిజానికి నిజంగా ఇంత మంచి ఫలితాలు  సమకూరుతా యని, రాధా అనుకోలేదు. 

క్రమంగా ఈ సహజ ఎరువులకు డిమాండ్ ఏర్పడింది. మట్టి పిడకలకు రేటు వస్తుంటే, షాపులు వెలిసాయి. రైతు కుటుంబాలలోని వారికి, ఉపాధి దొరికింది.  విక్రయదారులుగా పల్లెవాసులకు, అనుభవం మీద, మార్కెట్ రంగం కిటుకులు, అవగాహన పెరుగుతూ, నవ చైతన్యంతో అందరూ కళకళలాడుతున్నారు.  

@@@@@@

ఇంతకీ ఆమె కల ఏమిటంటే దేవుడు కలలో ప్రత్యక్షమై, - "మల్లమ్మా! గుడిలోని సరస్సు దుర్గతి చూసావు కదా! దానిని బాగుచేయించి, పావన గంగాజలాలుగా మలచు." అని అనుగ్రహ భాషణం అనుగ్రహించాడు.

భగవానుని ఆదేశాన్ని ఊరు ఊరంతా శిరసావహించింది. 

పునరుద్ధరణ జరిగిన తర్వాత - మానస సరోవరం ఇంకొకటి ఇక్కడ వెలసింది, అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. 

"ప్రతి పౌర్ణమి రోజున దేవతలు, అప్సరసలు స్నానాలు చేస్తున్నారు, జలక్రీడలు ఆడుతున్నారు." అంటూ చక్కని కల్పనలు ప్రజల ఊహాప్రపంచాలకు వన్నెలు అద్దుతూ, హరివిల్లులను విరబూయిస్తున్నవి.

"అమాయకంగా ఒక మహిళ శ్రీకారం చుట్టిన పని, ఇన్ని గొప్ప పరిణామాలకు కారణం అయ్యిందా." ఆశ్చర్యానందాల నుండి తేరుకోవడానికి, కొంత టైమ్ పట్టింది రాజమౌళికి. 

సందె వేళ, చల్లబడుతున్నది. రోజు మాదిరిగా, ప్రదక్షిణాలు చేయడానికి, 

మల్లమ్మ దంపతులు కోవెలలోకి వస్తున్నారు. ఆ ఇద్దరు అందరికీ ఆదిదంపతుల మాదిరిగా కనిపిస్తున్నారు.

Canvas - Tune - 5 stories KSM 


3, మే 2021, సోమవారం

తెరచాప నీడలో కొత్త రాగము

మంజుల పడవ ఎక్కింది. రత్న గాలివాటుగా తెరచాప తిప్పి, తెడ్డును ఒడుపుగా పట్టుకుని, పడవను ముందుకు సాగిస్తున్నది. "రత్తాలూ, తెడ్డును పట్టుకున్నప్పుడు, ముంజేయిని ఇట్టా తిప్పాలి" 

ఆమె తండ్రి సాంబయ్య కూతురికి నేర్పుతున్నాడు. సాంబ వయసు మీద పడుతున్నది, 

కొడుకుకు పడవ సరంగు వృత్తి అంటే ఏవగింపు, అందుకనే కుమార్తెకు ఈ వారసత్వాన్ని అందివ్వాలని తాపత్రయపడుతున్నాడు. అల్లుని కుటుంబానికి ఈ పరిణామం ఆనందదాయకంగానే ఉంది. 

ఆవలి ఒడ్డునా కాలేజీకి రోజూ జల యానం చేసే మంజులకు రత్న హుషారు చూస్తుంటే చాలా ముద్దు ముచ్చట. 

రత్తాలు తెరచాప తిప్పుతూ చెప్పింది, 

"గాలి వీయడాన్ని బట్టి, చాప ఉంచాలమ్మా, పడవ స్పీడు అందుకుంటుందమ్మా. కాస్త ఇటు కూర్చోండి, 

తెరచాప నీడ అమరుతుంది, మీకు ఎండ తగలదు." టిఫిన్ బాక్సు పట్టుకుని, పడవ దిగి, కాలేజీ దిశగా నడక సాగించింది మజుల. సాంబ, రత్నలు గమనించారు, మంజుల వెంట ఒక కుర్రాడు కూడా వెళ్తుండడం.

నదిలో ఆటుపోట్లు - నది కెరటాలను తంత్రులుగా చేసుకుని, రత్తాలు చేతిలోని తెడ్డు సవ్వడి, గాలికి కొత్త వీణను ఇస్తున్నవి. ఒకరోజు రహస్యంగా అడగనే అడిగింది రత్న "ఆ పిల్లోడు మీ క్లాసు స్టూడెంటా!?"

ముసిముసినవ్వులతో - ఔను - అంటూ, ఆ కబుర్లు చెబ్తుండేది మంజుల.

కాలేజీ చదువులు పూర్తి ఐనవి. 

ఇక యూనివర్సిటీ మెట్లను లెక్కించే టైమ్ ..., ;

మాస్టర్స్ డిగ్రీ - తిరుపతి యూనివర్సిటీలో చేరింది మంజుల. 

హాలిడేస్ లో వచ్చినప్పుడు - నదీ తీరానికి వచ్చింది. రత్న ఉరఫ్ రత్తాలు, 

అదీఇదీ అడుగుతుంటే చెప్తుండేది. 

"కాలేజీ బాయ్ ఫ్రెండ్ సంగమేశ్వర్ - తన కోసం తిరుపతికి వచ్చి, అక్కడ ఒక ప్రైవేట్ కోర్స్ లో చేరాడు. 

"స్నేహంగా మాత్రమే మసలండి, ఆడదాని ఒంటి మీద చెయ్యి వేసాక, 

మగవాడి మనసు మృగంలా మారిపోతుంది" 

"భలేదానివి, బాగానే చెప్పావు. నేను జాగ్రత్తగానే ఉంటున్నాను"

ఆరు సమావేశాలు కాలగమనంలో ఇద్దరికీ జరిగాయి.

ఆరున్నొక్క మీటింగ్ సమయాన - మంజుల వదనం చిన్నబోయి ఉన్నది. 

సంగం వాళ్ళ ఇంట్లో కుల - ఆర్ధిక మేటర్స్ - అనేకం లేవనెత్తారు. 

"ఇట్లాగ జరగకుంటేనే ఆశ్చర్యపడాలి, మన దేశంలో ఇది ఇంతే" 

రత్న చాలా తేలికగా అన్నది. 

"నేను ఒకణ్ణి ఇష్టపడ్డాను. ఇంచుమించు ఇట్లాంటి కారణాలతోనే అతగానితో మనువు కుదరలేదు. 

అప్పిగానితో, నలుగురు పిల్లలు, సంసారం రాసి పెట్టి ఉన్నది, కనుక - ఇప్పటికి ఇట్లాగే జరుగుతూన్నది" 

కిలకిలానవ్వింది తెరచాపను సర్దుతూ.

క్రిష్ణ రాధిక బంగారు దరహాసాలకు మల్లే తొణికాయి రత్న నవ్వులు.

"జీవితం మనది. ఎండపొడ తగలనీకుండా కాపాడుతుంది కూడా ఈ తెరచాప - 

అనుకున్న రేవుకు చేర్చే మా బంగారు తల్లి తెరచాప. 

మీరూ ధైర్యం తెచ్చుకుని, బతుకును మంచిగా తీర్చిదిద్దుకోండి" 

ఈ సారాంశం ఆ రోజు రత్న స్వర్ణ వాక్కులలో ప్రతిఫలించాయి.

విషణ్ణ వదనంలో ప్రశామత నింపుతున్న మందహాసాలతో ముందుకు అడుగు వేసింది మంజుల.

కొస మెరుపు - ఒకటి ఉన్నది, చదువరీ, ఒక పరి ఆగి, వినుము. 

రత్న జీవిత కథలో - యవ్వనంలో తాను నడిపిన ప్రేమ వ్యవహారం - అనే అంశం - 

చక్కని అబద్ధం, అంతా హుళక్కి. 

మంజుల కోసం అప్పటకప్పుడు అల్లిన కల్పిత కథనం అది. 

కల్పితం ఐతేనేం, మంజుల భవిష్యత్తుకు నిలిపిన - హరివిల్లు నిచ్చెన - అది.

[పాత్రలు ;- మంజుల, సాంబయ్య - కూతురు రత్న ]

====================,

mamjula paDawa ekkimdi. ratna gaaliwATugA teracaapa tippi,

teDDunu oDupugaa paTTukuni, paDawanu mumduku saagistunnadi. 

"rattaaluu, teDDunu paTTukunnappuDu, mumjEyini iTTA tippaali" 

aame tamDri saambayya kuuturiki nErputunnADu. saamba wayasu meeda paDutunnadi, koDukuku paDawa saramgu wRtti amTE Ewagimpu, amdukanE kumaarteku ee waarasatwaanni amdiwwaalani taapatrayapaDutunnADu. alluni kuTumbaaniki ee pariNAmam aanamdadaayakamgAnE umdi. Awali oDDunaa kaalEjeeki rOjuu jala yaanam cEsE mamjulaku ratna hushaaru cUstumTE cAlA muddu muccaTa. rattAlu teracApa tipputU ceppimdi, 

"gAli wIyaDAnni baTTi, cApa umcAlammA, paDawa spIDu amdukumTum dammA. kAsta iTu kuurcOMDi, teracaapa nIDa amarutumdi, meeku emDa tagaladu." Tiphin baaksu paTTukuni, paDawa digi, kaalEjee diSagA naDaka saagimcimdi majula. sAmba, ratnalu gamanimcaaru, mamjula wemTa oka kurrADu kUDA weLtumDaDam. 

2] nadilO ATupOTlu - nadi keraTAlanu tamtrulugaa cEsukuni, rattaalu cEtilOni teDDu sawwaDi, 

gaaliki kotta wINanu istunnawi. okarOju rahasyamgaa aDaganE aDigimdi ratna "A pillODu mee klAsu sTUDemTA!?"

musimusinawwulatO - aunu - amTU, aa kaburlu cebtumDEdi mamjula.

3] kaalEjI caduwulu puurti ainawi. ika yuuniwarsiTI meTlanu lekkimcE Taimm / టైమ్ ..., ;

maasTars DigrI - tirupati yuuniwarsiTIlO cErimdi mamjula. haaliDEs lO waccinappuDu - 

nadee teeraaniki waccimdi. ratna uraph rattAlu, adeeidee aDugutumTE ceptumDEdi. 

"kaalEjee baay phremD samgamESwar - tana kOsam tirupatiki wacci, akkaDa oka praiwET kOrs lO cErADu. 

"snEhamgA mAtramE masalamDi, ADadaani omTi mIda ceyyi wEsaaka, magawADi manasu mRgamlaa maaripOtumdi" "BalEdAniwi, baagaanE ceppaawu. nEnu jaagrattagaanE umTunnAnu"

4] aaru samaawESaalu kaalagamanamlO iddarikee jarigaayi.

aarunnokka mITimg samayaana - mamjula wadanam cinnabOyi unnadi. samgam wALLa imTlO kula - 

aardhika mETars - anEkam lEwanettaaru. "iTlAga jaragakumTEnE AScaryapaDAli, mana dESamlO idi imtE"

 ratna caalaa tElikagaa annadi. "nEnu okaNNi ishTapaDDAnu. imcumimcu iTlAmTi kAraNAlatOnE 

atagAnitO manuwu kudaralEdu. appigaanitO, naluguru pillalu, samsaaram raasi peTTi unnadi, 

kanuku ippaTiki iTlAgE jarugutUnnadi" kilakilaanawwimdi teracaapanu sardutuu.

krishNa raadhika bamgaaru darahaasaalaku mallE toNikaayi ratna nawwulu.

"jeewitam manadi. emDapoDa tagalanIkumDA kaapaaDutumdi kUDA 

ee teracaapa - anukunna rEwuku cErcE maa bamgaaru talli teracaapa. 

meeruu dhairyam teccukuni, batukunu mamcigaa teercididdukOmDi" 

ee saarAMSam aa rOju ratna swarNa waakkulalO pratiphalimcAyi.

wishaNNa wadanamlO praSAmata nimputunna mamdahaasaalatO mumduku aDugu wEsimdi mamjula.

kosa merupu - okaTi unnadi, caduwaree, oka pari aagi, winumu. ratna jeewita kathalO - 

yawwanamlO taanu naDipina prEma wyawahaaram - anE amSam cakkani abaddham, 

amtA huLakki. mamjula kOsam appaTakappuDu allina kalpita kathanam adi. 

kalpitam aitEnEm, mamjula bhawishyattuku nilipina - hariwillu niccena - adi.

[pAtralu ;- mamjula, sAmbayya - kuuturu ratna ]  [STORY ;- teracaapa nIDalO .... ] ; 

&

తెరచాప నీడలో కొత్త రాగము ;

Canvas - Tune - 4 stories KSM 



23, ఏప్రిల్ 2021, శుక్రవారం

కాటుక భరిణ హంగామా

జ్యోతి, రంజన్, కార్తీక్ - వింతగా చూస్తున్నారు దొడ్డమ్మ కృష్ణవేణి కాటుక తయారుచేయడానికి పెట్టిన సరంజామా అంతటినీ. సెలవుల్లో ఆటవిడుపు కోసమని భామిని Town కి వచ్చారు, తీరిక చేసుకుని అరకు వాలీ చూద్దామని అనుకున్నారు, ఇక్కడ దొడ్డమ్మ కార్యక్రమం మరింత ఇంట్రెస్టుగా ఉన్నది కదా, అరకులోయ సందర్శనను వాయిదా వేసి, ప్రేక్షకవర్గం అయ్యారు రంజన్ group. ఇంతకీ దొడ్డమ్మ కృష్ణవేణి కాటుక ప్రోగ్రామ్ కి మూల కారణం ఉన్నది. పక్క వీధి అమ్మాయి సుధాచంద్రిక - గర్భిణి , "నీకు పుట్టబోయే బిడ్డ మగపిల్లాడా, ఆడపిల్ల తెలుసుకుందాం సుధా! ఇవాళ కాటుక పడ్తాను" అంటూ నడుం బిగించింది. "కాటుక పడితే - జెండర్ తెలుస్తుందా!?" ఆశ్చర్యాన్ని గుమ్మరిస్తూ అడిగారు పిల్లకాయలు. అంజనాద్రి పేరు ఒక కొండకు ఉంది కదా, తిరుపతి ఏడుకొండలలో ఒక hill కి అంటే పద్మావతి అమ్మవారు - కాటుక తయారుచేస్తే - ఆ పేరు వచ్చి ఉంటుందా" సందేహం తీర్చు - అన్నట్లుగా నిలబడ్డాడు రంజన్." ఇంతకీ దీని మూలాన, పుట్టబోయే బేబీ ఎట్లాగ తెలుస్తుంది?" కృష్ణవేణి పిల్లలు ఆదిత్య, ప్రవీణ ఎంటర్ - ప్రశ్నావళి పట్టికకు అదనం అయ్యింది. "ఇదిగో, మూడు రాళ్ళు పెట్టి, పెద్ద ఇత్తడి పళ్ళాన్ని పెట్టాను చూసారు కదా" తర్వాత ఆమె ఆముదం నిండా నింపిన పెద్ద మట్టి ప్రమిదను వెలిగించి, పళ్ళెం కింద పెట్టింది. లావాటి వత్తి - చిన్న జ్యోతి ఐ వెలిగేటట్లు సర్దింది. "గదిలో మూల, గాలి తగలకుండా ఉంచాను. ఎవరూ లోపలికి రాకండి. రేపీ సరికి పళ్ళెం అడుగున - దీపం మసి దట్టంగా, దిట్టంగా పేరుకుని ఉంటుంది. ఆ కాటిక కుప్పలుగా అతుకుతుంది. ఒక్కోసారి సరి సంఖ్య గానీ - ఒక్కోసారి బేసి సంఖ్య రాసులు గానీ ఏర్పడతాయి. దాన్నిబట్టి తల్లి కడుపులో ఉన్న బిడ్డ సంగతిని ఊహిస్తాం అన్నమాట" ఇవాళ కాటుక పడ్తాను" అంటూ నడుం బిగించింది. "కాటుక పడితే - జెండర్ తెలుస్తుందా!?" ఆశ్చర్యాన్ని గుమ్మరిస్తూ అడిగారు పిల్లకాయలు. "మా ఊళ్ళో శరభేశ్వరస్వామికి తైలాల నుండి చేసిన - రకరకాల కాటుకలను సమర్పిస్తారు." కృష్ణవేణి చెల్లెలు కావేరి అన్నది. "అంటే" అక్క ప్రశ్నకు సమాధానం కూడా చెప్పింది, "మందార తైలం నూనె చేసి, దానితో అంజనం చేస్తారు. అదే పద్ధతిలో వివిధ నూనెలను, తద్వారా కాటుకలను చేసి, శరభేశ్వరస్వామి మొక్కులను సమర్పిస్తారు." కావేరి భర్త "వదిన గారు బాగా చేస్తున్నారు. ఈ సారి - ఇక్కడికి వచ్చి, మీ చేతి కాటుక తీసుకుంటాం" అన్నాడు. "తప్పకుండా, నేను అక్కడ - మీ ఊరి గుడిని కూడా చూస్తాను కదా" అన్నది కృష్ణవేణి. ఆమె శుభ్రం చేసిన తాటాకు రేకు పట్టుకుని, పళ్ళెం బోర్లించి, దీపం మసి అంతా నెమ్మదిగా గీరింది. చెల్లెలు పక్కనే ఉండి, అక్క సూచనలు పాటిస్తూ సాయపడుతున్నది. ఆవు పాల వెన్న వేసి, సున్నితంగా నూరసాగారు. పై నుండి నీళ్ళు - సన్న ధారగా పోస్తూ, నూరారు. అట్లా నూరాక, ఒక దగ్గరికి చేరిన నల్లని ముద్దలో కర్పూరం వేసి, నూరారు. "ఇంత కష్టపడితే - మూడు గోళి కాయలంత కాజల్ వచ్చింది" సిసింద్రీలు అననే అన్నారు. భోషాణం పెట్టె అడుగు నుండి దుర్భిణీ వేసి మరీ బైటికి తీసింది, మూడు రాగిభరిణలను. చిన్ని కొక్కెం కలిగి, తెరిచి, ముడవడానికి వీలుగా గుండ్రని కాయ ఆకారం కలిగి ముచ్చట గొలిపే ఆ రాగి భరిణలు - మొబైళ్ళు - Camera ఖజానాలను నింపినాయి. "చిన్నప్పుడు అమ్మ ఇచ్చింది, రాగి కాయలు, కాటుకను వాటిలో నింపి, ఒకటి చెల్లికి ఇచ్చింది, కావేరికి కొత్త గుడ్డను ఇచ్చింది. చేతిగుడ్డ లాంటి ఆ తెల్లని వస్త్రం కొసన కాటుకభరిణ ఉంచి, ముడి వేసింది.తతిమ్మావి - రెండింటిలో ఒకటి తను ఉంచుకున్నది, మూడో దాన్ని సీతాదేవికి ఇచ్చింది. ఎదురింటి సీతాదేవికి పదో తరగతి చదువుతున్న కోడుకు ఉన్నాడు, పిల్లాడికి మంచి మార్కులు వస్తున్నాయి, కాబట్టి తన కూతురును ఇస్తే, ఊళ్ళో సంబంధం - తనకు వెసులుబాటు, ఏమో - భవిష్యత్తులో ఈమె తనకు వియ్యపురాలు ఔతుందేమో, ఎవరు చెప్పగలరు!" కనుక ఆమెతో ఆదాన ప్రాదానాలు, చేబదుళ్ళు ఇచ్చి పుచ్చుకోవడాలు - ఒక స్థాయిలో జరుగుతుంటాయి. ఏడవ తరగతి ఎగ్జామ్స్, కృష్ణవేణి కూతురు గడగడా గట్టిగా చదువుతున్నది, నిగమ శర్మ కథ - అనే పాఠం. కృష్ణవేణి పాట్నాకు - చుట్టాలింటి శుభకార్యానికి వెళ్తున్నది. ఆమె భర్త "పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటానులే" అని ధైర్యం చెప్పి, రైలు ఎక్కించాడు. తెనాలి వద్ద, శంకరం మాస్టారు బోగీ ఎక్కారు. "అరె, నువ్వు కూడా పాట్నా వస్తున్నావా, పెళ్ళి వారి ద్వారా మనం ఇప్పుడు దగ్గరి చుట్టాలం అయ్యామన్న మాట" పకపకా నవ్వుతూ అన్నాడు భోళా శంకరుడు. "పాట్నా అసలు పేరు తెలుసా, పాటలీపుత్రం ... " 'తను చిన్నప్పుడు, పలక బలపం దాచిపెట్టి, స్కూలు ఎగ్గొట్టేది తను. పాపం, పిల్లలను జ్ఞానమూర్తులుగా మార్చాలని, ఎంతో కష్టపడేవారు పంతులుగారు" ఆ రోజులు గుర్తు వస్తుంటే ప్రయాణం సునాయాసంగా సాగింది. పాట్నా ఇజీక్వల్టు పాటలీపుత్రం చేరారు, ఈజీగానే, పెళ్ళి వారి ఇల్లు చేరారు. చాలామంది అప్పటికే వచ్చేసారు. కొత్త మనుషులు, కొత్త భాషల - సంక్రాంతి ముగ్గుల నడుమ పెట్టిన గొబ్బెమ్మల మంచి వాసన వలె ఉన్నది. "కిష్టక్కా, ఇప్పటికి కలిశాం" సంతోషంతో పలకరింపు, సుగుణ గుర్తు పట్టి, గుర్తు చేస్తూ, మరింతమందిని స్నేహాలకు, బంధుత్వాలకు స్టార్ మార్కు గుర్తులుగా అప్పజెప్పుకుంటూ - గంటలు క్షణాల్లాగా గడిచిపోయాయి. "సువర్ణా, బాగున్నావా!?" భోళా మాస్టారు శంకరం మాటలకు అటు తిరిగారు, పరిచయాల సందడి - సువర్ణ ఊరు, వివరాలు ... ; "జాగ్రత్త, ఈ పిల్లది - కాస్త చేతివాటం" ; "అంటే" "కొంచెం దొంగతనం బుద్ధి, కాస్ట్లీ వస్తువుల జోలికి పోదు గానీ, చిన్న చిన్న వస్తువులను కాజేస్తుంది." ట్రైనులో శంకరం మాస్టారు "హోటల్ కి వెళ్ళినప్పుడు - చెంచాలు కాజేసే దోస్త్" గురించి మాటలలో చెప్పారు ....., తమాషా ఏమిటంటే అతను ధనవంతుని సుపుత్రుడే - చేతి తుత్తర, అటువంటి చెయ్యి దురదలకు హేతువు కోసం, మానసిక తత్వ వేత్తల దగ్గరికి వెళ్ళాల్సిందే. సాయంత్రం అందరూ కళ్యాణమండపం చేరారు. సువర్ణ తన దగ్గర మసలుతున్నప్పుడు, సూట్ కేసు తాళం - ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకుంటున్నది. సబ్బు, పౌడరు ఇత్యాదులని జాగ్రత్తగా లోన పెట్టి, లాక్ చేస్తున్నది. పెళ్ళి - తర్వాత అంపకాలు, హంగామా జరుగుతున్నది.కొంచెంసేపటికి - తన చేతిలో ఏదో ఖాళీ ఐనట్లు అనిపించింది, గుండె గుభిల్లుమంది. "కాటుక్కాయ, మిస్సింగ్" కొందరికి - కృష్ణవేణి తన కాటుకభరిణల గొప్పదనాన్ని చెప్పింది, కాటుక తయారీ, స్వీయ అనుభవాలను పూసగుచ్చినట్టు చెప్పి, శభాష్ - అనిపించుకున్నది కూడానూ. నిగమశర్మ అక్క కథ జ్ఞాపకం వచ్చింది. ముక్కెర, బులాకీ, ముక్కుపుడక - చిన్న వస్తువులే కావచ్చు, అవి - సుమంగళి ధరించే సంప్రదాయానికి, భర్త పట్ల భక్తిభావనను ప్రోది చేసే అలంకారం, తద్వారా - కుల ప్రతిష్టకు ఆనవాలు ఐనది ..., అందుకనే వేమన ప్రేయసి - అభిరామి, శిలప్పదిగారం - కన్నగి - ప్రతినాయిక మాధవి లాంటి రంగసాని - "మీ ఇంటి స్త్రీల ముక్కెరలు కావాలి - అని - heros ని villian heroins శోధించారు. కృష్ణవేణి వెక్కిళ్ళు పెడుతూ వెతికింది. సాయంగా సుగుణ అన్వేషిస్తున్నది. కొసకి మొహమాటం వదిలి, అందరి బ్యాగులు వెదకసాగారు. సువర్ణ వంతు రానే వచ్చింది, సోదా చేసాక అందరూ అనుమనించినట్లుగానే సువర్ణ ట్రంకుపెట్టెలోనే దొరికింది, "ఈ కాటుక్కాయ - మా అమ్మ తరం నుండి వస్తున్నది. అందుకనే ఇంత ఖచ్చితంగా ఉన్నాను, మా ఊరికి రా! నీకు మంచి కాటుక ఇస్తాను." అన్నది. "కాటుక ఎట్లాగ చెయ్యాలో నేర్చుకోడానికి తప్పకుండా వస్తాను" అన్నది సువర్ణ, కన్నీళ్ళు తుడుచుకుంటూ. కాటుక ఎట్లాగ చెయ్యాలో నేర్చుకోడానికి - వస్తాను - అన్న పలుకులలో సువర్ణ ఆమె ఆత్మాభిమానం మెరిసింది. "కాటుక కంటి నీరు చనుకట్టు పయి బడ, ఏల ... " భక్త పోతన - సినిమా - mobile లో సన్నగా వినిపిస్తున్నది. & [ పాత్రలు ;- జ్యోతి, రంజన్, కార్తీక్, దొడ్డమ్మ కృష్ణవేణి - సుధాచంద్రిక, సుగుణ & భోళా మాస్టారు శంకరం - కృష్ణవేణి చెల్లెలు కావేరి - కావేరి భర్త ; 7 class కృష్ణవేణి కూతురు [lesson itom - నిగమ శర్మ అక్క ; తెనాలి - శంకరం మాస్టారు ; సువర్ణ ] *********************************************************, ; ;
కాటుక భరిణ హంగామా ;

మట్టి మగువ ప్రభలు

ఏకవీరా దేవి కోవెలలో ప్రదక్షిణలు చేసి, పూజారి స్వామి ఆశీస్సులు అందుకుని, గుడి వసారాలో కూర్చున్నాడు భైరవి రాజ గురు. వృద్ధాప్యం, కాలం - పోటాపోటీగా తన మేనులోని శక్తిని తూకం వేస్తున్నవి. గుడి వరండా పావంచా - మెట్లు ఇరు పక్కలా - ఏనుగులు ఒద్దికగా కూర్చుని, భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉన్నవి. ఆ బొమ్మలను ప్రేమగా నిమురుతూ కూర్చున్నాడు భైరవ, పల్లె పాకలోని గురుకులం మాదిరి పాఠశాల - ఎర్ర ఏగాణీ తీసుకోకుండా గురువుగా గురుతర బాధ్యతలను తృప్తిగా నిర్వహించాడు - అందుకే ఆయన - భైరవి రాజ గురు - పేరులో గురు శబ్దం పొదిగి ఇచ్చారు ప్రజలు. @@@@@@ భైరవయ్య అభిరుచి - జానపద కథలు, గీతాల సేకరణ. జానపద కథలు అనేకం పోగు చేసాడు. అంతేకాదు, అన్నింటినీ పుస్తకములుగా అచ్చొతించాడు. గ్రంధరూపంలో ప్రపంచానికి అందించాడు. మొగిలిచర్ల కొలను నీళ్ళ పైనుండి వీస్తున్న గాలితెమ్మెరలు మృదువుగా పలకరిస్తున్నాయి. ఊరి సర్పంచి సర్వప్ప ప్రతి రోజూ అక్కడికి వస్తాడు భైరప్పా, అంటూ స్నేహపూర్వకంగా వారి కబుర్లు - చల్లని గాలిని పెనవేసుకుంటాయి. మా వంశీయులు ఈ గుడిని కట్టించారూ స్వామీ, ఇప్పుడు చూడండి ..." వేదనగా సర్వప్ప నిట్టూర్పులు గాలిని వేడెక్కిస్తాయి. "నాన్నా, పొద్దుగూకింది. ఇంటికి వెళ్దాం, రండి. సర్వన్నా, ఇదిగోండి, మీరు అడిగిన పుస్తకం" అందించింది రేణుక. ఇంకా, అలనాటి కాశీ మజిలీలు, చింతామణి కథలు చదివే వారున్నారు - అనే సంగతి భైరవయ్య పిల్లలకు సంతోషం కలిగిస్తుంది. "ఈ మహా గ్రంధాలని ప్రచురణలు చేసి - పన్నెండు ఎకరాలు కరిగించాడు, మనకి నాస్తి మిగిలించి" కొడుకులు కాశీ, భట్టు ల చికాకులు ప్రసాదంగా లభిస్తుంటాయి. రేణు, సర్వప్ప వంటి వారి అనునయ వాక్యాలు భైరవ గురు మనసు తోటలోని పచ్చదనాన్ని కాపాడుతున్నాయి. "మీ నాన్నగారు అమెరికాలో పుట్టి ఉంటే, హిమశిఖరంపై కూర్చుని ఉండేవారు కదమ్మా" సర్వప్ప మాటలకు పెదవులపై లేత నవ్వు విరుస్తుంది. @@@@@@ మనవళ్ళు, మనవరాళ్ళు - డాలర్ల దేశంలో స్థిరపడుతున్నారు. మనమరాలు రుద్రమ దేవి "తాతయ్యా, మీరు ఇంటర్ నెట్ యుగం ఇది." అని తాతకు బహుమానంగా ఇచ్చిన టీ.వీ. లో ఆధునిక ఔకర్యాదులన్నిటినీ నేర్పింది. "రిమోట్ - ఇంత చిన్నవస్తువులో అంత జగతి అద్భుతాలు ఇమిడి ఉన్నవి" సంభ్రమంగా భైరవ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.ముఖ్యంగా జానపద సినిమాలను తనివితీరా చూడసాగాడు.  చాలా కథలు - తాను సేకరించిన ప్రాచీన హిందూ సాహిత్య సంపదలే. "మా పూర్వీకులు - కాసె సర్వప్ప - సిద్ధేశ్వర చరిత్ర - రాసారు భరప్పా, మా పూజ గదిలో భద్రంగా ఉన్నది. మీరు మళ్ళీ ప్రతులు చేసి, ప్రింట్ చేస్తారా!?" కాశీ, భట్ సర్వప్పను అరిచారు."అంతగా దురద ఎక్కువైతే, మీ ఎకరం పొలం అమ్మేసి, ప్రచురించండి, కాదన్న వారెవరు, అడ్డుకునే వారెవరు!?" భట్టు కేకలతో సర్వప్ప అభ్యర్ధన మొదటి రోజునే స్పీడ్ బ్రేకర్ వెనుక ఆగిపోయింది. @@@@@@@@ టివి లో గురువును మించిన శిష్యుడు - సినిమాను చూస్తున్నాడు భైరవ రాజ.రేణుక గబగబా వచ్చింది. "నాన్నా! ఎంతసేపూ సినిమాలేనా, హాట్ హాట్ న్యూస్ వస్తున్నది" అని, రిమోట్ తీసుకుని, వార్తా ఛానెల్స్ పెట్టింది. ఒకదాంట్లో ఒక అమ్మాయి స్వరం వేదికని అదరగొడ్తున్నది. ఈశ్వరి అందరినీ నిలదీస్తున్నది, "నాకు అన్యాయం జరిగింది... " అంటూ వాపోతున్నది. అసలేం జరిగిందంటే - " నే రంగమెళ్ళి పోతాను, నారాయణమ్మా ......  "అనే జానపగ గీతం కథ అది. ఆ పల్లె పాట - వెండితెరపైకి ఎక్కగానే, హిట్ సాధించి, విపరీతమైన జోష్ అందుకున్నది. ఏ నోట విన్నా, ఏ రింగ్ టోన్ విన్నా అదే పాట. "నేను మట్టి పిసికే నేలలో పుట్టాను. వీడియోలలో మొదటగా పాడింది నేనే. ఆ సినిమా వాళ్ళు అడగంగానే,అరవై పాటలు, కష్టపడి రాసి ఇచ్చాను. గుండ్రంగా మంచి చేతిరాతతో - మా తమ్ముడి చేత రాయించాను. బోలెడు ఠావు పేపర్లు, జెరాక్సు ఖర్చులు, మా స్థోమతకు మించి ఖర్చు చేసి, ఛార్జీలు పెట్టుకుని వెళ్ళి, సినిమా డైరెక్టర్లు, నిర్మాతలకు అందించాము. మా బోటి వాళ్ళు ఆరుగురి కష్టం వాళ్ళ మనసుకు పట్టలేదు. నన్ను వదిలేసి, వేరే సినిమా గాయని చేత పాడించారు. నన్ను అన్యాయం చేసారు, నేను ఊరుకోను" మూడు రోజుల పాటు - అదే వార్తాంశం సంచలనం కలిగితూ బుల్లితెరలపై ప్రసార ఔతున్నది. ఆనక ఆ చలనచిత్ర సంబంధీకులు రాజీ చేసుకున్నారు. వారం రోజుల తర్వాత ఈశ్వరి టెలివిజన్స్ ద్వారా అందించిన శుభవార్త : "జానపద గేయ నిధి" అనే సంస్థను సినీ వర్గం వారి సహకారం అందుకుని, నెలకొల్పింది. జానపద గేయ నిధి - పల్లె బాణీలను గ్రంధస్థంచేస్తుంది, ప్రసారమాధ్యమాలలో, పుస్తకాలుగా కలకాలం భద్రం అయ్యేలా చేస్తుంది, ఈశ్వరి ఆశయాలు నెరవేరే మంచి ఘడియలు - భైరవి రాజ గురు, సర్వప్ప, రేణు వంటి వారికి మోదం, సమ్మోదం కలిగిస్తున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలు - folk stories వెండితెరను, ముఖ్యంగా మన తెలుగు తెరను స్వర్ణమయం గావించాయి. అయాచితంగా లభించిన నిధులు ఇవి. విజయవంతమైన చిత్రాలకు లభించిన లాభాలలో కనీసం ఐదు శాతం కేటాయిస్తే, అందమైన ఫొటోలతో, పల్లె కథలు - అందరి చేతులలో ఉండేవి. ఇది తన తీపి కల - కొన్నిసార్లు ప్రయత్నించి విఫలుడయ్యాడు భైరవ రాజ గురు. ఈశ్వరి గొంతు ఎత్తిన బంగారు ప్రయత్నం - అద్భుత ఫలితాలను ఒసగింది. ఈ మట్టి చేతుల అమ్మాయి - మన భారతదేశం స్వాతంత్ర్యం పొందిన కొత్త దినాల నాడు ప్రాణం పోసుకున్న తన ఆశని, బీజావస్థ నుండి, మహాతరువుగా పెరిగేలా ప్రోత్సహించగలిగే విశిష్ట మహిళయే ఈశ్వరి, భైరవ, తదితరులు మట్టి మనిషి ఈశ్వరి దీక్ష, ఆచరణలల నుండి వెదజల్లి విరబూస్తున్న అరుణకిరణాల దొంతరల వైపు చూస్తున్నారు. "సామీ, భుజంపైని కండువాను దులిపి వేసుకోండి. ఇంకా స్తబ్ధుగా అట్లాగే కూర్చున్నారే" వాకిట్లో గొబ్బెమ్మలు పెట్టిన ముగ్గు దగ్గర నిలబడిన వ్యక్తి సర్వప్ప కంచుకంఠం అది.  ; [పాత్రలు ;- భైరవి రాజ గురు - ఈశ్వరి - సర్వప్ప  & రేణుక - కాశీ, భట్టు] ; & మట్టి మగువ ప్రభలు ;- Telugu Story - మాలిక web సాహిత్యపత్రిక ; రచన: కాదంబరి కుసుమాంబ ;

సులోచన సులోచనాలు

"తనకింకా 29 ఏళ్ళు పూర్తి అవలేదు. అప్పుడే దృష్టి ఆనడం లేదు" 

సులోచన కొంచెం సిల్లీగా, మరి కొంచెం సిగ్గుగా అనిపిస్తున్నది. 

మేడ మీద రూములో కొత్తగా అద్దెకు వచ్చారు ఇద్దరు బాచిలర్లు.

"వీళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళిచ్చే బాడుగ డబ్బులు తనకు, చన్నీళ్ళకు వేణ్ణీళ్ళుగా తోడ్పడుతున్నాయి"

మేడ మీదికి వెళ్ళి "నిద్ర కళ్ళ మీద కాఫీ ఏం చేసుకుంటారు!? నేను ఇస్తాను. హోటల్ కాఫీకి ఇచ్చే రేటు కంటే తక్కువ ఇవ్వండి, చాలు కదా."

ఆగంతకులు  పృధ్వి, రాజ్ ఉభయులూ సంతోషంగా తలలూపారు.

@@@@@@, ;

సులోచన మధ్య తరగతి గృహిణి. డాబా గది ఎన్నో రిపేర్లు చేస్తేనే అని అనిపించుకుంటుంది. 

పై కప్పు కొన్నిచోట వర్షం కురుస్తుంది, కిటికీ రెక్క ఒక ఒకటి ఊడి వేళ్ళాడుతున్నది. 

గోడలు సున్నం ముఖం చూసి,పదేళ్ళు ఆయె. 

అత్యవసరంగా అద్దెకు దిగిన వాళ్ళు ఒకట్రెండు నెలల్లో వేరే ఇల్లు చూసుకుని మారిపోతున్నారు. 

అందుకే ఈసారి సులోచన కొత్తగా అద్దెకు వచ్చిన ఆగంతకుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.

ఆమె భర్త గవర్నమెంటు ఆఫీసు క్లార్కు, జేభులో ఓ మూలకు ఇమిడే జీతం డబ్బులను బుద్ధిగా భార్య చేతిలో పోసేస్తాడు, 

"తన దగ్గర ఉంటే మాత్రం, ఆరేడు మేడలు కట్టేటంత మనీ వెనకేయ లేడు కదా" 

అందుకే పెళ్ళాం దోసిళ్ళలో పోసేసి, కళ్ళు అరమోడ్చి కూర్చుని, జపం చేస్తూ నిశ్చింతగా కూర్చుంటాడు. 

సులోచన వరండా గోడకు - హనుమంతప్ప - నేమ్ బోర్డ్ - ని తుడిచి, రోజూ నీట్ గా ఉంచి, ఇష్టంగా చూసుకుంటుంది.

ఆమెకు భర్త అంటే ప్రేమ, జాలి కూడా. "సగటు మనిషి కనబడని సంకెళ్ళు ధరించి, స్వీయ బందీ ఐ ఉంటున్నాడు. 

అదృశ్య శృంఖల నిర్మాతలు ఎవరో, కనబడని ప్రశ్నార్ధకములు ఎన్నో"  

@@@@@@, ;


అన్నయ్య అనంతరాముడు - ఇక్కడ ఒక కేసును investigation చేస్తూ వచ్చాడు. 

"భోంచెయ్యి, అన్నయ్యా" "కాదమ్మా, కేసు పని అర్జెంట్ గా వెళ్తున్నాను.

 ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా నీచేతి వంట, మిస్సవను, సరేనా"

అన్న మాట ప్రకారం అన్నయ్య అనంతరాముడు మరుసటి నెలలోనే వ చ్చాడు. సులోచన సంతోషంతో పలకరించింది. 

"ఇవాళ భోజనానికి వస్తాను." అని చెప్పి, బైటికి వెళ్ళాడు. 

"పోలీసెంకట్రాముడు, వంద పనుల మీద వచ్చి ఉంటాడు" నవ్వుతూ అన్నాడు ఆమె భర్త. 

"అంకుల్, మేము ఉద్యోగం, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, చిత్తూరు వెళ్తున్నాం. గురువారం వస్తాము, ఆంటీకి చెప్పండి"  

************

వంట చేస్తూ, కృష్ణ నామాలను వల్లె వేస్తున్న సులోచన, వాళ్ళ మాటలు విని, 

"సరే బాబూ, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి." 

మడి కట్టుకుని, ఉన్నందున లోపలి నుండే జవాబు చెప్పింది సులోచన.

అపరాహ్ణం దాటాక, బైట గేటు దగ్గర జీపు దిగి వస్తున్నాడు అన్న.

సులోచన కంచాలు పెట్టి, మంచినీళ్ళు పెట్టి, వడ్డన ఏర్పాట్లలో, నిమగ్నమైంది. 

అన్నం తిని, అక్క వంటను మెచ్చుకున్నాడు అనంతరాముడు.

తన మొబైలుని ఛార్జిలో పెట్టాడు. "సార్, వాళ్ళ అడ్రసు దొరికింది." అని ఇచ్చాడు కానిస్టేబుల్.

అనంతరాముడు ఆశ్చర్యపోయి, సర్దుకుని, సులోచనను అడుగుదామని అనుకున్నాడు.

గాభరా పడుతుందని,


ఆగాడు. నెమ్మదిగా "చల్లగాలికి మేడ మీదికి వెళ్దాం, బావగారూ" బావతో వెళ్తుంటే, 

"అరగంటలో దిగిరండి. కాఫీ తాగడానికి"  అన్నది అనంతరాముడు. 

మేడ రూములో కూర్చుని, రేడియో వింటున్న యువకుడు జనార్దన్ ని, కాలర్ గుంజి పట్టుకుని కిందకు వచ్చాడు. 

హనుమంతప్ప వణికిపోతూ, 

"వీడు మా బంధువుల పిల్లాడు, జనార్దన్. బుద్ధిమంతుడు మంచివాడు"

@@@@@@ ,

పోలీస్ స్టేషనులో విస్తుబోయే విషయాలు వాళ్ళ చెవుల్లో సీసం పోసినటయ్యింది. 

అద్దెకు వచ్చిన ఆ ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు. బంగారం, విలువైన వస్తువులను దొంగిలించి, 

ఇతర ప్రదేశాలలో అమ్మి సొమ్ము చేసుకొనే నేర్పరులు.

దగ్గరలో ఉన్న ఇతర యువకులతో స్నేహం పెంచుకుని, కుయుక్తి పన్ని, 

వాళ్ళను తాము చేస్తున్న నేరాలలో ఇరికించి, తాము తప్పించుకుంటారు.

ఇదీ వాళ్ళ చోరకళ పద్ధతి.

సులోచన బంధువు - ఖాకీ డ్రెస్సు - జీపు గేటు దగ్గర ఆగి ఉండడం చూసారు, అందుకనే తట్టా బుట్టా అర్దుకున్నారు,

పెట్టే బేడా నెత్తిన పెట్టుకుని, చల్లగా జారుకున్నారు.

and here - ఇక్కడ రేడియోలో విలువైన డైమండ్సును దాచి ఉంచుకున్నారు.

వాటిని మంచి బేరం రేటుకు విక్రయించడానికి రహస్య ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

ఈ లోపున - లాఠీవాలా రాక వాళ్ళ కుతంత్రాలకు గండి వేసింది.

ఇప్పుడు తెలివిగా - "మా సామాను చూస్తూ ఉండు." అని చెప్పి, 

జనార్దనస్వామిని కూర్చుండబెట్టి, అర్జంటుగా ... ఆ ఇరువురు లాఘవంగా తప్పించుకున్నారు. 

ట్రాన్సిస్టర్ లో - రత్నాలు, వజ్రాలు ఉన్నాయి, అని తెలీని జనార్దనుడు, హాయిగా ఆకాశవాణి - వివిధభారతి గానసుధలను ఆస్వాదిస్తూ కూర్చున్నాడు.

బుల్లిపెట్టెతో సహా పోలీసులు పట్టుకుని, చరచరా పొలిస్ స్టేషన్ కి లాక్కెళ్ళారు.

పాపం, జనార్దనస్వామి రాశిఫలాలు - వార ఫలాలలో - "నీ నొసట third degree వాయింపులు రాసిపెట్టి ఉన్నాయి" - 

అని  రాసి ఉన్నవి, కాబోలు- జనార్దన్ ఖాకీ లాఠీ దెబ్బలు తిన్నాడు.

స్వయంగా పోలీస్ ఠాణాకు వచ్చారు, స్వచ్ఛందంగా నిజం కోసం నిలడ్డారు, ఇరుగు పొరుగు, అందరూ చెప్పారు,  

ఏకకంఠంతో నొక్కి వక్కాణించారు - "ఈ పిల్లాడికేమీ తెలీదు, జనార్దన్ అమాయకుడు" -

ఆపద వేళలలో - తమ భారాన్ని పంచుకోవడానికి వచ్చిన స్నేహితులను చూసి, సులోచన కళ్ళు ఆనందబాష్పాలు నిండాయి.

ప్రజల వత్తాసు, అందరి మాటలు "నిజానిజాలు నిర్ధారించుకుని, జనార్దనాన్ని వదిలేసారు పోలీసులు.

@@@@@@  

"జగదంబ మనందరినీ రక్షించింది" సులోచన దంపతులు నిట్టూర్చారు. కర్ణాటక సరిహద్దుల వద్ద, గజదొంగలు పృధ్వి, రాజ్ దొరికారు.

ఈ కేసు ద్వారా, మరికొన్ని నేరాలు బైటపడ్డాయి, క్రూర నేరస్థులు పట్టుబడ్డారు. అనంతరాముడు గారికి అవార్డులు, పురస్కారాలు వచ్చాయి. 

ప్రమోషన్ లిస్టులో మొదటి పేరు అతనిదే. ఇంత భవిష్యత్తుకు రహదారి ఏర్పడడానికి కారణమైన అక్కయ్య ఇల్లు, స్వయంగా చూసి ఉన్నాడు కదా! 

సున్నం పెచ్చులు ఊడి, పురాతన స్థితిలో ఉన్న ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది. 

అనంతరాముడు దగ్గర ఉండి, రిపేర్లు చేయించి, అదనంగా ఇంకొక room కట్టించాడు. 

"అంతా మన మంచికే జరిగింది. అనవసరంగా కేసులో ఇరుక్కున్నామే, తెలీక అట్లాంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చామే" 

అనుకుంటూ అప్పటిదాకా భయపడుతున్న, 

సులోచన & హనుమంతప్ప - గుండెల నిండా గాలి పీల్చుకున్నారు. 

అన్నగారి అండదండలు లభించడంతో నగరంలో హాస్తల్స్ లో ఉన్న - 

హనుమంతప్ప -  సులోచన యొక్క పిల్లల చదువులు కూడా, ఒడిదుడుకులు లేకుండా సాగుతున్నవి.  

@@@@@@,

పృధ్వి వాళ్ళు ఇచ్చిన అడ్వాన్సు - సులోచన కళ్ళద్దాలు కొనడానికి ఉపయోగపడ్డాయి. 

"ఇంత చక్కని కంటి అద్దాలు - కొన్నావు. మనం ఆ విలన్లను కనిపెట్టలేక పోయాం" అన్నాడు హనుమంతప్ప.

"నిజమే, మీకు కూడా కవిత్వం మాట్లాడడం చేతనౌను - నాకిన్నాళ్ళూ తెలీ లేదు సుమీ" అన్నది సులోచన, 

నవ్వుతూ సులోచననాలను సర్దుకున్నది.

;

[ పాత్రలు ; సులోచన & భర్త హనుమంతప్ప -  సులోచన అన్నయ్య Police అనంతరాముడు ; బాడుగ ఇంట దిగిన వాళ్ళు - పృధ్వి, రాజ్,  & హనుమంతప్ప relative జనార్దనస్వామి ] ;;

Kusuma Stories - Telugu 



30, మార్చి 2021, మంగళవారం

ముద్దు పేర్లు - మొద్దు పేర్లు

ముద్దు పేర్లు - మొద్దు పేర్లు ;-

"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ."  ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలిచారు. 

మేడమీది రూములోనుండి బద్ధకంగా ఆవులిస్తూ ఒక్కొక్కళ్ళూ కిందికి దిగివచ్చారు. 

"పళ్ళు తోముకో లేదా?" "ఇవ్వాళ భౌమ్యవారం కదా పిన్నీ! ఇవాళైనా మమ్మల్ని రెస్టు తీసుకోనీయరేంటి, కాస్త విశ్రాంతి తీసుకుంటే మీరేమైనా అరిగిపోతారా? ఏంటి? 

పెద్దాళ్ళందరూ ఎప్పుడూ ఇంతే!" పెద్ద నాపసానిలా చిట్టి అనబడే గౌరి అన్నది. ఆ రోజులలో సంస్కృతం ఓరియంటల్ చేసింది లవంగిక. 

ఆమెకు దేవభాష అంటే ఇష్టం. ఆమె దగ్గర గౌరికి చనువు, గారాబం ఎక్కువ. 

కనుకనే ఛలోక్తులను కానుకలుగా ఇస్తూంటుంది చిట్టీ ఉరఫ్ గౌరి. 'ఆదివారము'ఐనట్టి SunDay కి భౌమ్యాన్ని పులిమి, చిట్టి తన గీర్వాణభాషా ప్రావీణ్యాన్ని వెల్లడించింది."ఇవాళ సన్ డే, కాస్త గుర్తుంచుకోండి, ప్లీజ్!" 

తరళాక్షి కొడుకు బంటీ అన్నాడు.  "ఏ వారమైనా గంటలు ఇట్టే గడుస్తాయి. గడియారంలో ముల్లు చకచకా కదల్తూనే ఉంటుంది, 

నడినెత్తిపైకి పొద్దు వాలినా నిద్రమత్తుల్ని వదలరు, పైగా ఇట్లాగ నయగారాలు...." అంత గడుసు దీర్ఘోపన్యాసం ఇచ్చిన మనిషి పేరు సత్యమ్మ ఉరఫ్ సత్యవతీదేవి.

మూలనున్న ముసలమ్మ సత్యవతి అప్పటికే వాకిట్లో ముగ్గులేసింది, స్నానం చేసింది, ఇత్తడి గ్లాసులో పావుశేరు కాఫీని గటగటా తాగేసింది. గునగునా అటూఇటూ నడుస్తూ శ్లోకాల్ని పఠిస్తూ,

ఆమె మాటల్ని కనీసం చెవి తమ్మెల దాకానైనా ఎక్కించుకోలేదెవ్వరూ. తొలి పొద్దున ఆలిండియా రేడియో లో అరగంటపాటు వచ్చే 'భక్తిరంజని ' ఎంతో ఆమె మాటల విలువ అంతే! 

రెండింటినీ ఎవ్వరూ పట్టించుకోనే పట్టించుకోరు. :) :) :) 

"అట్లాగ పెట్టీ  నేమ్స్ పెట్టి పిలిస్తే ఊరుకోము" రుసరుసలాడ్తూ అన్నారు పిల్లకాయిలు. "ఏం చేస్తారేంటి?" నవ్వుకుంటూ అన్నది. తరళ. 

"రోజూ ఉండే భాగోతమే కదా ఇది!" నవ్వాపుకుంటూ అన్నది లవంగిక. "అసలు పేర్లు మాని, కొసరు పేర్లు పెట్టి పిలుస్తారేంటి డాడీఈ వీళ్ళు? ఇట్లాగైతే పెట్టేబేడా సర్దుకుపోతామంతే!"  

దంతధావనం పూర్తిచేసుకుని, వంట్టిలోకి వచ్చి, కాఫీకప్పులు తీసుకున్నారు.

"మా ముద్దుపేర్లనే నామకరణం రోజున బియ్యప్పళ్ళెంలో రాసేస్తే సరి పోయేదిగా" బుజ్జీ అన్నాడు కోపంతో. వాడి పరిస్థితి మరీ అన్యాయం. "బుజ్జీ! బజ్జీ! మిరపకాయ సొజ్జీ.........."  అంటూ అర్ధం తెలీకున్నా, రిథమ్‌ బాగా కుదిరింది కదాని, ; ఆ అర్ధంపర్ధం లేని మాటలని పాటలు కట్టి వాణ్ణి బాగా ఎగతాళి చేస్తూంటారు ఆటల వేళలలో తోటి ఫ్రెండ్సు. "ఔను మరి, అట్లాగ నిక్ నేముల్నే బారసాలనాడు పెట్టేసి ఉంటే మాకు తేడా కూడా తెలిసేదే కాదు. ఆ పిలక నేములకు అలవాటు పడి ఉండే వాళ్ళం" ఈ మారు వాళ్ళ కంప్లైంట్సుని ఇవ్వడానికి తాతయ్య దగ్గరికి దారి తీసారు. "చూడు తాతయ్యా! అమ్మ, పిన్నీ మమ్మల్ని ఈ టిక్కీ నేముల్తో బైట కూడా పిలుస్తున్నారు. సినిమాహాలు దగ్గర విని, మా ఎగస్పార్టీవాళ్ళు అవే పేర్లెట్టి పిలుస్తూ ఏడిపిస్తున్నారు."   

[ ఏదో సినిమాలో - పండు - అని ముద్దు పేరు పెట్టినందుకు `parents ని heroine బాగా కోప్పడింది ....... పాపం, ఇట్లాంటి చేదు experiences ని face చేసింది కదా]

తాతయ్య బోసిపళ్ళ నోట్లోంచి మాటలు తుస్సుతుస్సున గాలిని కలుపుకుంటూ వస్తున్నాయి. ` "మరి మీకు పెట్టిన పేర్లు ముసలితరం వాళ్ళవి. అంటే మావి, బామ్మ, అమ్మమ్మ, తాతలవి అన్నమాట." 

"అయితే?......" మనమలు, మనవరాళ్ళ ఏకైక ప్రశ్న. "పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు, మీరు సరిగా చదవక మకురుతనం చేస్తున్నప్పుడు కోపంతో అప్పుడప్పుడు తిట్టాల్సివస్తుంది కదా?" 

"హూ!?" ఈ సారి సౌండులోనే క్వశ్చన్ మార్కును సంధించారు."అట్లాగ తిడితే ఆ పేర్లు ఉన్న మాలాంటి పెద్దవాళ్ళను తిట్టినట్లౌతుంది. అందుకే మీకీ పేర్లు. అవి నిక్ నేములు కాదు, ముద్దు పేర్లు." 

కాస్త సముదాయిస్తూ సమాధానపరిచాడు కన్నింగ్ తాతయ్య. ఆ జవాబు నచ్చినా నచ్చకున్నా ముక్కులు చిట్లించి, పెదవులు ముడుస్తూ బైటికి ఆడుకోడానికి పరుగులు తీసారు. 

*********************, ,

కరుణాకర్ తెలుగు టీచర్. ప్రైవేటుగా కట్టి బి.ఇడి., ఎం.ఇడి. లు పాసయ్యాడు. ఇప్పుడు పిల్లల గోల వలన ఈ నామధేయాల పట్ల కొన్ని సందేహాలు, దాంతో ఉన్నట్లుండి కొన్ని డౌట్లు ఉరవడిగా మదిలో వెల్లువెత్తాయి. "నాన్నా! పెద్దల పేర్లను భక్తితో పెడ్తున్నాము, సరే! కానీ ఎక్కువగా దేవుళ్ళ పేర్లను పెడ్తున్నాము. నాకు మీరు మోహన క్రిష్ణ అని పేరు పెట్టారు. తప్పు కదూ!"  అనూచానంగా వస్తూన్న ఈ ఆచార సంప్రదాయాలని అనుసరించడమే తప్ప అసలు దానిగురించి పట్టించుకోలేదెన్నడూ.  "ఏమిటో? ఇట్లాంటి ధర్మసందేహాలు కలిగితే ఎట్లాగ? జవాబు లేని ప్రశ్నలు ఇవి." 

అని బట్టతలను గోక్కుని, చేతులెత్తాడు. "రామాయణములో ఉన్న పేర్లన్నీ గుర్తున్నంత వర్ఱకూ చెప్పండి నాన్నగారూ!" 

"రామ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, కైకేయి సోదరుడు యుధాజిత్తు, గిరివజ్ర - గిరివ్రజ " 

అప్పుడప్పుడూ ఇద్దరూ ఇంకా ఉన్నవాటిని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ చెప్పారు. "దశరధ, వశిష్ఠ, విశ్వామిత్ర, శబరి, మాతంగ ముని, భరద్వాజ......."  " సుగ్రీవ, వాలి, రుమ, జాంబవంత, అంగద, హనుమంత" "సురమ, విభీషణ, సుమిత్ర, కౌసల్య."  తర్వాత భారత, భాగవతాలకు జంప్ చేసారు. "అర్జున్, భీమ్ - మొదలుకొని - దుర్యోధనుడు, నూర్గురు తమ్ముళ్ళు, చెల్లెలు దుస్సల ఇత్యాదిని కరువు తీరా చెప్పుకున్నారు.  "నాన్నా! ఇతిహాసాల, ప్రబంధాల రచయితలు ఎవరు?" వాల్మీకి, వ్యాస, నన్నయ, తిక్కన, ఎర్రాప్రెగ్గడ, అల్లసాని పెద్దన ............ "  లిస్టును చెప్పుకుంటూ వెళ్ళారు.

'బమ్మెర పోతన, బావమరదులు వగైరాలు పింగళి అక్కన్న, మాదన్న, శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయలు ........" వంట పూర్తి చేసి వచ్చిన ఇంటి ఇల్లాళ్ళు అక్కడికి చేరి, తమకు తోచిన అలనాటి పేర్లను చెప్పసాగారు.

"పల్నాటియుద్ధం లో బాలచంద్రుడు, ఐతాంబ, పేరిందేవి, మాంచాల,...........' ఈ పట్టిక పాతిక పాతపేర్లు కొత్తవాటిని చేర్చుకుంది. సంగీతం నేర్చుకుంటూన్న గౌరి 

'త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, సారంగపాణి, అన్నమయ్య, కంచెర్లగోపన్న, అనగా రామదాసు ....... " 

వెనక తోకలా తగుల్కొన్నాడు కొంచెం సంగీతపరిజ్ఞానం ఉన్న బంటీ ఫ్రెండు "రామదాసుగారూ! ఇదిగో రశీదందుకోండీ......" సత్యం బామ్మ అన్నది "పాతకాలం పేర్లలో దేవుని పేర్లు తక్కువగా కనపడుతున్నాయి. ఆ కాలం వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదో?" సంభాషణలోకి అందరూ వచ్చి చేరగా, పదాల ప్రవాహం వేగం పుంజుకుంది. వంటపూర్తి చేసి, స్త్రీలు హాలులోకి వచ్చారు. తరళాక్షి అన్నది. "నార్త్ ఇండియాలో నకుల్. సహదేవ్, కర్ణ, కౌరవుల పేర్లను పెట్టుకుంటారు. దుర్యోధన్, సుయోధన్, ఇట్లాగ." "డార్జిలింగ్ లో హిడింబికి గుడికూడా ఉన్నదట" "ప్రబంధకాలం గురించి చెప్ప్పండి. భువనవిజయ ఆస్థానంలో పెద్దన, ముక్కు తిమ్మన్న, గోదాదేవి, అట్లాగే ఆకాలానికి ముందు వెనకలుగా అవ్వయ్యార్, మీరాబాయి,  లొల్ల, కథానాయిక మొల్లమాంబ." "కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన."  "కన్నడదేశాన రన్న, పొన్న్న, కుమారవర్మ..." "ప్రాచీనకాలాన చాల ఉన్నాయి. విక్రమార్క, భట్టి, భోజరాజు, హర్షవర్ధన, సముద్రగుప్త, శాతవాహన, మిహిరలకుడు........" "విజయనగర సామ్రాజ్య స్థాపకులు 


ఒకరు బుక్కరాయలు మామూలు పేరే, రెండవ వ్యక్తి హరిహరరాయలు.......... శ్రీకృష్ణదేవరాయలులో క్రిష్ణుని పేరు ఉంది. మహామంత్రి తిమ్మరుసు, అష్టదిగ్గజ కవులు ముక్కుతిమ్మన,

అల్లసానిపెద్దన, వీళ్ళతోబాటు వికటకవి తెనాలి రామకృష్ణుడు, ధూర్జటి  ..."  "మన ఆంధ్ర కవిత్రయం నన్నయ్య,తిక్కన, ఎర్రాప్రెగడ ఐతే - అటు కర్ణాటక దేశాన రన్నడు, పొన్నడు, పంపడు ఎట్సెట్రా ఎట్సెట్రా"

సత్యమాంబ "ఇంతకీ సారాంశమేమిటీ అని?" 

"జనసామాన్యంలో భగవంతుని పేర్లను పెట్టుకోవడం, ఇటీవలి కాలంలో మొదలైంది. అన్నమాచార్యులు, భక్తపోతన, వారి కుటుంబీకులు అక్కన్న, మాదన్నలు. తాళ్ళపాక తిరుమలాంబ, తిరుమలయ్య 

వీరివి పుణ్యక్షేత్రాల పేర్లు ........  "ఇవి వింటుంటే మొద్దు పేర్లు . వీటి కన్నా ముద్దు పేర్లే నయం ....... " సదస్యులలో - ఒకరు - వెనక నక్కి, నొక్కి చెప్పిన వక్కాణం అది.

వక్క, ఆకులు నముల్తూ పెద్దల శాల్తీ కనుబొమ్మలను ప్రశ్నార్ధకంగా మలిచి, "ఇంకా చెప్పుడు ........ " అన్నట్లు వీక్షణాదులను ప్రసరించాడు. 

"శ్రీనాధుని పల్నాటియుద్ధములోని పాత్రలు, నాగమ్మ, ఐతాంబ, మాంచాల, బాలచంద్రుడు, పేరిందేవి, అనపోతరాజు, ఎక్కువగా ఇలాంటివి. తక్కువగా నరసింహ, బ్రహ్మనాయుడు లాంటివి. ప్రబంధపాత్రలు- నలుడు, దమయంతి, ప్రవరుడు, వరూధిని, గిరిక ఇవి చాలా ఉన్నాయి. క్రిష్ణరాయలనాటి మహామంత్రి తిమ్మరుసు, శిల్పి జక్కన, స్థూలంగా చెప్పాలంటే దేవుని పేర్లను సామాన్యులు సాధారణంగా పెట్టుకొనేవాళ్ళుకాదు. ఇటీవల మొదలైన అలవాటు అది. మళ్ళీ సంబోధిస్తూ పిలవాల్సి వచ్చినప్పుడు కలిగే ఇబ్బందుల్ని అధిగమించడానికి ముద్దుపేర్ల తంటాలు ఇదిగో, ఇప్పుడు మన ఇంట్లోకి మల్లేనే!" తరళ అన్నది. "నీకు ఇంత నాలెడ్జి ఉందనుకోనే లేదు నేను." విస్తుపోతూ భర్త రేపటి టెల్గూ రీసెర్చ్ కమ్‌ ప్రొఫెసర్ అన్నాడు.  &

పాత్రలు ;- [తెలుగు టీచర్ కరుణాకర్ - బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ [=  గౌరి ] -  ఉరఫ్  - & తరళాక్షి కొడుకు బంటీ  - తరళ, sister లవంగిక - సత్యమ్మ ఉరఫ్ సత్యవతీదేవి -  మోహన క్రిష్ణ - కొసరు పేర్లు  ;- మూలనున్న ముసలమ్మ సత్యవతి -  తాతయ్య -  ]  &  


మా బామ్మ మాట బంగారు మూట - 2 ;

LINK ;- కోణమానిని - protractar ; 

పూలు ఫూల్సు - 63 - A

 దిలీప్ బృందంతో  నల్లమల సీమను చేరాడు. సినిమా దర్శకత్వం చాన్స్ లభించింది - అందుకే ఈ హుషారు - Hills  దగ్గరలోనే చక్కని బంగ్లా - గెస్ట్ హౌస్ సౌక...